విలన్ గా మారుతున్న మరో హీరో!
on Jul 4, 2016
మన ఇండస్ట్రీలో హీరోలుగా చలామణి అవుతున్నవాళ్లు చిన్నాపెద్దా తేడా లేక్కేసుకొంటే ఈజీగా ఓ 50 మంది ఉంటారు. అయితే.. వారిలో కాస్త గుర్తింపు ఉన్న నటులను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. సో, ఇప్పుడు హీరోగా ట్రై చేయడం కంటే.. విలన్ల కొరత ఎక్కువగా ఉన్న కారణంగా, ఆ యాంగిల్ లో ట్రై చేస్తే అయినా సక్సెస్ అవుతాననుకొన్నాడో ఏమో తెలియదు కానీ.. విలన్ వేషాలు వేస్తాను అంటున్నాడు ఆర్యన్ రాజేష్. ఇవివి సత్యనారాయణ తనయుడిగా వెండితెర తెరంగేట్రం చేసిన ఆర్యన్ రాజేష్ కెరీర్ లో "ఎవడిగోల వాడిది" మినహా మరో హిట్ లేదు. ఇప్పటికీ పలుమార్లు హీరోగా నటించి విఫలమవ్వడంతో.. విలన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఫిక్సయ్యాడట. ప్రస్తుతం రాజేష్ జిమ్ లో కష్టపడి కండలు పెంచేస్తున్నాడట. త్వరలోనే అల్లరి నరేష్ హీరోగా, ఆర్యన్ రాజేష్ విలన్ గా ఓ సినిమా ఉండే అవకాశం ఉందని సన్నిహిత వర్గాల సమాచారం. మరి విలన్ గా రాజేష్ ఏమేరకు అలరిస్తాడో చూడాలి!