రంగస్థలం టీజర్ ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతుందా..?
on Jan 24, 2018
మాస్ కమర్షియల్ చిత్రాలతో తండ్రిలాగే మాస్ హీరో అనిపించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్. వీటి వల్ల వసూళ్లు బాగానే ఉన్నప్పటికీ నటుడిగా తానెంటో నిరూపించుకోవాలంటే వైవిధ్యమైన కథలు చేయాలి. దీనిని పసిగట్టిన చెర్రీ ధ్రువ సినిమా నుంచి తన స్టైల్, మేకోవర్ కంప్లీట్‌గా మార్చేశాడు. ఈ మూవీ ఇచ్చిన బూస్ట్‌తో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 చేస్తున్నాడు. టైటిల్ ఎనౌన్స్ అయిన దగ్గరి నుంచే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఈ సినిమాలో 1980ల నాటి కుర్రాడిగా చెర్రీ లుక్ ఇంకా వెరైటీగా ఉండే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
స్టార్ హీరోల సినిమా సెట్స్ లో ఉన్నప్పుడు.. మీడియా దృష్టంతా ఆ సినిమాపైనే ఉంటుంది. ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం తహ తహ లాడిపోతుంటారు. లేకపోతే.. వాళ్లే కొత్తవి పుట్టిచ్చేస్తుంటారు. మరి అంతటి క్రేజ్ ఉన్న రంగస్థలాన్ని వదులుతారా..? అందుకే ప్రతిరోజూ ఏదో ఒక గాసిప్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. చరణ్ ఇందులో చెవిటి, మూగ వాడిగా కనిపిస్తాడని.. కాదు కాదు సమంత మూగమ్మాయిగా నటిస్తోందని.. బాహుబలి కంటే ఎక్కువగా గ్రాఫిక్ వర్క్ జరుగుతోందని.. అందుకే రిలీజ్ లేట్ అవుతుందోని.. యాంకర్ అనసూయ, రామ్‌చరణ్‌కు అత్తగా నటిస్తోందని ఇలా రోజుకొక న్యూస్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇలాంటి కన్ఫ్యూజన్లకు క్లారిటీ రావాలంటే ఇవాళ సాయంత్ర 4.15 దాకా వెయిట్ చేస్తే చాలు. ఎందుకు అంటారా..? ఈ రోజు సాయంత్రం రంగస్థలం టీజర్ రిలీజ్ కాబోతోంది. సో.. గెట్ రెడీ.