Home

»

Latest News

DNK: రెండు రోజుల్లోనే అన్ని కోట్లా.. నెగెటివ్‌ టాక్‌తో ఊరమాస్ బ్యాటింగ్.!

Nov 15, 2026 2:27PM

సినిమాకు టాక్‌ బాగుంటే వసూళ్లు రావడం సహజం. కానీ నెగెటివ్‌ టాక్‌ వచ్చినా బాక్సాఫీస్‌ దగ్గర మంచి నంబర్లు నమోదైతే మాత్రం అది కచ్చితంగా ఆసక్తికరమైన విషయమే. ఇప్పుడు ‘దొంగ నా కొడుకు’ (DNK) సినిమా విషయంలో ఇదే జరుగుతోంది.

మౌళి హీరోగా నటించిన ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.7.25 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు మేకర్స్‌ ప్రకటించారు. సినిమా మొదటి షో నుంచే నెగెటివ్‌ టాక్‌ వినిపించినప్పటికీ ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్‌ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

సాధారణంగా నెగెటివ్‌ టాక్‌ వస్తే యంగ్ హీరోల సినిమాల కలెక్షన్లపై మొదటిరోజే ఆ ప్రభావం కనిపిస్తుంది. కానీ ‘DNK’ మాత్రం ఏకంగా రూ.4.15 కోట్ల గ్రాస్‌ తో సత్తా చాటింది. ఇక రెండో రోజు కూడా అదే జోరు చూపిస్తూ రూ.3.10 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. దీంతో రెండు రోజుల్లోనే రూ.7.25 కోట్ల గ్రాస్‌ సాధించింది.

‘DNK’ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే వరల్డ్ వైడ్ గా రూ.15 కోట్ల గ్రాస్ రాబట్టాలని అంచనా. మూడో రోజు ఆదివారం కావడంతో మరో మూడు కోట్లకు పైగా గ్రాస్‌ తో రూ.10 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం. ఇదే జోరు కొనసాగితే నెగెటివ్‌ టాక్‌తో హిట్ కొట్టిన క్రెడిట్ మౌళికి దక్కుతుంది.

‘లిటిల్ హార్ట్స్’తో మౌళికి వచ్చిన క్రేజ్‌, యూత్‌లో సినిమాపై ఏర్పడిన ఆసక్తి ఈ వసూళ్లకు కారణమని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.

 

 

 

[DNK Collections, Donga Naa Koduku, Box Office, Mouli]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com