'ఆగడు' బెనిఫిట్ షోలకు భారీ డిమాండ్
on Sep 18, 2014
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడ చూసిన 'ఆగడు' సందడే కనిపిస్తోంది. ఈ నెల19న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం డిమాండ్ ను బట్టి ఆంధ్ర, తెలంగాణలో పలుచోట్ల అభిమానుల కోసం బెనిఫిట్ షో లను ప్లాన్ చేశారు. అయితే ఈ షో లకి కూడా భారీ డిమాండ్ ఏర్పడడం విశేషం. అయితే బెనిఫిట్ షో టికెట్లు భారీ రెట్లు పలుకుతున్నాయి. బాల్కనీ టికెట్స్ ధర 2500 పలుకుతుంటే, మిగిలిన టికెట్స్ ధర 2000 పలుకుతున్నాయి. అయిన కూడా ఈ షోలకి ఇప్పటికే టికెట్స్ అన్ని దాదాపు అయిపోయాయి. ఆన్ లైన్ బుకింగ్ మొదలైన కొద్ది నిమిషాల్లోనే ఫస్ట్ డే టికెట్స్ అన్నీ అమ్ముడు పోయాయి. ఇక థియేటర్ల వద్ద ఇచ్చే అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ కూడా మంగళవారమే అయిపోయాయి. దీంతో అన్ని థియేటర్ల వద్ద ఫస్ట్ డే టికెట్స్ అయిపోయాయి అంటూ బోర్డులు పెట్టేసారు.ఈచిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్. 'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఇది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
