Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విడిపోవాలని నిర్ణయించుకునే ముందు భార్యాభర్తలు ఈ ప్రశ్నలు వేసుకోవాలి!
posted on: May 29, 2026 12:30PM

పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు. కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే విడిపోతున్నారు, ఇదే విడ్డూరం అనుకుంటే.. పెళ్లై ఏళ్ల తరబడి కాపురాలు చేసిన వారు కూడా విడాకులు తీసుకుంటున్నారు. వివాహం అనేది ఎంత సంతోషకరమైన విషయమో.. విడిపోవాలని నిర్ణయించుకోవడం, విడాకులు తీసుకోవడం అంతకంటే బాధాకరమైన విషయం. ఒకరికి ఒకరు అనుకుని, జీవితాంతం కలిసి ఉండాలనుకుని భార్యాభర్తలుగా మారిన ఇద్దరు వ్యక్తులు విడిపోవాలని అనుకునే ముందు కొన్ని ప్రశ్నలు తమకు తాము వేసుకోవాలని అంటున్నారు
అవేంటో తెలుసుకుంటే..
విడిపోవడం..
చాలామంది భార్యాభర్తలు విడిపోవడం అంటే కేవలం ఒక భావోద్వేగ ప్రతిచర్యగా కొట్టిపారేస్తుంటారు. కేవలం వారే కాదు.. చుట్టూ ఉన్న వ్యక్తులు, కుటుంబ సభ్యులు కూడా అలాగే అనుకుంటారు. కానీ విడిపోవడాన్ని కొద్దిపాటి అవగాహనతో, స్పష్టతతో ఆలోచించటం వల్ల విడిపోయిన తర్వాత పశ్చాత్తాపం పడకుండా చూసుకోవచ్చు. కొన్నిసార్లు కష్టంగా అనిపించినా, విడిపోవడం అనుకునే ఆలోచన ఆపుకోవడం అనేది సరైన నిర్ణయం అవుతుంది.
అసలు సమస్య..
విడిపోవాలని అనుకునే నిర్ణయం కేవలం అలసట వల్ల లేక విసిగిపోవడం వల్ల లేక మరేదైనా తాత్కాలిక భావోద్వేగం వల్ల వచ్చిన ఆలోచనా లేదా నిజమైన సమస్యా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు లేదా గృహ సమస్యలు సంబంధంపై ఒత్తిడిని కలిగించవచ్చు. కానీ ఆలోచనలు, లక్ష్యాలు , పద్ధతులు భిన్నంగా ఉంటే, అది అంతకంటే లోతైన అగాధం అని అర్థం.
ప్రేమ..
ప్రేమ అనేది కేవలం ఒక ఎమోషన్ మాత్రమే కాదు, అది మెదడులోని ఒక రసాయన అనుసంధానం కూడా. ఒక బంధం ముగిసినప్పుడు, ఏదో ఒక అలవాటును తెంచుకుంటున్నట్లుగా శరీరం ప్రతిస్పందిస్తుంది. దీనివల్ల, హఠాత్తుగా ఫోన్ చేయాలనే లేదా తిరిగి వెళ్లాలనే కోరిక కలగవచ్చు, కానీ వాస్తవానికి అది కేవలం ఒక శారీరక ప్రతిచర్య మాత్రమే. కాబట్టి లేని ప్రేమను ఉందని అనుకోవడం కూడా భ్రమే... ఉన్న ప్రేమను చంపేసుకోవడం కూడా తప్పే..
పరిస్థితి..
విడిపోవాలని ఆలోచన ఏదైనా గొడవ లేదా సంఘర్షణ వంటివి జరగడం వల్ల వస్తాయి. అలాంటివి జరిగినప్పుడు మిమ్మల్ని మీరు అప్పటికే విడిపోయామని ఊహించుకోండి అంతా ముగిసిపోయిందని, మీరు ఒంటరిగా కూర్చున్నారని ఊహించుకోండి. మీకు లోపల విచారం లేకుండా ఏదో బరువు దిగిపోయినట్టు, జీవితం ఇక సాఫీగా ఉంటుందని.. ఇలా తేలికైన భావన కలిగితే, ఆ బంధం అప్పటికే ముగిసిపోయిందనడానికి సంకేతం. అలా కాకుండా విడిపోయామని ఊహించుకున్నప్పుడు జీవితం అర్థం లేకుండా ఏదో కోల్పోయినట్టుగా, భాగస్వామి ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా అనిపిస్తే అప్పుడు విడాకుల ఆలోచన తప్పని అర్థం.
మనసే కాదు..
ఒక సంబంధాన్ని ముగించడం అనేది కేవలం మనసుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, దానిలో జీవితంలోని అనేక అంశాలను వదులుకోవడం కూడా ఉంటుంది. డబ్బు, స్నేహితులు, రోజువారీ అలవాట్లు అన్నీ మారిపోతాయి. తరచుగా, ఈ భయం ప్రజలను తిరిగి అదే సంబంధంలోకి వెళ్ళేలా చేస్తుంది.
స్పష్టత..
అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, చెప్పాలనుకున్న విషయాన్న భాగస్వామికి సరిగ్గా తెలియజేశారా? తమ అవసరాలను, ఆందోళనలను భాగస్వామికి స్పష్టంగా తెలియజేయకపోతే, 'ఒకవేళ అలా జరిగి ఉంటే?' అనే సందేహాలు మిగిలిపోతాయి. అందువల్ల, ఒక నిర్ణయం తీసుకునే ముందు మీతో మీరు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం.
*రూపశ్రీ.





