Home

»

Latest News

ఒక్క సినిమాకు రూ. 15 కోట్లు... ఐదేళ్ల‌లో త‌న పారితోషికం 7 రెట్లు పెంచిన ర‌ష్మిక‌!

Jun 2, 2026 2:23PM

టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో నేషనల్ క్ర‌ష్‌గా గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక రష్మిక మందన్న ప్రస్తుతం టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. టాలెంట్‌తో పాటు క్రేజ్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో డిమాండ్ ఏ రేంజ్‌లో పెరుగుతుందో ఈ కన్నడ బ్యూటీని చూస్తే అర్థమవుతుంది. గత ఐదేళ్ల కాలంలో ఆమె తన పారితోషికాన్ని ఊహించని స్థాయిలో పెంచి, ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కాక్‌టెయిల్ 2' కోసం రష్మిక ఏకంగా 15 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని వసూలు చేసినట్లు బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. షాహిద్ కపూర్, కృతి సనన్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఒక్క సినిమాతో ఆమె రెమ్యూనరేషన్ గ్రాఫ్ సరికొత్త రికార్డులను సృష్టించిందని చెప్పాలి.

టాలీవుడ్‌లో అగ్ర దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన గ్లోబల్ హిట్ ‘పుష్ప-1’ సమయంలో రష్మిక కేవలం 2 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంది. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించడంతో ఆమె మార్కెట్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. ఆ తర్వాత వచ్చిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు', 'సీతారామం' వంటి చిత్రాలకు దాదాపు 3 కోట్ల వరకు చార్జ్ చేసింది.

ఇక బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె కెరీర్ మరింత వేగం పుంజుకుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన 'గుడ్‌బై', తమిళ చిత్రం 'వారిసు', అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాతో చేసిన 'మిషన్ మజ్ను' వంటి సినిమాలకు 4 కోట్ల రేంజ్ అందుకుంది. ముఖ్యంగా రణబీర్ కపూర్‌ సరసన నటించిన సంచలన చిత్రం 'యానిమల్' ఘనవిజయంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.

ఆ క్రేజ్ తోనే 'పుష్ప-2' కోసం దాదాపు 7 కోట్ల రూపాయలను అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ఏకంగా 15 కోట్ల మార్కును తాకడం విశేషం. కార్పొరేట్ ఉద్యోగాల్లోనైనా ఐదేళ్లలో శాలరీ డబుల్ కావడం చూస్తాం, కానీ సినీ రంగంలో రష్మిక కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలోనే తన సంపాదనను 7 రెట్లు పెంచుకుని రికార్డ్ సృష్టించింది.

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా రష్మిక ఫ్యాన్స్ ఈ అప్‌డేట్‌తో పండగ చేసుకుంటున్నారు. నేషనల్ క్రష్ రేంజ్ ఇదంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర తారలకు పోటీగా రష్మిక ఎదుగుతున్న తీరును సినీ విశ్లేషకులు సైతం మెచ్చుకుంటున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com