ముక్క ముట్టుకోనంటున్న బన్నీ
on Feb 22, 2017
ఏదైనా పౌరాణిక చిత్రంగాని..లేదంటే భక్తి ప్రధానమైన సినిమా గాని చేస్తే ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించేవారు నటరత్న ఎన్టీఆర్.. షూటింగ్ పూర్తయ్యే వరకు చాలా పవిత్రంగా ఉండేవారు అన్నగారు. కాని ఇప్పుడు కాలం మారింది..నియమాలు, నిబంధనలు అన్నింటిని గాలికొదిలేశారు కొంతమంది కథానాయకులు. అయితే ఇన్నేళ్ల తర్వాత..ఈ జనరేషన్లో కూడా అలాంటి నియమాల్ని మళ్లీ పాటిస్తున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
ప్రజంట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే అనే సినిమా చేస్తున్నాడు..ఈ సినిమాలో బన్నీ ఒక బ్రాహ్మాణ యువకుడి పాత్ర పోషిస్తున్నాడు..బ్రహ్మాణులు స్వతహాగా శాఖాహారులు..మాంసాహారాన్ని ముట్టుకోరు. అందుకే తాను కూడా షూటింగ్ పూర్తయ్యే వరకు నాన్‌వెజ్ ముట్టుకోకూడదని డిసైడ్ అయ్యాడట అల్లు అర్జున్. అయితే బన్నీ నాన్‌వెజ్‌కి దూరం కావడానికి కారణం డైరెక్టర్ హరీశ్ శంకర్ అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. హరీశ్ శంకర్ బై బర్త్ బ్రాహ్మాణుడు కావడంతో పాటు ఈ సినిమాలో తన సామాజిక వర్గానికి చెందిన పాత్రలు ఉండటంతో అందరూ నిష్ఠగా ఉండాలని యూనిట్ మొత్తానికి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చాడట. అందుకే యూనిట్‌తో పాటు అల్లు అర్జున్ కూడా నాన్‌వెజ్‌కు దూరమయ్యాడట.
Also Read