చిక్కుల్లో బన్నీ-హరీష్ ల సినిమా!
on Jul 5, 2016
"సరైనోడు" అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సైన్ చేసిన అల్లు అర్జున్.. ప్రస్తుతం ఆ సినిమా కోసం సరికొత్త లుక్ ను ట్రై చేస్తూ బిజీగా ఉండగా.. హరీష్ ఏమో ఆ సినిమా స్క్రిప్ట్ పనుల్లో యమబిజీగా ఉన్నాడు. త్వరలోనే సెట్స్ కు వెళ్లాల్సిన ఈ సినిమా ఇప్పుడు చిక్కుల్లో పడిందని తెలుస్తోంది.
విషయం ఏంటంటే.. హరీష్ శంకర్ కి "మిరపకాయ్"తో సెకండ్ ఛాన్స్ ఇచ్చిన నిర్మాత రమేష్ పుప్పాల, ఆ సినిమా విడుదలకు ముందే హరీష్ తో వరుసగా మూడు సినిమాలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకోవడంతోపాటు అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. అయితే.. పుప్పాల తర్వాత "శ్రీమన్నారాయణ, పైసా" లాంటి సినిమాను రూపొందించి భారీ నష్టాలను చవిచూసిన కారణంగా నిర్మాణానికి కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ నిర్మాణం మొదలెడదామని హరీష్ ను అగ్రిమెంట్ లో భాగంగా "ఓ సినిమా చేసిపెట్టవయ్యా" అని రమేష్ పుప్పాల అడగ్గా.. సింపుల్ గా "సారీ సార్" అనేశాడట హరీష్ శంకర్. ఈ విషయమై రమేష్ పుప్పాల బాగా సీరియస్ అయ్యాడని, పరిశ్రమపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించడానికి సన్నద్ధమవుతున్నాడని సమాచారం!