LATEST NEWS
స్నేహితులే కదా అని నమ్మాడు.. వాళ్లు ఫోన్ చేసి పిలిస్తే ఏదో మాట్లాడుకుందామని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కానీ అదే అతడి చివరి అడుగైంది. కిందకు వచ్చిన కొద్దిసేపటికే మాటామాటా పెరిగింది. చూస్తుండగానే స్నేహితుల చేతుల్లో కత్తులు బయటకొచ్చాయి. తప్పించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా దారుణంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిపోయిన వసీం చివరకు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్‌లో వసీం అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వసీంకు కొంతమంది స్నేహితులు ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పారు. అనంతరం నలుగురు యువకులు అతడి ఇంటి వద్దకు వెళ్లి కిందకు రావాలని పిలిచారు. స్నేహితులే కావడంతో ఎలాంటి అనుమానం లేకుండా వసీం ఇంటి నుంచి కిందకు వచ్చాడు. అయితే వసీం కిందకు రాగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గంజాయి విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని వసీమే పోలీసులకు చేరవేస్తున్నాడంటూ అతడితో స్నేహితులు వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో నలుగురు యువకులు ఒక్కసారిగా వసీంపై దాడికి దిగారు. ఆ తర్వాత జరిగిన ఘటన మరింత దారుణం. తమ వెంట తెచ్చుకున్న కత్తులను బయటకు తీసిన నిందితులు వసీంపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ దాడి జరగడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిపోయిన వసీంను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు వసీం మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో స్నేహితులే పిలిచి బయటకు తీసుకొచ్చిన యువకుడు.. చివరకు వారి దాడిలోనే ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది. ఈ హత్య వెనుక డ్రగ్స్‌ వ్యవహారమే ప్రధాన కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వసీంతో పాటు హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తులపై గతంలో NDPS కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.  డ్రగ్స్‌ విక్రయాల గురించి వసీం పోలీసులకు సమాచారం అందిస్తున్నాడనే అనుమానంతోనే అతడిపై కక్ష పెంచుకున్నారా? పథకం ప్రకారమే ఫోన్ చేసి ఇంటి నుంచి బయటకు రప్పించి హత్య చేశారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు హత్యకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైనట్లు పోలీసులు గుర్తించారు. ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు.. నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఘటనపై రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్నేహితుల పిలుపు నమ్మి బయటకు వచ్చిన వసీంకు.. అదే పిలుపు చివరి పిలుపుగా మారడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.     [ Rajendranagar Murder, Upparpally Murder, Wasim Murder, Hyderabad Crime, Friends Murder, Knife Attack, Drug Case, NDPS Case, CCTV Footage, Rajendranagar Police, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police, Telugu One, Telugu News ]  
భారతదేశంలో కోట్లాది మంది నిత్యం వినియోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై కొత్తగా ఛార్జీలు విధించాలన్న నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పలు వాణిజ్య, వ్యాపార సంఘాలు అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున 'నో యూపీఐ డే' పాటించాలని నిర్ణయించాయి. ఆ రోజున దేశవ్యాప్తంగా వ్యాపారులు తమ దుకాణాల్లో డిజిటల్ స్కానర్లు, క్యూఆర్ కోడ్‌లు, సౌండ్ బాక్సులకు నల్లటి బట్టలు కట్టి వినూత్న రీతిలో నిరసన తెలపనున్నారు. వ్యాపారులు కస్టమర్ల మధ్య జరిగే లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి నూతన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం రూ.2,000 దాటిన ప్రతి చెల్లింపుపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) రుసుమును చెల్లించాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. అయితే ఒక లావాదేవీపై గరిష్ట పరిమితిని రూ.300గా నిర్ణయించారు. వ్యక్తుల మధ్య జరిగే బదిలీలతో పాటు, నెలకు లక్ష రూపాయల వరకు లావాదేవీలు నిర్వహించే చిన్న స్థాయి వ్యాపారులకు ఈ నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించారు. అయినప్పటికీ, దేశంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో అధిక భాగం రూ.2,000 దాటినవే ఉండటంతో ఇది తమపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుందని వ్యాపారులు వాపోతున్నారు. ప్రభుత్వం డిజిటల్ ఆర్థిక లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న తరుణంలో, వ్యాపార వర్గాలపై ఇలాంటి అదనపు రుసుములు రుద్దడం సరికాదని జాతీయ స్థాయి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. చిన్న వ్యాపారుల కష్టాలను గుర్తించి ప్రభుత్వం ఈ భారాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో పాటు పలు ప్రముఖ పంపిణీదారుల సంఘాలు ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. కొన్ని రంగాల వారికి సంబంధితశాఖలు చర్చలు జరిపి హామీలిచ్చినా, మొత్తంగా కొత్త నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించాయి. అక్టోబర్ 15 గడువు సమీపిస్తున్న తరుణంలో, ప్రభుత్వం  వ్యాపార సంఘాల మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టంభన ఎలాంటి మలుపు తిరుగుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డిజిటల్ పేమెంట్స్ భవిష్యత్తుపై ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.       [ UPI payments stop, No UPI Day October 2, MDR charges on UPI, digital payment news Telugu, merchant discount rate India ]  
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్‌ అయిన మాదాపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన ఓయో హోటల్ యువతి అనుమానాస్పద మృతి ఉదంతం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొత్తలుపులు తెరుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా లేదా అనుమానితుడిగా భావిస్తున్న యువకుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రి నుంచి అకస్మాత్తుగా పరారై, చివరకు తన స్వగ్రామంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. విశాఖపట్నానికి చెందిన షారోన్‌ నిఖితా టోప్నో, అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఇ-మర్రిపాలెంకు చెందిన శ్రీనివాస రవితేజ కొంతకాలంగా పరిచయంతో ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 21వ తేదీన వీరిద్దరూ మాదాపూర్‌లోని సిద్ధిఖీ నగర్‌లో ఉన్న ఒక ఓయో హోటల్‌లోని రూమ్‌ నంబర్ 303లో బస చేయడానికి దిగారు. అయితే, ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ, మంగళవారం తెల్లవారుజామున నిఖిత అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో రవితేజ హోటల్ సిబ్బంది సాయంతో ఆమెను కొండాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.   కానీ, ఆసుపత్రికి చేరుకునేసరికే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చిచెప్పారు. యువతి మరణ వార్త తెలిసిన వెంటనే రవితేజ ఎవరికీ చెప్పకుండా ఆసుపత్రి నుంచి హుటాహుటిన పరారయ్యాడు. దీంతో అప్రమత్తమైన మాదాపూర్ పోలీసులు అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. హోటల్‌లోని గదిని క్లూస్ టీమ్ పరిశీలించగా అక్కడ లభించిన ఆధారాలు మరింత దిగ్భ్రాంతికరించాయి. గది గోడలపై, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు స్పష్టంగా కనిపించాయి. అంతేకాకుండా యువతి ముఖం, తల భాగంలో బలమైన గాయాలు, వాపులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ గదిలో ఖాళీ బీర్, విస్కీ బాటిళ్లు కూడా లభించడంతో ఆ రాత్రి అక్కడ అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మరోవైపు హైదరాబాద్ నుంచి పరారైన రవితేజ నేరుగా తన స్వగ్రామానికి చేరుకున్నాడు. బుధవారం తన ఇంట్లోనే ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తాగి తీవ్ర అస్వస్థతకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు తొలుత అతడిని అగనంపూడి ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కి తరలించారు. ప్రస్తుతం రవితేజ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పరవాడ పోలీసులు వెంటనే మాదాపూర్ పోలీసులకు అధికారికంగా సమాచారం అందించారు.  రవితేజ ఆరోగ్యం కుదుటపడిన వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు మాదాపూర్ పోలీసుల ప్రత్యేక బృందం విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. హోటల్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, ఫోరెన్సిక్ ల్యాబ్ ఆధారాలు, అక్కడి సిబ్బంది మరియు సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. యువతి మృతికి అసలు కారణాలు ఏమిటి, ఆమె శరీరాలపై ఉన్న గాయాలు ఎలా సంభవించాయనే పూర్తి నిజాలు పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చిన తర్వాత మరింత స్పష్టంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.       [ Madhapur OYO hotel case, woman death mystery, Raviteja suicide attempt, Visakhapatnam KGH, Hyderabad crime news, OYO hotel incident, Telugu One, Telugu News ]
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో జరిగే గణేష్ లడ్డూ వేలంపాటలు ప్రతిసారీ దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. తాజాగా నగరంలోని బండ్లగూడ జాగీర్ పరిధిలో ఉన్న విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన లడ్డూ వేలం అంబరాన్ని అంటింది. కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన లడ్డూ వేలంలో స్థానిక నివాసితులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక వేలంపాటలో రికార్డు స్థాయిలో పోటీ నెలకొంది. చివరకు ఈ లడ్డూ ఏకంగా కోటి ఎనభై ఏడు లక్షలకు పైగా ధర పలకడం విశేషం. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి లడ్డూ ధర భారీగా పెరిగింది. గతేడాది ఇదే ప్రాంగణంలో జరిగిన వేలంలో లడ్డూ సుమారు కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. తాజా వేలంలో మరో అరవై లక్షలకు పైగా అదనంగా ధర పలకడంతో నిర్వాహకులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ భారీ వేలం వెనుక ఒక గొప్ప సామాజిక స్పూర్తి దాగి ఉంది. ఈ కమ్యూనిటీకి చెందిన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏటా లడ్డూ వేలం ద్వారా వచ్చే నిధులను పేద విద్యార్థుల చదువులు, వైద్య సాయం, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. వ్యాపార, సేవా రంగాల్లో రాణించే ప్రముఖులు ఈ వేలంలో పాల్గొనడం పరిపాటిగా మారింది. హైదరాబాద్‌లో బాలాపూర్ లడ్డూ వేలానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో, ఇటీవల కాలంలో గేటెడ్ కమ్యూనిటీల్లో జరుగుతున్న ఈ రకమైన వేలాలు కూడా అంతే స్థాయిలో ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి. కేవలం భక్తి భావమే కాకుండా సమాజ సేవకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఇక్కడి నివాసితులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ భారీ మొత్తాన్ని సేకరించడం ద్వారా అనేక మంది అభాగ్యులకు అండగా నిలవవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఎలాంటి పరిపాలనా ఖర్చులు లేకుండా పూర్తిగా స్వచ్ఛందంగా ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వినాయక నిమజ్జనోత్సవ వేళ వెలువడిన ఈ భారీ వేలం వార్త ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. భవిష్యత్తులో ఈ సంప్రదాయం మరింత విస్తరించి, మరిన్ని సేవా కార్యక్రమాలకు ఈ నిధులు బాటలు వేస్తాయని స్థానికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.       [ Hyderabad Ganesh Laddu Auction, Kirti Richmond Villas Laddu Price, Bandlaguda Ganesh Festival, Telangana Vinayaka Chavithi News, TeluguOne News Regional Updates ]  
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే జంక్షన్‌లలో ఒకటైన విజయవాడ పరిసర ప్రాంతంలో ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రైలు ప్రయాణంలో భాగంగా ఒక కోచ్ నుంచి దట్టమైన పొగలు రావడంతో పాటు మంటలు ఎగసిపడ్డాయి. ఈ హఠాత్తుగా రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఏం జరుగుతుందో అర్థంకాక వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపటి వరకు రైలు లోపల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీసేందుకు యత్నించినట్లు సమాచారం. సమయానికి స్పందించిన రైల్వే సిబ్బంది  సాంకేతిక నిపుణులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పుతుందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మంటలను వెంటనే అదుపులోకి తీసుకురావడంతో పెను విపత్తు నివారించబడింది. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారం ప్రకారం, రైలులోని ఒక నిర్దిష్ట కోచ్‌లో షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర సాంకేతిక లోపాలు కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ తర్వాతే అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇలాంటి హై-స్పీడ్ రైళ్లలో భద్రతా తనిఖీలను మరింత కఠినతరం చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ దేశంలోని పలు మార్గాల్లో నడుస్తున్న రైళ్లలో ఇలాంటి అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. రోజూ వేలాది మంది ప్రయాణించే ఈ ప్రీమియం రైళ్లలో సాంకేతిక లోపాలు పునరావృతం కాకుండా రైల్వే శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అనూహ్య ఘటన కారణంగా కొద్దిసేపు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది. అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని సమీక్షించడంతో పాటు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై దృష్టి పెట్టారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రైల్వే యంత్రాంగం ముందస్తు తనిఖీలను ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.     [ Vande Bharat Express fire, Vijayawada railway station news, Train coach fire incident, Indian Railways safety updates, Indian railways, High-speed trains,Telugu One, Telugu News ]    
ALSO ON TELUGUONE N E W S
  కె.వి. ఆనంద్ దర్శకత్వంలో జీవా, కార్తీక, అజ్మల్ అమీర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కో’ సినిమా 2011లో విడుదలై తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగులో ‘రంగం’ పేరుతో విడుదలై ఇక్కడ కూడా సూపర్‌హిట్ అయింది.  అయితే ఈ సినిమాలో జీవా నటించడం వెనుక కూడా ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ముందుగా ఈ కథను అజిత్ లేదా కార్తితో చేయాలని దర్శకుడు కె.వి. ఆనంద్ భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత శింబుకు కథ వినిపించగా.. ఆయన సినిమాకు ఓకే చెప్పారు. శింబుతో కొన్ని సన్నివేశాలను షూట్ కూడా చేశారు. అయితే శింబు అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశారు. దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. బడ్జెట్ పరిమితులను దృష్టిలో పెట్టుకుని అశ్విన్ కుమార్ పాత్ర కోసం జీవాను సంప్రదించారు. కథ విన్న జీవా మరో మాట లేకుండా సినిమాకు అంగీకరించారు. అలా శింబు చేయాల్సిన పాత్ర జీవా దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత అదే పాత్ర జీవా కెరీర్‌లోనే గుర్తుండిపోయే క్యారెక్టర్‌గా మారింది. ఇది కూడా చదవండి: గ్లోబల్ స్టార్ బాలయ్య.. ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో ట్రంప్‌ను ట్రోల్ చేసిన ఇరాన్.! 2011 ఏప్రిల్ 22న ‘కో’ విడుదలైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. మూడు వారాల తర్వాత ఇదే సినిమా తెలుగులో ‘రంగం’ పేరుతో విడుదలైంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగా ఆదరించారు. ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు వంటి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటులు ఉండటం కూడా సినిమాకు ప్లస్ అయింది. ‘రంగం’ తెలుగులోనూ మంచి వసూళ్లు సాధించింది.  ‘కో’ సినిమాకు పాటలు కూడా మరో పెద్ద బలంగా నిలిచాయి. హేరిస్ జయరాజ్ అందించిన సంగీతం అప్పటి యువతను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ‘ఎందుకో ఏమో’ పాట అప్పట్లో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలా మొదట అజిత్ లేదా కార్తితో అనుకున్న సినిమా.. ఆ తర్వాత శింబు దగ్గరకు వెళ్లి.. చివరికి జీవా చేతికి వచ్చింది. మీకు నచ్చవచ్చు: 55 ఏళ్ళ క్రితం కృష్ణ సాహసం.. సూపర్ స్టార్ బాటలో పయనించిన స్టార్స్ వీళ్ళే.! రాయలసీమ రామన్న చౌదరి.. మోహన్ బాబు ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాలి.!       [Ko Movie, Rangam Movie, Actor Jiiva, Ajmal Ameer, Karthika Nair, Simbu, Telugu Film News, Telugu News]  
ఒకప్పుడు తన మార్క్ కామెడీతో టాలీవుడ్‌లో వరుస విజయాలు అందుకున్న దర్శకుడు శ్రీను వైట్ల. అయితే కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు శర్వానంద్‌తో చేస్తున్న ‘జార్జ్ క్రిష్’ సినిమాతో మరోసారి తన సత్తా చూపించేందుకు రెడీ అవుతున్నారు. శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి 'ఫస్ట్ బూస్టర్' రిలీజ్ చేశారు. టైటిల్‌కు తగ్గట్టుగానే శర్వానంద్ ఇందులో జార్జ్, క్రిష్ అనే రెండు విభిన్నమైన షేడ్స్‌లో కనిపిస్తున్నారు. ఒక పాత్ర క్రిస్టియన్‌గా, మరో పాత్ర కృష్ణుడి భక్తుడిగా కనిపించడం ఆసక్తిని పెంచుతోంది. బూస్టర్‌లో శర్వా గెటప్స్, బాడీ లాంగ్వేజ్, కామెడీ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే శ్రీను వైట్ల తనకు బాగా కలిసొచ్చిన ఎంటర్‌టైన్మెంట్ జానర్‌లోనే మరోసారి సినిమా చేస్తున్నట్లు అనిపిస్తోంది. రెండు పాత్రల మధ్య ఉండే కాంట్రాస్ట్‌ను కామెడీకి ఎలా ఉపయోగించారన్నది కూడా ఆసక్తికరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా శర్వానంద్‌ను ఇంతకుముందు చూడని కొన్ని గెటప్స్‌లో చూపించడం సినిమాకు ప్లస్ అవుతోంది. కార్పొరేట్ లుక్‌తో పాటు జార్జ్, క్రిష్ పాత్రల్లో కనిపించిన వేరియేషన్స్ బూస్టర్‌కు మంచి కలర్ తీసుకొచ్చాయి. హీరోయిన్ మానస వారణాసి కూడా ఫ్రెష్ లుక్‌లో కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: వరుస ఫ్లాపులకు కారణం ఇదేనా.. ‘డ్రాగన్’పైనే ఇప్పుడు అందరి ఆశలు.! ‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’, ‘బాద్‌షా’ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన కామెడీ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న శ్రీను వైట్ల.. ఆ తర్వాత అదే స్థాయి విజయాలను అందుకోలేకపోయారు. దీంతో ‘జార్జ్ క్రిష్’ ఆయనకు చాలా కీలకమైన సినిమా అవుతోంది. ఈ ఫస్ట్ బూస్టర్ చూస్తే మాత్రం పాత శ్రీను వైట్ల మార్క్ ఎంటర్‌టైన్మెంట్‌ను మళ్లీ టచ్ చేసే ప్రయత్నం కనిపిస్తోంది. అయితే కేవలం బూస్టర్‌తోనే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పడం కష్టం. అసలు కథ, కామెడీ ట్రాక్, క్యారెక్టర్ల మధ్య కెమిస్ట్రీ ఎలా వర్క్ అవుతాయన్నది సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. ‘జార్జ్ క్రిష్’ను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాతో.. శ్రీను వైట్ల తన కంబ్యాక్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. మీకు నచ్చవచ్చు: ప్యారడైజ్ చుట్టూ రాజకీయం.. ఒక్క పూటలోనే సీన్ రివర్స్.! ప్యారడైజ్‌కు పోస్ట్ ప్రొడక్షన్ దెబ్బ.. సినిమాకు అది ఎంత కీలకమో గుర్తించరా.?       [George Krish First Booster, George Krish Movie, Sreenu Vaitla, Sharwanand, Manasa Varanasi, Telugu Film News, Telugu News]  
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విజయదశమికి వెల్ కమ్ చెప్తు సుకుమార్ తో చేయబోతున్న తన RC 17 ని స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు అన్ని విధాలా సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలోనే మరో సారి  కోయంబత్తూర్ లో ఉన్న ప్రసిద్ధ గంగా హాస్పిటల్‌లో కుడిచేతి మణికట్టు ట్రీట్ మెంట్ కి  సంబంధించిన సలహాలు గురించి మాట్లాడినట్టుగా తెలుస్తుంది.     ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.    చరణ్ కొన్ని రోజుల క్రితం  గంగా హాస్పిటల్‌లో కుడిచేతి మణికట్టు (Right Wrist) శస్త్రచికిత్స చేయించుకోవడం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. 'పెద్ది' (Peddi) సినిమా చిత్రీకరణ సమయంలో చరణ్ కు తీవ్రమైన మణికట్టు గాయమైంది. కుస్తీ మరియు భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ప్రమాదవశాత్తు ఈ గాయం కాగా, షూటింగ్ షెడ్యూల్స్ పాడవకూడదనే ఉద్దేశంతో ఆయన నొప్పిని భరిస్తూనే షూటింగ్‌ను పూర్తి చేశారు. అయితే, భవిష్యత్తులో తీవ్ర కాంప్లికేషన్లు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకోవాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నారు. ఇది కూడా చదవండి: ప్రముఖ మలయాళ లెజండ్రీ నటీమణి మృతి.. వెలకట్టలేని పురస్కారాలు    ఈ చికిత్స కోసం ఆర్థోపెడిక్స్ మరియు ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కోయంబత్తూర్ గంగా హాస్పిటల్‌ను ఎంచుకున్నారు. గంగా హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ S. రాజశేఖరన్ నేతృత్వంలో ఈ సర్జరీ విజయవంతంగా జరిగింది. ఈ గాయం చాలా సంక్లిష్టమైనది కావడంతో మైయామీ (USA) నుంచి వచ్చిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అలెజాండ్రో బాడియాతో పాటు డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ నేతృత్వంలోని నిపుణుల బృందం అత్యాధునిక లాపరోస్కోపిక్ పద్ధతిలో ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో వైద్య బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది.     [Ram Charan, RC 17, Ram Charan Wrist Surgery Ganga Hospital Coimbatore, Telugu One Cinema News, TeluguOne Cinema News, TeluguOne]  
'ప్యారడైజ్' మూవీ విడుదల సందర్భంగా టాలీవుడ్‌లో స్టోరీ, స్క్రీన్‌ప్లే విషయంలో మరోసారి చర్చ మొదలైంది. సినిమా హిట్ కావాలంటే దర్శకుడి విజన్ ఎంత ముఖ్యమో.. అదే సమయంలో స్టోరీ, స్క్రీన్‌ప్లే రాసే విషయంలో నిపుణుల అవసరం కూడా అంతే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో ప్రతి వారం ప్రేక్షకులను నిరాశపరిచే సినిమాలు వస్తూనే ఉన్నాయని.. దర్శకులు తమ ప్రధాన బాధ్యత అయిన డైరెక్షన్‌పై ఫోకస్ చేసి, రైటింగ్‌ను నిపుణులకు అప్పగిస్తే మంచి ఫలితాలు రావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అందరు దర్శకులకు ఇది వర్తించదనే వాదన కూడా ఉంది. కొందరు దర్శకులు కథ నుంచి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ వరకు అన్నింటినీ స్వయంగా హ్యాండిల్ చేసి అద్భుతమైన సినిమాలు అందించారు. పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు దీనికి ఉదాహరణగా కనిపిస్తారు. మరోవైపు వరుస పరాజయాలను చూస్తున్న కొందరు మాత్రం ప్రొఫెషనల్ రైటర్స్ అవసరాన్ని గుర్తించాల్సిన అవసరముంది. కథను రాసే వ్యక్తి, దాన్ని తెరపైకి తీసుకెళ్లే దర్శకుడు ఇద్దరూ తమ తమ విభాగాలపై ఫోకస్ చేస్తే సినిమా మరింత బలంగా తయారవుతుందనే చర్చ జరుగుతోంది. ఇది కూడా చదవండి: ప్యారడైజ్ చుట్టూ రాజకీయం.. ఒక్క పూటలోనే సీన్ రివర్స్.! ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’పై పడింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన క్రెడిట్స్ కూడా ప్రత్యేకంగా చర్చకు వస్తున్నాయి. రచన, దర్శకత్వం వంటి విభాగాల్లో స్పష్టమైన విభజన ఉండటం వల్ల.. ఒక టీమ్‌గా పనిచేస్తే ఎలాంటి అవుట్‌పుట్ వస్తుందో ‘డ్రాగన్’ చూపిస్తుందనే ఆసక్తి నెలకొంది. దర్శకుడు ప్రతి విభాగాన్నీ తన చేతుల్లోనే ఉంచుకోవాలా? లేక కథ, స్క్రీన్‌ప్లే కోసం ప్రత్యేకమైన రైటర్స్‌ను తీసుకోవాలా? అనే చర్చ మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రాజమౌళి వంటి అగ్ర దర్శకుల సినిమాల్లో కూడా రైటింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటం ఈ చర్చకు మరింత బలం ఇస్తోంది. మరి.. భారీ బ్యాక్‌డ్రాప్, ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌తో వస్తున్న ‘డ్రాగన్’ కథ, స్క్రీన్‌ప్లే విషయంలో ఎలాంటి స్టాండర్డ్ సెట్ చేస్తుందో చూడాలి. ఇప్పుడు ప్రేక్షకుల ఆశలు మాత్రం ఈ సినిమాపైనే ఉన్నాయి. మీకు నచ్చవచ్చు: రాయిని ఆడది చేసిన రాముడివా.. 44 ఏళ్ళ క్రితం వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్.! ‘ప్యారడైజ్’పై నెగెటివిటీ.. నానిని కావాలనే టార్గెట్ చేస్తున్నారా.?       [Tollywood Directors, Telugu Directors, The Paradise Movie, Nani Paradise, Jr NTR Dragon Movie, Prashanth Neel, SS Rajamouli, Varanasi Movie, Telugu Film News, Telugu News]  
భారతీయ చిత్రపరిశ్రమలో, ముఖ్యంగా మలయాళ నాటక, సినీ రంగాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ సీనియర్ నటి సావిత్రి శ్రీధరన్ ఇకలేరు. గత కొంతకాలంగా వయోసహజ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, కేరళలోని కోళికోడ్ (కాలికట్) మంకావులోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.  నాలుగు దశాబ్దాలకు పైగా నాటకరంగంలోనూ, వెండితెరపై విశిష్టమైన పాత్రలతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన సావిత్రి శ్రీధరన్ మరణం మలయాళ కళారంగానికి తీరని లోటుగా మారింది. సావిత్రి శ్రీధరన్ నట జీవితం కేవలం ఒక సాధారణ ప్రయాణం కాదు. అది క్రమశిక్షణ, నిరంతర శ్రమ, కళ పట్ల అపరిమితమైన ప్రేమతో కూడుకున్న ఒక స్ఫూర్తిదాయక అధ్యాయం. కేవలం 16 ఏళ్ల చిన్న వయసులోనే ఆమె ఔత్సాహిక (అమేచ్యూర్) నాటకరంగంలోకి అడుగుపెట్టారు. దాదాపు 20 సంవత్సరాల పాటు అమేచ్యూర్ నాటకాలతో అనుభవాన్ని గడించిన అనంతరం  ప్రొఫెషనల్ థియేటర్ రంగంలోకి అడుగుపెట్టి తిరుగులేని నటిగా ఎదిగారు. కాలికట్‌కు చెందిన కళింగ, సంగమం, స్టేజ్ ఇండియా, చిరంతన వంటి ప్రముఖ నాటక సమాజాలతో కలిసి ఆమె 40 ఏళ్లకు పైగా నాటకరంగంలో కొనసాగారు. వేలాది నాటక ప్రదర్శనల్లో విభిన్న తరహా సంక్లిష్టమైన పాత్రలను పోషించి నాటక ప్రియుల మనసులను గెలుచుకున్నారు. నాటకరంగంలో ఆమె చూపిన అత్యుత్తమ ప్రతిభకు గాను 1977, 1993 సంవత్సరాల్లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నాటక నటి అవార్డులు దక్కగా, 2009లో కేరళ సంగీత నాటక అకాడమీ పురస్కారం వరించింది. నాటకరంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ, వెండితెరపైకి ఆమె ఆలస్యంగానే ప్రవేశించారు. 1991లో జ్ఞానపీఠ్ గ్రహీత ఎం.టి. వాసుదేవన్ నాయర్ దర్శకత్వంలో వచ్చిన 'కడవు' సినిమాతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. అయితే, ఆమెకు నిజమైన గుర్తింపు, ఆల్ ఇండియా స్థాయిలో ప్రశంసలు తెచ్చిపెట్టిన చిత్రం మాత్రం 2018లో విడుదలైన 'సుడానీ ఫ్రమ్ నైజీరియా'. ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్ తల్లి జమీలా (ఉమ్మా) పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులు, విమర్శకులను కట్టిపడేసింది. ప్రేమానురాగాలు పంచే ఒక సగటు కేరళ తల్లి పాత్రను ఆమె పండించిన విధానం ప్రతి ఒక్కరి హృదయాలను తాకింది. ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్: ఓవర్సీస్ టాక్ ఇదే! ఈ చిత్రంలోని నటనకు గాను 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో (66th National Film Awards) సావిత్రి శ్రీధరన్ 'స్పెషల్ మెన్షన్' (Special Mention) అవార్డును దక్కించుకున్నారు. అంతేకాకుండా, 2018 కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో 'ఉత్తమ సహాయ నటి' (Best Character Actress) కేటగిరీలో రాష్ట్ర పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆమె 'వైరస్' (2019), 'దాకిని', 'ఇట్టిమాని: మేడ్ ఇన్ చైనా', 'పాడ', 'పాప్పన్', 'క్రిస్టీ' వంటి అనేక ప్రముఖ చిత్రాలలో కీలకమైన అమ్మ, అమ్మమ్మ పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఆమె మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష నాయకులు, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. 40 ఏళ్ల నాటక ప్రస్థానం, 60కి పైగా ప్రముఖ ప్రాజెక్టులు, జాతీయ అవార్డులతో ముగిసిన సావిత్రి శ్రీధరన్ ప్రయాణం రాబోయే తరాల కళాకారులకు ఎల్లప్పుడూ ఒక దిశానిర్దేశంలా నిలిచిపోతుంది.  ఆమె వయసు  85 ఏళ్ళు.        [Savithri Sreedharan, Savithri Sreedharan passed away,  Sudani from Nigeria actress, Telugu One Cinema News, TeluguOne Cinema News, TeluguOne]
సినిమాకి దర్శకుడే కెప్టెన్‌. కథ మొదలైన దగ్గర నుంచి సినిమా థియేటర్‌లోకి వచ్చే వరకు ప్రతి దశలో ఆయన విజన్ ఉంటుంది. కథ, నటీనటుల ఎంపిక, షూటింగ్, ఎడిటింగ్, మ్యూజిక్, గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్.. ఇలా ప్రతి విషయంలోనూ దర్శకుడి పాత్ర కీలకంగా ఉంటుంది. అయితే సినిమా పూర్తయిన తర్వాత కూడా దర్శకుడికి మరో ముఖ్యమైన బాధ్యత ఉంటుంది. అదే.. ప్రమోషన్స్. సినిమా ఎలా వచ్చింది? దర్శకుడు ఏం చెప్పాలనుకున్నారు? కథను ఎలాంటి ప్రపంచంలోకి తీసుకెళ్లారు? ఈ విషయాలు ప్రేక్షకులకు దర్శకుడి మాటల్లో తెలిస్తే సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడుతుంది. అందుకే ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కూడా ఒక క్రియేటివ్ ప్రాసెస్‌గా మారిపోయాయి. సినిమా తీయడంలో ఎంత క్రియేటివిటీ అవసరమో.. దాన్ని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడంలోనూ అంతే అవసరం. అయితే ప్రస్తుతం చాలామంది దర్శకులు సినిమా చివరి దశ వరకు ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ పనుల్లో బిజీగా ఉంటున్నారు. రిలీజ్‌కు కొన్ని గంటల ముందు కూడా ఫైనల్ అవుట్‌పుట్‌ను పూర్తి చేసే పనిలో ఉండిపోతున్నారు. దీంతో ప్రమోషన్స్‌కు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. హీరోలు మాత్రం వరుస ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, ప్రెస్‌మీట్లతో సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటీవల ‘ది ప్యారడైజ్’ విషయంలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. నాని దేశవ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. కానీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాత్రం ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఆశించిన స్థాయిలో కనిపించలేదు. చివరికి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా ఆయన హాజరు కాలేకపోయారు. దీంతో దర్శకులు కూడా తమ సినిమాల ప్రమోషన్స్‌కు కొంత సమయం కేటాయించుకోవాలనే చర్చ మొదలైంది. నిజానికి ఇది శ్రీకాంత్ ఓదెల ఒక్కరి విషయంలోనే కాదు. గతంలో ‘పుష్ప’ సమయంలో సుకుమార్ కూడా సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో కొన్ని ప్రమోషనల్ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో అల్లు అర్జున్ ప్రమోషన్స్‌ను ముందుండి నడిపించారు. సినిమా విజయం, పరాజయం పక్కన పెడితే.. దర్శకుడు ఏం ఆలోచించాడు? ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించాడు? అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా దర్శకుడి బ్రాండ్‌కు కూడా ఇప్పుడు ప్రాధాన్యత పెరుగుతోంది. రాజమౌళి సినిమా అంటే హీరో ఎవరనే విషయంతో పాటు అది రాజమౌళి సినిమా అనే చర్చ కూడా జరుగుతుంది. అదే విధంగా దర్శకుడి పేరు సినిమాకు ఒక గుర్తింపుగా మారుతున్నప్పుడు.. తన సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేసే విషయంలోనూ దర్శకుడు ముందుండాల్సిన అవసరం ఉంటుంది. అయితే సినిమా పూర్తయ్యే వరకు దర్శకుడిపై ఉండే పని ఒత్తిడి కూడా తక్కువేమీ కాదు. అందుకే ఫైనల్ అవుట్‌పుట్ లాక్ అయిన తర్వాత ప్రమోషన్స్ కోసం ముందుగానే కొంత సమయాన్ని కేటాయించుకునేలా ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా తీయడం ఎంత ముఖ్యమో.. ఆ సినిమాను ప్రేక్షకులకు సరైన విధంగా పరిచయం చేయడం కూడా అంతే ముఖ్యం. దర్శకుడి విజన్‌ను ఆయన మాటల్లోనే ప్రేక్షకులకు చెప్పగలిగితే సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడే అవకాశం ఉంటుంది.   [Film Promotions, Directors Promotions, Tollywood Directors, Telugu Cinema Directors, Movie Promotional Activities, Director Vision, The Paradise, Srikanth Odela, Nani The Paradise, Sukumar Pushpa, SS Rajamouli, Tollywood Movie Promotions, Telugu Cinema News, Directors in Movie Promotions]
  నాచురల్ స్టార్ నాని,  శ్రీకాంత్ ఓదెల తెలుగు నాట తమ మానస పుత్రిక 'ది ప్యారడైజ్' తో పరాజయాపు కౌగిలిలో మునిగిపోయారు. ఇప్పటివరకు ప్రదర్శించిన అన్ని షోస్ ప్రేక్షకులు ఒకటే మాట. ప్యారడైజ్ గట్టెక్కడం కష్టమే అని.   అయితే  అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి ప్రధాన ఓవర్సీస్ మార్కెట్లలో ప్రీమియర్ షోలు పూర్తి కావడంతో, అక్కడ చూసిన ప్రేక్షకులు, క్రిటిక్స్ నుండి టాక్ ఏంటనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. విదేశీ ప్రీమియర్ల నుంచి వస్తున్న వివరాలు మరియు సెన్సార్ సమాచారం ప్రకారం, అధిక మోతాదులో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ప్రేక్షకులను మరియు నాని డార్క్‌ యాక్షన్ లుక్‌ను ఇష్టపడే వారిని థ్రిల్ చేసినప్పటికీ, సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సుదీర్ఘంగా సాగడం మరియు ఎమోషనల్ కనెక్ట్ కొంత తగ్గిందనే టాక్ ఓవర్సీస్ రివ్యూలలో వినిపిస్తోంది. మరి ఓవర్ సీస్ లో కింగ్ అయిన నాని పూర్తి రన్నింగ్ లో ఎంత మేర సాధిస్తాడో చూడాలి. ఇది కూడా చదవండి: 400 కోట్ల క్లబ్ వైపు 'హనుమాన్‌ అంశ్' సంచలన పయనం   వ్యాపార పరంగా చూస్తే, నాని కెరీర్‌లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బ్యాలెన్స్‌తో భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ లక్ష్యంగా బరిలోకి దిగింది. బుక్ మై షోలో విడుదలకు ముందే ప్రతి గంటకూ వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడై అరుదైన రికార్డును నమోదు చేసింది. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి 'ది ప్యారడైజ్' చిత్రం నాని కెరీర్‌లో ఒక విభిన్నమైన సాహసోపేత ప్రయత్నమని, మాస్ ఆడియన్స్‌కు ఐ-ఫీస్ట్ ఇస్తూ, నానిని టాలీవుడ్ టైర్-1 హీరోల సరసన చేర్చే దిశగా బలమైన అడుగు అని విశ్లేషకులు భావిస్తున్నారు.    [The Paradise Movie Overseas Talk Analysis, The Paradise, Nani, Kayadu Lohar, Telugu One Cinema News, TeluguOne Cinema News, TeluguOne]
వందల వందల కోట్లు ఎందుకు ఖర్చుపెడుతుంటారో తెలియని వాళ్ళకి సినిమా అంటే పెన్ను, పేపర్ సాయంతో, ప్రస్తుతం ప్రేక్షకుల మూడ్ ఎలా ఉందో కనిపెట్టి మంచి కథతో కూడిన కంటెంట్ ని సృషించడమే. లేదంటే ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా సినిమాకి ఎలాంటి ఉపయోగం ఉండదు. అదే కోట్లుని కాకుండా రూపాయి ఎలా ఖర్చుపెట్టాలో తెలిసేలా 'హనుమాన్ అంశ్' లాంటి సినిమాలని ప్రేక్షకులకి అందిస్తే వాళ్ళ జేబుల్లో డబ్బులు మేకర్స్ అకౌంట్ లో ఉంటాయి. ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత విశేషాలు, ఆయన మహిమల ఆధారంగా తెరకెక్కిన 'హనుమాన్ అంశ్'  400 కోట్ల అరుదైన మైలురాయి వైపు  వేగంగా అడుగులు వేస్తోంది. వ్యాపార వర్గాలు, సినీ విశ్లేషకులు సైతం ఈ కలెక్షన్ల ప్రవాహాన్ని చూసి విస్తుపోతున్నారు. ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యేసరికి వసూళ్లు 1.08 కోట్లకు చేరుకున్నాయి. అయితే రెండో వారంలో కాస్త మందగించి కేవలం. 40 లక్షలు మాత్రమే రాబట్టడంతో, రెండు వారాల మొత్తం వసూళ్లు 1.48 కోట్ల దగ్గరే నిలిచిపోయాయి. చాలామంది ఈ చిత్రం ఇక్కడితో ఆగిపోతుందని భావించిన వేళ, మూడో వారం నుంచి ఊహించని అద్భుతం జరిగింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన పాజిటివ్ టాక్, మౌత్ పబ్లిసిటీ ఈ సినిమా రూపురేఖలనే మార్చేసాయి. దేవుడి మహిమలు, ఆధ్యాత్మిక భావనలు ప్రేక్షకుడి హృదయాన్ని తాకడంతో థియేటర్ల దగ్గర జనాలు క్యూ కట్టడం ప్రారంభించారు. ఇది కూడా చదవండి: మారెమ్మ ఓటిటి డేట్ వచ్చేసింది: అమ్మ తల్లో, మాయమ్మో!     ఈ జోరు  ఏమాత్రం తగ్గకుండా ఏకంగా 47వ రోజున కూడా బాక్సాఫీస్ వద్ద రోజుకు దాదాపు  5 కోట్ల భారీ వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు రూ. 200 కోట్ల భారీ షేర్ సాధించిన ఈ సినిమా ట్రేడ్ వర్గాలకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. మొదట ఈ చిత్ర తెలుగు హక్కులను దర్శకుడు త్రివిక్రమ్ కొనుగోలు చేసినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం సృష్టిస్తున్న ప్రభంజనం చూసి తెలుగు వెర్షన్ థియేట్రికల్ రిలీజ్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ చిన్న చిత్రం తెచ్చిపెట్టిన లాభాలను, ఇతర భారీ బడ్జెట్ సినిమాల ఫలితాలతో పోలుస్తూ నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఉదాహరణకు. 450 కోట్ల మైండ్ బ్లోయింగ్ బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్' ప్రపంచవ్యాప్తంగా 342 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించి బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది. 400 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్ముడైన టాక్సిక్ చివరకు కేవలం రూ. 160 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. కేవలం  2 కోట్ల బడ్జెట్ సినిమా 200 కోట్ల షేర్ తెచ్చిపెడితే, 450 కోట్ల భారీ చిత్రం డిజాస్టర్‌గా మిగలడంపై బాక్సాఫీస్ విశ్లేషకులు విస్తుపోతున్నారు. గొప్ప కథనం, నిజాయితీ ఉన్న మేకింగ్ ముందు బడ్జెట్లు ఎప్పుడూ ద్వితీయమేనని 'హనుమాన్ అంశ్' బాక్సాఫీస్ వద్ద మరోసారి రుజువు చేసింది.కేవలం . 2 కోట్ల అత్యంత స్వల్ప బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ విజువల్ వండర్, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 366 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సినిమా అనేది ఇస్త్రీ చొక్కా నలగకుండా ధర్మ బద్దంగా ఓవర్ నైట్ కరోడ్ పతిని ఎలా చేస్తుందో నిరూపించింది.   [Hanuman Ansh Collections, Hanuman Ansh budget, Toxic, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్‌’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌తో పాటు అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు కూడా సినిమాపై హైప్ పెంచాయి. ముఖ్యంగా ‘ది ప్యారడైజ్‌’లాంటి రా అండ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాకు అనిరుధ్ బీజీఎం అదిరిపోతుందని చాలామంది భావించారు. అయితే సినిమా విడుదలైన తర్వాత మాత్రం మ్యూజిక్ విషయంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాటలు కొంతవరకు ఆకట్టుకున్నా.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం సన్నివేశాలను ఆశించిన స్థాయిలో ఎలివేట్ చేయలేకపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి. కొన్ని రివ్యూల్లో కూడా అనిరుధ్ బీజీఎం సినిమాకు బలంగా నిలవలేకపోయిందని ప్రస్తావించారు. నిజానికి ‘ది ప్యారడైజ్‌’కు అనిరుధ్ పేరు కూడా ఒక ప్లస్ పాయింట్‌గానే మారింది. గతంలో నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్‌’కు అనిరుధ్ సంగీతం అందించారు. ఆ తర్వాత మరోసారి నాని సినిమాకు పనిచేయడంతో ఈ కాంబినేషన్‌పై ఆసక్తి పెరిగింది. సినిమా విడుదలకు ముందు అనిరుధ్ అమెరికాలో నిర్వహించిన కచేరీలో ‘ది ప్యారడైజ్‌’ రెండో సింగిల్‌ను కూడా విడుదల చేశారు. అయితే సినిమా నేపథ్య సంగీతం విషయానికి వచ్చేసరికి అంచనాలు మరోలా ఉన్నాయి. ‘ది ప్యారడైజ్‌’ కథ 1980ల నేపథ్యంలో సావరీ కమ్యూనిటీ చుట్టూ తిరుగుతుంది. మోహన్‌బాబు పోషించిన మాలిక్ ఆధిపత్యం, జడల్‌గా నాని తిరుగుబాటు, ఆ కమ్యూనిటీ ఎదుర్కొనే పరిస్థితులు కథలో కీలకంగా ఉంటాయి. ఇలాంటి కథకు సన్నివేశాల్లో ఎమోషన్, టెన్షన్, యాక్షన్‌ను మరింత పెంచే బీజీఎం అవసరం. కానీ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలకు అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆశించినంత ఇంపాక్ట్ ఇవ్వలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కథనం రెండో భాగంలోకి వెళ్లిన తర్వాత సన్నివేశాలు ఎక్కువగా హింస, యాక్షన్ వైపు వెళ్లడంతో మ్యూజిక్ కూడా వాటిని క్యారీ చేయాల్సి ఉంది. అక్కడే బీజీఎం కొంత తేలిపోయిందని కొందరు రివ్యూలు పేర్కొంటున్నాయి. మరోవైపు నాని పెర్ఫార్మెన్స్, సినిమా ప్రొడక్షన్ డిజైన్, విజువల్స్, కొన్ని యాక్షన్ సన్నివేశాలకు మాత్రం ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదిలా ఉంటే.. అనిరుధ్ సంగీతంపై వస్తున్న ఈ కామెంట్స్ పూర్తిగా ఆయన ప్రతిభకు సంబంధించినవే అని చెప్పలేం. సినిమా చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఫైనల్ ఎడిట్, రీ-రికార్డింగ్‌కు దొరికిన సమయం కూడా బీజీఎంపై ప్రభావం చూపి ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. రిలీజ్‌కు ముందు కూడా సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగినట్లు వార్తలు వచ్చాయి. మొత్తానికి ‘ది ప్యారడైజ్‌’కు పాటల పరంగా ముందే మంచి క్రేజ్ తీసుకొచ్చిన అనిరుధ్.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయాడనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరి అభిప్రాయం ఒకేలా లేదు. కొందరు అనిరుధ్ మ్యూజిక్‌ను కూడా ప్రశంసిస్తున్నారు. దీంతో ‘ది ప్యారడైజ్‌’లో మ్యూజిక్ ఎంతవరకు వర్కౌట్ అయిందన్నది ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మారుతోంది.       [The Paradise, Nani The Paradise, Anirudh Ravichander, The Paradise Music, The Paradise BGM, Anirudh BGM, Nani Anirudh Movie, The Paradise Review, Srikanth Odela, The Paradise Movie, Nani Latest Movie, Anirudh Music Review, The Paradise Background Score]
‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు.. ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ముఖ్యంగా సినిమా చివర్లో ఇచ్చిన ట్విస్టులతో సీక్వెల్‌పై భారీ ఆసక్తి ఏర్పడింది. ఇప్పుడు అందరి దృష్టి ‘కల్కి 2’పైనే ఉంది. ‘కల్కి 2’ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నది చాలాకాలంగా చర్చ జరుగుతున్న విషయం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్‌పై ఓ ఆసక్తికరమైన సమాచారం బయటికి వచ్చింది. 2027 డిసెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మూవీ టీమ్ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఇంకా అధికారికంగా ప్రకటించిన రిలీజ్ డేట్ మాత్రం కాదు. ‘కల్కి 2’ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 2026 నుంచి ప్రారంభం కానుందని నాగ్ అశ్విన్ ఇప్పటికే వెల్లడించారు. 2027 మధ్య నాటికి షూటింగ్ పూర్తి చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం. షూటింగ్ పూర్తయిన తర్వాత విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు భారీ సమయం కేటాయించాల్సి ఉంటుంది. ‘కల్కి’ ప్రపంచానికి సంబంధించిన విజువల్స్ సినిమాలో చాలా కీలకం కావడంతో ఈ పనుల విషయంలో మేకర్స్ తొందరపడకుండా ముందుకు వెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మొదటి పార్ట్ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ‘కల్కి 2’ కథ మరింత ముందుకు వెళ్లనుంది. ముఖ్యంగా ప్రభాస్ పోషించిన భైరవ పాత్రకు ఉన్న కర్ణుడి లింక్, కమల్ హాసన్ నటించిన సుప్రీమ్ యాస్కిన్ పాత్రకు సంబంధించిన అంశాలు సీక్వెల్‌లో మరింత కీలకంగా మారే అవకాశం ఉంది. మొదటి పార్ట్‌లో పరిమితంగా కనిపించిన యాస్కిన్ పాత్రకు రెండో భాగంలో ఎక్కువ ప్రాధాన్యత ఉండనుందని కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సీక్వెల్‌లో సాయి పల్లవి కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె పాత్రతో పాటు కొన్ని ఇతర క్యాస్టింగ్ వివరాలపై మేకర్స్ నుంచి పూర్తి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘కల్కి 2’ మొదటి భాగం కంటే మరింత భారీ స్థాయిలో ఉంటుందని ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ చెబుతూ వస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు కథను కూడా మరింత విస్తరించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం తీసుకుంటారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే 2027 డిసెంబర్‌లో ‘కల్కి 2’ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాతే రిలీజ్ డేట్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి నాగ్ అశ్విన్ అనుకున్న టైమ్‌లోనే ‘కల్కి 2’ ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేక రిలీజ్ ఇంకా ఆలస్యం అవుతుందా అనేది చూడాలి.     [Kalki 2, Prabhas Kalki 2, Kalki 2898 AD Part 2, Nag Ashwin, Kalki 2 Release Date, Prabhas Upcoming Movies, Amitabh Bachchan Kalki 2, Kamal Haasan Kalki 2, Kalki 2 December 2027, Kalki 2 Shooting, Kalki 2898 AD Sequel, Vyjayanthi Movies]
బంధం నుండి విడిపోయినా సరే జ్ఞాపకాల నుండి బయటపడలేకున్నారా.. ఇలా చేయండి.. ఒక బంధం ముగిసిన తర్వాత ఆ మనిషి మన జీవితం నుండి దూరమవ్వడం పెద్ద విషయం కాదు, కానీ వారితో పెనవేసుకున్న జ్ఞాపకాల నుండి బయటపడటం మాత్రం చాలామందికి ఒక పెద్ద సవాలుగా మారుతుంది. పగటిపూట పనుల్లో మునిగిపోయినా, రాత్రి వేళల్లో ఆ ఆలోచనలు మళ్లీ మళ్లీ దాడి చేస్తూ మనసును తీవ్రంగా బాధిస్తుంటాయి. గతంలో గడిపిన తీపి గుర్తులు, ఎదుర్కొన్న చేదు అనుభవాలు వెంటాడుతూ, వర్తమానం మీద దృష్టి పెట్టనీయకుండా చేస్తాయి. ఈ బాధ నుండి బయటపడటం సాధ్యం కాదేమో అనిపించవచ్చు. కానీ, మన ఆలోచనా విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటూ, సరైన పద్ధతులు పాటిస్తే ఎంతటి లోతైన జ్ఞాపకాల నుండి అయినా సులభంగా బయటపడి, జీవితంలో ముందుకు సాగవచ్చు. అందుకు ఉపయోగపడే కొన్ని విలువైన సూచనలు తెలుసుకుంటే.. యాక్సెప్ట్ చేయడం.. భావోద్వేగాలను అణచివేయకుండా స్వీకరించాలి. బంధం ముగిసినప్పుడు బాధపడటం, ఏడవడం లేదా కోపం రావడం చాలా సహజం.  మనసులోని భావాలను బలవంతంగా తొక్కిపెట్టడానికి ప్రయత్నించకూడదు. బాధను అణచివేసే కొద్దీ అది జ్ఞాపకాల రూపంలో మరింత ఎక్కువగా వేధిస్తుంది. కాబట్టి భావోద్వేగాలను అంగీకరించాలి. ఏడవాలనిపిస్తే ఏడ్చేయండి.  బాధను స్వీకరించడమే దాన్ని జయించడానికి మొదటి అడుగు. గత జ్ఞాపకాలకు దూరం.. గత జ్ఞాపకాలను గుర్తుచేసే వాటికి దూరంగా ఉండాలి.  వారితో ఉన్న పాత ఫోటోలు, చాటింగ్‌లు, ఇచ్చిన కానుకలు లేదా మీరు కలిసి తిరిగిన ప్రదేశాలు మీ జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ మేల్కొలుపుతాయి. కాబట్టి వాటిని మీ కంటికి కనిపించకుండా దాచిపెట్టండి లేదా పూర్తిగా తొలగించండి. సోషల్ మీడియాలో వారి అకౌంట్స్ చూడటం లేదా వారి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నించడం  ఆపేయాలి. ఇది మనసుకు త్వరగా ప్రశాంతతను ఇస్తుంది. దినచర్యను మార్చుకోవడం .. ఖాళీగా ఉన్నప్పుడే పాత ఆలోచనలు ఎక్కువగా మనసులోకి వస్తాయి. అందుకే మిమ్మల్ని మీరు ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నం చేసుకోండి. కొత్త అలవాట్లను ప్రారంభించండి. కొత్త పుస్తకాలు చదవడం, నచ్చిన సంగీతం వినడం, వ్యాయామం చేయడం లేదా ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం లాంటివి చేయాలి. దినచర్యలో మార్పులు రావడం వల్ల మీ దృష్టి పాత విషయాల నుండి కొత్త విషయాల వైపు మళ్లుతుంది. ఆత్మీయులతో సమయాన్ని గడపడం .. బాధలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు, కానీ అది జ్ఞాపకాలను మరింత పెంచుతుంది. మీకు బాగా దగ్గరైన స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపాలి. మీ మనసులోని బాధను నమ్మకమైన వారితో పంచుకోవాలి. వారు ఇచ్చే ధైర్యం, చూపించే ప్రేమ మీ మనసుకు పెద్ద ఊరటను ఇస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. స్వీయ సంరక్షణ.. శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటేనే భావోద్వేగాలను తట్టుకునే శక్తి వస్తుంది. సరైన వేళకు పౌష్టికాహారం తీసుకోవాలి, తగినంత నిద్రపోవాలి. ప్రతిరోజూ ధ్యానం లేదా యోగా చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. సెల్ఫ్ లవ్.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ప్రారంభించాలి. జీవితంలో మీ లక్ష్యాలు ఏంటి, మీ భవిష్యత్తును ఎలా మలచుకోవాలి అనే దానిపై దృష్టి పెట్టాలి. అనుభవాలు, గుణపాఠాలు.. గతాన్ని పాఠంగా భావించి ముందుకు సాగాలి.  జరిగిన దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. ఆ బంధం ఎందుకు తెగిపోయింది, తప్పు ఎవరిది అని నిరంతరం ఆలోచించడం వల్ల సమయం, ప్రశాంతత మాత్రమే వృథా అవుతాయి. జరిగిన ఘటనను ఒక అనుభవంగా, జీవితంలో ఒక పాఠంగా స్వీకరించాలి. ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభానికి నాంది అని గుర్తుంచుకోవాలి. సమయం.. బాధ నుండి ఒక్క రోజులోనే బయటపడటం ఎవరికీ సాధ్యం కాదు. దానికి కొంత సమయం పడుతుంది. మీ మనసును నయం చేసుకోవడానికి మీకు మీరు కొంత సమయాన్ని ఇవ్వాలి. రోజులు గడిచే కొద్దీ జ్ఞాపకాల తీవ్రత తగ్గుతుంది. ఓర్పుతో మీ జీవితాన్ని మెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేయాలి                   *రూపశ్రీ.
మన శరీరంలో ఎముకలు బలంగా ఉండటానికి మరియు శారీరక ఎదుగుదలకు క్యాల్షియం, విటమిన్ డి ఎంతటి కీలక పాత్ర పోషిస్తాయో మనందరికీ తెలిసిందే. ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్లలో మార్పులు, ఎండలో తిరగకపోవడం మరియు మారుతున్న జీవనశైలి కారణంగా మెజారిటీ ప్రజలు విటమిన్ డి మరియు క్యాల్షియం లోపంతో బాధపడుతున్నారు. వైద్య ఆరోగ్య నివేదికల ప్రకారం, భారతదేశంలో దాదాపు 70% నుండి 90% మంది ప్రజలు విటమిన్ డి లోపంతో సతమతమవుతుంటే, సుమారు 50% పైగా ప్రజలు రోజువారీ శరీరానికి అవసరమైన క్యాల్షియం మోతాదును పొందలేకపోతున్నారు. ఈ క్రమంలో చాలామంది వైద్యులను సంప్రదించినప్పుడు లేదా సొంతంగా మెడికల్ షాపుల్లో సప్లిమెంట్లు కొనుగోలు చేసినప్పుడు విటమిన్ డి మరియు క్యాల్షియం బిళ్ళలను ఒకేసారి కలిపి వాడుతుంటారు. అయితే, ఈ రెండింటినీ ఎల్లప్పుడూ కలిసే తీసుకోవాలా లేదా విడివిడిగా తీసుకోవడం మంచిదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ అంశంపై ప్రముఖ ఆరోగ్య నిపుణులు మరియు వైద్యులు విప్లవాత్మకమైన విషయాలను వెల్లడించారు. మానవ శరీర జీవక్రియలో విటమిన్ డి మరియు క్యాల్షియం మధ్య ఒక అద్భుతమైన భాగస్వామ్యం ఉంది. మనం ఆహారం లేదా సప్లిమెంట్ల ద్వారా తీసుకునే క్యాల్షియాన్ని మన ప్రేగులు సరిగ్గా గ్రహించాలంటే (Absorption) శరీరంలో తగినంత విటమిన్ డి ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ శరీరంలో విటమిన్ డి లోపిస్తే, మనం ఎంత క్యాల్షియం తీసుకున్నప్పటికీ అందులో కేవలం 10% నుండి 15% మాత్రమే శరీరం పీల్చుకోగలుగుతుంది. అదే విటమిన్ డి సరైన మోతాదులో ఉంటే క్యాల్షియం గ్రహణ సామర్థ్యం ఏకంగా 30% నుండి 40% వరకు పెరుగుతుంది. అందుకే ఎముకల సాంద్రతను పెంచడానికి, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల బలహీనత వ్యాధులను నివారించడానికి వైద్యులు ఈ రెండింటి కాంబినేషన్‌ను ఎక్కువగా రికమండ్ చేస్తుంటారు. అయితే ప్రతి ఒక్కరూ ఈ రెండు సప్లిమెంట్లను నిరంతరం కలిపే తీసుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి శరీరంలో విటమిన్ డి స్థాయిలు తీవ్రంగా తగ్గి (లేబొరేటరీ పరీక్షల్లో 20 ng/mL కంటే తక్కువగా ఉన్నప్పుడు), క్యాల్షియం స్థాయిలు సాధారణంగా ఉంటే, వారికి కేవలం విటమిన్ డి సప్లిమెంట్లు (వారం ఒకసారి ఇచ్చే 60,000 IU డోస్) మాత్రమే సరిపోతాయి. అలాగే, ఆహారం ద్వారా తగినంత క్యాల్షియం పొందుతున్న వారికి ప్రత్యేకంగా క్యాల్షియం టాబ్లెట్లు అవసరం లేదు. మోతాదుకు మించి క్యాల్షియం సప్లిమెంట్లను విచక్షణారహితంగా తీసుకోవడం వల్ల రక్తంలో క్యాల్షియం పెరిగి కిడ్నీలలో రాళ్లు (Kidney Stones) ఏర్పడే ప్రమాదం 20% వరకు పెరుగుతుంది. అంతేకాకుండా, అధిక క్యాల్షియం రక్తనాళాల్లో పేరుకుపోయి గుండె జబ్బుల ముప్పును పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సప్లిమెంట్లు తీసుకునే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించడం ఎంతో ఆవశ్యకం. విటమిన్ డి అనేది కొవ్వులో కరిగే (Fat soluble) విటమిన్, కాబట్టి దీనిని కొద్దిగా కొవ్వు పదార్థాలు ఉండే ఆహారంతో (ఉదాహరణకు పాలు లేదా పెరుగు) తీసుకుంటే శరీరం వేగంగా గ్రహిస్తుంది. క్యాల్షియం టాబ్లెట్లను భోజనం చేసిన తర్వాత తీసుకోవడం మంచిది. ముఖ్యంగా, ఒకేసారి 500 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ క్యాల్షియాన్ని శరీరం గ్రహించలేదు కాబట్టి, ఎక్కువ డోస్ ఉంటే రోజులో రెండు సార్లుగా విభజించి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. థైరాయిడ్ లేదా ఐరన్ సప్లిమెంట్లు వాడేవారు క్యాల్షియం టాబ్లెట్లకు కనీసం 2 నుండి 4 గంటల సమయం వ్యవధి ఇవ్వాలి. కాబట్టి సొంత వైద్యం మానుకుని, రక్త పరీక్షల ద్వారా మీ శరీరంలో ఏ పోషకం లోపించిందో తెలుసుకుని, డాక్టర్ సలహా మేరకే సరైన డోసేజ్ వాడటం ఆరోగ్యానికి అత్యంత సురక్షితం.     [ Vitamin D, Calcium, Calcium Supplements, Vitamin D Deficiency, Calcium Deficiency, Bone Health, Osteoporosis, Calcium Absorption, Kidney Stones, Nutritional Supplements ]
దక్షిణ భారతదేశపు పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకువచ్చే అత్యంత ప్రసిద్ధమైన, ఆరోగ్యకరమైన ఉపాహారం నోరూరించే వేడివేడి ఇడ్లీ. తెల్లగా, మల్లెపూవులా మెత్తగా ఉండే ఇడ్లీలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆహారప్రియుల హృదయాలను కొల్లగొట్టాయి. అత్యుత్తమమైన, సులభంగా అరిగే పౌష్టికాహారంగా పేరుగాంచిన ఈ ఇడ్లీలకు ఒక ప్రత్యేకమైన రాజధాని నగరం ఉందంటే మీరు నమ్ముతారా? అవును, దక్షిణ భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు రకరకాల ఇడ్లీలకు ప్రసిద్ధి చెందినప్పటికీ, తమిళనాడులోని చారిత్రాత్మక మరియు ఆధ్యాత్మిక నగరమైన మధురై (Madurai) నగరానికి  వరల్డ్ ఇడ్లీ క్యాపిటల్  లేదా ప్రపంచ ఇడ్లీ రాజధాని అనే ఘనమైన కీర్తి లభించింది. వీధి చివర ఉండే చిన్న చిన్న టిఫిన్ బండ్ల నుండి ఐదు నక్షత్రాల హోటళ్ల వరకు, మధురై నగరం అందించే ఇడ్లీల రుచి అత్యంత ప్రత్యేకమైనది మరియు మరెక్కడా లభించనిది. మధురై నగరానికి ఇడ్లీలతో ఉన్న అనుబంధం కేవలం ఒక ఆహార అలవాటు మాత్రమే కాదు, అదొక గొప్ప సంస్కృతి మరియు జీవనశైలి. ఈ నగరంలో దాదాపు 24 గంటల పాటు నిరంతరాయంగా వేడివేడి ఇడ్లీలు లభిస్తూనే ఉంటాయి. మధురైలోని ఐకానిక్ ఇడ్లీ బ్రాండ్  మురుగన్ ఇడ్లీ షాప్  (Murugan Idli Shop) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ నగరంలో ప్రసిద్ధి చెందిన ప్రతి టిఫిన్ సెంటర్ రోజుకు వేలాది సంఖ్యలో ఇడ్లీలను విక్రయిస్తుంది. సాధారణంగా ఒక సగటు మధురై నివాసి తన రోజువారీ ఆహారంలో కనీసం 3 నుండి 4 ఇడ్లీలను భాగం చేసుకుంటారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ లభించే ఇడ్లీ ప్రత్యేకత ఏమిటంటే, వాటి మెత్తదనం మరియు వాటితో పాటు వడ్డించే రకరకాల పచ్చళ్లు. ఒక్కో ప్లేట్ ఇడ్లీతో పాటు కనీసం 4 రకాల విభిన్నమైన చట్నీలు (తేంగై చట్నీ, కార చట్నీ, కొత్తిమీర చట్నీ, పుదీనా చట్నీ) మరియు ఘుమఘుమలాడే సాంబార్ అందించడం మధురై సంప్రదాయం. ఆహార పరిశోధకులు మరియు నిపుణుల విశ్లేషణ ప్రకారం, మధురై ఇడ్లీలు అంత మెత్తగా ఉండటానికి అక్కడ వాడే నీటిలోని ఖనిజ లవణాలు మరియు బియ్యం, మినపప్పుల కచ్చితమైన నిష్పత్తి ప్రధాన కారణం. సాధారణంగా 4.1 నిష్పత్తిలో బియ్యం, మినపప్పులను నానబెట్టి, పిండిని కనీసం 8 నుండి 12 గంటల పాటు సహజ సిద్ధంగా పులియబెట్టడం (Fermentation) వల్ల ఇడ్లీలు ఎంతో సాఫ్ట్‌గా వస్తాయి. పోషకాహార నిపుణుల ప్రకారం, ఆవిరిపై ఉడికించే ఒక సాధారణ ఇడ్లీలో కేవలం 39 నుండి 40 క్యాలరీల శక్తి మాత్రమే ఉంటుంది. ఇందులో 0 గ్రాముల సంతృప్త కొవ్వు (Saturated Fat) మరియు 0 గ్రాముల కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఇడ్లీలను టిఫిన్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన 2 గ్రాముల ప్రోటీన్, 8 గ్రాముల కార్బోహైడ్రేట్లు మరియు అవసరమైన అమినో యాసిడ్లు అందుతాయి. మధురైలో ఇడ్లీల హడావుడి ఎంతలా ఉంటుందంటే, ప్రతిరోజూ తెల్లవారుజామున 4.00 గంటలకే హోటళ్లు మరియు టిఫిన్ సెంటర్లు ప్రారంభమై అర్ధరాత్రి 2.00 గంటల వరకు నిరంతరాయంగా సాగుతాయి. కేవలం మధురై నగరంలోనే రోజుకు సుమారు 500 కంటే ఎక్కువ ప్రధాన ఇడ్లీ తయారీ కేంద్రాలు మరియు వేలాది చిన్న వ్యాపారాలు నడుస్తున్నాయి. ఏటా మార్చి 30న జరుపుకునే  ప్రపంచ ఇడ్లీ దినోత్సవం  (World Idli Day) సందర్భంలో మధురై నగరంలో ప్రత్యేకంగా వందల రకాల ఇడ్లీ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇక్కడి ప్రసిద్ధ మల్లి పూవు ఇడ్లీ (Malli Poo Idli), కరివేపిలై ఇడ్లీ, మరియు పొడి ఇడ్లీలను రుచి చూడటానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది దేశీ, విదేశీ పర్యాటకులు మధురైకి తరలివస్తుంటారు. నాణ్యత, రుచి, పౌష్టికత మరియు నిరంతర లభ్యత విషయంలో ప్రపంచంలోని ఏ నగరం కూడా మధురైకి సాటిరాదని, అందుకే ఈ నగరం ప్రపంచ ఇడ్లీ రాజధానిగా నిలిచిందని ఆహార ప్రియులు ముక్తకంఠంతో కొనియాడతారు.     [ Madurai, World Idli Capital, Idli, Murugan Idli Shop, South Indian Breakfast, Tamil Nadu, Idli Varieties, Fermented Foods, World Idli Day, South Indian Cuisine ]   
పిల్లలు బరువు పెరగడం లేదా ఎత్తు పెరగడంలో ఇబ్బంది పడుతున్నారా? చదువులో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత విషయంలో సమస్యలు ఉన్నాయా? పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందించడంలో కొన్ని గింజలు ఉపయోగపడతాయి. డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ సూచించిన విధంగా బాదం, పిస్తా, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు తీసుకుని ఇంట్లోనే పోషకమైన గింజల పొడిని తయారు చేసుకోవచ్చు. ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకుని విడిగా వేయించి, మెత్తగా పొడి చేసుకుని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిలో అర టీస్పూన్‌ను 100 మి.లీ. గోరువెచ్చని పాలలో కలిపి పిల్లలకు ఇవ్వవచ్చని డాక్టర్ సూచిస్తున్నారు. ఈ గింజల్లో ఉండే పోషకాలు పిల్లల ఎదుగుదల, ఎముకల ఆరోగ్యం, మెదడు పనితీరు మరియు శారీరక బలానికి తోడ్పడవచ్చు. ఈ 5 గింజల పొడిని ఎలా తయారు చేసుకోవాలి? పిల్లలకు ఎంత మోతాదులో ఇవ్వాలి? పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ఎండు ద్రాక్షలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మార్కెట్‌లో మనకు రకరకాల ఎండు ద్రాక్షలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ముఖ్యంగా పచ్చగా లేదా బంగారు రంగులో ఉండే ఎండు ద్రాక్షలు, అలాగే నల్లటి ఎండు ద్రాక్షలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ రెండింటిలో ఏది తినాలి, దేని వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి అనే విషయంలో చాలామందికి సందేహాలు వస్తుంటాయి. నిజానికి రెండిట్లోనూ ఎన్నో రకాల పోషకాలు నిండి ఉన్నాయి. కానీ తయారు చేసే విధానం, వాడే ద్రాక్ష రకం ఆధారంగా వీటి రంగుతో పాటు వాటిలోని గుణాలు, అందించే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుంటే.. పచ్చ లేదా బంగారు రంగు ఎండు ద్రాక్ష.. పచ్చటి లేదా బంగారు రంగు ఎండు ద్రాక్షలను సాధారణంగా ఆకుపచ్చ ద్రాక్ష పండ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని త్వరగా ఎండబెట్టడానికి, వాటి రంగు మారకుండా ఉండటానికి ప్రత్యేకమైన పద్ధతులను ఉపయోగిస్తారు. వీటిలో విటమిన్ సి, పొటాషియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో చాలా బాగా పనిచేస్తాయి. వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకం సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. తియ్యటి రుచితో ఉండే ఇవి పిల్లలకు, పెద్దలకు ఎంతో మంచి ఆహారం. నలుపు ఎండు ద్రాక్ష.. నల్లటి ఎండు ద్రాక్షలను నల్లటి ద్రాక్ష పండ్ల నుంచి సహజ సిద్ధంగా ఎండబెట్టడం ద్వారా తయారు చేస్తారు. సహజంగా ఎండడం వల్ల వీటి రంగు నల్లగా మారుతుంది. వీటికి నల్లటి రంగును ఇచ్చే ఆంథోసైనిన్ అనే ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్ వీటిలో సమృద్ధిగా ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాగే రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి నల్ల ఎండు ద్రాక్షలు ఎంతగానో దోహదపడతాయి. వీటిలో ఉండే కాల్షియం, బోరాన్ వంటి ఖనిజాలు ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. జుట్టు రాలడం తగ్గడం, చర్మం పై ముడతలు త్వరగా రాకుండా చూడటం, రక్తాన్ని శుద్ధి చేయడం వంటి ప్రత్యేక ప్రయోజనాలు నల్లటి ఎండు ద్రాక్షల ద్వారా లభిస్తాయి. ఈ రెండింటిలో ఏది ఎక్కువ మేలు చేస్తుంది? రెంటికీ వాటి ప్రత్యేక స్థానం ఉంది.  తక్షణ శక్తి కావాలన్నా,  మంచి జీర్ణక్రియ, సులువైన ఐరన్ పోషణ కావాలంటే పచ్చటి ఎండు ద్రాక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ గుండె ఆరోగ్యం, అధిక రక్తపోటు నియంత్రణ, ఎముకల బలం, జుట్టు , చర్మ సంరక్షణ వంటి విషయాల్లో నల్లటి ఎండు ద్రాక్షలు కాస్త ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తాయి. నల్లటి ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు కాస్త ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడటంలో ఇవి ముందంజలో ఉంటాయి. కాబట్టి రెండింటిలో ఏదో ఒకదాన్నే ఎంచుకోవాల్సిన అవసరం లేదు.  శరీర అవసరాలను బట్టి రెండింటినీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఉదయాన్నే నీటిలో నానబెట్టిన ఎండు ద్రాక్షలను తింటే వాటిలోని పోషకాలు శరీరానికి మరింత త్వరగా అందుతాయి. నానబెట్టిన నీటిని తాగడం వల్ల కూడా శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది. పరిమితికి లోబడి ప్రతిరోజూ వీటిని తీసుకోవడం వల్ల పూర్తి ఆరోగ్యం  సొంతమవుతుంది.                      *రూపశ్రీ.
మెడలో గడ్డ లేదా వాపు కనిపించగానే చాలామందికి క్యాన్సర్‌ గురించి భయం మొదలవుతుంది. కానీ మెడలో వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్‌ కావాల్సిన అవసరం లేదు. థైరాయిడ్‌ సమస్యలు, లింఫ్‌ నోడ్స్‌ వాపు, ఇన్ఫెక్షన్లు తదితర కారణాల వల్ల కూడా మెడలో గడ్డలు ఏర్పడవచ్చు. మెడలో గడ్డలు ఎందుకు వస్తాయి? థైరాయిడ్‌ వాపు ఎలా ఉంటుంది? లింఫ్‌ నోడ్స్‌ ఎందుకు పెరుగుతాయి? మెడలో గడ్డ కనిపిస్తే ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి? సమస్యను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు అవసరం? వంటి ముఖ్యమైన విషయాలను సీనియర్ ENT, హెడ్ & నెక్ సర్జన్ డాక్టర్ అశోక్ పృథ్వీరాజ్ మొగంటి ఈ వీడియోలో సులభంగా వివరిస్తున్నారు. మెడలో గడ్డను నిర్లక్ష్యం చేయకుండా, దాని కారణాన్ని వైద్యుల సలహాతో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో మెడలో గడ్డలు, థైరాయిడ్‌ సమస్యలు, లింఫ్‌ నోడ్స్‌ వాపు మరియు అవసరమైన వైద్య పరీక్షల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. గమనిక: మెడలో గడ్డ లేదా వాపు ఉంటే స్వయంగా నిర్ధారణ చేసుకోకుండా వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)