Home

»

Latest News

ఏఐ సెంటర్స్ పై అడివి శేష్ సంచలన వ్యాఖ్యలు!

Jun 2, 2026 4:21PM

అడివి శేష్ డెకాయిట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి అడివి శేష్ క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2 వంటి మూవీస్ లో పవర్ ఫుల్ రోల్స్ లో కనిపించాడు. అలాంటి అడివి శేష్ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో "ఆస్క్ మీ ఎనీ థింగ్ " అని అడిగాడు ఫాన్స్ ని. దాంతో చాలామంది చాలా ప్రశ్నలే అడిగారు. అడివి శేష్ ఆన్సర్స్ కూడా ఇచ్చాడు. "ఇండియాలో ఏఐ సెంటర్స్ ఏర్పాటును మీరు సపోర్ట్ చేస్తారా " అన్న ప్రశ్నకు "అస్సలు సపోర్ట్ చేయను ఎందుకంటే ఈ సెంటర్స్ ప్రకృతిని నాశనం చేస్తాయి.

ఈ సెంటర్స్ మన ఫ్రెష్ వాటర్ ని కబ్జా చేసి తాగేసి ఉష్ణోగ్రతలను అధికంగా పెంచేస్తాయి. ఈ సెంటర్స్ మనుషులకు, ప్రకృతికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. కేవలం జాబ్స్ కోసమే వీటిని ఏర్పాటు చేస్తున్నట్టయితే మాత్రం నెగటివ్ ఎఫెక్ట్స్ మాత్రం 10 x  లో ముంచేస్తాయి " అన్నారు.  "మీరు ఇంత అంత అందంగా ఉండడానికి కారణం ..మీ హైట్ ఎంత " అంటూ అడిగిన ప్రశ్నలు "మా పేరెంట్స్ కి థాంక్స్ చెప్పాలి అలాగే మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి.

ఇంకా నా హాట్ 6 '1  " అని చెప్పాడు. "అడివి నేను నీ బిగ్ ఫ్యాన్ ని ఇండోనేషియా" నుంచి అనేసరికి "థాంక్యూ సో మచ్ . త్వరలో అక్కడికి రావాల్సి ఉంది " అని చెప్పాడు. ఇక కొంతమంది అడిగిన ప్రశ్నలకు ఎం చెప్పారంటే "నాకు హిట్, మేజర్, డెకాయిట్ మూవీస్ అన్నీ ఇష్టమే అలాగే రాబోయే g2 మూవీ కూడా ఇష్టమే . డెకాయిట్ మై ఫస్ట్ లవ్ స్టోరీ. నేను ప్యూర్ వెజిటేరియన్ ని . కొన్ని కారణాల వలన ఎగ్ తినడం కూడా మానేసాను. " అంటూ ఆన్సర్స్ ఇచ్చారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com