
టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ, దర్శకుడు కృష్ణవంశీ విడాకులు తీసుకున్నారంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ వేర్వేరు నగరాల్లో ఉంటుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన రమ్యకృష్ణ ఈ ప్రచారంపై స్పందించి అసలు విషయం వెల్లడించారు. తామిద్దరం ఇప్పటికీ భార్యాభర్తలుగానే ఉన్నామని స్పష్టం చేశారు.
2003లో ప్రేమ వివాహం చేసుకున్న రమ్యకృష్ణ, కృష్ణవంశీ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. అయితే కొంతకాలంగా రమ్యకృష్ణ చెన్నైలో, కృష్ణవంశీ హైదరాబాద్‌లో ఉంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి.
తాజాగా ఈ విషయంపై స్పందించిన రమ్యకృష్ణ.. తాము వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ దంపతులుగానే కొనసాగుతున్నామని చెప్పారు. దీని వెనుక వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవని, కెరీర్, కుటుంబ పరిస్థితుల కారణంగానే ఈ ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.

తన కుమారుడు పుట్టిన తర్వాత తాను సీరియల్స్‌లో నటించే సమయంలో ప్రతి 15 రోజులకు ఒకసారి చెన్నై నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించాల్సి వచ్చేదని రమ్యకృష్ణ తెలిపారు. అయితే అలా ప్రయాణించిన ప్రతిసారీ తన కుమారుడు అనారోగ్యానికి గురయ్యేవాడని చెప్పారు. దీంతో కొడుకును చెన్నైలోనే చదివించాలని కృష్ణవంశీతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారట. అలా పరిస్థితులు క్రమంగా వేర్వేరు నగరాల్లో ఉండటానికి అనుకూలంగా మారాయని వెల్లడించారు.
అంతేకాదు.. రోజూ గొడవలు పడటం కంటే మంచి స్నేహితుల్లా ఉండటమే తమకు ఇష్టమని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు. తమ మధ్య మంచి స్నేహం, అవగాహన ఉన్నాయని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి.
ఇప్పటికే కృష్ణవంశీ కూడా పలుమార్లు విడాకుల ప్రచారాన్ని ఖండించారు. రమ్యకృష్ణతో తన బంధంపై వస్తున్న వార్తల్లో నిజం లేదని గతంలోనే స్పష్టం చేశారు. ఇప్పుడు రమ్యకృష్ణ కూడా స్వయంగా స్పందించడంతో ఈ ప్రచారానికి మరోసారి తెరపడినట్లయింది.
[Ramya Krishna, Krishna Vamsi, Divorce Rumours, Hyderabad, Chennai]




.webp)
