డ్రగ్ మాఫియా తో సంబంధం ఉన్న ఆ 10 మంది ఎవరు?
on Jul 12, 2017
డ్రగ్ మాఫియా- గత కొన్ని రోజులుగా మనం తరచుగా వింటున్న పదం. పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులు డ్రగ్స్ కి బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ డ్రగ్స్ మాఫియా వల్ల తెలుగు సినీ పరిశ్రమ కూడా ఇబ్బందులు ఎదుర్కుంటుంది. కొందరు యువ హీరోలకి డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నట్టు, ఇంతకు ముందు ఈ మధ్య కాలంలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై స్పందించడానికి పలువురు ఇండస్ట్రీ పెద్దలు సమావేశమై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఈ సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ, "మనము మన పిల్లలు ఉండే చోటు, మన సిటీ, మన రాష్ట్రం క్లీన్ గా ఉండాలని కోరుకుంటాం. అది మన బాధ్యత. కొన్ని సమాజ వర్గాల్లో డ్రగ్ మహమ్మారి ఎంటర్ అయింది. విచారకరం విషయం ఏంటంటే, మన ఇండస్ట్రీలో ఒక 10 మంది యువకుల్లో ఈ డ్రగ్ అడిక్షన్ ఉండడం. ఆ మహమ్మారిని అరికట్టే బాధ్యత మన పైన ఉంది. ఈ విషయాన్నీ ఒక ప్రణాళికా బద్దంగా డీల్ చేస్తున్న ప్రభుత్వానికి, పోలీస్ శాఖా వారికీ మా కృతజ్ఞతలు. ఇండస్ట్రీలో ఉన్న ఆ పది మంది ఇప్పటికయినా దీన్ని ఆపకపోతే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది," అని హెచ్చరించారు.
అగ్ర నిర్మాత సురేష్ బాబు కూడా ఈ విషయమై తన అభిప్రాయం వ్యక్త పరిచారు. ఇండస్ట్రీకి చెడు పేరు తెచ్చే పనులు మానేసి, బాగోగుల కోసం కార్యక్రమాలు చేయాలనీ చెప్పారు. అయితే, మన పెద్దలు చెబుతున్న ఆ పది మంది ఎవరు? వాళ్ళ మాటలు బట్టి చూస్తే ఆ పది మంది పేర్లు బయట పెట్టకుండానే డ్రగ్ మహమ్మారి పనిపట్టేలా కార్యక్రమాలు జరగబోతున్నాయని అర్ధం అవుతుంది.