Home

»

Gossips

మరో సర్‌ప్రైజ్: బోయపాటితో అల్లు అర్జున్‌ మూవీ అనౌన్స్‌మెంట్‌.!

Nov 15, 2026 8:45AM

టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ కాంబినేషన్లకు సంబంధించిన వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఎన్టీఆర్‌–అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌ తర్వాత మరో సర్‌ప్రైజ్‌ అనౌన్స్‌మెంట్‌ రాబోతోందనే ప్రచారం మొదలైంది. ఈసారి ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాస్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌ తెరపైకి వచ్చింది.

అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీను కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే టాక్‌ ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టును గీతా ఆర్ట్స్‌ నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో బన్నీతో ‘సరైనోడు’ వంటి మాస్‌ హిట్‌ అందించిన బోయపాటి.. మరోసారి ఆయనతో సినిమా చేయబోతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది.

ప్రస్తుతం అల్లు అర్జున్‌.. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకా’ సినిమాతో బిజీగా ఉన్నారు. డిసెంబర్‌ లేదా జనవరి నాటికి ఈ చిత్రంలో తనకు సంబంధించిన షూటింగ్‌ పూర్తి చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

ఆ తర్వాత మార్చి లేదా ఏప్రిల్‌ నుంచి రెండు సినిమాలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారనే టాక్‌ వినిపిస్తోంది.

ఒకవైపు లోకేష్ కనగరాజ్ తో అల్లు అర్జున్‌ చేస్తున్న AA23.. మరోవైపు బోయపాటి శ్రీను ప్రాజెక్టు షూటింగ్‌లను సమన్వయం చేసుకుంటూ బన్నీ ముందుకు వెళ్లనున్నారట. అయితే ఈ షెడ్యూల్స్‌, ప్రాజెక్టుల వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గతంలో ‘సరైనోడు’తో బన్నీకి మంచి మాస్‌ మూవీ ఇచ్చిన బోయపాటి.. ఈసారి ఎలాంటి కథతో ఆయన ముందుకు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. గీతా ఆర్ట్స్‌ నిర్మాణంలో ఈ కాంబినేషన్‌ నిజమైతే అభిమానులకు మరో మాస్‌ ట్రీట్‌ ఖాయమనే చెప్పాలి.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబో ఫిక్స్.. థియేటర్లలో నవ్వుల జాతరే!

 

 

 

[Allu Arjun, Boyapati Srinu, Jr NTR, Anil Ravipudi]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com