Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మోనికా కుమార్

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మోనికా కుమార్

 

 

ఇంగ్లీష్లో ప్రొఫెస్సర్ అయిన మోనికా కుమార్ మాతృభాష పంజాబీ. ఆమె పంజాబీ, హిందీ, ఇంగ్లీష్ ఈ మూడు భాషల్లోనూ కవిత్వం రాస్తుంది. మోనికా కుమార్ పురుషులు ఏలుతున్న హిందీ సాహిత్య ప్రపంచానికి తన కవిత్వంతో ఒక సవాలు విసిరింది. ప్రతి రోజూ జరిగే లెక్కలేని చిన్న చిన్న సంఘటనలకి భూతద్దం పట్టినంత తేలికగా ఎటువంటి అలంకారిక భేషజం లేకుండా ఉంటాయామె కవితలు. మన చుట్టూ గమనిస్తే ఎన్ని చిన్న చిన్న ప్రపంచాలో. పదమూడేళ్ళ వయసులో ఒక వ్యాస రచన పోటీలో మొదటి బహుమతికి ఆమె పేరు ప్రకటించినపుడు ఆమె చాలా ఇబ్బంది పడి పోయిందట. ఇబ్బంది అందరి దృష్టి తనమీద పడినప్పుడు. ఆ ఇబ్బంది ఆమెను చాలా ఏళ్ళు వెంటాడింది. ఆ తరవాత అది ఇంకా ప్రస్పుస్టంగా ఆమె వ్యక్త పరిచింది ఆమె కవిత్వంలో. ఈ ఇబ్బంది ఆమెని చాలా కాలం వెంటాడింది. అకస్మాత్తుగా బయటి ప్రపంచానికి ఒక రచయిత్రిగా పరిచయం అవడం అంటే అంత సులభం ఏమీ కాదు. ఎందుకంటే ఇక అప్పట్నుంచి అందరి దృష్టి ఆమె మీద ఉంటుంది. ఆమె ప్రతి పదమూ డిసెక్ట్ చెయ్యబడుతుంది. ఆ దృష్టికి కొన్ని లక్షణాలుంటాయి, వాటిలో, వెటకారం, మోహం, ఆకర్షణ, కామం అన్నీ ఉంటాయి. వీటిని తట్టుకోడం నేర్చుకోవాల్సొచ్చిందంటుందామె. ఇటువంటి ఇబ్బందే కెమేరా ముందు నిలబడటం. మన కనుపాపలాగే ఉండే ఆ కెమేరా కన్ను మన మొహంలోని అందాన్ని పట్టుకోడానికి ప్రయత్నిస్తుంది. ఇక మనం మన అగ్లినెస్ దాచటానికి విశ్వప్రయత్నం చేస్తాము. కానీ అదెక్కడికి పోతుంది. దాన్ని దాచలేని మన ఇబ్బందికి కాళ్ళు వణుకుతాయి. కానీ అదేదో పరిక్ష ఫలితంలాగా వెతుక్కుంటాం మనల్ని మనం ఫొటోలో. చివరికి తెలిసేదేంటంటే ఆ కెమేరా ఫైల్ అయ్యిందని. అదే ఆ ఫొటొలో మన కాళ్ళు వణకడం కనపడదు. Before the Camera అనే ఓ కవిత లోని ఈ చివరిలైన్స్ బాగుంటాయి.

'll look at this picture as desperately
as one looks at exam results

And see! There is a lot missing
It hasn't captured my trembling legs!

**
పాస్పోర్ట్ అనే ఈ కవిత చూడండి మచ్చుకి.

Pass Port

When we meet
even before smiling
I do the checklist
your eyes, still two
your ears, intact
your back, erect
in your passport photograph
your heartbeat has stopped though
I want to forget this photograph forever
sorry but the official stamp on your chest
does not look like a medal
I talk my heart to squirrels
since I know
they have the least interest in what I say
they are interested only in the breadcrumbs
the school children drop out of their lunchboxes
they hop around all day and wait
they have no urge for a leisurely talk
all they really care about is their tails
as they climb a tree
The passport is already here
visa on its way
so please don’t promise to write me letters
As soon as you are gone,
I will draft an appeal:
if ever, we meet again
you be me
and I, a squirrel


Passport

మనం కలిసినప్పుడు
చిరునవ్వులు రువ్వేముందే
నేను కొన్ని సరి చూస్తాను
నీ కళ్ళు, ఇంకా రెండు
నీ చెవులు, సరిగానే ఉన్నాయి
నీ నడుము, ఇంకా నిటారుగానే ఉంది
కానీ నీ పాస్పోర్ట్లోని ఫొటోలో
నీ గుండె కొట్టుకోవడం ఆగింది

నాకీఫొటోని ఎప్పటికీ మరిచిపోవాలనుంటుంది
సారీ, నీ గుండెలమీద పడిన అధికారిక ముద్ర
పతకం లాగా ఏమీ కనిపించదు

ఉడతలతో నా గుండె విప్పి మాట్లాడుతాను
ఎందుకంటే నాకు తెలుసు
నే చెప్పేదాంట్లో వాటికెటువంటి ఆసక్తి లేదని
స్కూలు పిల్లల టిఫిను బాక్సుల్లోంచి వేసే
బ్రెడ్ ముక్కలమీదే వాటి ఆసక్తి అంతా
రోజంతా గెంతుతూ వేచి ఉంటాయి
తీరికగా మాట్లాడే కోరిక వాటికి లేదు
అవి నిజంగా పట్టించుకునేది
చెట్లెక్కేటపుడు వాటి తోకలని మాత్రమే

పాస్పోర్ట్ వచ్చేసింది
వీసా కూడా వస్తుంది
నువ్వుత్తరాలు రాస్తానని ప్రమాణాలు చెయ్యకు

నువ్వెళ్ళిన వెంటనే
నేనొక ఫిర్యాదు రాస్తాను
మళ్ళీ మనమెప్పుడైనా కలిసినప్పుడు
నువ్వు నేనవ్వాలని
నేను, ఒక ఉడత అవ్వాలని.

ప్రేమికుడు దేశం వదిలి వెళ్ళిపోతాడంటే ప్రేయసి పడే బాధని ఎంతో సున్నితంగా చెప్తుంది ఈ కవిత. ప్రియుడు వెళ్ళిపోతే ఆమెకు తోచదు, పాస్పోర్ట్ రావడం, వీసా కూడా ప్రోసెస్ అవుతుండడం ఆమెని కలవరపెడతాయి. ఫొటోలో అన్నీ సరిగానే ఉన్నా గుండె కొట్టుకోదు. తన బాధని లెక్క చెయ్యకుండా వెళ్ళిపోయే ప్రియుడికి అసలు గుండె లేదని ఆమె అభియోగం, ఒకవేళ ఉన్నా అది కొట్టుకోవట్లేదంటుంది ఫొటోలోలాగే. పైగా ఆ ఫొటోపైన పడిన స్టాంపు పతకంలా ఏమీ కనిపించటంలేదని వెక్కిరిస్తుంది. ఉత్తరాలు రాస్తానని అతను చేసే ప్రమాణాలూ ఆమెని సంతృప్తి పరచవు. ఆమె గోడంతా ఆ ఉడతలతో అవి వినవని తెలిసినా చెప్పుకుంటుంది. ప్రియుడు లేకపోతే ఆమెకు చేసేదేమీ ఉండదు, సమయం గడవదు. కానీ అది ప్రియుడికి అర్ధంకాదు, అతను వెళ్ళిపోవడమెలాగూ ఖాయం. ఆ బాధ, నిస్సహాయత అతని మీద కోపంగా మారతాయి. అందుకే మళ్ళీ కలిసినపుడు అతను ఆమెవ్వాలని, ఆమె మాత్రం ఆ ఉడతలాగే అతని గోడు వినిపించుకోకుండా బిసీగా పట్టించుకోనట్లు ఉండాలనుందని ఆమె అంటుంది. ప్రేయసి పడే వియోగాన్ని వర్ణించడం చాలా కొత్తగా ఉంటుంది.

ఇంకో పరిచయంతో వచ్చే వారం.

 

-Sharada Sivapurapu