LATEST NEWS
చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అన్న నానుడి ఇప్పుడు జగన్ కు సరిగ్గా అతికినట్లుగా సరిపోతుంది. గతంలో తనకు అండగా నిలబడి, తన కోసం కష్టపడి పని చేసిన సన్నిహితులను దూరం చేసుకోవడం జగన్ కు ఉన్న అలవాటు. అలా జగన్ దూరం చేసుకున్న వాళ్ల జాబితాలో సొంత  తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా కొండవీటి చాంతాడంత పొడవుకు మించి ఉ:టుంది.   ఈ నేపథ్యంలోనే..   2029లో జరగనున్నఏపీ సెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ భవిష్యత్ ఏమిటి? ఎలా ఉంటుంది? అన్న చర్చ మొదలైంది. ఒకప్పుడు జగన్ కోసం నిలబడి, 2019 ఎన్నికలలో ఆయన విజయం కోసం నిర్విరామంగా కృషి చేసిన సొంత సోదరి షర్మిల, వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ కూడా జగన్ కు కుడి భుజం, ఎడమ భుజం కూడా తానే అన్నట్లుగా వ్యవహరించిన విజయ సాయిలే 2029 ఎన్నికలలో జగన్ విజయానికి స్పీడ్ బ్రేకర్ లుగా నిలుస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే 2024 ఎన్నికలలో జగన్  తనకు గట్టి పట్టున్న రాయలసీమలో ప్రతికూల ఫలితాలు రావడానికి ఆ ప్రాంతంలో జగన్ అంత కాకపోయినా, ఆయనతో సమానమైన పట్టు ఉన్న షర్మిల కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి పెట్టని కోట లాంటి కడప జిల్లాలో వైసీపీకి గత ఎన్నికలలో సీట్లు గణనీయంగా తగ్గడానికి వైఎస్ షర్మిల జగన్ కు వ్యతిరేకంగా చేసిన ప్రచారమేననడంలో ఎలాంటి సందేహాలకూ తావు లేదు.  ఎందుకంటే వైఎస్ బిడ్డగా.. షర్మిలకు కూడా కడప ఖిల్లాపై గట్టి పట్టు ఉంది.  ఇక ఇప్పుడు విజయసాయి సొంత పార్టీ ప్రకటన చేసిన క్షణం నుంచీ జగన్ పై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శల బాణాలు సంధిస్తున్నారు. నిజమైన సీమ పౌరుషం ఏమిటో తన పార్టీ ముందుముదు రుజువు చేస్తుందంటూ.. జగన్ ఇలాకాలో ఆయనను బలహీనుడిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.  అంతే కాకుండా జగన్ క్రైస్తవుడని పేర్కొంటూ.. తాను రాజకీయ పార్టీ పెట్టి జనంలోకి వస్తున్నది రెడ్డి సామాజికవర్గం కోసం పోరాడటమేనని చెబుతున్నారు.  నిజానికి విజయసాయి రెడ్డి స్వస్థలంనెల్లూరు జిల్లా ప్రాంతమే అయినా.. వైఎస్ రాజశేఖరెడ్డి నుంచి వైఎస్ జగన్ వరకూ ఆ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా విజయసాయికి రాయలసీమలోనూ సత్సంబంధాలు ఉన్నాయి.  ఈ పరిణామాలు జగన్ కు సీమపై ఇప్పటికే సడలిన పట్లు.. వచ్చే ఎన్నికల నాటికి మరింత సడలుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రస్తతం జగన్ పరిస్ధితి చేయి (కాంగ్రెస్ )దగ్గరకెడితే చేతి దెబ్బ అన్నట్లుగా తయారైంది. ఇటు షర్మిల, అటు విజయసాయిరెడ్డి కూడా జగన్ కు గట్టి పట్టున్న సీమ, మరీ ముఖ్యంగా కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో  జగన్ కు కచ్చితంగా రాజకీయంగా భారీ నష్టం వాటిల్లుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  [YS Sharmila, Vijaya Sai Reddy, YS Jagan Mohan Reddy, Dangerbells,  YCP, Andhra Pradesh Politics, 2029 Elections, Telugu One]
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూషకు వైసీపీ కీలక పార్టీ పదవిని కట్టబెట్టింది.   భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.   గతంలో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరించిన మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను  ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. చిన్న శ్రీను స్వయంగా బొత్స సత్యనారాయణ మేనల్లుడు కావడం గమనార్హం. మజ్జీ శ్రీనివాసరావు రాజీనామా చేయడంతో  భీమిలి వైసీపీలో ఏర్పడిన  ఖాళీని జగన్ డాక్టర్ బొత్స అనూష నియామకంతో భర్తీ చేశారు.    ఈ నియామకం ద్వారా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో యువ నాయకత్వానికి, అలాగే మహిళా నేతలకు పార్టీలో పెద్దపీట వేస్తున్నట్లు సంకేతాలు పంపారు.  భీమిలి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, క్రియాశీలక కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లే  బాధ్యతను బొత్స అనూషకు జగన్ అప్పగించారు.  ఈ సందర్భంగా జగన్ కు కృతజ్ణతలు తెలిపిన డాక్టర్ అనూష..  పార్టీ అధినాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, భీమిలిలో వైసీపీని మరింత పటిష్టం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. స్థానిక కేడర్‌ను కలుపుకొని పోతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం   శ్రమిస్తానన్నారు.     [Botsa Anusha, YCP Bheemili Constituency Incharge, Botsa Satyanarayana, Daughter, AP Politics, Telugu One]
వైఎస్ కుటుంబంలో విభేదాలకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. ముఖ్యంగా జగన్, షర్మిల మధ్య ఆస్తి, రాజకీయ విభేదాలు సమసిపోయేలా లేవు.  తాజాగా వైఎస్ కుటుంబం ఒకే వేదికపైకి వచ్చే అవకాశం ఉందని ఆశించిన వైఎస్ అభిమానుల ఆశలపై జగన్ నీళ్లు చల్లారు.  సాధారణంగా  కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలను పక్కన పెట్టి కుటుంబ వేడుకల్లో కలవడం కద్దు. అయితే..   వైఎస్ షర్మిల కుమార్తె వివాహ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో.. ఆ వివాహానికి హాజరు కాకుండా స్కిప్ చేయడానికా అన్నట్లు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, షర్మిల సోదరుడు అయిన జగన్ విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు.  షర్మిల కుమార్తె వివాహం, జగన్ విదేశీ పర్యటన రెంటినీ బేరీజు వేస్తూ.. ఆ వివాహ వేడుకకు దేశంలోనే ఉండి హాజరు కాకపోతే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందన్న భావనతోనే జగన్ విదేశీ పర్యటన పెట్టుకున్నారని పరిశీలకులు అంటున్నారు.   వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం డాక్టర్ సోమలా రఘురామ్ రెడ్డితో నిశ్చయమైన విషయం తెలిసిందే. ఈ పెళ్లి ఏర్పాట్లలో భాగంగా షర్మిల తన కుమార్తెతో కలిసి కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్‌ను సందర్శించారు. అక్కడ దివంగత నేత వైఎస్సార్ సమాధి వద్ద  నివాళులు అర్పించి, తొలి వివాహ పత్రికను ఆయన పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు కోరారు. ఇక వివాహ పనులు కుటుంబ పరంగా ముమ్మరంగా సాగుతున్నాయి.  నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, సెప్టెంబర్ 24న హైదరాబాద్‌లో,  సెప్టెంబర్ 25న బెంగళూరులో  వివాహ నిశ్చయ తాంబూలాలు, ఎంగేజ్‌మెంట్ వేడుకలు జరగనున్నాయి. ఆ తర్వాత నవంబర్ 25న వివాహం జరగనుంది. డిసెంబర్ 5న హైదరాబాద్‌లో   రిసెప్షన్ నిర్వహించనున్నారు. మరోవైపు, సరిగ్గా ఇదే సమయానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన కోసం సన్నాహాలు చేస్తుండటం గమనార్హం. దాదాపుగా అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 మధ్య కాలంలో సుమారు 25 రోజుల పాటు యూరప్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి కోరుతూ ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు 15 రోజుల విదేశీ ట్రిప్ కు అనుమతి ఇచ్చింది. జగన్ విదేశీ పర్యటన షెడ్యూల్, షర్మిల కుమార్తె రిసెప్షన్, వివాహ తేదీలు క్లాష్ అయ్యేలా ఉండటం గమనార్హం. ఆ విషయమూ మరోసారి షర్మిల, జగన్ మధ్య విభేదాలు, ఆస్తుల పంచాయతీపై చర్చను తెరపైకి తెచ్చాయి.   స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.   వైఎస్ కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆస్తుల పంపకాల విషయంలో తలెత్తిన వివాదాలు ప్రజల్లోనూ, మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు తాజాగా.. షర్మిల కుమార్తె వివాహం,  జగన్ విదేశీ పర్యటనకు సంబంధించిన తాజా పరిణామాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.   [YS Sharmila, YS Jagan Mohan Reddy, Anjali Reddy Marriage, YS Family Disputes, Jagan Foriegn Tour, Telugu One]
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరో సారి విదేశీ పర్యటనకు రెడీ అవుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి  యూరప్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి కోరుతూ ఆయన  హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు.  తన కుమార్తెల వద్దకు వెళ్లేందుకు, అలాగే కుటుంబంతో కలిసి యూరప్‌లో పర్యటంచే నిమిత్తం పాతిక రోజుల పాటు విదేశాల్లో పర్యటించేందుకు అనుమతి కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. ఆయన విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెల 1 నుంచి నవంబర్ 30 లోపు ఎప్పుడైనా 15 రోజుల పాటు యూరప్  పర్యటనకు అనుమతి ఇచ్చింది. అయితే పలు షరతులు కూడా విధించింది.   అక్రమాస్తుల కేసులలో నిందితుడిగా ఉండటం,  ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉండటంతో, వైఎస్ జగన్  విదేశాలకు వెళ్లేందుకు తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిన నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. కాగా కోర్టు జగన్ యూరప్ పర్యటనకు విధించిన షరతులు ఇలా ఉన్నాయి.  జగన్  యూరప్ పర్యటనకు బయలుదేరే ముందే పూర్తి పర్యటన షెడ్యూల్‌ను  సీబీఐ అధికారులకు  అందజేయాలి. అలాగే విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.   ప్రస్తుతం స్థానిక ఎన్నికల హడావుడి మరియు రాజకీయ పరిణామాల వేళ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడం రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.  [YS Jagan, CBI Court, Europe Tour, YCP, Andhra Pradesh News, Jagan Foreign Travel, Green Signal, Conditions Apply]
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2023  అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ తరఫున విజయం సాధించిన దానం నాగేందర్, ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.   2024 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే , కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు, ఆయనపై అనర్హత వేటు వేస్తూ శుక్రవారం (సెప్టెంబర్ 18) సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.  ఏప్రిల్ 23, 2024 నుంచే ఆయనపై అనర్హత వేటు వేసింది. అంటే ఆ రోజు నుంచే దానం నాగేందర్ తన  శాసనసభ్య సభ్యత్వాన్ని కోల్పోయినట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.  అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గతంలో మార్చి 11, 2026న దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై వచ్చిన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ వారికి క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు అల్లె మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది.  ఈ తీర్పుపై స్పందించిన దానం నాగేందర్ తాను సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో లేనని స్పష్టం చేశారు.  హైకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని, ఎన్నికల్లో పోరాడటం తనకు కొత్తేమీ కాదనీ దానం పేర్కొన్నారు. ప్రజల మధ్యలోకి వెళ్లేందుకు, ఎన్నికల షెడ్యూల్ వెలువడితే ఏ క్షణమైనా మళ్లీ పోటీ చేసి ఘనవిజయం సాధిస్తానన్నారు.  అదలా ఉండగా, దానంపై అనర్హత వేటుతో   ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది.   [Danam Nagender, Telangana High Court, MLA Disqualification, Khairatabad Bypoll, Anti Defection Law, BRS Congress News, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారి చేస్తున్న మూవీ 'ఇట్లు అర్జున'. యంగ్ హీరో అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఈ సినిమాకి మహేష్ ఉప్పాల దర్శకుడు. అక్టోబర్ 30న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలయింది. ఇందులో హీరో అనీష్ మాటలు రాని వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అలాంటి వ్యక్తి హీరోయిన్ అనస్వర రాజన్ ప్రేమ ఎలా పొందాడు? ఇద్దరి మనసులు ఎలా మాట్లాడుకున్నాయి? అనేది టీజర్ లో ఆసక్తికరంగా చూపించారు. హీరో పాత్రను డిజైన్ చేసిన తీరు బాగుంది. "అతను చాలా చెప్పాలనుకుంటాడు, కానీ ఎవ్వరికీ అర్థం కాదు" అంటూనే.. అతని ప్రేమను, ఎమోషన్ ని ఎవరైనా సరే ఫీల్ అవ్వాల్సిందే అని ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. హీరోయిన్ తో కనెక్ట్ అవ్వడానికి హీరో పడే ఆరాటం, సైగలతోనే చెప్పే క్యూట్ లవ్ సీన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా ఉన్నట్టుగా టీజర్ లో చూపించారు. విజువల్స్, థమన్ మ్యూజిక్ కూడా ఆకట్టుకున్నాయి.  ఇది కూడా చదవండి: 37 సీక్రెట్ ఇదే.. అల్లు అర్జున్ 'రాకా'లో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్.! మీకు నచ్చవచ్చు: పెళ్ళంటే పందిళ్ళు.. పెళ్ళి పాటను ఇలా రాయడం ఆత్రేయకే సాధ్యం.!       [Itllu Arjuna Teaser, Itlu Arjuna Teaser, Aniesh, Anaswara Rajan, Venky Kudumula, Mahesh Uppala, Thaman S, Telugu Film News, Telugu News]  
ఇరుముడి మేకర్స్ పుణ్యం చేసుకున్నారో, నటీనటులు పుణ్యం చేసుకున్నారో, లేక ప్రేక్షకులు పుణ్యం చేసుకున్నారో లేదో తెలియదు గాని మీ పుణ్యం చల్లగుండా అనే వర్డ్ ని   నిత్యం తెలుగు సినిమా ప్రేమికులు, ప్రేక్షకులు చెప్పుకునే పరిస్థితి.  ఇరుముడి నిన్న శుక్రవారం (సెప్టెంబర్ 18) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి  వచ్చింది. సాధారణంగా ఒక సినిమా ఓటీటీలోకి వస్తే ప్రజలు తమ ఇళ్లలోనే స్మార్ట్ టీవీల్లో లేదా మొబైల్ ఫోన్లలో డిజిటల్ స్క్రీన్లకు పరిమితమై ఒంటరిగా వీక్షిస్తుంటారు. కానీ 'ఇరుముడి' విషయంలో మాత్రం పల్లెటూర్లలో సరికొత్త విప్లవాత్మక దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రస్తుతం జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామీణ సెంటర్లు, వీధులు, గల్లీలలోని మండపాల వద్ద స్థానికులు పెద్ద టీవీ స్క్రీన్లు, బిగ్ ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి ఉచితంగా చూపిస్తున్నారు. Also Read: నాలుగేళ్లు ఆ డైరెక్టర్ ఇంటి గేటు బయటనే: శ్రీకాంత్ ఓదెల వ్యాఖ్యలు వైరల్ రాత్రి వేళల్లో ఊరి పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఒకేచోట కలిసి కూర్చుని సినిమా చూస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చిత్రంలోని 'ఇరుముడి కట్టు', 'మల్లెపూల పల్లకి' వంటి ప్రజాదరణ పొందిన జానపద, భక్తి గీతాలు ప్లే అవుతున్న సమయంలో వయస్సుతో సంబంధం లేకుండా పిల్లా పెద్దలు ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తున్నారు. మరోవైపు తండ్రీకూతుళ్ల బాండింగ్ క్లైమాక్స్ సన్నివేశాలు వస్తున్నప్పుడు వేలాది మంది కంటతడి పెట్టుకోవడం ఆ సన్నివేశాలలోని గాఢతను చాటిచెబుతోంది.     ఒకప్పుడు ప్రొజెక్టర్ రయ్యిమని తిరుగుతుంటే కళ్లప్పగించి చూసే ఆనాటి టూరింగ్ టాకీస్ అనుభూతిని ఈ దృశ్యాలు పునరావృతం చేస్తున్నాయి. థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టించిన 'ఇరుముడి' ఇప్పుడు ఓటీటీ ద్వారా పల్లెటూరి వీధుల్లో పండగ వాతావరణాన్ని నింపి, తెలుగు ప్రజలను మళ్లీ ఒకే వేదికపైకి తెచ్చి కట్టిపడేస్తోంది. అందుకే మీ పుణ్యం చల్లగుండా అనే వర్డ్ నిత్యం తెలుగు ప్రేక్షకుల నోళ్ళల్లో నానుతూ ఉంది. మీకు నచ్చవచ్చు : తేట తేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా..' తెలుగు వారి మనసుల్లో గుడి కట్టుకున్న పాట.!   [Irumudi Village Open Screenings,  Irumudi Ott Records, Irumudi, Raviteja, Shiva Nirvana, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]    
సినీ రంగంలో దర్శకుడు అవ్వడమంటే అంత ఈజీ కాదు. కానీ డైరెక్టర్ అయ్యి  బ్లాక్ బస్టర్ హిట్ కొడితే మాత్రం ఏ జన్మలో చేస్తుకున్న అదృష్టమో అని అందరూ చూసి అసూయా పడే పరిస్థితి. సింపుల్ గా చెప్పాలంటే దేశంలో ఉండే అత్యున్నత పదవులు కూడా సినీ డైరెక్టర్ ముందు దిగదుడుపు అని సినీ అభిమానులు చెప్తుంటారు.  ఇప్ప్పుడు ది ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పరిస్థితి కూడా అదే. నానితో 'దసరా' వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టి, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 121 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించిన  శ్రీకాంత్  తెలంగాణలోని గోదావరిఖనికి చెందిన ఈ యంగ్ డైరెక్టర్, ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చి తన కలని  నిజం చేసుకున్నాడు . ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఓదెల తన గురువు, ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ను కలవడానికి పడిన నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ గురించి పంచుకున్న ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో సుకుమార్ దర్శకత్వ శైలికి ఎంతగానో ఆకర్షితుడైన శ్రీకాంత్ ఓదెల, ఆయన వద్ద సహాయ దర్శకుడిగా పనిచేయాలని బలంగా నిశ్చయించుకున్నారు. అందుకోసం ప్రతిరోజూ సుకుమార్ ఇంటి ముందుకు వెళ్లి గేటు బయటే గంటల తరబడి నుంచొనేవారు. అలా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, ఏకంగా 4 సంవత్సరాల పాటు ఓపికగా నిరీక్షించారు. ప్రతిరోజూ గేటు బయట తనకోసం నుంచుంటున్న ఈ కుర్రాడి పట్టుదలను గమనించిన సుకుమార్, ఒకరోజు శ్రీకాంత్‌ను లోపలికి పిలిచి మాట్లాడారు. ముందుగా ఒక షార్ట్ ఫిలిం చేయమని ప్రోత్సహించి శ్రీకాంత్ ప్రతిభను పరీక్షించారు. శ్రీకాంత్ చేసిన ఆ ప్రయత్నం నచ్చడంతో ఆయనలోని మేధస్సును, సినిమా పట్ల ఉన్న అంకితభావాన్ని గుర్తించి తన దర్శకత్వ శాఖలోకి సహాయకుడిగా తీసుకున్నారు. ఇది కూడా చదవండి: మేకర్స్ ,హీరో, హీరోయిన్స్ కి షాక్: జయహో ప్రేక్షక మహాదేవా! ఆ తర్వాత సుకుమార్ తెరకెక్కించిన 'నాన్నకు ప్రేమతో' (2016), మరియు రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ హిట్ 'రంగస్థలం' (2018) చిత్రాలకు శ్రీకాంత్ ఓదెల అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ రెండు పెద్ద ప్రాజెక్టులపై పనిచేస్తున్న సమయంలోనే సినిమా మేకింగ్, కథనంలో ఉండాల్సిన డెప్త్, ప్రతి పాత్రను మలిచే విధానంలో సుకుమార్ పాటించే మెళకువలను ప్రత్యక్షంగా నేర్చుకున్నారు. 'రంగస్థలం' సినిమా నిర్మాణం సమయంలో సుకుమార్ ఏ రూమ్‌లో, ఏ కుర్చీలో కూర్చుని కథా చర్చలు సాగించేవారో, సీన్లు ప్లాన్ చేసేవారో శ్రీకాంత్ దగ్గరుండి చూశారు. కాలం ఎంత వేగంగా మారుతుందో చెప్పడానికి శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ లైవ్ ఉదాహరణగా నిలిచింది.   తన మొదటి చిత్రం 'దసరా' ఘన విజయం సాధించిన తర్వాత, నానితోనే తన రెండవ భారీ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' ను శ్రీకాంత్ ఓదెల ప్రారంభించారు. ఈ చిత్ర ఆఫీస్ పనుల కోసం ఆయన ఎంచుకున్న రూమ్ మరేదో కాదు, ఒకప్పుడు తన గురువు సుకుమార్ 'రంగస్థలం' మేకింగ్ కోసం ఉపయోగించిన అదే ఆఫీస్, అదే రూమ్! అంతేకాదు, ఒకప్పుడు తను అసిస్టెంట్‌గా నిలబడి ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్న ఆ గదిలో, ఈరోజు అదే సుకుమార్ కూర్చున్న కుర్చీలోనే శ్రీకాంత్ ఓదెల ఒక స్టార్ డైరెక్టర్‌గా కూర్చుని 'ది ప్యారడైజ్' పనులను పర్యవేక్షిస్తున్నారు. తొలిసారి ఆ కుర్చీలో కూర్చునే ముందు "నేను ఈ కుర్చీలో కూర్చోవచ్చా లేదా" అని కాస్త తడబడ్డానని, ఆ క్షణం కళ్లలో నీళ్లు తిరిగాయని ఎమోషనల్ అయ్యారు శ్రీకాంత్. నాలుగేళ్లు గేటు బయట నుంచున్న చోటు నుండి, 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టే స్థాయికి ఎదిగిన శ్రీకాంత్ ఓదెల ప్రయాణం ప్రతి ఒక్క సినీ ప్రేమికుడికి, సినీ ఆశావాదులకి గొప్ప స్ఫూర్తినిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.     మీకు నచ్చవచ్చు : అందాల ఆడబొమ్మ: బాలయ్య ఆల్ టైం క్లాసిక్ సాంగ్.! 
సరికొత్త కథా నేపథ్యాలతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే దర్శకుడు పా. రంజిత్ "వేట్టువం" టైటిల్ తో మరో భారీ యాక్షన్ చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ఆర్య, వి.ఆర్. దినేష్, శోభిత ధూళిపాళ్ల, కలైయరాసన్, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  "వేట్టువం" సినిమాను లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్స్ ఎస్. సాయి దేవానంద్, ఎస్. సాయి వెంకటేశ్వరన్, పా.రంజిత్ నిర్మిస్తున్నారు. భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న "వేట్టువం" సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  తాజాగా "వేట్టువం" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు వరల్డ్ ఆఫ్ వేట్టువం వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోకు తెలుగులో రానా దగ్గుబాటి, మలయాళంలో సౌబిన్ షాహిర్, కన్నడ వెర్షన్ కు కిచ్చా సుదీప్, తమిళంలో పా. రంజిత్ వాయిస్ అందించారు.  ఈ సినిమాలో ఎలాంటి కథను ప్రేక్షకులకు చూపించబోతున్నారో వరల్డ్ ఆఫ్ "వేట్టువం" వీడియోలో మేకర్స్ తెలియజేశారు. పూర్వకాల ప్రజల జీవన విధానం వల్ల ఏర్పడిన ప్రభావం ప్రస్తుతాన్ని ఎలా మార్చింది దాని ఫలితంగా ప్రకృతి సృష్టించే విపత్తు ఏంటి ? భవిష్యత్ లో ఎలాంటి మార్పులు రాబోతాయంటూ మూడు కాలాల గురించి డిస్కస్ చేస్తుందీ సినిమా. ఎవరు బలవంతులు, అధికారం ఎవరికుండాలి అని నిరూపించుకోవడానికి కొన్ని తెగల మధ్య జరిగే పోరాటే ఈ "వేట్టువం" సినిమా అంటూ వరల్డ్ ఆఫ్ వేట్టువం తెలుపుతుంది.  ఇది కూడా చదవండి: భూ కబ్జా.. ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ పై కేసు నమోదు.! ఈ చిత్రంలో ధర్మరాజన్ అనే పాత్రలో ఆర్య, సేంబియన్ క్యారెక్టర్ లో షబీర్, కలైయరాసన్ పాత్రలో వీరవర్మన్, రాధి క్యారెక్టర్ లో శోభిత ధూళిపాళ్ల, వె.ర.దినేష్ నందన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం నటీనటులు ఎంతో శ్రమించి అడిమురై, మాల్కమ్ వంటి సంప్రదాయ యుద్ధకళలతో పాటు మార్షల్ ఆర్ట్స్ ను నేర్చుకున్నారు అనేది ఈ వీడియోలో ఆకట్టుకుంటోంది. "వేట్టువం"తో దర్శక నిర్మాత పా.రంజిత్ మరో భారీ ప్రయత్నం చేసినట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. మీకు నచ్చవచ్చు: అందాల ఆడబొమ్మ.. బాలయ్య ఆల్ టైం క్లాసిక్ సాంగ్.!        [World Of Vettuvam, Vettuvam First Look, Director Pa Ranjith, Sobhita Dhulipala, Pa Ranjith Movies, Telugu Film News, Telugu News]  
  కొన్ని సినిమాలు అంతేనండి బాబు. ఆ మాటకొస్తే కొన్ని సినిమాలు ఏముందిలే మాగ్జిమమ్ చాలా సినిమాల్లో డ్రగ్, హింస చాలా ఎక్కువ మోతాదులో ఉంది. విచిత్రంగా హీరో నే వాటికి బానిసగా ఉంటాడు. హీరోయిన్ కూడా ఎంకరేజ్ చేసి ఇద్దరు తమ మధురమైన ప్రేమ అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రేక్షకులు కూడా అదే బాపతుని అవలంబించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రేక్షకుడు 'స్వామి వివేకానంద. అవతారం కాదు కదా! వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ 2026  సినిమాటోగ్రాఫ్ చట్టం కింద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) కోసం సరికొత్త మార్గదర్శకాలను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల్లో అత్యంత ప్రధానమైన మార్పు డ్రగ్స్ , మత్తు పదార్థాల దృశ్యాలకి  సంబంధించినది. సినిమాలో మాదకద్రవ్యాల వాడకం, విక్రయం లేదా ట్రాఫికింగ్ సన్నివేశాలు వచ్చినప్పుడు, తెరపై ఖచ్చితంగా "అక్రమ మత్తుపదార్థాలు ఆరోగ్యానికి హానికరం మరియు ఖచ్చితంగా జైలు శిక్షకు దారితీస్తాయి. డ్రగ్స్‌కు నో చెప్పండి" అనే చట్టబద్ధమైన హెచ్చరిక సందేశాన్ని ప్రదర్శించడం ఇకపై తప్పనిసరి చేశారు. గతంలో సిగరెట్, మద్యం సన్నివేశాలకు మాత్రమే పరిమితమైన ఈ హెచ్చరికలు, ఇకపై మత్తు పదార్థాల దృశ్యాలకు కూడా వర్తిస్తాయి. కేవలం సినిమాలకే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెళ్లకు కూడా ఇదే తరహా నిబంధనలను పాటించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. దీనితో పాటు, సినిమాల వయస్సు వారీ వర్గీకరణలో కూడా స్పష్టత తెచ్చారు. మే 2025లో అమల్లోకి తెచ్చిన 'U/A 7+', 'U/A 13+' మరియు 'U/A 16+' వర్గీకరణలను ఈ నూతన గైడ్‌లైన్స్‌లో మరింత బలోపేతం చేశారు. దీనివల్ల తమ పిల్లలు ఏ రకమైన కంటెంట్ చూస్తున్నారో తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు మరింత స్పష్టమైన అవగాహన లభిస్తుంది. అంతేకాకుండా, సమాజంలో హింస, నేర విధానాలు, అసాంఘిక కార్యకలాపాలను ప్రాచుర్యంలోకి తెచ్చేలా లేదా గ్లామోరైజ్ చేసేలా చూపించకూడదని సీబీఎఫ్‌సీ స్పష్టం చేసింది. దేశద్రోహ ఆలోచనలు, మత విద్వేషాలు, శాస్త్రీయ దృక్పథానికి విరుద్ధమైన విషయాలు, విదేశాలతో ఉన్న స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసే అంశాలు లేకుండా జాగ్రత్తలు వహించాలని బోర్డు తేల్చిచెప్పింది. ఇది కూడా చదవండి: విజయ్ ఫోన్ కాల్ సీక్రెట్ బయటపెట్టిన విజయ్ సేతుపతి.. ఫుల్ వైరల్ మామ!     మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదో ఒక సన్నివేశాన్ని మాత్రమే విడిగా చూడకుండా, సినిమా మొత్తాన్ని సమగ్రంగా పరిశీలించి సర్టిఫికేషన్ ఇస్తారు. కళాత్మక స్వేచ్ఛకు, సామాజిక బాధ్యతకు మధ్య సరైన సమతుల్యత సాధించడమే లక్ష్యంగా సెన్సార్ బోర్డ్‌ను 18 మంది ప్రముఖులతో ఇటీవల పునర్వ్యవస్థీకరించారు. నటులు ప్రీతి జింటా, పంకజ్ త్రిపాఠి, సునీల్ శెట్టి, పల్లవి జోషి, డైరెక్టర్ ప్రియదర్శన్ మరియు ఆస్కార్ విజేత రిక్కీ కేజ్ వంటి ప్రముఖులు ఈ కొత్త బోర్డులో సభ్యులుగా ఉన్నారు.దాదాపు 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, అంటే డిసెంబర్ 1991 నాటి పాత నిబంధనల స్థానంలో ఈ కొత్త గైడ్‌లైన్స్ అమల్లోకి రావడం విశేషం. ఈ సరికొత్త నిబంధనలు చలనచిత్ర రంగానికి మరియు ప్రేక్షకుల వీక్షణ విధానానికి అత్యంత కీలకమైన మైలురాయిగా నిలవనున్నాయి.    మీకు నచ్చవచ్చు : నా మనసుకేమయింది: 90s కిడ్స్ ఫేవరెట్ సాంగ్.. సిరివెన్నెల కలం చేసిన మ్యాజిక్.!         [Cbfc, Cbfc New Film Certification Guidelines 2026, mandatory drug warnings , censor board new rules, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]
    'ఇళయ దళపతి విజయ్'.. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి.. తమిళ చిత్ర పరిశ్రమకే కాకుండా సౌత్ సినీ పరిశ్రమకి దొరికిన పవర్ ఫుల్ సినీ ముత్యాలు. విజయ్ సేతుపతి, ఇటీవల మాట్లాడిన మాటలు తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్‌ని  ఉద్దేశించి చేసినవే అనే రూమర్స్ చాలా కాన్ఫిడెన్స్ గానే చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ విజయ్ సేతుపతి వివరణ ఇవ్వడంతో రూమర్స్ కి దిక్కుతోచని పరిస్థితి.   విజయ్ సేతుపతి మాట్లాడుతు "ఒకసారి విజయ్ గారి కుమారుడు జాసన్ సంజయ్ పుట్టినరోజు సందర్భంలో నేను సంజయ్‌కి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశాను. ఆ విషయం తెలుసుకున్న విజయ్ సర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా నాకే ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తగానే 'డియర్ ఫ్రెండ్' అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. మీరు మా అబ్బాయికి విష్ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. అంతటి తిరుగులేని సూపర్ స్టార్ హోదా ఉన్న వ్యక్తి నుంచి అలా ఫోన్ రావడం నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఆయన వ్యక్తిగతంగా ఎంతో నిరాడంబరంగా ఉంటారు" అని సేతుపతి కొనియాడారు. ఈ మాటలతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం కల్పిత రూమర్లేనని స్పష్టమైంది.      ఇది కూడా చదవండి: ఈ సారి ఆ సీక్రెట్ మిషన్ తో మూవీ వస్తుందా: చైనా సైన్యానికి చిక్కిన భారత ఏజెంట్లు! సూపర్ స్టార్ రజనీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మైలురాయి చిత్రం 'జైలర్ 2' గురించి కూడా ఆయన కీలక ప్రకటన చేశారు. సాధారణంగా తాను ఇతర హీరోల సినిమాల్లో స్పెషల్ క్యామియోలు లేదా గెస్ట్ రోల్స్ చేయడం ఎప్పుడో నిలిపివేశాను. ఒకే పోస్టర్‌పై తన ఫోటో, మరో హీరో ఫోటో ఉంటే ప్రాధాన్యతలు మారిపోయి, తాను సోలో హీరోగా చేసే సినిమాలపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతోనే క్యామియోలకు దూరంగా ఉంటున్నాను. కానీ, కేవలం ఒక్క రజనీకాంత్ గారి కోసమే తన సొంత నిబంధనను పక్కనపెట్టి 'జైలర్ 2'లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తెలిపారు. దీంతో జైలర్ 2 ఇచ్చి సినీ కిక్ స్థాయి పెరగనుంది.     మీకు నచ్చవచ్చు : మీర్జాపూర్ భామ వ్యాఖ్యలు వైరల్: టాలెంట్ ఉంటే చాలదు.. అలా అనిపిస్తే అవకాశం   [Vijay Sethupathi, Vijay, Vijay Sethupathi About Thalapathy Vijay phone Call, Jailer 2 Cameo, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]
  సీనియర్ దర్శకుడు ఆ నలుగురు ఫేమ్ 'చంద్ర సిద్దార్ధ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈ పాట కోరిన వారు నెమలి పాలెం నుండి'  నిన్న సెల్యులాయిడ్ ని తన వశం చేసుకోవడానికి వచ్చింది. ప్రేక్షకుల టాక్ తో పాటు మెజారిటీ రివ్యూస్ పర్వాలేదనే స్థాయిలోనే వస్తున్నాయి.  ముఖ్యంగా ఈ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ కి మంచి పేరు వస్తుంది.  ముఖ్యంగా ఒక సన్నివేశంలో హీరో క్యారక్టర్ పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న ఒక అమ్మాయితో భర్త దగ్గర్నుంచి ఎందుకు విడిపోయారు! బాగా తాగుబోతా! మిమల్ని సరిగా చూసుకునే వాడు కాదా! అనుమాన పక్షా అని అడుగుతాడు. అప్పుడే ఆమె అతను చాలా మంచి వాడు అంటుంది. మరి మీరు మంచి వారు కాదా అని హీరో అంటాడు. నేను మంచిదాన్నే అంటుంది. మీ ఇద్దరు మంచి వాళ్ళు అయినప్పుడు ఎందుకు విడిపోయారు అంటాడు. అప్పుడు ఆమె' ఒక్కోసారి ఇద్దరు మంచి మనుషులు మంచి భార్య భర్తలుగా కలిసి ఉండలేరని చెప్తుంది. ఇది కూడా చదవండి: 9 సినిమాల్లో ఒకే ఒక్క హిట్: అయినా తగ్గని క్రేజ్: ఎందుకని!      ఆ మాట కేవలం ఒక సినిమా సంభాషణ మాత్రమే కాదు, మానవ సంబంధాల లోతుని , మారుతున్న సామాజిక విలువల స్వభావాన్ని విశ్లేషించే ఒక అద్భుతమైన వేదిక. ప్రస్తుత సమాజంలో మరియు నేటి ఆధునిక జీవనశైలిలో 90% కంటే ఎక్కువ మంది మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక సవాళ్లు మరియు కమ్యూనికేషన్ లోపాల వల్ల తమ బంధాలలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఏది ఏమైనా మనుషుల్లో లోపాలు ఉండటం సహజం. అసలు లోపాలు లేనోడు మనిషే కాదు. సో నెమలి పాలెం లోని ఆ అద్భుతమైన డైలాగ్ విని విడిపోయన భార్య భర్తలు ఆలోచనలో పడతారేమో చూద్దాం. సినిమా గట్టిగా అనుకోవాలే గాని అయిపోతుందంతే.  మీకు నచ్చవచ్చు : ' ఈ పాట కోరిన వారు నెమలి పాలెం నుండి'  మూవీ రివ్యూ     [Ee paata Korinavaaru nemalipalem Nundi Movie Review, Ee paata Korinavaaru nemalipalem Nundi, Chandra Siddhardh,Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]  
    ఓవర్ నైట్ స్టార్ డమ్ అనేది ఎంత నిజమో, చెప్పుకునే స్థాయిలో సినిమాలు చేసిన హిట్టు అందుకు అలిగిందో తెలియని స్టేజ్ రావడం కూడా అంతే నిజం. అభిమానులు, ప్రేక్షకులని తన చూపు నుంచి తప్పించుకొని విధంగా మెస్మరైజ్ చేసే ఈ ముద్దుగుమ్మ  ఇప్పుడు ఆ స్టేజ్ లోనే ఉంది.  నభా నటేష్.. శాండల్‌వుడ్‌లో శివ రాజ్‌కుమార్ సరసన 2015లో 'వజ్రకాయ' చిత్రంతో నటనా జీవితాన్ని ప్రారంభించిన ఈ కన్నడ భామ, 100 రోజులకు పైగా థియేటర్లలో ఆడి సూపర్ సక్సెస్ సాధించి భారీ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2018లో సుధీర్ బాబు సరసన 'నన్ను దోచుకుందువటే' సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో తన చలాకీతనంతోనూ, ఫ్రెష్ లుక్స్‌తోనూ తెలుగు ప్రేక్షకులని  ఆకట్టుకున్నప్పటికీ విజయం మాత్రం ముఖం తిప్పుకుంది. తన  సినీ ప్రయాణంలో అసలైన బిగ్ టర్నింగ్ పాయింట్ 2019లో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మాస్ ఎంటర్‌టైనర్ 'ఇస్మార్ట్ శంకర్'. రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన ఈ బ్లాక్‌బస్టర్ చిత్రంలో తెలంగాణ యాస మాట్లాడుతూ,  గ్లామరస్‌గా 'చాందిని' క్యారక్టర్ లో జీవించిన నభా, ఒక్కసారిగా స్టార్ హోదా  సొంతం చేసుకుంది. టాలీవుడ్ వర్గాల్లో మరియు ఆడియన్స్‌లో 'ఇస్మార్ట్ బ్యూటీ'గా పాపులారిటీ దక్కించుకుని కుర్రకారు కలల రాణిగా మారిపోయింది. ఆ ఒక్క బ్లాక్‌బస్టర్ సినిమా ఇచ్చిన క్రేజ్ ద్వారా ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే, సినీ పరిశ్రమలో విజయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 'ఇస్మార్ట్ శంకర్' తదనంతరం ఆమె ఖాతాలో వరుస ప్రాజెక్టులు చేరినప్పటికీ, ఫలితాలు మాత్రం అనుకూలించలేదు. ఇప్పటివరకు నభా నటేష్ తన కెరీర్‌లో మొత్తం 9 సినిమాల్లో నటించగా, అందులో ఏకైక బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది కేవలం ఆ ఒక్క 'ఇస్మార్ట్ శంకర్' మాత్రమేనని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. 'డిస్కో రాజా', 'అల్లుడు అదుర్స్', 'సోలో బ్రతుకే సో బెటర్', 'మాస్ట్రో' వంటి వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందించలేకపోయాయి. ఇది కూడా చదవండి: వారం రోజుల్లో: మహేష్ బాబు 'వారణాసి' ఇంట్రో సీన్ ఊచకోత..రాజమౌళి స్కెచ్ వైరల్   కెరీర్ మంచి స్పీడ్‌లో ఉండి అవకాశాలు వస్తున్న సమయంలోనే నభా జీవితంలో ఒక ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఆమె తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురై భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా దాదాపు 2 ఏళ్ల పాటు కెమెరా ముందుకు రాకుండా, నటనకు పూర్తిగా దూరమై బెడ్ రెస్ట్‌కే పరిమితం కావలసి వచ్చింది. అనేక శస్త్రచికిత్సలు, కఠినమైన ఫిజియోథెరపీ సర్జరీల తర్వాత, తన ఆత్మవిశ్వాసంతో ఆ శారీరక, మానసిక బాధలను అధిగమించి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇటీవల  జూలై 3న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రంలో ప్రాముఖ్యత గల క్యారక్టర్ పోషించప్పటికి  ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ సరసన అత్యంత ప్రతిష్టాత్మక చారిత్రక నేపథ్య చిత్రం 'స్వయంభు'తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాక్సాఫీస్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ క్యారక్టర్ లో ఒదిగిపోయి నటించడం వల్లనే ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో సైతం అత్యధిక   ఫాలోవర్లను కలిగి ఉంటూ తన గ్లామరస్ ఫొటోషూట్‌లతో ట్రెండింగ్‌ మాత్రం 'నా ఇంటి పేరు' అని ఫ్యాన్స్ కి హామీ ఇస్తూ ఉంది.    మీకు నచ్చవచ్చు: తెలుగు సినిమా డైలాగుల ప్రయాణం: ఏమంటివి ఏమంటివి నుండి నేటి మాస్ పంచ్‌ల వరకు!     [Nabha Natesh Nabha Natesh Movies Hit And Flop Story, Swayambhu Movie, iSmart Shankar, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]  
టాలీవుడ్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై మాదాపూర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. మాదాపూర్ సున్నం చెరువు ప్రాంతంలోని తమ ల్యాండ్ కబ్జా చేశారంటూ సియాట్ సొసైటీ అధ్యక్షుడు శ్యామ్ సింగ్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ మాదాపూర్ లోని సున్నం చెరువు ప్రాంతంలో సీయాట్ సొసైటీకి సంబంధించిన ప్లాట్స్ ఉన్నాయి. సర్వే నెంబర్ 12, 12ఏ, 13 గుట్టల బేగంపేట్ లో తమ సొసైటీ ప్లాట్లు ఉన్నాయని ప్లాట్ ఓనర్స్ చెబుతున్నారు. అయితే, ఈ రోజు ఉదయం నిర్మాత సి. కళ్యాణ్ తన అనుచరులతో కలిసి ల్యాండ్ లోకి అక్రమంగా ప్రవేశించారనేది ఆరోపించారు. సొసైటీకి చెందిన స్థలంలో అక్రమంగా బ్లూ షీట్స్ వేసి, అసలు ప్లాట్ ఓనర్లు ఎవరూ కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: 37 సీక్రెట్ ఇదే.. అల్లు అర్జున్ 'రాకా'లో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్.! గతంలో కూడా కొందరు వ్యక్తులు ఈ ప్లాట్లను కబ్జా చేయడానికి ప్రయత్నించారని సొసైటీ సభ్యులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తులు వెనక్కి తగ్గారని, కానీ ఇప్పుడు మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఏకంగా సినీ రంగానికి చెందిన ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, ఆయనతో పాటు ప్రకాష్ ధారక్, ప్రేమలత అనే వ్యక్తులు కలిసి తమ ప్లాట్లను కబ్జా చేసేందుకు కుట్ర పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని మాదాపూర్ పోలీసులను కోరారు. మీకు నచ్చవచ్చు: నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా.. 28 ఏళ్ళయినా ఇప్పటికీ ఫ్రెష్‌గా అనిపించే లవ్ సాంగ్.!       [C Kalyan Land Grabbing Case, C Kalyan Land Dispute Case, Producer C Kalyan, Hyderabad Land Grabbing Case, Madhapur Land Grabbing Case, Madhapur Police Station, CEAT Society Madhapur, Sunnam Cheruvu Land Dispute, Telugu News]  
వారణాసిపై అభిమానులు, ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలని లెక్కకట్టలేని పరిస్థితి. అసలు డైలీ 'వారణాసి' టీజర్ చూడందే నిద్ర కూడా పోనీ పరిస్థితి.  పైగా రోజుకొక క్రేజీ వార్త సోషల్ మీడియాని  షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే  తాజాగా చిత్రబృందం నుంచి వచ్చిన ఆసక్తికరమైన సమాచారం  అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.  మహేష్ బాబు తన క్యారక్టర్ కి సంబంధించిన టాకీ పార్ట్ షూటింగ్‌ని దాదాపుగా పూర్తి చేసాడట. కేవలం ఒకే ఒక్క వారం రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. అయితే ఈ మిగిలి ఉన్న ఒక్క వారం వ్యవధిలోనే అసలైన విజువల్ వండర్‌ను ఆవిష్కరించేందుకు జక్కన్న మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. మహేష్ బాబు క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చే కీలకమైన ఇంట్రడక్షన్ ఎపిసోడ్‌ని ఈ వారం రోజుల్లోనే అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరించేందుకు  రంగం సిద్ధం చేయబోతున్నారు. వెండితెరపై ఈ ఇంట్రో సీన్ చూస్తున్నప్పుడు థియేటర్లలో ఈలలు, కేకలతో రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయమని టాలీవుడ్ ఇన్‌సైడర్ టాక్.   ఒకవైపు ఈ భారీ ఇంట్రో సీన్ షూటింగ్ సెట్స్ పైకి వెళ్తుండగానే, మరోవైపు మహేష్ బాబు తన రోల్ కి సంబంధించిన డబ్బింగ్ పనులని  కూడా సమాంతరంగా ప్రారంభించేయడం విశేషం. సాధారణంగా షూటింగ్ అంతా పూర్తయిన తర్వాతే డబ్బింగ్ ప్రక్రియను మొదలుపెడుతుంటారు. ఇది కూడా చదవండి: ధురంధర్,పెద్దిని వెనక్కి నెట్టి 'ఆస్కార్' కి వెళ్లిన 'గోంధళ్'లో ఏముంది!      కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకూడదనే ఉద్దేశంతో రాజమౌళి ప్రతి అంశాన్ని ఎంతో పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కేవలం ఒక హీరో చుట్టూనే కాకుండా మల్టీస్టారర్ రేంజ్‌లో రూపొందుతుండటంతో ఇతర కీలక నటీనటుల షూటింగ్ అప్‌డేట్స్ కూడా బయటకు వచ్చాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన ప్రధాన పోర్షన్ల చిత్రీకరణను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అలాగే మరో ముఖ్యమైన క్యారక్టర్ లో  కనిపించబోతున్న మలయాళ వర్సటైల్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు సంబంధించిన కీలక సన్నివేశాల టాకీ పార్ట్ కూడా పూర్తయిందని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.   ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులను అత్యంత ఆశ్చర్యానికి గురిచేస్తున్న మరో అద్భుతమైన విషయం రామాయణం ఆధారంగా వచ్చే విజువల్ ఎపిసోడ్. కథలో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న ఈ రామాయణం సీక్వెన్స్‌కు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు ఇప్పటికే వంద శాతం పూర్తయినట్లు ఇన్సైడర్ వర్గాలు వెల్లడించాయి.  దాంతో పాటు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సారథ్యంలో మ్యూజిక్ వర్క్ కూడా శరవేగంగా సాగుతోంది. ఇలా షూటింగ్, డబ్బింగ్, వీఎఫ్ఎక్స్, మ్యూజిక్ పనులను ఒకేసారి సమాంతరంగా రన్ చేస్తూ రాజమౌళి మార్క్ పర్‌ఫెక్షన్ చూపిస్తున్నారు. ఈ భారీ అడ్వెంచరస్ విజువల్ వండర్ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. మహేష్ బాబుని రాజమౌళి ఆలోచనలో నుంచి పుట్టిన సరికొత్త గ్లోబ్ ట్రోటర్ అవతారంలో చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫ్యాన్స్ కాచుకుని కూర్చున్నారు.    మీకు నచ్చవచ్చు: తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించాననీ: 'సింహరాశి'లోని ఈ క్లాసిక్ సాంగ్ మీనింగ్ తెలుసా.?       [Mahesh Babu, Varanasi, Rajamouli, Mahesh Babu Varanasi Movie Intro Scene, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మానవ శరీరం అత్యంత సంక్లిష్టమైనది, అందులోనూ మెదడు మరింత అద్భుతమైన నిర్మాణంతో కూడుకున్నది. శతాబ్దాలుగా వైద్య ప్రపంచం మరియు సైన్స్ రంగం మానవ మెదడును ఒకే రకమైన మూల కణ సమూహం నుండి ఉద్భవించిన ఒకే అవయవంగా భావిస్తూ వచ్చాయి. అంటే పిండం అభివృద్ధి చెందే ప్రాథమిక దశలోనే ఒకే మూలం నుంచి మెదడులోని వివిధ భాగాలు రూపుదిద్దుకుంటాయని విశ్వసించారు. అయితే అమెరికాలోని ప్రసిద్ధ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన తాజా పరిశోధన ఈ పాత నమ్మకాలను పూర్తిగా తిరగరాస్తోంది. మానవ మెదడు ఒకే మూలం నుండి కాకుండా, రెండు వేర్వేరు కణ సమూహాల నుంచి స్వతంత్రంగా ఆవిర్భవించిందని ఈ సంచలన అధ్యయనంలో తేలింది. స్టాన్‌ఫోర్డ్ డెవలప్‌మెంటల్ బయోలాజికల్ రీసెర్చర్ మరియు ఈ అధ్యయన సీనియర్ రచయిత కైల్ లోహ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ కొత్త విషయాన్ని ప్రపంచానికి వెల్లడించింది. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం, దాదాపు 500 మిలియన్ సంవత్సరాల క్రితమే స్వతంత్రంగా అభివృద్ధి చెందిన రెండు వేర్వేరు కణ వ్యవస్థల కలయిక ద్వారా మన మెదడు రూపుదిద్దుకుంది. మానవ మెదడును సాధారణంగా పూర్వ మెదడు, మధ్య మెదడు, పశ్చాత్ మెదడు అనే మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజిస్తారు. భాష, తార్కిక ఆలోచన, చైతన్యం, అమూర్త ఆలోచనల వంటి సంక్లిష్టమైన సామర్థ్యాలకు పూర్వ మెదడు కేంద్రంగా నిలుస్తుంది. మరోవైపు శ్వాస తీసుకోవడం, హృదయ స్పందనలు, నిద్ర, ఆకలి వంటి ప్రాథమిక జీవక్రియలతో పాటు ముఖ కదలికలు, మాట్లాడటం, మింగడం వంటి కార్యకలాపాలను పశ్చాత్ మెదడు నియంత్రిస్తుంది. పిండం అభివృద్ధి చెందే ప్రారంభ దశలోనే పూర్వ మెదడు మరియు పశ్చాత్ మెదడు ప్రాంతాలు రెండు వేర్వేరు అభివృద్ధి మార్గాలను అనుసరిస్తాయని ఈ అధ్యయనంలో గుర్తించారు. మెదడు వెనుక భాగంతో పోలిస్తే ముందు భాగం పూర్తిగా భిన్నమైన మూల కణ సమూహం నుండి ఉద్భవిస్తుందని ప్రయోగాత్మకంగా నిరూపించడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ విభజన కేవలం మానవులకే పరిమితం కాలేదని, కోళ్లు, జీబ్రాఫిష్, ఏకార్న్ వార్మ్స్ వంటి ఇతర ప్రాణుల జీవ పరిణామ క్రమంలో కూడా ఇదే రెండు భాగాల అభివృద్ధి నమూనా స్పష్టంగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిని బట్టి ఈ పరిణామ ప్రక్రియ జీవుల చరిత్రలోనే అత్యంత ప్రాచీనమైనదని స్పష్టమవుతోంది. వైద్య వైజ్ఞానిక రంగానికి ఈ ఆవిష్కరణ ఒక గొప్ప మైలురాయిగా మారనుంది.  ప్రయోగశాలల్లో మానవ పశ్చాత్ మెదడు కణాలను కృత్రిమంగా పెంచడం శాస్త్రవేత్తలకు ఎంతో కష్టతరంగా ఉండేది. కానీ ఈ కొత్త అవగాహన సహాయంతో స్టాన్‌ఫోర్డ్ పరిశోధకుల బృందం మూలకణాల నుంచి విజయవంతంగా హిండ్ బ్రెయిన్ మోటార్ న్యూరాన్లను రూపొందించింది. ప్రయోగశాలలో రూపుదిద్దుకున్న ఈ న్యూరాన్లు విద్యుత్ క్రియాశీలతను ప్రదర్శించడమే కాకుండా, ముఖం మరియు మింగే కండరాలను నియంత్రించే ప్రత్యేక ప్రోటీన్లను కూడా ఉత్పత్తి చేశాయి. ఈ విప్లవాత్మక ఫలితాలు రాబోయే రోజుల్లో మోటార్ న్యూరాన్ వ్యాధులైన అమియోట్రోఫిక్ లేటరల్ స్క్లెరోసిస్ (ALS), స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) వంటి తీవ్రమైన నాడీ సంబంధిత వ్యాధుల చికిత్సలో కొత్త వెలుగులు నింపనున్నాయి. ప్రయోగశాలలో నాడీ కణాలను సృష్టించి, వ్యాధి బారిన పడినప్పుడు కణాలు ఎలా దెబ్బతింటున్నాయో నిశితంగా పరిశీలించడానికి ఇది దోహదపడుతుంది. దీని ఆధారంగా భవిష్యత్తులో నూతన ఔషధాలు, జీన్ థెరపీలను విజయవంతంగా పరీక్షించే అవకాశం కలుగుతుంది. రానున్న రోజుల్లో వెన్నుపాముతో పాటు నాడీ వ్యవస్థలోని ఇతర భాగాలకు కూడా ఇలాంటి ప్రాచీన అభివృద్ధి మూలాలు ఉన్నాయా అనే కోణంలో శాస్త్రవేత్తలు మరిన్ని విస్తృత పరిశోధనలు నిర్వహించనున్నారు.     [ Human Brain, Brain Development, Stanford University, Stem Cells, Kyle Loh, Forebrain, Hindbrain, Motor Neurons, ALS, Spinal Muscular Atrophy ]
మన చిన్నతనంలో అమ్మమ్మలు, నాయనమ్మలు చేతులతో స్వయంగా చేసిన వంటల రుచి, ఆ సువాసనలు ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతాయి. మైదా పిండి, నీళ్లతో పిండి కలిపి, క్షణాల్లో సన్నని రవ్వలాంటి సేమియాను తమ చేతులతోనే తయారుచేసి, పెద్ద పెద్ద పళ్లెంలో వేసి తిరిగే పంఖా కింద ఆరబెట్టే ఆ దృశ్యాలు ఇప్పటి తరానికి ఒక అపురూపమైన జ్ఞాపకం. కానీ, ఆ చేతివంట నేర్చుకోకపోవడం వల్ల, ఆ తరం మనల్ని విడిచివెళ్లాక ఆ ప్రాచీన రుచులు కేవలం జ్ఞాపకాలుగానే మిగిలిపోతున్నాయి. నేటి వేగవంతమైన ప్రపంచంలో, మన సాంప్రదాయ వంటల వారసత్వాన్ని, కుటుంబ మూలాలను కాపాడుకునేందుకు కొత్త తరం ఒక గొప్ప ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఆహారం అంటే కేవలం కడుపు నింపుకునే తిండి మాత్రమే కాదు, అది మన బాల్యంతో, మన సంస్కృతితో, మన మూలాలతో అనుసంధానమైన ఒక బలమైన జ్ఞాపకం. ముంబైకి చెందిన ప్రసిద్ధ ఆహార చరిత్రకారుడు కురుష్ దలాల్ ప్రకారం, ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ తగ్గుముఖం పట్టి, చిన్న కుటుంబాల సంఖ్య పెరిగిన తర్వాతే ప్రజలు తమ సాంప్రదాయ వంటలను, ఇంటి రుచులను ఎంతగానో మిస్ అవుతున్నారు. పూర్వకాలంలో వంటల చరిత్రను, సాంప్రదాయాలను కాపాడే బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. అయితే, గత 10 ఏళ్లలో పురుషులు కూడా వంటింట్లోకి అడుగుపెట్టి, కాలగర్భంలో కలిసిపోతున్న తమ కుటుంబ సాంప్రదాయ వంటకాలను వెతికి మరీ నేర్చుకోవడం గమనార్హం. NRIలు సైతం భారతదేశానికి వచ్చినప్పుడు పాతకాలపు పార్శీ వంటకాలైన చోరా మా పాయా, వాల్, మసూర్ మా జీబ్ వంటి అరుదైన వంటకాలను అడిగి మరీ చేయించుకుని తింటున్నారంటే ప్రాచీన రుచులపై ఉన్న మక్కువ అర్థమవుతుంది. సాహిత్యం మరియు ఆహారాన్ని జోడిస్తూ బెంగళూరులో ప్రారంభమైన  ఫ్రమ్ వర్డ్స్ టు వోక్  అనే ఫుడ్-ఇన్-లిటరేచర్ క్లబ్ కేవలం 3 మంది సభ్యులతో ప్రారంభమై, నేడు 100 మందికి పైగా సభ్యులతో అలకరిస్తోంది. ప్రతీ నెలా శనివారం కలిసే ఈ క్లబ్ సభ్యులు పుస్తక పఠనం ద్వారా ఆహారానికి, సంస్కృతికి, వలసలకు, ఆకలికి మధ్య ఉన్న బంధాన్ని చర్చించుకుంటారు. మరోవైపు,  నివాలా  అనే క్యులినరీ హెరిటేజ్ ప్లాట్‌ఫారమ్‌ను స్థాపించిన శ్రుతి తన తల్లిని కోల్పోయిన తర్వాత ఈ అద్భుతమైన ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఒక తరం నుండి మరొక తరానికి వంటకాలు అందించే ప్రక్రియలో ఇప్పటికే 30% నుండి 40% వరకు సాంప్రదాయ వంటకాల జ్ఞానం నశించిపోయిందని ఆమె గణాంకాలు చెబుతున్నాయి. ఈ విలువైన వంటల వారసత్వాన్ని కాపాడుకోవడానికి నివాలా ఒక సరికొత్త మార్గాన్ని కనుగొంది. వారు క్యూఆర్ కోడ్‌లు (QR Codes) కలిగిన డిజిటల్ మరియు ప్రింటెడ్ రెసిపీ పుస్తకాలను రూపొందిస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే మన అమ్మమ్మలు లేదా నాయనమ్మలు ఆ వంటకాన్ని తమ సొంత గొంతుతో ఎలా చేయాలో వివరించే ఆడియో రికార్డింగ్ వినబడుతుంది. ఇది కేవలం వంట విధానం మాత్రమే కాదు, మన పెద్దల గొంతును, వారి ప్రేమను కలకాలం దాచుకునే ఒక భావోద్వేగ కానుక. వీరు ప్రచురించిన  మెమోరీస్ ఆన్ ఎ ప్లేట్  అనే పుస్తకానికి 2024 లో ప్రతిష్టాత్మక  గుర్మాండ్ వరల్డ్ కుక్‌బుక్ అవార్డు  (Gourmand World Cookbook Award) లభించింది. మీ ఇంట్లో కూడా తరతరాల నాటి వంటింటి జ్ఞాపకాలను కాపాడుకోవడానికి 6 సులువైన మార్గాలు ఉన్నాయి. మొదటిది, తాతయ్యలు, అమ్మమ్మల పేర్లు చెక్కిన పాతకాలపు కంచాలు, రాగి లేదా ఇత్తడి పాత్రలను భద్రపరుచుకోవడం. రెండవది, రోలు, పప్పు గుత్తి, చెక్క పూరీ పీట వంటి ప్రాచీన వంటింటి పరికరాలను ఫొటోలు తీసి వాటి వెనుక ఉన్న కథను రాసిపెట్టుకోవడం. మూడవది, మన పెద్దలు స్పూన్లు, గ్రాములలో కాకుండా  పిడికెడు ,  చిటికెడు  అంటూ చెప్పే అంచనా కొలతలను సరిగ్గా అర్థం చేసుకుని రికార్డ్ చేయడం. నాల్గవది, అమ్మమ్మ లేదా నాయనమ్మ వంట చేసేటప్పుడు వారి స్వరంలోనే కనీసం 30 సెకన్ల ఆడియో రికార్డ్ చేసుకోవడం. ఐదవది, తరతరాలుగా వస్తున్న ఇంట్లోనే చేసుకునే మూలికా వైద్యాన్ని, చిట్కాలను రాసి పెట్టుకోవడం. ఆరవది, వంటల తయారీలో వాడే ప్రాంతీయ పదాలను, భాషా వైవిధ్యాన్ని కాపాడుకోవడం. కొవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచంలో మనుషుల జీవితాల అనిశ్చితిని గ్రహించిన చాలామంది, తమ ఇంట్లోని చివరి తరం పెద్దల వద్ద ఉన్న ఈ అమూల్యమైన రుచుల జ్ఞానాన్ని కాపాడుకోవడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు.     [ Traditional Indian Recipes, Culinary Heritage, Family Recipes, Food History, Grandmother Recipes, Parsi Cuisine, Nivala, From Words to Wok, Memories on a Plate, Gourmand World Cookbook Award ]
నేటి వేగవంతమైన జీవనశైలిలో ఉదయాన్నే టిఫిన్ వండుకోవడానికి సమయం సరిపోక చాలామంది ఒక అరటిపండుతో తమ రోజును ముగించేస్తుంటారు. చవకగా లభించడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుందనే భావనతో పరగడుపున అరటిపండు తినడం ఎంతోమందికి ఒక రోజువారీ అలవాటుగా మారిపోయింది. పొటాషియం, విటమిన్లు, ఫైబర్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉండే అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనేది ఎంత నిజమో, దానిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనేది కూడా అంతే పచ్చి నిజం. పరగడుపున అరటిపండు తింటే శరీరంలో అసలు ఏం జరుగుతుంది? దీనివల్ల కలిగే ప్రయోజనాలు మరియు దాగి ఉన్న ప్రమాదాల గురించి పోషకాహార నిపుణులు వెల్లడించిన అనేక ఆసక్తికర విషయాలను ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. సాధారణంగా ఒక మీడియం సైజ్ అరటిపండులో దాదాపు 98 కేలరీలు మరియు 4 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. ఉదయాన్నే దీనిని తీసుకున్నప్పుడు ఇందులో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజమైన చక్కెరలు శరీరానికి వెంటనే అపరిమితమైన శక్తిని అందిస్తాయి. అలాగే అరటిలోని కరిగే పీచు పదార్థమైన పెక్టిన్ పేగుల పనితీరును మెరుగుపరిచి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కానీ, ఇవన్నీ అరటిపండును ఇతర ఆహారాలతో కలిపి తిన్నప్పుడే సాధ్యమవుతాయి. కేవలం అరటిపండును మాత్రమే ఖాళీ కడుపుతో తీసుకుంటే, అందులోని చక్కెరలు రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా విపరీతంగా పెంచేస్తాయి. దీనిని అదుపు చేయడానికి శరీరం అధిక మొత్తంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా కొద్దిసేపటికే బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పడిపోయి, విపరీతమైన నీరసం, అలసట మరియు కడుపులో మళ్లీ ఆకలి భావన మొదలవుతాయి. మరొక ప్రధానమైన ప్రమాదం ఏమిటంటే, అరటిపండులో మెగ్నీషియం మరియు పొటాషియం చాలా ఎక్కువగా ఉంటాయి. ఖాళీ కడుపుతో అరటిపండు తిన్నప్పుడు రక్తంలో మెగ్నీషియం శాతం ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇది శరీరంలో ఉండే క్యాల్షియం మరియు మెగ్నీషియం సమతుల్యతను దెబ్బతీసి గుండెపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా అరటిపండులో ఉండే సహజ ఆమ్లత్వం వల్ల సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ మరియు కడుపులో మంట వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ (మధుమేహం) బాధిత ప్రజలు, అసిడిటీ సమస్యతో సతమతమయ్యేవారు మరియు బరువు తగ్గాలని చూస్తున్నవారు పొరపాటున కూడా ఉదయాన్నే పరగడుపున అరటిపండు తినకూడదు. అలా అని అరటిపండు తినడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, దానిని తినే విధానాన్ని మార్చుకుంటే చాలు. ఉదయాన్నే అరటిపండు తినాలనుకునేవారు దానిని ఎప్పుడూ ఒంటరిగా తీసుకోకూడదు. ఓట్ మీల్, గోరువెచ్చని పాలు, పెరుగు లేదా బాదం, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అరటిపండులోని కార్బోహైడ్రేట్లు, ఫైబర్ తో పాటు నట్స్ లోని ప్రొటీన్లు, మంచి కొవ్వులు శరీరానికి సమతుల్యంగా అంది బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగకుండా ఉంటుంది. లేదా ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ పూర్తయిన తర్వాత లేదా మధ్యాహ్నం వేళలో అరటిపండు తీసుకోవడం అత్యంత సురక్షితమైన పద్ధతి. రోజువారీగా 1 నుంచి 2 అరటిపండ్లను సరైన పద్ధతిలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.     [ Banana, Empty Stomach, Banana Benefits, Blood Sugar, Insulin, Potassium, Magnesium, Digestive Health, Diabetes, Healthy Breakfast ]
ఎర్ర గోంగూర.. కేవలం తెలుగు రాష్ట్రాల రుచుల్లోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదిచుకుంది. ఆకుకూరల్లో గోంగూరకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తెల్ల గోంగూరతో పోలిస్తే ఎర్ర గోంగూరలో ఆరోగ్య గుణాలు, పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది దీని పులుపుదనం వల్ల లేదా పులుపు ఎక్కువైతే ఏమన్నా సమస్యలు వస్తాయేమోనని కాస్త దూరంగా ఉంటారు. కానీ, ఎర్ర గోంగూర రోజూ లేదా వారానికి రెండు మూడు సార్లు తింటే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఉంటాయని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు. అసలు ఎర్ర గోంగూరలో  ఉండే పోషకాలు ఏమిటి? ఎర్ర గోంగూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకుంటే ఎర్ర గోంగూరను అస్సలు వదిలిపెట్టరు.  ఎర్ర గోంగూర గురించి వివరంగా తెలుసుకుంటే.. ఎర్ర గోంగూర అందించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రక్తహీనతకు చెక్ పెడుతుంది:  నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రక్తహీనత. ఎర్ర గోంగూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో ఎర్ర గోంగూర ఒక సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది:  వయసు పెరిగే కొద్దీ ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు సహజంగా వస్తుంటాయి. ఎర్ర గోంగూరలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరం ఎముకలను దృఢంగా ఉంచడానికి ఎంతగానో తోడ్పడతాయి. చిన్నపిల్లల పెరుగుదలకు, ఎముకల ఎదగడానికి ఇది చాలా మంచిది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:  ఎర్ర గోంగూరలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును వేగవంతం చేసి, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. తిన్న ఆహారం త్వరగా అరగడానికి, పేగుల్లో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడానికి ఇది సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:  ఈ ఆకుకూరలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తినందిస్తుంది. కంటి చూపు పెరిగేందుకు దోహదం చేస్తుంది:  ఎర్ర గోంగూరలో విటమిన్ ఏ తగినంత ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రేచీకటి, కళ్ళు పొడిబారడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తూ, దృష్టి లోపాలు రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి రక్షణ:  ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా నిరోధించడంలో ఎర్ర గోంగూర  కీలకంగా పనిచేస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు:  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, ముడతలు పడకుండా చూడటానికి ఇది దోహదపడుతుంది. అలాగే తలకు అవసరమైన పోషకాలను అందించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి:  ఎర్ర గోంగూరలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి, పీచు పదార్థం ఎక్కువ. ఇది తిన్న తర్వాత కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. దీంతో అతిగా తినే అలవాటు తగ్గి సులభంగా బరువు తగ్గొచ్చు. ఇన్ని రకాల ఔషధ గుణాలు ఉన్న ఎర్ర గోంగూరను  దైనందిన ఆహారంలో పప్పు రూపంలోనో, పచ్చడి రూపంలోనో లేదా ఇతర కూరల్లో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.                       *రూపశ్రీ.  
మన చుట్టూ ఎక్కడ చూసినా కనిపించే కొన్ని మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అలాంటి మొక్కల్లో కుప్పింటాకుకూడా ఒకటి. దీనినిపిప్పింటాకు, మురిపిండి, హరిత మంజరివంటి పేర్లతో కూడా పిలుస్తారు.  శాస్త్రీయంగా దీనిని Acalypha indica అంటారు. కుప్పింటాకును మన సంప్రదాయ వైద్య విధానాల్లో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగాపిప్పి పన్ను నొప్పి, పంటి సమస్యలు, గజ్జి, దురద, తామర వంటి చర్మ సమస్యలకు సంప్రదాయంగా ఉపయోగించే విధానాల గురించి ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ వివరిస్తున్నారు. కుప్పింటాకు మొక్కలోని ఆకులు, వేర్లు తదితర భాగాలను వివిధ సంప్రదాయ పద్ధతుల్లో ఉపయోగించినట్లు సమాచారం ఉంది. అయితే ఏ ఆరోగ్య సమస్యకైనా స్వయంగా చికిత్స చేసుకోవడం కాకుండా, సరైన వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. కుప్పింటాకు మొక్కను ఎలా గుర్తించాలి? పిప్పి పన్ను నొప్పి, చర్మ సమస్యల వంటి వాటికి దీనిని సంప్రదాయంగా ఎలా ఉపయోగిస్తారు? ఈ ఆకు వల్ల చెప్పుకునే ఇతర ప్రయోజనాలు ఏమిటి? వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి పూర్తి వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
నీలిబృంగాది తైలం పూర్వకాలం నుండి ఆయుర్వేదంలో జుట్టు సంరక్షణకు ఉపయోగించే  ఒక అద్భుతమైన మూలికా నూనెగా పేరుగాంచింది. నేటి కాలంలో పెరిగిన కాలుష్యం, మానసిక ఒత్తిడి,  జీవనశైలి సరిగా లేకపోవడం,  రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల అనేక రకాల జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలన్నింటికీ నీలిబృంగాది తైలం ఒక సహజసిద్ధమైన పరిష్కారంగా పనిచేస్తుంది. ఈ నూనె గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నూనె తయారీలో వాడే పదార్థాలు.. ఈ నూనె తయారీలో నీలి, భృంగరాజ్ లేదా గుంటగలగర, ఆమ్లా లేదా ఉసిరి, శతక్రాంత, అజక్షీర అంటే మేక పాలు, మహిష క్షీర అంటే  బర్రె పాలు, గోక్షీర అంటే ఆవు పాలు,  మరియు కొబ్బరి పాలు లేదా నువ్వుల నూనె వంటి శక్తివంతమైన ఆయుర్వేద మూలికలు మరియు పాలను ఉపయోగిస్తారు. ఈ పదార్థాల కలయిక జుట్టుకు , కుదుళ్లకు కావలసిన సమగ్ర పోషణను అందిస్తుంది. ప్రయోజనాలు.. నీలిబృంగాది తైలం క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు రాలడం చాలా  తగ్గుతుంది. ఇది కుదుళ్లను దృఢంగా మార్చి, కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఈ నూనెలో ఉండే నీలి , భృంగరాజ్ మూలికలు జుట్టు సహజ రంగును కాపాడటంలో విశేషంగా తోడ్పడతాయి. చిన్న వయస్సులోనే వచ్చే తెల్ల జుట్టు సమస్యను నివారించడంలో , జుట్టును ఒత్తుగా, నల్లగా ఉంచడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. జుట్టు పెరగడమే కాకుండా, తలలో వచ్చే చుండ్రు , దురద సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. కుదుళ్లలో రక్తప్రసరణను మెరుగుపరచి, వెంట్రుకలు చిట్లడాన్ని , పొడిబారడాన్ని అడ్డుకుంటాయి. ఈ తైలం కేవలం జుట్టుకే కాకుండా మానసిక ప్రశాంతతకు కూడా తోడ్పడుతుంది. ఇందులో ఉండే చలవ చేసే గుణం వల్ల రాత్రి పూట ఈ నూనెతో తలకు మర్దన చేసుకుంటే ఒత్తిడి తగ్గి, మంచి నిద్ర పడుతుంది. కంటి అలసటను తగ్గించి, శిరోభారాన్ని ఉపశమనం చేయడంలో ఇది సహాయపడుతుంది. ఎలా వాడాలి?  ఈ నూనెను వాడే విధానం కూడా చాలా సులభం. కొద్దిగా తైలాన్ని తీసుకుని కుదుళ్లకు బాగా పట్టించి, మునివేళ్ళతో  సున్నితంగా మర్దన చేయాలి. కనీసం అర గంట నుండి గంట సేపు ఉంచుకున్న తర్వాత మెత్తటి సీకాయ లేదా మైల్డ్ ఆయుర్వేద షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు నుండి మూడు సార్లు ఈ నూనెను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.  సహజమైన పద్ధతిలో జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా , అందంగా మార్చుకోవడానికి నీలిబృంగాది తైలం చాలా మంచి ఎంపిక.                        *రూపశ్రీ.