Facebook Twitter
కారా మాస్టారు గారి గురించి మరికొన్ని సంగతులు...

కారా మాస్టారు గారి గురించి మరికొన్ని సంగతులు...

 

 



* కారా మాస్టారు అక్టోబర్ 14, 1924న జన్మించారు.

* కారా మాస్టారు పేర్రాజు, భ్రమరాంబ దంపతులకు ప్రథమ పుత్రుడు.

* సోదరులు కృష్ణారావు, విశ్వేశ్వరరావు -
సోదరీమణులు సూరీడు, కమల.

* కారా మాస్టారు గారికి అయిదుగురు కుమారులు, ఒక కుమార్తె.

* ప్రధమ రచన: చిత్రగుప్త.
మరికొన్ని రచనలు : తీర్పు, యజ్ఞం, వీరుడు-మహావీరుడు, మహదాసీర్వచనము, ఆదివారం, హింస, స్నేహం, ఆర్తి, భయం, శాంతి, చావు, జీవనధార, కుట్ర.

* కారా మాస్టారు 1966లో రాసిన ‘యజ్ఞం’ కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా ఆ కథలో చూపించారు. ఈ కథకు దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సినీ ప్రముఖుడు గుత్తా రామినీడు ఈ కథను అదే పేరుతో సినిమాగా కూడా రూపొందించారు.

* కారా మాస్టారు తెలుగు కథకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా విశేష కృషి చేస్తున్నారు . ఆంధ్రభూమి దినపత్రికలో ‘నేటి కథ’ శీర్షికను నిర్వహించి క్రొత్త రచయితలకు అవకాశమిచ్చారు.

* కారా మాస్టారు ఉపాధ్యాయ వృత్తి  నుండి రిటైరైన తరువాత 1997 ఫిబ్రవరి 22వ తేదీన 800 పుస్తకాలతో కథానిలయాన్ని శ్రీకాకుళంలో రెండు గదులున్న ఒక చిన్న భవనంలో  ప్రారంభించారు. ఈ కథానిలయం లో 1898వ సంవత్సరం నుండి ప్రచురణలు ఉన్నవి.  9 మంది సభ్యులతో 1998వ సంవత్సరంలో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ కథానిలయం ద్వారా ప్రతి సంవత్సరం 20 నుండి 30 మంది విద్యార్ధులు ఎంఫిల్, పీహెచ్‌డీ చేస్తున్నారు. INTACH ద్వారా కథా నిలయాన్ని సందర్శనా స్థలంగా పరిగణించుటకు గాను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కథా నిలయం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి, సాయంత్రం 7 గంటల వరకు తెరచి ఉంటుంది.



* కారా మాస్టారు తన రచనల ప్రచురణల ద్వారా వచ్చిన ఆదాయాన్ని,  అవార్డుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కేవలం తెలుగు  సాహిత్యానికి, మరియు కథానిలయం కోసం మాత్రమే ఖర్చు చేయడం విశేషం. సమాజంలోని పరిస్థితులు, ప్రకృతి వీటన్నిటి ప్రేరణ ద్వారానే తన రచనలు వచ్చేవి కాబట్టి దానిపై వచ్చిన ఆదాయాన్ని తన స్వంత విషయముల కోసం ఖర్చు చేసే అధికారం లేదు అని ఆయన అంటారు.


కారా మాస్టారు కథా నిలయం విశేషాలు..
రెండు అంతస్తుల భవనం. ( రెండవ అంతస్తులో రీడింగ్ రూం మరియు ఫోటో గేలరీ కలవు)

పత్రికా శీర్షికల సంఖ్య : 453, పత్రికా సంచికల సంఖ్య : 22000, మొత్తం పుస్తకాల సంఖ్య : 11697, సంకలనాలు : 417, సంపుటాలు : 2328, ఫీచర్ రచనలు : 105
వ్యాస సంకలనాలు : 110, ఆత్మ కథలు : 67, పరిశోధనా పత్రాలు : 97, జీవిత చరిత్రలు : 95, సాహిత్య సర్వస్వాలు : 130, ఉపయుక్త గ్రంధ సూచికలు : 53, ఇతర భాషలలో వచ్చిన తెలుగు పుస్తకాలు : 45, ఇతరములు : 2850, కథా రచయితల సంఖ్య : 13025, వ్యక్తిగత సమాచారం అందించిన రచయితలు : 2600, సేకరించిన ఫోటోలు : 500. ప్రస్తుతం వీటిని డిజిటలైజ్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు డిజిటలైజ్ అయినవి : 2 లక్షల పేజీలు, డిజిటలైజ్ కావలసినవి : 4 లక్షల పేజీలు.