కలెక్షన్లలో దూసుకుపోతున్న ఖైదీ, శాతకర్ణి
on Jan 15, 2017
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ రెండు సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇద్దరు పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు.. అందుకా వెంట వెంటనే విడుదలైన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ సినిమాకి.. ఆసినిమా భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి. మొదటి మూడు రోజుల్లో ‘ఖైదీ నంబర్ 150’ సినిమా రూ. 11.33 కోట్ల వసూళ్లు రాబట్టి 2 మిలియన్ డాలర్ల మార్క్ కు చేరువయిందని తెలిపారు. ఇక ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా మొదటి రెండు రోజుల్లో రూ. 4.67 కోట్లు రాబట్టిందని ప్రముఖ బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.
Also Read