కలెక్షన్ కింగ్ నిజంగా సీరియల్స్ చేస్తాడా..?
on Jan 25, 2017
తన సుధీర్ఘ ప్రయాణంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా, విలన్‌గా, హీరోగా, నిర్మాతగా ఇలా విభిన్న కోణాల్లో తన ప్రతిభను చూపించి విలక్షణ నటుడిగా, కలెక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు మోహన్‌బాబు..సినిమాకు సంబంధించి 24 విభాగాలపైనా ఆయనకు పట్టువుంది..ప్రస్తుతం తన మనవరాళ్లతో ఆడుకుంటూ నచ్చిన పాత్ర వస్తే సినిమాల్లో నటిస్తున్నారు కళాప్రపూర్ణ. అయితే ఇటీవల బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా సీనియర్ నటులంతా బుల్లితెర బాట పడుతుండటంతో తాను కూడా ఆ దిశగా అడుగులు వేయాలనుకుంటున్నారు మోహన్‌బాబు. తాజాగా అభిషేకం ధారావాహిక 2500 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. టీవీ ఆర్టిస్టులంటే నాకు ఎంతో గౌరవం. టీవీ షోలలో నటించాలని నేనూ అనుకునువాడిని..కానీ అంత ఓపిక, సమయం లేక పని ఒత్తిడి వల్ల చేయలేకపోయాను..అయితే మంచి కథ ఉంటే టీవీ సీరియల్స్‌లో నటిస్తానని చెప్పారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
