LATEST NEWS
  తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక సాధారణ సినిమా ఫెయిల్ అయితే కేవలం ఆ సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్లకు మాత్రమే నష్టం వస్తుందని, కానీ ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న 'రేవంత్ రెడ్డి' అనే సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం వల్ల ఏకంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఘోరంగా నష్టపోతున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనను ఎండగడుతూ ఆయన సినిమా పరిభాషలో చేసిన ఈ పోలిక ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ అవుతోంది. ఈ 'రేవంత్ రెడ్డి' అనే సినిమాను చూస్తున్న ప్రేక్షకులు ఇప్పటికే తీవ్ర అసహనానికి గురవుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ ముగిసి, ఇంటర్వెల్ కాగానే థియేటర్లలో ఉన్న జనాలు తలలు పట్టుకుంటున్నారని, 'ఎప్పుడు పోతడు రా ఈ రేవంత్ రెడ్డి' అంటూ అందరూ తీవ్ర అసంతృప్తితో ఎదురుచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్న అభివృద్ధి వేగం పూర్తిగా మందగించిందని, కేసీఆర్ హయాంలో రైతాంగానికి అండగా నిలిచిన రైతుబంధు వంటి పథకాలు అమలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అన్నపూర్ణలా విలసిల్లిన తెలంగాణను కాంగ్రెస్ సర్కార్ తన పాలనా వైఫల్యాలతో అనాథ తెలంగాణగా మారుస్తోందని మండిపడ్డారు. పాలన చేతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఈ ఆత్మహత్యలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం తన సొంత నియోజకవర్గమైన కోస్గి లాంటి ప్రాంతాల్లో కూడా శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నారని, ఆలయాలపైకి బుల్డోజర్లు వెళ్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టు సాధనలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 13 వేల 400 కోట్ల రుణాన్ని కేవలం 4 శాతం వడ్డీతో, 20 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితికి తీసుకునేలా అంతర్జాతీయ సంస్థలను ఒప్పించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని గుర్తు చేశారు. ఈ లోన్ బదిలీ ప్రక్రియ కోసం డాక్యుమెంట్ ఫీజు కింద రూ. 48 కోట్లు, ఈక్విటీ కింద రూ. 1400 కోట్లు కూడా అప్పట్లోనే చెల్లించామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇన్ని నిధులు సమకూర్చి, ప్రణాళికలు సిద్ధం చేసినా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం రాజకీయాలకే పరిమితమయ్యారని విమర్శించారు. సీఎం పదవి చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి దాదాపు 71 సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఆయనను అస్సలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో, కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో రేవంత్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. 71 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా రాష్ట్రానికి ఒక్క పైసా అదనపు ప్రయోజనం తీసుకురాలేకపోయారని విమర్శించారు. కేవలం కిషన్ రెడ్డి వంటి నేతలతో కలిసి బీఆర్ఎస్ పై బురదజల్లడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని, ఈ రాజకీయ నాటకాల వల్ల 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
సమాజంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. ఒక క్రిమినల్ కులం ఏంటి అంటూ  నేటి యువతను ప్రశ్నించిన తీరు   ఆలోచింపజేస్తోంది. గాదె సాయికృష్ణ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్, నేరగాళ్లను కుల కోణంలో చూడటం వల్లే వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయన్నారు. ఒక తల్లి తన కొడుకు కనిపించట్లేదని కోర్టును ఆశ్రయించిందంటే, అది ఆ తల్లి ప్రాథమిక హక్కు అన్న ఆయన.. తన బిడ్డ బతికాడో లేదో తెలియని ఆవేదనలో ఉన్న ఆ తల్లి పోరాటంలో ఎక్కడా కులం లేదని, కేవలం న్యాయ పోరాటం మాత్రమే ఉందని గుర్తుచేశారు. రాజ్యాంగం గానీ, దేశ క్రిమినల్ చట్టాలు గానీ నేరస్తుడి కులాన్ని, మతాన్ని లేదా ప్రాంతాన్ని చూసి శిక్షలు ఖరారు చేయవని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చట్టం దృష్టిలో కేవలం క్రైమ్ జరిగిందా లేదా, ఎవరు ఎవరికి అన్యాయం చేశారు అనే అంశాలు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకుంటాయి. కానీ దురదృష్టవశాత్తూ నేటి సమాజంలో నేరస్తులను కూడా వారి కులాలను బట్టి వెనకేసుకొచ్చే సంస్కృతి పెరిగిపోతోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా యువత ఈ కులాల పరిధి నుంచి బయటకు రావాలని, క్రిమినల్స్ ను క్రిమినల్స్ లాగే చూడాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పు చేసేవాడికి, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వాడికి   కులం ఎందుకు ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వాడి గుర్తింపు కేవలం ఒక క్రిమినల్ మాత్రమేనని, అలాంటి నీచుడిని ఏ కులం వారైనా వెనకేసుకొస్తే అది ఆ వ్యక్తి  దౌర్భాగ్య  స్వభావాన్ని సూచిస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. క్రిమినల్ గ్యాంగులతో ప్రభుత్వాలను నడపాలని చూడటం, అధికారులను భయభ్రాంతులకు గురిచేసి గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమని హెచ్చరించారు. భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం అంటూ క్రిమినల్ గ్యాంగులు ఈరోజు తలపైకి ఎక్కి ఆడుతున్నాయంటే, ఆ బలం వాళ్ళది కాదు, సమాజంగా మనందరి కలెక్టివ్ బలహీనత అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. పౌరులను సాధికారత వైపు నడిపించడమే తన ముఖ్య ఉద్దేశమని, అందుకే   3 నెలల క్రితమే ఎస్పీ గారితో మాట్లాడి సివిల్ సిటిజన్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరినట్లు వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం వస్తే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తమ పరిధిలో ఉంటారని, మితిమీరి ప్రవర్తించరని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కులాలకు ఓటింగ్ పాటర్న్ ఉండొచ్చేమో కానీ, పౌర హక్కులకు, ప్రాథమిక హక్కులకు ఎలాంటి కులాల ఓటింగ్ పాటర్న్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. మన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఏ ప్రభుత్వాన్ని కూడా మేము ఎన్నుకోబోమని ప్రజలు గట్టిగా నినదించినప్పుడే నిజమైన మార్పు వస్తుందని, పాలకులు కూడా మారుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రిమినల్స్ కు కులాన్ని అంటగట్టి వెనకేసుకొచ్చే ఏ రాజకీయ నాయకుడినైనా సరే ఆమడదూరంలో పెట్టకపోతే, అది సమాజ భవిష్యత్తుకే తీవ్ర భంగం కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ కలెక్టర్ నరహరికి చెందిన బ్యాంకు లాకర్లను తెరిచిన ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో బంగారం, నగదును గుర్తించారు. లాకర్లలో ఉన్న ఆస్తుల పరిమాణాన్ని చూసి అధికా రులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది. అలాగే, రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం కావడంతో నరహరి అక్రమాస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం విలువనుఅంచనా వేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఏసీబీ చరిత్రలో ఒకే అవినీతి కేసులో రూ.3 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొంటున్నారు. నరహరికి సంబంధించిన స్థిర, చరా స్తులు, బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక వివరాలను ఏసీబీ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న తాజా నిరసనలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డోలేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన ఈ ఉద్యమం తీరు,  నిరసనలు తెలిపే క్రమంలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాజకీయ పరిణామాలపై డోలేంద్ర ప్రసాద్‌తో సీనియర్ జర్నలిస్ట్ కె. రవిశంకర్  వాస్తవ వేదికలో విస్తృత చర్చ జరిపారు.  ఆ సందర్భంగా డోలేంద్ర ప్రసాద్..  ఈ ఉద్యమంలో పాల్గొన్న యువతకు కనీస రాజకీయ పరిణతి  లోపించిందన్నారు. జంతర్ మంతర్ వంటి చారిత్రాత్మక ధర్నా చౌక్‌లలో నిరసనలు తెలిపేటప్పుడు..  కేవలం నినాదాలకే పరిమితం కాకుండా, స్పష్టమైన ఉపన్యాసాల ద్వారా సమస్య తీవ్రతను వివరించాలనీ, కానీ కాక్రోచ్ జనతా పార్టీ నాయకులకు  మైకులు ఉపయోగించి తమ డిమాండ్లను బలంగా వినిపించాలనే కనీస అవగాహన కూడా    లేదని చెప్పారు.  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్..  అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ ఇలాంటి ధర్నాలు చేపడితే భారీగా మెన్ అండ్ మిషనరీని తరలిస్తుందని..  కానీ ఇది నిరుద్యోగులను కలుపుకోకుండా కేవలం స్టూడెంట్స్ కే పరిమితం కావడం వల్ల బలపడటం లేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రామదేవ్ బాబా నిరసనలకు దిగినప్పుడు ప్రణబ్ ముఖర్జీ వంటి అగ్రనేతలు స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి రాయబారాలు నడిపిన దాఖలాలు ఉన్నాయని డోలేంద్ర ప్రసాద్ గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో వచ్చే ఇలాంటి పబ్లిక్ ఇష్యూలను హ్యాండిల్ చేయడంలో నాటి ప్రభుత్వాలకు భయం ఉండేదనీ..  కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దీన్ని  వ్యూహాత్మకంగా డీల్ చేస్తూ నిప్పును చల్లార్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. రాజకీయ నాయకుల్లో ఎప్పుడూ ఒక రకమైన ప్రజా ఉద్యమాల భయం ఉంటుందని, అయితే ఈ నిరసనలకు సరైన నాయకత్వం లేకపోవడం పెద్ద మైనస్ అని తేల్చిచెప్పారు. ప్రజల్లో కోరిక ఉన్నప్పటికీ, సరైన లీడర్‌షిప్ లేని కారణంగానే ఉద్యమం పాలపొంగులా వచ్చి చల్లారిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీల నేతలు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న తరుణంలో..  క్షేత్రస్థాయి ఉద్యమాలను సమర్థవంతంగా నడిపించగల నాయకత్వ బలం యువతకు ఎంతైనా అవసరమని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.
 తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సాయికృష్ణ కేసు తీవ్ర సంచలనంగా మారింది. కస్టడీలో ఉన్న యువకుడు సాయికృష్ణ అదృశ్యం కావడం లేదా మరణించి ఉంటాడనే అనుమానాల నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే, ఈ కేసులో  వైసీపీ చేస్తున్న విమర్శల వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం,  హిడెన్ అజెండా ఉందన్నారు   ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు, తెలుగుదేశం కూటమి అధికార ప్రతినిథి అప్పసాని రాజేష్.  తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించారు.   కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో 23 ఏళ్ల సాయికృష్ణ అనే యువకుడిని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతని ఆచూకీ లభించకుండా పోయింది. ఈ ఉదంతంపై కృష్ణలంక సీఐ నాగరాజును ప్రభుత్వం ఇప్పటికే విఆర్  కు పంపి, ఆపై సస్పెండ్ చేసి, హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, పోలీస్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే..  జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని  విశ్లేషించారు. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలోనే  సిట్ విచారణ అత్యంత వేగంగా సాగుతోందని  గుర్తు చేశారు. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి నోటీసులు అందాయని, కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు అరెస్టు చేశారనీ.. త్వరలోనే ఈ విచారణ తీగ లాగితే డొంకంతా కదిలినట్లు..  జగన్మోహన్ రెడ్డి ఇటికి చేరే అవకాశం ఉందని అన్నారు.   ఈ మద్యం కుంభకోణం విచారణను పక్కదారి పట్టించడానికి, సిట్ దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న సీపీ రాజశేఖర్ బాబు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికే వైసీపీ  ఈ కేసును  రాజకీయ అస్త్రంగా వాడుకుంటోందని అప్పసాని  రాజేష్ అన్నారు. గతంలో  వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసును, డాక్టర్ సుధాకర్, చీరాల కిరణ్ ఉదంతాలను ప్రస్తావిస్తూ.. ఆనాడు పౌర హక్కుల ఉల్లంఘనలపై స్పందించని జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు హఠాత్తుగా మానవ హక్కుల నేతగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు పరిధిలో ఉందనీ, జూన్ 29వ తేదీ నాటికి పోలీసులు కోర్టుకు సమర్పించే నివేదికతో అసలు నిజాలు అధికారికంగా బయటకు వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ కేసులో ఎవరినీ కాపాడే ప్రయత్నం చేయడం లేదనీ..  తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షార్హులేనని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతిని గుర్తు చేశారు.  సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజమండ్రి ఎస్పీ నేతృత్వంలో నిష్పాక్షిక విచారణ కమిషన్ కూడా ఏర్పాటైందనీ..  బాధితులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ, ఒక యువకుడి అదృశ్యం కేసును అడ్డుపెట్టుకుని వైసీపీ ఆడుతున్న పొలిటికల్  డ్రామాను ప్రజలు గమనిస్తున్నారనీ, విచారణ పూర్తయితే అసలు నిజాలు నిగ్గు తేలుతాయని అప్పసాని చెప్పారు. 
ALSO ON TELUGUONE N E W S
  మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)కి ఎంటైర్ తన కెరీర్ లోనే సూపర్ హిట్ అందించి మరో మారు తన మార్క్ ని చాటి చెప్పిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ తో తన హవాని కంటిన్యూ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు. VenkyAnil5 NKRAR2 అనే వర్కింగ్ టైటిల్స్‌తో పిలుస్తున్న ఈ మూవీ రెండు రోజుల క్రితం స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. రీసెంట్ గా మేకర్స్  ప్రమోషనల్ వీడియోని  సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. "కత్తి లాంటి ఐడియా" అంటూ సాగే ఈ వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతూ, కేవలం కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది అని చెప్పేందుకు కూడా అనిల్ ఓ వెరైటీ వీడియోతో మన ముందుకు వచ్చాడు. హీరో, హీరోయిన్లు, జివి ప్రకాశ్ మాట్లాడుతూ ఉండగా చేతిలో పెద్ద కత్తి పట్టుకొని. తల పాగ పెట్టుకొని అనిల్ అక్కడకు వస్తాడు. తనకు ‘కాన్సెప్ట్ కింగ్‌’ అనే బిరుదు ఇచ్చారని చెబుతాడు. ఇంతలో వెంకటేశ్ నేను ఓ ఐడియా ఇస్తానని కత్తి తీసుకొని అనిల్ వేలిని కట్ చేసి వీర తిలకం దిద్దుతారు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్‌ కూడా అదే పని చేస్తారు. అనంతరం వీర తిలకం అమ్మాయిలు దిద్దాలిగా అంటూ హీరోయిన్లు కీర్తి సురేశ్, కృతి శెట్టిలు అనిల్ వేలిని కట్ చేసి వీర తిలకం పెడతారు. ఆ తర్వాత అనిల్ ‘ఎంత రాయలసీయ బ్యాక్‌డ్రాప్ అయితే మాత్రం ఇంత రక్తపాతం అవసరమా’ అని చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. చివర్లో సినిమా షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించడంతో పాటు  2027 సంక్రాంతికి థియేటర్స్ లో కలుద్దామని టీం చెప్పింది. also read: Samantha: సమంత అసలు రూపం బయటపెట్టిన ఆడపడుచు.. తెల్లవారుజామున 3 గంటలకి ఏం చేసిందంటే  
  సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం తో థియేటర్స్ లో సందడి చేశున్న విషయం తెలిసిందే. అలాంటి ఈ టైంలో సమంత భర్త రాజ్ నిడిమోరు సోదరి 'శీతల్' సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన  భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  ఆమె తన పోస్ట్ లో నేను ఇంతవరకు సమంత నటించిన ఏ ఒక్క సినిమాని  కూడా చూడలేదు. కానీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో సమంత అసలు రూపం ఎలాంటిదో తాను స్వయంగా చూశాను. పెళ్లయిన కొన్ని రోజులకే హైదరాబాద్‌లోని సమంత ఇంట్లో నేను బస చేశాను. ఒకరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత, తెల్లవారుజామున 3 గంటల సమయంలో నాకు అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యం చేసింది. శరీరం విపరీతంగా వణికిపోవడం, వాంతులు అవ్వడం, తల పగిలిపోయేలా నొస్తూ ఉండటంతో, కనీసం మంచం దిగి మందులు లేదా దుప్పట్లు వెతుక్కునే ఓపిక కూడా లేకపోయింది. ఆ సమయంలో కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టడానికి మొదట కాస్త సంకోచించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో తప్పక సాయం కావాలని సందేశం పంపింది. ఆ మెసేజ్ చూసిన వెంటనే ఎవరూ ఊహించని విధంగా సమంతే మొదటి వ్యక్తిగా స్పందించింది. ఇంట్లో మరెవరినీ నిద్ర లేపకుండా, కనీసం తన సోదరుడు రాజ్‌కు కూడా చెప్పకుండా, అర్ధరాత్రి అని కూడా చూడకుండా సమంతే స్వయంగా శీతల్ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో అదనపు దుప్పట్లు దొరకకపోవడంతో, సమంత ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెద్దపెద్ద టవళ్లను తీసుకువచ్చి శీతల్‌కు చలి పెట్టకుండా చుట్టింది. అవసరమైన మందులు, తాగునీరు అందించి దగ్గరుండి సపర్యలు చేసింది. శీతల్‌ను మరింతగా కదిలించిన విషయం ఏమిటంటే, ఆ రాత్రంతా సమంత అస్సలు నిద్రపోలేదు. పెళ్లి హడావుడి ఇప్పుడిప్పుడే ముగియడం, చుట్టూ ఎన్నో పనులు ఉన్నప్పటికీ, కేవలం కొన్ని గంటల్లోనే సమంత ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయినప్పటికీ, తన ఆరోగ్యం కంటే అత్తగారింటి ఆడపడుచు ఆరోగ్యమే ముఖ్యమని భావించి సామ్ రాత్రంతా మేల్కొనే ఉంది. మరుసటి రోజు ఉదయం శీతల్ కోలుకుని షూటింగ్ సెట్‌కు వెళ్లి చూసేసరికి, సమంత చీరకట్టులో ఎంతో అలవోకగా సొంతంగా స్టంట్స్ చేస్తూ కనిపించింది. రాత్రంతా నిద్రలేదనే అలసట ఎక్కడా మొహంపై కనిపించకుండా, కెమెరా ముందుకు రాగానే ఎంతో ఏకాగ్రతతో, చిరునవ్వుతో నటిస్తున్న సమంతని చూసి శీతల్ ఆశ్చర్యపోయాను. Also read:  Allu arjun: నా దేవుడు ఆయనే.. అల్లు అర్జున్ రిలీజ్ చేసిన వీడియో వైరల్ షూటింగ్ విరామంలో సమంత శీతల్‌ను చూడగానే, సినిమా గురించి కాకుండా 'ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది?' అని ఎంతో ఆరాటంగా అడిగింది. ఒక మనిషి అలసిపోయినప్పుడు కూడా ఇతరులపై చూపే ఈ కరుణే ఆమె అసలైన శక్తని శీతల్ కొనియాడారు. వెండితెరపై 'మా ఇంటి బంగారం' సినిమా చూడటానికి ముందే, తాను నిజమైన 'బంగారం' లాంటి మనసున్న సమంతను కలిశానని శీతల్ ఎమోషనల్ అయ్యారు.  
  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)తన అప్ కమింగ్ మూవీ 'రాకా'(Raaka)తో అభిమానులకి, ప్రేక్షకులకి మరో సారి ఐ ఫీస్ట్ అనుభూతిని కలిగించాలనే పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం రాకా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. అల్లు అర్జున్ త్రిబుల్ రోల్స్ లో కనిపిస్తున్నాడనే టాక్ కూడా ఉంది.  ఈ రోజు  ఫాదర్స్ డే.  దీంతో ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే సంబరాలు అంబరాన్ని తాకుతున్న వేళ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి, ప్రముఖ అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌పై ఉన్న ప్రేమాభిమానాలని వ్యక్తం చేస్తూ అల్లు అరవింద్‌తో గడిపిన కొన్ని అపురూపమైన, అరుదైన క్షణాలతో కూడిన ఒక ప్రత్యేక వీడియోని షేర్ చెయ్యడంతో పాటు ఒక అద్భుతమైన ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్ట్‌కి   జోడించిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. "నాకు మా నాన్నే దేవుడు. నేను కంటితో చూడగలిగే, చెవులతో వినగలిగే, నోటితో మాట్లాడగలిగే మరియు చేతితో తాకగలిగే ఏకైక దేవుడు ఆయనే. నా జీవితంలో ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు అన్నీ ప్రసాదించింది ఆయనే. నా ప్రియమైన నాన్నకి ,ప్రపంచంలోని ప్రతి ఒక్క స్వీట్ నాన్నకి  హ్యాపీ ఫాదర్స్ డే" అంటూ అల్లు అర్జున్ రాసుకొచ్చిన భావోద్వేగపూరితమైన మాటలు తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని కళ్లకు కట్టాయి. Also read: మ్యాజిక్ రిపీట్ అవుతుందా!.. మన శంకర వరప్రసాద్ గారుని దాటుతాడా! ఈ భావోద్వేగ పోస్ట్‌లో మరో విశేషం ఏమిటంటే, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారి అద్భుతమైన స్వరంతో కూడిన ప్రవచన వీడియోని బ్యాక్‌గ్రౌండ్‌లో ఉపయోగించడం. తండ్రి గొప్పతనాన్ని వివరించే చాగంటి గారి ప్రవచనం ఈ వీడియోకు మరింత గాంభీర్యాన్ని, ఎమోషనల్ టచ్‌ తెచ్చిపెట్టింది.   
మొన్న 18 వ తారీఖున విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్ రామ్ ల మూవీ అధికారకంగా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో అంచనాలు స్థాయి ఒక రేంజ్ లో ఉన్నాయి. మన శంకర వరప్రసాద్ తో 300 కోట్ల క్లబ్ లోకి చేరిన అనిల్ రావిపూడి ఇప్పుడు వెంకీ, కళ్యాణ్ రామ్ తో కూడా ఆ రేంజ్ కలెక్షన్స్ అందుకుంటాడా అనే చర్చ అభిమానులు, సినీ సర్కిల్స్ లో జరుగుతుంది. మరి మూవీ విశేషాలేంటో చూద్దాం. ఈ  చిత్రం కోసం అనిల్ రావిపూడి ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథను సిద్ధం చేశారు. వెంకటేశ్‌తో అనిల్ రావిపూడికి ఇది ఐదో సినిమా (F2, F3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు తర్వాత). అలాగే తొలి చిత్రం పటాస్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కల్యాణ్ రామ్‌తో చేస్తున్న రెండో సినిమా. దీంతో తన మార్క్  క్లీన్ హ్యూమర్, బలమైన ఎమోషన్స్, మరియు పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా అనిల్ రావిపూడి కథని డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది.   కాస్టింగ్ పరంగా కూడా మేకర్స్ చాలా కేర్ తీసుకున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన కథానాయికగా నటిస్తుండగా, యంగ్ అండ్ బ్యూటిఫుల్ కృతి శెట్టి కల్యాణ్ రామ్ జోడీగా నటిస్తోంది. ఈ విలక్షణమైన కాంబినేషన్ వెండితెరపై సరికొత్త కలర్‌ఫుల్ వైబ్‌ను తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు నేషనల్ అవార్డ్ గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్‌గా అనిల్ రావిపూడి, జి.వి. ప్రకాష్ కలిసి చేసిన ఒక ఫన్నీ అనౌన్స్‌మెంట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. Also read: Prakash Raj: ప్రకాష్ రాజ్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. సినీ వర్గాల్లో సంచలనం షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తుండగా, జీ స్టూడియోస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ప్రేక్షకులకు అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే.. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ అధికారికంగా డేట్ లాక్ చేశారు. అనిల్ రావిపూడికి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసివచ్చే సీజన్ కావడంతో, ఈ మల్టీస్టారర్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.     
  ఎనీ క్యారక్టర్ తీసుకోండి సదరు క్యారక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసి చెడుగుడు ఆడుకునే  లెజండ్రీ యాక్టర్ ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ నుంచి వచ్చిన గత చిత్రాలని ఓజి, డెకాయిట్ లే ఒక ఉదాహరణ. అలాంటి  ప్రకాష్ రాజ్‌చట్టపరమైన నిబంధనలని ఉల్లంఘించాడనే ఆరోపణలతో  బెంగళూరు కోర్టు  నాన్-   బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసి షాక్ ఇచ్చింది. ఈ పరిణామం ఒక్కసారిగా సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అసలు ప్రకాష్ రాజ్ లాంటి ఒక సీనియర్ నటుడిపై బెయిల్ రాని విధంగా అరెస్ట్ వారెంట్ రావడానికి గల కారణాలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వివాదం అంతా ఓటర్ ఐడీ కార్డుల చుట్టూ తిరుగుతోంది. ప్రకాష్ రాజ్ చట్టవిరుద్ధంగా ఒకే పేరుతో నాలుగు వేర్వేరు ఓటర్ ఐడీ కార్డులను కలిగి ఉన్నారని బెంగళూరుకు చెందిన దిలీప్ కుమార్ అనే వ్యక్తి కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఒక భారతీయ పౌరుడిగా కేవలం ఒకే చోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలి. కానీ, ప్రకాష్ రాజ్ కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు సహా 4 వేర్వేరు ప్రాంతాలలో ఓటర్ గుర్తింపు కార్డులు పొందారనేది ప్రధాన ఆరోపణ. దీనిని తీవ్రమైన ఎన్నికల నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తూ బెంగళూరులోని 48వ ACJM కోర్టు (అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు) ఈ కేసును విచారణని   స్వీకరించింది. Also read: ఫ్యామిలీ ఆఫర్ ప్రకటించిన సింగ్ గీతం టీం.. టికెట్ ధరలు ఎంత తగ్గాయో తెలుసా! చట్టం ముందు అందరూ సమానులే అన్నట్టుగా కోర్టు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు ప్రకాష్ రాజ్‌కు సమన్లు జారీ చేసింది. స్వయంగా విచారణకు హాజరై తన వివరణ ఇచ్చుకోవాలని ఆదేశించింది. అయినప్పటికీ, బిజీ షెడ్యూల్స్ వల్లో లేదా ఇతర కారణాల వల్లో ఆయన కోర్టు విచారణకు హాజరు కాలేదు. కోర్టు ఆదేశాలని  ఉల్లంఘించడంతో, ఆ తర్వాత వరుసగా రెండుసార్లు  వారెంట్లు జారీ అయ్యాయి. అయినా కూడా నటుడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, న్యాయస్థానం ఈ విషయాన్ని మరింత తీవ్రంగా పరిగణించింది. తాజాగా మూడోసారి కూడా ఆయనపై కఠినమైన నాన్  బెయిల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేస్తూ, తదుపరి విచారణకు ఆయన్ను కోర్టు ముందు హాజరుపరచాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.    
  విభిన్న కథ, కథనంతో కూడిన చిత్రాల లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(Singeetham Srinivasa Rao)తన మార్క్ మాయాజాలంతో 'సింగ్ గీతం' (sing geetham)అనే మూవీతో థియేటర్స్ లో తిష్ట వేసిన విషయం తెలిసిందే. కల్కి దర్శకుడు  నాగ్ అశ్విన్ నిర్మాణ భాగస్వామ్యంలో వైజయంతీ మూవీస్ సమర్పణలో  తెరకెక్కగా ప్రేక్షకులకి  సరికొత్త అనుభూతికి గురి చేస్తుంది థియేటర్లలో లభిస్తున్న అద్భుతమైన రెస్పాన్స్, పాజిటివ్ టాక్ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రేక్షకులకి  ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. ముఖ్యంగా సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ మ్యూజికల్ విజువల్ వండర్‌ని  థియేటర్లలో చూసి ఆనందించాలనే ఉద్దేశంతో తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలని  భారీగా తగ్గించారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతంలోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లలో  200 గా ఉన్న సినిమా టికెట్ ధరని 175 కి తగ్గిస్తూ  అధికారిక ప్రకటన విడుదల చేశారు.  Also read: Mouneesha chowdary: మూవీ ఆఫర్ చేసి బాడీ కొలతలు అడిగాడు.. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ భాగోతం   ఈ క్రేజీ ప్రాజెకి  టాలీవుడ్ నుండి కూడా ఊహించని స్థాయిలో సపోర్ట్ లభిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించగా, తాజాగా గ్లోబల్ స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్  తన పూర్తి సపోర్ట్ అందిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేశారు. ప్రభాస్ ఇచ్చిన ఈ పాజిటివ్ ఎండార్స్‌మెంట్ మరియు తాజాగా ప్రకటించిన టికెట్ ధరల తగ్గింపు ఆఫర్ ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని  థియేటర్ల వైపు పరుగులు పెట్టించేలా చేస్తోంది. అయాన్ ఖాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి కీ రోల్స్ పోషించగా దేవిశ్రీప్రసాద్ దర్శకుడు.  
  సినీ పరిశ్రమలో అవకాశాల పేరుతో అమ్మాయిలను లోబరుచుకునేందుకు, కొందరు ప్రయత్నిస్తారనే అపవాదు ఎప్పటి నుంచో ఉంది. ఇండస్ట్రీలో ఉండే ఈ చీకటి కోణాన్ని, కాస్టింగ్ కౌచ్ చేదు అనుభవాలను ఇప్పటికే పలువురు యంగ్ హీరోయిన్లు, నటీమణులు ధైర్యంగా బయటపెట్టారు. ఇప్పుడు ఇదే బాటలో మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మౌనీషా చౌదరి(Mouneesha chowdary) టాలీవుడ్‌లో తనకు ఎదురైన ఒక షాకింగ్ అనుభవాన్ని పంచుకుని సంచలనం సృష్టించింది. అమెరికాలో నివసిస్తూ మోడలింగ్‌ రంగంలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌనీషా చౌదరి, రీసెంట్‌గా ఇండియాకు వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ నిర్వహించిన టాక్ షోలో ఆమె పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత విషయాలతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా హోస్ట్ ఆమెను ప్రశ్నిస్తూ, "మీకు తెలుగులో సినిమా ఆఫర్స్ వచ్చాయా?" అని అడిగారు. దానికి మౌనీషా సమాధానమిస్తూ ఆఫర్లు వచ్చిన మాట నిజమే. కానీ కొన్ని చేదు కారణాల వల్ల తిరస్కరించాను. ఒక దర్శకుడు సినిమా ఆఫర్ ఇస్తానని చెప్పి, ఆడిషన్స్ పేరుతో శరీర కొలతలు అడిగాడు. అసలు ఒక నటిగా ప్రతిభని నిరూపించుకోవడానికి నటన వచ్చా రాదా అని అడగాలి కానీ, బాడీ  కొలతలు అడగడం ఏంటి? నటన రాకపోతే నేరుగా ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోమనాలి తప్ప ఇలాంటి డిమాండ్లు చేయడం కరెక్ట్ కాదు. ఆ చేదు అనుభవం మిగిల్చిన భయంతోనే సినిమాలకి  దూరంగా ఉన్నాను. Also read: Toxic: టాక్సిక్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారకంగా ప్రకటించిన యష్  నన్ను కొలతలు అడిగిన వ్యక్తి, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక పెద్ద స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో వందల కోట్ల బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడని పేర్కొనడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్‌సేన్‌ కొత్త సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మౌనీషాను సంప్రదించారట. కానీ పాత భయాల వల్లే తాను ఆ క్రేజీ ప్రాజెక్ట్‌కు కూడా నో చెప్పానని మౌనీషా చౌదరి స్పష్టం చేసింది.    
  ఇప్పుడు యష్(Yash)అభిమానులందరు 'ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే అనే సాంగ్ పాడుకుంటూ మస్త్ జోష్ లో ఉన్నారు. ఎందుకంటే  'టాక్సిక్'(Toxic)విడుదలపై వాళ్ళల్లో ఉన్న సస్పెన్స్, ఉత్కంఠత కి తెరపడింది. గత కొన్ని నెలలుగా వరుస వాయిదాలతో అభిమానులను తీవ్ర నిరీక్షణకు గురిచేసిన ఈ పాన్-ఇండియా చిత్రం, ఇప్పుడు సరికొత్త విడుదల తేదీని అధికారికంగా ఖరారు చేసుకుంది. ఫాదర్స్ డే సందర్భంగా ఈ రోజు  యష్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా 'నీ తండ్రిని గౌరవించు.. టాక్సిక్ ఆగస్టు 26, 2026 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది" అని  ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందంతో ఉన్నారు. ఈ సరికొత్త పోస్టర్‌లో యష్ రాయ, టికెట్ అనే విభిన్నమైన లుక్స్‌లో తండ్రీకొడుకులుగా రెండు పవర్‌ఫుల్ రోల్స్ లో కనిపించి కనువిందు చేశారు. మొదట మార్చి 19న విడుదల చేసి రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' చిత్రంతో పోటీ పడేలా ప్లాన్ చేశారు. అయితే, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య తలెత్తిన అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) యుద్ధ వాతావరణం కారణంగా ఓవర్సీస్ పంపిణీ దెబ్బతినే అవకాశం ఉండటంతో మేకర్స్ వెనక్కి తగ్గారు. జూన్ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కానీ సినిమా కంటెంట్‌ను సినిమాకాన్ ఈవెంట్‌లో అంతర్జాతీయ బయ్యర్లకి  ప్రదర్శించినప్పుడు వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చూసి, దీనిని మరింత భారీ స్థాయిలో అంతర్జాతీయంగా విడుదల చేయాలని  భావించారు. ఇందుకోసం డిస్ట్రిబ్యూషన్ డీల్స్ కుదుర్చుకోవడానికి మరింత సమయం పడుతుండటంతో మేకప్స్ జూన్ విడుదలని  వాయిదా వేయాల్సి వచ్చింది. Also read: Prabhas: చంచల్‌గూడ జైలులో ప్రభాస్.. హైప్ తో పోతే ఎవరిదీ బాధ్యత ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఇప్పుడు 2026 ఆగస్టు 26 న  ఫైనల్ రిలీజ్ డేట్‌గా లాక్ చేశారు. ఈ సరికొత్త బుధవారం విడుదల తేదీ సినిమాకి  భారీ ప్లస్ కానుంది. ఎందుకంటే ఆ సమయంలో వరలక్ష్మి వ్రతం, ఓనం, ఈద్ మరియు రక్షాబంధన్ వంటి వరుస పండుగల సెలవులు ఉండటంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. 'కేజీఎఫ్ 2' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు 4 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం యష్ చేస్తున్న చిత్రం కావడంతో  అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  ఈ భారీ యాక్షన్ ఫాంటసీ డ్రామాకు జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా, యష్ కూడా కథా రచనలో భాగస్వామిగా ఉండటంతో పాటు ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణతో కలిసి యష్ స్వయంగా నిర్మించాడు. కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా కీ రోల్స్.  
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)కట్ అవుట్ కి ఉన్న క్రేజ్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఏ హీరో కూడా చేయని విధంగా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సదరు చిత్రాలన్నీ సెట్స్ పైనే ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకరి సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న 'స్పిరిట్' ఒకటి. ఈ మూవీపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకాయి. బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం షేక్ చేసిన 'యానిమల్' బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత సందీప్ వంగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ మూవీ  అప్‌డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ హై-వోల్టేజ్ క్రైమ్ డ్రామా షూటింగ్ తెలంగాణలో అత్యంత వేగంగా, నాన్‌స్టాప్‌గా దూసుకుపోతోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం మేకర్స్  దాదాపు రెండు నెలల పాటు సాగే ఒక పవర్‌ఫుల్ లాంగ్ షెడ్యూల్‌ని  ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ షెడ్యూల్ కోసం చిత్రబృందం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలుని  వేదికగా ఎంచుకుంది. ఈ రోజు జైలు పరిసరాల్లో ప్రభాస్‌పై కొన్ని కీలకమైన, అత్యంత ఇంటెన్స్ సీన్లని  చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్  పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు. జైలు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే అతిపెద్ద హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఎండను సైతం లెక్కచేయకుండా గ్ ప్రభాస్ ఈ షూటింగ్‌లో పాల్గొనడం విశేషం. ఇప్పటికే కొంపల్లి, అజీజ్‌నగర్, కోటి ఉమెన్స్ కాలేజీతో పాటు బాలానగర్‌లోని ప్రముఖ 40 ఏళ్ల నాటి ఐకానిక్ సింగిల్ స్క్రీన్ 'విమల్ థియేటర్'లో కీలక షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ వస్తున్నారనే విషయం లీక్ అవ్వడంతో వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. క్రౌడ్ కంట్రోల్ కోసం భారీ ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు స్థానిక పోలీసులను కూడా రంగంలోకి దించాల్సి వచ్చింది. ఇప్పుడు చంచల్‌గూడ జైలు వద్ద కూడా ప్రభాస్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు మరియు ట్రాఫిక్ నియంత్రణలు చేపట్టారు. షూటింగ్ లొకేషన్ నుండి ఒక క్రేజీ షాడో పిక్ కూడా లీకై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. Also read: Rhea kapoor: అనిల్ కపూర్ కుమార్తె డైమండ్ ఇయర్ రింగ్స్ చోరీ.. చేసింది ఎవరో తెలిస్తే షాక్ గ్యారంటీ  ఈ చిత్రంలో ప్రభాస్ సరసన 'యానిమల్' ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా చేస్తుండగా బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ పవర్‌ఫుల్ విలన్ రోల్ లో చేస్తున్నాడు.హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ ని అందిస్తుండగా  టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. 2027 మార్చి 5వ రిలీజ్ డేట్ .    
రియా కపూర్.. బాలీవుడ్ సీనియర్ అండ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కుమార్తె.. ప్రముఖ ఫిల్మ్ మేకర్, ఫ్యాషన్ స్టైలిస్ట్  అయిన  రియా కపూర్ టీమ్‌లో జరిగిన ఒక భారీ చోరీ ఉదంతం ఇప్పుడు ఇండస్ట్రీ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్ కోసం రియా కపూర్ ముంబైలోని ప్రముఖ జ్యువెలర్స్ నుండి  1.35 కోట్ల విలువైన వజ్రాల మరియు పచ్చల (ఎమరాల్డ్) బంగారు చెవి జుమ్మీలు అద్దెకి తీసుకుంది. విమాన ప్రయాణంలో ఆమె హ్యాండ్‌బ్యాగ్ నుండి   నగలు మాయమవ్వడం బాలీవుడ్ వర్గాల్లో పెను షాక్‌కి  గురిచేసింది.  ఈవెంట్‌లో పాల్గొనేందుకు రియా కపూర్ తన వ్యక్తిగత స్టాఫ్, స్టైలింగ్ టీమ్‌తో కలిసి పయనమయ్యారు. ఈ ఈవెంట్ కోసం ముంబైలోని ప్రముఖ మెహతా జ్యువెలర్స్ నుండి రూ. 66 లక్షల విలువైన ఎమరాల్డ్ స్టోన్ డైమండ్ గోల్డ్ ఈరింగ్స్, అలాగే ప్రఖ్యాత గోయెంకా జ్యువెలర్స్ నుండి రూ. 69 లక్షల విలువైన జాంబియన్ ఎమరాల్డ్ స్టోన్ గోల్డ్ బోర్డర్డ్ ఈరింగ్స్‌ను ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్నారు. ఈ రెండు అత్యంత ఖరీదైన జుమ్మీల బాక్సులను రియా కపూర్ వద్ద గత 7 సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తున్న మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ తన పర్సనల్ హ్యాండ్‌బ్యాగ్‌లో భద్రపరుచుకున్నారు. హోటల్ రూమ్‌లోకి వెళ్లిన తర్వాత మెట్ గాలా ట్రయల్స్ కోసం మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ తన హ్యాండ్‌బ్యాగ్ తెరిచి, మరో టీమ్ మెంబర్ షిరీన్‌కు ఇచ్చేందుకు జ్యువెలరీ బాక్సులను బయటకు తీశారు. అయితే ఆ బాక్సులను తెరిచి చూడగానే అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్. ఆ రెండు జ్యువెలరీ బాక్సులు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి! రూ. 1.35 కోట్ల విలువైన ఆ రెండు జంటల వజ్రాల జుమ్మీలు అందులో లేవు. Also read: Kiran abbavaram: కిరణ్ అబ్బవరం స్పీచ్ వైరల్ న్యూయార్క్‌లో ఉండగానే ఈ దొంగతనం గుర్తించినప్పటికీ, టీమ్ అంతా ముంబై తిరిగి వచ్చిన తర్వాతే దీనిపై అధికారికంగా పోలీసులకి  ఫిర్యాదు చేశారు. మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ ఫిర్యాదు మేరకు ముంబైలోని సహార్ పోలీస్ స్టేషన్ అధికారులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 303(2) కింద దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఇంతకీ ఈ భారీ చోరీ ఎక్కడ జరిగింది అనే కోణంలో పోలీసులు తలమునకలవుతున్నారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందా? లేక దుబాయ్ లేఓవర్‌లో ఫ్లైట్ మారే సమయంలో జరిగిందా? లేక న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్ మరియు హోటల్ మార్గంలో జరిగిందా? అనే మూడు ప్రధాన అనుమానాస్పద సమయాలపై (టైమ్‌లైన్స్) పోలీసులు ఫోకస్ పెట్టారు. సిసిటివి ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తూ, టీమ్‌తో పాటు ప్రయాణించిన ఇతరుల వివరాలను కూడా వెరిఫై చేస్తున్నారు. సెలబ్రిటీల హై ప్రొఫైల్ ప్రయాణంలో ఇంతటి భారీ మొత్తంలో విలువైన వజ్రాల నగలు మాయమవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనిల్ కపూర్ పెద్ద కుమార్తె సోనమ్ కపూర్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఆలోచన ఒక అవసరానికి ముడివడకుండా ఉన్నంతవరకూ దానికి అర్ధవంతమైన గెలుపు ఉండదు. చాలా మందిలో ఆలోచన అనే ఒక బెరడు, జీవిత సాగరంలో దానికదే తేలిపోతూ ఉంటుంది. లక్ష్యం లేని ఆలోచన ఒక దుర్గుణం. ఆలోచనలను ఆలా తేలిపోనివ్వకూడదు. లక్ష్యం లేని ఆలోచనల వలన చివరకు జరిగేది విధ్వంసమే. ఒక లక్ష్యం లేకుండా జీవించే వారు తేలికగా ఆందోళన, భయం, కష్టాలు నిర్వేదాల ఉచ్చులో పడతారు. ఈ బలహీనతలన్నీ ఖచ్చితంగా జరిగే ఒక పాపపు ప్రణాళికలా  ఓటమికీ, దుఃఖానికీ మరియూ నష్టానికీ దారి తీస్తాయి. ఎందుకంటే శక్తి ఆధారంగా పరిణతి చెందే ఈ విశ్వంలో బలహీనతకి చోటు లేదు. ఒక మనిషి తన హృదయంలో ఒక ఆశయాన్ని కలిగి ఉండి, దానిని చేరుకునేవరకూ పరితపించాలి. ఆ ఆశయాన్ని లేదా లక్ష్యాన్ని తన ఆలోచనల కేంద్రబిందువుగా చేసుకోవాలి. సమయ సందర్భాలను బట్టి, ఆ లక్ష్యం ఆధ్యాత్మిక ఆశయం కావచ్చు, లేదా ప్రాపంచిక విషయం కావచ్చు. అది ఏదైనప్పటికీ తన ఆలోచనాశక్తినంతా దాని మీదే పూర్తిగా లగ్నం చేయాలి. దానినే అతని పరమ విధిగా భావించి వేరే ఇతర వ్యాపకాల పట్ల కోరికల పట్ల, ఊహల పట్ల మనస్సుని పోనివ్వకుండా తదేక దీక్షతో సాధించే వరకూ శ్రమించాలి. ఇదే ఆత్మ నిగ్రహానికి మరియూ నిజమైన ఏకాగ్రతకు రాజమార్గం. ఒక వేళ లక్ష్య సాధనలో మరలా మరలా ఓడిపోయినా (బలహీనతలను అధిగమించేవరకూ ఓటమి ఎలాగూ తప్పదు), వ్యక్తి శీలంలో అభివృద్ధి కనిపిస్తే అది విజమైన విజయానికి ఒక నిదర్శనం, భవిష్యత్తులో సాధించబోయే విజయానికి ఈ ఓటమి ఒక మెట్టులా, ఒక శక్తిలా పనిచేస్తుంది. ఉన్నత లక్ష్యం గురించి ఆదుర్దా వద్దనుకునే వ్యక్తులు చేసేది ఎంత చిన్న పనైనా సరే, దానికి ఏమాత్రం విలువలేదనిపించినా సరే, ఎటువంటి అవకతవకలు లేకుండా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే దాని మీదనే తమ ధ్యాసంతా ఉంచాలి. కేవలం ఈ విధంగానే ఆలోచనలను వృద్ధి చేసుకున్నప్పుడు అవి మరింత శక్తివంతంగా మారి లక్ష్యసాధనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తాయి. శక్తిని వృద్ధి చేసుకునే ఏకైక మార్గం ఎడతెగని కృషి మరియూ సాధన మాత్రమే అని తెలుసుకుని, దానిని నమ్మిన మరుక్షణం, అతి బలహీనమైన వ్యక్తి అయినా సరే కష్టించి పనిచేయడం ప్రారంభిస్తాడు. కృషికి కృషినీ, ఓర్పుకి ఓర్పునీ, శక్తికి శక్తినీ జోడిస్తూ ఉంటే, వ్యక్తి అభివృద్ధి ఇక ఆగదు. అలా ఎదుగుతూ చివరకు ఎంతో దివ్యమైన శక్తిగా మారుతుంది. శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి సహనంతో జాగ్రత్తగా సాధన చేస్తే ఎలా శక్తివంతంగా తయారవుతాడో అలాగే బలహీనమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి సరైన ఆలోచనల వలన మానసికంగా శక్తివంతంగా తయారుకాగలడు. నిర్లక్ష్యాన్ని, బలహీనతనూ దూరంగా ఉంచి, ఒక లక్ష్యం వైపు ఆలోచించడం మొదలుపెట్టడమంటే, ఓటమిని కూడా లక్ష్య సాధనలో ఒక భాగంగా పరిగణించే శక్తివంతులుగా మారడమే. అటువంటి వ్యక్తులు శక్తివంతంగా ఆలోచించి, భయంలేకుండా అడుగు ముందుకేసి, ఎటువంటి పరిస్థితినైనా తమకు అనువుగా మార్చుకుని విజయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యక్తి తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని చేరుకునే మార్గాన్ని మానసికంగా ఎంచుకుని దిక్కులు చూడకుండా ఋజుమార్గంలో పయనించాలి. అనుమానాలను, భయాలనూ పూర్తిగా తుడిచిపెట్టెయ్యాలి.  ఎందుకంటే అవి నాశనానికి కారకాలు, కృషి అనే దారిని మళ్ళించి వ్యక్తిని ప్రభావరహితంగా పనికిమాలినవిధంగా తయారుచేయగలవు. అనుమానం, భయం ఎప్పుడూ ఏదీ సాధించింది లేదు, ఎప్పుడూ సాధించలేవు కూడా. అవి ఎప్పుడూ ఓటమికే దారి తీస్తాయి. అవి చేరిన వెంటనే లక్ష్యం, బలం, శక్తి, సంకల్ప శక్తి అన్నీ పనిచేయడం ఆగిపోతాయి. ఏదైనా పని చేయగలమనే జ్ఞానం నుంచే చేయాలనే సంకల్పం పుట్టుకొస్తుంది. అనుమానం, భయం జ్ఞానానికి బద్ధ శత్రువులు. వాటిని చంపేయకుండా ఇంకా ఉత్సాహపరిచే వారు ప్రతి అడుగులోనూ ఇబ్బందికి గురవుతారు. అనుమానాన్నీ, భయాన్నీ జయించినవాడు ఓటమిని కూడా జయిస్తాడు. అతని ప్రతి ఆలోచన, శక్తితో కూడుకుని ఉంటుంది, అతడు ప్రతి కష్టాన్నీ వివేకంతో మరియూ ధైర్యంతో ఎదుర్కొని జయించగలడు. నిర్భయమైన ఆలోచనకు ఒక నిర్దిష్టమైన లక్ష్యం తోడైతే అది సృజనాత్మక శక్తిగా మారుతుంది. ఈ విషయం తెలిసిన వ్యక్తి ఊగిసలాడే ఆలోచనలతో మరియూ కొట్టుమిట్టాడే వాతావరణంతో ఉండే ఒక బుడగలా కాకుండా, పరిస్థితికి ఉన్నతంగా శక్తివంతంగా మారేదానికి సంసిద్ధమవుతాడు. ఈ విషయం తెలుసుకున్న వ్యక్తి తన మానసిక శక్తులను స్పృహతో మరియూ తెలివితేటలతో సమర్ధవంతంగా వాడుకోగలుగుతాడు.                                  ◆నిశ్శబ్ద.
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు.  వీటి కారణంగానే ఆ తరువాత చాలా బాధపడతారు కూడా. ఈ తప్పుల వల్ల బంధాలు చెడిపోవడం, విచ్చిన్నం కావడం, ఆఖరుకు ఆ బంధం ముగిసిపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రిలేషన్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. అది కొంతమందికి అయినా ఆలోచించే అవకాశాన్ని,  తప్పు జరగకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది.  రిలేషన్ లో ఉండే అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో తెలుసుకుంటే.. తొందరపాటు.. ప్రేమ, సహజీవనం,  పెళ్లి.. ఇలా ఏ బంధంలో అయినా  మహిళలు ఒక కొత్త బంధానికి త్వరగా కట్టుబడిపోతారు. ఏ సంబంధమైనా బలంగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ మహిళలు మాత్రం చాలా తొందరగా ఆ బంధానికి స్టిక్ అయిపోతారు.  అవగాహన లేకుండా జరిగే ఈ తొందరపాటు వల్ల  భవిష్యత్తులో  చాలా సమస్యలు వస్తాయి.  మొదట్లో తాము అనుకున్నట్టు, తరువాత లేదని అనుకోవడం,  పరిస్థితులు విభిన్నంగా మారడం.. ఇలా చాలా విషయాలు ఆ తరువాత బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా సాగుతాయి.  ప్రాధాన్యత.. మహిళలు ఏ సంబంధంలోనైనా చాలా భావోద్వేగంగా ఉంటారు.  తరచుగా తమ అవసరాల కంటే తమ భాగస్వామి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు కారణంగా, సంబంధంలో తమకు తాము ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా మరిచిపోతారు.  ఇధి ఇలాగే కొనసాగితే.. బంధంలో భాగస్వామి తప్ప వారు ఎప్పటికీ కనిపించరు.  సింపుల్ గా చెప్పాలంటే తమను తాము కోల్పోతారు. ఇదే తర్వాత వారి బాధకు కారణం అవుతుంది. ఎమోషనల్ డిపెండింగ్.. చాలా మంది మహిళలు ఎప్పుడూ భావోద్వేగపరంగా తమ  భాగస్వామి మీద ఆధారపడతారు, తమ సంతోషాన్ని, తమకు కావలసిన ఓదార్పును,  తన ఇష్టాలను అన్నింటిని తమ భాగస్వామి ద్వారానే పొందుతారు.  ఇందులో తప్పు లేదు. భాగస్వామి కూడా భావోద్వేగపరంగా అంతే అనుభూతి చెందించే పర్లేదు.. కానీ  భావోద్వేగ మద్దతు కోసం పూర్తిగా  భాగస్వామిపై ఆధారపడటం  తప్పు. ఈ అలవాటు  భాగస్వామిపై ఒత్తిడిని కలిగించి సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎంపిక.. చాలా వరకు మహిళలు సంబంధాలలో తమ సొంత ఇష్టాలను పక్కన పెడతారు. తమ భాగస్వామికి అవి నచ్చవనే కారణంతో వారు తమ అభిరుచులను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం  సంబంధానికి మంచిది కాదు. అది సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు.  ఎవరి కోసమూ  అభిరుచులను, ఇష్టాలను వదులుకోకూడదు. లేకపోతే రేపటి రోజు చెప్పుకోవడానికి ఇష్టం,  చేయడానికి అభిరుచి వంటివి ఏమీ లేకుండా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తుంది.                                              *రూపశ్రీ.
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు. ఈ కారణంగా మధ్యతరగతి, దిగువ తరగతి వారిగానే ఉండిపోతారు తప్ప, ధనవంతుల లిస్ట్ లోకి వెళ్లలేరు.  అయితే దీనంతటికి కారణం ఆ వ్యక్తులే అంటున్నారు ఆర్థిక నిపుణులు,  లైఫ్ స్టైల్ విశ్లేషకులు.  ఇంతకీ మనిషి చేసే తప్పులు మనిషిని ధనవంతుడు కాకుండా ఎలా  ఆపుతాయి.  ధనవంతుడు కావాలంటే ఏం చేయాలి? తెలుసుకుంటే.. మనిషి చేసే తప్పు.. శ్రమ మనిషికి నిజమైన సంపద, కానీ మనిషి చాలా సార్లు శ్రమిస్తాడు కానీ అతనికి సొంతంగా ఎదగడం తెలియదు.  గంధం తీయాలంటే గందపు చెక్కను అరగదీయాలి,  అలాగే ఒక మంచి పూల హారం కావాలంటే పూలను దారంలోకి జొప్పించి అల్లాలి.  ఇవన్నీ వ్యక్తిలో ఓపిక,  శ్రమకు చక్కని నిదర్శనాలు. అలాంటి శ్రమ, ఓపిక ఉన్నప్పుడే.. దేవుడి ముందు నిలబడి దేవుడిని తృప్తిగా ప్రార్థిస్తారు. ఆ భగవంతుడి అనుగ్రహం కూడా పొందగలుగుతారు. అదే విధంగానే.. మనిషి కష్టపడి పనిచేస్తేనే తనకు తాను ఫలితాన్ని పొందగలుగుతాడు. అంతేకానీ కష్టపడకుండా ఇతరుల మీద ఆధారపడి చివరిలో ఫలితం రావాలని అనుకుంటే అది ఆశాజనకంగా ఉండదు. సద్గుణాలు.. మనిషిలో సద్గుణాలు ఉంటే అతను ధనవంతుడు కావడానికి మార్గాలు పదే పదే కలిసి వస్తూనే ఉంటాయి.  పేదరికంలో ఉన్న వ్యక్తికి ఓర్పు ఉంటే గొప్ప అవకాశాలు చూపిస్తుంది.  మాసిపోయిన బట్టలు మంచి నీటితో ఉతికితేనే అవి తెల్లగా మెరుస్తాయి. అలాగే వ్యక్తి మొదట సద్గుణాలు అలవర్చుకున్నప్పుడు అతను  అతను ఆకర్షిస్తాడు.  అతని వ్యక్తిత్వంలో మంచి, చెడు బయటకు ప్రకాశిస్తాయి.  ధనవంతులు కావడం అంటే చెడు గుణాలు కలిగి ఉండటమా లేదా అనేది కాదని కొందరు అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే.. చెడు దారిలో కలిగే ధనం ఎప్పటికీ మనిషిని ఉన్నతంగా ఉంచదు. నిజమైన ధనవంతుడు.. పేదరికంలో ఉన్న వ్యక్తి అసలు పేదవాడిగా  పరిగణించకూడదని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. ఎందుకంటే నిజమైన పేదవాడు డబ్బు లేని వాడు.. జ్ఞానం,  వ్యక్తిత్వం లేనివాడే నిజమైన పేదవాడు అంటాడు ఆచార్య చాణక్యుడు. జ్ఞానం లేని వ్యక్తికి ఎంత సంపద ఉన్నా అతను వ్యర్థ్యం అంటాడు. అవకాశాలు.. మనిషి జీవితంలో అవకాశాలు రావడం లేదని వాపోతుంటాడు. కానీ నిజానికి అవకాశాలను సృష్టించుకునే వాడే ఆర్థికంగా ఎదగగలడని అంటారు. ఎడారిలో అయినా ఇసుకను లోతుగా తవ్వితేనే నీటి చెలమ లభించే అవకాశం ఉంటుంది. అలాగే అవకాశాలే లేవు అనుకున్నప్పుడు వాటిని సృష్టించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే ఫలితం దక్కుతుంది. అపాత్ర దానం.. దానం చేయడం చాలా గొప్ప గుణం. కానీ దానం చేస్తే పుణ్యం వస్తుందనే కారణంతో చేతిలో ఉన్నది అనవసరమైన వ్యక్తులకు దానం చేయడం పేదరికాన్ని కొనితెచ్చుకున్నట్టే. దానం చేయడం ఎంత మంచి కార్యమో.. అర్హత లేని వారికి దానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం లభించకపోగా, ఆర్థికంగా దిగజారిపోతారు.   పొదుపు.. చాలామందికి పొదుపు చేయడం అంటే అవసరాలు మాని మరీ దాచిపెట్టడం అనుకుంటారు. కానీ అవసరాలు మానుకుని దాచిపెట్టే డబ్బే పేదరికానికి కారణం అవుతుంది.                                   *రూపశ్రీ.
పిల్లలు మొబైల్ ఫోన్, ట్యాబ్ లేదా కంప్యూటర్ ఎక్కువగా వాడితే కళ్ళు దెబ్బతింటాయనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే నిజంగా కళ్ళకు హాని కలిగించేది స్క్రీన్ కాదు, దాన్ని ఉపయోగించే విధానమని ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డా. కాసు ప్రసాద్ రెడ్డి వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు, కంటి అలసటను తగ్గించే సులభమైన ఐ ఎక్సర్‌సైజులు, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను వివరించారు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు.  ముఖ్యంగా ఆహారంలో అన్నం, చపాతీకి సమానంగా లేక అంతకంటే ఎక్కువ మొత్తంలో కూరగాయలు ఉండాలని ఆహార నిపుణులు కూడా చెబుతారు. అయితే ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టంట్ ఫుడ్ వినియోగం పెరగడం వల్ల నేటికాలంలో కూరగాయల వినియోగం కూడా తగ్గింది.   కూరగాయలు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం , యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి, ఇవి అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా కూరగాయలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది , బరువును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. అయితే 5 రకాల కూరగాయలు ఉన్నాయి.  ఈ కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  ఈ విషయం చాలా మందికి తెలియదు కూడా.  ఆ కూరగాయలు ఏంటో తెలుసుకుంటే.. పాలకూర.. పాలకూరను పోషకాల నిధిగా పరిగణిస్తారు. దీనిలో ఐరన్ , కాల్షియం, పీచుపదార్థం, విటమిన్లు ఎ, సి , కె సమృద్ధిగా ఉంటాయి. పాలకూర తినడం వల్ల శరీరంలోని రక్తహీనతను తగ్గించి, ఎముకలను బలపరిచి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బ్రోకలి.. బ్రోకలీలో విటమిన్ సి, ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.  బ్రోకలీని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అనేక అవసరమైన పోషకాలు లభిస్తాయి. క్యారెట్లు.. క్యారెట్లలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో విటమిన్ A గా మార్చబడుతుంది. ఇది కంటిచూపును మెరుగుపరచడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి , రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. క్యారెట్లను సలాడ్‌గా, జ్యూస్‌గా లేదా కూరగాయగా తినవచ్చు. క్యాప్సికమ్.. క్యాప్సికమ్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు , అనేక ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి , ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. సొరకాయ.. సొరకాయలో నీరు, పీచుపదార్థం పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరాన్ని తేమగా ఉంచి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. వేసవి కాలంలో సొరకాయను తినడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా బరువు అదుపులో ఉంటుందని కూడా చెబుతారు.                              *రూపశ్రీ
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు. అయితే, ఈ అలవాటు దీర్ఘకాలంలో బరువు పెరగడానికి, జీర్ణ సమస్యలకు , అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, అనారోగ్యకరమైన చిరుతిళ్లకు బదులుగా ఆరోగ్యకరమైన చిరుతిళ్లు  ఎంచుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు  ఆకలిని తీర్చడమే కాకుండా,  శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎనర్జీగా ఉండటానికి , అతిగా తినడాన్ని నివారించడానికి సహాయపడతాయి.  ఎలాంటి చింత లేకుండా  ఆహారంలో చేర్చుకోగల కొన్ని ఆరోగ్యకరమైన చిరుతిళ్ల గురించి తెలుసుకుంటే.. వేయించిన శనగలు.. వేయించిన శనగలు ఆరోగ్యకరమైన చిరుతిళ్లలో మొదటి  స్థానంలో ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ , అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.  వీటిని  తీసుకోవడం వల్ల కడుపు చాలా సేపటి వరకు నిండుగా ఉంటుంది, దీని కారణంగా పదేపదే ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి వేయించిన శనగలు స్నాక్స్ కోసం మంచి ఆప్షన్.   అంతేకాకుండా, ఇవి శరీరానికి శక్తిని అందించడంలో కూడా సహాయపడతాయి. మఖానా.. మఖానా తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగిన చిరుతిండి, ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మఖానాలో  కాల్షియం, మెగ్నీషియం , యాంటీఆక్సిడెంట్ల వంటి పోషకాలు లభిస్తాయి.  లేతగా వేయించిన మఖానా తినడం వల్ల ఆకలిని నియంత్రించుకోవచ్చు , అనారోగ్యకరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి , బరువు అదుపులో ఉంచుకోవడానికి కూడా చాలా మంచిది. తాజా పండ్లు.. పండ్లు సహజంగానే పోషకాల నిధి. ఆపిల్, అరటిపండు, జామ, బొప్పాయి , నారింజ వంటి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతాయి. పండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది , శరీరం చాలా సేపటి వరకు తాజాగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్.. బాదం, వాల్‌నట్స్, పిస్తా , జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ , అనేక విటమిన్లు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ను పరిమిత పరిమాణంలో తీసుకోవడం శరీరానికి శక్తిని అందించి, ఆకలిని కూడా నియంత్రిస్తుంది.  వాల్‌నట్‌లు , బాదం పప్పులు ముఖ్యంగా మెదడు , గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  వీటిని చిరుతిండిగా తినడం ద్వారా జంక్ ఫుడ్ తినే అలవాటును తగ్గించుకోవచ్చు. మొలకలు.. మొలకెత్తిన పెసలు, శనగలు , ఇతర పప్పుధాన్యాలలో ప్రోటీన్, పీచుపదార్థం , విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మొలకెత్తిన తర్వాత వాటిలోని పోషకాల పరిమాణం పెరగడం వల్ల అవి ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి.  మొలకలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరానికి శక్తిని అందిస్తుంది , కండరాల అభివృద్ధికి కూడా సహాయపడుతుంది.  శరీరం ఫిట్ గా ఉండాలని అనుకునే వారికి మొలకలు చాలా మంచివి. వేరుశనగలు.. వేరుశెనగలను పేదల బాదం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే వాటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు , అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వేరుశెనగలను పరిమితంగా తినడం వల్ల ఆకలి తగ్గి, శరీరానికి ఎక్కువసేపు శక్తి లభిస్తుంది. ఇది కండరాలను బలోపేతం చేయడానికి , శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది.                              *రూపశ్రీ.