LATEST NEWS
జనసేన ఎమ్మెల్యే  అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్ పదవికి చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.  రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన అరవ శ్రీధర్ ఇటీవల తన విప్ పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే.  ఇటీవల తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అరవ శ్రీధర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఆ భేటీ అనంతరం వ్యక్తిగత కారణాలతో ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ రాజీనామా చేశారు.   అరవ శ్రీధర్‌పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  అయితే ఆ కమిటీ అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తి చేసిందా, ఒక వేళ పూర్తి చేస్తే.. పార్టీ హైకమాండ్ కు ఇచ్చిన నివేదికలో ఏముంది? అన్న విషయాలపై క్లారిటీ లేదు. అయితే.. అరవ శ్రీధర్ జనసేనానితో భేటీ అనంతరం విఫ్ పదవికి రాజీనామా చేయడం, ఆ రాజీనామా ఆమోదం పొందటం జరిగిపోయాయి.   
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌ వేదికగా తలపెట్టిన భారీ బహిరంగ సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. తెలంగాణలో జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా  తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం పేరిట ఈ భారీ సభను ఏర్పాటు చేశారు. మంగళవారం (జూన్ 2) మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించాలని జనసేన శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే, రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతుండటం, అదే సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ,  ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పోలీసుల నిర్ణయంతో ఏమాత్రం వెనక్కి తగ్గని జనసేనాని పవన్ కళ్యాణ్, తక్షణమే ప్రత్యామ్నాయ వ్యూహానికి తెరలేపారు. సభకు బ్రేక్ పడినా, తన గళాన్ని వినిపించేందుకు   సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే అత్యవసరంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణలో జనసేన భవిష్యత్ యాక్షన్ ప్లాన్, పార్టీ పటిష్టతకు తీసుకోబోయే   కీలక నిర్ణయాలను ఆయన నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. పోలీసులు సభను అడ్డుకున్నా, ప్రెస్ మీట్ ద్వారా తన పొలిటికల్ ఎజెండాను బలంగా చాటాలని పవన్ భావిస్తున్నారు. మరోవైపు, పోలీసుల నిరాకరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన లీగల్ టీమ్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. రేపు మధ్యాహ్నం లోగా కోర్టు నుంచి అనుకూల తీర్పు వస్తుందని పార్టీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. కోర్టు తీర్పుపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో యువత టార్గెట్‌గా, దాదాపు 50 శాతం కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌ను యాక్టివ్ చేయాలనేది పవన్ ప్రధాన ఉద్దేశం. కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా, తెలంగాణలోనూ జనసేన సత్తా చాటాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వేదికగా జరగాల్సిన సభకు బ్రేక్ పడటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి   కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉంది. పవన్ కళ్యాణ్ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో  అనూహ్య పరిణామం సంభవించింది. నిన్న మొన్నటివరకు తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అస్థిత్వం కోసం  పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే..  పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు   భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత..  భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు  ఏర్పాటు చేసిన   కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు   గైర్హాజరు  అయ్యారు.  ఈ పరిణామం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న అసంతృప్తిని,  ముఠా రాజకీయాలనుబహిర్గతం చేసింది. ముఖ్యంగా మమతా బెనర్జీ వారసుడిగా చలామణి అవుతున్న అభిషేక్ బెనర్జీ ఒంటెద్దు పోకడలపై పార్టీ సీనియర్లలో  ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇటీవలే ఎన్నికల ఫలితాల అనంతరం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కంటికి  గాయమై ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా హుగ్లీలో మరో కీలక నేత కల్యాణ్ బెనర్జీపై కూడా దాడి జరిగింది. ఈ దాడుల నేపథ్యంలో పార్టీ నేతల్లో ధైర్యం నింపేందుకు దీదీ ఏర్పాటు చేసిన సమావేశానికి మెజారిటీ ఎమ్మెల్యేలు గైర్హాజర్ కావడం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని దిగ్భ్రాంతికి గురి చేసింది.    తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 50 మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా బెంగాల్ రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది.   వీరంతా మమతా బెనర్జీ,  అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..  సరికొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు చర్చ నడుస్తోంది.  ఈ తాజా సంక్షోభంపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకులపై దాడులు జరుగుతుంటే ఆసుపత్రులు కూడా చికిత్స అందించవద్దంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని, బెంగాల్‌  ప్రస్తుతం   నియంతృత్వ ధోరణి నడుస్తోందని ఆరోపించారు.  కాగా 80 మందిలో 60 మంది ఎమ్మెల్యేలు కీలక సమావేశానికి గైర్హాజర్ కావడం చూస్తుంటే.. టీఎంసీలో  మమతా బెనర్జీ పట్టు   సడలినట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని అటు సొంత సామాజికవర్గం, ఇటు రాజకీయ ప్రత్యర్థుల నుంచి ముప్పేట దాడి మొదలైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చుట్టూ ఇప్పుడు సరికొత్త వివాదాలు చుట్టుముడుతున్నాయి. అటు తెలంగాణలో భూముల వ్యవహారాలు, ఇటు ఆంధ్రాలో కాపు సామాజికవర్గ నేతల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలు జనసేనానిని రాజకీయంగా ఇరకాటంలోకి నెడుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై  సీనియర్ రాజకీయ విశ్లేషకుడు  భరద్వాజ తో  తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.   పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.  ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పవన్ కళ్యాణ్ ఏం చేశారంటూ దాసరి రాము వంటి నేతలు టోన్ పెంచి విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ పవన్ ఓడిపోవడానికి ఆ సామాజికవర్గమే బాధ్యత వహించాలంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ప్రత్యర్థులు ఆయుధంగా మలుచుకుంటున్నారు. జనసేన కేవలం ఒక కులానికి పరిమితమైన పార్టీ కాదని పవన్ స్పష్టం చేస్తున్నప్పటికీ, ఆయనను టార్గెట్ చేయడం ఆపడం లేదు. మరోవైపు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి  కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు కూడా పవన్‌పై విమర్శల దాడిని ముమ్మరం చేశారు. వంగవీటి మోహన రంగా హత్యోదంతాన్ని మళ్లీ తెరపైకి తెస్తూ, ఆనాటి రాజకీయ పరిస్థితులను ప్రస్తుత కూటమితో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రంగా అభిమానులు, కాపు సామాజికవర్గం విస్తృతంగా ఉన్న ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ బలాన్ని తగ్గించడమే ఈ విమర్శల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అందుకే రంగా హత్యను తెరపైకి తీసుకువచ్చి.. ఆ హత్యకు కారకులతో పవన్ కల్యాణ్ ఇప్పుడు ఉన్నారంటూ విమర్శిస్తున్నారు. ఈ వ్యూహాత్మక ఒత్తిడి ద్వారా పవన్ కళ్యాణ్ చేత ఏదైనా భావోద్వేగ ప్రకటన చేయించాలని ప్రత్యర్థులు భావిస్తున్నారు. ఆ ప్రకటన గనుక కూటమి ప్రభుత్వ ఐక్యతకు భంగం కలిగించేలా ఉంటే..  దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది శత్రు పక్షాల ప్లాన్. ఈ ముప్పేట దాడిని తిప్పికొట్టేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్యాడర్ మద్దతును కూడగడుతున్నారు. ఇందులో భాగంగానే రాజమండ్రి, విజయవాడ, మంగళగిరి పార్టీ కార్యాలయాల్లో వరుసగా కీలక సమావేశాలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ ప్రెజర్‌ను పవన్ కళ్యాణ్ ఎంత నిగ్రహంతో, శాంతియుతంగా హ్యాండిల్ చేస్తారనేది అత్యంత కీలకంగా మారింది. ఆయన భావోద్వేగానికి లోనై కూటమికి ఇబ్బంది కలిగిస్తారా? లేక చాకచక్యంగా ఈ వ్యూహాల నుంచి బయటపడి తన రాజకీయ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా? అనేది వేచి చూడాలి.
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ దేశ అత్యున్నత న్యాయస్థానానికి చెందిన ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, వివాదానికి దారితీశాయి. సామాజిక మాధ్యమాల్లో, సమాజంలో ప్రశ్నించే హక్కును వాడుకుంటున్న నిరుద్యోగ యువతను, ఆర్టీఐ  యాక్టివిస్టులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో  తీవ్ర  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠంనేని, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ స్పందించారు. ఈ అంశంపై  తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో  రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను  పారసైట్లు,  కాక్రోచ్‌లు  అనడం  అత్యంత దురదృష్టకరమని   అభిప్రాయపడ్డారు.   గత కొన్నేళ్లుగా దేశంలో సాగుతున్న కమ్యూనల్, కుల పోలరైజేషన్ ప్రభావం దురదృష్టవశాత్తూ అత్యున్నత స్థానాల్లో ఉన్నవారి మెదడుపై కూడా పడుతోందనే ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో విమర్శకులను  అర్బన్ నక్సలైట్లు  అని ముద్రవేసిన పాలకులు..  ఇప్పుడు సరికొత్తగా బ్రాండింగ్ చేయడం ప్రారంభించారని, దానికి ఈ వ్యాఖ్యలే ఉదాహరణని విశ్లేషించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి పౌరుడికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. అలాగే ఆర్టికల్ 21 ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవంతో జీవించే హక్కును కల్పిస్తోంది. ఈ హక్కులను కాపాడాల్సిన న్యాయమూర్తి, ప్రశ్నించే వారిని అణచివేసేలా మాట్లాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని  అన్నారు. దేశంలో  నెలకొన్న ప్రధాన సమస్య నిరుద్యోగం కాదు..  చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం లేకపోవడం అంటే అండర్ ఎంప్లాయ్‌మెంట్. పీహెచ్‌డీ  చేసిన అభ్యర్థులు, ఎంబీఏ   చదివిన యువకులు   డ్రైవర్లుగా, గిగ్ వర్కర్లుగా స్థిరపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వాల విద్యా విధానాల, ఉపాధి కల్పన వైఫల్యమే అని డోలేంద్రప్రసాద్ అన్నారు.  న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించాల్సింది ప్రభుత్వాల వైఫల్యాలను, ఆదేశించాల్సింది నిరుద్యోగ యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించమని.అయితే ఆయన అందుకు భిన్నంగా యువత సోషల్ మీడియాలో, ఆర్టీఐ అప్లికేషన్లతో సమయం వృథా చేస్తోందంటూ  కించపరచడం సమంజసం కాదన్నారు. మీడియా తన వ్యాఖ్యలను తప్పుదారి పట్టించిందంటూ న్యాయమూర్తి వివరణ ఇవ్వడంపై  ఆయన..  ఒక కార్పొరేటర్ లేదా ఎమ్మెల్యే స్థాయిలో కాకుండా, దేశ అత్యున్నత న్యాయస్థానంలో కూర్చున్న వ్యక్తి తప్పుడు సంజాయిషీలు ఇచ్చుకోవడం కరెక్ట్ కాదన్నారు.  ఆయన వెంటనే దేశ యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు మాట్లాడే ప్రతి మాట సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు యువతలో తీవ్ర తిరుగుబాటు ధోరణికి కారణమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా పౌర సమాజం, న్యాయవ్యవస్థ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డోలేంద్రప్రసాద్, రవిశంకర్ కంఠంనేని అన్నారు. 
ALSO ON TELUGUONE N E W S
తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ముప్పై ఏళ్లు దాటితే చాలు గ్లామర్ పాత్రలకు క్రేజ్ తగ్గి ఆఫర్లు నెమ్మదిస్తాయి. అయితే ఈ మూస పద్ధతిని బ్రేక్ చేసి ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు రాణించాలని గట్టి ప్లాన్ తో ముందుకు వెళ్తోంది మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ బ్యూటీ తన కెరీర్‌లో నయా స్ట్రాటజీని ఫాలో అవుతోంది. తొలినాళ్లలో 'ప్రేమమ్', 'శతమానం భవతి' వంటి సినిమాలతో హోమ్లీ బ్యూటీగా, పక్కింటి అమ్మాయిగా కుర్రకారు మనసు దోచుకుంది అనుపమ. కేవలం ఆ క్యూట్‌నెస్, గ్లామర్‌తోనే మరో నాలుగైదేళ్లు సులువుగా నెట్టుకురావచ్చు. కానీ ముప్పై ఏళ్ల మైలురాయి దాటాక కూడా రేసులో నిలబడాలంటే కొత్త హీరోయిన్ల పోటీని తట్టుకోవడం కష్టమని భావించిన ఈ భామ, కేవలం కమర్షియల్ రోల్స్ కే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన పాత్రలను లైన్ లో పెడుతోంది. గత కొద్ది కాలంగా అనుపమ ఎంచుకుంటున్న కథలను గమనిస్తే ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ స్పష్టంగా కనిపిస్తుంది. 'కార్తికేయ-2' లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఆమెకు ఎన్నో కమర్షియల్ ఆఫర్లు తలుపు తట్టినా.. వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించింది. వాటి స్థానంలో పరదా, లాక్‌డౌన్, మరీచిక వంటి పూర్తి కంటెంట్ ఓరియెంటెడ్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ముఖ్యంగా 'మరీచిక' చిత్రంలో వెంకటలక్ష్మి అనే విలక్షణమైన పాత్రలో అనుపమ చేసిన నటనకు, ప్రయోగానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అయితే ఇలాంటి ప్రయోగాత్మక పంథా ఎంచుకోవడం వెనుక పెద్ద రిస్క్ కూడా దాగి ఉంది. కమర్షియల్ ఫార్ములా సినిమాలను వదిలేయడం వల్ల బాక్సాఫీస్ మార్కెట్ తో పాటు రెమ్యునరేషన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. గతంలో 'కిష్కిందపురి' లాంటి కొన్ని సినిమాలు మినహాయిస్తే ఆమె చేసిన కొన్ని ప్రయోగాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. అయినప్పటికీ తాత్కాలిక విజయాల కోసం పాకులాడకుండా, బాలీవుడ్ సీనియర్ నటీమణులు విద్యాబాలన్, టబుల తరహాలో లాంగ్ ర‌న్‌లో గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదలతో ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. సాయి పల్లవి, కీర్తి సురేష్ లు కూడా గ్లామర్ పైనే కాకుండా తమ నటనపై నమ్మకంతోనే ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అనుపమ కెరీర్ ప్లానింగ్ పై ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముప్పై ఏళ్ల వయసులోనే ఇమేజ్ మార్చుకుంటూ భవిష్యత్తుకు గట్టి పునాది వేసుకోవడం మంచి నిర్ణయమేనని ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా, విమర్శకుల మెప్పు పొందితే భవిష్యత్తులో మరింత బలమైన క్యారెక్టర్స్ వస్తాయని అనుపమ బలంగా నమ్ముతోంది. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో మరికొన్ని క్రేజీ విమెన్ సెంట్రిక్ కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది అనుపమ పరమేశ్వరన్. ఈ కొత్త ప్రయోగాలు ఆమెను టాలీవుడ్‌లో ఏ స్థాయికి తీసుకెళ్తాయో.. నటిగా ఎలాంటి గుర్తింపును తెచ్చిపెడతాయో చూడాలి!
అడివి శేష్ డెకాయిట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి అడివి శేష్ క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2 వంటి మూవీస్ లో పవర్ ఫుల్ రోల్స్ లో కనిపించాడు. అలాంటి అడివి శేష్ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో "ఆస్క్ మీ ఎనీ థింగ్ " అని అడిగాడు ఫాన్స్ ని. దాంతో చాలామంది చాలా ప్రశ్నలే అడిగారు. అడివి శేష్ ఆన్సర్స్ కూడా ఇచ్చాడు. "ఇండియాలో ఏఐ సెంటర్స్ ఏర్పాటును మీరు సపోర్ట్ చేస్తారా " అన్న ప్రశ్నకు "అస్సలు సపోర్ట్ చేయను ఎందుకంటే ఈ సెంటర్స్ ప్రకృతిని నాశనం చేస్తాయి. ఈ సెంటర్స్ మన ఫ్రెష్ వాటర్ ని కబ్జా చేసి తాగేసి ఉష్ణోగ్రతలను అధికంగా పెంచేస్తాయి. ఈ సెంటర్స్ మనుషులకు, ప్రకృతికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. కేవలం జాబ్స్ కోసమే వీటిని ఏర్పాటు చేస్తున్నట్టయితే మాత్రం నెగటివ్ ఎఫెక్ట్స్ మాత్రం 10 x  లో ముంచేస్తాయి " అన్నారు.  "మీరు ఇంత అంత అందంగా ఉండడానికి కారణం ..మీ హైట్ ఎంత " అంటూ అడిగిన ప్రశ్నలు "మా పేరెంట్స్ కి థాంక్స్ చెప్పాలి అలాగే మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇంకా నా హాట్ 6 '1  " అని చెప్పాడు. "అడివి నేను నీ బిగ్ ఫ్యాన్ ని ఇండోనేషియా" నుంచి అనేసరికి "థాంక్యూ సో మచ్ . త్వరలో అక్కడికి రావాల్సి ఉంది " అని చెప్పాడు. ఇక కొంతమంది అడిగిన ప్రశ్నలకు ఎం చెప్పారంటే "నాకు హిట్, మేజర్, డెకాయిట్ మూవీస్ అన్నీ ఇష్టమే అలాగే రాబోయే g2 మూవీ కూడా ఇష్టమే . డెకాయిట్ మై ఫస్ట్ లవ్ స్టోరీ. నేను ప్యూర్ వెజిటేరియన్ ని . కొన్ని కారణాల వలన ఎగ్ తినడం కూడా మానేసాను. " అంటూ ఆన్సర్స్ ఇచ్చారు.
Raveena Tandon and her family recently faced a shocking breach of trust as Mumbai Police arrested their long-time caregiver for theft. A 47-year-old woman named Rashi Chhabria, who looked after the actress's 86-year-old mother Veena Tandon, was taken into custody. She allegedly stole gold and diamond jewelry worth approximately Rs. 25 lakhs from the family residence. The caregiver had been working closely with the Tandon family since 2020. Over the years, she managed to earn their complete trust and was allowed access to the private sections of the house. According to the police, she misused this freedom to break into a secure locker and remove the expensive valuables. The missing items were first noticed last year during the Dussehra festival. Raveena's brother, Rajiv Tandon, realized that several luxury watches and diamond ornaments were missing from the house. He immediately approached the police and filed a formal complaint to track down the stolen goods. During the initial police questioning, the caregiver completely denied having any hand in the robbery. However, as the investigating officers gathered more concrete evidence against her, they were able to make the arrest. The Mumbai Police have already recovered a portion of the stolen jewelry and are continuing the investigation to find the rest. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
తమిళ చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా విభిన్నమైన, ప్రయోగాత్మక చిత్రాల ట్రెండ్ నడిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అక్కడి అగ్ర కథానాయకులు తమ పంథా మార్చుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించడమే లక్ష్యంగా, పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. వినోదానికి పెద్దపీట వేస్తూ వరుస క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఇటీవలే స్టార్ హీరో సూర్య నటించిన 'కరుప్పు' చిత్రంతో ఈ సరికొత్త కమర్షియల్ ట్రెండ్ మొదలైంది. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాతో సూర్య తన బాక్సాఫీస్ సత్తా ఏంటో మరోసారి నిరూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ. 320 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ భారీ విజయంతో కోలీవుడ్‌లో కమర్షియల్ ఫార్ములాకు మళ్లీ ఊపు వచ్చింది. ఇదే ఊపును కొనసాగిస్తూ విలక్షణ నటుడు చీయాన్ విక్రమ్ తన తదుపరి చిత్రం 'చీయాన్ 63' తో మాస్ హంగామా చేయడానికి రెడీ అవుతున్నారు. హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి వినోదం కలగలిపిన ఒక భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ యొక్క రెగ్యులర్ షూటింగ్ జూన్ 7 నుంచి పట్టాలెక్కబోతోంది. మరోవైపు, వైవిధ్యమైన కథలతో మెప్పించే ధనుష్ సైతం తన 55వ మైల్‌స్టోన్ చిత్రం 'D55' కోసం కమర్షియల్ రూట్‌నే ఎంచుకోవడం విశేషం. ఇదొక హై-బడ్జెట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ, సాధారణ ప్రేక్షకులను సైతం థియేటర్లకు రప్పించేలా అన్ని వర్గాల వారికి నచ్చే పక్కా కమర్షియల్ ట్రీట్‌మెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ సైతం తన వింటేజ్ మాస్ లుక్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న నయా ప్రాజెక్ట్ 'సేయోన్' పక్కా రూరల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేశారు. గతంలో శివకార్తికేయన్‌కు భారీ బ్లాక్‌బస్టర్స్ అందించిన 'వరుత్తపడాత వాలిబర్ సంగం', 'రజినీ మురుగన్' చిత్రాల తరహాలోనే రోమాంచితమైన మాస్ మూమెంట్స్, కామెడీతో ఈ సినిమా ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. కోలీవుడ్ అగ్ర హీరోలంతా ఒకేసారి కమర్షియల్ ట్రాక్‌పైకి రావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరోలను మళ్లీ వింటేజ్ మాస్ అవతారాల్లో చూడబోతున్నామంటూ నెటిజన్లు ఎగ్‌జైట్ అవుతున్నారు. ట్రేడ్ విశ్లేషకులు సైతం ఈ మార్పును స్వాగతిస్తున్నారు, థియేటర్లకు పూర్వ వైభవం రావాలంటే ఇలాంటి కమర్షియల్ సినిమాలే కరెక్ట్ అని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, ఒకప్పుడు ప్రయోగాల వైపు అడుగులు వేసిన తమిళ తంబీలు.. ఇప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్ల వేటలో పక్కా కమర్షియల్ రూట్ ఎంచుకోవడంతో రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌ల టీజర్స్, ట్రైలర్స్ మరియు రిలీజ్ డేట్స్‌పై త్వరలోనే మరిన్ని అధికారిక అప్‌డేట్స్ రానున్నాయి.
  తెలుగు ప్రేక్షకులకి హాలీవుడ్ సినిమాలు కొత్త కాదు. ఎన్నో దశాబ్దాల నుంచి అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా హాలీవుడ్ చిత్రాలని చూస్తూ వస్తున్నారు. పైగా వాటిల్లోనూ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ ఇచ్చే కిక్ అయితే చెప్పక్కర్లేదు. స్క్రీన్ ముందు కూర్చుంటే కలిగే ఉత్కంఠ, చేజింగ్ సీన్లు, ఊహించని ట్విస్టులు ఆ మజాని  మాటల్లో చెప్పలేం. థియేటర్లలోనే కాదు, ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వేదికగా ఓటీటీలో అందుబాటులో ఉన్న కొన్ని హాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులని  విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఆ  8 ఎపిక్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లు ఏవి?  ఏ ఏ  ఓటిటిలో ఉన్నాయో చూద్దాం. మొదటిగా చెప్పుకోవాల్సింది మైండ్ బెండింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఇన్‌సెప్షన్'. 2010లో వచ్చిన ఈ క్రిస్టోఫర్ నోలన్  ఐఎండీబీలో 8.8 రేటింగ్ ఉంది. సుమారు 160 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 839 మిలియన్ డాలర్లకి పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. కలల ప్రపంచంలోకి వెళ్లి రహస్యాలను దొంగిలించే కాన్సెప్ట్‌తో సాగే ఈ సినిమా యాక్షన్ ప్రియులకి  ఒక విజువల్ ఫీస్ట్. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటుంది. ఆ తర్వాత 2014లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'ఇంటర్‌స్టెల్లార్' కూడా ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్తుంది. 165 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దాదాపు 730 మిలియన్ డాలర్లను రాబట్టింది. మానవాళి మనుగడ కోసం అంతరిక్షంలో సాగే ఈ ప్రయాణం గుండెలను పిండేసే ఎమోషన్స్‌తో పాటు అద్భుతమైన స్పేస్ థ్రిల్‌ను అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లలో ఈ మాస్టర్‌పీస్ అందుబాటులో ఉంది. యాక్షన్ అంటే కేవలం సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాదు, రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్స్ కూడా అని నిరూపించిన చిత్రం 'ది డార్క్ నైట్'. జోకర్, బాట్‌మాన్ మధ్య సాగే మైండ్ గేమ్స్ ఈ సినిమాను ఆల్ టైమ్ గ్రేట్ యాక్షన్ మూవీగా నిలబెట్టాయి. 185 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1.006 బిలియన్ డాలర్ల వసూళ్లతో చరిత్ర సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్ మరియు జియో సినిమాలో ఉన్న ఈ చిత్రం యాక్షన్ లవర్స్ ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు. మరోవైపు, ప్యూర్ రా యాక్షన్ కావాలనుకునే వారికి కీను రీవ్స్ నటించిన 'జాన్ విక్' సిరీస్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ముఖ్యంగా చాప్టర్ 4 కేవలం 100 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా 440 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ఇందులో ఉండే స్టంట్ సీక్వెన్సులు, గన్ ఫైట్లు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. లయన్స్ గేట్ ప్లే మరియు ప్రైమ్ వీడియోలో ఈ హై-వోల్టేజ్ యాక్షన్ మూవీస్ అందుబాటులో ఉన్నాయి. ఇక రియలిస్టిక్ మిలిటరీ యాక్షన్ ఇష్టపడే వారికి 'బ్లాక్ హాక్ డౌన్' ఒక అద్భుతమైన ఎంపిక. సోమాలియాలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మిలిటరీ ఆపరేషన్ల తీవ్రతను కళ్లకు కడుతుంది. 92 మిలియన్ డాలర్లతో రూపొంది 173 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం యాక్షన్ డ్రామాను సరికొత్తగా చూపిస్తుంది. ఈ జాబితాలో నెక్స్ట్ లెవెల్ ఛేజింగ్స్ తో అలరించే 'మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్' కూడా ఉంది. 150 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో వచ్చి 380 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా, ఆస్కార్ అవార్డుల్లో ఏకంగా 6 అవార్డులను కొల్లగొట్టింది. పోస్ట్-అపోకలిప్టిక్ ప్రపంచంలో సాగే ఈ రోడ్ యాక్షన్ థ్రిల్లర్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లభిస్తుంది. అలాగే, టామ్ క్రూజ్ నటన, సాహసాలు ఇష్టపడే వారి కోసం 'మిషన్ ఇంపాజిబుల్ - ఫాల్అవుట్' ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. 178 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా 791 మిలియన్ డాలర్లని  వసూలు చేసింది. ఇందులో టామ్ క్రూజ్ స్వయంగా చేసిన డూప్ లేని స్టంట్స్ చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. Also read: Nikhil: గాయాలైనా వెనక్కి తగ్గని నిఖిల్.. పెద్ద సాహసమే అని చెప్పవచ్చు చివరిగా, సైంటిఫిక్ అండ్ టైమ్ ఇన్వర్షన్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'టెనెట్' సినిమా సరికొత్త అనుభూతిని ఇస్తుంది. 200 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం కరోనా కాలంలోనూ 365 మిలియన్ డాలర్లు సాధించింది. స్క్రీన్ ప్లే పరంగా మైండ్ బ్లాక్ చేసే ఈ 8 సినిమాలు  తెలుగు ఆడియోతో, సబ్‌టైటిల్స్‌తో విభిన్న ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. మరి ఈ చిత్రాలని చూసీ అసలైన ప్రపంచ సినీ ప్రేమికులనే గుర్తింపు పొందండి.  
టాలీవుడ్ లో ఒక సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే ఆ దర్శకుడి తదుపరి ప్రాజెక్టులపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'ఉప్పెన' సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చేరి జాతీయ అవార్డును సైతం గెలుచుకున్న దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ మేకర్‌గా మారిపోయారు.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఆయన తెరకెక్కించిన విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందోనని యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.  అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, బుచ్చిబాబు తన మూడవ సినిమా కోసం ఒక భారీ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 'పెద్ది' చిత్రం తర్వాత ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెరవెనుక భారీ స్కెచ్ వేసినట్లు ఇండస్ట్రీ ఇన్సైడర్స్ చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌లకు అటు సూపర్ స్టార్ మహేష్ బాబుతోనూ, ఇటు దర్శకుడు బుచ్చిబాబుతోనూ ముందుగానే అగ్రిమెంట్లు ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరినీ ఒకే ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకువచ్చి ఒక అల్టిమేట్ బిగ్ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.  ట్రేడ్ వర్గాల లీకుల ప్రకారం, బుచ్చిబాబు ఇప్పటికే మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ మరియు ఇమేజ్‌కు సరిపోయేలా రెండు విభిన్నమైన పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌లను సిద్ధం చేశారట. అందులో ఒకటి క్లాస్ మరియు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కాగా, మరొకటి పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన హై-వోల్టేజ్ యాక్షన్ స్క్రిప్ట్ అని వినికిడి. ఈ రెండు లైన్లు విన్న మైత్రీ నిర్మాతలు కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యారని, మహేష్ బాబుకు ఏ కథ నచ్చితే ఆ ప్రాజెక్ట్‌ను వెంటనే పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంది. గతంలో మహేష్ బాబు కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన సైకలాజికల్ థ్రిల్లర్ '1: నేనొక్కడినే' సినిమాకు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే మహేష్ బాబు వర్కింగ్ స్టైల్‌ను, ఆయన నటనలోని వైవిధ్యాన్ని బుచ్చిబాబు చాలా దగ్గరగా గమనించారు. ఆ పాత పరిచయం మరియు నమ్మకమే ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వడానికి ప్రధాన కారణం కాబోతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ప్రస్తుతం మహేష్ బాబు దర్శధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అడ్వెంచర్ డ్రామా 'వారణాసి' (Varanasi) షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ గ్లోబ్-ట్రాటింగ్ సినిమా 2027 ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మహేష్ బాబు తన నెక్స్ట్ లైనప్‌ను లాక్ చేయనున్నారు. జూన్ 4న 'పెద్ది' విడుదలయ్యాక వచ్చే భారీ రెస్పాన్స్‌ను బట్టి బుచ్చిబాబు, మహేష్ బాబు కాంబోపై ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  
    పాన్ ఇండియా సెల్యులాయిడ్, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'స్వయంభు'(swayambhu)శరవేగంగా చిత్రీకరణని పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. నిఖిల్ పోరాట యోధుడిగా చేస్తున్నాడు. దీంతో తన క్యారక్టర్ కోసం  నిఖిల్ ఎలాంటి గాయాలని సైతం లెక్కచేయడం లేదు.   ఈ చిత్రంలో అత్యంత కీలకమైన, ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని ఇటీవల చిత్రీకరించారు. 12 రోజుల ప్రత్యేక షెడ్యూల్ కోసం ఏకంగా 8 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయించడం విశేషం. వెండితెరపై ఈ యాక్షన్ విజువల్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక షెడ్యూల్ కోసం నిఖిల్ దాదాపు 45 రోజుల పాటు రాత్రింబవళ్లు కఠినమైన శిక్షణ తీసుకున్నారు. గుర్రపు స్వారీ, కత్తి సాము మరియు ప్రాచీన యుద్ధ విద్యల్లో ఆయన ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు. ఈ 45 రోజుల సుదీర్ఘమైన, కఠినమైన శ్రమలో నిఖిల్‌కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నిఖిల్‌ కి  పలుమార్లు తీవ్రమైన గాయాలయ్యాయి. కొన్ని సందర్భాల్లో అపాయం కొంచంలో తప్పింది . అయినప్పటికీ నిఖిల్ ఎక్కడా వెనకడుగు వేయలేదు. సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా రావాలనే ఒకే ఒక్క లక్ష్యంతో, నొప్పిని  భరిస్తూ  షూటింగ్‌లో పాల్గొన్నారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ పెయిన్ కిల్లర్స్ వాడుతూ, డూప్ గా ఎవరినీ పెట్టుకోకుండా స్వయంగా ఆ రిస్కీ స్టంట్స్ అన్నింటినీ పూర్తి చేశారు. నిఖిల్ చూపిస్తున్న ఈ డెడికేషన్, పట్టుదల చూసి దర్శకుడు భరత్ కృష్ణమాచారితో పాటు చిత్ర నిర్మాణ సంస్థ పిక్సెల్ స్టూడియోస్ ప్రతినిధులు సైతం ఆశ్చర్యపోయారు.  Also read: Raju weds rambai: రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్ సెకండ్ ప్రాజెక్ట్.. ఈ సారి ఈ యదార్ధ గాధ ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న స్వయంభులో   సంయుక్తా మీనన్, నభా నటేష్  కథానాయకులు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, ఒకప్పటి రాజమౌళి ఆస్థాన కెమెరామెన్  కేకే సెంథిల్ కుమార్ ఫొటోగ్రఫీ అందిస్తున్నాడు. రిలీజ్ డేట్ త్వరలోనే రానుంది.    
  'రాజు వెడ్స్ రాంబాయి'(Raju weds Rambai).. ఈ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఖమ్మం, వరంగల్ సరిహద్దుల్లో జరిగిన ఒక యథార్థ గాథ ఆధారంగా తెరకెక్కి చిన్న చిత్రం, పెద్ద చిత్రం అనే తారతమ్యాన్ని చెరిపివేసింది. సరికొత్త కథ, కథనాల్ని కూడా సెల్యులాయిడ్ కి పరిచయం చేసిందని చెప్పవచ్చు. సాయిలు దర్శకత్వంలో మరో  దర్శకుడు విరాటపర్వం ఫేమ్ 'వేణు ఊడుగుల' నిర్మించాడు.  గద్దర్ అవార్డ్స్ 2025 అవార్డ్స్ లో ఉత్తమ చిత్రంగా నిలిచింది.  నిర్మాతగా తొలి అడుగులోనే ఇంతటి ఘనవిజయం సాధించిన వేణు ఊడుగుల(Venu Udugula)ఇప్పుడు డోలాముఖి సబ్‌ఆల్టర్న్ ఫిల్మ్స్, మాన్‌సూన్స్ టేల్స్ బ్యానర్లపై తన సరికొత్త ప్రాజెక్ట్‌ని ప్రకటించారు. ఈ నూతన చిత్ర ప్రకటన కేవలం ఒక సినిమా అనౌన్స్‌మెంట్‌గా మాత్రమే కాకుండా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది వర్ధమాన కళాకారులకి ఒక బంగారు అవకాశంగా మారింది. కేవలం 150 నిమిషాల వెండితెర కథ కోసం కాకుండా, సమాజంలోని మూలాల్లో ఉన్న సహజత్వాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రాజెక్ట్‌ని వేణు ఊడుగుల ప్లాన్ చేస్తున్నారు. ఈ సరికొత్త సామాజిక సందేశాత్మక చిత్రంలో నటించేందుకు పక్కా తెలంగాణ యాస, భాష వచ్చిన నటీనటులు కావాలంటూ చిత్ర యూనిట్ ఒక వినూత్నమైన కాస్టింగ్ కాల్‌ ని  వదిలింది. పల్లెటూరి వాతావరణంలో పెరిగి, తెలంగాణ జీవన విధానంపై పూర్తి పట్టున్న ప్రతిభావంతులను ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేయనున్నారు. గత చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ, అఖిల్ రాజ్, తేజస్విని వంటి స్థానిక నటులకు పెద్ద పీట వేసినట్లే, ఈసారి కూడా సరికొత్త టాలెంట్‌ని  వెలికితీయడానికి 100 శాతం ప్రాధాన్యత ఇస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. Also read: Anushka sharma: వైరల్ గా మారిన వాచ్... ధర తెలిస్తే షాక్ అవుతారు  ఒక యదార్థ గాథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.  భారతీయ కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య గొడవలు, విభేదాలు కొత్తవి కావు. కానీ ఒక ఇల్లు చీలిపోతే కేవలం ఆ కుటుంబమే ఓడిపోతుందా? లేక ఆ ఊరంతా నష్టపోతుందా? అనే  ప్రశ్న చుట్టూ ఈ కథ తిరుగుతుంది. “అన్నదమ్ములు అంటే రామలక్ష్మణుల్లా ఉండేవారనే రోజులు పోయాయి… ఇప్పుడు రక్తం పంచుకున్నవాళ్లే గొడ్డళ్లు పట్టుకునే మహాభారతం నడుస్తోంది. మా ఊరు జమ్మికుంట మట్టిసాక్షిగా.. ఇద్దరు అన్నదమ్ముల పంచాయితీ, కేవలం వాళ్ల ఇల్లనే కాదు… మా ఊరి రాతనే మార్చేసింది. అసలు ఆ రోజు ఎవరు గెలిచారో తెలియదు కానీ… ఊరు మాత్రం ఓడిపోయింది. ఇది ఏ ఇంట్లోనూ జరగకూడని కథ. పిల్లలు, పెద్దలు, తాతలు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు… అందరూ బయల్దేరండి, ఆ అన్నదమ్ముల పంచాయితీ ఏంటో సూద్దాం.” అని మేకర్స్ ఒక ఎమోషనల్ నోట్ వదిలారు. మధుకర్ రెడ్డి కొమిరెడ్డి కథ-దర్శకత్వంలో, DSF ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 2గా ఈ చిత్రం వస్తుంది. ఈ సంవత్సరమే సెల్యులాయిడ్ పై అడుగుపెట్టనున్నట్టుగా తెలుస్తుంది.    
- అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్! - ఆగిపోయిన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్? - డైరెక్టర్ తో విభేదాలే కారణమా? టాలీవుడ్, కోలీవుడ్ సినీ వర్గాల్లో ప్రస్తుతం ఒక వార్త సంచలనంగా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో ప్రకటించిన భారీ ప్రాజెక్ట్ 'AA23' ఆగిపోయే ప్రమాదం ఉందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా అనౌన్స్ చేసిన ఈ క్రేజీ కాంబినేషన్, షూటింగ్ దశకు చేరకముందే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్న లీకులు ఇరు హీరో, దర్శకుల అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్ట్.. ప్రకటన వచ్చిన రోజున సోషల్ మీడియాను షేక్ చేసింది. ముఖ్యంగా అనిరుధ్ అందించిన '23 థీమ్' మ్యూజిక్ ఏకంగా 1 మిలియన్ కంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో ట్రెండ్ అయి రికార్డు సృష్టించింది. అంతగా అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఇప్పుడు అటకెక్కనుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ నిలిచిపోవడానికి అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మధ్య తలెత్తిన కొన్ని అభిప్రాయ బేధాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. కథా చర్చల సమయంలో ఇద్దరి ఆలోచనలు వేర్వేరుగా ఉండటం, క్యారెక్టరైజేషన్ విషయంలో ఇద్దరి మధ్య ఒక స్పష్టమైన అవగాహన కుదరకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  2026 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది, కానీ ఇప్పటివరకు ప్రీ-ప్రొడక్షన్ పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడం ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. రాబోయే రోజుల్లో అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ ల మధ్య ఉన్న ఈ విభేదాలు సద్దుమణిగి, చర్చలు సఫలం కాకపోతే ఈ బిగ్గెస్ట్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ అధికారికంగా షెల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. ఈ వార్తలపై ఇటు మైత్రీ మూవీ మేకర్స్ కానీ, అటు హీరో, దర్శకులు కానీ స్పందించి క్లారిటీ ఇస్తే తప్ప ఈ సస్పెన్స్‌కు తెరపడదు.  
టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో నేషనల్ క్ర‌ష్‌గా గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక రష్మిక మందన్న ప్రస్తుతం టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. టాలెంట్‌తో పాటు క్రేజ్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో డిమాండ్ ఏ రేంజ్‌లో పెరుగుతుందో ఈ కన్నడ బ్యూటీని చూస్తే అర్థమవుతుంది. గత ఐదేళ్ల కాలంలో ఆమె తన పారితోషికాన్ని ఊహించని స్థాయిలో పెంచి, ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కాక్‌టెయిల్ 2' కోసం రష్మిక ఏకంగా 15 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని వసూలు చేసినట్లు బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. షాహిద్ కపూర్, కృతి సనన్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఒక్క సినిమాతో ఆమె రెమ్యూనరేషన్ గ్రాఫ్ సరికొత్త రికార్డులను సృష్టించిందని చెప్పాలి. టాలీవుడ్‌లో అగ్ర దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన గ్లోబల్ హిట్ ‘పుష్ప-1’ సమయంలో రష్మిక కేవలం 2 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంది. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించడంతో ఆమె మార్కెట్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. ఆ తర్వాత వచ్చిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు', 'సీతారామం' వంటి చిత్రాలకు దాదాపు 3 కోట్ల వరకు చార్జ్ చేసింది. ఇక బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె కెరీర్ మరింత వేగం పుంజుకుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన 'గుడ్‌బై', తమిళ చిత్రం 'వారిసు', అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాతో చేసిన 'మిషన్ మజ్ను' వంటి సినిమాలకు 4 కోట్ల రేంజ్ అందుకుంది. ముఖ్యంగా రణబీర్ కపూర్‌ సరసన నటించిన సంచలన చిత్రం 'యానిమల్' ఘనవిజయంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ క్రేజ్ తోనే 'పుష్ప-2' కోసం దాదాపు 7 కోట్ల రూపాయలను అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ఏకంగా 15 కోట్ల మార్కును తాకడం విశేషం. కార్పొరేట్ ఉద్యోగాల్లోనైనా ఐదేళ్లలో శాలరీ డబుల్ కావడం చూస్తాం, కానీ సినీ రంగంలో రష్మిక కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలోనే తన సంపాదనను 7 రెట్లు పెంచుకుని రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా రష్మిక ఫ్యాన్స్ ఈ అప్‌డేట్‌తో పండగ చేసుకుంటున్నారు. నేషనల్ క్రష్ రేంజ్ ఇదంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర తారలకు పోటీగా రష్మిక ఎదుగుతున్న తీరును సినీ విశ్లేషకులు సైతం మెచ్చుకుంటున్నారు.
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం.  ఇలాంటి పరిస్థితిలో అతిగా మాట్లాడం లేదా ఎక్కువ మాట్లాడటం కూడా భార్యాభర్తల బంధాన్ని విచ్చిన్నం చేస్తుందని అంటున్నారు రెలేషన్షిప్ నిపుణులు. జరిగే ప్రతి విషయాన్ని తమ భాగస్వామితో పంచుకోవడం, ప్రతి విషయాన్ని చర్చించడం, అన్ని విషయాలు తమకు తెలిసి జరగాలి అనుకోవడం, ప్రతి చిన్న విషయం గురించి మాట్లాడటం.. ఇలా ప్రతిదీ భాగస్వామితో మాట్లాడం వల్ల భార్యాభర్తల బంధం విచ్చిన్నం అవుతుంది అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఇది తెలుసుకోవాలి.. ఒక సంబంధాన్ని బలపరచడంలో  ముఖ్యమైనది ఎక్కువ మాట్లాడటం కాదు.. ఏదైనా మాట్లాడినప్పుడు ఆ మాటలలో నిజాయితీ,  మాట్లాడే విషయం పట్ల అవగాహన,  దాని ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనవి.  ఏదో ఒకటి మాట్లాడాలి అని  కబుర్లు చెప్పుకోవడంలో బంధం బలపడటం అనేది జరగదు. ఇద్దరి ఆలోచనలు, ప్రవర్తనలు, ఇద్దరూ ఏదైనా విషయం గురించి మాట్లాడటం.. ఇలాంటి సందర్బాలు చాలా కొన్నే ఉన్నా అది బంధాన్ని బలపరుస్తుంది.  ఏదో ఒకటి మాట్లాడాలనే కారణంతో అవసరం లేని విషయాలు మాట్లాడుతూ ఉంటే.. భాగస్వామి విసుగు చెంది  ఇలా కబుర్లు చెప్పడం అనే మంచి సమయానికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సమయం ముఖ్యమే..  భార్యాభర్తలు రోజులో కొంత సమయం గడపడం చాలా కీలకమని నిపుణులే చెబుతున్నారు. ఇద్దరు కలిసి కొంత సమయం గడిపినప్పుడు, వారి మధ్య ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి, సాన్నిహిత్యం పెరుగుతుంది. ఎప్పుడూ ఒకరితో మరొకరు అప్యాయత, అనురాగం,  ఇద్దరి మధ్య బంధం బలపడే  అవకాశం ఉంటుంది. చిన్న విషయాలు ఎందుకు మాట్లాడకూడదు.. కొందరు భాగస్వాములు చిన్న చిన్న విషయాలను కూడా చెబుతూ ఉంటారు. ఏ విషయాన్ని దాచుకోవడం లేదని, తాము బంధంలో ఎంతో నిజాయితీగా ఉంటున్నామని కూడా అంటుంటారు. కానీ ఇది చాలా పొరపాటు.  ప్రాముఖ్యత లేని విషయాల గురించి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య ఆసక్తి తగ్గి, అపార్థాలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇద్దరు కలిసి గడిపే సమయం నాణ్యంగా మార్చుకోవాలి. అంచనాలకు పోవద్దు.. టీవి, సినిమా, సీరియల్, చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు భార్యాభర్తల బందాలలో కొన్ని సంఘటనలు, సందర్భాలు చాలా సంతోషంగా, ఎంతో అపురూపంగా గడుపుతూ ఉంటారు.  ఇలాంటి బంధాలను చూసి తాము అలా ఉండాలని అనుకుంటారు చాలామంది. కానీ ఇలాంటి అంచనాలు పెట్టుకోవడం వల్ల చాలా అసంతృప్తి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కాస్తా భాగస్వామి విషయంలో ఒకరంటే ఒకరి పట్ల ఇష్టం,  ఆసక్తి తగ్గి,  చిరాకు, కోపం పెరిగేలా చేస్తుంది. మనిషిని బట్టే.. కొందరు ఎక్కువ మాట్లాడేవారు ఉంటారు. మరికొందరు తక్కువ మాట్లాడేవారు ఉంటారు. కాబట్టి మనిషిని బట్టి ముందుకెళ్లాలి.  బాగా మాట్లాడేవారితో ఏం మాట్లాడినా సరదాగా తీసుకుంటారు. కానీ ఎక్కువ మాట్లాడని వ్యక్తులు చిన్న చిన్న విషయాలకు చాలా చిరాగ్గా ఫీలవుతారు.  కాబట్టి మనిషిని బట్టి సాగితేనే బంధాలు బాగుంటాయి.                                    *రూపశ్రీ.
అపజయాలు ప్రతి మనిషి జీవితంలో వస్తూనే ఉంటాయి. అపజయాలు లేకపోతే అసలు విజయానికి విలువ, విజయాలు అనుభూతి చెందలేదు. కానీ ప్రతి ఒక్కరూ అపజయం అనేది తమకు ఎదురు కాకూడదు అని అనుకుంటారు. అయితే అపజయాల విషయంలో మనిషి వైఖరి ఎలా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.  "ఒక వ్యక్తి వెయ్యిమార్లు విఫలుడైనా ఉన్నతమైన ఆదర్శానికి అంటిపెట్టుకుని ఉండాలి. అబద్ధాలు చెప్పడం రాని గోడలా ఉండడం కన్నా, తప్పు చేస్తూ ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ఉత్తమం" అని అనేవారు స్వామి వివేకానంద. అబ్రహమ్ లింకన్ తమ దేశ పార్లమెంటు సభ్యుడవ్వాలనుకున్నాడు. అయితే అతని మొదటి ప్రయత్నం విఫలమైంది. వ్యాపారంలో భాగస్వామి అతణ్ణి మోసం చేశాడు. వ్యాపారం కోసం చేసిన అప్పుల బారినుంచి బయటపడడానికి 17 సంవత్సరాల కాలం పట్టింది. అతను వివాహం చేసుకున్న కొద్దికాలానికే మొదటి భార్య మరణించింది. గయ్యాళి అయిన రెండవ భార్య అతనికి పెద్ద తలనొప్పిగా మారింది. అయినా అతడు తన లక్ష్యసాధనకై శక్తినంతా ఉపయోగిస్తూ, చేస్తున్న ప్రయత్నాలను మానలేదు. చివరకు అతను ఎన్నికల్లో నెగ్గడమే కాకుండా, అమెరికా అధ్యక్షుడై, చరిత్రపుటల్లోకి ఎక్కాడు. వ్యక్తిగత సమస్యలకు జడవకుండా, ఉన్నత ఆదర్శాన్ని విడవకుండా ప్రయత్నించిన వారే ఏ కార్యాన్నైనా సాధించగలరు. మనిషి వ్యక్తిగత, సామాజిక, మానసిక రంగాలలో తప్పకుండా అభివృద్ధి సాధించాలి. అలా సాధించినప్పుడు మనిషికి అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ విషయం లోతు ఎంత అనేది అర్థం అవుతుంది. లేకపోతే ఎప్పటికీ ఏమీ తెలియకుండా బెల్లం కొట్టిన రాయి చందాన మనిషి ప్రవర్తన కూడా ఏమీ పట్టనట్టు, ఏమీ తెలియని ముర్ఖుడిలా ఉండిపోతారు. ఇలా ఉంటే అపజయాలు ఎదురైనప్పుడు వాటి నుండి ఏమీ నేర్చుకోలేరు. అపజయాల గురించి అసలు ఆలోచించలేరు. కేవలం అపజయాల కారణంగా తాము ఎదగలేక పోయామనే అసంతృప్తి మాత్రమే వాళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి అపజయాలను అనుభవాలుగా చూసినప్పుడే మనిషి సరైన ఆలోచనా మార్గంలో ఉండగలుగుతారు.                                  *నిశ్శబ్ద.
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే విడిపోతున్నారు, ఇదే విడ్డూరం అనుకుంటే.. పెళ్లై ఏళ్ల తరబడి కాపురాలు చేసిన వారు కూడా విడాకులు తీసుకుంటున్నారు. వివాహం అనేది ఎంత సంతోషకరమైన విషయమో.. విడిపోవాలని నిర్ణయించుకోవడం,  విడాకులు తీసుకోవడం అంతకంటే బాధాకరమైన విషయం. ఒకరికి ఒకరు అనుకుని, జీవితాంతం కలిసి ఉండాలనుకుని భార్యాభర్తలుగా మారిన ఇద్దరు వ్యక్తులు విడిపోవాలని అనుకునే ముందు కొన్ని ప్రశ్నలు తమకు తాము వేసుకోవాలని అంటున్నారు  అవేంటో తెలుసుకుంటే.. విడిపోవడం.. చాలామంది భార్యాభర్తలు విడిపోవడం అంటే  కేవలం ఒక భావోద్వేగ ప్రతిచర్యగా కొట్టిపారేస్తుంటారు. కేవలం వారే కాదు.. చుట్టూ ఉన్న వ్యక్తులు, కుటుంబ సభ్యులు కూడా అలాగే అనుకుంటారు. కానీ విడిపోవడాన్ని కొద్దిపాటి అవగాహనతో, స్పష్టతతో ఆలోచించటం వల్ల విడిపోయిన తర్వాత పశ్చాత్తాపం పడకుండా  చూసుకోవచ్చు.  కొన్నిసార్లు కష్టంగా అనిపించినా, విడిపోవడం అనుకునే ఆలోచన ఆపుకోవడం అనేది సరైన నిర్ణయం అవుతుంది. అసలు సమస్య.. విడిపోవాలని అనుకునే నిర్ణయం కేవలం అలసట వల్ల లేక విసిగిపోవడం వల్ల లేక మరేదైనా తాత్కాలిక భావోద్వేగం వల్ల వచ్చిన ఆలోచనా లేదా నిజమైన సమస్యా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు లేదా గృహ సమస్యలు  సంబంధంపై ఒత్తిడిని కలిగించవచ్చు. కానీ  ఆలోచనలు, లక్ష్యాలు , పద్ధతులు భిన్నంగా ఉంటే, అది అంతకంటే లోతైన అగాధం అని అర్థం. ప్రేమ.. ప్రేమ అనేది కేవలం ఒక ఎమోషన్ మాత్రమే కాదు, అది మెదడులోని ఒక రసాయన అనుసంధానం కూడా. ఒక బంధం ముగిసినప్పుడు, ఏదో ఒక అలవాటును తెంచుకుంటున్నట్లుగా శరీరం ప్రతిస్పందిస్తుంది. దీనివల్ల, హఠాత్తుగా ఫోన్ చేయాలనే లేదా తిరిగి వెళ్లాలనే కోరిక కలగవచ్చు, కానీ వాస్తవానికి అది కేవలం ఒక శారీరక ప్రతిచర్య మాత్రమే. కాబట్టి లేని ప్రేమను ఉందని అనుకోవడం కూడా భ్రమే...  ఉన్న ప్రేమను చంపేసుకోవడం కూడా తప్పే.. పరిస్థితి.. విడిపోవాలని ఆలోచన ఏదైనా గొడవ లేదా సంఘర్షణ వంటివి జరగడం వల్ల వస్తాయి.  అలాంటివి జరిగినప్పుడు మిమ్మల్ని మీరు అప్పటికే విడిపోయామని  ఊహించుకోండి అంతా ముగిసిపోయిందని, మీరు ఒంటరిగా కూర్చున్నారని ఊహించుకోండి. మీకు లోపల విచారం లేకుండా ఏదో బరువు దిగిపోయినట్టు, జీవితం ఇక సాఫీగా ఉంటుందని.. ఇలా  తేలికైన భావన కలిగితే, ఆ బంధం అప్పటికే ముగిసిపోయిందనడానికి సంకేతం. అలా కాకుండా విడిపోయామని ఊహించుకున్నప్పుడు జీవితం అర్థం లేకుండా ఏదో కోల్పోయినట్టుగా,  భాగస్వామి ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా అనిపిస్తే అప్పుడు విడాకుల ఆలోచన తప్పని అర్థం. మనసే కాదు.. ఒక సంబంధాన్ని ముగించడం అనేది కేవలం మనసుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, దానిలో జీవితంలోని అనేక అంశాలను వదులుకోవడం కూడా ఉంటుంది. డబ్బు, స్నేహితులు, రోజువారీ అలవాట్లు అన్నీ మారిపోతాయి. తరచుగా, ఈ భయం ప్రజలను తిరిగి అదే సంబంధంలోకి వెళ్ళేలా చేస్తుంది. స్పష్టత.. అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే,  చెప్పాలనుకున్న విషయాన్న భాగస్వామికి  సరిగ్గా తెలియజేశారా? తమ  అవసరాలను, ఆందోళనలను భాగస్వామికి స్పష్టంగా తెలియజేయకపోతే, 'ఒకవేళ అలా జరిగి ఉంటే?' అనే సందేహాలు మిగిలిపోతాయి. అందువల్ల, ఒక నిర్ణయం తీసుకునే ముందు మీతో మీరు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం.                          *రూపశ్రీ.
       ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు.  మరికొందరు దీన్ని కేవలం అలసట లేదా నీరసం అని కొట్టిపారేస్తుంటారు.  అయితే ఇలా చేయడం చాలా పెద్ద పొరపాటు. . ఇది  శరీరంలో ఒక నిర్దిష్ట వ్యాధికి తొలి సంకేతం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు, దీనిని వైద్యపరంగా ప్లాంటార్ ఫాసైటిస్ అని పిలుస్తారు. ఈ వ్యాధి గురించి , దానిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు  తీసుకోవాలో తెలుసుకుంటే.. ఉదయం పూట చీలమండలు ఎందుకు నొప్పిస్తాయి? పాదం అరికాలి భాగం మడమ ఎముక నుండి కాలివేళ్ల వరకు ఉంటుంది. ఇది ప్లాంటార్ ఫాసియా అనే మందపాటి, బలమైన కణజాలపు పొరతో కప్పబడి ఉంటుంది. మనం నడిచేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు ఈ పొర మన పాదాలను కుదుపుల నుండి కాపాడుతుంది. ఈ కండర పట్టీపై ఎక్కువ  ఒత్తిడి పడినప్పుడు, అది చిన్న చిన్న చిరుగులకు , వాపుకు కారణమవుతుంది. రాత్రిపూట మన పాదాలు విశ్రాంతిగా ఉన్నప్పుడు, ఈ కణజాలం సంకోచిస్తుంది. ఉదయం నిద్రలేచి నేలపై మొదటి అడుగు వేయగానే, సంకోచించిన ఈ కణజాలం అకస్మాత్తుగా మళ్లీ సాగి, తీవ్రమైన నొప్పిని కలుగజేస్తుంది. కారణాలు.. శరీరంలో పెరిగిన కొవ్వు మడమలపై నేరుగా అధికంగా ఒత్తిడిని కలుగజేస్తుంది.  చాలా పలుచగా ఉండే లేదా ఆర్చ్ సపోర్ట్ లేని చెప్పులు, బూట్లు ధరించడం వల్ల కూడా అరికాళ్ళు దెబ్బతింటాయి.  పనిలో భాగంగా  గంటల తరబడి చాలాసేపు నిలబడవలసి వస్తే.. అలాంటి వారు కూడా ఈ సమస్యను ఎదుర్కోవచ్చు.  శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం, ఎముకలు బలహీనపడటం లేదా విటమిన్ డి లోపం కూడా మడమ నొప్పిని పెంచుతాయి. ఇంటి చిట్కాలు..  మడమకు రోజుకు రెండు నుండి మూడు సార్లు 15 నిమిషాల పాటు ఐస్ పెట్టాలి. దీనివల్ల వాపు తగ్గుతుంది. మంచం దిగే ముందు కాళ్లు ఉన్నట్టుండి చాపకుండా  కాళ్లను , కాలివేళ్లను ముందుకు వెనుకకు సాగదీయాలి. ఎల్లప్పుడూ మందపాటి కుషన్ ఉన్న సౌకర్యవంతమైన పాదరక్షలను ధరించాలి. ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడవడం మానుకోవాలి. నొప్పి కొన్ని రోజుల పాటు కొనసాగితే , నడవడంలో మరింత ఇబ్బంది ఉంటే వెంటనే ఎముకల వైద్యుడిని సంప్రదించాలి.                              *రూపశ్రీ.
  మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం, సూదుల నొప్పిని భరించడం ఎంత నరకంలా ఉంటుందో ఆ బాధను అనుభవించే వారికే తెలుస్తుంది. మీరు లేదా మీ ప్రియమైన వారు ఈ పరిస్థితుల్లో ఉన్నారా? కిడ్నీ మార్పిడి ఒక్కటే మార్గమని డాక్టర్లు చెప్పారా? అయితే ఆందోళన చెందకండి. ప్రకృతి ప్రసాదించిన ఔషధాలతో, ఆహారపు అలవాట్లలో మార్పులతో మీ కిడ్నీలను మళ్ళీ ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. పూర్తి వివరాల కోసం Dr. Srinivas Gupta గారు ఈ VIDEO లో వివరించారు. కిడ్నీల ఆరోగ్యం కోసం ప్రకృతి చిట్కాలు మన ఇంటి పరిసరాల్లో దొరికే మొక్కలే మనకు గొప్ప డాక్టర్లు. వందల ఏళ్లుగా ఆయుర్వేదంలో వాడబడుతున్న చిట్కాలు కిడ్నీ సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను చూపుతున్నాయి. వేపాకు మరియు రావి ఆకు కషాయం: ఐదు వేపాకులు మరియు మూడు రావి ఆకులను తీసుకుని, 100 ml నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు 50 ml అయ్యే వరకు మరిగించి, ఆ కషాయాన్ని తీసుకోవడం వల్ల క్రియాటినిన్ (Creatinine) మరియు యూరియా స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని వేల మంది పేషెంట్లలో గమనించడం జరిగింది.   మొక్కజొన్న పొత్తు జుట్టు (Corn Silk): మనం సాధారణంగా పడేసే మొక్కజొన్న పొత్తు జుట్టు కిడ్నీలకు ఒక వరం. దీనిని నీటిలో మరిగించి టీ లాగా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గడమే కాకుండా క్రియాటినిన్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి పసుపు టీ: పచ్చి పసుపు, అల్లం మరియు కరివేపాకులను నలిపి నీటిలో మరిగించి ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఆహారమే అతిపెద్ద మందు కిడ్నీ పేషెంట్లు రైస్ లేదా గోధుమ రొట్టెలకు బదులుగా బార్లీ (Barley) ని వాడటం శ్రేయస్కరం. బార్లీ ఒక నేచురల్ డయూరెటిక్ (diuretic) లాగా పనిచేసి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. కూరగాయల ఎంపిక: మీ మధ్యాహ్న భోజనంలో పొట్లకాయ (సొరకాయ) మరియు రాత్రి భోజనంలో బీరకాయను ఎక్కువగా చేర్చుకోవాలి. ఉప్పు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం చాలా ముఖ్యం. గ్రీన్ జ్యూసెస్: కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మరియు గ్రీన్ ఆపిల్‌తో చేసిన జ్యూస్ శరీరంలోని విషతుల్యాలను తొలగించడానికి (Detox) సహాయపడుతుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్: రక్తపోటును (BP) నియంత్రించడంలో మరియు కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఒక అమృతంలా పనిచేస్తుంది. ఆధునిక చికిత్స మరియు జీవనశైలి మార్పులు కేవలం ఆహారం మాత్రమే కాకుండా, ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లలో అందించే కిడ్నీ ప్యాక్, కిడ్నీ మసాజ్ మరియు కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్ వంటి బాహ్య చికిత్సలు కిడ్నీలను మళ్ళీ ఉత్తేజితం చేస్తాయి. అలాగే, చెప్పులు లేకుండా నేల మీద నడవడం (Earthing) వల్ల శరీరం ఉత్తేజితమై ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముందస్తు హెచ్చరికలు: యూరిన్ వెళ్ళినప్పుడు బాగా నురుగు వస్తుంటే, అది ప్రోటీన్ లీక్ అవుతున్నట్లు ప్రాథమిక సూచన. దీనిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న 1: క్రియాటినిన్ స్థాయిలను సహజంగా తగ్గించవచ్చా?  సమాధానం: అవును, వేపాకు మరియు రావి ఆకు కషాయం తీసుకోవడం, బార్లీ ఆహారంలో చేర్చుకోవడం మరియు కిడ్నీలకు సంబంధించిన ప్రత్యేక వ్యాయామాలు చేయడం ద్వారా క్రియాటినిన్ స్థాయిలను తగ్గించవచ్చు. ప్రశ్న 2: డయాలసిస్ స్టేజ్ లో ఉన్నవారు కూడా ఈ చికిత్సలు ఫాలో అవ్వచ్చా?   సమాధానం: తప్పకుండా. ఫోర్త్ లేదా ఫిఫ్త్ స్టేజ్ లో ఉన్నవారు కూడా సరైన డైట్ మరియు నాచురల్ ట్రీట్మెంట్స్ ద్వారా తమ క్రియాటినిన్ స్థాయిలను తగ్గించుకుని సాధారణ స్థితికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రశ్న 3: కిడ్నీ పేషెంట్లు ఎలాంటి కూరగాయలు తినాలి?  సమాధానం: సొరకాయ మరియు బీరకాయ కిడ్నీలకు చాలా మంచివి. కూరగాయలను వాడే ముందు వాటిని బాయిల్ చేసి ఆ నీటిని పారబోయడం వల్ల పొటాషియం స్థాయిలు తగ్గుతాయి, ఇది కిడ్నీ పేషెంట్లకు ముఖ్యం.  కిడ్నీ సమస్య అనగానే భయపడిపోయి డయాలసిస్ లేదా ట్రాన్స్‌ప్లాంట్ వైపు వెళ్ళే ముందు, ఒకసారి మన ప్రకృతి అందించే చికిత్సలను నమ్మండి. క్రమశిక్షణతో కూడిన ఆహారం మరియు సరైన వ్యాయామంతో కిడ్నీలను తిరిగి ఆరోగ్యవంతంగా మార్చుకోవడం అసాధ్యమేమీ కాదు.   మరిన్ని వివరాల కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్స్ : INDIA : + 917070999313  USA : +1(732)947-4166   మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు కిడ్నీ వ్యాధులపై పూర్తి అవగాహన కోసం మా యూట్యూబ్ ఛానెల్‌ TeluguOne Health ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి!  మీ ఆరోగ్యం - మీ చేతుల్లోనే!
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు (Bad Gums) నిర్లక్ష్యం చేస్తే అవి మన శరీరంలోని ఇతర భాగాలపై కూడా తీవ్ర प्रभावం చూపుతాయి. ఈ ముఖ్యమైన విషయంపై ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ సుధీర్ చౌదరి (Dentist, MDS) గారు అందించిన పూర్తి సమాచారం సరళమైన తెలుగులో ఈ వీడియో మీ కోసం... చిగుళ్ల సమస్యలకు ప్రధాన కారణాలు (Causes of Gum Diseases): ప్లేక్ మరియు టార్టార్ (Plaque & Tartar): మనం తినే ఆహార అవశేషాలు, నోటిలోని బ్యాక్టీరియా కలిసి పంటిపై ఒక జిగట పొరలా (Plaque) ఏర్పడతాయి. దీనిని సకాలంలో బ్రషింగ్ ద్వారా శుభ్రం చేయకపోతే అది గట్టిపడి టార్టార్‌గా మారుతుంది. ఇది చిగుళ్ల ఇన్ఫెక్షన్‌కు ప్రధాన కారణం. తప్పుడు బ్రషింగ్ విధానం: రోజుకు రెండు సార్లు బ్రష్ చేయకపోవడం లేదా చాలా గట్టిగా పళ్ళను తోమడం వల్ల చిగుళ్లు దెబ్బతింటాయి. పోషకాహార లోపం: శరీరంలో ముఖ్యంగా విటమిన్ సి (Vitamin C) మరియు కాల్షియం లోపం వల్ల చిగుళ్లు బలహీనపడతాయి. ఇతర ఆరోగ్య సమస్యలు: మధుమేహం (Diabetes) ఉన్నవారిలో, ధూమపానం (Smoking) అలవాటు ఉన్నవారిలో మరియు గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల చిగుళ్ల ఇన్ఫెక్షన్లు త్వరగా వస్తాయి. చిగుళ్ల ఇన్ఫెక్షన్ ప్రధాన లక్షణాలు (Symptoms of Gum Infection): బ్రష్ చేస్తున్నప్పుడు లేదా గట్టి పదార్థాలు (ఆపిల్ వంటివి) తింటున్నప్పుడు చిగుళ్ల నుండి రక్తం కారడం (Bleeding Gums). చిగుళ్లు ఎర్రగా మారడం, వాపు రావడం మరియు ముట్టుకుంటే నొప్పిగా ఉండటం. నోటి నుండి విపరీతమైన దుర్వాసన రావడం (Bad Breath). పళ్ళు కదలడం లేదా పళ్ళ మధ్య ఖాళీలు (Gaps) ఏర్పడటం. చిగుళ్లు పంటి పైభాగం నుండి కిందికి జారిపోవడం (Gum Recession). చిగుళ్ల సమస్యలు ఇతర ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయి? (Impact on Overall Health): చిగుళ్ల ఇన్ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేస్తే, ఆ బ్యాక్టీరియా రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రవహిస్తుంది. ఇది గుండె జబ్బులు (Heart Diseases), డయాబెటిస్ నియంత్రణ తప్పడం మరియు గర్భిణీ స్త్రీలలో ముందస్తు ప్రసవాల (Premature Delivery) వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నివారణ మరియు చికిత్స మార్గాలు (Prevention & Treatment): డెంటల్ స్కేలింగ్ (Scaling): ప్రతి ఆరు నెలలకు ఒకసారి డెంటిస్ట్‌ను సంప్రదించి పళ్ళను, చిగుళ్లను ప్రొఫెషనల్‌గా క్లీన్ (Scaling) చేయించుకోవాలి. దీనివల్ల పంటిపై పేరుకుపోయిన గట్టి టార్టార్ తొలగిపోతుంది. సరైన బ్రషింగ్ మరియు ఫ్లాసింగ్: మృదువైన (Soft) బ్రష్ ఉపయోగించి, రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి. పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని తొలగించడానికి డెంటల్ ఫ్లాస్ (Floss) ఉపయోగించాలి. ఆరోగ్యకరమైన ఆహారం: విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, జామ వంటి పండ్లు మరియు ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి. గమనిక : చిగుళ్ల నుండి రక్తం రావడం అనేది సాధారణ సమస్య కాదు, అది ఒక హెచ్చరిక. కాబట్టి పంటి సమస్యలు రాకముందే జాగ్రత్త పడటం ఎంతో మేలు.    మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health  సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!