RSS Feeds

There are billions of pages on the Internet and trying to find what you want can often prove to be really tedious. But you can now have customised content delivered to your desktop through RSS (Really Simple Syndication) feeds. teluguone.com/news offers free headlines for personal, non-commercial use via Really Simple Syndication (RSS 2.0). This is an easy way to get the latest news from teluguone.com/news even if you are not logged on to the site.

The feeds are available for the following sections:


English

Telugu

LATEST NEWS
సాక్షి దినపత్రికపై టీడీపీ నేత నారా లోకేష్ రూ. 75 కోట్లకు పరువునష్టం దావా వేశారు. 'చినబాబు చిరుతిండి 25 లక్షలండి' అంటూ గత ఏడాది సాక్షిలో ఓ కథనాన్ని ప్రచురించారు. తప్పుడు కథనంతో తన పరువు ప్రతిష్టలకు ఉద్దేశపూర్వకంగా మంటగలిపేందుకు ప్రయత్నించారని.. సాక్షిపై లోకేష్ పరువునష్టం దావా వేశారు.  విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే రీతిలో, ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాన్ని సాక్షి ప్రచురించిందని తన వ్యాజ్యంలో లోకేష్ పేర్కొన్నారు. 2019 అక్టోబ‌ర్ 22న విశాఖ విమానాశ్రయంలోని క్యాంటీన్లలో.. లోకేష్ రూ. 25 లక్షలకు చిరుతిళ్లు తిన్నారని, అదంతా ప్రజాధనమని సాక్షి రాసింది. అయితే.. సాక్షి పత్రిక ప్రచురించిన తేదీల్లో లోకేష్ విశాఖలో లేరు. అదే సమయంలో.. ఆ ఖర్చంతా ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిధుల మర్యాదల కోసం వెచ్చించే ప్రోటోకాల్ ఖర్చుగా తేలింది. ఈ విషయాలను బయట పెట్టిన లోకేష్.. క్షమాపణ చెప్పాలని కోరుతూ.. సాక్షి యాజమాన్యానికి లేఖ రాశారు. అయితే సాక్షి పత్రిక.. తమ కథనానికి వివరణ ప్రచురించడానికి నిరాకరించడంతో.. లోకేష్ న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే రీతిలో తప్పుడు కథనం ప్రచురించారంటూ.. సాక్షిపై రూ. 75 కోట్లకు పరువు నష్టం దాఖలు చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భైంసాలో రసవత్తర రాజకీయానికి తెర పడింది.భైంసాలో ఉత్కంఠ వాతావరణం మధ్య ఎన్నిక ఫలితాలు వెలువడ్దాయి.భైంసా మునిసిపల్ ఎన్నికల్లో ఎంఐఎం సత్తాచాటింది. మొత్తం 26 స్థానాల్లో 15 ఎంఐఎం కైవసం చేసుకోగా.. బిజెపి 9 స్థానాల్లో.. స్వతంత్రులు 2 స్థానాలను గెలుపొందారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా మొదటి నుండి బిజెపి , ఎంఐఎం మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఒకానొక దశలో బీజేపీ ముందంజలో కొనసాగగా అనూహ్యంగా ఎంఐఎం చివరి రౌండ్ లో దూసుకెళ్లింది. ఏకంగా 15 స్థానాలను కైవసం చేసుకుని భైంసాను తన ఖాతాలో వేసుకుంది. ఉదయం 8 గంటల నుంచి ఫలితాలు విడుదలవుతున్న నేపధ్యంలో బీజేపీ వర్సెస్ ఎంఐఎం గా గట్టి పోటీ కొనసాగింది. మొదటి రౌండ్ లో ఇద్దరు 9 స్థానాలతో సమాంతరంగా ఉండి కౌంటింగ్ రసవత్తరంగా సాగింది.చివరకు 15 స్థానాలతో ఎంఐఎం భైంసా విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. ఇతరులు 2 స్థానాలను గెలుచుకున్నారు. ఈ ప్రాంతంలో టీఆర్ఎస్,కాంగ్రెస్ కానీ ఎవరూ గెలవలేదు. మొత్తం మీద చైర్మన్ పీఠంతో పాటు వైస్ చైర్మన్ పీఠాన్ని కూదా ఎంఐఎం తన ఖాతాలో వేసుకున్నట్లు సమాచారం.  
సిరిసిల్లలో ఫలితాల కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల వైఖరి అందరిని ఆగ్రహానికి గురి చేస్తొంది.మున్సిపాలిటీలో ఓడిపోయిన అభ్యర్థులను పోలీసులు ఓ రూమ్ లో వేసి తాళాలు వేయడం కలకలం రేపుతోంది. ఓడిపోయిన వారందరు బయటకు వెళితే గొడవలు చేస్తారనే ముందుచూపుతో ఇలా చేశామంటున్నారు పోలీసులు. ఇది కావాలని అధికార పార్టీ చేయిస్తోందని ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ 24 సీట్లు,కాంగ్రెస్ 2 సీట్లు, బీజేపీ 3 సీట్లను ఇతరులు 10 సీట్లను సొంతం చేసుకున్నారు. ఓడిపోయిన వారు కౌంటింగ్ ప్రదేశం నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేయగా.. అక్కడి పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడున్న అధికారులకు పోలీసులకు మధ్య గట్టి వివాదం చోటుచేసుకుంది. వారిని బయటకు పంపితే ఇరు నేతల మధ్య వివాదాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నందునే తాము ఇలాంటి చర్యలకు పాటు పడాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. మొత్తం మీద పోలీసుల చర్యలతో ఓడిపోయిన నేతలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ALSO ON TELUGUONE N E W S
  పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' అనే రొమాంటిక్ కామెడీ మూవీతో హీరోగా వెండితెరపై అడుగుపెడుతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర 'ఆర్య 2', 'నేనొక్కడినే' సినిమాలకు పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆయనే ఈ సినిమాకు రచన కూడా చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ లను శనివారం రానా దగ్గుబాటి ఆవిష్కరించాడు. పోస్టర్ల కాన్సెప్టు, మ్యూజిక్ తనకు బాగా నచ్చాయని ఆయన చెప్పాడు. ఫస్ట్ లుక్ పోస్టరులో పల్లెటూరి వేషంలో ఉన్న ప్రదీప్, సినిమాలో తన ప్రేయసిగా నటిస్తోన్న అమృత అయ్యర్ తో పాటు కులాసాగా కనిపిస్తున్నాడు. ఇద్దరి ముఖాల్లోనూ ఉల్లాసం తాండవిస్తోంది. సూర్యోదయం, జలపాతాలు, పక్షులు, చెట్లతో బ్యాగ్రౌండ్ ఒక అందమైన పెయింటింగ్ ను తలపిస్తోంది. టైటిల్ డిజైన్ కూడా ఆసక్తికరంగా ఉంది. బాణం విసురుతున్న మన్మథుడు, గులాబీ, లవ్ లెటర్, తాళం వేసిన హృదయం వంటి వాటితో ఆ టైటిల్ ను రూపకల్పన చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించనున్నది.  ఎస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై కన్నడ నిర్మాత ఎస్.వి. బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దాశరథి శివేంద్ర సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్న ఈ మూవీకి పనిచేస్తుండగా, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పాటలన్నింటినీ చంద్రబోస్ రాశారు. వాటిని సిద్ శ్రీరామ్, రాహుల్ సిప్లిగంజ్, అనురాగ్ కులకర్ణి, ధనంజయ్, సునీత, మోహన భోగరాజు, మధుప్రియ ఆలపించారు.
  జనవరి 24న విడుదలైన 'డిస్కో రాజా' మూవీ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో 'క్రాక్' సినిమా చేస్తోన్న రవితేజ, మరొ సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదివరకు తనతో 'వీర' సినిమాని తీసిన రమేశ్‌వర్మ డైరెక్షన్‌లో మరో మూవీని చేయబోతున్నాడు. రమేశ్‌వర్మతో ఇటీవల 'రాక్షసుడు' వంటి హిట్ థ్రిల్లర్‌ను తీసిన ఏ స్టూడియోస్ అధినేత కోనేరు సత్యనారాయణ ఈ మూవీని నిర్మించనున్నారు.  జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టును ప్రకటించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రూపొందించనున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించి, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతామని నిర్మాత తెలిపారు. ఈ మూవీలో నటించే హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. 'వీర' సినిమా ఫ్లాపైనా, రమేశ్‌వర్మ చెప్పిన సబ్జెక్ట్ బాగా నచ్చి, మళ్లీ అతని డైరెక్షన్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు రవితేజ.
యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ చిన్న నిక్కరులో ఉన్న ఫొటో ఒకటి ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఆల్మోస్ట్‌ వైరల్‌ అయింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ పిరియాడిక్‌ ఫిల్మ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వర్కింగ్‌ స్టిల్‌ అది. ఆ స్టిల్‌ ఒక్కటే కాదు... ఒక వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. అదీ ఎన్టీఆర్‌దే. దీంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రంగంలోకి దిగింది. కాపీ రైట్‌ యాక్ట్‌ కింద ఆ ఫొటోలు, వీడియో డిలీట్‌ చేయిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్‌ షూటింగ్‌ పార్ట్‌ లీక్‌ కావడం ఇది ఫస్ట్‌ టైమ్‌ కాదు. ఇంతకు ముందు అరకు దగ్గరలోని పాడేరులో షూటింగ్‌ చేస్తే... సాయంత్రానికి లొకేషన్‌లో ఎన్టీఆర్‌ స్టిల్స్‌ బయటకొచ్చాయి. లేటెస్టుగా లీకైన వీడియోలో పులితో ఎన్టీఆర్‌ ఫైట్‌ చేసే సీన్‌ ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో తెలంగాణ విప్లవ యోధుడు కోమరం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు. టైగర్‌తో ఫైట్‌ చేసే సీన్‌ను ఎన్టీఆర్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌గా ప్లాన్‌ చేశారు. అదే ఇప్పుడు లీకైంది. లీకులను అరికట్టడానికి దర్శకుడు రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ, అవేవీ ఫలితాలను ఇవ్వడం లేదు. ‘బాహుబలి’కి కూడా రాజమౌళి లీకులను ఎదుర్కొన్నాడు. ఆ అనుభవంతో ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినా లీకుల బెడద తప్పడం లేదు.  
సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకోవడానికి అసలు కారణం మోకాలికి సర్జరీ చేయించుకోవాలని అనుకోవడమే అని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి మహేశ్‌ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే సర్జరీ చేయించుకోవాలని ప్లాన్‌ చేశారట! కొన్నేళ్లుగా మోకాలి నొప్పితో మహేశ్‌ బాధపడుతున్నారు. భళ్లారిలో ‘ఆగడు’ షూటింగ్‌ చేసేటప్పుడు 2014లో ఆయన మోకాలికి గాయమైందట. అప్పట్నుంచి సర్జరీ చేయించుకోవడానికి బిజీ షెడ్యూల్స్‌ వల్ల కుదరలేదట. ‘స్పైడర్‌’ తర్వాత ఒకసారి సర్జరీ చేయించుకున్నా ఎక్కువ రోజులు షూటింగ్‌కి దూరంగా ఉండకపోవడంతో సెట్‌ కాలేదట. అందుకని, ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మూడు నెలలు ప్రొఫెషనల్‌ కమిట్‌మెంట్స్‌కి దూరంగా ఉండి, సర్జరీ చేయించుకుని పూర్తిగా నయమైన తర్వాత మళ్లీ సినిమా షూటింగులు స్టార్ట్‌ చేయాలనే డెసిషన్‌ తీసుకున్నాడట. అందుకని, అమెరికా వెళ్లారని టాక్‌. పైకి మూడు నెలలు అని చెబుతున్నా, పూర్తిగా కోలుకోవడానికి ఐదు నెలల సమయం పట్టవచ్చట. విశ్రాంతి నుండి తిరిగొచ్చిన తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘మహర్షి’ వచ్చింది. అది మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమా. ఈసారి ఆ సినిమాకు కంప్లీట్‌ డిఫరెంట్‌గా ఉండే సినిమా చేయనున్నారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో జేమ్స్‌ బాండ్‌ తరహా క్యారెక్టర్‌ను మహేశ్‌ కోసం వంశీ పైడిపల్లి డిజైన్‌ చేశాడట.
  ఇవాళ టాలీవుడ్‌లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే.. క్షణం ఆలోచించకుండా చెప్పే పేరు తమన్. అవును. 2018 వరకూ దేవి శ్రీప్రసాద్ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తూ రాగా, ఇప్పుడు ఆ కిరీటాన్ని తమన్ ధరించాడు. 2019 సెప్టెంబర్ ఆఖరులో విడుదలైన 'సామజవరగమన' అనే పాట సృష్టించిన ప్రభంజనం సద్దుమణగక ముందే, అక్టోబర్‌లో వచ్చిన 'రాములో రాములా' సాంగ్ దుమ్ము రేపేసింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సినిమాలోని ఈ రెండు పాటలతో తమన్ టాప్ రేంజికి చేరుకున్నాడు. ఆ రెండు పాటలూ అతి స్వల కాలంలో యూట్యూబ్‌లో 150 మిలియన్ వ్యూస్ దాటిన పాటలుగా తెలుగు సినీ సంగీత ప్రపంచంలో సరికొత్త చరిత్రను సృష్టించాయి.  'అల.. వైకుంఠపురములో' సినిమా ఆడియెన్స్ ముందుకు రాకమునుపే అది మ్యూజికల్ హిట్టనే విషయం తేలిపోయింది. ఆ రెండు పాటల స్థాయిలో సెన్సేషన్ కాకపోయినా 'ఓ మై గాడ్ డాడీ', 'బుట్టబొమ్మ' పాటలూ శ్రోతల్ని అలరించాయి. ఇక సినిమా రిలీజయ్యాక 'సిత్తరాల సిరపడు' పాట సూపర్ హిట్టయింది. మొత్తంగా 'అల.. వైకుంఠపురములో' బ్లాక్‌బస్టర్ హిట్టవడంలో తమన్ సమకూర్చిన మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించింది. అలాగే 2019లో తమన్ మ్యూజిక్ అందించగా విడుదలైన వెంకటేశ్-నాగచైతన్య సినిమా 'వెంకీమామ', సాయితేజ్-మారుతి మూవీ 'ప్రతిరోజూ పండగే' పాటలూ సంగీత ప్రియుల్ని అలరించాయి. వాటికి తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోరూ ఆకట్టుకుంది. అంటే సంగీతపరంగా 2019 తమన్ నామ సంవత్సరంగా పేరు తెచ్చుకుంది.  ఇక 2020 సంవత్సరంలో తమన్ డైరీలో ఒక్కరోజు కూడా ఖాళీ లేదు. ఇప్పటికే మనకు తెలిసి తొమ్మిది సినిమాలకు అతను పనిచేస్తున్నాడు. ఇంకా ఎన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో మనకు తెలీదు. కీర్తి సురేశ్ టైటిల్ రోల్‌లో కొత్త దర్శకుడు నరేంద్రనాథ్ రూపొందిస్తోన్న 'మిస్ ఇండియా' సినిమాకు స్వరాలు అందిస్తున్నాడు తమన్. 'ప్రతిరోజూ పండగే' వంటి హిట్ మూవీ తర్వాత సాయితేజ్ లెటెస్ట్ ఫిల్మ్ 'సోలో బ్రతుకే సో బెటర్'కూ అతను బాణీలు కూరుస్తున్నాడు. ఈ సినిమాతో సుబ్బు అనే డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. జనవరి 24న రిలీజైన రవితేజ సినిమా 'డిస్కో రాజా'కు ఇచ్చిన మ్యూజిక్‌తో మరోసారి మెరిసిన తమన్, ఇప్పుడు అదే హీరో చేస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'క్రాక్'కు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకుడు. ఇక తమన్ తొలిసారి హీరో నానితో కలిసి పనిచేస్తోన్న సినిమా 'టక్ జగదీష్'. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తొన్న ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ ఇటీవలే జరిగాయి. వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందిస్తోన్న సినిమాకు సంగీతం అందిస్తోంది తమనే. పవన్ కల్యాణ్ కంబ్యాక్ మూవీ 'పింక్' రీమేక్‌కు పనిచేస్తోన్న అతను ఇప్పటికే ఐదు పాటలకు ట్యూన్స్ ఇచ్చేశాడు. ఇది పీకేతో అతని ఫస్ట్ కొలాబరేషన్ కావడం గమనార్హం. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో తయారవుతున్న సినిమాకూ తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. 'డిక్టేటర్' సినిమా తర్వాత అతను బాలకృష్ణతో పనిచేస్తోంది ఇప్పుడే. మహేశ్ హీరోగా నటించనున్న 27వ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడనే వార్త ఆ హీరో ఫ్యాన్స్‌ను ఆనందపరుస్తోంది. వంశీ పైడిపల్లి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. 'దూకుడు', 'బిజినెస్‌మేన్', 'ఆగడు' సినిమాల తర్వాత మహేశ్ సినిమాకు తమన్ సంగీతం అందివ్వబోతున్నాడు. ఇక 'అల.. వైకుంఠపురములో' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత త్రివిక్రమ్ తీయనున్న సినిమాకీ తమన్ పనిచేయనున్నాడని వినిపిస్తోంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హీరో. ఇదివరకు ఈ ముగ్గురి కాంబినేషన్‌లో 'అరవింద సమేత' వచ్చిన విషయం తెలిసిందే. కొంత కాలం క్రితం వరకు కాపీ మ్యూజిక్ అందిస్తున్నాడనీ, తన హిట్ ట్యూన్స్‌నే మళ్లీ మళ్లీ కొడుతున్నాడనీ విమర్శలను ఎదుర్కొన్న తమన్ ఇవాళ.. ఆ అపకీర్తి నుంచి బయటపడి, శ్రోతల్ని రంజింపజేసే బాణీలతో టాప్ మ్యూజిక్ డైరెక్టరుగా నీరాజనాలు అందుకుంటున్నాడు. డైరెక్టర్ల మనసు తెలుసుకొంటూ, అప్పటికప్పుడు బాణీలు సృష్టిస్తూ వాళ్లను ఆనందపరుస్తున్నాడు. అందుకే ఇవాళ తమన్ తమకు ఫ్లెక్సిబుల్‌గా ఉంటాడని చాలామంది డైరెక్టర్లు భావిస్తున్నారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందనేది సామెత. కానీ, పదకొండేళ్ల కాలంలోనే వంద సినిమాలు పూర్తిచేసేసిన తమన్ ఆ సామెతను తిరగరాస్తున్నాడు. సినిమాలు ఎక్కువైనా తన బాణీలలోని మార్దవం తగ్గదని నిరూపిస్తున్నాడు. సమీప భవిష్యత్తులో తన కీబోర్డుతో ఇంకెన్నో మ్యాజికల్ ట్యూన్స్ అందిస్తాడనీ, మనల్ని ఆ బాణీల ప్రవాహంలో ఓలలాడిస్తాడనీ చెప్పడానికి సందేహపడాల్సింది లేదు. - బుద్ధి యజ్ఞమూర్తి
శాసనమండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. 50శాతం ఓట్లు, 151మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చినా... శాసనమండలిలో మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం బలమే ఎక్కువగా ఉండటంతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మండలిలో చుక్కెదురు కావడంతో కౌన్సిల్ రద్దు దిశగా జగన్ ప్రభుత్వం అడుగులేస్తోంది. అయితే, మండలిని రద్దు చేయాలంటే మొదటగా శాసనసభలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. శాసనసభలో ఎలాగూ జగన్ ప్రభుత్వానిదే మెజారిటీ కనుక తీర్మానం ఆమోదం పొందడం ఖాయమే. అయితే, శాసనసభ చేసిన తీర్మానాన్ని పార్లమెంట్లో చర్చించి లోక్ సభ, రాజ్యసభల్లో ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, పార్లమెంట్ కి విచక్షణాధికారాలు ఉన్నాయి. దాంతో, కేంద్రానికి ఇష్టంలేకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదించకుండా వెనక్కి పంపే అవకాశమూ ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తున్న తరుణంలో జగన్ ప్రభుత్వ తీర్మానాన్ని ఆమోదించకుండా తిప్పిపంపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, మూడు రాజధానులను జనసేన వ్యతిరేకిస్తుండటం... అదే సమయంలో ఏపీ బీజేపీ కూడా అమరావతే... ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగాలని తీర్మానం చేసిన నేపథ్యంలో...  మండలి రద్దు అంత సులువు కాదనే మాట వినిపిస్తోంది. అయితే, శాసన మండలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదని, దీనిపై కేంద్రానికి ఎలాంటి హక్కూ ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు. మండలి రద్దుకు శాసనసభ తీర్మానంచేసి పంపితే, దాన్ని కచ్చితంగా పార్లమెంట్ ఆమోదించి తీరుతుందని అంటున్నారు. ఇందులో రాజకీయాలు ఏమీ ఉండవని చెబుతున్నారు. అందుకు, ఎన్టీఆర్ హయాం నాటి ఘటనను గుర్తుచేస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు... ఎన్టీఆర్ కూడా శాసనమండలి రద్దు చేశారని, అయితే, ఆనాడు కాంగ్రెస్ నేతలంతా రాజీవ్ కు మొరపెట్టుకున్నా... ఎన్టీఆర్ సూచన మేరకు మండలిని రద్దు చేశారని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు కూడా ఆర్ధిక భారం పేరుతో మండలిని రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరితే... కేంద్రం చేయక తప్పదని అంటున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. న్యాయపరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటొంది. ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం కాగా 20 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించినా రెండూ ఒకే రోజు జరిపితే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది ఏపీ సర్కార్. దీని ప్రకారం 20 ఉదయం 9:30 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించి హైపవర్ కమిటీ నివేదికను ముందుగా ఆమోదిస్తారు.11:30 నిమిషాలకు అసెంబ్లీ భేటీ జరుగుతుండగా రాజధానితో పాటు అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ విషయంలో చట్ట పరంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తరలింపు విషయంలో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను అధిగమించాలంటే ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాల్సిందేనన్న ఆలోచనల్లో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రాజధాని విభజన విషయంలోనూ అలాగే వికేంద్రీకరణ విషయంలోనూ కొత్త చట్టాన్ని తెచ్చే దిశగా కసరత్తు చేయడమే కాక రాజధాని పేరు లేకుండా కొత్త చట్టం రూపొందించే పనిలో పడింది ఏపీ సర్కార్. ఏపీ డిజిటలైజేషన్ అంటూ ఈక్వల్ డెవలప్ మెంట్ ఆఫ్ ఓల్డ్ రీజన్స్ బెల్ ట్వంటీ ట్వంటీ పేరుతో కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సూచనలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును అధికారులు సిద్ధం చేస్తున్నారు.ఏపీలో ఉన్న మూడు ప్రాంతాల్లో వివిధ జోన్ లుగా ఏర్పాటు చేసే దిశగా కొత్త బిల్లు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రతి జోన్ కు ప్రత్యేకంగా 9 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తారు. ప్రతి బోర్డుకు ఒకరు చైర్మన్ గా వ్యవహరిస్తారు, అలాగే వైస్ చైర్మన్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రాంతీయ బోర్డులో సభ్యులుగా 1 ఎంపి, 2 ఎమ్మెల్యేలు, మరో 4 ప్రతి నిధులు వుండేలా బిల్లును సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సదరు ప్రాంతీయ బోర్డు కార్యదర్శిగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఏఏ జోన్లలో ఏఏ ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి,ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాలను, కర్ణాటక మోడల్ తరహాలో బిల్లును రూపొందిస్తున్నారు.జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక కూడా దాదాపు ఇలాంటి సూచనలే చేశాయి. కొత్త చట్టాన్ని తీసుకు రావడంతో పాటు ఇప్పటికే ఉన్న సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కూడా సర్కారు నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు అధికారులు సీఆర్డీఏ రద్దుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీఆర్డీఏ చట్టం రద్దు చేస్తే ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాలి.
రాజధాని అమరావతి కోసం ప్రతి ఇల్లు ఉద్యమించాలని.. ప్రతి ఇంటి నుంచి ఒకరు ముందుకు రావాలని.. అందరూ సంఘటిత శక్తిగా మారాలని.. టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధానిని అమరావతి లోనే ఉంచాలి అంటూ అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో  తొలిసారిగా మచిలీపట్నం, విజయవాడలో జరిగిన జేఏసీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా రాజధానిని రక్షించేందుకు పార్టీలకు అతీతంగా అందరూ ఒకే వేదికపైకి వచ్చామని చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి అంటే సీఎం జగన్ భయపడుతున్నారని..అందుకే బస్సు యాత్రకు అన్ని అనుమతులు ఇచ్చి చివర్లో రూట్ పర్మిషన్ లేదంటూ పోలీసులను ఉసిగొలిపి అడ్డుకున్నారని దుయ్యబట్టారు.  ముందుగా ప్రజావేదికను కూల్చేశారన్నారు. అమరావతికి ముంపు భయం లేదని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెప్పినా కూడా మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తాను అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొన్నానని ప్రచారం చేశారన్నారు. హై కోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలంటే వెనుకడుగువేస్తున్నారు. ఎన్నికల ముందు అమరావతిలో చదరపు గజం రూ 30,000 పలికింది. తాను మళ్లీ వచ్చి ఉంటే లక్ష పలికేదని.. ఆ డబ్బుతోనే అమరావతిని బ్రహ్మాండంగా నిర్మించవచ్చని ఎద్దేవా చేశారు. ఇది ప్రజా రాజధాని దేవుళ్ల మొదలు ప్రజలందరి ఆశీస్సులు ఉన్నాయి. దానిని కదిలించే శక్తి ఎవరికీ లేదన్నారు. ప్రజా రాజధానిని రక్షించుకునేందుకు ఇంటికో వ్యక్తి బయటికి వస్తే.. మనమందరం కలిసి కట్టుగా ఉద్యమిస్తే జగన్ తోక ముడుస్తారని అన్నారు. ఆయన తీరుతో బయటి రాష్ట్రాల్లో మన పరువు పోతుందన్నారు. ఆంధ్ర ప్రజల బతుకు మూడుముక్కలాటయిందని ఇతర రాష్ర్టాల ప్రజలు నవ్వుతున్నారు. అమరావతి కోసం ఉద్యమించే వారిపై తన పత్రిక ద్వారా బురద చల్లుతున్నారని తెలియజేశారు. రాజధానిపై రెఫరెండం పెట్టి.. దమ్ముంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి.. అప్పుడు మీ ఇష్టం వచ్చిన చోట రాజధానులు పెట్టుకోవాలి అన్నారు.  మంత్రి పేర్ని నాని, పవన్ కళ్యాణ్ ను పవన్ నాయుడు అని సంబోధిస్తున్నారు. మరీ ఆయనేమన్నా నాని రెడ్డా పవన్ స్వశక్తితో ఎదిగిన వాడు. ఆయన వ్యక్తిగత జీవితంపై బురద జల్లుతున్నారు. ఉన్న ఊరి నుంచి రాజధాని తరలిపోతుంటే ఎవరైనా పోరాడతారని అన్నారు. కానీ మంత్రి పేర్ని నానికి ఇక్కడ రాజధాని ఉండటం ఇష్టం లేనట్లే ఉంది.. అందుకే సిగ్గులేకుండా హైపవర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. తాను ఒక పిలుపు ఇస్తే అమరావతి రైతులు 33,000 ల ఎకరాలను రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు.  విశాఖ నీతి నిజాయితీ ఉండేవాళ్ల నగరం.. అక్కడ అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ నాయకులు బయలుదేరారు అని చంద్రబాబు అన్నారు. హుద్ హుద్ ముందు హుద్ హుద్ తర్వాత విశాఖ ఎలా ఉందో అక్కడ ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. దానిని టెక్నాలజీ హబ్ గా, ఫార్మా హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు. మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభకు అధికారులు అవంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. విద్యుత్ సరఫరాను నిలిపేశారు. సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. సభకు వచ్చిన వారందరు తమ సెల్ ఫోన్లలో ఉన్న లైట్ ను వెలిగించాలని పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణం వద్ద సెల్ ఫోన్ లైట్ల వెలుగుతో నిండిపోయింది.
  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ‘మా‘ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. చిరంజీవి మాట్లాడుతుండగా పలుమార్లు అడ్డుపడ్డ రాజశేఖర్... పరుచూరి గోపాలకృష్ణ చేతిలో నుంచి మైక్ లాక్కుని... మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో విభేదాలను బయటపెట్టాడు. వేదికపైనున్న అందరి కాళ్లు మొక్కుతూ రాజశేఖర్ వింతగా ప్రవర్తించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కారణంగా తన ఫ్యామిలీలో గొడవులు జరుగుతున్నాయని, తన కారు ప్రమాదానికి కూడా ‘మా‘ గొడవలే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిప్పు ఉన్నప్పుడు... దాన్ని కప్పిపుచ్చేందుకు ఎంత ప్రయత్నించినా పొగ రాకుండా ఆపలేమన్నారు. అయితే, వేదికపైనున్న మోహన్ బాబు, చిరంజీవి, కృష్ణంరాజు, జయసుధ తదితరులు ఆపేందుకు ప్రయత్నించినా తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు రాజశేఖర్. అయితే, హీరో రాజశేఖర్ తీరుపై మెగాస్టార్ చిరంజీవి మండిపడ్డారు. మంచిని మైకులో చెబుదాం... చెడుని చెవిలో చెప్పుకుందామని తాను విజ్ఞప్తి చేసినా... రాజశేఖర్ పట్టించుకోలేదని సీరియస్ అయ్యారు. వేదికపైనున్న పెద్దలను రాజశేఖర్ అవమానించారని మండిపడ్డారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో క్రమశిక్షణాసంఘం ఉంటే... రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని చిరంజీవి సూచించారు. రాజశేఖర్ ప్రవర్తన, వ్యాఖ్యలపై జీవిత క్షమాపణలు చెప్పారు. రాజశేఖర్ ది చంటి పిల్లాడి మనస్తత్వమని, ఆయన ఏదీ దాచుకోడని, మనసుకి ఏదనిపిస్తే అదే మాట్లాడతాడంటూ వాతావరణాన్ని కూల్ చేసేందుకు జీవిత ప్రయత్నించారు. అయితే, చిరంజీవి మాట్లాడుతున్నప్పుడే రాజశేఖర్ అడ్డుపడటం చర్చనీయాంశమైంది. ఎందుకంటే, చిరంజీవి పీఆర్పీని ఏర్పాటు చేసినప్పుడు రాజశేఖర్ కారుపై మెగా ఫ్యాన్స్ రాళ్ల దాడి చేయడంతో ఇరువురి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దాదాపు పదేళ్ల తర్వాత చిరంజీవి-రాజశేఖర్ మళ్లీ కలిసినా.... ఇప్పుడు ‘మా‘ డైరీ ఆవిష్కరణలో చిరంజీవిని మళ్లీ టార్గెట్ చేయడం వెనుక ఏదో గొడవ ఉందంటున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి ఏప్రిల్ 11 వ తేదీన ఎన్నికలు జరిగాయి. మే 23 వ తేదీన వచ్చిన ఫలితాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుంధుబి మోగించింది. గతంలో ఏ పార్టీకీ సాధ్యం కాని విధంగా అసెంబ్లీలో వైసీపీ 86 శాతం స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 175 స్థానాలకు గాను 151 సీట్లలో గెలిచి రికార్డు సృష్టించింది. పోలైన మొత్తం ఓట్లలో 49.9 శాతం సాధించింది. ఇక అధికారం కోల్పోయిన తెలుగుదేశం 23 సీట్లకు మాత్రమే పరిమితమైంది. 30.96 శాతం ఓట్లతో ప్రతిపక్షస్థానంలో కూర్చవలసి వచ్చింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కేవలం ఒక్కచోట మాత్రమే గెలిచింది. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి, మొత్తం 25 స్థానాలకు గాను, 22 చోట్ల వైసిపి ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది.  ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలన్న జగన్ కల 2019 లో నెరవేరింది. ఇందు కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. 2019 ఎన్నికల్లో గెలవాలన్న తపనతో అంతకు రెండేళ్ల ముందే 2017 నవంబర్ 6 న ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. సుమారు 3648 కిలోమీటర్ల పాద యాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాది జనవరి 9 వ తేదీ న ప్రజా సంకల్ప యాత్రను ముగించారు. ఆ తర్వాత పూర్తిగా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. చివరకు ఘన విజయాన్ని అందుకో గలిగారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్మోహనరెడ్డి మే 30 వ తేదీ న విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటి గవర్నర్ నరసింహన్ ఆయన చేత ప్రమాణం చేయించారు, ప్రమాణ స్వీకారం రోజు ఆయన వృద్ధాప్య పెన్షన్ల పెంపు ఫైలుపై తొలి సంతకం చేశారు. జూన్ 8 వ తేదీ న సీఎం జగన్మోహనరెడ్డి సెక్రటేరియట్ లో తొలిసారి అడుగు పెట్టారు. ఆ సమయంలో ఆశా వర్కర్ల జీతాల పెంపుపై సీఎం జగన్ తన తొలి సంతకం చేశారు. అనంతపురం, అమరావతి ఎక్స్ ప్రెస్ హైవేకి కేంద్ర అనుమతి కోరుతూ రెండవ సంతకం చేశారు. జర్నలిస్టు హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేస్తూ మూడవ సంతకం చేశారు. 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళ పాటు పాలించారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం ఘోర ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం ఈ సారి ఒంటరిగా బరిలోకి దిగింది. కేవలం 23 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. చంద్రబాబు చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలేవి ఆయన్ను గట్టెక్కించలేక పోయాయి. గత ఎన్నికల్లో బిజెపి, టిడిపి కూటమికి మద్దతిచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సారి కమ్యునిస్టు పార్టీలతో కలిసి బరిలోకి దిగారు. భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. ఆ పార్టీ తరపున రాపాక వర ప్రసాద్ మాత్రమే గెలిచారు. జనసేన పార్టీకి కేవలం 6 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. కాంగ్రెస్, బిజెపి, లెఫ్ట్ పార్టీలు ఈ సారి ఖాతా కూడా తెరవలేకపోయాయి. 2014 లో టిడిపితో కలిసి నాలుగు సీట్లు గెలిచిన బీజేపీకి ఈ సారి ఒక్కటి కూడా దక్కలేదు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఖాతా తెరిచేందుకు ఎంతో ప్రయత్నించింది, కానీ ఉపయోగం లేకుండా పోయింది. జనసేనతో కలిసి పోటీ చేసిన కమ్యునిస్టు పార్టీల పరిస్థితి కూడా అంతే. ఇక అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత  టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యలు పార్టీ ఫిరాయించారు. టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరి పోయారు. మెజారిటీ సభ్యులు అటు వెళ్లడంతో రాజ్యసభలో టిడిపికి ఒక సభ్యుడు మాత్రమే మిగిలారు. ఓవరాల్ గా ఈ ఏడాది ఎన్నికలు వైసీపీకి తప్ప మిగిలిన పార్టీలన్నింటికీ చేదు అనుభవాన్నే మిగిల్చాయి.
ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ విశాఖ అంటూ వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. "28న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అపూర్వ స్వాగతం పలుకుదాం. విశాఖను రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో థాంక్యూ జగనన్నా అంటూ జననేతకు ధన్యవాదాలు చెబుదాం." అని జగన్ విశాఖ పర్యటనను విజయవంతం చేయండి అంటూ ట్విట్టర్ లో పెద్ద పోస్టే పెట్టారు. విజయ సాయి వ్యాఖ్యలు ట్వీట్లు చూసి ఇంకేముంది వైసీపీ నెంబర్ 2 నే విశాఖను రాజధాని అన్నారంటే ఇక కంఫర్మ్ అయిపోయినట్టే... కేబినెట్ భేటీ తరువాత ప్రకటన తరువాత ప్రకటన రావడమే ఆలస్యం అనుకున్నారంతా. కానీ కట్ చేస్తే.. టోటల్ రివర్స్ అయింది. జీఎన్‌రావు, బీసీజీ కమిటీ నివేదికలను అధ్యయనం చేసి.. హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని.. ఆ కమిటీ చెబితే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి.. నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. కేబినెట్ మీటింగ్ ముగిసింది కానీ రాజధానిపై సస్పెన్స్ కి మాత్రం ఎండ్ కార్డు పడలేదు. మరి ఈ మాత్రం విజయ సాయి ఇంత హడావుడి ఎందుకు చేసారని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి విజయసాయి ఏం సమాధానం చెప్తారో తెలియదు కానీ.. మంత్రి పేర్ని నాని మాత్రం విజయసాయివి రాజకీయ వ్యాఖ్యలని సింపుల్ గా తేల్చేశారు. కేబినెట్ మీటింగ్ తర్వాత మాట్లాడిన ఆయన.. విజయసాయి ప్రకటనతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. విశాఖ వైసీపీ ఇన్‌చార్జ్‌గా విజయసాయిరెడ్డి మాట్లాడి ఉండవచ్చని.. ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్ని నాని తెలిపారు. దీనిని బట్టి చూస్తే తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టుగా.. విజయ సాయి కంగారుపడి వ్యాఖ్యలు చేసారా లేక ప్రస్తుతం పార్టీలో విజయసాయికి తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
    With spoons and forks replacing the usage of hands and the influence of Western culture on Indian households, eating with hands is slowly fading. Perceived as unhygienic and primitive, the practice of eating with hands seems to be perceived only as primitive. To appreciate the habit of eating with hands we must delve into our Vedic wisdom to know the reasons why it is good for us. For centuries Indians have been eating with hands as the people of yore knew the Power of the hand. The ancient Hindu teachings talk about eating food with your hands, feeds not only the body but also the mind and the spirit. The hands are considered the most important organs of action. It is mentioned in the Vedic prayer-“Karagre Vasate Lakshmi Karamule Sarasvati Karamadhye Sada Gouri Prabhate Karadarsanam”, which means on the tip of your fingers is Goddess Lakshmi; on the base of your fingers is Goddess Sarasvati; in the middle of your fingers is Gouri Parvati. In this manner, look at your palm and while looking at the palm, thus sanctifying all the actions that will be done during the day. Thus, one prays in the morning to reinforce the attitude that all actions are performed as a service to the Lord. This is one simple explanation through a prayer. There is also another scientific reason from the Vedic texts and Ayurveda that our hands and feet are said to be the channels of the five elements. Each finger is an extension of one of the five elements. Through the thumb - space; forefinger- air; mid-finger-fire; ring finger-water and through the little finger - earth. While taking the food into the mouth, each finger aids in the conversion of food, before it passes on to the internal digestive system. Gathering the fingertips as they touch the food stimulates the five elements and invites Agni (fire) to bring forth the digestive juices. As well as improving digestion the person becomes more conscious of the tastes, textures and smells of the foods they are eating, which all adds to the pleasure of eating and healthy living. With the knowledge and scientific reasoning behind eating with the hands explained, let us enjoy the benefits of eating with hands with a higher awakening. Now even etiquette experts say it's acceptable to eat with your hands except that you don’t lick them in public!
Bamboo for Fengshui:Many people give a Lucky Bamboo or Dancing Bamboo as a gift  for housewarming gifts, birthdays, anniversaries, grand openings, award, achievements and other auspicious occasions. Receiving this plant as a gift increases your luck. For those who are still uninitiated about this beautiful green stalk here is what we are talking about. The lucky bamboo plays an important role as a living example of the feng shui elements of water, wood and earth. When you place this plant in the correct spot, it can introduce fire and metal to complete a balance of the five elements. This plant is one of the most recognizable and popular feng shui cures. It's an easy care plant that can survive in any kind of light and can attract auspicious chi energy and in turn energise your home. Number of stalks matters : Much of the luck that is associated with bamboo comes from the number of stalks bunched together or woven together into an arrangement. The number of stalks determines the kinds of energy the plant attracts into your home and life. The more stalks in the planter, the greater the blessing of good fortune and luck. Two Bamboo Stalks Two stalks of bamboo as an expression of love. This number also is said to double your luck. Three Bamboo brings three kinds of luck to you:Happiness: Fu, Long Life: Soh and Wealth: Lu (Career promotions) Five Bamboo Stalks With the number five, there's one stalk for every area of your life that can bring you wealth. The overall energy attracted to a five bamboo stalk plant is one of health, which is needed to benefit from any of the five areas of your life. You'll want to have a healthy career, healthy relationships, and more. The five stalk bamboo reinforces each of the five areas of your life Emotional,Intuitive,Mental,Physical,Spiritual that can influence the level of wealth for each area. As the number increase so do the benefits, so the next time you are at loss as to what to buy for your loved ones , this is the easiest and beautiful gift you can buy. And not just gifting your could buy one for yourself too! Here wishing you all the energies in life.
      The English novelist George Eliot said “Animals are such agreeable friends. They ask no questions and pass no criticisms.” A wonderful statement that describes the unconditional love that these wonderful beings give us. And when we lose them the grief is as much as you would feel when you lose a person close to you.   It is no wonder that people experience intense grief at the loss of a pet and the feeling of grief following a loss is completely normal. There are several ways that pet owners can help themselves and  move forward after the loss of a pet.   1. Get back to your daily routine You probably wake up and take your pet out on its routine walks , continue that routine and also when you have specific schedule for your pet’s need,replace it with an alternate routine to get over it. Sometimes pet owners are used to a schedule that was based on their animal's needs.   2. Farewell ceremony If you have friends who also have loved the pet and have played with it ,you could have a farewell ceremony and have talk about him/her and have them share a few things which would help you feel better.   3. Photos or videos There are many ways you could preserve your pets memories alike  photos, scrapbooks, home videos & collages. The latest being the Facebook and Instagram where you can permanently share your pets pictures in the digital form.   4. Help Children cope with the loss A child is devastated with a loss of pet and the best thing to do is to be honest with him/her about the death, depending on the age of the child. Assure them that the pet has moved on and is no longer in pain and if the older ones are there just spend some quiet time with them reassuring them.   6. Get another pet This again depends as to how the previous pet has passed away. If it was sudden then it’s better not to get a new pet, as the grieving would take time and you can’t focus on the new one. If the pet has aged and passed away then you could consider and get another one to replace the pet  and move on.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.