విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా ఆమోదం

posted on: Jun 2, 2026 2:28PM

జనసేన ఎమ్మెల్యే  అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్ పదవికి చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.  రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన అరవ శ్రీధర్ ఇటీవల తన విప్ పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 

ఇటీవల తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అరవ శ్రీధర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఆ భేటీ అనంతరం వ్యక్తిగత కారణాలతో ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ రాజీనామా చేశారు.   అరవ శ్రీధర్‌పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

 అయితే ఆ కమిటీ అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తి చేసిందా, ఒక వేళ పూర్తి చేస్తే.. పార్టీ హైకమాండ్ కు ఇచ్చిన నివేదికలో ఏముంది? అన్న విషయాలపై క్లారిటీ లేదు. అయితే.. అరవ శ్రీధర్ జనసేనానితో భేటీ అనంతరం విఫ్ పదవికి రాజీనామా చేయడం, ఆ రాజీనామా ఆమోదం పొందటం జరిగిపోయాయి.   

google-ad-img
    Related Sigment News
    • Loading...