నయన్‌ని అంత మాటన్నాడా..?
on Oct 28, 2016
చిత్ర సీమలో నటీనటుల మధ్య అభిప్రాయ భేదాలు, వివాదాలు కామనే. అయితే పదేపదే వివాదాల్లో చిక్కుకుని వార్తల్లోకి ఎక్కడం ఒక తారకు మాత్రం అలవాటైపోయింది. ఆమె ఎవరో కాదు సౌత్‌లో టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్న నయనతార. ఏ హీరోయిన్‌కు లేనన్ని గాసిప్స్, లవ్ ఫెయిల్యూర్స్, వివాదాలు నయన్ పేరిట లిఖించబడ్డాయి. తాజాగా ఆమెను టార్గెట్ చేస్తూ ఒక స్టార్ కమెడియన్ సెటైర్లు వేశాడు. కార్తీ హీరోగా నయన్ నటించిన కాష్మోరా చిత్ర ప్రమోషన్లో భాగంగా ఆ మూవీలో నటించిన ప్రముఖ కమెడియన్ వివేక్ కూడా పాల్గొన్నాడు.
అయితే ఈ కార్యక్రమానికి నయనతార హాజరుకాలేదు. దీనిపై స్పందించిన వివేక్ కొంతమంది కథానాయికలు తాము ప్రమోషన్స్‌కి వస్తే సినిమా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్‌తో ఉన్నారని అన్నాడు. మరి అలాంటి వాళ్లకి..పూర్తి రెమ్యునరేషన్ తీసుకున్నా సినిమా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఉంటే బాగుంటుందేమో అన్ని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే వివేక్ చేసిన కామెంట్ నయనతారను ఉద్దేశించేనని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై పెద్ద దుమారం రేగడంతో తాను నయనకు పెద్ద అభిమానిని అని, ఆమె గురించి తాను అనలేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.