Hyderabad: యువతిపై అత్యాచారయత్నం.. స్థానికుల దాడిలో DRDO ఉద్యోగి మృతి.!
Published on: Thu Oct 22, 2026 5:33PM

DRDO ఉద్యోగి ఎదురింట్లో ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు.. అవకా శం కోసం ఎదురుచూశాడు యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి చొరబడ్డాడు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు రంగప్రవేశం చేసి అతడిపై దాడికి పాల్పడటంతో DRDO ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న రామ్మోహన్ (40) DRDO ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
తన నివాసానికి ఎదురుగా ఉన్న ఫ్లాట్‌లో ఉంటున్న ఓ యువతిపై మనసు పడ్డాడు. ఈ క్రమంలో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంట్లోకి వెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో సదరు యువతి గట్టిగా కేకలు వేయడంతో పక్క ఫ్లాట్‌లో ఉన్న వ్యక్తులు వెంటనే స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న వారు రామ్మోహన్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు.

ఈ దాడిలో రామ్మోహన్ తలకు తీవ్ర గాయాల య్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం వీధిలో రామ్మోహన్ అనే వ్యక్తి తన భార్య కాత్యా యినితో కలిసి గత రెండు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు. ఇతను డిఆర్డిఓ లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను గత కొంతకాలంగా ఇంటి పక్కనే ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు. దీంతో ప్రతిసారి ఆ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా రామ్మోహన్ యువతిని వేధించసా గాడు. దీంతో సదరు యువతి ఇంటి పక్కనే నివాసం ఉంటున్న అభిజిత్ అనే యువకుడికి విషయం మొత్తం చెప్పింది.
దీంతో ఆగ్రహం చెందినే అభిజిత్ వచ్చి రామ్మోన్ను గత కొంతకాలంగా యువతిని ఎందుకు వేధిస్తున్నావని ప్రశ్నిం చాడు. దీంతో ఇరువురి మధ్య మాట మాట పెరిగి పెద్ద ఎత్తున గొడవ జరగడంతో అభిజిత్ ఒక్కసారిగా రామ్మోహన్‌ను గట్టిగా తోసేసాడు. దీంతో రామ్మోహన్ తలకు గాయమైంది. అది గమనించిన అతని భార్య వెంటనే రామ్మోహన్ ను కాచిగూడ లోని సీసీ షరాఫ్ ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించగా చికిత్స పొందుతూ చెందాడు. రామ్మోహన్ భార్య కాత్యాయిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
[ DRDO employee Rammohan, Attempted rape of a young woman, Chikkadapalli Police Station, Crime news, Hyderabad Police, CP Sajjanar, DGP C.V. Anand, Telugu One, Telugu News ]


