అఖిల్ ని రిజెక్ట్ చేసిన అలియా..!
on Dec 18, 2014
హీరోగా మొదటి సినిమా మొదలుకాకుండానే బ్రాండ్ అంబాసిడర్‌గా దూసుకుపోతున్నాడు అక్కినేని అఖిల్. టైటాన్ వాచెస్‌తో మొదలైన అఖిల్ బ్రాండ్ జర్నీ మౌంటెన్ డ్యూ సాఫ్ట్ డ్రింక్‌తో కంటిన్యూ అవుతోంది. అయితే అఖిల్ మొదటి సినిమాకి హీరోయిన్ ఇంకా దొరకలేదు. రీసెంట్ గా అఖిల్ కి జోడీగా నటించమని అలియా భట్ ని సంప్రది౦చారట. కానీ అలియా ఇప్పుడప్పుడే తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వనని తేల్చిచెప్పేసిందట. బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న కారణంగానే అలియాకి టాలీవుడ్ లోఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదట. ఇదిలా ఉంటే, మరో పక్క అఖిల్ కి మొదటి సినిమా కాబట్టి ఆ సినిమా టాలీవుడ్ లో తనకు సరైన బ్రేక్ ఇస్తుందా లేదా అని కూడా అలియా ఆలోచిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల కథనం. దాంతో అఖిల్ సినిమాకి హీరోయిన్ వేట మళ్ళీ మొదలైందని ఇండస్ట్రీలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.