LATEST NEWS
ఆంధ్రప్రదేశ్  మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెచ్చరిల్లడానికి కారణంగా రాష్ట్రంలో జగన్ ఐదేళ్ల పాలనే కారణమని ఆరోపించారు.   తూర్పుగోదావరి జిల్లా  దుద్దుకూరులో  నిర్వహించిన  ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర లో ఆమె జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు.  జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు.  జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.  ప్రత్యేక హోదా కోసం మోడీ కాలర్ పట్టుకుంటానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక బీజేపీకి సాగిలపడ్డారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పోలవరం ప్రాజెక్టును కూడా నిర్వీర్యం చేశారని విమర్శించారు.  రాష్ట్ర ప్రజలు గత ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వైసీపీని దారుణంగా ఓడంచడంతో ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కోసం బతిమలాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 
  రాయలసీమ ముఖద్వారం, అన్నమయ్య జిల్లా రాజకీయ కేంద్రం రాజంపేటలో ఇప్పుడు అసలైన 'రాజకీయం' మొదలైంది. ప్రత్యర్థులతో పోరాటం కంటే.. సొంత గూటిలోనే సాగుతున్న 'ఆధిపత్య పోరు' ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు, జనసేన పార్లమెంట్ ఇన్చార్జి శ్రీనివాసరాజుల  మధ్య సాగుతున్న అంతర్యుద్ధం కూటమి శ్రేణులను అయోమయంలో నెట్టడమే కాకుండా, రాబోయే స్థానిక సమరానికి సవాలుగా మారింది. *ఆధిపత్య పోరు టిడిపి ఇన్చార్జి ​చమర్తి జగన్ మోహన్ రాజు గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని, కష్టకాలంలో కేడర్‌కు అండగా నిలిచిన నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ ఇన్‌చార్జ్‌గా క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని నిర్మించుకున్న ఆయన, రాజంపేటపై తనదే పైచేయి అని భావిస్తున్నారు. మరోవైపు, మాజీ అధికారిగా పరిపాలనా అనుభవం, జనసేన వైపు నుంచి వచ్చిన మద్దతుతో యల్లటూరు  శ్రీనివాసరాజు తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యావంతుడు, మృదుస్వభావి అనే ఇమేజ్‌తో ఆయన కొత్త తరం ఓటర్లను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నారు. *​అసలు చిచ్చు ఎక్కడ? ​రాజంపేటలో సామాజికంగా బలంగా ఉన్న 'రాజుల' వర్గంలో అగ్రస్థానం కోసం జరుగుతున్న పోరాటమే దీనికి మూలకారణమని పరిశీలకులు భావిస్తున్నారు. *​ప్రోటోకాల్ రచ్చ:  ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా, పార్టీ వేదికలు ఏర్పాటు చేసినా 'ముందువరుస' ఎవరిది? అనే అంశంపై ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధం నడుస్తోంది. రాజంపేట జిల్లా సాధన ఉద్యమం నుంచి స్థానిక అభివృద్ధి పనుల వరకు ఏ చిన్న పని జరిగినా "అది మా నాయకుడి చలవే" అంటూ పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఈ పరిస్థితులు కూటమి క్యాడర్ పై ప్రభావం చూపుతోంది.ఒకే కూటమి  కింద ఉన్నప్పటికీ, కార్యకర్తలు "జగన్ మోహన్ రాజు వర్గం", "శ్రీనివాసరాజు వర్గం"గా విడిపోవడం భవిష్యత్తులో కూటమికి గొడ్డలిపెట్టులా మారే ప్రమాదం ఉంది. *​వైఎస్సార్‌సీపీకి 'అయాచిత' బలం! ​ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి ఈ అంతర్గత కలహాలు వరంగా మారాయి. ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి వంటి ఉద్ధండులను ఢీకొట్టాలంటే కూటమి ఐక్యంగా ఉండాలి. కానీ, ఇక్కడ "ఇంటి గుట్టు లంకకు చేటు" అన్న చందంగా ఒకరిని ఒకరు నష్టం పరుచుకునే  క్రమంలో ప్రత్యర్థికి అవకాశం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. *​అధిష్టానం మౌనం..   ​ఈ ఆధిపత్య పోరుపై అటు అమరావతిలోని టీడీపీ పెద్దలకు, ఇటు జనసేన అధినాయకత్వానికి పూర్తి సమాచారం ఉంది. అయితే, ఇద్దరినీ వదులుకోలేక, అలాగని ఒకరిని వారించలేక అధిష్టానం మౌనం వహిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ మౌనం రాజంపేటలో కూటమి పునాదులను బలహీనపరుస్తోందని సీనియర్ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాజంపేట రాజకీయ యవనికపై ఈ ఇద్దరు 'రాజుల' పోరు ఎటు దారితీస్తుందో చూడాలి. ఒకరు అనుభవాన్ని నమ్ముకుంటే, మరొకరు మారుతున్న సమీకరణాలను నమ్ముకున్నారు. ఈ ఇద్దరూ కలిసి నడిస్తే రాజంపేటలో కూటమికి తిరుగుండదు.. కానీ, నేనే రోజు..నేనే రాజు అన్న చందంగా ఎవరికి వారు సాగితే మాత్రం ఫలితం మరోలా ఉండే అవకాశం ఉంది
  ప్రజాస్వామ్యంలో అధికారులు వ్యవస్థకు వెన్నెముక వంటివారు. కానీ, స్వలాభం కోసమో, రాజకీయ విధేయత కోసమో ఆ వ్యవస్థకే తూట్లు పొడిస్తే? ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల  రహస్య బేటీలు  సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అడుగులు వేస్తుంటే, మరోవైపు తెరచాటున ఏం జరుగుతోంది? వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై  ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన  ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.   లక్షలాది మంది పోటీ పడే యూపీఎస్సీ పరీక్షల్లో నెగ్గి, అత్యున్నత శిక్షణ పొందిన ఐఏఎస్ అధికారులను మనం క్రీమ్ ఆఫ్ ది సొసైటీ  అని పిలుచుకుంటాం. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, రూపొందించే ప్రతి రూల్ వీరి కనుసన్నల్లోనే జరుగుతుంది. అయితే.. ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులు, హైదరాబాద్‌ వేదికగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని, కాంట్రాక్టర్ల వివరాలను, పెట్టుబడుల సమాచారాన్ని ప్రత్యర్థి పార్టీలకు చేరవేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇది కేవలం క్రమశిక్షణారాహిత్యం మాత్రమే కాదు, ప్రజలు కట్టిన పన్నులతో జీతం తీసుకుంటూ ఆ ప్రజలకే చేసే విశ్వాసద్రోహం. ఈ విషయంలో ప్రభుత్వాధినేతలు ఉదాసీనంగా వ్యవహరిస్తే అది పెను ప్రమాదానికి దారి తీస్తుందని అప్పసాని రాజేష్ హెచ్చరించారు. తెలుగువన్ యూట్యూబ్ చానల్ అప్పసాని ఇచ్చిన ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఈ కింది లింక్ క్లిక్ చేసి వీక్షించండి
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం  కేవలం రెండు దేశాల మధ్య సరిహద్దు పోరు కాదు ప్రపంచ దేశాల సమస్య. అన్ని దేశాల్లోని ప్రజల ఇంటి సమస్య. యుద్ధం అనగానే మనకు చాలా దూరంగా, ఎక్కడో సరిహద్దుల్లో జరిగే తుపాకుల మోత మాత్రమే అని అనిపిస్తుంది. కానీ ఇప్పటి గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ గా పరిమితం కాలేదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, మరీ ముఖ్యంగా  భారతదేశ భవిష్యత్తును మార్చబోయే ఒక పెద్ద మలుపు. పెద్ద కుదుపు. ఇండియాకు  అవసరమైన ఇంధన అవసరాలలో దాదాపు 90% మనం దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దిగుమతులకు ఆటంకం ఏర్పడింది.   ఈ  కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, ఆ ప్రభావంతో  నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అంతేనా యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్తతలునెలకొన్న గల్ఫ్ దేశాలలో దాదాపు కొటి మంది ఇండియన్స్ పని చేస్తున్నారు. ఈ యుద్ధం   వారి ఉద్యోగాలు, భవిష్యత్, అలాగే ఆయా దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను ప్రభావితం చేస్తున్నది. తద్వారా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంది.   ఈ సంక్షోభ సమయాన్ని ఎదుర్కోవడానికి లేదా  పరిష్కరించడానికి  భారతదేశం వంటి పెద్ద దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ తన పలుకుబడిని ఉపయోగించి ఆపడానికి కృషి చేయాలి.   బ్రిక్స్ ద్వారా చైనా, రష్యా, బ్రెజిల్ వంటి దేశాలను ఏకం చేసి శాంతి కోసం ఒత్తిడి తేవాలి.   తెలుగువన్ యూట్యూబ్ చానెల్ వాస్తవ వేదికలో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ మధ్య  ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం, అది ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై చూపే ప్రభావం తదితర అంశాలపై విశ్లేషణాత్మక చర్చ జరిగింది. ఆ చర్చ పూర్తి పాఠం ఈ దిగువ ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి వీక్షించండి.  
చంద్ర‌బాబు ప‌నై పోయింద‌ని.. ఆయ‌న‌కివే చివ‌రి ఎన్నిక‌లు అవుతాయ‌ని..  ఈ వ‌య‌సులో కృష్ణా రాా అనుకోకుండా  ఆయ‌న‌కెందుకీ రాజ‌కీయాలు. అలాగైనా ఆయ‌న‌కు పుణ్యం వ‌స్తుంది  క‌దా? అంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిన జగన్ కు  వైసీపీ సీనియ‌ర్ నేత బొత్స  ప‌ట్ల లోకేష్ చూపిన   వాత్స‌ల్యం చెంపపెట్టులాంటిదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే జగన్, లోకేష్ ఇద్దరూ పొలిటీషియన్సే.. కానీ మెచ్యూరిటీ, పరిపక్వల విషయంలో ఇద్దరికీ ఉన్న తేడా ఇది అంటూ.. మండలిలో ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోనై, కోలుకుని మండలికి వచ్చిన సందర్భంగా లోకేష్ ఆయనను ఆప్యాయంగా పలకరించి,  మా మాస్టారు బొత్స తిరిగి  స‌భ‌కు వ‌చ్చారు, సభలో ఆయనన చూడటం ఎంతో సంతోషంగా  ఉంద‌న్నారు లోకేష్.  ఇటీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి  తీవ్రంగా  ఇబ్బంది  ప‌డ్డారు.  కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్  సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ష‌ర్మిళ.. జ‌గ‌న్ మానసిక పరిస్థితి ప‌ట్ల తనకు సందేహాలున్నాయని షర్మిల అంటారు.   ఏదో సినిమా డైలాగులో ఆయ‌న్ను ఎవ‌రికైనా చూపించండ్రా, అలా వదిలేయకండ్రా అని వైసీపీ శ్రేణులకు సూచించారు.   జ‌గ‌న్ ఎందుక‌ని ఇంత ప‌ర్వ‌ర్టెడ్ గా ఉన్నారు? మంచి చెడులు మ‌ర‌చి వ్యవహరిస్తారు?   చంద్ర‌బాబు వ‌య‌సుతో ఆయ‌న‌కేం ప‌ని? అంటూ పలు సందర్భాలలో ఆయనపై పలువురు విమర్శలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం రాష్ట్రానికి   అనుభ‌వంతో కూడిన నాయ‌క‌త్వం  అవసరం అని ప్రజలు భావించారు. కనుకనే చంద్రబాబుకు అఘండ మెజారిటీతో అధికారం కట్టబెట్టారు.  ఆ విషయాన్ని పట్టించుకోకుండా జగన్ చంద్రబాబు విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరుకు.. లోకేష్ తన పరిణితితో సమాధానమిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
'ఉస్తాద్ భగత్ సింగ్' టీజర్ పై కాంట్రవర్సీ  తెరవెనుక రాజకీయం జరుగుతుందా? 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ట్రైలర్ విడుదల కానుందని తెలుపుతూ ఇటీవల ట్రైలర్ టీజ్ ను విడుదల చేశారు. అయితే ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది.  వివాదానికి కారణమైన సన్నివేశం టీజర్ చివరలో పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిని కాలుతో తన్నే యాక్షన్ సీన్ ఉంది. ఆ వ్యక్తి ఆహార్యం (టోపీ మరియు కట్టు) చూస్తుంటే అతను ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం రంజాన్ మాసం నడుస్తున్న తరుణంలో, ఇలాంటి దృశ్యాన్ని టీజర్‌లో చూపించడం ప్రజల సెంటిమెంట్‌ను హర్ట్ చేసే విధంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.  రాజకీయం పవన్ కళ్యాణ్ ఇటీవల రాజకీయంగా సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. తిరుపతి లడ్డూ వివాదం వంటి అంశాల నేపథ్యంలో ఆయన ఇమేజ్ మారిపోయింది. ఈ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. టీజర్ లో ఒక ముస్లిం వ్యక్తిని కాలుతో తన్నడం అనేది ఇష్యూ చేయడానికి ఒక పునాదిలా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.    సినిమాను సినిమాగా చూడలేమా? మరోవైపు, ఇది కేవలం సినిమా మాత్రమేనని, అందులో పాత్రలను మతంతో ముడిపెట్టకూడదనే వాదన కూడా బలంగా ఉంది. సినిమాలో హీరో ఒక పోలీస్ ఆఫీసర్. చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా సరే శిక్షించడం ఆ పాత్ర స్వభావం. అక్కడ ఉన్నది ఒక పాత్ర మాత్రమే తప్ప, ఒక మతాన్ని ఉద్దేశించినది కాదని గుర్తించాలి. అదే టీజర్ లో పవన్ కొట్టిన మిగతా ఇద్దరు వ్యక్తులు హిందువులో లేక క్రిస్టియన్లో అయి ఉండవచ్చు. కానీ ఎవరూ దాని గురించి మాట్లాడటం లేదు సినిమాలో పాత్రలకు కులం, మతం ఉండటం సహజం. కానీ అది ఒక కమ్యూనిటీని తక్కువ చేయడానికే అని ముందే నిర్ణయానికి రావడం సరికాదు. సినిమా విడుదలైన తర్వాత అందులో ఏదైనా అభ్యంతరకర అంశాలు ఉంటే చర్చించడం సమంజసం కానీ, ఒక చిన్న సీన్ చూసి విమర్శించడం కరెక్ట్ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇలాంటి మరిన్ని ఆసక్తికర విశ్లేషణలు, సినిమా అప్డేట్స్ కోడం మా 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
‘సర్వం మాయ.. సకలం మాయ.. దైవం మాయ.. ధర్మం మాయ..’ ఈ మాటలు వింటేనే మనకు జీవితం లోని లోతైన సత్యాలు, తెర వెనుక దాగి ఉన్న రహస్యాలు గుర్తొస్తాయి. సినిమా ప్రపంచంలో కొన్ని సన్నివేశాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, మనిషిలోని నైతిక సంఘర్షణను కూడా కళ్లకు కడతాయి. అటువంటి ఒక ఉత్కంఠభరితమైన, భావోద్వేగాలతో కూడిన క్ల‌యిమాక్స్ సీన్ మ‌హాన‌గ‌రంలో మాయ‌గాడు చిత్రంలోనిది.  చిరంజీవి, విజ‌య‌శాంతి, రావుగోపాల‌రావు, అల్లు రామ‌లింగ‌య్య‌, నూత‌న్‌ప్ర‌సాద్ త‌దిత‌రులు ముఖ్య‌ పాత్ర‌లు పోషించిన ఈ సినిమాకి విజ‌య‌బాపినీడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమాలోని అనేక ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పే ఈ క్ల‌యిమాక్స్‌ను ఎంతో అద్భుతంగా తెర‌కెక్కించారు ద‌ర్శ‌కులు. ఈ సన్నివేశంలో ప్రధానంగా కనిపించేది మనుషుల మధ్య జరిగే ఆధిపత్య పోరు మరియు ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి పడే తాపత్రయం. లోకం దృష్టిలో చనిపోయినట్లు నమ్మించి, నాలుగు గోడల మధ్య బ్రతుకుతున్న ‘చంచల’ అనే పాత్ర చుట్టూ ఈ డ్రామా నడుస్తుంది. ‘నువ్వు లోకం దృష్టిలో చచ్చి పోయావు.. అప్పుడు చావలేదు, చావు నుంచి తప్పించుకొచ్చిన ఖైదీవి’ అంటూ సాగే సంభాషణలు ఆ పాత్ర ఎదుర్కొంటున్న మానసిక క్షోభను తెలియజేస్తాయి. తన ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా మరొకరిని చంపి, ఆ నేరాన్ని కప్పిపుచ్చ డానికి చేసే ప్రయత్నాలు ప్రేక్షకులలో ఉత్కంఠను పెంచుతాయి. ఈ కథలో అత్యంత కీలకమైన మలుపు శవాన్ని మాయం చేసే క్రమంలో వస్తుంది. ఒక ముస్లిం శవాన్ని అడ్డుపెట్టుకుని, ముసుగు వేసి అసలు నిజాన్ని దాచడానికి చేసే ప్రయత్నం విఫలమవడంతో అసలు రంగు బయటపడుతుంది. ఈ క్రమంలో ఒక బాధ్యతాయుతమైన అధికారి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయానని గ్రహించడం అత్యంత భావోద్వేగ పూరితమైన ఘట్టం. బంధుప్రీతికి లొంగిపోయి చట్టాన్ని మోసం చేశానని బాధపడుతూ, తన తప్పును తెలుసుకున్న ఆ ఇన్‌స్పెక్టర్ తన పదవికి రాజీనామా చేసే నిర్ణయం తీసుకోవడం మనల్ని ఆలోచింపజేస్తుంది. చేసిన తప్పును తెలుసుకుని దిద్దుకోగలిగే వ్యక్తిత్వమే నిజమైన గొప్పతనమని ఈ సన్నివేశం నిరూపిస్తుంది. జీవితం ఒక మాయ అని తెలిసినా, ఆ మాయలో చిక్కుకోకుండా ధర్మాన్ని నిలబెట్టడమే అసలైన మానవత్వం. ఈ క్ల‌యిమాక్స్  సీన్ మనకు నేర్పే పాఠం కూడా అదే. ఎంతటి మాయగాడైనా కాలం ముందు తలవంచాల్సిందే. ఉత్కంఠ, ఆవేదన,  చివరకు నైతిక విజయం కలగలిసిన ఈ వీడియోను మీకు అందిస్తున్నాం. వీక్షించండి. ఇలాంటి మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
Yash Raj Films’ has announced the theatrical release date of its highly awaited action entertainer, Alpha, headlined by Alia Bhatt, to be July 10, 2026!  YRF, Alia and Sharvari posted about this development with a brand new teaser poster that showed just a glimpse of Alia Bhatt’s all new fierce action avatar in which she is shown all bruised and cut, clearly after a bloody showdown.  Alpha pairs Alia Bhatt with the rising star of the Hindi film industry, Sharvari, in this relentless action thriller, that also has Anil Kapoor & Bobby Deol in pivotal roles. Alia and Sharvari will go toe to toe against Bobby in this brutal showdown.  Alpha marks Alia’s first film with Yash Raj Films. It is also the first female-led out and out action film of India with Alia and Sharvari teaming up to pull off action sequences that audiences have never seen a girl do before on screen. Alpha is directed by Shiv Rawail, who had previously directed YRF’s global hit series The Railway Men. The film has been produced by Aditya Chopra.  
    -గద్దర్ అవార్డ్స్ లో ఈటీవీ విన్ ప్రభంజనం -ఆదిత్య హాసన్ ఉద్దేశ్యం ఏంటి! -సోషల్ మీడియా వేదికగా ఏం చెప్తున్నారు గద్దర్ అవార్డ్స్(Gaddar Awards).. సినీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వాళ్ళకి  తెలంగాణ (Telanagana)ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక సినీ అవార్డ్స్ . రీసెంట్ గా 2025 వ సంవత్సరానికి సంబంధించిన  అవార్డ్స్ ప్రకటించగా అందులో ఈటీవీ విన్ నుంచి వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి, అనగనగ, లిటిల్ హార్ట్స్ చిత్రాలతో పాటు మౌనమే నీ బాషా అనే షార్ట్ ఫిలిం గద్దర్ అవార్డ్స్ కి ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా గద్దర్ అవార్డ్స్ అందుకున్న విజేతలతో ఈటీవీ విన్ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉండగా అందులో ప్రముఖ దర్శకుడు, లిటిల్ హార్ట్స్ నిర్మాత ఆదిత్య హాసన్ (Aditya Haasan)మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి. ఏం మాట్లాడాడో చూద్దాం. ఆదిత్య  హాసన్ మాట్లాడుతు మాది తెలంగాణలోని మహబూబ్ నగర్ దగ్గర ఉన్న వనపర్తి(wanaparthy).ఎక్కడ ఉందో కూడా ఎవరకి సరిగా తెలియదు. పైగా మహబూబ్ నగర్ అంటే క్యాబ్ డ్రైవర్స్ అనుకునే వాళ్ళు. ఇప్పడు అందరం సిఏం మా జిల్లానే  అని గర్వంగా చెప్పుకుంటున్నాం. తెలంగాణ కల్చరర్ కి ఈ అవార్డ్స్ నిదర్శనం అని చెప్పుకొచ్చాడు. ఈ మాటలపై పలు సినీ ప్రియులు స్పందిస్తూ నువ్వు కూడా మహబూబ్ నగర్, వనపర్తి కి గర్వ కారణమనే కామెంట్స్ చేస్తున్నారు. also read: అప్పుకి బదులు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయ్.. కూతురి నిర్ణయం ఏంటి! ఆదిత్య హాసన్ ది వనపర్తి నే. ఈటీవీ విన్ నుంచి వచ్చిన 90  s  మిడిల్ క్లాస్ బయోపిక్  తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత లిటిల్ హార్ట్స్ తో నిర్మాతగాను సక్సెస్ ని తన ఖాతాలో వేసుకొని ప్రస్తుతం పలు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉన్నాడు.   
బ్లాక్‌బస్టర్ 'బేబీ' జోడి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’(EPIC - First Semester). '90s' వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీత దర్శకుడు. ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'సంచారమే' తాజాగా విడుదలైంది. ప్రజాకవి గోరేటి వెంకన్న ఈ పాటకు సాహిత్యం అందించడం విశేషం. "తొలి తొలి ప్రేమలు.. తొలకరి మాటలు.. సలి సలి వెట్టంగా.. సాగర తీరాన సంచారమే" అంటూ మట్టి పరిమళాన్ని వెదజల్లేలా ఆయన లిరిక్స్ ఉన్నాయి. ఈ పాటను హేషమ్ అబ్దుల్ వహాబ్ తో కలిసి గోరేటి వెంకన్న కూడా ఆలపించడం మరో విశేషం. 'సంచారమే' లిరికల్ వీడియో కాకుండా, డైరెక్ట్ గా వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. లండన్ విజువల్స్, తెలంగాణ యాస లిరిక్స్ తో రూపొందిన ఈ సాంగ్ సరికొత్త అనుభూతిని ఇస్తుంది. గోరేటి వెంకన్న సాహిత్యం, గానం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య జోడి తెరపై చూడటానికి బాగుంది. 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'ను భావోద్వేగాలతో కూడిన మృదువైన ప్రేమకథగా నిర్మాతలు అభివర్ణించారు. యువ హృదయాల అమాయకత్వం, సంఘర్షణలు, మౌన భావాలను ప్రతిబింబించే సరికొత్త, మధురమైన ప్రేమకథకు ఈ చిత్రం హామీ ఇస్తుంది.  
     -కంటతడి పెట్టించే కథ -జీవితాన్ని త్యాగం చేసిన సత్యవతి  -సమాజానికి సవాల్ మనిషి తల రాత దేవుడు రాస్తాడని అంటారు. ఇది నిజమేనేమో అనే విధంగా ఊహించని మార్పులు మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆనందంగా మార్పుని స్వీకరించాల్సి రావడంతో అప్పటి వరకు మనం కన్న కలలు కలలుగానే ఉండిపోతాయి. మనల్ని నమ్ముకున్న వారు సంతోషంగా ఉంటే చాలని కోరుకుంటాం. అలాంటి వాళ్ళల్లో సత్యవతి ఒకటి. తండ్రి పరువు కోసం, తన జీవితాన్నే పణంగా పెట్టిన మహా వనిత ఈ సత్యవతి. పూర్తి కథ చూద్దాం.    సత్యవతి తండ్రి పేరు మాధవయ్య. అంతంత బతుకులే కావడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. ఆత్మభిమానం కలవాడు కావడంతో  తన పరువు బజారున పడుతుందేమోనని ఆవేదన చెందుతుంటాడు. దీంతో సత్యవతి.తన తండ్రిని రుణవిముక్తుడిని చేయడానికి, తన ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా సింగరాజు ని  వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతుంది. కొడుకైనా కూతురైనా నేనే అనేవాడివి కదా! నీకు కొడుకే ఉంటే బాకీ తీర్చవలసిన బాధ్యత తను తీసుకోడా?" అని తండ్రితో అంటుంది. ఆ దృశ్యాన్ని లైవ్ లో చూస్తే మన హృదయాలు చలించిపోతాయి. ఒక పేద తండ్రి తన బిడ్డకి  ఇచ్చే అత్యంత విలువైన కానుక 'పసుపు కుంకుమలు' మాత్రమేనని మాధవయ్య పలికే మాటలు పేదరికంలోని గొప్పతనాన్ని చూడవచ్చు. కానీ మూడు ముళ్ళు పడ్డ ముచ్చట మూడు నాళ్ళైనా గడవకముందే సత్యవతి పెళ్లి జరిగిన కొన్ని రోజులకే  విధి ఆమెని వెక్కిరిస్తుంది. భర్త గుండెపోటుతో కన్నుమూశాడు. రెండు వారాల పాటు మంచం పక్కనే ఉండి సేవ చేసినా, భగవంతుడు ఆమెకి  కన్నీటిని మిగిల్చి ఆమె కుంకుమని  చెరిపేశాడు. తెల్లారిన తన బతుకులో కేవలం తెల్లచీర మాత్రమే మిగిలిందని ఆవేదన చెందుతు తన ఊరికి తిరిగి వస్తుంది. దేవుడు లేని గుడిలా అనిపిస్తున్నావు అని ఆమె స్నేహితురాలు లక్ష్మి బాధపడుతుంది. రంగడు కూడా ఎంతగానో బాధపడతాడు. రంగడు , లక్ష్మి, సత్యవతి చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులు.   ఆ తర్వాత భర్తని కోల్పోయిన వాళ్ళని 'ముండమోపి', 'విధవ' అని పిలుస్తూ  శుభకార్యాలకి  దూరంగా ఉండాలనే మూఢనమ్మకాలని సత్యవతి సవాల్ చేస్తుంది. అర్థం లేని బంధాలని  తెంచుకోగలిగితే, దేవుడు రాసిన రాతలను కూడా మార్చవచ్చనే విషయాన్నీ చాలా గట్టిగా నమ్ముతుంది. దీంతో తన జీవితం అంధకారమైనా ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్న రంగడు, లక్ష్మిల ప్రేమను గెలిపించాలని  నిశ్చయించుకుంటుంది. సమాజం  అపశకునంగా భావించి దూషించినా వెనకడుగు వెయ్యదు.  also read: irugapatru.. 38 జంటల విడాకుల్ని ఆపిన మూవీ.. మీకు శతకోటి వందనాలు  ఈ విధంగా సత్యవతి కథ ప్రతి ఒక్కరికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. విధి ఎన్ని అడ్డంకులు సృష్టించినా, మనిషి తన సంకల్పంతో ఎదుటివారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని నిరూపిస్తుంది. త్యాగం అంటే కోల్పోవడం మాత్రమే కాదు. ఇతరుల ఆనందంలో తన సంతోషాన్ని వెతుక్కోవడం కూడా అని ఈ గాథ చాటిచెబుతుంది. ఈ అపురూప సన్నివేశం జానకి రాముడు సినిమాలోది. సత్యవతిగా జీవిత, లక్ష్మి గా విజయశాంతి, రంగడు గా నాగార్జున తమ క్యారెక్టర్స్ కి జీవాన్ని పోశారు. లక్షి తండ్రిగా సాక్షి రంగారావు కనిపించాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం, మురారి నిర్మాణపు విలువలకి ఒక విలువ ఉండేలా కూడా జానకి రాముడు చేసింది. మరిన్ని ఆసక్తికరమైన మరియు భావోద్వేగభరితమైన సినిమా సన్నివేశాల కోసం మా తెలుగు వన్(telugu One) ఛానల్ ని  సబ్‌స్క్రైబ్ చేసుకోండి.     
The makers of EPIC - FIRST SEMESTER have unveiled the film’s first single “Sancharame,” a soulful track that beautifully captures the emotional journey of the lead characters. Penned by renowned lyricist Goreti Venkanna, the song stands out for its pure Telugu poetry and heartfelt storytelling. The lyrics elegantly contrast the essence of desi roots and videshi life, perfectly aligning with the film’s narrative. Adding more depth to the composition, the track is melodiously sung by Hesham Abdul Wahab along with Goreti Venkanna, with music composed by Hesham Abdul Wahab. Visually, the song presents stunning glimpses of London, blending vibrant international landscapes with the soulful charm of Telugu vocals. The pairing of Anand Deverakonda and Vaishnavi Chaitanya, who reunite after the blockbuster Baby, adds a charming presence on screen. EPIC - FIRST SEMESTER marks the feature film directorial debut of Aditya Haasan and brings together a promising cast and crew. The film is produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas, and presented by Srikara Studios. Co-Produced by Venkat Upputuri & VMR. The film promises to be a refreshing and emotionally rich soft love story that captures the innocence, conflicts, and unspoken emotions of young hearts. More updates about the film will be revealed soon.  
అవినీతి అనే క్యాన్సర్ పై భారతీయుడు యుద్ధం  లంచగొండితనాన్ని అంతం చేసినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం సామాజిక స్పృహతో కూడిన సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా అవినీతి అనే క్యాన్సర్, వ్యవస్థను ఎలా తొలిచేస్తుందో కళ్ళకు కట్టినట్లు చూపించిన చిత్రం 'భారతీయుడు'. దర్శకుడు శంకర్ అద్భుత సృష్టికి, లోకనాయకుడు కమల్ హాసన్ ప్రాణం పోసిన తీరు అమోఘం. ఈ సినిమాలో ఆయన పలికిన సంభాషణలు, చూపిన ఆవేశం నేటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. (Bharateeyudu) 'భారతీయుడు' కేవలం ఒక సినిమా కాదు, అది ఒక ఆవేదన. స్వాతంత్ర్య సమరయోధుడైన సేనాపతి (కమల్ హాసన్).. ఎందరో ప్రాణాలర్పించి సాధించిన స్వాతంత్ర్యం లంచగొండితనంలో కూరుకుపోవడం చూసి సహించలేక 'భారతీయుడు'గా మారి అవినీతిపరులను అంతం చేసే కథ ఇది. 75 ఏళ్ల వయసున్న వృద్ధుడిగా కమల్ హాసన్ మేకప్ మాత్రమే కాదు, ఆయన నడక, చూపు, గంభీరమైన స్వరం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. 80 వేల మంది పోలీసులు వెతికినా, ఆయన నీడను కూడా తాకలేరన్న డైలాగ్ ఆయన పాత్రలోని పవర్‌ను తెలియజేస్తుంది. కదిలించే సన్నివేశం వ్యవస్థలో లంచం అనేది ఎంతలా పాకిపోయిందో వివరిస్తూ.. లంచం తీసుకోవాలంటే భయపడేలా ఒక లంచగొండిని లైవ్ లో హత్య చేసే సన్నివేశం ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచింది. ఆ సీన్‌లో కమల్ హాసన్ చెప్పే మాటలు కళ్ళు తెరిపించేలా ఉంటాయి. "మన దేశంలో బిడ్డ పుట్టిన ప్రసూతి కేంద్రం నుండి, మనిషిని కాల్చే స్మశానం వరకు ప్రతి అడుగులోనూ లంచం అడుగుతున్నారు. చిన్న చిన్న లంచాలే కదా అని మనం ఇచ్చే అలక్ష్యం చేయడం వల్లే.. ఇది ఇది వ్యవస్థకు ఒక భయంకరమైన క్యాన్సర్ వ్యాధిలా ఆవహించింది." అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు సేనాపతి.  కలుపు మొక్కల ఏరివేత పచ్చని స్వతంత్ర భారతావనికి లంచాల చిచ్చుపెట్టే స్వార్థ ప్రభుత్వోద్యోగులను 'కలుపు మొక్కలు'గా అభివర్ణిస్తూ, ఆ చిచ్చు చల్లార్చాలంటే ఆ మొక్కలను ఏరి పారేయక తప్పదని కమల్ హాసన్ పాత్ర హెచ్చరిస్తుంది. "లంచం తీసుకున్నా చంపుతాను, ఇచ్చినా చంపుతాను, లంచం ఇవ్వలేదని పని జాప్యం చేసినా వదిలేది లేదు" అంటూ ఆయన చేసే గర్జన అవినీతిపరుల గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. ఆయన పట్టుకున్న కత్తి ఆయుధం మాత్రమే కాదు.. అవినీతిపరులకు కలిగించే 'మరణ భయం'. కమల్ హాసన్ తన అద్భుత నటనతో ఒక సామాన్యుడిలోని ఆవేశాన్ని వెండితెరపై ఆవిష్కరించారు. వ్యవస్థ మారాలంటే కేవలం చట్టాలు సరిపోవని, ప్రతి ఒక్కరిలో నిజాయితీ ఉండాలని ఈ సినిమా చాటిచెప్పింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున చాక్లెట్లు పంచుకోవడం వల్ల దేశభక్తి రాదు, లంచగొండితనాన్ని అంతం చేసినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని ఈ చిత్రం అందించిన సందేశం ఎప్పటికీ నిలిచిపోతుంది. మరిన్ని హై-వోల్టేజ్ సినిమా సీన్లు, ఆసక్తికరమైన అప్‌డేట్స్ కోసం మా 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి.
  -సినిమాకి ఉన్న శక్తి మరోసారి బయటపడింది  -38 జంటలని నిజంగానే  కలిపిందా -ఇంతకీ ఆ సినిమా ఏంటి! ఎక్కడ జరిగింది జోనర్ తో సంబంధం లేదు. మంచి సినిమా పడాలే కానీ, దేవతలు సైతం థియేటర్ లో సినిమా చూసి వెళ్తారనే నానుడి మూవీ లవర్స్ లో ఎప్పట్నుంచో ఉంది. అంతటి శక్తీ  సినిమా సొంతం. నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యశీలి కూడా. అసలు సినిమా అనేది ఈ నేలపై అడుగుపెట్టకపోతే మనిషికి మంచి, చెడు చెప్పే వాళ్ళు కూడా ఉండేవారు కాదు. అంత సీన్ ఉందా అనే డౌట్ వ్యక్తం చేసే వాళ్ళ కళ్ళు తెరిపించేలా సిల్వర్ స్క్రీన్ కొన్ని చిత్రాలు మెరుస్తుంటాయి. మరి ఆ మూవీ  ఏంటి? చేసిన మంచి ఏమిటో చూద్దాం. ఇరుగపట్రు(Irugapatru).. తమిళంలో తెరకెక్కగా విక్రమ్ ప్రభు(Vikram Prabhu),శ్రద్ద శ్రీనాధ్(Shraddha Srinath),విదార్ద్, అబర్నతి, శ్రీ, సానియా అయ్యప్పన్ ముఖ్యమైన క్యారక్టర్ లలో కనిపించారు. ఈ మూవీ రిలీజ్ కాకముందు సుమారు ముప్పై ఎనిమిది జంటలు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పాలనుకున్నారు. కానీ వాళ్ళందరు 'ఇరుగపట్రు' చూసాక తమ మనసు మార్చుకొని విడాకుల ఆలోచనకి మంగళం పాడి తమ బంధాన్ని కొనసాగించారు. ఈ సంఘటన త్రిచి ప్రాంతంలో  జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా విక్రమ్ ప్రభు నే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా మారడంతో మూవీ లవర్స్ ఇరుగపట్రు దగ్గర టేక్ ఆఫ్ అయ్యారు. కనీసం విడాకుల విషయంలో  వెయ్యి జంటల మనసునైనా మార్చాలని ప్రిపేర్ అయ్యామని కూడా విక్రమ్ ప్రభు చెప్పడం గమనార్హం. also read: allu arjun: ధురంధర్ 2 నా ఉస్తాద్ భగత్ సింగ్ నా.. హైదరాబాద్ ఖ్యాతిని పెంచిన అల్లు అర్జున్ ఇరుగపట్రు కథ విషయానికి వస్తే మూడు జంటల మధ్య అహం, అపార్ధం, కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఏర్పడతాయి. దీంతో విడిపోవాలనుకుంటారు. కానీ ఆ తర్వాత తమ సమస్యని తెలుసుకొని కలిసి బతకాలనుకుంటారు. దాదాపుగా విడాకులు తీసుకునే వాళ్లందరికీ అవే సమస్యలు. దీంతో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే చాలా జంటలు కలిసాయి. 2023 లో వచ్చిన ఈ మూవీ తెలుగు అనువాదం లో కూడా అందుబాటులో ఉంది. మరి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా విడిపోవడానికి రెడీ గా ఉంటే ఇరుగపట్రు చూపించండి. ఖచ్చితంగా కలిసి ఉంటారు.      
సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా రష్మి ట్వీట్ రష్మిని టార్గెట్ చేసిన ఖమేనీ మద్దతుదారులు క్యారెక్టర్ లెస్ అంటూ చీప్ కామెంట్స్  ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కొద్దిరోజులుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీ హతమవ్వడం సంచలనంగా మారింది. అయితే ఖమేనీ చనిపోతే మన భారతదేశంలోనూ కొందరు ఆందోళన చేశారు. సోషల్ మీడియాలో ఖమేనీకి మద్దతుగా పోస్ట్ లు పెట్టారు. అలాంటి వారిని ప్రముఖ యాంకర్ రష్మి తప్పుపట్టింది. (Anchor Rashmi Gautam) ఖమేనీ చనిపోతే ఇక్కడ ఆందోళన చేయడం ఏంటంటూ రష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని ఇరాన్ కి పంపించాలని ట్వీట్ చేసింది. అప్పటినుంచి ఖమేనీ మద్దతుదారులకు రష్మి టార్గెట్ అయింది. ఆమెపై బెదిరింపులకు దిగుతున్నారు. చెప్పడానికి వీల్లేని అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్నారు. వాటన్నింటికీ తనదైన శైలిలో రిప్లై ఇస్తుంది రష్మి. కొందరైతే ఖమేనీ పేరుతో ఉన్న అకౌంట్స్ నుంచి రష్మి పోస్ట్ ల కింద దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు. వాటిని స్క్రీన్ షాట్ తీసి రష్మి ట్విట్టర్ లో షేర్ చేయగా.. దానికి ఒక నెటిజెన్ నుంచి ఇంకో దారుణమైన రిప్లై వచ్చింది. ఆమెకు క్యారెక్టర్ లేదని, ఎందరితోనే రిలేషన్స్ పెట్టుకుందని ఆ కామెంట్ లో ఉంది. తన క్యారెక్టర్ గురించి మాట్లాడిన నెటిజెన్ కి రష్మి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. "ప్రూఫ్ ఉంటే చూపించు. నాకు రిలేషన్ షిప్స్ ఉన్నా లేకపోయినా.. నన్ను వేధించే హక్కు ఎవరికీ లేదు. నేను నిన్నో, నీ తండ్రినో లేదా నీ కొడుకునో వివాహం చేసుకునే వరకు.. నేను ఎంతమందితో తిరిగినా అది మీ సమస్య కాదు. కేవలం నా పేరే ఎందుకు? నాకు ఎవరితో లింక్ ఉందో వాళ్ళ పేర్లు ప్రూఫ్ తో సహా చెప్పండి. మీరు ఎవరి క్యారెక్టర్ మీదైనా నింద వేయాలనుకుంటే.. ఇద్దరి పేర్లు బయటపెట్టడం న్యాయం." అని రాసుకొచ్చింది. రష్మీ ఇచ్చిన సమాధానానికి సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది. ఒక మహిళను టార్గెట్ చేస్తూ దారుణ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని, అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. https://x.com/rashmigautam27/status/2030624228421320822
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రపంచ దేశాలలో చాలా ఆనందంగా ఉండే ప్రజలుగా జపనీయులను చెబుతారు.  వారు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తారు.  వారి ఆరోగ్యం,  వారి సంతోషం వారి ముఖంలోనూ, వారి శరీరాకృతిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. జపనీయులు ఎప్పుడూ  ఆహ్లాదకరమైన చిరునవ్వుతో,  చాలా ఫిట్‌గా కనిపిస్తారని సోషల్ మీడియా నుండి ఎన్నో వార్తల వరకు ప్రతి ఒక్కచోట కనిపిస్తూ ఉంటుంది.. దీనికి ప్రధాన కారణం వారి జీవనశైలి, ముఖ్యంగా వారి ఆహారం. ఆధునిక కాలంలో ఊబకాయం అత్యంత తీవ్రమైన వ్యాధులలో ఒకటిగా పరిగణించబడుతున్నప్పటికీ, జపాన్‌లో ఊబకాయం రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ప్రపంచ మొత్తం మీద  ఆరోగ్యం విషయానికి వస్తే, జపనీయులు ప్రపంచంలో నాల్గవ లేదా ఐదవ స్థానంలో ఉన్నారు. జపనీయులు తమ రోజును చాలా సరళంగా ఉంటూనే శరీరానికి బాగా పోషకాలు  ఇచ్చే ఆహారంతో మొదలుపెడతారని చెబుతారు.  వారి అల్పాహారం తేలికగా అనిపించవచ్చు, కానీ అది పోషకాలతో నిండి ఉంటుందట. ఫిట్నెస్ రహస్యం.. జపనీయుల మాదిరిగా ఫిట్‌గా ఉండటం చాలా సులభం. వారి దినచర్యలను ఖచ్చితంగా పాటిస్తే ఇది సాధ్యమేనని అంటున్నారు ఆరోగ్య నిపుణులు,  వైద్యులు. ఇలా ఆచరిస్తే ఆ ఫలితాలను  అనుభవపూర్వకంగా తెలుసుకుంటారని అంటారు. చిన్న ప్లేట్ లో ఆహారం.. మనం ఆహరం తినే సమయంలో, మన ప్లేట్ పరిమాణం మన ఆరోగ్యానికి నేరుగా సంబందం ఉంటుందట. పెద్ద ప్లేట్లు పెట్టుకుంటే అది అతిగా తినడానికి దారి తీస్తుందట.  ఇది అనారోగ్యకరమైనికి కారణమవుతుందట. ఫిట్‌గా ఉండటానికి  జపనీస్ లాగా చిన్న ప్లేట్‌లలో తినే అలవాటును అలవర్చుకోవాలట. ఇది అతిగా తినడాన్ని తగ్గిస్తుంది,  ఫిట్‌గా ఉండటానికి సహాయపడుతుంది. సీజనల్ ఫుడ్స్.. ఎక్కువ కాలం ఫిట్‌గా ఉండాలనుకుంటే,  ఆహారంలో సీజనల్ పండ్లు,  కూరగాయలను చేర్చుకోవాలని అంటారు. జపనీయులు తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి సీజనల్ ఆహారాలను తింటారు.  శీతాకాలంలో  వేడెక్కే ప్రభావాన్ని కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. దీని కోసం,  ఎండిన పండ్లు, నువ్వులు, బెల్లం, ఖర్జూరం,  ఆకుపచ్చ కూరగాయలను తీసుకోవచ్చు. వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఆహారాలైన పండ్లు,  పానీయాలు, ఎక్కువగా నీరు వంటివి తీసుకోవాలి. ఆహారం మోతాదు.. మనకు ఇష్టమైన ఆహారం దొరికినప్పుడు ఆకలి తీరిన తర్వాత కూడా  ఇంకా తింటూనే ఉంటారు. దీనివల్ల కడుపు సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. జపనీయులు ఇలా చేయరు. వారికి  ఆహారం ఎంత నచ్చినా, వారి ఆకలి తీరే వరకు మాత్రమే తింటారు. ఈ అలవాటు వారి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతోందట. నిద్ర.. దీర్ఘకాలిక ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా అవసరం, ఎందుకంటే తగినంత నిద్ర లేకపోవడం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది,  జ్ఞాపకశక్తిని  ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి, ప్రతిరోజూ 7 నుండి 8 గంటలు నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. జపనీస్ ప్రజలు తమ నిద్ర గురించి చాలా శ్రద్దగా ఉంటారు. తినే విధానం.. ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే సరిపోదు;  తినే విధానం కూడా ముఖ్యం. మనలో చాలామంది తొందరపడి తింటారు.   సరిగ్గా నమలడం మర్చిపోతారు, ఇది తీవ్రమైన హానిని కలిగిస్తుంది. , జపనీయులు ఆహారం తీసుకునేటప్పుడు నెమ్మదిగా ఆహారాన్ని బాగా నమిలి తింటారట. ఫైనల్ గా..  శరీరాన్ని దీర్ఘకాలికంగా ఫిట్‌గా ఉంచుకోవాలనుకుంటే,  ఈ జపనీస్ ఫిట్‌నెస్ దినచర్యను పూర్తిగా అనుసరించాలి. ఎటువంటి రాజీలు ఉండకూడదు. అప్పుడే ఫిట్ గా మారతారు.                                      *రూపశ్రీ.
1979- శశిబాల ఒక అందమైన 20 ఏళ్ల యువతి. దిల్లీలోని ప్రఖ్యత లక్ష్మీబాయ్‌ కాలేజి నుంచి డిగ్రీని కూడా సాధించింది. శశిబాలకు పది నెలల క్రితమే పెళ్లయింది. ఇప్పుడు తను ఆర్నెళ్ల గర్భవతి కూడా! బయట నుంచి చూసేవారికి ఇదంతా ఓ అందమైన జీవితం తాలూకు వర్ణనగా తోచవచ్చు. కానీ శశిబాల వ్యక్తిగత జీవితం ఆ చిత్రానికి తలకిందులుగా కనిపిస్తుంది. పెళ్లయిన దగ్గర్నుంచి శశిబాల అత్తమామలు కట్నం కింద ఏదోఒక వస్తువుని తీసుకురమ్మంటూ గొడవచేస్తూనే ఉన్నారు. శశిబాల తన తల్లి సత్యరాణి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రతిసారీ, తల్లీకూతుళ్లు వారి కోరికను ఎలా తీర్చాలా అని మదన పడుతూనే ఉన్నారు. సత్యరాణి వితంతువు, పైగా శశిబాలతో పాటు ఆమె మీద మరికొందరి బిడ్డల భారం కూడా ఉంది. ఇలాంటి సమయంలో ఓ రోజు సత్యరాణికి, శశిబాల అత్తగారింటి నుంచి వెంటనే రమ్మంటూ కబురు వచ్చింది.     పరుగుపరుగున వెళ్లిన ఆమెకు తన బంగారు కూతురు నల్లటి ముద్దగా ఓ మూల కనిపించింది. ‘నీ కూతురు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఆ చెత్తని ఇక్కడి నుంచి పట్టుకుపో!’ అన్నారు శశిబాల అత్తగారు. కూతురి శవాన్ని కప్పేందుకు వాళ్లు ఒక దుప్పటిని అందించేందుకు కూడా సిద్ధపడలేదు. 1980వ దశకంలో ఇలాంటి సంఘటనలు చాలానే వినిపించేవి. కిరసనాయిలు పోసుకునో, చీరకు నిప్పంటుకునో నిస్సహాయంగా ఎందరో ఆడవాళ్లు చనిపోయేవారు. అవన్నీ ప్రమాదాలో ఆత్మహత్యలో కాదనీ, వరకట్నపు హత్యలనీ తెలిసినా ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి. కానీ సత్యరాణి అలా నిశ్శబ్దంగా ఊరుకోదల్చుకోలేదు.   స్కూటరు కొనిపెట్టలేదన్న కారణంగా తన అల్లుడు ఆమెను చంపేశాడంటూ కేసుని నమోదు చేసింది. అయితే అప్పట్లో చట్టాలు ఇంత కఠినంగా ఉండేవి కాదు. పెళ్లి సమయంలో అందుకున్నవే కట్నకానుకల కిందకి వస్తాయన్న నిర్వచనం ఉండేది. పైగా చావుకి సంబంధించిన ఆరోపణలను నిరూపించే బాధ్యత మృతుల తరఫు న్యాయవాదులకే ఉండేది. సత్యరాణి ఒక పక్క తన కూతురి చావుకి సంబంధించిన కేసులను పోరాడుతూనే, మరో పక్క వరకట్నపు చావులను ఎదుర్కొంటున్న ఎందరో అభాగ్యుల కోసం గొంతు విప్పడం మొదలుపెట్టింది. తమ కూతురు వరకట్నం కారణంగా చావుని ఎదుర్కొందిని భావించిన ప్రతి ఒక్కరి పోరాటానికీ ఆసరాగా నిలిచేది.       సత్యరాణి తనలాంటి దుస్థితిలో ఉన్న మరికొందరితో కలిసి శక్తిశాలిని పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. వరకట్నపు వేధింపులను ఎదుర్కొనేవారికి ఈ సంస్థ నిలువనీడను కల్పించేది. సత్యరాణికి చదువు లేదు. వయసు పైబడుతోంది. పైగా చెట్టంత కూతురిని పోగొట్టుకుంది. అయినా వరకట్నానికి వ్యతిరేకంగా తన పోరులో రవ్వంత కూడా వెనక్కి తగ్గలేదు. రానురానూ సత్యరాణి ఉద్యమం ఫలితాలనివ్వసాగింది. వరకట్న వ్యతిరేక చట్టానికి ప్రభుత్వం మరింత పెట్టాల్సి వచ్చింది. వరకట్నం అంటే కేవలం డబ్బే కాదు, వస్తువుని కోరడం కూడా వరకట్న పరిధిలోనే వస్తాయంటూ చట్టాన్ని మార్చింది కేంద్రం. పెళ్లైన ఏడేళ్ల లోపు స్త్రీ ఆత్మహత్య చేసుకున్నా కూడా, అందుకు కారణం అత్తవారింటి ఆరళ్లు కూడా కావచ్చునంటూ మరో సవరణ కూడా చేసింది.   ఒక పక్క సమాజంలో మార్పు రావడం, మరో పక్క చట్టాలకు పదునెక్కించడంతో... వరకట్న హత్యలు కొంతమేరకన్నా తగ్గాయి. ముఖ్యంగా ‘వంటగదిలో ప్రమాదాలు, ఆత్మహత్యలు’ చాలామేరకు తగ్గాయి. నేరాల తగ్గుదలను చాలామంది గమనించారు కానీ, అందుకు కారణమైన సత్యరాణి వంటి తల్లుల పోరాటాన్ని పెద్దగా గమనించింది లేదు. వరకట్న చావులను తగ్గించడంలోనే సత్యరాణి విజయం సాధించడమే కాదు, మారిన చట్టాలకు అనుగుణంగా తన అల్లుడికి శిక్షపడేలా కూడా విజయం సాధించింది. 2014లో సత్యరాణి తన 85వ ఏట ప్రశాంతంగా కన్నుమూసింది. కానీ ఆమె జీవితం ఏనాడూ వృధాగా పోలేదు. ఒక తల్లిగా తాను పొందిన గర్భశోకాం, మరో తల్లికి కలుగకుండా ఉండేందుకే అనుక్షణం పోరాడింది. ఎందరో కూతుళ్లకి న్యాయాన్ని సాధించింది. మరెందరో వధువులు వరకట్నపు కోరల్లో చిక్కుకోకుండా తన జీవితాన్ని అడ్డు వేసింది.   - నిర్జర.
చాలామంది జీవితంలో కష్టాలు వస్తాయి. కలలా సాగిపోతున్న జీవితం కాస్తా తలకిందులైపోతుంది. అలా తారుమారైన జీవితాన్ని తల్చుకుని తల్చుకుని వారు కుమిలిపోతుంటారు. కానీ కొందరు మాత్రం తాము పడిన కష్టానికి ఉపశమనంగా, అలాంటి కష్టంలో ఉన్న తోటివారందరికీ ఓదార్పుగా..... ఓ భిన్నమైన మార్గాన్ని ఎన్నుకొంటారు. తన కష్టాన్ని సమాజానికి ఓ వరంగా అందిస్తారు. అలాంటి ఓ వ్యక్తే సరోజనీ అగర్వాల్‌! లక్నోలో ఉండే సరోజనీది ఓ అందమైన కుటుంబం. చక్కగా చూసుకునే భర్త, రత్నాల్లాంటి పిల్లలు... అంతా బాగుంది. హిందీలో పీ.హెచ్‌.డీ చేసిన సరోజనీకి కథలన్నా, కవితలన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టంతో స్వయంగా ఎన్నో రచనలు చేశారు. ఓ రోజు సరోజనీ తన కూతురుతో కలిసి ప్రయాణిస్తుండగా... అనుకోని ఉపద్రవం ఎదురైంది. ఆమె నడుపుతున్న బండి ప్రమాదానికి లోనై, ఆమె కళ్ల ముందే కూతురు చనిపోయింది.   కళ్లముందే కూతురు చనిపోవడం, అది కూడా తను నడుపుతున్న బండి వల్లే చనిపోవడంతో సరోజనీ తేరుకోలేకపోయింది. కానీ అందరిలా ఆమె ఆవేదనతో మిగిలిపోలేదు. తన కూతురు జ్ఞాపకాలకు విలువనిచ్చేలా ఏదన్నా చేయాలనుకున్నారు. అలా 1985లో తన ఇంట్లోనే ఆడపిల్లల కోసం ఓ అనాథ శరణాలయాన్ని నెలకొల్పారు. ఆ శరణాలయానికి తన కూతురు పేరు మీదుగా ‘మనీషా మందిర్‌’ అని పేరు పెట్టారు. తన రచనల మీద వచ్చే రాయల్టీలతో దాన్ని నడపసాగారు.   మనీషా మందిర్‌ను మొదలుపెట్టడమే ఆలస్యం... ఎందరో పిల్లలకి అది ఆసరాగా మారింది. వికలాంగులుగా ఉన్నారనో, పెంచే ఆర్థిక స్తోమత లేదనో... వదిలేసే ఆడపిల్లలకు మనీషా మందిర్‌ నీడనిచ్చింది. రోడ్ల మీద తనకు అనాథలా కనిపించినవారినీ, వేశ్యాగృహాలలో పుట్టినవారినీ కూడా సరోజనీ అక్కున చేర్చుకునేవారు. మనీషా మందిర్లో అనాథలను చేర్చేందుకు ఆ ఇంటి ముంగిట ఒక ఊయల కట్టి ఉండేదంటే... ఆమె నిశ్చయం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.   మనీషా మందిర్‌లో ఇప్పటివరకూ 800 మందికి పైగా ఆడపిల్లలకు ఆశ్రయం లభించింది. అలాగని వారిని కేవలం అనాథలుగా చూడలేదావిడ. వారందరిలోనూ దూరమైన తన కూతురిని చూసుకుని మురుసుకునేవారు. ఒక కూతురి కోసం ఎలాంటి సుదాపాయాలు కల్పించాలని తల్లి తాపత్రయపడుతుందో... తన ఆశ్రమంలో ఉన్నవారికి అలాంటి సౌకర్యాలన్నీ కల్పిస్తారు సరోజని. లైబ్రరీ, కంప్యూటర్‌ లాబ్‌, బాడ్మింటన్ కోర్ట్‌... లాంటివన్నీ మనీషా మందిర్‌లో కనిపిస్తాయి. ఇక అందులోని పిల్లలకు విద్య, వృత్తి నైపుణ్యాలని అందించడం సరేసరి!   మనీషా మందర్‌లో రోజుల వయసులో చేరిన పిల్లలు, తమ కాళ్ల మీద తాము నిలబడేవరకూ చేయూతగా నిలుస్తారు సరోజనీ. అలా మనీషా మందిర్‌లో ఎదిగిన ఎందరో పిల్లలు బ్యాంక్‌ మేనేజర్లుగా, టీచర్లుగా, ప్రభుత్వోద్యోగులుగా గౌరవప్రదమైన స్థానాలకు ఎదిగారు. మరికొందరు పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. ‘‘ఇంతమందికి సాయపడేందుకే భగవంతుడు నా కూతురిని తీసుకువెళ్లిపోయాడేమో! ఇన్ని వందల మందిలో నా కూతురిని పదిలంగా చూసుకునే అవకాశం కల్పించినందుకు ఆయనకి నేను రుణపడిపోయాను,’’ అంటారు సరోజనీ. మనీషా మందిర్‌ ముంగిట ఉన్న మనీష విగ్రహంలోని చిరునవ్వుని గమనిస్తే... ఆమె ఈ మాటలను వింటున్నట్లుగానే తోస్తుంది.   - నిర్జర.
• కిడ్నీలో రాళ్ళు ఉన్న • యూరిన్ ఇన్ఫెక్షన్ / యూరిన్ ప్రాబ్లెమ్స్ • కిడ్నీ డిసీజ్ & వారి కుటుంబ సభ్యులు • సహజమైన ఆయుర్వేదం / యూనానీ వైద్యం  • సర్జరీ లేకుండా కిడ్నీ స్టోన్స్ ట్రీట్‌మెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఈ రోజుల్లో మనల్ని వేధిస్తున్న ఎన్నో ఆరోగ్య సమస్యలకు ప్రకృతిలోనే అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వంటి ఇబ్బందులతో బాధపడేవారికి ఒక తీపి కబురు. కేవలం ఒక పండుతో మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో ఈ వ్యాసంలో వివరంగా తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్ళు (Kidney Stones) & యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ వీడియోలో ప్రముఖ యూనానీ వైద్య నిపుణులు Dr. SGV Satya గారు కిడ్నీ స్టోన్స్ కి సహజమైన & శాశ్వతమైన పరిష్కారం గురించి వివరంగా చెప్తున్నారు. సర్జరీ లేకుండా కిడ్నీ రాళ్ళు కరిగించే అద్భుతమైన పండు గురించి, యూరిన్ ప్రాబ్లెమ్స్ కి యూనానీ ట్రీట్‌మెంట్ గురించి ఈ వీడియోలో తెలుసుకోండి. పైనాపిల్: మీ కిడ్నీలకు మరియు సర్వ రోగాలకు ఒక సంజీవిని పైనాపిల్ కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, వందల ఏళ్ల నాటి యునాని వైద్యంలో దీనికి విశిష్ట స్థానం ఉంది. శరీరంలోని మలినాలను తొలగించి, మిమ్మల్ని తాజాగా ఉంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మనం పైనాపిల్ ఎందుకు తీసుకోవాలి? (Why Should We?) 1. కిడ్నీ మరియు మూత్రపిండాల రక్షణ: పైనాపిల్‌లో 'డయూరిటిక్ ఎఫెక్ట్' ఉంటుంది. ఇది యూరిన్ ఫ్రీగా వచ్చేలా చేసి, కిడ్నీలో రాళ్లు (Kidney Stones) మరియు ప్రోస్టేట్ సమస్యలను నివారిస్తుంది. 2. వాపుల నివారణ (Anti-inflammatory): యునాని వైద్యంలో దీనిని 'ఇల్తహాబ్' (వాపు) తగ్గించడానికి వాడుతుంటారు. కీళ్ల నొప్పులు (Arthritis), సైనసైటిస్, గొంతు ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలకు ఇది మేలైన పరిష్కారం. 3. శరీర ప్రక్షాళన (Detoxification): శరీరంలోని హానికరమైన వ్యర్థాలను (Morbid material) బయటకు పంపడంలో పైనాపిల్‌ను మించినది లేదు. 4. మెదడు మరియు గుండె ఆరోగ్యం: నిరంతరం కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేసే వారికి, మెమరీ లాస్ ఉన్న వారికి ఇది మేధోశక్తిని పెంచుతుంది. అలాగే రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా (Blood clotting) చూస్తూ గుండెను కాపాడుతుంది. 5. దంత ఆరోగ్యం: పళ్లపై పేరుకుపోయిన గార (Plaque) తొలగించడానికి మరియు చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నేరుగా పైనాపిల్ ముక్కలు తినడం ఎంతో మంచిది. ఏం చేయకూడదు? (What Not to Do?) • అపెండిక్స్ సర్జరీ అయిన వారు: అపెండిక్స్ తీసేసిన వారు నేరుగా పండు తినకూడదు, కేవలం జ్యూస్ మాత్రమే తాగాలి. • అతిగా తీసుకోవద్దు: పైనాపిల్ ఆరోగ్యానికి మంచిదే కదా అని అతిగా, మరీ పుల్లగా ఉన్నవి తీసుకోకండి. దీనివల్ల కొన్నిసార్లు జలుబు లేదా ఆస్తమా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. • డయాబెటిస్ ఉన్నవారు: షుగర్ ఉన్నవారు పండును లేదా జ్యూస్‌ను తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఎలా ఉపయోగించాలి? (How to Use?) • ప్రయాణాల్లో వాంతులు (Motion Sickness): బస్సుల్లో ప్రయాణించేటప్పుడు వాంతులు అయ్యే వారు, చిన్న బాక్స్‌లో పైనాపిల్ ముక్కలు పెట్టుకుని, టూత్‌పిక్‌తో అప్పుడప్పుడు తింటూ ఉంటే ఆ సమస్య తగ్గుతుంది. • పిల్లల్లో కడుపులో పురుగులు: పిల్లలకు తరచుగా పైనాపిల్ తినిపిస్తే, పేగుల్లో ఉండే పురుగులు (Intestinal worms) నశిస్తాయి. • డయాబెటిస్ నియంత్రణకు: పైనాపిల్ ఆకులు మరియు వేర్లను నీళ్లలో మరిగించి ఆ కషాయం తాగితే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. • శ్వాసకోస సమస్యలకు: జలుబు, దగ్గు ఉన్నప్పుడు పైనాపిల్ జ్యూస్‌ను డైల్యూట్ చేసి తీసుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్రశ్న: కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పైనాపిల్ తీసుకోవచ్చా?  జవాబు: తప్పకుండా! బాడీలో ఎక్కడ స్టోన్స్ ఉన్నా వాటిని బ్రేక్ చేయడంలో, ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ తొలగించడంలో పైనాపిల్ జ్యూస్ పాత్ర సాటిలేనిది. ప్రశ్న: పైనాపిల్ తింటే జలుబు చేస్తుందా?  జవాబు: ఇది చాలా మందిలో ఉన్న అపోహ. పైనాపిల్ వల్ల జలుబు రాదు, కానీ అతిగా పుల్లని పండు తింటే సమస్య రావచ్చు. సరైన పద్ధతిలో తీసుకుంటే ఇది లంగ్స్ మరియు గొంతు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రశ్న: శరీర నొప్పులకు పైనాపిల్ పనిచేస్తుందా? జవాబు: అవును, ఇందులో అనాల్జిసిక్ (Analgesic) గుణాలు ఉండటం వల్ల వెన్నునొప్పి, కడుపునొప్పి వంటి బాడీ పెయిన్స్ తగ్గడానికి సహాయపడుతుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన పండును మీ డైట్‌లో భాగం చేసుకోండి. "ఏతదాలే అక్లాత్" అంటే శరీరంలోని నాలుగు ధాతువులను సమతుల్యంగా ఉంచి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడంలో పైనాపిల్ ఎంతో కీలకం. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు నిపుణుల సలహాల కోసం మా యూట్యూబ్ మా Youtube"TeluguOne Health"ఛానెల్‌ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!) ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి! Disclaimer: ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ట్రీట్‌మెంట్ ప్రారంభించే ముందు మీ డాక్టర్‌ని సంప్రదించండి.
బోన్ సిస్ట్.. దీన్నే ఎముక తిత్తి అని అంటారు. ఎముక తిత్తి అనేది ఎముక సంబంధిత సమస్య, దీని గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఇది చాలా అరుదైన వ్యాధి, కానీ ఎవరికైనా ఇది వచ్చినప్పుడు, వారి సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. ఎముక తిత్తి అభివృద్ధి చెందినప్పుడు, ఆ ప్రాంతంలోని ఎముక నెమ్మదిగా కరిగిపోవడం ప్రారంభమవుతుంది.  తరచుగా ఈ సమస్యను  క్యాన్సర్‌తో  రిలేటెడ్ గా పరిశీలిస్తారు. కానీ ఇది క్యాన్సర్ కు సంబందం లేని వ్యాధి. బోన్ సిస్ట్ సమస్య ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేస్తుంది.  మరీ ముఖ్యంగా  కౌమారదశలో పిల్లలను ప్రభావితం చేస్తుంది.  చిన్న గాయం కారణంగా అకస్మాత్తుగా ఎముక విరిగినప్పుడు ఎముక తిత్తులు వస్తాయి.  ఒక అధ్యయనం ప్రకారం, ఈ తిత్తులు సాధారణంగా ఎముకల చివర్లలో అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ పెరుగుదల ప్లేట్లు చురుకుగా ఉంటాయి, ఈ తిత్తులు సాధారణంగా రెండు రకాలు: అనూరిస్మల్ ఎముక తిత్తులు  యునికార్న్యుయేట్ ఎముక తిత్తులు. ప్రారంభం..  ఈ వ్యాధి ప్రారంభం లక్షణాలు ప్రభావిత ప్రాంతంలో వివరించలేని నొప్పి,,  ఎక్స్-కిరణాలు ఆ ప్రాంతంలో ఎముక సాంద్రత తగ్గినట్లు వెల్లడిస్తాయి. అదృష్టవశాత్తూ, ముందుగానే గుర్తిస్తే, దీనిని పూర్తిగా నయం చేయవచ్చు. కౌమార దశలో దీని ప్రమాదం ఎక్కువ ఎందుకు? కౌమారదశలో ఎముకలు వేగంగా పెరుగుతాయి.  ఈ సమయంలో ఎముకల లోపల ద్రవ పీడనం లేదా రక్త నాళాలలో మార్పులు తిత్తులు ఏర్పడటానికి దారితీస్తాయి.  వైద్యులు, నిపుణుల అభిప్రాయం ప్రకారం..  ఇది సాధారణంగా 5 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలలో కనిపిస్తుంది, ఎందుకంటే ఈ కాలంలో ఎముక ఎదుగుదల,  ఎముకలలో మార్పుల  ప్రక్రియ వేగంగా జరుగుతుంది. లక్షణాలు.. ఎముక తిత్తులు ఎలాంటి స్పష్టమైన లక్షణాలను కలిగి ఉండవు,  కొన్నిసార్లు ప్రభావిత ప్రాంతంలో నొప్పిని కలిగిస్తాయి, కానీ చాలా సందర్భాలలో ఎముక బలహీనపడి విరిగిపోయే వరకు నొప్పి ఉండకపోవచ్చు. ఈ వ్యాధి తరచుగా ఆటలు ఆడే  సమయంలో గాయాలు తగలడం జరిగినప్పుడు చేసే  ఎక్స్-రే వాపు లేదా చిన్న బెణుకుల ద్వారా గుర్తించబడుతుంది. పిల్లలు పెద్ద గాయం లేకుండా ఒకే ప్రాంతంలో పదే పదే నొప్పి లేదా పగుళ్లను ఎదుర్కొంటుంటే, అది ఎముక తిత్తికి ముందస్తు సంకేతం కావచ్చు. చికిత్స.. వైద్యులు తరచుగా చిన్న తిత్తులను పర్యవేక్షిస్తారు, ఎందుకంటే చాలా సందర్భాలలో అవి వయస్సుతో పాటు వాటంతట అవే నయం అవుతాయి. తిత్తి పెద్దగా ఉండి, పగులు వచ్చే ప్రమాదం ఉంటే, 'క్యూరెట్టేజ్' ప్రక్రియ ద్వారా ద్రవాన్ని తొలగించడం ద్వారా 'బోన్ గ్రాఫ్టింగ్' చేస్తారు. కొన్ని సందర్భాల్లో, ఈ తిత్తులను శస్త్రచికిత్స లేకుండానే స్టెరాయిడ్ ఇంజెక్షన్ల ద్వారా కూడా చికిత్స చేయవచ్చు. తిత్తి పెద్దదిగా మారితే  శస్త్రచికిత్సను కూడా సూచించవచ్చు. ఇది చాలా అవసరం.. ఎముక తిత్తి సమస్య   సరైన సమయంలో గుర్తించబడితే  సకాలంలో చికిత్స చేయడం ద్వారా దీనిని పూర్తిగా నయం చేయవచ్చు. ప్రభావిత ప్రాంతంలో కణజాలం  బయాప్సీ చేసిన తర్వాత మాత్రమే నిపుణులు ఈ సమస్యను  నిర్ధారిస్తారు. బయాప్సీ నివేదిక ఎముక తిత్తిని నిర్ధారించిన తర్వాత, చికిత్స ప్రారంభిస్తారు. పిల్లలకు ఎముకల విషయంలో ఏదైనా అనుమానాస్పదంగా సమస్య కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయంకుడా ఆర్థోపెడిక్ వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.                                       *రూపశ్రీ.
బట్టతల మరియు జుట్టు రాలడం :  కారణాలు నివారణలు  ఆధునిక చికిత్సలు జుట్టు అనేది కేవలం మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన అందానికి మరియు ఆత్మవిశ్వాసానికి చిహ్నం. అద్దంలో చూసుకున్నప్పుడు జుట్టు పలచబడటం గమనిస్తే కలిగే ఆందోళన అంతా ఇంతా కాదు. ఒకప్పుడు 40 ఏళ్లు దాటిన వారిలో కనిపించే బట్టతల సమస్య, నేడు మారుతున్న జీవనశైలి వల్ల 13-14 ఏళ్ల చిన్న వయసులోనే మొదలవుతోంది. ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనిని అరికట్టడం సాధ్యమేనా?  Dr. Sunaina Shaik చెప్పిన మరిన్ని విషయాలు ఈ  TeluguOne Health Video Link క్లిక్ చేసి తెలుసుకుందాం. మనం జుట్టుపై ఎందుకు శ్రద్ధ వహించాలి? (Why Should We?) • ముందస్తు గుర్తింపు (Early Diagnosis): జుట్టు పూర్తిగా ఊడిపోయిన తర్వాత తిరిగి రావడం అసాధ్యం. ప్రారంభ దశలోనే గుర్తిస్తే మందుల ద్వారా జుట్టును కాపాడుకోవచ్చు. • ఆత్మవిశ్వాసం: జుట్టు రాలడం వల్ల కలిగే మానసిక ఒత్తిడి మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం వల్ల మనల్ని మనం ఉత్సాహంగా ఉంచుకోవచ్చు. • మెరుగైన ఫలితాలు: జుట్టు పల్చబడే దశలో (Hair Thinning) చికిత్స ప్రారంభిస్తే, ఉన్న జుట్టును ఒత్తుగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) • సొంత వైద్యం వద్దు: డాక్టర్ పర్యవేక్షణ లేకుండా మినాక్సిడిల్ (Minoxidil) వంటి మందులను వాడకూడదు. • గర్భధారణ సమయంలో జాగ్రత్త: గర్భం దాల్చిన వారు లేదా ప్లాన్ చేస్తున్న వారు మినాక్సిడిల్ వాడటం వల్ల పుట్టబోయే పిల్లల్లో లోపాలు వచ్చే అవకాశం ఉంది. • అతిగా ఆశించవద్దు: హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ ద్వారా గతంలో ఉన్నంత సహజమైన సాంద్రత (Density) రాకపోవచ్చు; ఇది కేవలం పలచబడిన ప్రాంతాన్ని కవర్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. • ఒత్తిడిని నిర్లక్ష్యం చేయకండి: ఆధునిక పరిశోధనల ప్రకారం, ఒత్తిడి (Stress) అనేది బట్టతలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారుతోంది. జుట్టును ఎలా కాపాడుకోవాలి? (How to - Treatment Steps) 1. కారణాన్ని గుర్తించండి: పురుషులలో వచ్చే బట్టతలను 'ఆండ్రోజెనెటిక్ అలోపేసియా' అంటారు, ఇది ఎక్కువగా జన్యుపరంగా వస్తుంది. మహిళల్లో జుట్టు మధ్యలో పలచబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2. వైద్య చికిత్సలు:     ◦ మినాక్సిడిల్: ఇది సీరం, లోషన్, ఫోమ్ లేదా టాబ్లెట్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ◦ PRP మరియు GFC: ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా (PRP) మరియు గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ (GFC) చికిత్సల ద్వారా మీ స్వంత రక్తం నుండి తీసిన పోషకాలను తలకు ఇంజెక్ట్ చేసి జుట్టు సాంద్రతను పెంచుతారు. ◦ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్: జుట్టు పూర్తిగా ఊడిపోయిన చోట వేరే ప్రాంతం నుండి జుట్టును తీసి నాటుతారు. 3. సప్లిమెంట్స్: డాక్టర్ సూచన మేరకు అవసరమైన విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది. సాధారణ సందేహాలు - సమాధానాలు (Q&A) ప్ర: బట్టతల అనేది కేవలం జన్యుపరంగానే వస్తుందా?  జ: పురుషులలో ఇది ప్రధానంగా జన్యుపరంగా వస్తుంది. కానీ మహిళల్లో జన్యువులతో పాటు హార్మోన్ల మార్పులు మరియు ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. ప్ర: PRP చికిత్సతో కొత్త జుట్టు వస్తుందా?  జ: లేదు. PRP లేదా GFC చికిత్సలు ఉన్న జుట్టును ఒత్తుగా (Thickening) చేయడానికి మరియు రాలకుండా ఆపడానికి మాత్రమే ఉపయోగపడతాయి. జుట్టు లేని చోట కొత్తగా జుట్టు రావాలంటే హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ ఒక్కటే మార్గం. ప్ర: శరీరంలోని ఇతర భాగాల నుండి జుట్టును తీసి తలకు వాడవచ్చా?  జ: అవును, చాతి లేదా గడ్డం వంటి భాగాల నుండి జుట్టును తీసి ట్రాన్స్ ప్లాంట్ చేయవచ్చు. కానీ తలపై ఉన్న జుట్టు ఇచ్చినంత సహజమైన ఫలితాలు వీటితో రాకపోవచ్చు. జుట్టు రాలడం అనేది ఒక సమస్యే కావచ్చు, కానీ సరైన సమయంలో స్పందిస్తే దానికి పరిష్కారం తప్పక ఉంటుంది. భయపడకుండా నిపుణులైన డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోండి. మరింత సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానెల్ సందర్శించండి: జుట్టు సంరక్షణ మరియు మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!