రైలు పట్టాల్లాంటి శ్రీదేవి మాధురి
on Apr 23, 2015
.jpg)
ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ మధ్య పోటీఉండడం సహజం. అయితే కెరీర్ క్లోజ్ అయ్యాకైనా వాళ్ల మధ్య పొరపొచ్చాలు పోయి కూల్ గా ఉంటారు. కానీ శ్రీదేవి-మాధురి మాత్రం ఇందుకు విరుద్దం. ఒకరి ఆఫర్స్ మరొకరు ఎగరేసుకుపోయారంటూ అప్పట్లో కోల్డ్ వార్ జరిగింది. ఆ తర్వాత ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. అయితే ఇప్పటికీ వీళ్లిద్దరి మధ్యా మాటా-మంతీ లేదట. ఈ మధ్యే ఓ అవార్డు ఫంక్షన్ కు హాజరైన ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకరి తర్వాత మరొకరు వచ్చారట. శ్రీదేవి వెళ్లిపోయే సమయంలో మాధురి ఎంటరైందట. ఇద్దరూ ఎదురుపడ్డారు కదా మాట్లాడుకుంటారేమో అనుకుంటే మొహం కూడా చూసుకోపోవడం హాట్ టాపిక్ అయింది. దీంతో.. వయసు మీద పడుతున్నా.. వీరి మధ్య వార్ కు ఫుల్ స్టాప్ పడలేదని డిస్కస్ చేసుకుంటున్నారు. ఏళ్లు గడిచినా కాంప్రమైజ్ కాని బ్యూటీస్ భవిష్యత్ లో కలుస్తారనే ఆశేలేదంటున్నారు బీటౌన్ జనాలు. మొత్తానికి అందాల భామల ఫేస్ కోమలం మనసు కఠినం అన్న మాట నిజమే మరి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



