కన్ఫ్యూజన్ లో కొణిదెల కుమార్తె!
on Jul 4, 2016
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒకేఒక్క హీరోయిన్ గా ఇండస్ట్రీలో కావాల్సినంత పేరుతోపాటు.. ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సంపాదించుకొన్న కొణిదెల నీహారిక టీవి షోల వరకూ ఫర్వాలేదు కానీ.. వెండితెరపై మాత్రం తన మార్క్ ను చూపించలేకపోయింది. ఆమె నటించిన "ఒక మనసు" విమర్శకులతోపాటు ప్రేక్షకులను కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దాంతో.. తన తదుపరి సినిమాల కోసం ఏ తరహా పాత్రలను ఎన్నుకోవాలో తెలియని కన్ఫ్యూజన్ లో పడింది కొణిదెల కుమార్తె.
టీవి షోలు కంటిన్యూ చేస్తూ సెటిల్ అయిపోవాలా లేక మరోమారు హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలా? అని కూడా నీహారిక ఆలోచిస్తున్నట్లు వినికిడి. అయితే.. మెగా ఫ్యామిలీతోపాటు, మెగా అభిమానులు కూడా ఆమెను టీవీకే పరిమితమవ్వమని సూచిస్తునట్లు సమాచారం. మరి నిజారికా ఫైనర్ డెసీషన్ ఏంటో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే!