LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన  క్యాబినెట్  సమావేశానికి   ఉప ముఖ్యమంత్రి,  పవన్ కళ్యాణ్ గైర్హాజరుపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ పవన్ కల్యాణ్ గైర్హాజర్ ను కూటమి పార్టీల మధ్య విభేదాలుగా చిత్రీకరించి పొలిటికల్ మైలేజీ కోసం తాపత్రేయ పడుతోంది. వాస్తవానికి ప్రభుత్వం   కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే   ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.    అయితే ఇక్కడే వైసీపీయులు కేబినెట్ భేటీకి గైర్హాజరై విశ్రాంతి తీసుకున్న పవన్ కల్యాణ్   కుంకీ ఏనుగులకు స్వాగతం పలకడానికి మాత్రం ఎలా రాగలిగారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కుంకీ ఏనుగుల విషయంలో పవన్ కల్యాణ్ బయటకు వచ్చింది ఆరగంట సేపు మాత్రమేననీ, అదే కేబినెట్ భేటీ అయితే గంటల తరబడి ఉంటుందనీ,   కొంత కాలంపాటు అలా సుదీర్ఘ సమయం జరిగే సమావేశాలు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వైద్యులు విస్పష్టంగా చెప్పినందునే పవన్ కల్యాణ్  క్యాబినెట్ భేటీ హాజరు కాలేదనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  Pawan Kalyan, Pawan Kalyan Shoulder Surgery, AP Cabinet Meeting,   Deputy CM Pawan Kalyan, Jana Sena Party
  మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు. ఆయన కుమారుడు ప్రమేయం ఉన్న ప్రమాదంలో ఒక గొర్రెల కాపరి మరణించడం, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు ఆంధ్రా రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రమాద స్థలంలో నిజాలను దాచేందుకు వేరొక వ్యక్తిని నిలబెట్టారనే అభియోగాలు, నిందితుడిని తప్పించే ప్రయత్నాలు చేశారనే కోణంలో పోలీసులు సిదిరి అప్పలరాజును అరెస్ట్ చేశారు. ఈ అంశంపై  టోన్‌ న్యూస్‌లో ఆసక్తికర విశ్లేషణ జరిగింది. ఈ పరిణామంపై వైసీపీ అధినేత జగన్ ఘాటుగా స్పందించారు. అప్పలరాజును పేద మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన వైద్యుడిగా, నిష్కళంకమైన నాయకుడిగా అభివర్ణిస్తూ, ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రమాదాన్ని హత్యగా ఎలా చిత్రీకరిస్తారని, పిల్లాడి పొరపాటుకు తండ్రిని ఎలా బాధ్యుడిని చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ వరుస పరిణామాలు రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ మరియు కూటమి ప్రభుత్వం మధ్య రాజకీయ పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ కేసును కేవలం ఒక సాధారణ రోడ్డు ప్రమాదంగా చూసేందుకు వీల్లేదు. దీని వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహాలు, ప్రయోజనాలు కనిపిస్తున్నాయి.  తమ పార్టీ నాయకులపై ఏ చిన్న కేసు నమోదైనా, దాన్ని తక్షణమే "రాజకీయ కక్ష సాధింపు"గా మలిచే వ్యూహాన్ని వైఎస్సార్‌సీపీ అనుసరిస్తోంది. నాయకులకు శ్రేణుల స్థాయిలో అభయం ఇవ్వడం, పార్టీ శ్రేణులు అధైర్యపడకుండా కాపాడుకోవడం ఈ డిఫెన్సివ్   కేసు చట్టపరమైన లోతుపాతులతో సంబంధం లేకుండా, నాయకుడికి అధినేత పూర్తి మద్దతుగా నిలవడం ద్వారా పార్టీ కేడర్‌కు బలమైన సందేశం వెళ్తుంది. చట్టం ముందు తప్పు-ఒప్పుల కంటే, పార్టీ అండగా ఉందనే భావనను కలిగించడం ఇక్కడ ప్రాధాన్యంగా మారింది. కూటమి ప్రభుత్వ నిష్పాక్షిక ముద్ర: మరోవైపు, అధికారంలో ఉన్న తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోతుందనే సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని చాటడం కూటమి ప్రాథమిక లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ వ్యూహాత్మక ఘర్షణల్లో సామాన్య ప్రజలు, ముఖ్యంగా బాధితుల పట్ల మానవీయ కోణం మరుగునపడిపోతోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అరెస్ట్ పరిణామం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పలు మార్పులకు బీజం వేసే అవకాశం ఉంది. నేరారోపణలు లేదా చట్టపరమైన చిక్కుల్లో ఉన్న నాయకులను రాజకీయంగా వెనకేసుకురావడం ద్వారా తటస్థ ఓటర్లలో (Neutral Voters) ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందనేది కీలక అంశం.  చట్టాన్ని గౌరవించే ధోరణి లేకపోతే, మధ్యతరగతి మరియు మేధోవర్గం దూరమయ్యే ప్రమాదం ఉంది. చట్టబద్ధమైన పాలనను అందిస్తున్నామని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ఇది ఒక పరీక్ష లాంటిది. కేసుల్లో ఎలాంటి పక్షపాతం లేకుండా, పారదర్శకంగా విచారణ పూర్తి చేయగలిగితేనే ప్రభుత్వానికి విశ్వసనీయత పెరుగుతుంది.  ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి ఈ తరహా అరెస్టులు ఒక రకంగా కేడర్‌ను రోడ్లపైకి తెచ్చే అవకాశాన్ని ఇస్తాయి. అయితే, ఇవి ప్రజల్లో సానుభూతిని తెచ్చిపెడతాయా లేదా పార్టీ ప్రతిష్టను దిగజారుస్తాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. సమగ్ర విచారణ ద్వారా న్యాయం జరగడం, చట్టం ముందు అందరూ సమానులే అనే సంకేతం సమాజంలోకి వెళ్లడం మాత్రమే ఈ వివాదానికి సరైన ముగింపు కాగలదు. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.   Seediri Appalaraju Arrest, YS Jagan Mohan Reddy, AP Political News, Seediri Appalaraju Son Case, AP Politics, YSRCP Strategy, AP Law and Order, CM Chandrababu Naidu
వైసీపీలో ఎప్పుడు ఎవరికి అందలం దక్కుతుందో.. ఎప్పుడు ఎవరికి అధ:పాతాళమే దిక్కౌతుందో తెలియని పరిస్థితి ఉంది. జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆడింది ఆట, పాడింది పాటగా పెత్తనం చెలాయించారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ అండతో చెవిరెడ్డి పార్టీలో ఓ వెలుగు వెలిగారు. చెవిరెడ్డికి దక్కిన ప్రాధాన్యత వైసీపీలో మరెవరికీ దక్కలేదంటే అందులో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. అటుంటి చెవిరెడ్డి భాస్కరరెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.  గత సార్వత్రిక ఎన్నికల్లో  ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించడంతో సరిపెట్టకుండా, ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇచ్చి మరీ పోటీకి దింపారు జగన్. అటువంటి చెవిరెడ్డిని జగన్ ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  జగన్ అధికారంలో ఉండగా జరిగిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కీలకంగా వ్యవహరించారు. మద్యంవిధానంరూపకల్పన దగ్గరనుంచి డిస్టిలరీల వరకూ చెవిరెడ్డి అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ కుంభకోణంపై ఈడీ దర్యాప్తుచేపట్టింది. అంతకు ముందే ఇదే కేసులో చెవిరెడ్డి అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉండి బెయిలుపై బయటకు వచ్చారు. ఇప్పుడు అదే కుంభకోణం చెవిరెడ్డిని జగన్ కు దూరం చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మద్యం కుంభకోణం వ్యవహారంలో జగన్ దృష్టికి కూడా రాకుండా చెవిరెడ్డి తన సొంతంకోసం సొమ్ములు వెనకేశారనీ, సిట్ దర్యాప్తులో భాగంగా చెవిరెడ్డిని అరెస్టు చేసి విచారించిన సందర్భంలో ఆ వివరాలు వెల్లడయ్యాయనీ  పార్టీ వర్గాల భోగట్టా. దీంతో మద్యం కుంభకోణం విషయంలో తన అనుకునన చెవిరెడ్డే తనను మోసం చేశారన్న అసంతృప్తితో జగన్ చెవిరెడ్డిని పూర్తిగా పక్కన పెట్టేశారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.   దీంతో ఒకప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లోనే తరచుగా కనిపించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ తలుపులు బంద్ అయ్యాయని అంటున్నారు. ఈ కారణంగానే గత కొంత కాలంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి జగన్ దరిదాపుల్లో కూడా నిలబడలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారనీ చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగాఇటీవలి కాలంల ో పార్టీ సమావేశాలకు కూడా ఆయనఎంట్రీని జగన నిేధించరనిపేర్కొంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డికి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ దక్కే అవకాశాలు దాదాపు శూన్యమని పార్టీవర్గాలే చెబుతున్నాయి.   Jagan keeps Chevireddy at a distance, Ap Liquor cam, Chevireddy Bhaskarreddy, Cheating 
ఒక దేశంలోని 150 కోట్ల మంది ప్రజలను ఎల్లకాలం మోసం చేయడం సాధ్యమేనా? ఒక మహా సామ్రాజ్యాన్ని నిరంతరం ఏలగలరా? అంటే అది అసాద్యం అన్న సమాధానమే వస్తుంది.   నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కాక్రోచ్‌ లు వీధుల్లోకి వచ్చాయి! ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ  కాక్రోచ్ జనతా పార్టీ  రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.   సరిహద్దు గోడలు, ముళ్ల కంచెలు, పోలీసు లారీలు, వాటర్ క్యానన్లు, లాఠీచార్జీలు... వీటివేవీ   యువత ఆక్రోశాన్ని, ఆగ్రహాన్నీ  ఆపలేకపోతున్నాయి. పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, వ్యవస్థాగత అవినీతి, ప్రశ్నించే గొంతుకలపై నిర్బంధాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటం కేవలం ఒక మంత్రి రాజీనామాకో, పరీక్షల రద్దుకో పరిమితం కాదని, ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యమని ఉద్యమకారులు చెబుతున్నారు.   మతం, కులం, వర్గం ఆధారంగా పౌరుల మధ్య వ్యత్యాసం చూపే విభజన రాజకీయాలను ఎండగడుతూ, ఎలాంటి ఆయుధాలు లేకుండానే శాంతియుతంగా జరుగుతున్న ఈ ఉద్యమం ప్రస్తుత పాలక వ్యవస్థ పునాదులను కదిలించివేస్తున్నది.     Delhi students protest,  Cockroach Janata Party,  Competitive exam paper leak, Demand for Education Ministers resignation
దేశవ్యాప్తంగా ప్రస్తుతం నీట్   లీకేజీ వ్యవహారం   కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీ వీధుల నుంచి మొదలైన విద్యార్థుల నిరసన జ్వాలలు దేశమంతటికీ వ్యాపించాయి. తమ భవిష్యత్తు, విద్యా హక్కుల రక్షణ కోసం లక్షల మంది విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. ఎలాంటి జకీయ ప్రమేయం లేకుండా,   విద్యార్థుల హక్కుల కోసం సాగుతున్న ఈ  పోరాటానికి జనబాహుల్యం నుంచి విశేష మద్దతు లభిస్తోంది.    ఇక్కడే.. ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది.   జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ   మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని   జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.   రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక  అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ,  నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైసిపి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువత, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరింది. వైసిపి ప్రధానంగా మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నీట్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని,  ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తోంది. నీట్ వివాదంతో డీఎస్సీని ముడిపెట్టడం ద్వారా యువతలో ఆందోళన రేకెత్తించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. నీట్ పరీక్షల తీవ్రతకు, ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ అంశానికి అసలు పోలికే లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భవిష్యత్తుతో ముడిపడిన నీట్ వ్యవహారం జాతీయ మీడియాలో, సుప్రీం కోర్టులో,  పార్లమెంటులో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో వైసీపీ లేవనెత్తుతున్న ఏపీ డీఎస్సీ విషయంలో స్థానికంగా అంటే రాష్ట్రంలో కూడా పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు.   జాతీయ స్థాయిలో హోరెత్తుతున్న ఒక స్వచ్ఛంద  విద్యార్థి ఉద్యమంలోకి, రాష్ట్రంలో కూడా ఎవరూ ప్రాధాన్యత ఇవ్వడానికి ముందుకు రాని డీఎస్సీ అంశాన్ని తీసుకురావాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నం వృధా ప్రయాసే, కాకుండా ఆ ప్రయత్నాలు వైసీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.   YCP NEET Protests, AP Mega DSC Issue, YSRCP July 28 Rally
ALSO ON TELUGUONE N E W S
కోలీవుడ్ యంగ్ హీరో ధృవ్ విక్రమ్‌పై నైలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ నిర్మాణ సంస్థలు సంచలన రీతిలో పోలీసులతో పాటు చిత్రమండలికి ఫిర్యాదు చేయడంతో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేగింది. వర్సటైల్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడిగా సినీ రంగానికి పరిచయమైన ధృవ్ విక్రమ్, తన మొదటి చిత్రం 'ఆదిత్య వర్మ'తోనే నటనా ప్రతిభను చాటుకుని యంగ్ జనరేషన్ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత 'మహాన్' వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకుని, వరస ఆఫర్లతో ఎంతో ఆశాజనకంగా సాగుతున్న అతని సినీ కెరీర్‌లో ఈ ఊహించని చట్టపరమైన వివాదం ఒక పెద్ద ప్రతిబంధకంగా మారింది. ఈ వివాదానికి ప్రధాన మూలం ఒక భారీ బడ్జెట్ సినిమా నిర్మాణ ఒప్పందం, దాని చుట్టూ తిరిగిన ఆర్థిక లావాదేవీలు అని తెలుస్తోంది. నైలాద్రి ప్రొడక్షన్స్ సంస్థ ప్రముఖ పెన్ స్టూడియోస్‌తో కలసి ధృవ్ విక్రమ్ ప్రధాన పాత్రలో ఒక భారీ చిత్రాన్ని రూపొందించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ధృవ్ విక్రమ్‌కు అత్యంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అడ్వాన్స్ ఇవ్వడమే కాకుండా, ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసం దాదాపు రూ. 5 కోట్లకు పైగా నిధులను నిర్మాతలు ఇప్పటికే వెచ్చించినట్లు సమాచారం. అయితే, ఒప్పంద పత్రాల్లో సంతకం చేసిన ప్రకారం షూటింగ్ డేట్లను కేటాయించడంలో మరియు ప్రాజెక్ట్‌ను నిర్దేశిత సమయంలో ప్రారంభించడంలో ధృవ్ తీవ్ర నిర్లక్ష్యం వహించారని ప్రొడక్షన్ హౌసెస్ తమ ఫిర్యాదులో ఆరోపించాయి. సమయం గడుస్తున్న కొద్దీ, ప్రాజెక్ట్ పురోగతిపై నిర్మాతలు పంపిన పలు అధికారిక నోటీసులకు గానీ, సందేశాలకు గానీ ధృవ్ విక్రమ్ లేదా అతని టీమ్ నుంచి సరైన స్పందన రాలేదని నిర్మాతలు వాపోతున్నారు. తమ సినిమాకు ఇచ్చిన కమిట్‌మెంట్‌ను పక్కన పెట్టి ఇతర కొత్త ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యత ఇస్తూ, తమ భారీ ప్రాజెక్ట్‌ను అంతులేని నిరీక్షణలోకి నెట్టేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల నైలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంస్థలకు సమయంతో పాటు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా, వేసిన సెట్లు వృథా అయి, సాంకేతిక నిపుణుల కాల్ షీట్లు కూడా వృథాగా మారిపోయాయి. అన్ని రకాల శాంతియుత చర్చలు విఫలమైన అనంతరం, నిర్మాతల మండలి మరియు పోలీసు అధికారులను ఆశ్రయించడం తప్ప తమకు వేరే మార్గం లేదని నిర్మాతలు ఒక తీవ్ర నిర్ణయానికి వచ్చారు. ఒప్పంద నిబంధనలను ఘోరంగా ఉల్లంఘించడమే కాకుండా తమను ఆర్థికంగా నష్టపరిచారంటూ వారు ధృవ్ విక్రమ్‌పై అధికారికంగా ఫిర్యాదు దాఖలు చేశారు. చిత్ర పరిశ్రమలో నిర్మాతల శ్రేయస్సును కాపాడటానికి, నటులు తమ వృత్తిపరమైన ఒప్పందాలకు కట్టుబడి ఉండేలా చూడటానికే ఈ కఠిన చర్య తీసుకున్నట్లు ప్రొడక్షన్ హౌసెస్ ప్రకటించాయి. ఈ వివాదం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది, మరి దీనిపై ధృవ్ విక్రమ్ కాంపౌండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.     Dhruv Vikram Niladri Productions PEN Studios Chiyaan Vikram 
Christopher Nolan has once again proved his unmatched popularity among Indian audiences. His latest epic, The Odyssey, has crossed the Rs. 100 crore gross mark at the Indian box office within its first week, becoming one of the fastest Hollywood films to achieve the milestone in the country. The film ended its seven-day run with an estimated Rs. 107 crore gross, continuing its impressive theatrical journey. The film opened to record-breaking numbers for a non-franchise Hollywood release in India and maintained a solid hold through the weekdays. Despite the expected Monday drop after a strong opening weekend, Nolan's adaptation witnessed steady collections, highlighting the filmmaker's loyal fanbase and strong word of mouth. With this feat, The Odyssey has also entered the list of the Top 15 highest-grossing Hollywood films in India. The achievement further strengthens Nolan's remarkable box office track record in the country after the blockbuster success of Oppenheimer, reaffirming his status as one of the biggest international directors in the Indian market. Featuring an ensemble cast led by Matt Damon, Tom Holland, Anne Hathaway, Zendaya, Robert Pattinson, Lupita Nyong'o and Charlize Theron, The Odyssey is based on Homer's legendary Greek epic. Mounted on a massive scale with cutting-edge visuals and Nolan's signature storytelling, the film has drawn audiences across premium formats, especially IMAX. The strong first-week performance has put The Odyssey on course for an even bigger lifetime total in India. With limited competition from Hollywood releases in the immediate future and sustained audience interest, the film is expected to continue its successful run over the coming weeks. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
    వరుణ్ తేజ్(Varun Tej).. కట్ అవుట్, గ్లామర్, యాక్టింగ్ అన్ని పుష్కలమైన మోతాదులోనే ఉన్నాయి. కానీ కొంత కాలం నుంచి డిజాస్టర్ అనేది ఆగర్భ శత్రువుగా వరుణ్ తేజ్ చుట్టూ వైఫై లా తిరుగుతూ ఉంది. వరుసగా నాలుగు డిజాస్టర్లు అందుకున్నాడు. (వెంకటేష్ తో కలిసి) ఎఫ్ 3 ముందు చేసిన గని,  గాండీవధారి అర్జున, పాన్ ఇండియా మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్' , మట్కా' .. ఇలా నాలుగు చిత్రాలు భారీ డిజాస్టర్స్. పెట్టిన బడ్జెట్ కి, వచ్చిన కలెక్షన్స్ ని నక్కకి నాగలోకానికంత తేడా  ఉంది.  ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన కెరీర్‌ని  మళ్లీ గాడిలో పెట్టేందుకు వరుణ్ తేజ్ తీసుకున్న ఒకే ఒక్క కొత్త నిర్ణయం 'కోరియన్ కనకరాజు'. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లోనే అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌గా మారింది. తెలుగు సినీ చరిత్రలోనే తొలిసారిగా ఒక ‘ఇండో-కోరియన్ హారర్ కామిడీ’ జానర్‌లో నిర్మిస్తుండటం విశేషం. వరుస సీరియస్, యాక్షన్ సినిమాలతో బోరింగ్ అనిపించిన వరుణ్, ఈసారి అవుట్ అండ్ అవుట్ హ్యూమర్, ఫన్ ఎంటర్‌టైనర్‌  ఎంచుకోవడం ఆయన కెరీర్‌కు అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు.  ఈ సినిమాపై పరిశ్రమలో భారీ ఆశలు నెలకొనడానికి ప్రధాన కారణం దీని నిర్మాణ విలువలు మరియు ప్రతిభావంతమైన సాంకేతిక నిపుణుల కలయిక. ప్రముఖ నిర్మాణ సంస్థలు యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ ప్రాజెక్ట్‌ నిర్మిస్తున్నాయి.  Also read: శేఖర్ కమ్ముల భావోద్వేగం.. అభిమానులు శాంతించండి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందిస్తున్న స్వరాలు ఇప్పటికే యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల విడుదలైన "కమ్‌సాహంనిడా" అనే లిరికల్ పాట ట్రెండింగ్ లో ఉంది.  'కిమ్‌చీకారం' టీజర్ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుని సోషల్ మీడియాను ఊపేసింది. మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్.  ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  Varun Tej, Korean Kanakaraju, Ritika Nayak, Merlapaka Gandhi  
Yash believes Ramayana has endured for thousands of years because it is, at its heart, a deeply human story. Speaking at San Diego Comic-Con, where the team promoted the film ahead of its global release, the actor shared his thoughts on portraying Ravana and the vision behind the ambitious adaptation directed by Nitesh Tiwari. The actor, who is also producing the film alongside Namit Malhotra, said the makers never wanted to view Ramayana solely through the lens of religion. Instead, they focused on its universal themes of human conflict, emotions and ego. According to Yash, the story explores how an immensely powerful and intelligent man is ultimately brought down by his own arrogance and a series of wrong choices. He added that the team has remained faithful to the original epic without altering its emotional core, while presenting it on a grand cinematic scale for audiences across the world. Talking about stepping into the shoes of Ravana, Yash said he never approached the character as someone who is simply evil or unrelatable. Instead, he saw Ravana as a complex human being blessed with extraordinary abilities whose overwhelming ego led to his downfall. He described the film as an ideological clash between two powerful personalities, making the role one of the most fascinating characters he has portrayed. Recalling his childhood, Yash revealed that his grandfather first introduced him to the Ramayana as a bedtime story, an experience that stayed with him over the years. That emotional connection, he said, inspired the team to preserve the essence of Lord Rama and Sita's journey while bringing the story to life with world-class production values. He expressed confidence that audiences would be mesmerised by the visuals and emotionally invested in the narrative. Starring Ranbir Kapoor as Lord Rama, Sai Pallavi as Sita and Yash as Ravana, Ramayana is being mounted as one of the biggest Indian films ever made. The film features music by Hans Zimmer and A.R. Rahman, with Oscar-winning VFX studio DNEG handling the visual effects. Distributed internationally by Sony Pictures, Ramayana: Part 1 is slated for a grand worldwide release during Diwali.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'చెన్నై లవ్ స్టోరీ'. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మాతలు SKN, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ప్రేమకథా చిత్రానికి రవి నంబూరి స్క్రీన్ ప్లే, సంభాషణలు అందిస్తూ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మణిశర్మ అందించిన సంగీతం ఈ ప్రేమకథకు ప్రధాన బలంగా నిలిచింది. నేడు(జూలై 24) ఈ సినిమా విడుదల కాగా, నిన్న రాత్రి ప్రీమియర్స్ వేశారు. సాధారణంగా ఒక ప్రేమకథా చిత్రానికి ప్రీమియర్ షోల ద్వారా భారీ మొత్తంలో వసూళ్లు రావడం అరుదు. అయితే 'చెన్నై లవ్ స్టోరీ' ఆ రికార్డులను తిరగరాసింది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే ఈ చిత్రం ఏకంగా రూ. 3.13 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లు రాబట్టిన లవ్ స్టోరీ సినిమాల్లో ఇది సరికొత్త రికార్డుగా నిలిచింది. 'చెన్నై లవ్ స్టోరీ' బుకింగ్స్ బాగున్నాయి. ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టే అవకాశం కనిపిస్తోంది. సినిమాలోని కథ, కథనాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉండటంతో పాటు, కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా మణిశర్మ అందించిన మ్యూజికల్ మ్యాజిక్ థియేటర్లలో ప్రేక్షకులకు మైమరిపించే అనుభూతిని అందిస్తోంది.   Chennai Love Story, Box Office, Kiran Abbavaram, Sri Gouri Priya, Sai Rajesh, SKN  
సాంకేతిక పరిజ్ఞానం మనుషుల జీవన విధానాన్ని సులభతరం చేసేందుకు, సమాజ ప్రగతికి ఎంతగానో ఉపయోగపడాలి. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది వికృత మనస్తత్వం కలిగిన వ్యక్తులు అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఆయుధంగా మలచుకుని ఇతరుల జీవితాలను నాశనం చేయడానికి, పైశాచిక ఆనందం పొందడానికి వాడుతున్నారు. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన నటీమణులను లక్ష్యంగా చేసుకుని డీప్‌ఫేక్, ఏఐ సాంకేతికతతో అశ్లీల ఫోటోలు, వీడియోలు సృష్టిస్తూ సోషల్ మీడియా వేదికగా డిజిటల్ వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు ఇటీవల తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా భోజ్‌పురి సినీ పరిశ్రమలో చోటుచేసుకున్న ఒక అత్యంత దిగ్భ్రాంతికరమైన ఉదంతం ఇటు సినీ వర్గాల్లోనూ, అటు సోషల్ మీడియా ప్రపంచంలోనూ పెద్ద దుమారాన్నే రేపుతోంది. ప్రముఖ భోజ్‌పురి నటి అంజనా సింగ్ తనపై, తన కుటుంబంపై జరుగుతున్న సైబర్ దాడిపై అత్యంత కఠినమైన చట్టపరమైన చర్యలకు పూనుకున్నారు. తనకు ఎదురైన దారుణమైన డిజిటల్ వేధింపులపై నటి అంజనా సింగ్ లక్నోలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. ప్రముఖ భోజ్‌పురి నటుడు, సింగర్ ఖేసరి లాల్ యాదవ్, ఆయన మేనేజర్, సినీ రచయిత అఖిలేష్ కశ్యప్, కృష్ణ బెదర్దీ, సంజయ్ యాదవ్‌లతో పాటు పలు సోషల్ మీడియా అకౌంట్లపై ఆమె ఈ ఫిర్యాదును దాఖలు చేయడం విశేషం. పక్కా ప్రణాళిక ప్రకారమే తనను సామాజికంగా, మానసికంగా వేధించేందుకు ఒక డిజిటల్ సైబర్ నెట్‌వర్క్ క్రియాశీలకంగా పనిచేస్తోందని ఆమె తన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యంత దుర్మార్గంగా వాడుకుంటూ, మహిళా నటుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న సైబర్ నేరగాళ్లకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే తాను చట్టపరమైన పోరాటానికి సిద్ధమైనట్లు ఆమె వెల్లడించారు. ఈ వివాదంలో అందరినీ తీవ్రంగా కలిచివేసిన అంశం ఏమిటంటే, కేవలం నటి అంజనా సింగ్‌ను మాత్రమే కాకుండా ఆమె 11 ఏళ్ల చిన్నారి కూతురిని కూడా ఈ వికృత క్రీడలోకి లాగడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ అంజనా సింగ్ తో పాటు ఆమె 11 ఏళ్ల పసిపాప ఫోటోలు, వీడియోలను కూడా అశ్లీలంగా రీక్రియేట్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. అంతటితో ఆగకుండా సదరు సోషల్ మీడియా ఖాతాల ద్వారా వారిపై అత్యంత అభ్యంతరకరమైన, అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ, ఏకంగా ప్రాణభయంతో కూడిన బెదిరింపులకు గురిచేశారు. ఒక 11 ఏళ్ల మైనర్ బాలికను సైతం వదలకుండా ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడటం కుటుంబ సభ్యులను తీవ్ర మానసిక క్షోభకు, సామాజిక వేదనకు గురిచేసిందని అంజనా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ వివాదానికి మూలం ఇటీవల జరిగిన ఒక సంఘటన అని తెలుస్తోంది. ఇటీవల ఒక ప్రముఖ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజనా సింగ్, నటుడు ఖేసరి లాల్ యాదవ్‌కు సంబంధించి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని, అనుభవాలను బహిరంగంగా పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ వెలువడిన నాటి నుంచే సోషల్ మీడియాలో ఆమెను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున ఆన్‌లైన్ ట్రోలింగ్, సైబర్ వేధింపుల ప్రచారం మొదలయ్యాయి. సైబర్ క్రిమినల్స్ ఒక ముఠాగా ఏర్పడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల ద్వారా నకిలీ అశ్లీల చిత్రాలను సృష్టించి విస్తృతంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. ఒక సినీ నటిగా, తల్లిగా తన హక్కులను, తన బిడ్డ రక్షణను కాపాడుకోవడానికి పోలీసులను ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేకపోయిందని ఆమె తెలిపారు. ఈ డిజిటల్ దాడికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు, వీడియో లింకులు, సోషల్ మీడియా పోస్టులతో కూడిన పక్కా డిజిటల్ ఆధారాలను అంజనా సింగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమర్పించారు. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి ప్రధాన సోషల్ మీడియా దిగ్గజాలకు ఐటీ చట్టాల ప్రకారం తక్షణమే నోటీసులు జారీ చేయాలని ఆమె పోలీసులను కోరారు. నేరస్తుల ఐపీ అడ్రస్‌లు (IP Addresses), లాగిన్ వివరాలు, వాడిన డివైజ్ రికార్డులు వంటి సాంకేతిక డేటాను భద్రపరిస్తేనే ఈ సైబర్ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టడం సాధ్యమవుతుందని ఆమె విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ తీవ్రమైన ఆరోపణలపై నటుడు ఖేసరి లాల్ యాదవ్ లేదా ఆయన బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. 11 ఏళ్ల మైనర్ పాపను సైతం సైబర్ వేధింపుల్లోకి లాగిన ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని, డిజిటల్ ప్రపంచంలో మహిళలకు రక్షణ పెంచాలని ప్రజా సంఘాలు, సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.   Anjana Singh FIR, Khesari Lal Yadav, Obscene AI Video Case, Cyber Crime Police Lucknow, Deepfake AI Harassment, Bhojpuri Actress Cyber Complaint
శేఖర్ కమ్ముల.. తెలుగు సినిమాకి సరికొత్త స్క్రీన్ ప్లే, భావోద్వేగాన్ని పరిచయం చేసిన విభిన్న దర్శకుడు. ఆయన చిత్రంలోని క్యారెక్టర్లు సెల్యులాయిడ్ పై పెర్ఫార్మ్ చేస్తుంటే  మనతో ఏవో కబుర్లు చెప్తునట్టుగా అనిపించడంతో పాటు ఫ్యామిలీ  మెంబర్స్ గా ఫీలవుతాం. అందుకు నిదర్శనం శేఖర్ కమ్ముల నుంచి ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలు. ఢిల్లీ వేదికగా ఆరంభమైన విద్యార్థుల పోరాటం  దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో పారదర్శకత, బాధ్యతాయుతమైన పాలన కావాలంటూ లక్షలాది మంది విద్యార్థులు, ముఖ్యంగా నేటి 'జెన్ జీ' (Gen Z) యువతరం చేపట్టిన ఈ ఆందోళనకి  సమాజంలోని అన్ని వర్గాల నుంచి అపారమైన మద్దతు వెల్లువెత్తుతోంది. ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో పాటు పలువురు ప్రముఖ క్రీడాకారుల సతీమణులు, సామాజిక వేత్తలు పాలకులు తక్షణమే జవాబుదారీతనం వహించాలని గళమెత్తారు. ఇదే క్రమంలో  శేఖర్ కమ్ముల సైతం ఈ యువ ఉద్యమం పట్ల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన పంచుకున్న సుదీర్ఘమైన, ఆవేదనతో కూడిన అభిప్రాయాలు ప్రతి ఒక్కరి హృదయాల్ని కలిచివేస్తున్నాయి జెన్ జీ విద్యార్థులు లేవనెత్తుతున్న డిమాండ్లలో నూటికి నూరు శాతం పూర్తి న్యాయం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కీలకమైన నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి  అంతేకాకుండా, ఈ అన్యాయాన్ని తట్టుకోలేక, తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడిన అమాయక నీట్ విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే తగిన నష్టపరిహారాన్ని అందించాలి. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి అక్రమాలు, లీకేజీలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అసలు ఏ ప్రభుత్వమైనా ప్రజలు లేదా విద్యార్థులు అడగకుండానే ప్రాథమిక బాధ్యతగా చేయాల్సిన పనులను సాధించుకోవడానికి ఈరోజు పిల్లలు రోడ్డెక్కాల్సి రావడం బాధాకరం. Also read: సడన్ గా బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకున్న నటి.. కారణం ఇదే! ఈ అతి చిన్న డిమాండ్ల నెరవేర్పు కోసం లక్షలాది మంది చిన్న పిల్లలు రోడ్లపై లాఠీ దెబ్బలు తింటూ రక్తమోడుతున్న దృశ్యాలు నన్ను తీవ్రంగా కలచివేస్తున్నాయి. తిండీ తిప్పలు మాని, నిద్రాహారాలు మానేసి, రాత్రనకా పగలనకా వీధుల్లో దెబ్బలు తింటూ ఓర్పుతో చేస్తున్న పోరాటంలో మన పిల్లల స్ఫూర్తి గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన పిల్లలు గెలిస్తే ఈ దేశం గెలిచినట్టే. మన పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉంటేనే మనం సార్థకత సాధించినట్టు అని భావోద్వేగ రీతిలో చెప్పుకొచ్చాడు. శేఖర్ కమ్ముల ప్రీవి యస్ మూవీ కుబేర. నాగార్జున, ధనుష్ , రష్మిక తమ అద్భుతమైన పెర్ఫార్మ్ తో హిట్ చేసారు.   sekhar kammula, nagarjuna, dhanush, rashmika, neet delhi
ఈ డిజిటల్ యుగంలో చిత్రసీమలో సరికొత్త ట్రెండ్స్ నడుస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే ముందు ఎంత సందడి చేస్తాయో, మరికొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చే ముందు కూడా అంతకంటే ఎక్కువ ప్రచారం పొందుతాయి. కానీ, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్‌గా డిజిటల్ వేదికపై ప్రత్యక్షమయ్యే సినిమాల సంఖ్య కూడా ఇటీవల పెరుగుతోంది. అదే కోవలో ఇప్పుడు టాలీవుడ్‌కి చెందిన ఒక ఆసక్తికరమైన కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు సడన్‌గా వచ్చేసింది.  కమెడియన్ సప్తగిరి, రాజ్ కసిరాజు, నూతన నటుడు పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పురుషః'. మే 22, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే, తాజాగా ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండా నేరుగా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చి సినీ ప్రియులను ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం ప్రధానంగా భార్యాభర్తల మధ్య జరిగే మనస్పర్ధలు, వైవాహిక బంధాల్లో వచ్చే సమస్యలను హాస్యభరితంగా తెరకెక్కించిన తీరుతో సాగుతుంది. కథ విషయానికి వస్తే.. చిన్ననాటి నుండి ప్రాణస్నేహితులైన గోవింద్ (పవన్ కల్యాణ్), సత్తిబాబు (సప్తగిరి), శ్రీను (రాజ్ కసిరెడ్డి, కిస్ (వెన్నెల కిశోర్) ప్రతీ విషయాన్ని పరస్పరం పంచుకుంటూ పెరిగి పెద్దవుతారు. ఆ తర్వాత గోవింద్ కమల (రాయంచ)ను ప్రేమించి పెళ్లి చేసుకోగా, సత్తిబాబుకు లక్ష్మి (హాసిని)తో, అలాగే శ్రీనుకు గీత (విషిక)తో వివాహం జరుగుతుంది. జీవితం ఎంతో సంతోషంగా సాగుతుందని భావించిన ఈ ముగ్గురు స్నేహితులకు భార్యలతో నిత్యం గొడవలు రావడం మొదలవుతుంది. ఈ గొడవలతో తీవ్రంగా విసిగిపోయిన భార్యలు ముగ్గురూ తమకు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతారు. విడాకుల కేసుల విచారణ కోసం భర్తలు కోర్టు చుట్టూ తిరుగుతుంటారు కానీ, భార్యలు మాత్రం కోర్టుకు హాజరుకాకపోవడంతో జడ్జికి అనుమానం వస్తుంది. కోర్టులో కేసు విచారిస్తున్న జడ్జి (వీటీవీ గణేష్) అసలు ఈ భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం ఏంటి, సమస్య ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అసలు గోవింద్, కమల ప్రేమకథ ఎలా మొదలైంది? సత్తిబాబు, శ్రీనులపై వారి భార్యలకు అంత అనుమానం రావడానికి వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? వీరి ముగ్గురి కాపురాల్లో నిప్పులు పోయడంలో స్నేహితుడు 'కిస్' పాత్ర ఏంటి? చివరికి జడ్జి సమక్షంలో ఈ మూడు జంటల కథ ఎలాంటి మలుపు తిరిగి సుఖాంతమైంది అనేదే 'పురుషః' చిత్ర ముఖ్య కథాంశం.  వీరూ ఉలవల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలోరాజీవ్ కనకాల, పమ్మి సాయి వంటి నటులు కూడా కీలక పాత్రల్లో మెరిశారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నపాటి అనుమానాలు ఎలాంటి పరిస్థితికి దారితీస్తాయో సరదాగా చూడాలనుకునే వారు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.     Purushaha, OTT Release, Telugu Comedy, Saptagiri, Vennela Kishore  
చిత్రపరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు చాలా అరుదుగా, విచిత్రంగా నిలుస్తుంటాయి. అలాంటి ఒక అపూర్వమైన రేర్ రికార్డ్ సీనియర్ నటి మీనా, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిల కాంబినేషన్‌లో ఆవిష్కృతమైంది. ఏ భారతీయ చిత్ర పరిశ్రమలోనూ సులభంగా కనిపించని ఒక అరుదైన ప్రయాణం వీరిద్దరి మధ్య సాగడం విశేషం. తెరపై ఒకే స్టార్ హీరోతో వేర్వేరు కాలాల్లో మూడు రకాల పూర్తి భిన్నమైన అనుబంధాలను పండించి ప్రేక్షకులను మెప్పించడం ఒక్క మీనాకే చెల్లింది. ఈ అరుదైన ప్రయాణం 1984లో ప్రారంభమైంది. మీనా తన చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు పి.జి. విశ్వంభరన్ దర్శకత్వంలో వచ్చిన 'ఒరు కోచుకథ ఆరుం పరయత కథ' (1984) అనే మలయాళ చిత్రంతో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో మమ్ముట్టి కూతురు 'రజని' అనే చిన్నారి పాత్రలో మీనా అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో మమ్ముట్టి ఆ చిన్నారిని తన సొంత కూతురిలాగే ప్రాణంగా చూసుకునే తండ్రి తరహా పాత్రలో కనిపించి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. కాలం ముందుకు సాగుతున్న కొద్దీ మీనా చైల్డ్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి కథానాయికగా రూపాంతరం చెంది, దక్షిణ భారతదేశంలో అగ్ర కథానాయికగా వెలిగారు. ఆ తర్వాత కొన్నేళ్లకు, అంటే 2001లో దర్శకుడు వినయన్ తెరకెక్కించిన 'రాక్షస రాజావు' చిత్రంలో మమ్ముట్టి సరసన కథానాయికగా నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నారు. ఒకప్పుడు తండ్రిగా నటించిన హీరో సరసన హీరోయిన్‌గా జోడీ కట్టి వీరిద్దరూ వెండితెరపై మైమరిపించే రొమాంటిక్ కెమిస్ట్రీని పండించి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 'కరుత్త పక్షికల్' (2006), 'కథ పరయుంబోల్' (2007) వంటి చిత్రాల్లో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. అయితే వీరి ఆన్-స్క్రీన్ ప్రయాణంలో అసలైన మ్యాజిక్ 2014లో చోటుచేసుకుంది. వైకోమ్ ముహమ్మద్ బషీర్ ప్రసిద్ధ నవల ఆధారంగా ప్రమోద్ పయ్యన్నూర్ దర్శకత్వంలో వచ్చిన 'బాల్యకాలసఖి' (2014) చిత్రంలో ఈ ఆన్-స్క్రీన్ రిలేషన్ ఒక ఫుల్ సర్కిల్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో మమ్ముట్టి ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో తండ్రి మమ్ముట్టికి భార్యగా, అలాగే కథానాయకుడైన కొడుకు మమ్ముట్టికి ఏకంగా తల్లి పాత్రలో మీనా నటించడం విశేషం. సాధారణంగా ఏకధాటిగా సాగే సినీ ప్రయాణంలో ఒకే హీరోతో తండ్రి-కూతుళ్ల అనుబంధంతో మొదలై, రొమాంటిక్ జోడీగా అలరించి, చివరికి తల్లిగా నటించే అరుదైన మూడంచెల మైలురాయిని అందుకోవడం సినీ చరిత్రలోనే ఒక విలక్షణమైన రికార్డ్. 1984లో చిన్నారిగా మొదలై 2014 నాటికి తల్లి పాత్ర వరకు సాగిన ఈ ముప్పై ఏళ్ల ఆన్ స్క్రీన్ ప్రయాణం ఇప్పటికీ దక్షిణాది సినీ వర్గాల్లో ఎంతో ఆసక్తికరమైన అంశంగా, ఒక ప్రత్యేకమైన ఘనతగా మిగిలిపోయింది.   Meena Mammootty 
తెలంగాణ జానపద గీతాలతో యూట్యూబ్ వేదికగా విపరీతమైన ప్రజాదరణ సంపాదించుకున్న తెలుగమ్మాయి నాగదుర్గ ఇప్పుడు వెండితెరపై తన ముద్ర వేస్తోంది. యూట్యూబ్‌లో తనదైన పాటలు, డ్యాన్సులతో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించిన నాగదుర్గ, హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం 'లవ్ ఓ లవ్'. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ హీరోగా నటించారు. గతంలో ధనుష్ దర్శకత్వం వహించిన 'నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబం' (జాబిల‌మ్మా నీకు అంత కోప‌మా) చిత్రంతో తెరంగేట్రం చేసిన పవిష్ నారాయణ్‌కి ఇది రెండవ చిత్రం కావడం విశేషం. 'లవ్ ఓ లవ్' మూవీ జూలై 10న థియేటర్లలో విడుదలైంది. అయితే, థియేటర్లలో విడుదలైన కేవలం 3 వారాల వ్యవధిలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం కావడం విశేషం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, జూలై 31 నుండి ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళంతో పాటు తెలుగు భాషలో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. మహేష్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామాలో భారీ తారగణం నటించింది. ప్రముఖ దర్శకుడు, నటుడు సెల్వరాఘవన్, సీనియర్ దర్శకుడు కె.ఎస్. రవికుమార్, వనితా విజయ్ కుమార్, రమ్య, ఆదిత్య కతిర్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించారు. ఒక కార్పొరేట్ ఉద్యోగి తన గర్ల్ ఫ్రెండ్ చేసిన విలాసవంతమైన ఖర్చుల వల్ల క్రెడిట్ కార్డ్ బిల్లులు పెరిగిపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన సమయంలో ఎదుర్కొన్న సవాళ్లను పోలీస్ స్టేషన్‌లో కథగా వివరించే కామెడీ నేపధ్యంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.     Love Oh Love, OTT Release, Naga Durga, Pavish Narayan  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..  కొన్నిసార్లు తరాల మధ్య అభిప్రాయ భేదాలు లేదా ఆలోచనా విధానాలలో తేడాలు ఉంటాయి. ఈ తేడాలు విభేదాలకు దారితీయవచ్చు. దీని వల్ల ప్రతి కోడలికి తన మనసులో ఒక ప్రశ్న ఉండిపోతుంది. అత్తగారు చెప్పే ప్రతి విషయాన్ని కోడలు వినాలా? అత్త చెప్పిన ప్రతి విషయాన్ని కోడలు అంగీకరించాల్సిందేనా?  అని.  అయితే దీనికి సమాధానం అంత సులభమైనది కూడా కాదు.  దీని గురించి లైఫ్ స్టైల్ నిపుణులు వివరణ ఇస్తున్నారు.  ప్రతి కోడలు తెలుసుకోవలసిన ఈ విషయం గురించి తెలుసుకుంటే.. సెల్ఫ్ రెస్పెక్ట్.. ప్రవర్తన.. కొందరు అత్తలు చాలా దురుసుగా ఉంటారు.   దుర్భాషలాడటం, ఎగతాళి చేసి మాట్లాడటం, అందరి ముందు కోడలిని  అవమానించడం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి ఎప్పుడూ  ఎదుర్కొంటున్నట్లయితే కోడలు  మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మొదట  ప్రశాంతంగా మాట్లాడి, సరిగ్గా మాట్లాడమని, సరిగ్గా ప్రవర్తించమని అడగడం మంచిది. అత్తాకోడళ్ల బంధం బాగుండాలంటే.. రెండు వైపులా గౌరవం చాలా ముఖ్యం. ఆరోగ్య సంబంధ విషయాలు..  అత్తల తరానికి,  ఇప్పటి కోడళ్ల తరానికి చాలా తేడాలు ఉన్నాయి.  వారి జీవనశైలి,  ఆహారం వంటి విషయాలు ఇప్పట్లో లేవు.  ఈ కారణంగా ఇప్పటి అమ్మాయిలలో అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది.  ఏదైనా అనారోగ్యానికి చికిత్స, మందులు, విశ్రాంతి తీసుకోవడం, గర్భం దాల్చడం, మానసిక ఆరోగ్యం లేదా మరే ఇతర వైద్య సలహాలలో అయినా అత్తలు ఎప్పుడూ కోడళ్లను నిర్ల7్యంగా మాట్లాడకూడదు.  మేము ఇంత పని చేసుకునేవాళ్లం, మాకేమీ సమస్య ఉండేది కాదు అనడం,  పని తప్పించుకోవడానికి అనారోగ్యం అని చెబుతున్నావని నిందించడం చాలా మంది అత్తగార్లు చేస్తారు. కోడళ్లు  అత్తగారి మాటల కంటే డాక్టర్ సలహాకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆరోగ్య నిర్ణయాలు కేవలం కుటుంబ ఒత్తిడి మీద కాకుండా, వాస్తవాలు , నిపుణుల సలహా ఆధారంగా తీసుకోవాలి. విద్య, ఉద్యోగం.. నేటికాలంలో అమ్మాయిలు అబ్బాయిలకేమీ తీసిపోకుండా బాగా చదువుతున్నారు, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు.  ఉద్యోగం , ఆర్థిక స్వాతంత్య్రానికి  సంబంధించి నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రతి కోడలికి ఉంటుంది.  కుటుంబ అంచనాలకు,  వృత్తిపరమైన లక్ష్యాలకు మధ్య పొంతన కుదరకపోతే ఓపెన్ గా ఇంట్లో డిస్కస్ చేసి  అందరికి నచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. అంతేకానీ అత్తగారు చేప్పారు అని ఉద్యోగాలు వదిలేయడం, ఇంటికే పరిమితం కావడం వంటివి చేయాల్సిన అవసరం లేదు.  ఏకపక్ష ఒత్తిడితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తులో మనస్పర్థలకు దారితీయవచ్చు.అంతేకాదు.. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలకు కూడా కారణం కావచ్చు. వ్యక్తిగత హద్దులు.. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత సమయం, వ్యక్తిగత స్వేచ్ఛ , వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది.  వ్యక్తిగత హద్దులను పదేపదే ఉల్లంఘించినా లేదా ప్రతి నిర్ణయంలో అనవసరమైన జోక్యం ఉన్నా,  హద్దులను మర్యాదగా తెలియజేయడం మంచిది. ఇది అపార్థాలు, గొడవలు ఎక్కువ దూరం వెళ్లకుండా చేస్తుంది.  కొందరు అత్తలు కోడళ్లకు ఎలాంటి పర్సనల్ స్పేస్ ఉండకూడదని, వారికి పర్సనల్ అంటూ ఏమీ అవసరం లేదని వాదిస్తారు.  కానీ కోడళ్లకు పర్సనల్ స్పేట్ ఉండటం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉండగలుగుతుంది.   ప్రొటెక్షన్,  లీగల్ రైట్స్.. ఆడపిల్ల  భద్రతకు, చట్టపరమైన హక్కులకు, లేదా నైతిక విలువలకు భంగం కలిగించే పని చేయమని అత్తగారు కోడలిని అడిగితే, దానికి తలొగ్గడం మంచిది కాదు. అలాంటి పరిస్థితిలో జీవిత భాగస్వామిని, నమ్మకమైన కుటుంబ సభ్యుడిని, లేదా అవసరమైతే చట్టపరమైన సహాయాన్ని తీసుకోవడం మంచిది.                                       *రూపశ్రీ.  
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది. అయితే.. విజయం సాధించడానికి కష్టపడితే సరిపోతుందని  తెలివి ఉంటే చాలని అనుకుంటారు అందరూ. కానీ విజయం సాధించడానికి తెలివి తేటలు, కష్టపడే తత్వం ఉన్నా.. కొన్ని అలవాట్లు మాత్రం వారికి విజయాన్ని దూరంగానే ఉంచుతాయి.  కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడని సాక్షత్తు ఆచార్య చాణక్యుడే చెబుతాడు.  ఒక వ్యక్తిని విజయం సాధించకుండా చేసే ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. సోమరితనం.. కష్టపడే వ్యక్తులలో సోమరితనం ఉంటుందా అని చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం.. కష్టపడే వ్యక్తులలో ఎంతో కొంత సోమరితనం కనిపిస్తూ ఉంటుంది.  అయితే ఏదో ఒక సందర్బంలో ఈ సోమరితనం వారిని దెబ్బతీస్తుంది.  కీలకమైన సందర్బంలో ఏ విషయాన్ని అయినా లైట్ తీసుకుంటే లేదా పనిని నిర్లక్ష్యం చేస్తే.. చేతుల దాకా వచ్చిన విజయం కూడా చేజారిపోతుంది.  అందుకే.. ఏ కొద్దిపాటి సోమరితనం ఉన్నా,  దాన్ని వదిలిపెట్టడం మంచిది. పట్టుదల.. పట్టుదల ఏ పనిలో అయినా ముందుకు సాగడానికి,  పనిని పూర్తీ చేయడానికి ప్రేరణ ఇస్తుంది. కానీ చాలామంది ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు చాలా సీరియస్ గా ప్రారంభించి కష్టపడతారు.. ఆ తరువాత మాత్రం తమ పట్టుదలను తగ్గిస్తారు.  దీని వల్ల దక్కాల్సిన విజయం చెయ్యి జారిపోతుంది. ప్రవర్తన.. మనిషి ప్రవర్తన కూడా వారు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. చాలామంది ఇతరులతో అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులను చుట్టుప్రక్కల వారు, సమాజం ఎప్పటికీ ఇష్టపడదు, వారికి గౌరవం ఇవ్వదు,  వారు చేసే పనులలో తోడ్పాటు, వారు చేసే పనులకు గౌరవం కూడా ఇవ్వదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు తమ పనుల విషయంలో కూడా నెగెటివ్ ఫలితాలు పొందుతారు.                                   *రూపశ్రీ.
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది. ఒకప్పుడు కేవలం పండుగలు,  పెళ్లిళ్లు, శుభకార్యాలు వంటి సమయాల్లో మాత్రమే ధరించినప్పటికీ, నేటికాలంలో మహిళలు ఆఫీస్, పార్టీలు, పండుగలు, నార్మల్ టూర్స్ వంటి వాటికి కూడా సల్వార్ సూట్ లు ధరించడానికి ఇష్టపడతారు.  అయితే ఇప్పట్లో సల్వార్ సూట్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ లోకి మారింది. నేటికాలంలో మరింత ఫ్యాషన్ గా ఉన్న దుస్తులు రావడంతో సల్వార్ సూట్ కూడా సాధారణ దుస్తుల్లా మారిపోయింది.  కానీ సల్వార్ సూట్ ను కూడా ఫ్యాషన్ గా ధరిస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండొచ్చు.  అందుకోసం సల్వార్ సూట్ ను ఎలా ధరించాలి?  తెలుసుకుంటే.. సల్వార్ సూట్ స్టైల్ గా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు.. సరైన ఫిట్టింగ్..  సరైన ఫిట్‌తో సూట్‌ను ఎంచుకోండి. సల్వార్ సూట్ స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా కనిపించాలంటే, దాని ఫిట్టింగ్‌పై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. చక్కగా సరిపోయే సూట్  చక్కగా కనిపించేలా చేస్తుంది, అలాగే చాలా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.  మరీ వదులుగా ఉండే సూట్ ధరించడం వల్ల దుస్తుల షేప్  పాడవుతుంది, అదే సమయంలో మరీ బిగుతుగా ఉండే సూట్ ఎబ్బెట్టుగా కనిపించేలా చేస్తుంది. అందుకే ఫిట్టింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుప్పట్టా.. సల్వార్ సూట్‌లో దుపట్టా చాలా ముఖ్యమైనది.  ఇది మొత్తం రూపాన్ని డిఫరెంట్ గా మార్చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. అంతేకాదు.. దుపట్టాను ధరించే విధానాన్ని మార్చడం ద్వారా ఒకే సూట్‌ను చాలా విధాలుగా దరించవచ్చు. దుప్పట్టాను  ఒక భుజంపై ఓపెన్ గా  వేసుకోవచ్చు, ముందు వైపు కుచ్చులతో ధరించవచ్చు, లేదా బెల్ట్‌తో కొత్త టచ్ ఇవ్వవచ్చు.   ఫ్యాషన్ జ్యువెలరీ.. సరైన జ్యువెలరీ  సాధారణ సల్వార్ సూట్‌ను కూడా స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా మార్చగలవు.  సూట్ సింపుల్‌గా ఉంటే, ఆక్సిడైజ్డ్ చెవిపోగులు, చాంద్‌బాలీలు, ఒక స్టేట్‌మెంట్ నెక్లెస్ లేదా రంగురంగుల బ్రాస్‌లెట్‌లు ధరించి  లుక్‌ను మరింత మెరుగుపరుచుకోవచ్చు. అయితే, భారీ వర్క్  ఉన్న సూట్‌తో సింపుల్ ఆభరణాలు మరింత హుందాగా కనిపిస్తాయి. ఆభరణాలను ఎంచుకునేటప్పుడు, బాలెన్స్డ్  లుక్ కోసం సూట్  రంగు , డిజైన్‌ను పరిగణలోకి తీసుకోవాలి. .పాదరక్షలు.. సల్వార్ సూట్‌కు సరైన పాదరక్షలను ఎంచుకోవడం  మొత్తం రూపాన్ని మార్చేస్తుంది. సాంప్రదాయ రూపానికి, ఎత్నిక్ జుట్టీలు, కొల్హాపురి చెప్పులు , శాండల్స్ మంచి ఎంపికలు.  పార్టీకి లేదా ప్రత్యేక సందర్భానికి సూట్ ధరిస్తుంటే, లైట్ హీల్స్ మరింత అందాన్ని ఇస్తాయి.  హెయిర్ స్టైల్, మేకప్.. సరైన హెయిర్‌స్టైల్ , మేకప్ సల్వార్ సూట్‌తో  రూపాన్ని మరింత మెరుగుపరుస్తాయి. సాంప్రదాయ దుస్తులతో, లూజ్ హెయిర్ స్టైల్ కు స్మూత్  కర్ల్స్, లో బన్, గజ్రా స్టైల్ లేదా సైడ్ బ్రెయిడ్ వంటివి బాగుంటాయి. హెవీ మేకప్ లుక్ కంటే లైట్ గా , సహజమైన మేకప్ మరింత హుందాగా కనిపిస్తుంది.  డ్రెస్ రంగుకు అనుగుణంగా   లిప్ కలర్, ఐ మేకప్ , బిందీని సెలెక్ట్ చేసుకోవచ్చు.                                           *రూపశ్రీ.  
ఆహారం మానెయ్యకుండా బరువు తగ్గడం ఎలా..Atkins Diet ప్లాన్ పూర్తి వివరాలు ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలా మందికి పెద్ద సవాలుగా మారింది. అయితే బరువు తగ్గడం కోసం ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా మానెయ్యాల్సిన అవసరం లేదని ప్రముఖ సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ పి. జానకి శ్రీనాథ్ చెప్తున్నారు. తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రోటీన్లు ఉండే "అట్కిన్స్ డైట్" (Atkins Diet) విధానం ద్వారా ఆహార నియంత్రణల భయం లేకుండానే సులభంగా బరువు తగ్గవచ్చని ఆమె వివరించారు. అట్కిన్స్ డైట్ అంటే ఏమిటి? అట్కిన్స్ డైట్ అనేది ఆహారంలో పిండి పదార్థాలను (Carbohydrates) తగ్గించి, శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులను సరైన పరిమాణంలో అందించే ఒక ప్రత్యేకమైన డైట్ ప్లాన్. మనం సాధారణంగా తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. అట్కిన్స్ డైట్‌లో వాటిని క్రమంగా తగ్గించడం వల్ల శరీరం శక్తి కోసం దాచుకున్న కొవ్వును (Fat) కరిగించడం ప్రారంభిస్తుంది. ఈ డైట్ ప్లాన్ వల్ల కలిగే ముఖ్యమైన ఉపయోగాలు: ఆకలి బాధలు ఉండవు: ఆహారం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకుండానే కేలరీలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. శరీరంలో కొవ్వు త్వరగా కరుగుతుంది: కార్బోహైడ్రేట్లు తగ్గడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు శక్తిగా మారుతుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్: రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి కూడా ఈ డైట్ సహకరిస్తుంది. ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది: ఆహారంలో ప్రోటీన్ మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల రోజంతా నిరోధక శక్తి, ఉత్సాహం ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు తమ జీవన శైలికి మరియు ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా సరైన న్యూట్రిషనిస్ట్ సలహాతో ఈ డైట్ ప్లాన్‌ని పాటించడం మంచిది. సంపూర్ణ వివరాలు మరియు డాక్టర్ గారి పూర్తి సలహాల కోసం TeluguOne Health వీడియోను తప్పకుండా వీక్షించండి. గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డైట్ ప్లాన్ ప్రారంభించే ముందు తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించండి.
అంతులేని అలసట వెనుక అసలు కారణం ఏమిటి..డాక్టర్ చెప్పిన నిజాలు.! రోజంతా అలసటగా, నీరసంగా అనిపిస్తుందా? ఎంత విశ్రాంతి తీసుకున్నా శరీరంలో శక్తి లేకపోతే, అది కేవలం సాధారణ అలసట మాత్రమే కాకుండా Chronic Fatigue Syndrome (CFS) అనే ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణులు డా. చిట్టిభొట్ల మధుసూదన శర్మ గారు Chronic Fatigue Syndrome గురించి సులభమైన భాషలో వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: Chronic Fatigue Syndrome అంటే ఏమిటి? సాధారణ అలసటకు, Chronic Fatigue Syndrome కు ఉన్న తేడా ఏమిటి? ఈ సమస్య వచ్చే ప్రధాన కారణాలు ఏమిటి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి? ఈ సమస్యను తగ్గించేందుకు జీవనశైలిలో చేయాల్సిన మార్పులు సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిపుణుల సూచనలు ఎప్పుడూ అలసటగా ఉండటం, ఏ పని చేయాలన్నా శక్తి లేకపోవడం, ఏకాగ్రత తగ్గిపోవడం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. సరైన సమయంలో కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ సమస్యను నియంత్రించుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి. గమనిక: ఈ వీడియోలో అందించిన సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సలహా, నిర్ధారణ లేదా చికిత్స కోసం వైద్య నిపుణులను సంప్రదించండి.  
తిన్న వెంటనే గ్యాస్ వస్తుందా..అయితే మీరు చేస్తున్న తప్పులు ఇవే..! నేటి కాలంలో రోజులో మూడు పూటలా ఆహారం తీసుకోవడం కామన్.  ఉదయం టిఫిన్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తప్పకుండా చేస్తారు. చాలామంది ఉదయం సమయంలో టిఫిన్ స్కిప్ చేస్తే గ్యాస్ సమస్యలు వస్తాయని,  ఆహారం సమయానికి తినకపోతే గ్యాస్ సమస్యలు వస్తాయని చెబుతుంటారు. కానీ కొందరికి ఒక సమస్య ఉంటుంది. అదే ఆహారం తినగానే గ్యాస్ సమస్య రావడం. రోజూ మూడు పూటలా ఆహారం తింటున్నా సరే.. గ్యాస్ సమస్య ఎందుకు వస్తోంది అనేది చాలామందికి అర్థం కాదు.. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. ఇప్పటి కాలంలో చాలామందికి తొందరగా తినడం అలవాటు.  ఆహారాన్ని వేగంగా మింగినప్పుడు దాన్ని సరిగ్గా నమలలేం. ఆహారాన్ని పూర్తిగా నమలడం అనేది జీర్ణక్రియలో మొదటి , అత్యంత ముఖ్యమైన దశ, ఎందుకంటే నోటిలోని లాలాజలం ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. ఆహారం సరిగ్గా నమలకుండా కడుపులోకి ప్రవేశిస్తే, దానిని జీర్ణం చేయడానికి కడుపు మరింత కష్టపడాల్సి వస్తుంది, దీనివల్ల గ్యాస్ , బరువుగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి చాలా మందికి భోజనం చేసేటప్పుడు లేదా తిన్న వెంటనే ఎక్కువగా నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. దీనివల్ల కడుపులోని జీర్ణరసాలు పలుచబడి, సరైన జీర్ణక్రియ జరగదు. ఫలితంగా గ్యాస్, అజీర్ణం కలుగుతాయి. జీర్ణక్రియ సరిగ్గా జరగాలంటే, భోజనానికి సుమారు అరగంట ముందు లేదా భోజనం చేసిన గంట తర్వాత నీళ్లు తాగడం మంచిది. తిన్న వెంటనే మంచం మీద పడుకోవడం లేదా నిద్రపోవడం కూడా గ్యాస్ ఏర్పడటానికి ఒక ప్రధాన కారణం. పడుకోవడం వల్ల కడుపులోని ఆహారం , ఆమ్లం పైకి వచ్చి, కడుపు ఉబ్బరం, గ్యాస్ , గుండెల్లో మంటకు కారణమవుతాయి. తిన్న తర్వాత కనీసం 20 నుండి 30 నిమిషాల పాటు నిటారుగా కూర్చోవడం లేదా తేలికపాటి నడక  జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అతిగా వేయించిన, మసాలా దినుసులు లేదా నూనెతో కూడిన ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది . ఇవి కడుపుపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ ఆహారాలను అధిక పరిమాణంలో తినడం వల్ల గ్యాస్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా, రాజ్మా బీన్స్, శనగలు , క్యాబేజీ వంటి కొన్ని కూరగాయలు , పప్పుధాన్యాలు కూడా సహజంగా గ్యాస్ ను ఉత్పత్తి చేసే  ఆహారాలుగా  పరిగణిస్తారు, కాబట్టి వాటిని సరైన పరిమాణంలో , సరిగ్గా వండిన తర్వాత తినడం ముఖ్యం. ఆహారం తింటూ ఎక్కువగా మాట్లాడటం, వేగంగా శ్వాస తీసుకోవడం, లేదా స్ట్రాతో తాగడం వంటివి కూడా కడుపులోకి గాలి చేరడానికి కారణమవుతాయి. ఈ విధంగా మింగిన గాలి కడుపు ఉబ్బరానికి, గ్యాస్ కు కూడా కారణం కావచ్చు. అందువల్ల, నిశ్శబ్దంగా, సౌకర్యవంతంగా, తక్కువ మాట్లాడుతూ తినడం మంచిది. పైన చెప్పుకున్న ఐదు అలవాట్లు ఎవరిలో అయినా ఉంటే వారు తప్పకుండా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నెమ్మదిగా తినడం, ఆహారాన్ని బాగా నమలడం, భోజనాల మధ్య అధికంగా నీరు త్రాగకుండా ఉండటం, తిన్న వెంటనే పడుకోకుండా ఉండటం, బరువైన , వేయించిన ఆహారాలను తగ్గించడం,  నిశ్శబ్దంగా తినే అలవాటును అలవర్చుకోవడం వంటివి గ్యాస్ సమస్యను తగ్గించుకోవడంలో సహాయపడతాయి.                                  *రూపశ్రీ.