అనుపమ పరమేశ్వర్ బాధ్యతని తీసుకున్న సమంత
on Apr 27, 2024
టిల్లు స్క్వేర్ తో అనుపమ పరమేశ్వరన్ పేరు మారుమోగిపోతుంది. ముఖ్యంగా యువతలో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి సుమారు 24 చిత్రాలకి పైనే చేసింది. కానీ వాటితో రాని గుర్తింపు ఒక్క టిల్లు తో వచ్చింది. దీంతో ఆమె చెయ్యబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.
అనుపమ అప్ కమింగ్ మూవీ పరదా.ఇప్పుడు ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. స్టార్ హీరోయిన్ సమంత రిలీజ్ చేసిన ఆ టీజర్ ఇప్పుడు యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. సాంప్రదాయ దుస్తులతో ఉన్న అనుపమ మరికొంత మంది ఆడవాళ్ళతో నిలబడి ఉంది. తన పక్కన ఉన్న వారికి మాత్రం ముఖాలు కప్పి ఉన్నాయి. కాన్సెప్ట్ వీడియో గ్రామ సెటప్‌లో దేవత విగ్రహంతో పాటు ఒక శ్లోకం వినబడుతుంది ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ దైవత్వం వికసిస్తుంది. మరియు స్త్రీలు ఎక్కడ అవమానించబడతారో, ఎంత గొప్పవారైనా అన్ని చర్యలు ఫలించవు అనే శ్లోకం వినపడుతుంది. దీంతో పరదా ఒక వెరైటీ మూవీ అనే విషయం అర్ధం అవుతుంది.
హృదయం, జయజయ జయజయ హే చిత్రాలకి దర్శకత్వం వహించిన దర్శనా రాజేంద్రన్ పరదా కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆనంద మీడియా బ్యానర్‌పై విజయ్ దొన కొండ నిర్మిస్తుండగా సంగీత, దర్శన్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు.గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తన సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసినందుకు సమంత కి అనుపమ పరమేశ్వరన్ కి ధన్యవాదాలు తెలిపింది
Also Read