LATEST NEWS
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్‌కు లేదని అన్నారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయిం చిందని ఆరోపించారు. ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్‌ను రాజకీయ నిమజ్జనం చేయడం తథ్యమని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఫాంహౌజ్ వ్యవహారంపై కూడా బండి సంజయ్ స్పందించారు. ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా? అని ప్రశ్నించారు. ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం మీకెక్కడిదని నిలదీశారు. ఫాంహౌజ్‌లో ప్రభుత్వ భూములు ఉంటే వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా అని ప్రశ్నించిన ఆయన.. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే చర్యలు తీసుకో వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు. భూదోపిడీ జరిగితే ఆధారాలతో సహా బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. భూముల స్వాధీ నంతోపాటు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఫాంహౌజ్‌ను సందర్శిస్తే అర్థం చేసుకోవచ్చని, కానీ అధికార పార్టీ ఫాంహౌజ్‌ ను సందర్శించడం విడ్డూ రంగా ఉందని వ్యాఖ్యానిం చారు.రాష్ట్రంలో 22ఏ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రని బండి సంజయ్ అన్నారు. ప్రజల సమస్య లను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అవసరమైతే ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తా మని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమకు పోటీ కానేకాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. రాజకీయంగా కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు గణేశ్ నవరాత్రి ఉత్సవా లను ప్రశాంతంగా నిర్వహించుకుందామని బండి సంజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. భక్తిశ్ర ద్ధలతో ఉత్సవాలను జరుపుకోవడంతో పాటు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అందరూ సహకరించాలని కోరారు.     [ Bandi Sanjay Kumar, Congress party, Supreme Court, BJP, BRS, Danam Nagender, Khairatabad by-election, CM Revanth reddy ]
చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అన్న నానుడి ఇప్పుడు జగన్ కు సరిగ్గా అతికినట్లుగా సరిపోతుంది. గతంలో తనకు అండగా నిలబడి, తన కోసం కష్టపడి పని చేసిన సన్నిహితులను దూరం చేసుకోవడం జగన్ కు ఉన్న అలవాటు. అలా జగన్ దూరం చేసుకున్న వాళ్ల జాబితాలో సొంత  తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా కొండవీటి చాంతాడంత పొడవుకు మించి ఉ:టుంది.   ఈ నేపథ్యంలోనే..   2029లో జరగనున్నఏపీ సెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ భవిష్యత్ ఏమిటి? ఎలా ఉంటుంది? అన్న చర్చ మొదలైంది. ఒకప్పుడు జగన్ కోసం నిలబడి, 2019 ఎన్నికలలో ఆయన విజయం కోసం నిర్విరామంగా కృషి చేసిన సొంత సోదరి షర్మిల, వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ కూడా జగన్ కు కుడి భుజం, ఎడమ భుజం కూడా తానే అన్నట్లుగా వ్యవహరించిన విజయ సాయిలే 2029 ఎన్నికలలో జగన్ విజయానికి స్పీడ్ బ్రేకర్ లుగా నిలుస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే 2024 ఎన్నికలలో జగన్  తనకు గట్టి పట్టున్న రాయలసీమలో ప్రతికూల ఫలితాలు రావడానికి ఆ ప్రాంతంలో జగన్ అంత కాకపోయినా, ఆయనతో సమానమైన పట్టు ఉన్న షర్మిల కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి పెట్టని కోట లాంటి కడప జిల్లాలో వైసీపీకి గత ఎన్నికలలో సీట్లు గణనీయంగా తగ్గడానికి వైఎస్ షర్మిల జగన్ కు వ్యతిరేకంగా చేసిన ప్రచారమేననడంలో ఎలాంటి సందేహాలకూ తావు లేదు.  ఎందుకంటే వైఎస్ బిడ్డగా.. షర్మిలకు కూడా కడప ఖిల్లాపై గట్టి పట్టు ఉంది.  ఇక ఇప్పుడు విజయసాయి సొంత పార్టీ ప్రకటన చేసిన క్షణం నుంచీ జగన్ పై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శల బాణాలు సంధిస్తున్నారు. నిజమైన సీమ పౌరుషం ఏమిటో తన పార్టీ ముందుముదు రుజువు చేస్తుందంటూ.. జగన్ ఇలాకాలో ఆయనను బలహీనుడిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.  అంతే కాకుండా జగన్ క్రైస్తవుడని పేర్కొంటూ.. తాను రాజకీయ పార్టీ పెట్టి జనంలోకి వస్తున్నది రెడ్డి సామాజికవర్గం కోసం పోరాడటమేనని చెబుతున్నారు.  నిజానికి విజయసాయి రెడ్డి స్వస్థలంనెల్లూరు జిల్లా ప్రాంతమే అయినా.. వైఎస్ రాజశేఖరెడ్డి నుంచి వైఎస్ జగన్ వరకూ ఆ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా విజయసాయికి రాయలసీమలోనూ సత్సంబంధాలు ఉన్నాయి.  ఈ పరిణామాలు జగన్ కు సీమపై ఇప్పటికే సడలిన పట్లు.. వచ్చే ఎన్నికల నాటికి మరింత సడలుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రస్తతం జగన్ పరిస్ధితి చేయి (కాంగ్రెస్ )దగ్గరకెడితే చేతి దెబ్బ అన్నట్లుగా తయారైంది. ఇటు షర్మిల, అటు విజయసాయిరెడ్డి కూడా జగన్ కు గట్టి పట్టున్న సీమ, మరీ ముఖ్యంగా కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో  జగన్ కు కచ్చితంగా రాజకీయంగా భారీ నష్టం వాటిల్లుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  [YS Sharmila, Vijaya Sai Reddy, YS Jagan Mohan Reddy, Dangerbells,  YCP, Andhra Pradesh Politics, 2029 Elections, Telugu One]
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూషకు వైసీపీ కీలక పార్టీ పదవిని కట్టబెట్టింది.   భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.   గతంలో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరించిన మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను  ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. చిన్న శ్రీను స్వయంగా బొత్స సత్యనారాయణ మేనల్లుడు కావడం గమనార్హం. మజ్జీ శ్రీనివాసరావు రాజీనామా చేయడంతో  భీమిలి వైసీపీలో ఏర్పడిన  ఖాళీని జగన్ డాక్టర్ బొత్స అనూష నియామకంతో భర్తీ చేశారు.    ఈ నియామకం ద్వారా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో యువ నాయకత్వానికి, అలాగే మహిళా నేతలకు పార్టీలో పెద్దపీట వేస్తున్నట్లు సంకేతాలు పంపారు.  భీమిలి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, క్రియాశీలక కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లే  బాధ్యతను బొత్స అనూషకు జగన్ అప్పగించారు.  ఈ సందర్భంగా జగన్ కు కృతజ్ణతలు తెలిపిన డాక్టర్ అనూష..  పార్టీ అధినాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, భీమిలిలో వైసీపీని మరింత పటిష్టం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. స్థానిక కేడర్‌ను కలుపుకొని పోతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం   శ్రమిస్తానన్నారు.     [Botsa Anusha, YCP Bheemili Constituency Incharge, Botsa Satyanarayana, Daughter, AP Politics, Telugu One]
వైఎస్ కుటుంబంలో విభేదాలకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. ముఖ్యంగా జగన్, షర్మిల మధ్య ఆస్తి, రాజకీయ విభేదాలు సమసిపోయేలా లేవు.  తాజాగా వైఎస్ కుటుంబం ఒకే వేదికపైకి వచ్చే అవకాశం ఉందని ఆశించిన వైఎస్ అభిమానుల ఆశలపై జగన్ నీళ్లు చల్లారు.  సాధారణంగా  కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలను పక్కన పెట్టి కుటుంబ వేడుకల్లో కలవడం కద్దు. అయితే..   వైఎస్ షర్మిల కుమార్తె వివాహ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో.. ఆ వివాహానికి హాజరు కాకుండా స్కిప్ చేయడానికా అన్నట్లు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, షర్మిల సోదరుడు అయిన జగన్ విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు.  షర్మిల కుమార్తె వివాహం, జగన్ విదేశీ పర్యటన రెంటినీ బేరీజు వేస్తూ.. ఆ వివాహ వేడుకకు దేశంలోనే ఉండి హాజరు కాకపోతే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందన్న భావనతోనే జగన్ విదేశీ పర్యటన పెట్టుకున్నారని పరిశీలకులు అంటున్నారు.   వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం డాక్టర్ సోమలా రఘురామ్ రెడ్డితో నిశ్చయమైన విషయం తెలిసిందే. ఈ పెళ్లి ఏర్పాట్లలో భాగంగా షర్మిల తన కుమార్తెతో కలిసి కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్‌ను సందర్శించారు. అక్కడ దివంగత నేత వైఎస్సార్ సమాధి వద్ద  నివాళులు అర్పించి, తొలి వివాహ పత్రికను ఆయన పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు కోరారు. ఇక వివాహ పనులు కుటుంబ పరంగా ముమ్మరంగా సాగుతున్నాయి.  నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, సెప్టెంబర్ 24న హైదరాబాద్‌లో,  సెప్టెంబర్ 25న బెంగళూరులో  వివాహ నిశ్చయ తాంబూలాలు, ఎంగేజ్‌మెంట్ వేడుకలు జరగనున్నాయి. ఆ తర్వాత నవంబర్ 25న వివాహం జరగనుంది. డిసెంబర్ 5న హైదరాబాద్‌లో   రిసెప్షన్ నిర్వహించనున్నారు. మరోవైపు, సరిగ్గా ఇదే సమయానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన కోసం సన్నాహాలు చేస్తుండటం గమనార్హం. దాదాపుగా అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 మధ్య కాలంలో సుమారు 25 రోజుల పాటు యూరప్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి కోరుతూ ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు 15 రోజుల విదేశీ ట్రిప్ కు అనుమతి ఇచ్చింది. జగన్ విదేశీ పర్యటన షెడ్యూల్, షర్మిల కుమార్తె రిసెప్షన్, వివాహ తేదీలు క్లాష్ అయ్యేలా ఉండటం గమనార్హం. ఆ విషయమూ మరోసారి షర్మిల, జగన్ మధ్య విభేదాలు, ఆస్తుల పంచాయతీపై చర్చను తెరపైకి తెచ్చాయి.   స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.   వైఎస్ కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆస్తుల పంపకాల విషయంలో తలెత్తిన వివాదాలు ప్రజల్లోనూ, మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు తాజాగా.. షర్మిల కుమార్తె వివాహం,  జగన్ విదేశీ పర్యటనకు సంబంధించిన తాజా పరిణామాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.   [YS Sharmila, YS Jagan Mohan Reddy, Anjali Reddy Marriage, YS Family Disputes, Jagan Foriegn Tour, Telugu One]
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరో సారి విదేశీ పర్యటనకు రెడీ అవుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి  యూరప్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి కోరుతూ ఆయన  హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు.  తన కుమార్తెల వద్దకు వెళ్లేందుకు, అలాగే కుటుంబంతో కలిసి యూరప్‌లో పర్యటంచే నిమిత్తం పాతిక రోజుల పాటు విదేశాల్లో పర్యటించేందుకు అనుమతి కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. ఆయన విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెల 1 నుంచి నవంబర్ 30 లోపు ఎప్పుడైనా 15 రోజుల పాటు యూరప్  పర్యటనకు అనుమతి ఇచ్చింది. అయితే పలు షరతులు కూడా విధించింది.   అక్రమాస్తుల కేసులలో నిందితుడిగా ఉండటం,  ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉండటంతో, వైఎస్ జగన్  విదేశాలకు వెళ్లేందుకు తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిన నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. కాగా కోర్టు జగన్ యూరప్ పర్యటనకు విధించిన షరతులు ఇలా ఉన్నాయి.  జగన్  యూరప్ పర్యటనకు బయలుదేరే ముందే పూర్తి పర్యటన షెడ్యూల్‌ను  సీబీఐ అధికారులకు  అందజేయాలి. అలాగే విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.   ప్రస్తుతం స్థానిక ఎన్నికల హడావుడి మరియు రాజకీయ పరిణామాల వేళ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడం రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.  [YS Jagan, CBI Court, Europe Tour, YCP, Andhra Pradesh News, Jagan Foreign Travel, Green Signal, Conditions Apply]
ALSO ON TELUGUONE N E W S
  సుమన్ అనే పేరుకి తెలుగు చిత్రసీమలో  ఉన్న హిస్టరీ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ట్రాక్టర్లలో ఊళ్ళకి, ఊళ్లే సుమన్ సినిమా చూడటానికి థియేటర్స్ వెళ్లే వాళ్ళు. అంత అద్భుతమైన సినీకుసుమాలతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు. రీసెంట్ గా ఆయన మాట్లాడుతు' ఇటీవల ఒక వల్గారిటీ  మూవీ వచ్చింది. అమ్మ, నాన్న, పిల్లలతో  కలిసి ఒక ఫ్యామిలీ  ఆ సినిమాని చూడటానికి  థియేటర్స్ కి వెల్లగలదా!. మరి పిల్లలు చెడిపోకుండా ఉండగలరా! అలాంటి సినిమాలకి  సెన్సార్ ఎలా ఒప్పుకుంటుంది. ప్రజలకి కనిపిస్తున్న వల్గారిటీ సెన్సార్ బోర్డు కి కనించడం లేదా! మంచి సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడు సిద్దమే. అందుకు ఉదాహరణ ఇరుముడి సినిమా. అన్ని రకాల భావోద్వేగాలు ఉండబట్టే ఇరుముడి చూసారు. వల్గారిటి సినిమాలో ఏం లేదు కాబట్టే ప్రేక్షకులు తిరస్కరించారని  చెప్పుకొచ్చాడు. ఇది కూడా చదవండి : ఫ్యాన్స్ తో నాని అత్యవసర సమావేశం: ఆ 10000 మందితో పారడైజ్ రచ్చ చేస్తుంది ఎవరు!   ఇక సుమన్ మాట్లాడింది 'టాక్సిక్' గురించి అనే విషయం తెలిసిపోతుండటంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.   మీకు నచ్చవచ్చు: ఘాటైన ప్రేమ ఘటన: బాలయ్య, రోజా ఎవర్‌గ్రీన్‌ రొమాంటిక్ సాంగ్.!   [Suman, Toxic, irumudi, Suman Comments On Censor Board, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News,]
The makers of January 12 Vidudala have unveiled the first look of Krithi Shetty, who looks gorgeous in a traditional half-saree. Set against a temple backdrop, the actress appears as a Telugu village belle in a purple and velvet ensemble, adding a festive touch to the film's Sankranti positioning. Victory Venkatesh and Nandamuri Kalyanram are coming together for the first time with this film, directed by Anil Ravipudi. Keerthy Suresh is also playing a leading role. The combination has generated considerable anticipation, with Venkatesh and Anil Ravipudi reuniting for the fifth time after delivering four blockbusters together. The film's shoot is progressing at a brisk pace, with the first half already completed and work on the second half underway. Music composer GV Prakash Kumar recently shared his reaction after watching a 90-minute cut of the film. He praised Anil Ravipudi's comedy, emotional sequences, entertainment value and screenplay, expressing confidence in the film's prospects. Produced by Sahu Garapati on a lavish scale, January 12 Vidudala is presented by Anitha, Suresh Babu and Zee Studios. With Venkatesh, Kalyanram, Keerthy Suresh and Krithi Shetty coming together under Anil Ravipudi's direction, the film is gearing up for a Sankranti theatrical release. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  నాచురల్ స్టార్ నాని వన్ మాన్ షో 'ది ప్యారడైజ్' సందడితో వరల్డ్ తెలుగు సినిమా మార్కెట్ కళకళలాడుతూ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్  జోరు చూస్తే హాట్ కేకుల్లా అనే వర్డ్ ని మార్చాల్సిన పరిస్థితి. ఇక ఫ్యాన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు, 23 డేట్ (ప్రీమియర్స్) త్వరగా రావాలని తమ ఇష్టదైవాల్ని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్రబృందం ప్రమోషన్స్‌లో సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతోంది. అభిమానులతో నేరుగా అనుబంధాన్ని పెంచుకోవడానికి, ఒకేసారి ఏకంగా 10,000 (పదివేల) మంది అభిమానులతో భారీ ఫ్యాన్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నాని ప్లాన్ చేస్తున్నారు. భారతీయ చిత్రసీమలోనే ఇంత పెద్ద ఎత్తున కేవలం ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేయడం విశేషంగా మారింది. ఈ భారీ వేడుకకు సంబంధించిన సమాచారం బయటకు రాగానే సోషల్ మీడియా వేదికగా హల్చల్ సృష్టిస్తోంది. 100% పక్కా మాస్ ఎనర్జీతో రూపొందుతున్న ఈ సినిమాలో నాని సరికొత్త రగ్గడ్ అవతారంలో కనిపించనున్నారు. శ్రీకాంత్ ఓడెల మేకింగ్ విజన్, అనిరుధ్ రవిచందర్ అందించే సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు నగరాల్లో పర్యటిస్తున్న నాని, ఇప్పటికే చెన్నై ప్రమోషనల్ ఈవెంట్లో మొదటి ఫ్యాన్ షో టికెట్‌ను స్వయంగా విడుదల చేసి ఫ్యాన్స్‌లో విపరీతమైన జోష్ నింపారు. బెంగళూరు, కొచ్చి నగరాల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లలో కూడా నాని అభిమానులతో ఎంతో సరదాగా గడిపారు. ఇది కూడా చదవండి: రియల్ వైఫ్‌తో ఇంటిమేట్ సీన్స్.. ఏం జరిగిందో అసలు నిజం చెప్పిన సిద్ధార్థ్!     అంతేకాకుండా, ఈ చిత్ర విస్తృత ప్రచారంలో భాగంగా ఏకంగా 10,000 మంది అభిమానులను ఒకే వేదికపై కలిసే అవకాశం కల్పించడం ద్వారా సినిమాపై క్రేజ్ రేటింగ్స్ మరింత ఊపందుకున్నాయి. సామాన్యుడి పాత్రలో జీవిస్తూ 'నాచురల్ స్టార్'గా కోట్ల మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్న నాని, తన విజయంలో 100% క్రెడిట్ అభిమానులకే ఇస్తుంటారు. అందుకే ఈ భారీ మీట్ అండ్ గ్రీట్‌లో 10,000 మంది ఫ్యాన్స్‌తో వ్యక్తిగతంగా సంభాషించడం, ఫోటోలు దిగడం, వారితో నేరుగా ముచ్చటించడం వంటి విశేషాలను ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.చిత్ర యూనిట్ తెలుపుతున్న వివరాల ప్రకారం, ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు వేల సంఖ్యలో తరలిరానున్నారు. ఏది ఏమైనా ప్యారడైజ్ హంగామా చూసి తెలుగు సినిమా తనకున్న స్థాయిని చూసుకుంటూ మూసి మూసి నవ్వులతో మురిసిపోతూ ఉంది.   మీకు నచ్చవచ్చు: లేత మనసులు'కి 60 ఏళ్లు: షూటింగ్‌లో జమునకు ఏమైంది?.. క్లాసిక్ మూవీ వెనుక సీక్రెట్స్.!   [Nani, Nani The Paradise Ten Thousand Fans Meet, The Paradise, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]   
    'బొమ్మరిల్లు' తో అన్ని వర్గాల ప్రేక్షకుల హార్ట్స్ ని దోచేశాడు సిద్దార్ద్.  ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆంథాలజీ సిరీస్ 'లస్ట్ స్టోరీస్ 3'  తో సందడి చేస్తున్నాడు. సందడి చేస్తుండటమే కాదు, ఓటీటీ ప్రపంచంలో 'లస్ట్ స్టోరీస్ 3' భారీ సంచలనం సృష్టిస్తోంది. నలుగురు ప్రముఖ దర్శకులు విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా మరియు విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన 4 విభిన్న కథలతో ఈ బోల్డ్ ఎమోషనల్ సిరీస్ రూపొందింది.  రియల్ లైఫ్ కపుల్ సిద్ధార్థ్, అదితి రావు హైదరి నటించిన ఎపిసోడ్ వీక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. దిగ్గజ దర్శకుడు విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథలో సిద్ధార్థ్, అదితులు భార్యాభర్తలుగా అత్యంత సన్నిహిత సన్నివేశాల్లో నటించారు. అయితే నిజ జీవితంలో భార్యాభర్తలైనప్పటికీ, కెమెరా ముందు అలాంటి ఇంటిమేట్ సీన్స్‌లో నటించడంపై  సిద్ధార్థ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'నిజ జీవితంలో జంటగా మారిన తర్వాత తెరపై అలా కలిసి నటించడం మొదట్లో చాలా వింతగా, కొద్దిగా అసౌకర్యంగా అనిపించింది.పెళ్లైన తర్వాత ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నప్పటికీ, సెట్స్‌పై వందలాది మంది టెక్నీషియన్లు మరియు కెమెరాల మధ్య సాన్నిహిత్యాన్ని ప్రదర్శించడం సాధారణ విషయం కాదు.వృత్తిపరమైన బాధ్యతగా పాత్రకు 100% న్యాయం చేయడమే తమ ప్రధాన లక్ష్యం. అందుకే వ్యక్తిగత బంధాన్ని పక్కన పెట్టి నటులుగా మాత్రమే ఆ సన్నివేశాల్లో పాల్గొన్నాం.  ఇది కూడా చదవండి: థియేటర్ వ్యాపారంలోకి మెగాస్టార్: ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్ నిర్మాణం.. ఎక్కడ అనుకున్నారు! అంతేకాకుండా, నటీనటులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, పూర్తి సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడం కోసం హాలీవుడ్ తరహాలో ప్రత్యేకంగా 'ఇంటీమసీ కోఆర్డినేటర్' సహాయం తీసుకున్నట్లు సిద్ధార్థ్ వివరించారు.   ఈ ఆంథాలజీ సిరీస్‌లో కేవలం సిద్ధార్థ్-అదితి జంట మాత్రమే కాకుండా విజయ్ వర్మ, రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, అలీ ఫజల్, రాధికా మదన్, అభిషేక్ బెనర్జీ, గుర్ఫతే పిర్జాదా, సనా థంపి మరియు గజరాజ్ రావు వంటి 10 మందికి పైగా దిగ్గజ తారాగణం కీలక పాత్రల్లో అలరించారు. ఆధునిక సమాజంలో స్త్రీల కోణంలో కోరికలు, మానవ సంబంధాలు, సంక్లిష్ట భావోద్వేగాలు మరియు సాన్నిహిత్యం చుట్టూ ఈ కథలు తిరుగుతాయి. 2024లో సిద్ధార్థ్, అదితి రావు హైదరీ వివాహం జరిగింది. మీకు నచ్చవచ్చు: నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా: 28 ఏళ్ళయినా ఇప్పటికీ ఫ్రెష్‌గా అనిపించే లవ్ సాంగ్.!   [Siddharth, Aditi Hydari, Siddharth About Lust Stories 3 Intimate Scenes With Aditi, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
రష్మిక మందన్న నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'మైసా'. ఈ చిత్రంలో గోండ్ గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న రష్మిక , ఆ పాత్రలో ఒదిగిపొవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న'మైసా' మూవీ, ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్‌తో ఆసక్తిని రేకెత్తించింది. నవంబర్ 27న ‘మైసా’ గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. “అలసిపోయాను.. ఆగిపోయాను.. ఓడిపోయాను” అంటూ రష్మిక చెప్పే డైలాగ్‌తో ఆమె పాత్రలోని ఇంటెన్సిటీని పరిచయం చేశారు. భయపడని, వెనక్కి తగ్గని గిరిజన మహిళగా ఆమె పాత్ర అద్భుతంగా ఉంది. తాను ఎదుర్కొనే ఎన్నో సవాళ్లు, సామాజిక అడ్డంకులను అధిగమిస్తూ.. ప్రతి సమస్యను ఎదురించి పోరాడే ఒంటరి యోధురాలిగా మైసా కనిపిస్తుంది.   గోండ్ గిరిజన మహిళ పాత్రలో రష్మిక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లలో అదరగొట్టారు. బైక్‌ను ఎంతో ధైర్యంగా నడపడంతో పాటు.. అండర్‌వాటర్ సీక్వెన్స్‌లలోనూ సాహసోపేతమైన స్టంట్స్ చేశారు. పాత్ర కోసం రష్మిక తనను తాను పూర్తిగా మార్చుకున్న తీరు టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ఇంటెన్సిటీ, రా రేజ్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. రవీంద్ర పుల్లే తన విజన్ ను స్క్రీన్‌పై అద్భుతంగా ప్రజెంట్ చేశారని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా నీటి అడుగున రష్మిక గొడ్డలి పట్టుకుని కూర్చున్న షాట్ హాంటింగ్‌గా ఉండటంతో పాటు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ సీక్వెన్స్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది. ఇది కూడా చదవండి: విడాకులు.. సంచలనంగా మారిన కాజల్ అగర్వాల్ కామెంట్స్.! సినిమాటోగ్రాఫర్ శ్రేయాస్ పి. కృష్ణ దర్శకుడి విజన్‌ను అద్భుతమైన విజువల్స్‌గా మలిచారు. జేక్స్ బిజోయ్ అందించిన ఇంటెన్స్ స్కోర్ సినిమా డార్క్, యాక్షన్ వరల్డ్‌ను మరింత ఎలివేట్ చేస్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్  కేచ రూపొందించిన యాక్షన్ బ్లాక్స్ రా, షార్ప్‌గా టాప్ క్లాస్ లో కనిపిస్తున్నాయి. మొత్తంగా ‘మైసా’ టీజర్ స్టన్నింగ్ విజువల్స్, యాక్షన్ తో సినిమాపై అంచనాలు పెంచుతోంది. 'మైసా' టీజర్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కొద్ది గంటల్లోనే తెలుగు టీజర్ కి 1 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. రష్మిక పర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్స్, విజువల్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. మీకు నచ్చవచ్చు: అందాల ఆడబొమ్మ.. బాలయ్య ఆల్ టైం క్లాసిక్ సాంగ్.!        [Mysaa Teaser, Rashmika Mandanna, Mysaa Movie, Rashmika Mysaa, Rawindra Pulle, Jakes Bejoy, Telugu Film News, Telugu News]  
Nani's The Paradise is witnessing unprecedented demand in advance bookings, with the film crossing Rs.10 crore in worldwide gross sales despite bookings being open only in Nizam and overseas markets. With three days remaining for its September 24 release, the Srikanth Odela directorial has already sold over one lakh tickets in the Nizam region, while Andhra Pradesh bookings are yet to open. The film is currently selling around 11,000 tickets per hour on BookMyShow and District apps in Nizam, reflecting the growing demand ahead of release. The makers are also looking to add more theatres across various territories to accommodate the bookings. The advance sales are being driven by the anticipation surrounding Nani's action avatar, along with the popularity of Anirudh Ravichander's songs Aaya Sher and Yasha Nagula. The makers have also managed to address concerns over completing the film's work on time after postponing its release twice. Overseas prints have been dispatched, while work on versions in other languages is underway. The team has secured permission for Telangana premieres with ticket price hikes and is following dynamic pricing based on individual centres. The film's pre-release event is being held today, with the makers set to unveil a release glimpse. Produced by Sudhakar Cherukuri on a massive scale, The Paradise is gearing up for its theatrical release in multiple languages, worldwide.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  ప్రెజెంట్ మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ముఖాలు చూస్తుంటే మతాబుల్లా వెలిగిపోతూ ఉన్నాయి. ఒక రకంగా వాళ్లంతా ఈ రోజు కోసమే ఎప్పట్నుంచో ఎదురుచూస్తూ ఉన్నారు   అందుకు భారతీయ చలనచిత్ర రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్ నగరం వేదిక కానుంది.   చిరంజీవి, ప్రముఖ సినిమా పంపిణీ, నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ కలిసి ప్రపంచంలోనే అత్యంత భారీ సినిమా స్క్రీన్‌ని హైదరాబాద్ లో  నిర్మించేందుకు  సన్నాహాలు చేస్తున్నారు.ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్న  స్క్రీన్ సైజ్, సాంకేతిక వివరాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక స్క్రీన్ దాదాపు 120 అడుగుల వెడల్పు, 69 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద శాశ్వత ఐమాక్స్ స్క్రీన్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన జర్మనీలోని 'ట్రాంపలాస్ట్ లియోన్‌బర్గ్' (Traumpalast Leonberg) థియేటర్ స్క్రీన్ కొలతలు 127 అడుగుల వెడల్పు, 69 అడుగుల ఎత్తుతో దాదాపు 8,770 చదరపు అడుగుల విస్తీర్ణంలో 574 రెక్లైనర్ సీట్లతో ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోని ఐమాక్స్ మెల్‌బోర్న్ (105 అడుగులు x 75 అడుగులు), అమెరికాలోని రాయల్ సినిమాస్ (101 అడుగులు x 76.2 అడుగులు), ఏఎమ్‌సీ లింకన్ స్క్వేర్ (101 అడుగులు x 75.6 అడుగులు) మరియు హైదరాబాద్‌లోని ప్రసాద్స్ పిసిఎక్స్ (98 అడుగులు x 64 అడుగులు) ప్రముఖ పెద్ద స్క్రీన్లుగా కొనసాగుతున్నాయి.   హైదరాబాద్‌లో నిర్మించే ఈ నూతన స్క్రీన్, గ్లోబల్ రికార్డులను సైతం సవాలు చేసే స్థాయి డైమెన్షన్స్, అత్యాధునిక డ్యూయల్ లేజర్ ప్రొజెక్షన్ మరియు హై-ఎండ్ 3D సరాండ్ సౌండ్ సిస్టమ్‌తో రూపొందనుంది. నగరంలో సుదీర్ఘ కాలంగా కొరవడిన ప్రామాణిక భారీ లాార్జ్-ఫార్మాట్ ఐమాక్స్ తరహా థియేట్రికల్ అనుభూతి లోటును తీర్చడమే ఈ మెగా వెంచర్ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ గ్లోబల్ విజువల్ వండర్ గురించి వార్తలు హల్ చల్ చేస్తుండగా, చిరంజీవి టీమ్ మరియు ఏషియన్ సినిమాస్ యాజమాన్యం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ మెగా ప్రాజెక్ట్ గనుక కార్యరూపం దాల్చితే, హైదరాబాద్  ప్రపంచ సినిమా పటంలో అంతర్జాతీయ సినిమాటిక్ అనుభవానికి సరికొత్త వేదికగా మారడం ఖాయం. ఇది కూడా చదవండి: భాగ్యశ్రీ బోర్సే  సంచలన నిర్ణయం: ఫ్యాన్స్ షాక్      ఇప్పటికే వినోద రంగానికి హబ్‌గా మారిన హైదరాబాద్‌లో ఈ తరహా మెగా ప్రాజెక్ట్ రాబోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.   ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌ను హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ మరియు కార్పొరేట్ కేంద్రమైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లేదా గచ్చిబౌలి ప్రాంతంలో నెలకొల్పడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏషియన్ సినిమాస్ ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఏఎమ్‌బీ సినిమాస్ (AMB Cinemas), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ఏఏఏ సినిమాస్ (AAA Cinemas), మరియు విజయ్ దేవరకొండతో కలిసి ఏవీడీ సినిమాస్ (AVD Cinemas) నిర్మించి ప్రేక్షకులకు ప్రీమియం థియేట్రికల్ అనుభూతిని అందించడంలో సక్సెస్ అయ్యాయి.'ఏషియన్ చిరంజీవి సినిమాస్' (Asian Chiranjeevi Cinemas - ACC) లేదా 'ఏషియన్ మెగాస్టార్ సినిమాస్' (Asian Megastar Cinemas - AMC) పేరుతో ఉండవచ్చనేది కూడా టాక్.   మీకు నచ్చవచ్చు: పల్లెల్లో ప్రాజెక్ట్ పండుగ: పుణ్యం చేసుకుంది ఎవరు! [Chiranjeevi, Maltiplex, Chiranjvee Worlds Largest Cinema Screen Hyderabad, Asian Chiranjeevi Cinemas, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
ఈ రోజుల్లో మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు దేనితో ఎక్కువ సమయం గడుపుతున్నాం? మన పక్కన ఉన్న మనుషులతో మాట్లాడటం మానేసి, మన చేతిలో ఉన్న ఫోన్‌తోనే గడుపుతున్నాం. ఒకప్పుడు కుటుంబం అంటే మాటలు, నవ్వులు, తీపి జ్ఞాపకాలు. కానీ ఇప్పుడు? ఎదురుగా కూర్చుంటారు.. కానీ ఒకరి ముఖం ఒకరు చూసుకోరు. అందరి కళ్ళు ఆ మెరిసే ఫోన్ స్క్రీన్ మీదే. ఇదే అంశంపై టాలీవుడ్ చందమామ, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చను దారితీశాయి. సమాజంలో రోజురోజుకీ పెరిగిపోతున్న విడాకుల సంఖ్యపై కాజల్ అగర్వాల్ రీసెంట్‌గా స్పందించారు. ఈ సమాజంలో సహనం, ఓపిక తగ్గిపోవడానికి, అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి విడాకుల వరకు దారితీయడానికి ప్రధాన కారణం 'అతిగా సోషల్ మీడియా వాడటమే' అని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. "చాలామంది దంపతులు డిన్నర్ డేట్‌కి వెళ్తారు. కానీ అక్కడ కూర్చున్నాక ఏం చేస్తారో తెలుసా? ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఇద్దరి చేతుల్లోనూ ఫోన్లు ఉంటాయి. సోషల్ మీడియా స్క్రోల్ చేసుకోవడానికే సరిపోతుంది." అని కాజల్ అన్నారు. పక్కనే జీవిత భాగస్వామి ఉన్నా, ఆన్‌లైన్ ప్రపంచంలో మునిగిపోతున్నారని, అదే ఇద్దరి మధ్య దూరానికి కారణమవుతుందని అభిప్రాయపడ్డారు.  అయితే, కేవలం నీతులు చెప్పడమే కాదు.. తన నిజ జీవితంలో కూడా ఒక క్రమశిక్షణను పాటిస్తున్నట్లు కాజల్ వెల్లడించారు. భర్త గౌతమ్ కిచ్లూతో తనకున్న బంధం ఎప్పుడూ బలంగా ఉండటానికి ఆమె ఒక సీక్రెట్ రూల్ పాటిస్తారట. వారంలో కనీసం ఒక్క రోజైనా కచ్చితంగా ఇద్దరూ కలిసి డిన్నర్‌కి వెళ్తారు. కానీ ఆ సమయంలో ఫోన్లకు అస్సలు చోటు ఉండదు. కేవలం ఇద్దరూ ఒకరికొకరు సమయం కేటాయించుకుంటారు. తమ ఆలోచనలు, సంతోషాలు, మానసిక భావాలను పంచుకుంటారు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. డ్రాగ‌న్ షూటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌.! కాజల్ మాటల్లో చెప్పాలంటే.. "సరైన కమ్యూనికేషన్ లేకపోవడమే దాంపత్య బంధాలు ముక్కలవ్వడానికి పెద్ద కారణం." మనం పక్కనున్న వ్యక్తికి మన మనసులోని మాటను చెప్పనప్పుడు, వారి బాధను విననప్పుడు ఆ ఖాళీని సోషల్ మీడియా భర్తీ చేస్తుంది. అక్కడ మొదలవుతుంది అసలు సమస్య.  https://www.instagram.com/p/DcGiAGKsnpX/ భార్యాభర్తల మధ్య సోషల్ మీడియా దూరం పెంచుతోందంటూ కాజల్ చేసిన కామెంట్స్ ను మెజారిటీ నెటిజెన్లు సమర్ధిస్తున్నారు. ఫోన్లు పక్కన పెట్టి, ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేస్తే బంధాలు బలంగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.  మీకు నచ్చవచ్చు: అక్కినేని అరుదైన రికార్డు.. 1955లో 7 సినిమాలు, 6 సూప‌ర్‌హిట్‌.!       [Kajal Aggarwal Relationship Advice, Kajal Aggarwal Interview, Kajal Aggarwal On Divorces, Kajal Aggarwal Husband, Relationship Advice Telugu, Kajal Aggarwal, Telugu Film News, Telugu News]  
Rashmika Mandanna is stepping into uncharted territory with Mysaa, a female-led action film that sees her take on some physically demanding sequences. Directed by Rawinder Pulle, the film revolves around a tribal woman's rebellion against the delay in getting justice. The makers unveiled the teaser at a grand event, where Rashmika received an enthusiastic response from the crowd. Speaking at the event, Rashmika revealed how challenging the shoot has been, with a new task awaiting her every day. “I was shivering to go to sets of Mysaa as there was a new challenge everyday,” she said, adding that she had never attempted such heavy action despite performing dramatic roles in several films. The actress revealed that the director asked her to jump from a 90-feet waterfall, stay underwater for eight hours a day and walk barefoot across harsh mountain terrains. She also joked about being pushed to her limits, saying, “My director and makers are just pushing me to the edge so much so that I am complaining to you all.” Rashmika added that she was willing to take on these challenges to bring her director's vision to life. Rawinder Pulle praised Rashmika's dedication, revealing that she had sustained a hip injury and was currently recovering. The actress said Mysaa would be a raw, realistic action film with strong emotions. With 12 days of shooting still pending, the film is gearing up for a pan-India release on November 27. Ajay Saipureddy, Anil Sayyapureddy and Veerasai Gopa are producing the film on a lavish scale. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Rashmika Mandanna takes on a full-fledged action role in Mysaa, and the newly released teaser introduces her as a tribal woman pushed into a violent fight after her attempts to seek justice are ignored. Directed by Rawinder Pulle, the teaser opens with Rashmika being cornered by several men. Her character approaches the court and police, but her anguish and pain go unheard. With powerful people standing in her way, she eventually decides to fight back, turning the story into a bloody hunt for those responsible. The teaser places Rashmika's emotional performance alongside its action sequences. Her expressions, particularly the anger and anguish conveyed through her eyes, form a key part of the character's portrayal. The stunts also showcase a physically demanding side of the actor, while Jakes Bejoy's background score intensifies the emotional and action-driven moments. The teaser was unveiled on the occasion of Rawinder Pulle's birthday, adding to the film's promotional campaign. Produced by Ajay Saipureddy, Anil Sayyapureddy and Veerasai Gopa, Mysaa is gearing up for a worldwide release on November 27 in multiple languages.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మనలో చాలామందికి ఉదయం నిద్రలేవగానే వేడివేడిగా ఒక కప్పు టీ లేదా కాఫీ తాగడం ఎంతో కాలంగా వస్తున్న అలవాటు. ఉదయపు అలసటను పారద్రోలి రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఈ కేఫీన్ పానీయాలు తోడ్పడతాయని భావిస్తాం. అయితే, మన ఆరోగ్యం మరియు శరీర సౌష్ఠవం అనేది మనం ఉదయాన్నే పరగడుపున తీసుకునే మొదటి ఆహారం లేదా పానీయం పైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల ఆమ్లత్వం, జీర్ణకోశ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అందుకే, ఈ అలవాటుకు స్వస్తి చెప్పి, ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించే మునగాకు మరియు ఉసిరికాయలతో చేసిన సహజసిద్ధమైన హెల్త్ షాట్‌ను మన నిత్య జీవితంలో భాగం చేసుకుంటే శరీరంలో ఊహించని అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. ఈ అద్భుతమైన ఆరోగ్యకరమైన పానీయాన్ని ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. దీని తయారీకి 2 ఉసిరికాయలు, 1 స్పూన్ లేత మునగాకు లేదా మునగాకు పొడి, కొద్దిగా కరివేపాకు, చిన్న అల్లం ముక్క, 1/4 స్పూను జీలకర్ర, 6 మిరియాలు, చిటికెడు పసుపు మరియు రుచికి సరిపడా గులాబీ ఉప్పు (పింక్ సాల్ట్) అవసరమవుతాయి. తయారీ విధానం చూస్తే, ఒక మిక్సీ జార్‌లో కొద్దిగా నీరు పోసి ఉసిరికాయ ముక్కలు, మునగాకు, కరివేపాకు, అల్లం, జీలకర్ర, మిరియాలు మరియు పసుపు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని శుభ్రమైన వస్త్రం లేదా వడకట్టే జల్లెడ సహాయంతో పిండి వడకట్టుకోవాలి. వచ్చే చిక్కటి రసంలో చిటికెడు గులాబీ ఉప్పు కలుపుకుంటే మన శరీరానికి అమృతం లాంటి పోషకమైన మునగాకు ఉసిరి షాట్ సిద్ధమవుతుంది. ప్రతిరోజూ ఉదయం పరగడుపున కేవలం 30 ml చొప్పున ఈ హెల్త్ షాట్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో అనూహ్య ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఉసిరికాయలో పుష్కలంగా ఉండే విటమిన్ సీ మరియు మునగాకులోని ఐరన్, కాల్షియం, జింక్, అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను అనూహ్యంగా బలోపేతం చేస్తాయి. ఇది వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల సంభవించే ఇన్ఫెక్షన్లు, సాధారణ జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా బలమైన కవచంలా రక్షణగా నిలుస్తుంది. ఈ పానీయం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందాన్ని పెంచడంలో కూడా మేటిగా పనిచేస్తుంది. ఉసిరిలోని అధిక విటమిన్ సీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచి, ముడతలు, మచ్చలను నివారించి చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. అదేవిధంగా, మునగాకులోని పోషకాలు జుట్టు కుదుళ్లను లోపలి నుండి దృఢపరిచి, చుండ్రు మరియు జుట్టు రాలడం వంటి సమస్యలను అరికడతాయి. ఉదయాన్నే పరగడుపున ఈ పానీయం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుద్ధి అయ్యి, కాలేయం మరియు పేగుల్లో పేరుకుపోయిన విషపదార్థాలు బయటకు పోయి శరీరం సహజంగా డీటాక్స్ అవుతుంది. దీనివల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యల నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా, మునగాకు, ఉసిరి మరియు కరివేపాకు కలయిక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తూ, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రతిరోజు ఉదయం 30 ml ఈ పానీయాన్ని తాగితే నీరసం మాయమై, రోజంతా శరీరం అపరిమితమైన శక్తితో, ఉత్సాహంగా ఉంటుంది.     [ Moringa Leaves, Amla, Amla Benefits, Health Shot, Vitamin C, Antioxidants, Immunity, Digestive Health, Hair Health, Blood Sugar ]
సాధారణంగా వచ్చే తలనొప్పికి, మైగ్రేన్ అని పిలిచే తీవ్రమైన నరాల సమస్యకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక సాధారణ తలనొప్పి కొన్ని గంటల విశ్రాంతి తర్వాత లేదా స్వల్ప చికిత్సతో తగ్గుముఖం పడుతుంది. కానీ మైగ్రేన్ అలా కాదు, ఇది బాధితులను రోజులకు తరబడి తీవ్రంగా పీడిస్తుంది. తల ఒకవైపు భాగంలో లేదా నొసటి నుండి మెడ వెనుక భాగం వరకు విపరీతమైన నరాల గుంజుడు, తీవ్రమైన ఒత్తిడి, సూదులతో గుచ్చినట్లు ఉండే భరించలేని నొప్పి మైగ్రేన్ యొక్క ప్రధాన లక్షణం. ఈ తీవ్రమైన నొప్పుల సమయంలో చిన్నపాటి శబ్దం లేదా స్వల్ప వెలుతురు పడినా సరే విపరీతమైన చికాకు, మానసిక అసహనం కలుగుతాయి. అంతేకాకుండా, చాలా మందిలో ఈ సమస్య వల్ల వికారం, వాంతులు కూడా అవుతాయి. ఇలాంటి దీర్ఘకాలిక సమస్య నుండి ఉపశమనం పొందడానికి, మన వంటింట్లోనే దొరికే సహజసిద్ధమైన దినుసులతో అద్భుతమైన మూలికా పానీయం (Herbal Drink) తయారుచేసుకోవచ్చు. ఈ శక్తివంతమైన పానీయం తయారుచేసుకోవడానికి మనకు ప్రధానంగా ఐదు పదార్థాలు అవసరమవుతాయి. అవి 1 ఇంచ్ పొడవు ఉన్న అల్లం ముక్క, 10 నల్ల మిరియాలు, 1/2 స్పూను పసుపు, 1 నిమ్మకాయ మరియు 300 ml పరిశుభ్రమైన నీరు. తయారీ విధానం చాలా సులభం. మొదట ఒక పాత్రలో 300 ml నీటిని పోసి పొయ్యిపై ఉంచి బాగా మరగనివ్వాలి. నీరు బాగా మరిగేటప్పుడు, అందులో కచ్చాపచ్చాగా దంచిన 10 మిరియాలు, పొట్టు తీసి సన్నగా దంచిన 1 ఇంచ్ అల్లం ముక్కలను వేయాలి. వీటిలోని మూలికా గుణాలు నీటిలోకి దిగి పచ్చివాసన పోయేంత వరకు కొన్ని నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఆ తర్వాత అందులో 1/2 స్పూన్ పసుపు వేసి, వెంటనే స్టవ్ ఆపివేయాలి. పసుపును నీటిలో ఎక్కువ సేపు మరిగించకూడదు, అలా చేస్తే అందులోని సహజసిద్ధమైన విలువలు తగ్గిపోతాయి. ఈ మిశ్రమం కాస్త చల్లారి గోరువెచ్చగా అయిన తర్వాత వడకట్టుకోవాలి. చివరగా అందులో 1 నిమ్మకాయ రసం పిండుకుంటే అద్భుతమైన ఆరోగ్యకరమైన మూలికా టీ సిద్ధమవుతుంది. ఈ హెర్బల్ డ్రింక్‌ను ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో వేడివేడిగా తాగడం వల్ల మన నరాల వ్యవస్థ ఉత్తేజితమై మైగ్రేన్ నొప్పి నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. మైగ్రేన్ తీవ్రమైన నొప్పి ఉన్న సమయంలోనే కాకుండా, నొప్పి లేనప్పుడు కూడా దీనిని ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా తీసుకోవచ్చు. క్రమం తప్పకుండా ప్రతిరోజూ సాయంత్రం ఈ పానీయం తాగడం వల్ల మైగ్రేన్ దాడులు మళ్లీ మళ్లీ రాకుండా అదుపు చేయవచ్చు. మెరుగైన మరియు శాశ్వత ఫలితాల కోసం దీనిని కనీసం 30 రోజుల పాటు నిరంతరాయంగా తీసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పానీయంలో ఉపయోగించే ప్రతి పదార్థం మైగ్రేన్ నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది. పసుపులో లభించే  కర్కుమిన్  (Curcumin), అల్లంలో ఉండే  జింజరోల్  (Gingerol) వంటి శక్తివంతమైన యాంటీ ఇంఫ్లమేటరీ (Anti inflammatory) కాంపౌండ్లు మెదడులోని రక్తనాళాలు, నరాల వాపును సమర్థవంతంగా తగ్గిస్తాయి. మిరియాలలో ఉండే  పైపెరిన్  (Piperine) మరియు అల్లం కలయిక శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం చేసి తలనొప్పి తీవ్రతను తగ్గిస్తాయి. ఈ డ్రింక్ తాగడం వల్ల మైగ్రేన్ సమయంలో వచ్చే వికారం తగ్గడమే కాకుండా జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. నిమ్మలోని విటమిన్ సీ శరీరాన్ని డీటాక్స్ చేసి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ మూలికా పానీయం నరాల వ్యవస్థను బలపరిచి, మైగ్రేన్ నుండి శాశ్వత ఉపశమనాన్ని అందించే ఒక గొప్ప సహజ ఔషధం.     [ Migraine, Migraine Symptoms, Herbal Drink, Ginger, Black Pepper, Turmeric, Curcumin, Gingerol, Piperine, Natural Remedies ]
మన వంటింట్లో సులభంగా లభించే మూలికా దినుసులలో పుదీనాకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. వంటకాలకు అద్భుతమైన సువాసన, రుచిని అందించడమే కాకుండా, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించడంలో పుదీనా కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక శైలి మరియు ఆహార అలవాట్ల వల్ల ఉత్పన్నమయ్యే అనేక ఆరోగ్య సమస్యలకు పుదీనా రసం ఒక గొప్ప సహజసిద్ధమైన పరిష్కారంగా నిలుస్తుంది. రోజువారీ ఆహారంలో భాగంగా రోజుకు ఒక్క గ్లాస్ పుదీనా రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే 5 ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు మరియు దానిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిది, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడం. పుదీనాలో ఉన్న  మెంథాల్  అనే ముఖ్యమైన సమ్మేళనం జీర్ణ ఎంజైమ్‌లను వేగంగా ఉత్తేజపరుస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే పుదీనా రసం తాగడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ మరియు మలబద్ధకం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. శరీరంలో తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవడానికి ఇది సహాయపడుతుంది. రెండవది, శరీర రోగనిరోధక శక్తిని పెంచడం. కేవలం 2 టేబుల్ స్పూన్ల పుదీనా ఆకులలో దాదాపు 1.5 మిల్లీగ్రాముల విటమిన్ సీ, 0.4 గ్రాముల ప్రోటీన్, 0.9 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.8 గ్రాముల ఫైబర్, 22.4 మిల్లీగ్రాముల కాల్సియం, 6.8 మిల్లీగ్రాముల భాస్వరం మరియు 51.5 మిల్లీగ్రాముల పొటాషియం వంటి అత్యవసర పోషకాలు ఉంటాయి. పుదీనాలో సమృద్ధిగా లభించే విటమిన్ సీ మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో కణాల క్షీణతను అరికట్టి, రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. మూడవది, చర్మ సౌందర్యాన్ని పెంపొందించడం. పుదీనాలో సహజసిద్ధమైన శోథ నిరోధక (Anti inflammatory) మరియు బాక్టీరియా నిరోధక గుణాలు సమృద్ధిగా ఉంటాయి. పుదీనాలో ఉండే అధిక శాతపు శాలిసిలిక్ యాసిడ్ మరియు విటమిన్ ఏ చర్మంలో నూనె ఉత్పత్తిని నియంత్రించి మొటిమలు, మచ్చలు మరియు నల్లమచ్చలను (Blackheads) సమర్థవంతంగా నివారిస్తాయి. ఇది చర్మాన్ని నిర్విషీకరణ (Detox) చేసి, ముఖానికి సహజ కాంతిని అందిస్తుంది. నాల్గవది, నోటి ఆరోగ్యం మరియు శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరచడం. పుదీనాలోని యాంటీబాక్టీరియల్ గుణాలు నోటిలోని హానికర బాక్టీరియాను నశింపజేసి దుర్వాసనను అరికడతాయి. అలాగే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తూ శ్వాసక్రియను సులభతరం చేస్తాయి. ఐదవది, మనస్సును ప్రశాంతంగా ఉంచడం మరియు ఒత్తిడి తగ్గించడం. పుదీనాలోని సహజ సువాసన మరియు కూలింగ్ గుణాలు శరీరాన్ని రిఫ్రెష్ చేయడమే కాకుండా నాడీ వ్యవస్థను ప్రశాంత పరిచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పుదీనా రసాన్ని ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక గుప్పెడు తాజా పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి బ్లెండర్‌లో వేయాలి. దానికి ఒక గ్లాసు నీరు, కొద్దిగా అల్లం ముక్క, రెండు స్పూన్ల నిమ్మరసం, తగినంత తేనె లేదా సైంధవ లవణం (Black salt) చేర్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి, అవసరమైతే కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకుని ఫ్రెష్‌గా సేవించవచ్చు. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ డ్రింక్ రోజంతా శరీరాన్ని ఉత్సాహంగా, హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి, ప్రతిరోజూ ఉదయం కాఫీ లేదా టీలకు బదులుగా ఈ పోషకాల గని అయిన పుదీనా రసాన్ని మీ ఆహార అలవాట్లలో భాగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుదాం.     [ Mint Juice, Mint Leaves, Digestive Health, Vitamin C, Antioxidants, Skin Health, Oral Health, Respiratory Health, Stress Relief, Healthy Drinks ]
మెడలో గడ్డ లేదా వాపు కనిపించగానే చాలామందికి క్యాన్సర్‌ గురించి భయం మొదలవుతుంది. కానీ మెడలో వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్‌ కావాల్సిన అవసరం లేదు. థైరాయిడ్‌ సమస్యలు, లింఫ్‌ నోడ్స్‌ వాపు, ఇన్ఫెక్షన్లు తదితర కారణాల వల్ల కూడా మెడలో గడ్డలు ఏర్పడవచ్చు. మెడలో గడ్డలు ఎందుకు వస్తాయి? థైరాయిడ్‌ వాపు ఎలా ఉంటుంది? లింఫ్‌ నోడ్స్‌ ఎందుకు పెరుగుతాయి? మెడలో గడ్డ కనిపిస్తే ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి? సమస్యను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు అవసరం? వంటి ముఖ్యమైన విషయాలను సీనియర్ ENT, హెడ్ & నెక్ సర్జన్ డాక్టర్ అశోక్ పృథ్వీరాజ్ మొగంటి ఈ వీడియోలో సులభంగా వివరిస్తున్నారు. మెడలో గడ్డను నిర్లక్ష్యం చేయకుండా, దాని కారణాన్ని వైద్యుల సలహాతో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో మెడలో గడ్డలు, థైరాయిడ్‌ సమస్యలు, లింఫ్‌ నోడ్స్‌ వాపు మరియు అవసరమైన వైద్య పరీక్షల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. గమనిక: మెడలో గడ్డ లేదా వాపు ఉంటే స్వయంగా నిర్ధారణ చేసుకోకుండా వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ఎర్ర గోంగూర.. కేవలం తెలుగు రాష్ట్రాల రుచుల్లోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదిచుకుంది. ఆకుకూరల్లో గోంగూరకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తెల్ల గోంగూరతో పోలిస్తే ఎర్ర గోంగూరలో ఆరోగ్య గుణాలు, పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది దీని పులుపుదనం వల్ల లేదా పులుపు ఎక్కువైతే ఏమన్నా సమస్యలు వస్తాయేమోనని కాస్త దూరంగా ఉంటారు. కానీ, ఎర్ర గోంగూర రోజూ లేదా వారానికి రెండు మూడు సార్లు తింటే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఉంటాయని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు. అసలు ఎర్ర గోంగూరలో  ఉండే పోషకాలు ఏమిటి? ఎర్ర గోంగూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకుంటే ఎర్ర గోంగూరను అస్సలు వదిలిపెట్టరు.  ఎర్ర గోంగూర గురించి వివరంగా తెలుసుకుంటే.. ఎర్ర గోంగూర అందించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రక్తహీనతకు చెక్ పెడుతుంది:  నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రక్తహీనత. ఎర్ర గోంగూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో ఎర్ర గోంగూర ఒక సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది:  వయసు పెరిగే కొద్దీ ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు సహజంగా వస్తుంటాయి. ఎర్ర గోంగూరలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరం ఎముకలను దృఢంగా ఉంచడానికి ఎంతగానో తోడ్పడతాయి. చిన్నపిల్లల పెరుగుదలకు, ఎముకల ఎదగడానికి ఇది చాలా మంచిది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:  ఎర్ర గోంగూరలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును వేగవంతం చేసి, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. తిన్న ఆహారం త్వరగా అరగడానికి, పేగుల్లో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడానికి ఇది సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:  ఈ ఆకుకూరలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తినందిస్తుంది. కంటి చూపు పెరిగేందుకు దోహదం చేస్తుంది:  ఎర్ర గోంగూరలో విటమిన్ ఏ తగినంత ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రేచీకటి, కళ్ళు పొడిబారడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తూ, దృష్టి లోపాలు రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి రక్షణ:  ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా నిరోధించడంలో ఎర్ర గోంగూర  కీలకంగా పనిచేస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు:  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, ముడతలు పడకుండా చూడటానికి ఇది దోహదపడుతుంది. అలాగే తలకు అవసరమైన పోషకాలను అందించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి:  ఎర్ర గోంగూరలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి, పీచు పదార్థం ఎక్కువ. ఇది తిన్న తర్వాత కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. దీంతో అతిగా తినే అలవాటు తగ్గి సులభంగా బరువు తగ్గొచ్చు. ఇన్ని రకాల ఔషధ గుణాలు ఉన్న ఎర్ర గోంగూరను  దైనందిన ఆహారంలో పప్పు రూపంలోనో, పచ్చడి రూపంలోనో లేదా ఇతర కూరల్లో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.                       *రూపశ్రీ.  
మన చుట్టూ ఎక్కడ చూసినా కనిపించే కొన్ని మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అలాంటి మొక్కల్లో కుప్పింటాకుకూడా ఒకటి. దీనినిపిప్పింటాకు, మురిపిండి, హరిత మంజరివంటి పేర్లతో కూడా పిలుస్తారు.  శాస్త్రీయంగా దీనిని Acalypha indica అంటారు. కుప్పింటాకును మన సంప్రదాయ వైద్య విధానాల్లో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగాపిప్పి పన్ను నొప్పి, పంటి సమస్యలు, గజ్జి, దురద, తామర వంటి చర్మ సమస్యలకు సంప్రదాయంగా ఉపయోగించే విధానాల గురించి ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ వివరిస్తున్నారు. కుప్పింటాకు మొక్కలోని ఆకులు, వేర్లు తదితర భాగాలను వివిధ సంప్రదాయ పద్ధతుల్లో ఉపయోగించినట్లు సమాచారం ఉంది. అయితే ఏ ఆరోగ్య సమస్యకైనా స్వయంగా చికిత్స చేసుకోవడం కాకుండా, సరైన వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. కుప్పింటాకు మొక్కను ఎలా గుర్తించాలి? పిప్పి పన్ను నొప్పి, చర్మ సమస్యల వంటి వాటికి దీనిని సంప్రదాయంగా ఎలా ఉపయోగిస్తారు? ఈ ఆకు వల్ల చెప్పుకునే ఇతర ప్రయోజనాలు ఏమిటి? వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి పూర్తి వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)