Home

»

Latest News

Nikhil: గాయాలైనా వెనక్కి తగ్గని నిఖిల్.. పెద్ద సాహసమే అని చెప్పవచ్చు

Jun 2, 2026 3:07PM

 

 

పాన్ ఇండియా సెల్యులాయిడ్, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'స్వయంభు'(swayambhu)శరవేగంగా చిత్రీకరణని పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. నిఖిల్ పోరాట యోధుడిగా చేస్తున్నాడు. దీంతో తన క్యారక్టర్ కోసం  నిఖిల్ ఎలాంటి గాయాలని సైతం లెక్కచేయడం లేదు.
 
ఈ చిత్రంలో అత్యంత కీలకమైన, ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని ఇటీవల చిత్రీకరించారు. 12 రోజుల ప్రత్యేక షెడ్యూల్ కోసం ఏకంగా 8 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయించడం విశేషం. వెండితెరపై ఈ యాక్షన్ విజువల్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక షెడ్యూల్ కోసం నిఖిల్ దాదాపు 45 రోజుల పాటు రాత్రింబవళ్లు కఠినమైన శిక్షణ తీసుకున్నారు. గుర్రపు స్వారీ, కత్తి సాము మరియు ప్రాచీన యుద్ధ విద్యల్లో ఆయన ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు. ఈ 45 రోజుల సుదీర్ఘమైన, కఠినమైన శ్రమలో నిఖిల్‌కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.

ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నిఖిల్‌ కి  పలుమార్లు తీవ్రమైన గాయాలయ్యాయి. కొన్ని సందర్భాల్లో అపాయం కొంచంలో తప్పింది . అయినప్పటికీ నిఖిల్ ఎక్కడా వెనకడుగు వేయలేదు. సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా రావాలనే ఒకే ఒక్క లక్ష్యంతో, నొప్పిని  భరిస్తూ  షూటింగ్‌లో పాల్గొన్నారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ పెయిన్ కిల్లర్స్ వాడుతూ, డూప్ గా ఎవరినీ పెట్టుకోకుండా స్వయంగా ఆ రిస్కీ స్టంట్స్ అన్నింటినీ పూర్తి చేశారు. నిఖిల్ చూపిస్తున్న ఈ డెడికేషన్, పట్టుదల చూసి దర్శకుడు భరత్ కృష్ణమాచారితో పాటు చిత్ర నిర్మాణ సంస్థ పిక్సెల్ స్టూడియోస్ ప్రతినిధులు సైతం ఆశ్చర్యపోయారు. 


Also read: Raju weds rambai: రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్ సెకండ్ ప్రాజెక్ట్.. ఈ సారి ఈ యదార్ధ గాధ

ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న స్వయంభులో   సంయుక్తా మీనన్, నభా నటేష్  కథానాయకులు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, ఒకప్పటి రాజమౌళి ఆస్థాన కెమెరామెన్  కేకే సెంథిల్ కుమార్ ఫొటోగ్రఫీ అందిస్తున్నాడు. రిలీజ్ డేట్ త్వరలోనే రానుంది.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com