శ్రీమంతుడులో ప్రి క్లైమాక్స్ అదుర్స్..!!
on Aug 3, 2015
గత సంవత్సరం రెండు సినిమాలతో అభిమానులను నిరాశపరిచిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈసారి మాత్రం అభిమానుల్ని నిరాశపరచనని చెబుతున్నాడు. ఇంతకీ ఈ సినిమా అభిమానులను ఆకట్టుకునే అంశాలు ఏమి వున్నాయని అడగ్గా..ఇంటిల్లిపాదీ కలిసి చూసే ఎమోషన్స్ ఇందులో చాలా బాగా వచ్చాయని చెబుతున్నాడు. ప్రి క్లైమాక్స్ కూడా సినిమా హైలైట్ అవుతోందని అంటున్నారు. అలాగే కొరటాల శివ కూడా ప్రి క్లైమాక్సే శ్రీమంతుడికి మెజర్ అసెట్ అని అంటున్నాడు.
పదే పదే ప్రి క్లైమాక్స్ అంటున్నారు ఇంతకీ ఏముందని ఇందులో? అన్నచర్చ మొదలైంది. మామూలుగా స్టార్ హీరో సినిమాల్లో ఇంటర్వెల్ గురించో..క్లైమాక్స్ ..ఫైట్స్ గురించో ప్రత్యేకంగా చెబుతుంటారు. మరి ప్రి క్లైమాక్స్ అన్నారంటే.. అందులో కచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. మహేష్ పెర్ఫామెన్స్ కూడా ఈ సీన్లో నే పీక్స్ లో ఉండొచ్చని అంటున్నారు. మరి ఇవన్నీ చూడాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.