LATEST NEWS
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతున్న బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ తనయ కవితకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలు కనిపించడం లేదు.  తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై తీర్పును కోర్టు వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు పూర్తికాగా.. గురువారం  తీర్పు వెలువరించనున్నట్లు కోర్టు గత విచారణలో తెలిపింది. అయితే, నేటి ఉదయం మరోమారు తీర్పును వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై ఈ నెల 6న తీర్పు వెలువరిస్తామని జడ్జి వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత జైలుపాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవిత.. తనను సీబీఐ అరెస్టు చేయడంపై న్యాయపోరాటం చేస్తున్నారు.  లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మార్చి 15 న అరెస్టు చేశారు. ఢిల్లీ కోర్టు కస్టడీ విధించడంతో ఆమెను తీహార్ జైలుకు పంపించారు. జైలులో ఉన్న కవితను ఇదే కేసులో ఈ నెల 11న సీబీఐ కూడా అరెస్టు చేసింది. కోర్టు అనుమతితో అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ అరెస్టులపై కోర్టులో కవిత పోరాడుతున్నారు. ఈడీ, సీబీఐ కేసులలో బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
‘అధికారం శాశ్వతం కాదు’... దారిన పోతున్న ఏ దానయ్యని ఆపి ‘అధికారం’ అనే పాయింట్ గురించి అడిగితే ఈ సమాధానమే చెబుతాడు. ఇంత చిన్న లాజికల్ పాయింట్ ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది అధికారులకు అర్థం కావడం లేదు. ఆ అధికారులలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు పలువురు ద్వితీయ, తృతీయ స్థాయి అధికారులు కూడా వున్నారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో వున్న వైసీపీ త్వరలో అధికారం కోల్పోబోతోందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. కానీ, కొంతమంది అధికారులకు మాత్రం ఆ విషయం తెలియడం లేదు.. వైపీపీ శాశ్వతంగా అధికారంలో వుంటుందన్న భ్రమల్లో బతుకుతూ ఆ పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు.  ఐదేళ్ళుగా వైసీపీ సేవలో తరించిన అధికారగణం ఎలక్షన్ కోడ్ అమల్లో వున్న ప్రస్తుత తరుణంలో కూడా నిస్పక్షపాతంగా పనిచేయడానికి మనసు రాక జగన్ ప్రభుత్వం సేవలో పునీతమవుతున్నారు. రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అనే భయం ఎంతమాత్రం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి అధికారులందరూ తెలంగాణ రాష్ట్రంలోని అధికారులను చూసి, వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసి మారాల్సిన అవసరం వుంది. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ తప్పిదాన్ని చేయించిన కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు ఏమంటున్నారు? మాకేమీ సంబంధం లేదని అంటున్నారు. మొన్నటి వరకు అధికారం వెలగబెట్టిన ఇద్దరూ ఇప్పుడు చేతులు ఎత్తేశారు. ఒకవేళ ట్యాపింగ్ జరిగి వుంటే, దానికి సంబంధించిన అధికారులను శిక్షించాలి అంటున్నారు తప్ప.. మేమే ట్యాపింగ్ చేయమన్నాం అని చెప్పడం లేదు. కేసీఆర్ అయితే మరింత దారుణంగా మాట్లాడారు. ప్రభుత్వ అధినేతగా నేను సమాచారం అడుగుతాను. అధికారులు ఏ మార్గంలో సమాచారం తెలుసుకుని తెచ్చి ఇస్తారో నాకు అవసరం లేదు.. నాకు సంబంధం లేదని చెప్పేశారు. అంటే, ట్యాపింగ్ చేయించిన కేసీఆర్, కేటీఆర్ చాలా తెలివిగా తప్పంగా అధికారుల మీదకి నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సీన్ రేపు ఏపీలో కూడా రిపీట్ అవుతుంది. ఇప్పుడు జగన్ మెప్పు కోసం పనిచేస్తే, రేపు అధికారం పోయిన తర్వాత జగన్ కూడా చేతులు దులుపుకుంటాడు.. నాకేం సంబంధం.. అధికారులే బాధ్యులు అనేస్తాడు. అప్పుడు దోషుల్లా నిలబడాల్సింది అధికారులే. ఒక్క ఛాన్స్ అంటే నమ్మి ఓటేసిన ప్రజల్నే మోసం చేసిన వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తి మమ్మల్ని మోసం చేయడులే అనుకోవడం అధికారుల అమాయకత్వం.
ఏడువిడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకూ జరిగిన రెండు విడతల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అనూహ్యంగా వెనుకబడింది. తమ ఎక్స్ పెక్టేషన్స్ కంటే సీట్లు భారీగా తగ్గనున్నాయని బీజేపీ నాయకులే చెబుతున్నారు. తోలి విడతలో 102, రెండో విడతలో 88 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 60 శాతం, రెండో విడతలో 62 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రెండు విడతల ఎన్నికలపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. తీరా పోలింగ్ పూర్తి అయిన తరువాత ఆ ఆశలు ఆవిరయ్యాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. బీజేపీ వెనుకబాటుకు కారణాలేమిటని ఆలోచిస్తే అతి ఆత్మవిశ్వాసం, అహంభావం కారణాలుగా కనిపిస్తాయి.  బీజేపీకి ప్రజాదరణ తగ్గడానికి, లేదా ప్రజావ్యతిరేకత పెల్లుబకడానికి ప్రధాన కారణం మోడీ అహంభావ పూరిత వైఖరిగా పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వస్తామనీ, ఈ సారి తమ సీట్ల సంఖ్య ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలతో కలుపుకుని  400 మార్కు దాటుతుందని మోడీ ఘనంగా ప్రకటించారు. 2004లో వాజపేయి ప్రభుత్వం   భారత్ వెలిగిపోతోంది అన్న నినాదంతో  ఎన్నికలకు వెళ్లి చతికిల పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలలో తొలి రెండు విడతల పోలింగ్ ముగిసిన తరువాత   2004 ఫలితమే పునరావృతమయ్యే పరిస్థితులు కానవస్తున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. ఎన్నికలకు ముందే మోడీ ఈ సారి మరిన్ని కఠోర నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అలాగే హిందూ ఓట్లను ఆకర్షించేందుకు కామన్ సివిల్ కోడ్, ముస్లిం రిజర్వేషన్ల రద్దు, సీఏఏ( ను పక్కాగా అమలు చేస్తామని ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఈ ప్రకటనలు ఒక విధంగా దుస్సాహసంగానే చెప్పాలి. హిందూ ఓట్ల పోలరైజేషన్ కు దేశంలో మత పరమైన చీలకకు కూడా వెనుకాడబోమని మోడీ చెప్పకనే చెప్పారని అంటున్నారు.ఇది కూడా మోడీ సర్కార్ కు ప్రతికూలంగానే మారిందని అంటున్నారు.  ఇక ప్రాంతీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేందుకు మోడీ సర్కార్ గత పదేళ్లుగా అవలంబించిన విధానాల కారణంగా ప్రజలలో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతోంది.   తన ప్రభుత్వ విధానాలతో విభేదించే విపక్ష పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడి,సీబీఐ లను ప్రయోగించి విధేయులుగా మార్చుకోవడానికి మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలను జనం విశ్వసించేలా పరిస్థితులు ఉండటం కూడా బీజేపీ పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమైందన్నది పరిశీలకుల విశ్లేషణ.  బీజేపీ ఆర్థిక, రాజకీయ విధానాలపై విమర్శనాత్మకంగా మాట్లాడే మేధావులను అర్బన్ నక్సలైట్లుగా  ముద్ర వేయడం మధ్య తరగతి వర్గంలో మోడీ సర్కార్ పట్ల విముఖత ఏర్పడేందుకు కారణమైందంటున్నారు. ఇక  రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించించడం కూడా ప్రజాస్వామ్య వాదులలో ఆందోళన రేకెత్తిం చిందని అంటున్నారు. రెండోవిడత పోలింగ్ జరిగి 88 లోక్ సభ స్థానాలలో బీజేపీ మహా అయితే 28 స్థానాలలో విజయం సాధిం చే అవకాశాలు ఉన్నాయనీ, ఈ విడతలో పోటీలో ఉన్న   బీజేపీ సీనియర్ నేతలు అరుణ్ గోవెల్, హేమమాలినీ,రాజీవ్ చంద్రశేఖర్, ఓం బిర్లా, తేజస్వీ సూర్య వంటి వారి విషయంలో ఫలితాలు రాకముందే ఓటమి ఖరారైపోయిందని అంటున్నారు. అదే విధంగా మొదటి విడత  102 స్థానాలకు జరి గిన పోలింగ్ లో బీజేపీ 30 స్థానాలలో విజయం సాధిస్తే గొప్పే అన్న అంచనాలు ఉన్నాయి. రాజపుట్, జాట్, ఠాగూర్ సామాజికవర్గాల పట్ల టికెట్ల విషయంలో బీజేపీ వివక్షా పూరితంగా వ్యవహరించిందన్న ఆగ్రహం ఆయా వర్గాలలో బలంగా కనిపిస్తోంది. రాజస్తాన్ లో వసుంధరా రాజే, మహారాష్ట్ర లో చౌహన్ లను పక్కన పెట్టడం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారిందని అంటున్నారు. యూపీ, రాజ స్థాన్, ఎంపీ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర లలో దళితులు,ఆదివాసీలు ఇండియా కూటమి వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మొదటి నుంచీ బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. మోదీ ఈసారి మోడీ తన అద్భుత వాగ్ధాటితో చేస్తున్న వాగ్దానాలను కూడా ప్రజలు నమ్మేపరిస్థితి లేదంటున్నారు.  నల్లధనం వెలికి తీస్తా నని, అలా విదేశాలలో మగ్గుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకువచ్చి పేదల ఖాతాలలో వేస్తామని మోడీ చెప్పిన మాటల డొల్లతనాన్ని జనం అర్ధం చేసుకున్నారని, ఈ సారి అటువంటి వాగ్దానాలను జనం విశ్వసించే పరిస్థితి లేదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అని గత ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన మోడీ.. రెండో సారి అధకారంలోకి వచ్చిన తరువాత ఆదాయం రెట్టింపు మాట అటుంచి రైతుల కష్టాలను రెట్టింపు చేశారన్న ఆగ్రహం వ్యవసాయ దారులలో తీవ్రంగా ఉందంటున్నారు. అలాగే పెద్ద నోట్ల రద్దు విషయంలో ఆయన అనాలోచిత నిర్ణయం,  సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన వాగ్దానాన్ని విస్మరించడం, కరోనా సమయంలో వలస కూలీల ఆకలి కేకలు,  వంటి మోదీ ప్రభుత్వ వైఫల్యాలు ఈ ఎన్నికలలో ప్రభావం చూపనున్నాయని అంటున్నారు.   ఇక చివరి క్షణంలో  హిందూత్వ అంశాన్ని మోదీ తన ఆఖరి ఆయుధంగా ప్రయోగించి లబ్ధి పొందాలని చూస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకా శాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతూ.. నల్లమల అభయారణ్యంలో కొండగుట్టల మధ్య శ్రీశైల భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి ఆలయం వెలసి ఉంది. ఈ ఆలయానికి నిరంతరం భక్తులు స్వామి వారి దర్శనానికి అధికంగా వస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాక, ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇలా వచ్చే భక్తులు ఇప్పటి నుండి ఈ నిబంధన పాటించి సహకరించాలని ఆలయ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ ఆలయానికి ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు తీసుకువచ్చారో.. ఇక జరిమానాలు తప్పవు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ నిబంధన పాటించక పోతే చర్యలు తీసుకోనున్నారు ఆలయ అధికారులు. అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం అధికారులు సిద్దం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైల క్షేత్రం పరిధిలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చింది. నిన్నటి నుంచి అంటే మే ఒకటో తేదీ నుంచి అధికారులు ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని బ్యాన్ చేశారు.  పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్‌ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవస్థానం బోర్డు ఆదేశంతో పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగారు. చెక్‌పోస్టు పరిసరాల్లో పడి ఉన్న ప్లాస్టిక్‌ బాటిళ్లు, కవర్లతోపాటు చెత్తను తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రపరుస్తున్నారు.  అలాగే దైవ దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్లాస్టిక్‌ బాటిళ్లను ఎవరూ క్షేత్ర పరిధిలోకి తీసుకురాకుండా కట్టుదిట్టంగా ప్లాక్టిక్ బ్యాన్ ను అమలు చేస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ఆలయ అధికారులు, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే స్థానిక వ్యాపారులు, హోటల్‌ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, అటవీ జంతువుల సంరక్షణ కోసం ప్లాస్టిక్‌ మంచినీటి సీసాలకు బదులుగా గాజు సీసాలనే విక్రయించాలని స్పష్టం చేశారు. అలాగే మట్టి, స్టీల్‌, రాగితో తయారైన బాటిళ్లను కూడా విక్రయించవచ్చని సూచించారు. అలాగే ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా కాగితపు కవర్లు, గుడ్డ సంచులు, జూట్‌ బ్యాగులు ఉపయోగించాలన్నారు. ప్లాస్టిక్‌ నిషేధంపై దేవస్థానానికి సహకరించాలని స్థానికులు, వ్యాపారులు, హోటళ్లు, సత్రాల నిర్వాహకులను కోరారు.
ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక్క ఎంపీ స్థానం.. అది కూడా మెదక్ ఎంపీ స్థానం దక్కుతుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వున్నాయి. అయితే బిఆర్ఎస్ వర్గాల్లో ఆ ఒక్క స్థానం ఆశలను కూడా జర్నలిస్టు రవిప్రకాష్ తుస్సుమనిపించారు. బుధవారం నాడు ఆయన తన సొంత మీడియా ఛానల్లో తెలంగాణలో ఏయే పార్టీకి ఎన్నెన్ని స్థానాలు వస్తాయన్న అంశాలతో కూడిన కథనాన్ని ప్రసారం చేశారు. ఇందులో ఆయన తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు, భారతీయ జనతాపార్టీకి 8 స్థానాలు దక్కుతాయని, ఎం.ఐ.ఎం. హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందని తేల్చారు. బిఆర్ఎస్‌కి ఒక్క స్థానం కూడా దక్కదని బాంబు పేల్చారు. ఇలాంటి దయనీయ పరిస్థితిలో ఏ పార్టీ వున్నా ఎవరైనా సరే  ‘అయ్యోపాపం’ అంటారు. బిఆర్ఎస్ విషయంలో మాత్రం ఎవరూ ఆ మాట అనడం లేదు.. అంత పాతాళానికి పడిపోయింది బిఆర్ఎస్ పార్టీ.
ALSO ON TELUGUONE N E W S
  ఎన్నికల హడావుడి కారణంగా ఈ వేసవిలో టాప్ స్టార్ల సినిమాల సందడి లేదు. ఎక్కువగా చిన్న, మీడియం రేంజ్ సినిమాలే విడుదలవుతున్నాయి. ఈవారం నాలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. రేపు(మే 3న) 'ఆ ఒక్కటీ అడక్కు', 'ప్రసన్న వదనం', 'శబరి', 'బాక్' సినిమాలు విడుదలవుతున్నాయి. ఆ ఒక్కటీ అడక్కు (Aa Okkati Adakku): ఇటీవల సీరియస్ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్.. మళ్ళీ తన మార్క్ వినోదాన్ని పంచడానికి 'ఆ ఒక్కటీ అడక్కు' చిత్రంతో వస్తున్నాడు. మల్లి అంకం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. ఒకప్పుడు కామెడీ హీరోగా ఎన్నో విజయాలు అందుకున్న నరేష్.. మళ్ళీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడేమో చూడాలి. ప్రసన్న వదనం (Prasanna Vadanam): విభిన్న సినిమాలతో అలరిస్తూ హీరోగా తనదైన ముద్ర వేస్తున్న సుహాస్.. ఇప్పుడు 'ప్రసన్న వదనం' అనే సినిమాతో రాబోతున్నాడు. ఇందులో ఫేస్ బ్లైండ్ నెస్ తో బాధపడే యువకుడి పాత్రలో సుహాస్ కనిపించనున్నాడు. ఈ థ్రిల్లర్ సినిమాకి అర్జున్ దర్శకుడు. శబరి (Sabari): వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో అనిల్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'శబరి'. ఒక బిడ్డ కోసం తల్లి పడే తపనను సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. మరి ఈ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ వరలక్ష్మికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. బాక్ (Baak): సూపర్ హిట్ హారర్ కామెడీ ఫ్రాంచైజ్ 'అరణ్మనై' నుంచి వస్తున్న నాలుగో చిత్రమిది. సుందర్. సి ప్రధాన పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించిన ఈ తమిళ సినిమాలో తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.  
It is known that Telugu film directors association planned to celebrate of Director's Day at the LB Stadium in Hyderabad on May 4. Now, this mega event is postponed. The Police Law and Order department canceled the permission due to newly scheduled activities involving prominent leaders. For the past 5 years, this program has been held annually on the 4th of May to commemorate the birthday of director Dasari Narayana Rao. Telugu Film Directors Association President, Veera Shankar, has informed that the new date for this event will be announced within two days. The director's invited major actors from Telugu industry to attend the event on May 4th and they've also planned skits and multiple events at the celebrations. Now, everything will be cancelled and it is unknown that heroes will attend this event or not.
The Teaser for 'Pushpa: The Rule' was released to a rousing response on Icon Star Allu Arjun's birthday last month. The goosebumps-inducing Teaser has now been followed by what can only be described as an unparalleled anthem of sorts. The song 'Pushpa Pushpa', which is the first single from the most-awaited pan-Indian action drama, is a scintillating Devi Sri Prasad composition.  The pulsating song is the best one to come out from Tollywood, elevating the ruler-like attitude of Pushpa Raj, the beloved character created by genius filmmaker Sukumar. Revolving around the hero's characterization, it builds on the hero-centric song from the first part. The song is laced with Bunny's flawless hook step that is smartly placed thrice in a space of a few minutes. Each time, the impeccable dancer shows a variation. In recent times, this is the most likeable mass number.  The musical promotions for 'Pushpa 2' have taken off on a robust note with the release of the song written by Chandrabose in Telugu. The celebrated lyricist uses this phrase to effect: 'Nuvvu gaddam atta savaristhunte desham daddarille'. The concept has been designed by Prem Rakshit, while the dance choreography is by Vijay Polaki and Shrasti Verma. The 'Thaggede Le' mood has been carried so well. Raqueeb Alam (Hindi), Viveka (Tamil), Varadaraj Chikkaballapura (Kannada), Siju Thuravoor (Malayalam), and Srijato Bandopadhyay (Bengali) have penned the song. Director Sukumar's signature is evident in the way the song is staged. He has proved that he knows the mass pulse like only a few directors in the country. Mythri Movie Makers and Sukumar Writings are producing the movie. Cinematographer Mireslow Kuba Brozek is going to deliver his best work ever. S Rama Krishna and N Monica's production design complements the world-building. The film will be released on a grand scale worldwide in multiple languages on August 15, 2024.
ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా అందరి నోటా ఒకటే మాట. హరిహర వీరమల్లు ( hari hara veera mallu)టీజర్ సూపర్ గా ఉందని. ఇక ఫ్యాన్స్  గురించి చెప్పక్కర్లేదు. సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. పైగా  షూటింగ్ త్వరగా కంప్లీట్ అవ్వాలని తమ ఇష్ట దైవాన్ని కూడా ప్రార్థిస్తున్నారు. పవన్ కళ్యాణ్ (pawan kalyan) ఫ్యాన్స్ కదా.. అలాగే ఉంటుంది మరి. పైగా  వీరమల్లు అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాని వెతకడం కూడా ప్రారంభించారు. దీంతో పవన్ కి సంబంధించిన న్యూస్ ఒకటి వాళ్ళల్లో సరికొత్త ఆలోచనలని కలిగిస్తుంది    పవన్ ప్రస్తుతం  రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం (pithapuram) అసెంబ్లీ  స్థానం  నుంచి ఎంఎల్ఏ గా పోటీ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు.  ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలలో భాగంగా రాత్రి పడుకునే ముందు ఎలాంటి సినిమాలు చూసేందుకు ఇష్టపడతారని పవన్ ని  అడిగారు.దాంతో  హారర్ సినిమా చూసేందుకు ప్రిఫర్ చేస్తానని చెప్పుకొచ్చాడు. పవన్ చెప్పిన  ఈ సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇక  ఇప్పుడు  ఫ్యాన్స్ అయితే పవన్  హర్రర్ జోనర్ లో సినిమా చెయ్యాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.  మరి ఫ్యూచర్ లో పవన్ ఆ దిశగా అడుగులేస్తాడేమో చూడాలి. లేదా తన డైరెక్షన్ లో అయినా చేస్తాడో చూడాలి. ఎందుకంటే పవన్ కేవలం హీరోనే కాదు. ఒక రచయిత,దర్శకుడు కూడా. జానీ సినిమాకి తనే దర్శకుడు.మూవీ  ఫలితం ఎలా ఉన్నా డైరెక్టర్ గా  పవన్ కి మంచి పేరు వచ్చింది.హరి హర వీర మల్లు లో పేదల పక్షాన పోరాడే ఒక  పోరాట యోదుడుగా  కనిపించనున్నాడు. పవన్ నటిస్తున్న మొట్టమొదటి  పీరియాడిక్ జోనర్ మూవీ ఇది. ఓజి,ఉస్తాద్ భగత్ సింగ్  లు కూడా లైన్ లో ఉన్నాయి  
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) ల సినీ కెరీర్ దాదాపు ఒకే సమయంలో స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ రెండో చిత్రం 'స్టూడెంట్ నెం.1'తో రాజమౌళి దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో 'సింహాద్రి', 'యమదొంగ', 'ఆర్ఆర్ఆర్' వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. రెండు దశాబ్దాలుగా వీరి మధ్య మంచి అనుబంధం ఉంది. టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరిగా ఎన్టీఆర్-రాజమౌళి ద్వయాన్ని భావిస్తారు అందరూ. అలాంటిది ఎన్టీఆర్ నా ఫ్రెండ్ కాదంటూ రాజమౌళి తాజాగా చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. బుధవారం సాయంత్రం జరిగిన 'కృష్ణమ్మ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రాజమౌళి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయనకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. సినీ పరిశ్రమలో మీకున్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని హోస్ట్ అడగగా.. రాజమౌళి సమాధానం చెప్పకముందే.. "ఎన్టీఆర్.. ఎన్టీఆర్" అంటూ ఆడియన్స్ అరిచారు. అయితే రాజమౌళి మాత్రం.. ఎన్టీఆర్ తనకి ఫ్రెండ్ కాదని, తమ్ముడు లాంటి వాడని అన్నాడు. అలాగే 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ, 'ఈగ' నిర్మాత సాయి కొర్రపాటి తన బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు.
సక్సెస్‌ఫుల్ చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తు వస్తున్న నటుడు అభినవ్ గోమటం. హీరోగా కూడా లాంచ్ అయ్యాడు. ఇటీవల  మై డియర్ దొంగ అంటు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం  ఆహా లో విడుదలైన ఈ మూవీ ఘన విజయం దిశగా దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.  హీరో అభినవ్ గోమటం మాట్లాడుతూ..మా సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. అలాగే ప్రేక్షకుల  ముందుకు తీసుకెళ్తున్న మీడియాకి కూడా  థాంక్స్.  ప్రొడక్షన్, నటీనటులు, ఆహా  ఈ మూడు టీం లని  సమన్వయం చేసుకొని మూవీ  చేయడం జరిగింది.  శాలిని చాలా చక్కగా కథ రాసింది. అలాగే  చాలా కష్టపడింది కూడా .   వంశీ, శర్వాతో లు కూడా చాలా చక్కగా నటించారు. మనోజ్ చక్కని విజువల్స్ ఇచ్చాడు.ముఖ్యంగా  అల్లు అరవింద్ గారికి మా ప్రాజక్ట్ చాలా బాగా నచ్చింది. మంచి  సినిమాలో భాగం కావడం కూడా  చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. అలాగే ఈ మూవీలో హీరోయిన్  గా చేసిన శాలినీ కూడా మాట్లాడింది. పైగా మై డియర్ దొంగ స్టోరీ ని కూడా తనే అందించింది.  మా మూవీకి  వచ్చిన రివ్యూస్, రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇంత గొప్ప రెస్పాన్స్ ని  అసలు ఊహించలేదు. ఆహ టీంకి ధన్యవాదాలు. ఇది బ్యూటీఫుల్ టీం వర్క్. పాషన్ తో ఒక కంటెంట్ ని హానెస్ట్ గా నమ్మి చేస్తే విజయం వస్తుందని చెప్పడాని  మా మూవీనే  ఒక ఉదాహరణ. ఇంత గొప్ప రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకి  ధన్యవాదాలు. దర్శకుడు కథని గొప్పగా అర్ధం చేసుకొని చాలా  గొప్పగా ప్రజెంట్ చేశారు. ఈ సినిమా రాయడం నాలో గొప్ప ఆత్మ విశ్వాసాన్ని నింపింది. అభినవ్ కి ధన్యవాదాలు. దివ్యతో పాటు ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా గురించి మరింత మందికి చెప్పాలని మీడియాని కోరుతున్నాను. అందరికీ రికమెండ్ చేసే చిత్రమిది. అందరూ ఎంజాయ్ చేస్తారు. మీ అందరి సపోర్ట్ మరింతగా వుండాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.   దర్శకుడు బీఎస్ సర్వాంగ కుమార్ కూడా మాట్లాడారు.  మై డియర్ దొంగ  మా అందరికీ గొప్ప అవకాశాలు తెచ్చిపెట్టింది. అభినవ్ గారు చాలా సపోర్ట్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్ ఝాన్సీ గారు చాలా మంచి లుక్ తీసుకొచ్చారు. అజయ్ అర్సాడా మ్యూజిక్ తో సినిమాని ఎలివేట్ చేసుకుంటూ వచ్చారు. శాలిని మంచి రచయిత, నటి. వీళ్లందరి తో  కలిసి  మళ్ళీ వర్క్ చేయాలని ఉందని తెలిపాడు. అభినవ్,  శాలినీ తో పాటు  దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించాడు.ఆయన కూడా సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందని తెలిపాడు. మూవీ  చూడని ప్రేక్షకులు తప్పకుండా చూడండి. పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి అని కోరాడు. మై డియర్ దొంగ ని ఇప్పటివరకు ఇరవై ఐదు లక్షల మంది చూసారని  ఆహా మార్కెటింగ్ హెడ్ రాజశేఖర్ తెలిపాడు. అలాగే  మై డియర్ దొంగ రిటర్న్స్ కోసం ఎదురుచుస్తున్నాం  అని తెలిపారు.ఇంకా ఈ మూవీ లో నటించిన  నిఖిల్, స్నేహాల్, వంశీ లు కూడా మూవీ విజయం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు  
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) నుంచి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తప్పుకోనున్నారని, ఆయన స్థానంలో మరొకరు ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయనున్నారని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ దర్శకులలో క్రిష్ ఒకరు. అలాంటి ఆయన తన ప్రైమ్ టైంలో 'హరి హర వీరమల్లు' కోసం ఏకంగా మూడేళ్లకు పైగా కేటాయించారు. అయినప్పటికీ ఇంకా సినిమా పూర్తి కాలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అవ్వడం మరియు ఇతర కారణాల వల్ల.. ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి మొదలైంది. పవన్ ఎమ్మెల్యేగా గెలిచి, ఏపీ పాలిటిక్స్ లో కీలకంగా మారి, మరింత బిజీ అయ్యే అవకాశముంది. అదే జరిగితే 'హరి హర వీరమల్లు' మరింత ఆలస్యమవుతుంది. అందుకే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తన ఇతర కమిట్ మెంట్స్ ని పూర్తి చేయాలని క్రిష్ నిర్ణయించుకున్నాడట. క్రిష్ స్థానంలో మరో కొత్త దర్శకుడు మిగతా చిత్రాన్ని పూర్తి చేయనున్నాడు. తాజాగా 'హరి హర వీరమల్లు' టీజర్ విడుదలైంది. టీజర్ విడుదల సందర్భంగా నిర్మాతలు కీలక ప్రకటన చేశారు. క్రిష్ పర్యవేక్షణలో నిర్మాత ఎ.ఎం. రత్నం కుమారుడు, దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ చిత్రం యొక్క మిగిలిన షూటింగ్ ను, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. జ్యోతి కృష్ణ "ఎనక్కు 20 ఉనక్కు 18", "నీ మనసు నాకు తెలుసు", "ఆక్సిజన్" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అలాగే "నట్పుక్కాగ", "పడయప్ప" వంటి తమిళ బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పని చేశాడు. 
ఇండియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన హీరోల్లో పవన్ కళ్యాణ్ (pawan kalyan) కూడా ఒకడు. ఆయన  సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే సందడే వేరు.ఇక ఫ్యాన్స్  కి అయితే  మూవీకి సంబంధించిన చిన్న వార్త కూడా పండుగ వాతారణాన్ని తెప్పిస్తుంది. అంతటి ఇమేజ్ కలిగిన  పవన్  తన కెరీర్‌లోనే తొలిసారి  హరిహరవీరమల్లు (Hari hara veera mallu) అనే పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్‌ మూవీలో చేస్తున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్ తో  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీ నుంచి టీజర్ వచ్చింది. రావడమే కాదు  విత్ ఇన్ సెకన్లలో సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది. అలాగే ఎవరు ఊహించని ఒక న్యూస్ ని కూడా చెప్పింది  17వ శతాబ్దంలోని  పేదలు దోపిడీకి గురవుతు, ధనవంతులు మరింతగా  అభివృద్ధి చెందుతుంటారు.ఈ క్రమంలో పేద వారి తరుపున పోరాడే ఒక  యోధుడుగా పవన్ హరిహర వీరమల్లు లో కనిపించబోతున్నాడని  టీజర్ చూస్తే అర్ధమవుతుంది. తన పాత్ర తీరుని తెలుపుతూ బలమైన సంభాషణలు, ఆ సంభాషణలకు తగ్గట్టుగా అద్భుతమైన దృశ్యాలతో  రూపొందించిన టీజర్ ప్రతి ఒక్కరిని కట్టి పడేస్తుంది. కళ్ళు చెదిరే విజువల్స్, భారీ సెట్లు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతం.  రేపు  థియేటర్లలో  ప్రేక్షకుడు  ఒక గొప్ప అనుభూతిని అర్ధం అవుతుంది  మొఘల్ చక్రవర్తిగా ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ కనిపించారు. ఆహార్యం, అభినయంలో ఆ ఇద్దరూ కూడా తమ  పాత్రలకు వన్నె తెచ్చారు. ఇవే కాకుండా  రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే ఎన్నో  అంశాలు టీజర్ లో ఉన్నాయి. చట్టవిరుద్ధంగా నైనా, న్యాయం కోసం పేదల పక్షాన  పోరాటం అనేది స్ఫూర్తిని కలిగిస్తోంది. ఇక  వీరమల్లుగా వెండితెరపై పవన్ కళ్యాణ్  చేసే సాహసాలని  చూడటం కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే వీరమల్లు రెండు భాగాలుగా రానుంది. ఈ విషయాన్ని మేకర్స్  టీజర్ లోనే  ప్రకటించారు. హరిహరవీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో రానుంది. ధర్మం కోసం యుద్ధం  అనేది ఉపశీర్షిక. నిధి అగర్వాల్, బాబీ డియోల్, సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  జ్ఞానశేఖర్ వి.ఎస్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. చార్మినార్, ఎర్రకోట మరియు మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్‌లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. 2024 చివర్లో విడుదల చేయనున్నట్టుగా కూడా  ప్రకటించారు. ఇక  నిర్మాత ఏ ఎం రత్నం  ఒక కీలక ప్రకటన చేసాడు. ప్రముఖ  రచయిత, దర్శకుడు అయిన  జ్యోతి కృష్ణ (jyothi krishna) హరి హర వీర మల్లు  యొక్క  మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను  పూర్తి చేస్తాడు. కాకపోతే  క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలోనే  చేస్తాడు.  ఆయన గతంలో  నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన్  వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. తమిళంలోను దర్శకుడుగా రచయితగా ఎన్నో హిట్ సినిమాలని అందించాడు. శామ్ కౌశల్, టోడర్ లాజరోవ్ జుజీ, రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్ ల వంటి ఉద్దండులు ఫైట్స్ ని అందిస్తున్నారు. 
విశ్వక్ సేన్( vishwak sen)..వరుస హిట్స్ తో  తెలుగు చిత్ర పరిశ్రమలో తన కంటు ఒక స్థానాన్ని సంపాదించాడు. ఎంతో మంది ప్రేక్షకులకి అభిమాన హీరో గా కూడా మారాడు.లేటెస్ట్ గా  గామితో హిట్ కొట్టాడు. హిట్ కొట్టడమే కాదు తనలో పాన్ ఇండియా నటుడు ఉన్నాడని కూడా నిరూపించాడు.లేటెస్ట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of godavari)తో రాబోతున్నాడు. రిలీజ్ కి ముందే    ఆ మూవీ ఒక  రికార్డు క్రియేట్  చేసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ నెల 17 న వరల్డ్ వైడ్ గా ల్యాండ్ అవ్వనుంది. ఈ మేరకు ప్రమోషన్స్ కూడ ఊపందుకున్నాయి. పక్కా  విలేజ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్యూర్ మాస్ మూవీ.  ఇటీవల రిలీజ్ అయిన టీజర్ తో ఆ విషయం అందరకి అర్ధమయ్యింది.దీంతో  మూవీ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ ఓటిటి హక్కులుని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.  పద్నాలుగు  కోట్ల రూపాయల రికార్డు ధరకి సదరు సంస్థ దక్కించుకుంది. విశ్వక్  మూవీ అంత పెద్ద మొత్తానికి అమ్ముడవ్వడం ఇదే మొదటి సారి. పైగా విశ్వక్ సేన్ సినీ కెరీర్ టాప్ రేంజ్ లో కొనసాగతు ఉందనడానికి ఉదాహరణగా కూడా నిలిచింది సితార ఎంటర్ టైనేమెంట్స్ పై సూర్యదేవర నాగ వంశీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని  నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా  టిల్లు స్క్వేర్  తో ఆ సంస్థ మంచి  హిట్ కొట్టింది. డి జె టిల్లు ఫేమ్  నేహా శెట్టి  విశ్వక్ తో  జతకట్టింది.  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి  ఒక కీలక పాత్రలో నటించింది. నాజర్, సాయికుమార్, గోపరాజు రమణ ముఖ్య పాత్రల్లో నటించగా కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు  
'Oo Manchi Ghost' (OMG) is an upcoming hilarious comedy horror that is coming under the banner of Markset Networks. Directed by Shankar Marthand with comedian Vennela Kishore, Nandita Swetha, Shakalaka Shankar, Navami Gayak, Naveen Neni, Rajath Raghav, and comedian Raghu Babu playing key roles, the film is produced by Dr. Abinika Inabathuni. Anup Rubens has scored the music and the previously released lyrical video of the first song was well-received.  Meanwhile, the makers unveiled a concept poster and a glimpse of the movie. The poster sees the lead actors with fear on their faces, as they see a ghost. We can see a shadow of a ghost in the background that also has a haunted house. Shakalaka Shankar appeared as an exorciser. The glimpse shows all the main characters, apart from introducing the premise of the movie. It is evident through the glimpse that the movie besides horror and thriller elements will have a good dose of comedy. Anup Rubens’ background score amplifies the impact. The makers are confident that the film will entertain the audience throughout the runtime. I Andrew is taking care of the cinematography, while Supriya is the art director. The editing is by M.R. Varma.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది! ఒంటి మీద ఎప్పుడూ ఏదో ఒక గాయం కనిపిస్తూనే ఉంటుంది. వాళ్లని చూసి పాపం దురదృష్టవంతులు అని మిగతావారు జాలిపడుతూ ఉంటారు. కానీ తరచూ ఏదో ఒక ప్రమాదానికి లోనవ్వడానికీ మన వ్యక్తిత్వానికీ సంబంధం ఉండవచ్చని ఊహిస్తున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇలాంటి మనస్తత్వాన్ని ‘Accident Prone Psychology’ అంటున్నారు. అదేమిటో తెలుసుకుంటే మనకీ కాస్త ఉపయోగపడుతుందేమో... ఓ ఆలోచన! తరచూ కొంతమందే ఎందుకు దెబ్బలు తగిలించుకుంటారన్న అనుమానం 19వ శతాబ్ది మొదటిలోనే వచ్చింది. దీని మీద మరిన్ని పరిశోధనలు చేసిన గ్రీన్‌వుడ్ వంటి నిపుణులు మన ఆలోచనా విధానానికీ, ప్రమాదాలకి సంబంధం ఉండే అవకాశం ఉందని తేల్చారు. ఆ తరువాత వచ్చిన ఎన్నో పరిశోధనల్లో ఓ 20 శాతం మంది వ్యక్తులే అధికశాతం ప్రమాదాలకి కారణం అవుతూ ఉంటారనీ... మొత్తంగా మన చుట్టూ జరిగే ప్రమాదాలలో దాదాపు 75 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే ఏర్పడతాయని చెబుతూ వస్తున్నాయి. ఈ పరిశోధనల శాస్త్రీయతని చాలామంది కొట్టిపారేసినా, వీటిలో స్పృశించిన చాలా అంశాలు చాలా తార్కికమైనవే! అందుకనే కొన్ని భీమా కంపెనీలు ప్రమాదభీమాను చెల్లించేటప్పుడు, ఉత్పాదక సంస్థలు తమ ఉద్యోగులను హెచ్చరించేందుకూ ఈ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి.   ప్రమాదాన్ని ఆశించే వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువగా ఉన్నారు, దూకుడుగా ఉండేవారు, నిరంతరం కోపంతో రగిలిపోయేవారు... పోయి పోయి ఏదో ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారని తేలింది. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు కూడా ప్రమాదాలకి త్వరగా లోనవుతారని చాలా పరిశోధనలు వెల్లడించాయి. ఏదన్నా కుటుంబంలో ఒకరి తరువాత ఒకరు ప్రమాదానికి లోనవడం మనం గమనిస్తూ ఉంటాము. ఆ కుటుంబానికి ఏదో శాపం తగిలిందనో, వారి గ్రహస్థితి బాగోలేదనో అనుకుంటాము. నిజానికి ఇలా కుటుంబంలో ఎవరన్నా ఒకరు తీవ్ర ప్రమాదానికి లోనైతే, ఆ ప్రభావం ఇతరుల మనసు మీద కూడా పడుతుందనీ... ఆ ఒత్తిడిలో మిగతా సభ్యులు కూడా ప్రమాదానికి లోనయ్యే అవకాశం 20 శాతం ఉంటుందనీ ఓ పరిశోధన తేల్చింది. ఎవరైతే ఇతరుల సలహాలను, సహాయాన్నీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారో... వారు త్వరగా ప్రమాదాలకు లోనుకారని తేలింది. అహంకారం లేకుండా, తొందరపడకుండా ఉండేవారికి ప్రమాదాలు కూడా ఆమడదూరంలో ఉంటాయని 2001లో జరిగిన ఒక పరిశోధన రుజువు చేసింది. అంటే నిదానమే ప్రధానం, నోరు మంచిదైతే ఊరు మంచిది లాంటి సామెతలు యాంత్రిక జీవితానికి కూడా వర్తిస్తాయన్నమాట.     ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తొందరపాటు, దూకుడు, ద్వేషం, అహంకారం... మనిషి విచక్షణను దెబ్బతీస్తాయి. తన మీద తనకి ఉండాల్సిన నియంత్రణను ప్రభావితం చేస్తాయి. దాంతో ఒక అనర్థం జరగడం సహజమే! కానీ ఇలాంటివారు కేవలం తమకి మాత్రమే ప్రమాదాన్ని తెచ్చుకుంటే ఫర్వాలేదు. అలా కాకుండా ఈ ‘Accident Prone Psychology’ ఉన్నవారు ఏ విమానాన్నో నడుపుతుంటే! అందుకే ఈ తరహా వ్యక్తిత్వం గురించి నానాటికీ ప్రచారం పెరుగుతోంది. మీది ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వ్యక్తిత్వమేమో గమనించుకోండి అంటూ కొన్ని వెబ్‌సైట్లు పరీక్షలు పెడుతున్నాయి. మున్ముందు ఉద్యోగులకు కూడా ఇలాంటి పరీక్షలను నిర్వహించి విధుల్లోకి తీసుకునే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు!   - నిర్జర.
ప్రేమ అనేది  ఇప్పట్లో చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ప్రేమ అంటే అబ్బాయిలు మాత్రమే ధైర్యం చేసి చెప్పేది.. అమ్మాయిలకు అంగీకారం ఉంటే తదుపరి వారి బంధం మరో మలుపు తిరిగేది.. కానీ ఇప్పుడు అట్లా కాదు.. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ ప్రేమ విషయంలో బాగా అడ్వాంటేజ్ గా ఉంటున్నారు. అయితే చిక్కల్లా ఒకమ్మాయి తమకు బాగా తెలిసి, తమతో సన్నిహితంగా ఉంటూ తమను లవ్ చేస్తుందా లేదా  అనే విషయం అర్థం కాక జట్టు  పీక్కునే అబ్బాయిల గురించే..   అయితే దీనికి ఈజీగానే చెక్ పెట్టవచ్చు అమ్మాయిలు తమను ప్రేమిస్తున్నారా లేదా అనే విషయాన్ని అబ్బాయిలు ఈ 7 విషయాల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటంటే.. అమ్మాయిలు తమకు ఎంత పని ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా వారి మనసులో ఒక అబ్బాయి పట్ల ప్రేమ ఉంటే వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఫోన్ లో అయినా, మెసేజ్ లో అయినా, వ్యక్తిగతంగా కలవడంలో అయినా తను ప్రేమించిన అబ్బాయిని ఎప్పుడూ లైట్ తీసుకోదు. తను ఇష్టపడుతున్న అబ్బాయితో సన్నిహితంగా ఉండటానికి అమ్మాయిలు అబద్దాలు చెప్తారు. మాట్లాడటానికో, కలసి నడుస్తున్నప్పుడో, పక్కపక్కన కూర్చున్నప్పుడో తాకడం, చెయ్యి పట్టుకోవడం, నవ్వడం, నవ్వించడం వంటివి చేస్తారు. ప్రతి అమ్మాయికి తను ఇష్టపడే అబ్బాయి మరొకరితో సన్నిహితంగా మాట్లాడితే కోపం వస్తుంది. అలాగే అసూయ పడుతుంది. ఒకమ్మాయి తను ఇష్టపడుతున్న అబ్బాయి ఇతర అమ్మాయిలతో మాట్లాడుతుంటే అలాగే ఫీలవుతుంది. కొన్నిసార్లు తను ప్రేమించిన అబ్బాయి  ముందు కోపాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. అమ్మాయి తను ప్రేమిస్తున్న అబ్బాయి కళ్లలోకి చూసి మాట్లాడాలంటే చాలా ఇష్టపడుతుంది. అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్లలోకి చూస్తూ మాట్లాడుతుంటే ఆమెకు ప్రేమ ఉన్నట్టే. అమ్మాయిలు తాము ప్రేమిస్తున్న అబ్బాయిలు అందుబాటులో కాస్త దూరంగా ఉంటే ఇక చూపులన్నీ తను ప్రేమిస్తున్న అబ్బాయి వైపే ఉంచుతుంది. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే.. అమ్మాయి తను ఇష్టపడే అబ్బాయి కదలికలను గమనించడానికి, అతన్ని చూడటానికి ఇష్టపడుతుంది. అబ్బాయికి నచ్చిన పని చేయడానికి, నచ్చిన వస్తువులు, నచ్చిన ఆహారం తీసుకొచ్చి ఇవ్వడానికి అమ్మాయి శ్రద్ద చూపిస్తున్నట్టైతే అది సాధారణ పరిచయం లేదా స్నేహం అనుకోవడానికి వీల్లేదు. ఏ మూలో అమ్మాయికి తప్పకుండా అబ్బాయి మీద ఇష్టముందని అర్థం. అమ్మాయిలు తమకు ఏ చిన్న బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా అబ్బాయితో చెబుతుంటే ఆమెకు అతను చాలా స్పెషలని అర్థం. అంతేకాదు తను ఇష్టపడుతున్న అబ్బాయి పక్కన ఉంటే ఆమె తన బాధలన్నీ మర్చిపోతుంది. అమ్మాయి ఇలా చేస్తుంటే ఆమె ప్రేమిస్తోందనే అర్థం.                                                         *నిశ్శబ్ద.  
  మనసులో ఏదీ దాచుకోలేకపోవడం చాలా మంది బలహీనత. బాధ అయినా, సంతోషం అయినా, దుఃఖం అయినా తనకు తెలిసిన వారికో లేక స్నేహితులు, ఆత్మీయులకో ఏదో ఒక  సందర్భంలో చెప్పుకుని తీరతారు. అయితే ఇలా చెప్పడం తప్పని కాదు కానీ.. కొన్ని విషయాలు మాత్రం ఇతరులతో అస్సలు చెప్పడం మంచిది కాదని అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేష నిపుణులు. ఏ వ్యక్తి అయినా ఇతరులతో అస్సలు చెప్పకూడని 5 విషయాలేంటో తెలుసుకుని వాటిని పాటిస్తే  వారి జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది. ఆ అయిదు విషయాలేంటో తెలుసుకుంటే.. ఆర్థిక స్థితి.. ఉద్యోగం చేసేవారు అయినా వ్యాపారం చేసేవారు అయినా పొదుపు చేసేవారు అయినా తమ ఆర్థిక స్థితి గురించి మరో వ్యక్తికి చెప్పడం మంచిది కాదు. ప్రతి వ్యక్తి ఆర్థిక స్థితి సామాజిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. డబ్బును చూసి మనుషులు మసలుకునే కాలమిది. ఎవరిదగ్గరైనా డబ్బు ఎక్కువ ఉందని తెలిసినా, ఎక్కువ సంపాదిస్తున్నారని తెలిసినా అప్పు కోసం, సహాయాల కోసం సులువుగా చుట్టూ చేరతారు. పక్క మనిషి గురించి పట్టించుకోని ఈ కాలంలో ఆర్థిక సహాయాలు చెయ్యడం అంత మంచిది కాదు. అందుకే ఆర్థిక స్థితి గురించి ఎవరికీ చెప్పకూడదు. ఇంటి సమస్యలు.. ప్రతి ఇంట్లోనూ సమస్యలుంటాయి. ఇంటి సమస్యలను ఇంటి వారితో చర్చించి వాటిని చక్కబెట్టుకోవడం శ్రేయస్కరం. అలా కాకుండా సలహాలు, సూచనలు ఇస్తారనో లేదా మనసులో భారం దించుకోవాలనే ఆలోచనతోనో ఇంటి సమస్యలు బయటి వారికి, తెలిసిన వారికి చెప్పడం మంచిది కాదు. రిలేషన్ గొడవలు..  నిజానికి తోబుట్టువులు, చుట్టాలు, బాగా దగ్గరి వారైనా సరే.. భార్యాభర్తల సమస్యలలో జోక్యం చేసుకోవడం, తీర్పులు ఇవ్వడం మంచిది కాదు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవలు, సమస్యలు వారే పరిష్కరించుకుంటే వారిద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం పెరుగుతుంది. ఏ సమస్యకైనా ప్రతి వ్యక్తి స్పందన వేరుగా ఉంటుంది. అనుభవాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి సమస్యలను బయటకు, లేదా ఇతరుల దగ్గరకు తీసుకెళ్లడం, చెప్పడం మంచిది కాదు. మూడవ వ్యక్తికి భార్యాభర్తల సమస్యలు చెబితే వారు దాన్ని ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు. బలహీనతలు.. ప్రతి వ్యక్తిలోనూ బలాలతో పాటూ బలహీనతలు ఉంటాయి. చాలామంది వ్యక్తులలో లోపాలు, బలహీనతలను వెతుకుతారు. వాటిని వేలెత్తి చూపిస్తారు. విమర్శిస్తారు. అందుకే వ్యక్తులలో బలాలు బయటపెట్టినా సమస్య లేదు కానీ బలహీనతల గురించి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరికీ చెప్పకూడదు. ప్రణాళికలు.. పెద్ద పెద్ద విషయాల గురించి నిర్ణయాలు తీసుకునే ముందు, పెద్ద ప్రణాళికలు వేసుకునేటప్పుడు వాటిని మరొక వ్యక్తితో చెప్పకూడదు. జీవితంలో ఇంకా ఎదిగే దశలో వేసుకునే ప్రణాళికలు ఇతరులతో చెప్పకూడదు.                                                      *రూపశ్రీ.  
భారతీయ వంటిల్లు గొప్ప ఔషదాల వేదిక. వంటింట్లో ఉండే ప్రతి మసాలా దినుసు, వంటకు ఉపయోగించే ప్రతి వస్తువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే అయ్యుంటాయి. వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం.. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి దానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇక  రెస్టారెంట్లో భోజనానికి వెళితే చివరగా వాళ్లు ఇచ్చే సొంపు  లేదా సోపు కూడా చాలా ఇళ్లలో ఉంటుంది. భోజనం తరువాత పొట్ట సమస్యలు ఏవీ ఉండకూడదని, ఆహారం బాగా జీర్ణం కావాలని సోపు ఇస్తుంటారు. అయితే అది స్వీట్ సోపు.. సాధారణంగా ఇళ్లలో ఉండే ప్లెయిన్ సోపు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే దీన్ని ఎప్పుడూ లైట్ తీసుకోరు.. సోపు వంటింటి  దినుసుల మధ్య ఉండే జీలకర్రను పోలి ఉంటుంది.  కానీ దీని సువాసన నుండి రుచి వరకు, ఆరోగ్య ప్రయోజనాల నుండి ధర వరకు అన్నీ వేర్వేరుగానే ఉంటాయి. ఎండలు దంచేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సోపును తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుందని ఆయుర్వేద ఆహార నిపుణులు అంటున్నారు. సోపును వేసవి కాలంలో తీసకుంటే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. సాధారణంగా వేసవికాలంలో బయటి వాతావరణం వల్ల శరీరం కూడా వేడెక్కుతుంది. కానీ ఈ వేడిని సోపు నియంత్రిస్తుంది. సోపులో శీతలీకరణ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇది శరీరాన్ని శాంతపరచడంతో పాటూ హీట్ స్ట్రోక్ నుండి శరీరాన్ని రక్షించడంలో కూడా మెరుగ్గా ఉంటుంది. కేవలం శరీరాన్ని చల్లబరచడం, హీట్ స్ట్రోక్ నుండి రక్షించడమే కాదు.. జీర్ణ లక్షణాలు కూడా సోపులో మెండుగా ఉంటాయి. ఈ కారణంగానే వేసవిలో ఎదురయ్యే జీర్ణ సంబంధ సమస్యలకు సోపు చెక్ పెడుతుంది. సోపును నేరుగా కానీ, సోపును నీటిలో ఉడికించి టీలా కానీ తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. సోపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే టాక్సిన్లను తగ్గించడంలోనూ, బయటకు పంపడంలోనూ సహాయపడతాయి. శరీరాన్ని శుద్ది చేసుకోవాలని అనుకునేవారు సోపు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. సోపు టీని ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు.  ఇది శరీరంలోనూ, పొట్ట భాగంలోనూ పేరుకున్న అదనపు కొవ్వులను కరిగించడంలో సహాయపడుతుంది.                                                  *రూపశ్రీ.
మనిషి శరీరానికి ఆహారమే గొప్ప ఔషదం. సరైన ఆహారం తిన్నా, సరైన వేళకు తిన్నా అది శరీరానికి చాలా బాగా పనిచేస్తుంది. గ్రామాల లైఫ్ స్టైల్ గమనిస్తే సాయంత్రం దీపాలు పెట్టే వేళకు వంట పూర్తీ చేయడం,  ఆ తరువాత రాత్రి 7 గంటల లోపే భోజనం చేయడం జరుగుతుంది. ఆ తరువాత ఇరుగు పొరుగు వారు, కుటుంబ సభ్యులు కాసేపు కబుర్లు చెప్పుకుని 8 నుండి 9 గంటల్లోపు నిద్రపోయేవారు. తర్వాత ఉదయం నాలుగు గంటలకే లేచి పనులు చక్కబెట్టుకునేవారు. గ్రామాలలో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఇది బలమైన కారణం. కానీ ఈ అలవాటు ఇప్పుడెక్కడా కనిపించట్లేదు..  గ్రామాలలో కూడా కాంక్రీటు సొగసులు అద్దుకుని తమ అలవాట్లను కూడా కోల్పోయాయి. అయితే  రాత్రి 7 గంటలలోపే భోజనం చెయ్యడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఒక్కసారి తెలుసుకుంటే... ఆహారం తినడానికి, నిద్రపోవడానికి మధ్య తగినంత సమయం ఉండాలని వైద్యులు చెబుతారు.   ఎందుకంటే తినడానికి నిద్రించడానికి మధ్య  సమయం ఉండచం వల్ల  ఆహారం జీర్ణం కావడానికి అనువుగా ఉంటుంది.  ఆహారం సరిగా జీర్ణమైతే జీర్ణాశయ సమస్యలు ఏమీ ఉండవు. జీర్ణాశయ సమస్యలు  లేకపోతే ఉదర ఆరోగ్యం బాగుంటుంది.  దీంతో నిద్ర కూడా బాగా పడుతుంది. రోజూ రాత్రి 7 గంటలలోపు తినడం అలవాటు చేసుకునే వారికి తరువాత రోజు ఉదయం 8 గంటలలోపు బాగా ఆకలి అవుతుంది. ఉదయం 8 గంటలలోపు అల్పాహారం కానీ లేదా ఇతర ఆహారాలు కానీ ఉదయాన్నే తింటారు. దీని వల్ల ఉదయం ఆహారం ఎగ్గొట్టే అలవాటు తప్పుతుంది. ఆకళి కూడా వేళకు ఠంచనుగా అవుతుంది.   రాత్రి నిద్రపోయే ముందు ఆహారం తినేటప్పుడు అదొక హడావిడి ఉంటుంది. సమయం అయిపోతోందని, తొందరగా నిద్రపోవాలని కంగారు పడేవారు కొందరు ఉంటారు. దీని వల్ల ఆహారాన్ని ఆస్వాదించలేరు. అదే 7 గంటలప్పుడు వాతావరణం బాగుంటుంది. ఆహ్లదకరమైన వాతావరణంలో తినడం వల్ల ఆహారం కూడా శరీరానికి ఒంటబడుతుంది. ఆహారం బాగా జీర్ణం కావాలంటే తిన్న వెంటనే పడుకోకూడదు. 7గంటలలోపు భోజనం చేస్తే పడుకునే లోపు ఏదో ఒక పని చేస్తూ సమయం గడుస్తుంది. దీనివల్ల తిన్న ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది.  కడుపులో గ్యాస్, ఉబ్బరం, జీర్ణసమస్యలు వంటివి ఎదురుకావు. చాలామంది బరువు పెరగడానికి కారణం రాత్రి భోజన వేళలు సరిగా లేకపోవడమే. తిన్న వెంటనే కాసేపు నడక, ఇతర పనులు చేయడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కావడానికి సమయం దొరకడమే కాకుండా  కేలరీలు కూడా బర్న్ అవుతాయి. జీవక్రియ బాగుండటం వల్ల బరువు పెరగే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. ప్రతి వ్యక్తిలో సిర్కాడియన్ రిథమ్ అనే చక్రం ఉంటుంది. ఇది నిద్రా చక్రం నుండి జీవక్రియ వరకు చాలా విధులు సక్రమంగా ఉండేలా చూస్తుంది. రాత్రి 7గంటల లోపు తింటే సిర్కాడియన్ రిథమ్  ఆరోగ్యకరంగా ఉంటుంది.                                                           *నిశ్శబ్ద.
  జీర్ణ ఆరోగ్యం బాగుంటే మొత్తం ఆరోగ్యం అంతా బావుంటుంది. వేసవిలో  వేడి,  తేమతో కూడిన వాతావరణంలో శరీరాలు సులభంగా డీహైడ్రేషన్ కు గురవుతాయి.  ఇది మలబద్ధకం, అతిసారం,  ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి  ఆయుర్వేద చెప్పిన  చిట్కాలను అనుసరించడం అన్ని విధాలా మంచిది. జీర్ణ సమస్యల పరిష్కారానికి ఆయుర్వేదం చెప్పిన చిట్కాలివీ.. ఆహారం మన శరీరానికి ఇంధనం. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది, ఔషదంగా పనిచేస్తుంది. శరీరం  సమతుల్యంగా ఉండటంలో సహాయపడుతుంది.  మంచి ఆహారం తీసుకోవడం సరైన ఫిట్నెస్ మెంటైన్ చేయడానికి మూలం.   వెచ్చని, తాజాగా వండిన,  సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు ఆయుర్వేదంచే ఎక్కువగా సిఫార్సు చేయబడ్డాయి. డైటరీ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలు,  విత్తనాలు అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి మూలికలు,  సుగంధ ద్రవ్యాలు తీసుకోవడం చాలా మంచిది.  ఆయుర్వేదంలో ఉపయోగించే త్రిఫల వంటి మూలికలు జీర్ణక్రియకు,  జీర్ణశయాంతర వ్యవస్థను క్లియర్ చేయడానికి  బాగా ఉపయోగపడతాయి.  మసాలా దినుసులను పోలి ఉండే అల్లం జీర్ణ ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అల్లంను ఆహారంలో చేర్చవచ్చు లేదా తాజా అల్లం టీ వంటివి త్రాగవచ్చు. జీలకర్ర, కొత్తిమీర,  ఫెన్నెల్ టీ, లేదా CCF టీ, జీర్ణక్రియకు,  గ్యాస్,  ఉబ్బరం నుండి ఉపశమనానికి ఉపయోగిస్తారు. పులియబెట్టిన ఆహారాలైన పెరుగు, ఇంట్లో తయారుచేసిన ఊరగాయలు, మజ్జిగ, అన్నం గంజి,  ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు. సరైన జీర్ణక్రియ గట్ బ్యాక్టీరియా  సమతుల్యంగా ఉండటంపై  ఆధారపడి ఉంటుంది. ఇది ప్రోబయోటిక్స్ మద్దతు ఇస్తుంది.  కెఫిన్, స్పైసీ ఫుడ్,  కొన్ని పాల ఉత్పత్తులు కడుపు నొప్పికి కారణం అవుతాయి.  కొన్ని వస్తువులు తీసుకోవడం పరిమితం చేయడం ఉత్తమం. భారీ ఆహారాలు,  వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక కొవ్వు, ప్రాసెస్ చేయబడిన, ప్యాక్ చేయబడిన, నిల్వ చేసిన,  సీసాలలో ఉంచిన ఆహారాలను తగ్గించాలి.  ఎందుకంటే అవి జీర్ణం కావడం కష్టం.  జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. ఒకేసారి ఎక్కువ తినకుండా  రోజంతా చిన్న మొత్తాలలో తినాలి.  ఇది  జీర్ణవ్యవస్థపై  అధిక భారం పడకుండా చేస్తుంది. భోజనం చేస్తున్న సమయంలో  స్పృహతో తినాలి. తినేటప్పుడు గాలి పీల్చుకోకూడదు. ప్రశాంతమైన, రిలాక్స్డ్ వాతావరణంలో తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఆహారాన్ని నెమ్మదిగా,  పూర్తిగా నమలాలి. ఇది ఆహార కణాల విచ్ఛిన్నానికి సహాయపడుతుంది.   రోజంతా తగినంత నీరు త్రాగాలి. నీరు జీర్ణక్రియ,  పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.  అలాగే జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం కదలికలో సహాయపడుతుంది. జీర్ణాశయాన్ని శుభ్రపరచడంలో  గోరువెచ్చని నీరు తాగాలని ఆయుర్వేదం సూచిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి రెగ్యులర్ శారీరక శ్రమ కూడా అవసరం. ఆప్టిమల్ మూవ్మెంట్ థెరపీ ప్రేగు కదలికలను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.  మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొన్ని యోగా భంగిమలు,  శ్వాస వ్యాయామాలు ఉదర అవయవాలను ప్రేరేపిస్తాయి, ఇవి విశ్రాంతిని,  మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. పవనముక్తాసనం (గాలి-ఉపశమన భంగిమ),  భుజంగాసనం (కోబ్రా భంగిమ) వంటి ఆసనాలు సహాయపడతాయి. నాడి శోధన (ప్రత్యామ్నాయ నాసికా శ్వాస) వంటి ప్రాణాయామం కూడా జీర్ణవ్యవస్థను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.  గోరువెచ్చని నువ్వుల నూనెతో సవ్యదిశలో పొత్తికడుపును మసాజ్ చేయడం జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ప్రసరణను మెరుగుపరుస్తుంది.  నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది.  తద్వారా జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. విరేచన (చికిత్సా ప్రక్షాళన),  బస్తీ (ఔషధ ఎనిమా) వంటి పంచకర్మ చికిత్సలు శరీరాన్ని శుభ్రపరచడానికి,  జీర్ణ ఆరోగ్యానికి పరోక్షంగా తోడ్పడే దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు. క్రమం తప్పకుండా తినడం,  నిద్రపోవడం ద్వారా సిర్కాడియన్ చక్రాన్ని నియంత్రణలో ఉంచవచ్చు. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు కీలకం.                                                            *రూపశ్రీ.