సమంత ప్లాన్ వెనుక నాగార్జున..?
on Jan 27, 2017

హీరోలతో పోలిస్తే..హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్ చాలా తక్కువ.. దీపముండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్నది వారికి పెద్దలు ఇచ్చే సలహా..అలా నాలుగు రాళ్లు వేనకేసుకున్న తర్వాత దానిని ఏ రియల్ ఏస్టేట్స్‌లోనో ..హోటల్స్, బొటిక్‌లలో పెట్టుబడులు పెడుతుంటారు హీరోయిన్లు. అయితే త్వరలో అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లబోతున్న సమంత మాత్రం విభిన్నంగా ఆలోచించింది..అందుకు తనకు కాబోయే మామగారిని ఆదర్శంగా తీసుకుంది. టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్‌గా నాగార్జునకు మంచి పేరుంది. ఆయన ఎందులోనైనా పెట్టుబడులు పెడితే అందులో లాభాలే కానీ నష్టాలు రావన్నది బహిరంగ రహస్యం.
సినిమాల విషయంలో కూడా అందరూ ఒకదారిన వెళితే ఆయన మరో దారిన వెళ్లి హిట్ కొడతారు.. ఇప్పుడు అదే రూట్‌ని ఫాలో అవ్వాలనుకుంటోంది సమంత. తన అభిరుచికి తగ్గట్టు మంచి చిత్రాన్ని నిర్మించాలని సమ్ భావిస్తోందట. ఈ క్రమంలోనే కన్నడలో సూపర్‌హిట్టయిన "యూటర్న్" సినిమా రీమేక్ హక్కులను సంపాదించిందని ఫిల్మ్‌నగర్‌లో చర్చించుకుంటున్నారు. సినిమాని ఎలా నిర్మించాలి..తదితర విషయాలపై మామగారి నుంచి కొన్ని సలహాలు కూడా తీసుకుందట సమంత..మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



