ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో దంగల్ క్లీన్‌స్వీప్...
on Jan 15, 2017
బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పుడు ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో కూడా తన సత్తా చూపించింది. ఏకంగా నాలుగు మేజర్ అవార్డుల్లో మూడు దంగల్ ఖాతాలో చేరాయి. నిన్న జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డు ఫంక్షన్ కలర్ ఫుల్ గా సాగింది. బాలీవుడ్ బాద్ షా హోస్ట్ గా నిర్వహించిన అవార్డ్ ఫంక్షన్ లో దంగల్ క్లీన్‌స్వీప్ చేసింది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ అవార్డులు ఈ సినిమాను వరించాయి. బెస్ట్ సినిమా దంగల్, బెస్ట్ యాక్టర్ ఆమీర్‌ఖాన్, బెస్ట్ డైరెక్టర్ నితీష్ తివారీ అవార్డులు అందుకున్నారు. ఇక బెస్ట్ ఫిమేల్ యాక్టర్ అవార్డు మాత్రం ఉడ్తా పంజాబ్కుగాను ఆలియా భట్ ను వరించింది.
Also Read