స్టార్ హీరోలపై దాసరి సెటైర్లు
on Apr 27, 2015

దాసరి నారాయణరావు ఏం మాట్లాడినా.. సంచలనమే. ఎవరి పేరు ఎత్తకపోయినా బిట్ విన్ ద లైన్స్ అందులో సంచలన విషయాలు కావల్సినన్ని ఉంటాయి. ఆదివారం రాత్రి మోసగాళ్లకు మోసగాడు ఆడియో వేడుక జరిగింది. ఈ సందర్భంగా నటుడిగా 50 యేళ్లు పూర్తి చేసుకొన్న కృష్ణని దాసరి సత్కరించారు. కృష్ణ గురించి గొప్పగా మాట్లాడుతూనే.. పరోక్షంగా ఇప్పటి స్టార్ హీరోలపై సెటైర్లు వేశారు దాసరి. కృష్ణ యేడాదికి పదిహేను, ఇరవై సినిమాలు పూర్తిచేసి నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకొన్నాడని, ఇప్పటి హీరోలంతా యేడాదికి ఒక్క సినిమా సరిపోతుందన్న ధ్యాసలో ఉన్నారని, కృష్ణ విరామం లేకుండా కష్టపడితే... ఈనాటి హీరోలు - ఎక్కడకి వెళ్లి సెలవలు గడుపుదామా అనే దృష్టితో ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. మరి ఈ మాటలకు ఏయే హీరోలు భుజాలు తడుముకొంటారో, ఏంటో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



