‘రుద్రాక్ష’కి అడ్డంకులు
on Oct 14, 2015
.jpg)
కృష్ణవంశీ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మించాలని అనుకుంటున్న ‘రుద్రాక్ష’ సినిమా ఇంకా బాలారిష్టాలను తప్పించుకోలేదు. ఈ సినిమా పట్టాలు ఎక్కడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయట. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫమ్ కాలేదు. కృష్ణవంశీ ఒక హీరోయిన్ అంటుంటే, దిల్ రాజు మరో హీరోయిన్ అంటున్నాడట.
ఈ హీరోయిన్ గొడవ ఇలా వుంటే, ‘రుద్రాక్ష’ అనే టైటిల్ నా దగ్గరుంది అంటూ ఓ ఛోటా ఫిలిం మేకర్ రంగంలోకి దిగాడు. రుద్రాక్ష అనే టైటిల్‌తో పోస్టర్ కూడా రిలీజ్ చేసేశాడు. మా ‘రుద్రాక్ష’ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది అని అనౌన్స్ కూడా చేసేశాడు. మరి టైటిల్ రిజిస్టర్ చేయకుండా దిల్ రాజు ఎందుకు ఊరుకున్నాడో అర్థం కాని పరిస్థితి. టైటిల్ విషయం అలా వుంటే, ఈ సినిమాలో మొత్తం నలుగురు హీరోలు వుంటారట.
నలుగుర్లో హీరోయిన్ లవ్ చేసే హీరోగా మాత్రం కాస్త బిజీగా వున్న హీరోని పెట్టుకుని, మిగతా ముగ్గుర్నీ వేషాల్లేక ఖాళీగా వున్న యంగ్ హీరోలని పెట్టుకుందామని దిల్ రాజు అంటే, కృష్ణవంశీ మాత్రం అలా కుదరదని చెప్పాడని సమాచారం. నలుగురు హీరోలూ బిజీగా వున్న యంగ్ హీరోలు కావాలని పట్టుబడుతున్నాడట. అయినా కృష్ణవంశీది మరీ చాదస్తం, చాలా గ్యాప్ తర్వాత సినిమా వచ్చింది కదా... కాస్త ఎడ్జస్ట్ అవ్వచ్చు కదా అని దిల్ రాజ్ కాంపౌండ్లోవాళ్ళు గుసగుసగుసలాడుకుంటున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



