LATEST NEWS
  దేశవ్యాప్తంగా నీట్  పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి. భావి వైద్యుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందంటూ విద్యార్థులు, యువజన సంఘాలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపడుతుండగా, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలపై టోన్ న్యూస్ వాస్తవ వేదిక కార్యక్రమంలో తెలుగువన్‌ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్లేషణాత్మకంగా చర్చ నిర్వహించారు.   పార్లమెంటు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ లీకేజీ బాధ్యులైన 13 మందిని అరెస్ట్ చేశామని, కఠిన శిక్షలు అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ, ఈ ప్రతిస్పందన సమస్య తీవ్రతకు తగినట్లు లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ పరిస్థితి – విద్యార్థుల ఆగ్రహం నీట్ వివాదం కేవలం ఒక పరీక్ష అక్రమానికి పరిమితం కాకుండా తీవ్ర రాజకీయ రూపం దాల్చింది. ఈ వివాదంలో ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేయాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది.  విద్యార్థుల ఆవేదనను, భయాందోళనలను పరిష్కరించడంలో ప్రభుత్వం నెమ్మదిగా స్పందిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గతంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన సుదీర్ఘ రైతు ఉద్యమం మాదిరిగానే, ఈ నీట్ ఆందోళన కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది.వ్యూహం  అంతర్లీన రాజకీయాలుఈ ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని పరిశీలిస్తే, ఆందోళన తీవ్రతను తగ్గించి, కాలక్రమేణా దాన్ని సర్దుమణిగేలా చేయడం అనే వ్యూహం కనిపిస్తోంది.  ప్రస్తుత తరం విద్యార్థులు తమ కెరీర్, చదువుపై ఎక్కువ దృష్టి పెడతారని, హింసాత్మక లేదా తీవ్రస్థాయి ఉద్యమాల్లో సుదీర్ఘకాలం పాల్గొనలేరనే అంచనాతో ప్రభుత్వం 'సైలెంట్ వెయిట్ అండ్ వాచ్' విధానాన్ని అనుసరిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌ను తిరస్కరించడం ద్వారా తన పట్టును నిలబెట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, ఇది విద్యార్థుల ఆవేదనను మరింత పెంచుతోంది.  కేంద్ర ప్రభుత్వంలో జరగాల్సిన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ  వాయిదా పడటానికి కూడా ఈ రాజకీయ ఒత్తిళ్లే కారణమనే ప్రచారం సాగుతోంది.  రాజకీయ పరిణామాలు  భవిష్యత్ ప్రభావం నీట్ వివాదాన్ని సకాలంలో మరియు పారదర్శకంగా పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఇది తీవ్ర రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. యువతలో నమ్మకం సడలడం: దేశంలోని కోట్లాది మంది యువత, విద్యార్థులలో పరీక్షల వ్యవస్థ మరియు విద్యాశాఖ నిర్వహణపై నమ్మకం దెబ్బతింటుంది. ప్రతిపక్షాలకు బలమైన ఆయుధం.. రానున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విద్యార్థుల నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రచార అంశాలుగా మారతాయి.  విద్యా సంస్కరణల ఆవశ్యకత: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వంటి సంస్థల స్వయంప్రతిపత్తి, నిర్వహణ లోపాలను సరిదిద్దకపోతే, విద్యా వ్యవస్థ విశ్వసనీయత శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ముగింపుగా, విద్యార్థుల ఆవేదనను కేవలం రాజకీయ కోణంలో కాకుండా, వ్యవస్థాగత లోపాలను సరిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగవంతమైన, పారదర్శకమైన చర్యలు చేపడితేనే ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.   NEET Controversy, NEET Paper Leak, Dharmendra Pradhan Resignation, Narendra Modi, Vaastava vedika, NTA, Kanthamneni Ravi Shankar
ఒక అమ్మాయి అడిగిన ఒక్క ప్రశ్న... మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు...? అని  ఆ ప్రశ్నకు... ఎవరూ సమాధానం చెప్పలేదు.  నమస్తే...చరిత్రలో...కొన్ని రోజులు...క్యాలెండర్‌లో ఒక తేదీగా మాత్రమే మిగిలిపోతాయి.కానీ...కొన్ని రోజులు మాత్రం...ఒక దేశం...తన భవిష్యత్తును...తన చేతులతో రాయడం మొదలుపెట్టిన రోజులుగా నిలిచిపోతాయి. ఇప్పుడు...నేను మీకు చెప్పబోయేది...రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.   ...ఢిల్లీ వీధుల్లో...వేలాది మంది యువత నడిచారు. వాళ్ల చేతుల్లో...తుపాకులు లేవు.కత్తులు లేవు.రాళ్లు కూడా లేవు.ఉన్నదల్లా...కొన్ని ప్లకార్డులు...కొన్ని ప్రశ్నలు...ఆపై ... భవిష్యత్తుపై భయం. ఆ వీడియోలు...నేను చాలాసార్లు చూశాను. ప్రతిసారి...ఒకే ప్రశ్న...నా మనసులో వినిపించింది. ఒకవేళ...ఆ పోలీసుల ముందు నిలబడి... మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు...?' అని అడుగుతున్నది...నా కూతురే అయితే...?  ఆ ఒక్క ఆలోచనే...గుండెను భారంగా మార్చేసింది. జంతర్ మంతర్...గత కొన్ని వారాలుగా...ఒక నిరసన వేదికగా మారింది. మొదట...నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి...బాధ్యత వహిస్తూ...కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కొంతమంది విద్యార్థులు...నిరాహార దీక్ష ప్రారంభించారు. రోజులు గడిచాయి.ఆ నిరసన...కొద్దిమంది నుంచి...వందల మందికి...వందల మంది నుంచి...వేల మందికి చేరింది.  అలా     సోమవారం...పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజున..ఆ యువత... చలో సంసద్ అని పిలుపునిచ్చింది. ప్రభుత్వం...ముందుగానే సిద్ధమైంది.నగరాన్ని...నాలుగైదు భద్రతా జోన్లుగా విభజించింది.రాపిడ్ యాక్షన్ ఫోర్స్...సీఆర్పీఎఫ్...ఢిల్లీ పోలీసులు...ఇంకా భారీ బలగాలను మోహరించింది.మెట్రో స్టేషన్లు మూసివేసింది.కొన్ని ప్రాంతాల్లో...ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అన్ని ఏర్పాట్లు...చేసి...ఆ యువత...పార్లమెంట్ గేటు దగ్గరకు చేరకుండా ఆపాలనుకుంది. కానీ...జరిగింది మాత్రం...వేరే. వేలాది మంది యువత...అన్ని అడ్డంకులను దాటుకుంటూ...ముందుకు దూసుకొచ్చారు. పోలీసులు...లాఠీలు ఎత్తారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు.అయినా...వాళ్లు వెనక్కి తగ్గలేదు. ఒక్కసారి...ఆ వీడియోలను...చుడండి.ఒక అమ్మాయి...పోలీసుల ముందు నిలబడి...భయంతో కాదు...ఆవేదనతో...ఒక్క ప్రశ్న అడుగుతోంది. "ఆప్ హమే క్యూ మార్ రహే హై...?" "మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు...?" ఆమె గొంతులో...కోపం లేదు.ద్వేషం లేదు.ఉన్నదల్లా...ఒక సమాధానం కోసం ఎదురుచూస్తున్న...అసహాయత. మరో వీడియోలో...ఒక మహిళా కార్యకర్త...పోలీసుల వైపు తిరిగి...గట్టిగా ప్రశ్నిస్తోంది. "ఆప్ లడ్కియోంకే కప్డే క్యూ ఫాడ్ రహే హై...?" "అమ్మాయిల బట్టలు ఎందుకు చింపేస్తున్నారు...?" ఆ ప్రశ్న...ఒక పోలీసును కాదు.ఒక వ్యవస్థను నిలదీస్తోంది.    ఆ రోజు...ఢిల్లీ వీధుల్లో...కేవలం ఒక నిరసన జరగలేదు.ఒక ప్రశ్న...దేశమంతా వినిపించింది.ఆ ప్రశ్న...ప్రభుత్వాన్ని మాత్రమే కాదు...అందరినీ ఆలోచింపజేసింది. "ఈ యువత...కేవలం ఒక పరీక్ష కోసం పోరాడుతోందా...?లేక...తన భవిష్యత్తు కోసం పోరాడుతోందా...?" ఇంకో వీడియో...ఇంకా బాధాకరం.చుట్టూ...డజన్ల కొద్దీ పోలీసులు.మధ్యలో...ఒక్కడే యువకుడు.లాఠీలు...వర్షంలా కురుస్తున్నాయి.కానీ...అతను...వెనక్కి తగ్గలేదు.పైగా...పోలీసుల కళ్లలోకి...నేరుగా చూస్తూ...ఒకే మాట అంటున్నాడు. "మారో...ముఝే ఔర్ మారో...""ఇంకా కొట్టండి..." ఆ మాటలో...నొప్పి ఉంది.కానీ...భయం మాత్రం లేదు. ఇలా ఎంతో మంది యువతీ యువకులు గాయాల  పాలై రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి లో చేరారు... ఆ రోజు...అది ఒక ఆసుపత్రి మాత్రమే కాదు. ఆ నిరసన...ఎంత తీవ్రంగా అణచివేయబడిందో...చెప్పిన...మౌన సాక్షిగా నిలిచింది. ఈ యువత...కేవలం...నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ గురించే...రోడ్డు మీదికి వచ్చిందా...?" లేదు..."ఈ యువతను...కేవలం...ఒక పరీక్ష...రోడ్డు మీదికి తీసుకురాలేదు. ఏళ్లుగా...వారి మనసుల్లో పేరుకుపోయిన...నిరాశ...నిరుద్యోగం...చాలీచాలని జీతాలు...వ్యవస్థపై నమ్మకం కోల్పోవడం...ఇవన్నీ...ఒకేసారి...పేలిపోయాయి.  ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే .జంతర్ మంతర్‌కు వచ్చిన...చాలామంది యువతను...ఏ రాజకీయ పార్టీ...బస్సులు పెట్టి తీసుకురాలేదు. ఎవరూ...డబ్బులు ఇచ్చి పిలవలేదు.ఎవరూ...రైళ్లు ఏర్పాటు చేయలేదు. మరి ఎలా జరిగింది..? సోషల్ మీడియాలో...ఒక చర్చ మొదలైంది. ఆ చర్చ...ఒక పిలుపుగా మారింది.ఆ పిలుపు...వేల అడుగులుగా మారింది. దాని పేరే క్రాకోచ్..    కాక్రోచ్ దండు... ఒక్క బొద్దింకను...ఎవరైనా...సులభంగా తొక్కేయొచ్చు. కానీ...వేల బొద్దింకలు...ఒకేసారి...కదలడం మొదలుపెడితే...వాటిని...అంత సులభంగా...ఆపలేరు. ఈ ఉద్యమం కూడా...అలాంటిదే. ఇది...ఒక పార్టీ ఉద్యమం కంటే...ఒక తరం...తన భవిష్యత్తు గురించి...అడుగుతున్న ప్రశ్నగా...మారింది. కానీ...ఈ యువతను...ప్రభుత్వం...సరైన సమయంలో...అర్థం చేసుకుందా...? లేక... శాంతిభద్రతల సమస్యగా మాత్రమే...చూసిందా...? చాలామంది అనుకుంటున్నారు...ఇది...ఒక రాజకీయ పార్టీ ఉద్యమమని.కానీ...నేను చూసింది మాత్రం...అది కాదు.నాకు కనిపించింది...దిక్కుతోచని...ఒక తరం. జంతర్ మంతర్‌కు వచ్చిన...ఆ యువతను...ఒక్కసారి గమనించండి. దేశం నలుమూలల నుంచి...వేల మంది యువత...ఢిల్లీకి ఎలా వచ్చారు...? ఒకప్పుడు...మనుషులను..రోడ్ల మీదకు తీసుకొచ్చేది...రాజకీయ పార్టీలు.ఇప్పుడు...ఒక మొబైల్ ఫోన్...ఒక వీడియో...ఒక పోస్ట్...ఒక రీల్...చాలు.అదే...వేల అడుగులను...ఒకే దారిలో నడిపిస్తోంది. ఈ యువత...కేవలం...నీట్ ప్రశ్నపత్రం కోసం...రోడ్డు మీదకు వచ్చిందా...? నాకు మాత్రం...అలా అనిపించడం లేదు. ఇది...ఏళ్లుగా...వారి మనసుల్లో...నిశ్శబ్దంగా పేరుకుపోతున్న...నిరాశ. ఉద్యోగాల కోసం...ఎదురుచూస్తూ...అలసిపోయిన కళ్ల బాధ. చదివినా...భవిష్యత్తు కనిపించక...ఆగిపోయిన అడుగుల బాధ. చాలీచాలని జీతాలతో...కలలను...రోజూ కొంచెం కొంచెంగా...చంపుకుంటున్న...ఒక తరం బాధ. ఇవన్నీ...ఒకేసారి...బయటకు వచ్చాయి. ఈ తరం...గతాన్ని చూసి...రోడ్డెక్కలేదు.ఎమర్జెన్సీని... చూడలేదు.జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం...వాళ్లకు జ్ఞాపకం లేదు.మండల్...కమండల్...వాళ్ల రాజకీయ అనుభవంలో భాగం కాదు. వాళ్లు...చరిత్ర పుస్తకాలు చదివి...ప్రశ్నించడం లేదు.తమ జీవితాన్ని చూసి...ప్రశ్నిస్తున్నారు. అందుకే...ఈ తరాన్ని...తప్పు అని చెప్పలేం. రైట్ అని కూడా చెప్పలేం. వాళ్లు...ఒక సిద్ధాంతాన్ని కాదు...ఒక సమాధానాన్ని వెతుకుతున్నారు.వాళ్ల చేతుల్లో...జెండాల కంటే...మొబైల్ ఫోన్లు ఎక్కువ. వాళ్ల నోట...నినాదాల కంటే...ప్రశ్నలే ఎక్కువ.  ఒకప్పుడు...టెలివిజన్...ఏది చూపిస్తే...దేశం అదే చూసేది. ఇప్పుడు...దేశం...తన ఫోన్‌లో...తానే చూసేది నమ్ముతోంది. ఒక వీడియో...లక్షల మందికి చేరుతోంది. ఒక ప్రశ్న...కోట్ల మందిలో...ప్రతిధ్వనిస్తోంది. ఇప్పుడు...వార్తలు...ప్రజల దగ్గరకు వెళ్లడం లేదు.ప్రజలే...వార్తలుగా మారుతున్నారు. అలా...ఈ ఉద్యమం...ముందు...సోషల్ మీడియాలో పుట్టింది. తర్వాత...జంతర్ మంతర్‌కు చేరింది.చివరికి...పార్లమెంట్ గేటు వరకు...నడిచింది. ఈ ఉద్యమం...ఒక పార్టీ చేస్తున్న ఉద్యమంలా  కనిపించలేదు.సమాధానం కోసం...దేశాన్ని నిలదీస్తున్న...ఒక తరం లా కనిపించింది....అదే...ఇక్కడ...అత్యంత ప్రమాదకరమైన విషయం కూడా. ఎందుకంటే... ప్రశ్నలు అడగడం మొదలుపెట్టిన తరం...సమాధానం దొరికే వరకు...ఆగదు. కానీ...ప్రశ్న...ఇంకా మిగిలే ఉంది.ఈ యువత...రోడ్డు మీదికి వచ్చింది.ఆ తర్వాత...ఏమైంది...? మొదట...వాళ్లది...ఒక సాధారణ నిరసనగా చూశారు. తర్వాత...ఒక శాంతిభద్రతల సమస్యగా చూశారు.ఆ తర్వాత...లాఠీలతో...చెదరగొట్టాలని ప్రయత్నించారు.కానీ...ఒక విషయం...ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఒక మనిషిని...ఆపొచ్చు.వంద మందిని...భయపెట్టొచ్చు.కానీ...ఒక తరం...ప్రశ్నించడం మొదలుపెడితే...దాన్ని...లాఠీలతో ఆపలేం. బహుశా...అందుకేనేమో...ఇది...ముందు జరిగిన ఉద్యమాల్లా కాదు.వాళ్లు...ఎవరో చెప్పారని...నమ్మరు. చూసినదాన్ని...విన్నదాన్ని...తమంతట తామే...ప్రశ్నిస్తారు.సమాధానం...సంతృప్తికరంగా అనిపించకపోతే...మళ్లీ ప్రశ్నిస్తారు. ప్రతిపక్షాలు...తమ బాధ్యతను...ఎంతవరకు నిర్వర్తించాయి...? ప్రభుత్వం...ప్రజల ఆందోళనలను...ఎంతవరకు వినగలిగింది...?ఈ ప్రశ్నలకు...కాలమే సమాధానం చెబుతుంది.కానీ...ఒక విషయం మాత్రం...ఈ రోజు స్పష్టంగా కనిపిస్తోంది. రోడ్డు మీద నిలబడ్డ...ఆ యువత...కేవలం...ఈ రోజు గురించి మాట్లాడటం లేదు.రేపటి గురించి...మాట్లాడుతోంది.   ప్రజాస్వామ్యంలో...ప్రశ్న అడగడం...నేరం కాదు. ప్రశ్నను వినకుండా ఉండిపోవడమే...ప్రమాదం. అందుకే వాళ్ళు నిరసనను తీవ్రతరం చేసారు.  చరిత్ర...మనకు...ఒక విషయం నేర్పింది. మార్పు...ఎప్పుడూ...గొప్ప నాయకులతోనే...ప్రారంభం కాదు.కొన్నిసార్లు...ఒక చిన్న ప్రశ్నతో మొదలవుతుంది. ఆ ప్రశ్న...ఒక గొంతు నుంచి...వంద గొంతులకు...వేల గొంతులకు...చివరికి...ఒక దేశం గొంతుగా మారుతుంది. బహుశా...ఈరోజు...మనమూ...అలాంటి ఒక క్షణాన్నే...చూస్తున్నామేమో. నేను...మీరు...మనందరం...చరిత్రలో మరో పేజీ తిరుగుతున్న శబ్దాన్ని...వింటున్నామేమో.  చివరికీ ప్రతి ఉద్యమం...ఒకే కారణంతో పుట్టకపోవచ్చు. కానీ...ప్రతి ఉద్యమం వెనుక...ఒక అసంతృప్తి మాత్రం ఉంటుంది. యువత అసంతృప్తిని అర్థం చేసుకొని ప్రభుత్వం దానిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని ఆశిద్దాం...      Batons witnessed blood of  innocent, Jantarmantar, Agitation, Youth, Question, Nation, Future
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ఇటీవల కొంత కాలంగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్న వల్లభనేని వంశీ ఈ లేఖ ద్వారా తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నించారు.  ఆయన రాసిన లేఖలో   పోలవరం కుడి కాల్వ ద్వారా పట్టిసీమ నీటిని గన్నవరం   మెట్ట భూములకు   సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ మోటార్ల నిలిపివేత చర్యలను తక్షణమే సమీక్షించి ఉపసంహరించుకోవాలని  కోరారు. అయితే విశేషం ఏమిటంటే.. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు. ఆ లేఖలో గతంలో తాను గన్నవరం ఎమ్మెల్యేగా   కాలంలో అధికారుల నుంచి అనేక అభ్యంతరాలు వచ్చినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు చొరవతోనే  నిరాటంకంగా పట్టిసీమ నీటిని మెట్ట ప్రాంతాలకు అందించగలిగామని  పేర్కొన్నారు.   అంతే కాదు.. వైసీపీ వట్టి సీమ అంటూ విమర్శలు గుప్పించిన పట్టిసీమను ఆయన అత్యంత ప్రాధాన్యమైన ప్రాజెక్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు.  గన్నవరం ప్రాంత రైతాంగానికి పట్టిసీమ ద్వారా  అందుతున్న ప్రయోజనాలను వివరించారు.  2015లో పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించడం వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులకు ఎంతో మేలు చేకూరిందని పేర్కొన్నారు.  ఆ సమయంలో   తాను గన్నవరం నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఉన్న సంగతిని గుర్తు చేస్తూ..  పోలవరం కుడి కాల్వ పక్కనే ఉన్న మెట్ట ప్రాంత గ్రామాల రైతులకు కూడా పట్టిసీమ నీటిని వినియోగించుకునే సదవకాశాన్ని అప్పటి చంద్రబాబు సర్కార్ కల్పించిందని ప్రశంసలు గుప్పించారు.    Vallabhaneni Vamshi letter to CBN, Praises, Pattiseema, Babu, Vision
2024 ఎన్నికలలో  ఓటమి తరువాత నుంచీ వైసీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతున్న పరిస్థితి. ఈ పార్టీ నేతలు  చట్టపరమైన, న్యాయపరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వైసీపీకి చెందిన  కీలక నాయకులు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు, కార్యకర్తలపై  వరుసగా కేసులు నమోదవుతుండటంతో పార్టీ భవిష్యత్తుపై  నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అవకతవకలు, అన్యాయాలు, అక్రమాలు, కుంభకోణాలపై  విచారణలు ముమ్మరమయ్యాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది.  అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా  పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ  న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో పార్టీ ఉనికే నామమాత్రం అన్నట్లుగా వైసీపీ ప్రస్తుతం మిగిలింది.  వైసీపీయులపై  నమోదైన కేసుల తీరుతెన్నులను పరిశీలిస్తే, కేవలం ఉన్నత స్థాయి రాజకీయ నేతలే కాకుండా నియోజకవర్గ స్థాయిలో క్రియాశీలకంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు, సోషల్ మీడియా విభాగం సభ్యులు కూడా న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు.   ఈ  కేసులతో వైఎస్సార్‌సీపీ చట్టపరమైన రక్షణ కొరకు ప్రతి జిల్లాలోనూ, ఉన్నత న్యాయస్థానాలలోనూ పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విచారణాధికారుల ముందర హాజరుకావడం, ముందస్తు బెయిల్స్ కొరకు పిటిషన్లు దాఖలు చేయడం, పోలీసుల కస్టడీని ఎదుర్కోవడం వంటి పరిణామాలు పార్టీ రోజువారీ కార్యకలాపాలను, రాజకీయ పోరాటాలను నామమాత్రం చేసేశాయి. దీంతో పార్టీ సంస్థాగతంలో బలహీనపడింది.  క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించడానికి, ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ఉద్యమించడానికి పని చేసే నాయకులే వైసీపీలో కరవైయ్యారు. ఉన్న నేతల సమయం అంతా  లీగల్ వివాదాలలో కోర్టులు, న్యాయవాదుల చుట్టూ తిరగడానికే సరిపోతున్న పరిస్థితి.  కొన్ని జిల్లాల్లో నేతలు అరెస్టులకు భయపడి పార్టీ కార్యకలాపాలకు, రాజకీయాలకూ దూరంగా ఉంటున్నారు.  దీంతో పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేసే వారే కరవయ్యారు. ఈ పరిస్థితి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని సంసిద్ధం చేయాలని భావిస్తున్న జగన్ కు అడుగు ముందుకు పడకుండా చేస్తోంది.  దీంతో రాష్ట్రంలో వైసీపీ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   Ycp cadre in disarray, YSRCP Legal Troubles, YS Jagan Mohan Reddy, AP Politics,  , Legal Cases,  YCP Leaders
దేశవ్యాప్తంగా  విద్యార్థుల నిరసనలకు దారితీసిన నీట్   పరీక్షల నిర్వహణ వైఫల్యం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిందనడంలో సందేహం లేదు. పరీక్షా పత్రాల లీకేజీ, మూల్యాంకనంలో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై విద్యార్థులలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది.  అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో మోడీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకు వస్తున్నారన్న చర్చ మొదలైంది.    జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు నానాటికీ తీవ్రరూపం దాల్చుతున్నా,  ప్రధాని నరేంద్రమోడీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకు రావడానికి కారణమేంటన్న చర్చ జోరుగా సాగుతోంది.  ప్రధాన్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) లో సుదీర్ఘకాలం పనిచేసిన  నాయకుడు కావడం, ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనాయకత్వంతో ఆయనకున్నపటిష్ట సంబంధం అనుబంధం, అలాగే , పార్టీ పట్ల ఉన్న  విశ్వసనీయత ధర్మేంద్ర ప్రధాన్ కు రక్షణ కవచంగా మారాయని అంటున్నారు.  అదే విధంగా ఒడిశా రాష్ట్ర రాజకీయాల్లో బిజెపి సాధించిన చారిత్రాత్మక విజయాల్లో ధర్మేంద్ర ప్రధాన్ పాత్ర అత్యంత కీలకమైనది కావడంతో ఆయనను పక్కన పెట్టడానికి మోడీ వెనుకాడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అలాగే..  నిరసనకారుల  ఒత్తిడికి తలొగ్గి  ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయిస్తే.. ముందు ముందు ఇతర కేంద్ర మంత్రుల విషయంలో కూడా ఇటువంటి పరిస్థితే ఎదురు కావచ్చునని మోడీ భావిస్తున్నారని అంటున్నారు.    NEET exam controversy, Narendra Modi government, Jantar Mantar protests, BJP's Odisha politics, RSS links
ALSO ON TELUGUONE N E W S
నటీనటులు: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, అదిత్ అరుణ్, సిరి హనుమంత్, దీప, పి. వాసు సాంకేతిక వర్గం: రచన: సాయి రాజేష్, రవి నంబూరి సినిమాటోగ్రఫీ: డానియెల్ విశ్వాస్ ఎడిటింగ్: సంతోష్ నాయుడు సంగీతం: మణిశర్మ దర్శకత్వం: రవి నంబూరి నిర్మాతలు: సాయి రాజేష్, ఎస్.కె.ఎన్   వరుస ప్లాపుల తర్వాత కిరణ్ అబ్బవరం తన కథల ఎంపికలో చాలా జాగ్రత్త పడుతున్నాడు. కె ర్యాంప్ తర్వాత చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story) తో మళ్లీ మన ముందుకు వచ్చాడు. బేబీ (Baby) లాంటి మరో కల్ట్ లవ్ స్టోరీని అందిస్తామని మేకర్స్ ప్రామిస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా గురించి వివరంగా మాట్లాడుకుందాం. కథ: స్టీవెన్ శంకర్ (Kiran Abbavaram) ఒక అనాథ. సినిమాల్లో పెద్ద పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. అతను డిప్రెషన్ లో ఉండి, మద్యానికి బానిసైన నివేద అలియాస్ నివి (Sri Gouri Priya)ని కలుస్తాడు. ఆమె ప్రియుడు అరుణ్ (Adith Arun) పెళ్లి రోజున పెళ్లి పీటల మీద ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు, అందుకే ఆమె అందరికీ దూరంగా ఒంటరిగా ఉంటుంది. అమాయకుడైన, స్నేహపూర్వక మనస్తత్వం ఉన్న స్టీవెన్ మెల్లగా ఆమెను ఆకట్టుకుంటాడు. ఆమె అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కానీ అప్పుడే ఒక విషాదం చోటుచేసుకుంటుంది. పెళ్లి రోజున అసలు ఏమైంది? ఆ తర్వాత కథ ఎటు మలుపు తిరిగింది? అనేదే ఈ సినిమా ప్రధానాంశం. విశ్లేషణ: కిరణ్ అబ్బవరం కొన్ని సన్నివేశాల్లో బాగానే చేసినప్పటికీ, లోతైన భావోద్వేగాలను పలికించడంలో అతని పరిమితులు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని చోట్ల పేపర్ మీద ఉన్న సీన్ ను తెరపై ఎలివేట్ చేయలేకపోయాడు, అయితే కొన్ని సన్నివేశాల్లో మాత్రం బాగా చేశాడు. ఫస్టాఫ్ లో శ్రీ గౌరి ప్రియ అద్భుతంగా నటించింది, కానీ సెకండాఫ్ లోని కొన్ని క్లోజ్ అప్స్, సీన్స్ ఆమె నటనా తీవ్రతకు సరిపోలలేదు. మిగతా వారెవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. గతాన్ని మర్చిపోలేక, తమకు ముఖ్యమైన వారి జ్ఞాపకాలతోనే ఉండిపోవాలనుకునే ఆలోచన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే పాయింట్. కానీ సాయి రాజేష్ (Sai Rajesh) కథ, రవి నంబూరి (Ravi Namburii) స్క్రీన్ ప్లే ఒకటి రెండు చోట్ల మినహా పెద్దగా మెప్పించలేకపోయాయి. సన్నివేశాల్లో సహజత్వం లోపించింది. హీరో పాత్ర మరీ అంత అమాయకంగా ఉండటం చూస్తుంటే రియలిస్టిక్ గా అనిపించదు. హీరోయిన్ పాత్రను చాలా డెప్త్ గా రాసుకున్నారు కానీ, హీరో పాత్రలో ఆ డెప్త్ కనిపించదు. పాత కథలకే కొత్త డైలాగ్స్ రాసి తీసినట్లుగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల పది అడుగులు ముందుకు వేసినా, మరికొన్ని చోట్ల ముందుకు సాగకుండా ఆగిపోతుంది. మణిశర్మ (Mani Sharma) సంగీతం పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు, కానీ పాటలు పర్వాలేదనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, సౌండ్ డిజైన్ అండ్ మిక్సింగ్, మేకప్ డీసెంట్ గా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. సినిమాలోని అత్యంత కీలకమైన సన్నివేశాల్లో కావాల్సినంత డెప్త్ లేకపోవడంతో, సినిమా బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. మొత్తం మీద, చాలా లోపాలు ఉన్నప్పటికీ ఇది ఒక డీసెంట్ అటెంప్ట్.   ప్లస్ పాయింట్స్: శ్రీ గౌరి ప్రియ నటన ఫస్టాఫ్ లో కిరణ్ అబ్బవరం సన్నివేశాలు కొన్ని మంచి డైలాగ్స్   మైనస్ పాయింట్స్: సాగదీసినట్లున్న కథనం రొటీన్ గా అనిపించే సన్నివేశాలు దారి తప్పిన సెకండాఫ్ ముఖ్యమైన సన్నివేశాల్లో డెప్త్ లోపించడం   బాటమ్ లైన్: చెన్నై లవ్ స్టోరీ రొటీన్ కథని మరీ సాగదీసి చెప్పినట్టు అనిపిస్తుంది.    రేటింగ్: 2.5/5   డిస్క్లైమర్: ఈ రివ్యూలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు పూర్తిగా రచయిత వ్యక్తిగతమైనవి, దీనికి సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు. వీక్షకులు తమ సొంత విచక్షణను ఉపయోగించగలరు.  
Cast: Kiran Abbavaram, Sri Gouri Priya, Adith Arun, Siri Hanumanth, Deepa, P Vasu  Crew:  Written by Sai Rajesh, Ravi Namburii Cinematography by Daniel Viswas Editing by Santhosh Naidu  Music by Mani Sharma  Directed by Ravi Namburii Produced by Sai Rajesh, SKN    Kiran Abbavaram has been very careful with his choice of scripts after a string of flops. He is back after K Ramp with Chennai Love Story. The makers are promising another Baby kind of cult love story. Let's discuss about the film in detail.  Plot:  Steven Shankar (Kiran Abbavaram) is an orphan and he wants to make a big name in films. He meets Nivedha aka Nivi (Sri Gouri Priya) who is depressed and addicted to alcohol. Her love Arun (Adith Arun) left her at the alter on the marriage day and hence, she stays elusive. Steven being an innocent and friendly person, slowly impresses her. She wants to get married to him but tragedy strikes. What happened on the day of marriage? Where does the story go after that forms the crux of the plot.  Analysis:  Kiran Abbavaram is good in few portions but his limited skills when it comes expressing deep emotions is evident here. At places, he couldn't really elevate the scene on the paper while he did a good job in few. Sri Gouri Priya is excellent in the first hour but few close ups and scenes in second half doesn't match to her intensity. All others do not leave much of an impression.  The idea of someone unable to move on and their need to stay in presence of the significant other is a very relatable plot point. But Sai Rakesh's story and Ravi Namburii screenplay don't really shine beyond few places here and there. The sequences lack any sort of groundedness.  It feels superficial to see someone be too innocent as the character doesn't feel grounded. Leading lady's character is written with depth but similar depth is not seen in leading man's character. It feels like standard tropes being rehashed with New lines of dialogue. Screenplay at places jumps ten steps ahead and at places reaches a stagnation.  Mani Sharma's music lacks impact but songs are decent. Cinematography, production values, sound design and mixing, make up are decent enough. Editing could have been better. The most important portions of the film lack the depth that is needed to elevate the scene and hence, it feels like a film that drags too much. Overall, the movie ends being a decent attempt with too many flaws.  Positives:  Sri Gouri Priya performance  Kiran Abbavaram scenes in first hour  Few good dialogues  Negatives:  Draggy Narrative  Very cliched sequences  Derailed second half  Lack of depth in important scenes    Bottomline:  Chennai Love Story suffers from predictability and indulgence.    Rating: 2.5/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన సరికొత్త సామాజిక కథా చిత్రం 'ది ఇండియా స్టోరీ'. సినీ ప్రియులు, కాజల్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల విషయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ చిత్రం జూలై 24న థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో సెన్సార్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల తాత్కాలికంగా నిలిచిపోయినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. హిందీ వెర్షన్ మాత్రం అనుకున్న తేదీకే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సమాజంలో తీవ్ర చర్చకు దారితీసే ఒక అత్యంత కీలకమైన సామాజిక అంశాన్ని నేపధ్యంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. ముఖ్యంగా మన దేశంలో వ్యవసాయ రంగంలో విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న రసాయనాల వల్ల ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి తీవ్ర ప్రభావం పడుతోంది అనే చేదు నిజాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆహార భద్రత, పర్యావరణ సమతుల్యత, ప్రజారోగ్యం చుట్టూ తిరిగే ఈ కథాంశం ప్రేక్షకులలో ఆలోచన రేకెత్తించేలా ఉంటుందని మేకర్స్ మొదటినుంచీ చెబుతున్నారు. ఈ సందేశాత్మక చిత్రంలో కాజల్ అగర్వాల్ ఒక పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించి మెప్పించబోతున్నారు. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు జీ స్టూడియోస్, ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తుండగా, సాగర్ బి.షిండే ఎంతో నిర్మించారు.  అయితే డబ్బింగ్ వెర్షన్లకు సంబంధించిన సెన్సార్ క్లియరెన్స్ ప్రక్రియ అనుకున్న సమయానికి పూర్తికాకపోవడమే ఈ హఠాత్ వాయిదాకు కారణమని తెలుస్తోంది. త్వరలోనే సెన్సార్ పూర్తి చేసుకుని తెలుగు, తమిళ భాషల్లో కొత్త విడుదల తేదీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.     Kajal Aggarwal, The India Story, Postponed  
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు ఆస్తి వేలం వివాదంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ షేక్‌పేట ప్రాంతంలో ఉన్న ఆస్తిని బ్యాంక్ వేలం వేయడాన్ని సవాలు చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తాజాగా తిరస్కరించింది. దీంతో ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పే యథాతథంగా అమల్లో ఉండనుంది. ఈ వివాదానికి ప్రధాన మూలం శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ లిమిటెడ్‌కు సంబంధించిన బ్యాంక్ రుణాలు. ఆ సంస్థ తీసుకున్న రుణాలకు బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు హామీదారులుగా వ్యవహరించారు. అయితే కాలక్రమేణా సదరు సంస్థ రుణ బకాయిలను సక్రమంగా చెల్లించకపోవడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. సర్ఫేసీ (SARFAESI) చట్టం కింద 2019వ సంవత్సరంలోనే బ్యాంక్ అధికారులు హామీదారుల ఆస్తిని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2022లో నిర్వహించిన బహిరంగ వేలంలో ఈ ఆస్తిని సుమారు రూ. 8.51 కోట్లకు యూనియన్ బ్యాంక్ విక్రయించింది. బ్యాంక్ జరిపిన ఈ వేలం ప్రక్రియను సవాలు చేస్తూ బండ్ల గణేష్ డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT)ను ఆశ్రయించారు. విచారణ జరిపిన డీఆర్టీ మొదట బ్యాంక్ చేపట్టిన వేలాన్ని రద్దు చేస్తూ బండ్ల గణేష్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ యూనియన్ బ్యాంక్ ఈ తీర్పును తెలంగాణ హైకోర్టులో సవాలు చేసింది. విచారణ సమయంలో బండ్ల గణేష్ తరఫు న్యాయవాదులు వాదిస్తూ, సదరు కంపెనీపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో దివాళా పరిష్కార ప్రక్రియ (Insolvency) కొనసాగుతున్నందున వేలం ఎంతమాత్రం చెల్లదని పేర్కొన్నారు. అయితే బ్యాంక్ తరఫు లాయర్లు మాత్రం వేలం వేసిన ఆస్తి కంపెనీది కాదని, రుణాలకు వ్యక్తిగత హామీ ఇచ్చిన వ్యక్తుల సొంత ఆస్తి అని, కాబట్టి సర్ఫేసీ చట్టం ప్రకారం బ్యాంక్ చర్యలు పూర్తిగా చట్టబద్ధమేనని గట్టిగా వాదించారు. హైకోర్టు బ్యాంక్ వాదనతో ఏకీభవించి డీఆర్టీ తీర్పును రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.  ఈ పరిణామంతో తన ఆస్తులన్నీ పోయాయంటూ వస్తున్న పుకార్లపై బండ్ల గణేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరణ ఇచ్చారు. "కొందరు నా మొత్తం ఆస్తి పోయిందని అపోహ పడుతున్నారు, అది పూర్తిగా అవాస్తవం. ఈ కేసు కేవలం షేక్‌పేటలోని అపర్ణా సినార్ వ్యాలీలో ఉన్న 500 గజాల ఒక్క ప్రాపర్టీకి మాత్రమే పరిమితమైనది. 2022లో రూ. 8.51 కోట్లకు యూనియన్ బ్యాంక్ అమ్మిన ఆ ఒక్క ఆస్తి విక్రయాన్నే నేను చట్టపరంగా ప్రశ్నించాను" అని స్పష్టం చేశారు.  అంతేకాకుండా, సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తుది తీర్పును తాను సంపూర్ణంగా గౌరవిస్తున్నానని, భారతీయ న్యాయవ్యవస్థపై తనకు పరిపూర్ణ విశ్వాసం ఉందని బండ్ల గణేష్ పేర్కొన్నారు.     Bandla Ganesh, Property Auction, Supreme Court, Verdict  
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఇళయ దళపతి విజయ్(Vijay).. సౌత్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తమదైన ఆధిపత్యం చెలాయించే హీరోలు. కట్ అవుట్ కనపడితే చాలు కోట్లు కురవాల్సిందే. అభిమాన ఘనానికైతే లెక్కే లేదు.ఇప్పుడు ఈ ఇద్దరు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. పవన్ నుంచి గత ఏడాది వచ్చిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'ఓజీ' (OG) థియేటర్లలో సాధించిన సంచలన ఓపెనింగ్స్ అందరినీ విస్తుపోయేలా చేశాయి.వరల్డ్ వైడ్ గా మొదటి రోజూ 154 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్ టైమ్ టాప్ 10 ఇండియన్ ఓపినింగ్ కలెక్షన్స్   జాబితాలో నిలిచింది. నార్త్ అమెరికా ప్రీమియర్ల ద్వారానే ఏకంగా $3.13 మిలియన్ల కంటే ఎక్కువ రాబట్టడం పవన్ కళ్యాణ్ మాస్ స్టామినాకి నిదర్శనం. ఇండియా వైడ్ గా  90 కోట్లకి  పైగా నెట్ వసూళ్లు సాధించి సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో   ఒకటిగా రికార్డు పుటలకెక్కింది.  Also read: జననాయకుడు vs చెన్నై లవ్ స్టోరీ.. తెలుగు ప్రేక్షకులు ఆ వైపే ఎందుకు! విజయ్ స్టిల్ జన నాయగన్(జననాయకుడు) తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. దీంతో మొదటి రోజు  'ఓజీ' నెలకొల్పిన  154 కోట్ల ప్రపంచవ్యాప్త వసూళ్ల మార్కుని  'జన నాయగన్' దాటగలదా లేదా?అనే చర్చలు మొదలయ్యాయి. మూవీ అయితే కొన్ని ఏరియాస్ లో డిజాస్టర్, కొన్ని ఏరియాల్లో పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.ట్రేడ్ వర్గాల ముందస్తు అంచనాల ప్రకారం 'జన నాయగన్' తమిళనాడు, కేరళ, కర్ణాటక ఓవర్సీస్ మార్కెట్లలో రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్‌ నమోదు చేసింది. దీంతో తొలిరోజే గ్లోబల్‌గా 100 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ 'ఓజీ' నెలకొల్పిన రూ. 154 కోట్ల రికార్డును అందుకోవాలంటే 'జన నాయగన్' తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా మార్కెట్‌లో ఊహించని రేంజ్‌లో రాణించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏపీ, తెలంగాణ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, ఓవర్సీస్ ప్రీమియర్స్‌లో భారీ వసూళ్లు రాబడితే 'ఓజీ' రికార్డు ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. కానీ ఆ ప్రమాదం లేదనే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. og, pawan kalyan, vijaythalapathy, vijay, jana nayagan  
  ఈ రోజు థియేటర్లలో తిష్ట వేసిన దళపతి విజయ్(Vijay)వన్ మాన్ షో 'జననాయకుడు'కి ఆశించిన స్థాయిలో టాక్ రావడం లేదు. గాడ్ ఆఫ్ మాసెస్  బాలకృష్ణ వన్ మాన్ షో సూపర్ హిట్ చిత్రం 'భగవంత్ కేసరి'నే మళ్ళీ తెరకెక్కించడంతో మన దగ్గర వర్క్ అవుట్ కాదని, తమిళనాడులో వర్క్ అవుట్ అవుతుందనే అభిప్రాయాన్ని కొంత మంది సినీ విశ్లేషకులు చెప్తున్నారు.  దీంతో ఇప్పుడు 'చెన్నై లవ్ స్టోరీ' కి అనూహ్యమైన ప్లస్ పాయింట్‌గా మారింది. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా చేయగా 'బేబీ', 'కలర్ ఫోటో' చిత్రాల దిగ్గజ నిర్మాత సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వయంగా నిర్మించారు. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ లభించింది. సెన్సార్ బోర్డు నుంచి ఎటువంటి కట్స్ లేకుండా,పూర్తి పాజిటివ్ వైబ్స్‌తో థియేటర్లలోకి అడుగుపెడుతోంది. సరిగ్గా ఈ సమయంలో పెద్ద సినిమా అయిన 'జన నాయకుడు' కి ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో, యూత్‌ఫుల్ కంటెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులు, లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాలని ఆదరించే సినీ ప్రియులు ఇప్పుడు 'చెన్నై లవ్ స్టోరీ' థియేటర్స్ కి పోటెత్తుతారని అంటున్నారు. Also read: 'జననాయగన్' కి విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇంతేనా!..మరి మిగతా వాళ్ళకి  దీంతో పేయిడ్ ప్రీమియర్లపై మేకర్స్ పెట్టిన నమ్మకం నూటికి నూరు శాతం నిజమవుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం పోటీలో ఇతర పెద్ద సినిమాలేవీ లేకపోవడం, జన నాయకుడు ప్రభావం తగ్గడం మూలంగా ఈ వారం ఆడియెన్స్ కి 'చెన్నై లవ్ స్టోరీ' ఒకే ఒక్క బెస్ట్ ఛాయిస్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సపోర్ట్ ఇవ్వడం, మణిశర్మ అందించిన అద్భుతమైన మెలోడీలు సినిమాకి మరింత హైప్ తీసుకువచ్చాయి. 'చెన్నై లవ్ స్టోరీ' కనుక ప్రేక్షకుల హృదయాలని తాకితే, ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ హిట్‌గా నిలవడం ఖాయం. కాకపోతే కంటెంట్ బాగుంటేనే సదరు విజయం లాభాలు ఇచ్చే దాకా వెళ్ళిపోని అతిధిగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. vijay, jana nayakudu, chennai love story, kiran abbavaram
పాన్ ఇండియా సూపర్‌స్టార్ యష్ 'కెజిఎఫ్' ఫ్రాంచైజీతో బాక్సాఫీస్ వద్ద నెలకొల్పిన సంచలనం అందరికీ తెలిసిందే. ఆ బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ బిగ్ బడ్జెట్ మూవీ 'టాక్సిక్'. ఈ చిత్రానికి 'ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (A Fairy Tale for Grown-Ups) అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్‌ను ఖరారు చేశారు. టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి ప్రముఖ తారలు అత్యంత కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేశాయి. అయితే ఈ సినిమా కంటెంట్, కథాంశం గురించి సోషల్ మీడియాలో నిరంతరం రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే 'టాక్సిక్' సినిమా ఎలాంటి కేటగిరీకి చెందుతుందనే దానిపై నిర్మాత వెంకట్ కె. నారాయణ్ పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చారు. ఇటీవల 'జన నాయగన్' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో నిర్మాత కీలక విషయాలను వెల్లడించారు. 'టాక్సిక్' చిత్రం కేవలం పెద్దలకు మాత్రమే (Only for Grown-Ups) అని ఆయన బహిరంగంగా స్పష్టం చేశారు. మేము ఈ విషయాన్ని ఎక్కడా దాచలేదని, సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ రోజే 'ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' అని స్పష్టమైన ట్యాగ్ లైన్ ద్వారా ప్రేక్షకులకు ముందే క్లారిటీ ఇచ్చామని గుర్తుచేశారు. సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌ను గమనిస్తే ఈ విషయం ఎవరికైనా సులభంగా అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో పాటు కాస్త ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు, బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. టీజర్‌లో చూపించిన కార్ సీన్, 'తబాహీ' పాటలో యష్, కియారా అద్వానీ మధ్య వచ్చే కెమిస్ట్రీ, అలాగే 'మనసాగదే' మెలోడీ సాంగ్‌లో యష్, తారా సుతారియా కనిపించిన బాత్‌టబ్ సీన్ నెటిజన్లలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అంతేకాకుండా పోస్టర్లలో నయనతార సిగరెట్ తాగుతూ కనిపించిన తీరు సినిమాలోని బోల్డ్ అండ్ రా ఎలిమెంట్స్‌కు నిదర్శనంగా నిలిచింది. సినిమా ప్రమోషన్ల వ్యూహం గురించి నిర్మాత మాట్లాడూతూ, ఇప్పటివరకు మొత్తం 3 విభిన్నమైన టీజర్లు, 2 అదిరిపోయే పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. మొదటి టీజర్ ద్వారా కథలోని మేకింగ్ క్రియేటివిటీని చూపించగా, రెండో టీజర్‌తో సినిమా యొక్క భారీ స్కేల్, విజువల్స్ స్థాయిని పరిచయం చేశామన్నారు. ఇక మూడో టీజర్‌లో సినిమాలో నటించిన పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్లను రివీల్ చేశామని చెప్పారు. ప్రత్యేకంగా ఆయా ఏజ్ గ్రూప్ ప్రేక్షకులకు తగ్గట్టుగానే ఈ చిత్రంలో ప్రెజెంటేషన్, క్యారెక్టర్ స్టైలింగ్ డిజైన్ చేసినట్లు వెల్లడించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ్, హీరో యష్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒరిజినల్‌గా కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళంతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కథనం, మేకింగ్ పరంగా సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా రూపొందుతున్న ఈ డార్క్ ఏ-సర్టిఫైడ్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.     Yash, Toxic Movie, Toxic A Fairy Tale for Grown Ups
  వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ దగ్గర జన నాయగన్(జన నాయకుడు) జోరు చూస్తుంటే తొలి రోజు హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధిస్తుందేమో అనిపిస్తుంది. తమిళనాడులో మెజారిటీ రివ్యూస్ మూవీ పర్లేదని చెప్తున్నా తెలుగు రివ్యూస్ మాత్రం కొంచం నెగిటివ్ గా వస్తున్నాయి. ఇందుకు కారణం బాలకృష్ణ వన్ మాన్ షో భగవంత్ కేసరి కథతోనే జన నాయకుడు తెరకెక్కడం. కాకపోతే విజయ్ నటనకి మాత్రం మంచి పేరు వస్తుంది. జన నాయగన్ కోసం   విజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు తీసుకున్న రెమ్యూనరేషన్లు ఇవే అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.  విజయ్(Vijay)220 కోట్ల నుండి 250  కోట్ల వరకు భారీ పారితోషికాన్ని అందుకున్నట్లు టాక్. మరి ఇదే నిజమైతే  భారతదేశ సినీ చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్న అతికొద్దిమంది అగ్ర కథానాయకులలో విజయ్ అగ్రస్థానంలోనిలిచినట్టే. పూజా హెగ్డే  6 కోట్లు. విలన్ గా చేసిన బాబీ డియోల్ 5 కోట్లు, ప్రకాష్ రాజ్ 5 కోట్లు ప్రియమణి 3 కోట్లు గౌతమ్ వాసుదేవ్ మీనన్  3 కోట్లు, నరేన్ 2.5 కోట్లు పారితోషికం పొందినట్లు సమాచారం.  మమితా బైజూ 1 కోటి వరకు తీసుకున్నారని చెప్తున్నారు.   also read: జననాయగన్ ని త్రిష ఏ థియేటర్ లో చూసిందంటే.. అక్కడే ఎందుకు! తెర వెనక ఉన్న వారి విషయానికి వస్తే దర్శకుడు హెచ్. వినోత్ తన కెరీర్‌లోనే అత్యధికంగా 25 కోట్ల రెమ్యూనరేషన్ పొంది రికార్డు సృష్టించాడని చెప్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్  అనిరుధ్ రవిచందర్ 13 కోట్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ భారీ వ్యయానికి తగ్గట్టే 'జన నాయగన్' బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ లో ఊచకోత కోసింది. భారతదేశంలో ఇప్పటికే దాదాపు రూ. 20 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ సాధించగా, ఓవర్సీస్ లో ప్రి సేల్స్  15 కోట్లు దాటాయి. తొలిరోజే ఇండియాలో . 60 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా  90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని, తొలి వీకెండ్ నాటికి ఇండియాలో 150-180 కోట్లు, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 250 కోట్ల మైలురాయిని చేరుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ మునుపటి ఇండస్ట్రీ హిట్స్ అయిన 'లియో' (. 606 కోట్లు), 'గోట్ (GOAT)' (. 458 కోట్లు) రికార్డులను తిరగరాస్తూ 'జన నాయగన్' సరికొత్త చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాలి! jana nayagan, jana nayakudu, vijay, pooja hegde, h vinoth, mamitha baiju
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన సరికొత్త ప్రేమకథా చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. 'కలర్ ఫోటో', 'బేబీ' వంటి సంచలన విజయాల తర్వాత నిర్మాతలు ఎస్కేఎన్, సాయి రాజేష్ అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మించారు. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం, ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచేశాయి.  డిఫరెంట్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 24న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం బిజినెస్ పరంగా ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రాన్ని సుమారు రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. మేకర్స్ అనుసరించిన పక్కా ప్రమోషనల్ స్ట్రాటజీ, పాటలకు లభించిన ఆదరణ కారణంగా ఈ సినిమాకు బిజినెస్ వర్గాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెటింది.  ఈ చిత్రం సాధించిన నాన్ థియేట్రికల్ బిజినెస్ వివరాల్లోకి వెళితే, ఓటీటీ డిజిటల్ రైట్స్ ద్వారా ఏకంగా రూ.15 కోట్ల మేర భారీ ఆఫర్ దక్కగా, ఆడియో రైట్స్ రూపంలో మరో రూ.5 కోట్లు సమకూరాయి. అంటే కేవలం నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారానే మేకర్స్‌కు మొత్తంగా రూ.20 కోట్ల ఆదాయం లభించింది.  ఇక వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ కూడా రూ.15 కోట్ల మేర జరిగిందని తెలుస్తోంది. ఈ లెక్కన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.35 కోట్లకు చేరుకుని, నిర్మాతలు విడుదల కంటే ముందే సుమారు రూ.20 కోట్ల భారీ ప్రాఫిట్ జోన్‌లోకి అడుగుపెట్టేలా చేసింది. థియేట్రికల్ బిజినెస్ రూ.15 కోట్లుగా నమోదవడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ.15 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంటుంది. పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ నాటికే ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమించి క్లీన్ హిట్ సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.     Kiran Abbavaram, Chennai Love Story, Business, Box Office  
డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ప్రతి వారం కొత్త రకం చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్, డ్రామా జోనర్లకు ఓటీటీ వేదికలపై విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు అదే తరహాలో తమిళ చిత్రసీమ నుంచి వచ్చి థియేటర్లలో ప్రేక్షకులను మైమరిపించిన ఒక విభిన్నమైన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఆ సినిమా పేరు 'ఈగో రామన్'. తమిళంలో మంచి సస్పెన్స్, ఎమోషనల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూలై 24, 2026 నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుండటంతో ఓటీటీ ప్రియులలో, థ్రిల్లర్ ప్రేమికులలో భారీ ఆసక్తి నెలకొంది. దర్శకుడు గణేషన్ నాచిముత్తు దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'ఈగో రామన్' చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ సిబి చంద్రన్ కథానాయకుడిగా అద్భుతమైన నటనను కనబరిచారు. ఆయనతో పాటు ప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్, చేరన్ రాజ్ మరియు కీర్తన శ్రీకుమార్ ముఖ్య పాత్రలలో నటించి మెప్పించారు. ఈ కథంతా 'అరివు' అనే ఒక మధ్యతరగతి యువకుడి చుట్టూ తిరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే బలమైన సంకల్పంతో టిఎన్‌పిఎస్సి (TNPSC) పరీక్షలకు సిద్ధమవుతున్న అరివుకు, అతని తల్లి ఎంతో ప్రేమతో ఒక యామహా బైక్‌ను కానుకగా ఇస్తుంది. ఆ బైక్ అరివు జీవితంలో కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, అతని ఆశయానికి మరియు అమ్మ ప్రేమకు నిదర్శనంగా మారుతుంది. అయితే ఊహించని విధంగా వారి కుటుంబం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ బైక్‌ను కోల్పోవాల్సి వస్తుంది. తన ప్రాణంగా భావించే బైక్‌ను ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని అరివు చేసే తీవ్ర ప్రయత్నాలే ఈ కథకు ప్రధాన మలుపు. బైక్ వేటలో సాగే అరివు ప్రయాణం అనుకోకుండా ఒక ప్రమాదకరమైన హంతకుడితో ముడిపడుతుంది. మరోవైపు, తనకు మార్గదర్శకుడిగా ఉన్న గురువుతో తలెత్తే ఇగో సంఘర్షణలు, అహంకారపూరిత సవాళ్లు అరివు జీవితాన్ని మరింత సంక్లిష్టం చేస్తాయి. ఒక సాధారణ యువకుడు తన ఆత్మగౌరవాన్ని, ఆశయాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం, ఈ క్రమంలో వచ్చే ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులకు ఉత్కంఠను పంచుతాయి. సినిమాలోని నిర్మాణ విలువలు, పాత్రల మధ్య సాగే మానసిక ఘర్షణ, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. దాదాపు 2 గంటల పాటు సాగే ఈ ఉత్కంఠభరిత ప్రయాణం ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్న ఈ సైకలాజికల్ డ్రామా, ఓటీటీలో సైతం విశేషమైన వ్యూవర్‌షిప్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జూలై 24, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న 'ఈగో రామన్' చిత్రాన్ని మీ ఓటీటీ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవడం అస్సలు మర్చిపోకండి.
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది. అయితే.. విజయం సాధించడానికి కష్టపడితే సరిపోతుందని  తెలివి ఉంటే చాలని అనుకుంటారు అందరూ. కానీ విజయం సాధించడానికి తెలివి తేటలు, కష్టపడే తత్వం ఉన్నా.. కొన్ని అలవాట్లు మాత్రం వారికి విజయాన్ని దూరంగానే ఉంచుతాయి.  కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడని సాక్షత్తు ఆచార్య చాణక్యుడే చెబుతాడు.  ఒక వ్యక్తిని విజయం సాధించకుండా చేసే ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. సోమరితనం.. కష్టపడే వ్యక్తులలో సోమరితనం ఉంటుందా అని చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం.. కష్టపడే వ్యక్తులలో ఎంతో కొంత సోమరితనం కనిపిస్తూ ఉంటుంది.  అయితే ఏదో ఒక సందర్బంలో ఈ సోమరితనం వారిని దెబ్బతీస్తుంది.  కీలకమైన సందర్బంలో ఏ విషయాన్ని అయినా లైట్ తీసుకుంటే లేదా పనిని నిర్లక్ష్యం చేస్తే.. చేతుల దాకా వచ్చిన విజయం కూడా చేజారిపోతుంది.  అందుకే.. ఏ కొద్దిపాటి సోమరితనం ఉన్నా,  దాన్ని వదిలిపెట్టడం మంచిది. పట్టుదల.. పట్టుదల ఏ పనిలో అయినా ముందుకు సాగడానికి,  పనిని పూర్తీ చేయడానికి ప్రేరణ ఇస్తుంది. కానీ చాలామంది ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు చాలా సీరియస్ గా ప్రారంభించి కష్టపడతారు.. ఆ తరువాత మాత్రం తమ పట్టుదలను తగ్గిస్తారు.  దీని వల్ల దక్కాల్సిన విజయం చెయ్యి జారిపోతుంది. ప్రవర్తన.. మనిషి ప్రవర్తన కూడా వారు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. చాలామంది ఇతరులతో అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులను చుట్టుప్రక్కల వారు, సమాజం ఎప్పటికీ ఇష్టపడదు, వారికి గౌరవం ఇవ్వదు,  వారు చేసే పనులలో తోడ్పాటు, వారు చేసే పనులకు గౌరవం కూడా ఇవ్వదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు తమ పనుల విషయంలో కూడా నెగెటివ్ ఫలితాలు పొందుతారు.                                   *రూపశ్రీ.
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది. ఒకప్పుడు కేవలం పండుగలు,  పెళ్లిళ్లు, శుభకార్యాలు వంటి సమయాల్లో మాత్రమే ధరించినప్పటికీ, నేటికాలంలో మహిళలు ఆఫీస్, పార్టీలు, పండుగలు, నార్మల్ టూర్స్ వంటి వాటికి కూడా సల్వార్ సూట్ లు ధరించడానికి ఇష్టపడతారు.  అయితే ఇప్పట్లో సల్వార్ సూట్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ లోకి మారింది. నేటికాలంలో మరింత ఫ్యాషన్ గా ఉన్న దుస్తులు రావడంతో సల్వార్ సూట్ కూడా సాధారణ దుస్తుల్లా మారిపోయింది.  కానీ సల్వార్ సూట్ ను కూడా ఫ్యాషన్ గా ధరిస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండొచ్చు.  అందుకోసం సల్వార్ సూట్ ను ఎలా ధరించాలి?  తెలుసుకుంటే.. సల్వార్ సూట్ స్టైల్ గా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు.. సరైన ఫిట్టింగ్..  సరైన ఫిట్‌తో సూట్‌ను ఎంచుకోండి. సల్వార్ సూట్ స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా కనిపించాలంటే, దాని ఫిట్టింగ్‌పై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. చక్కగా సరిపోయే సూట్  చక్కగా కనిపించేలా చేస్తుంది, అలాగే చాలా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.  మరీ వదులుగా ఉండే సూట్ ధరించడం వల్ల దుస్తుల షేప్  పాడవుతుంది, అదే సమయంలో మరీ బిగుతుగా ఉండే సూట్ ఎబ్బెట్టుగా కనిపించేలా చేస్తుంది. అందుకే ఫిట్టింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుప్పట్టా.. సల్వార్ సూట్‌లో దుపట్టా చాలా ముఖ్యమైనది.  ఇది మొత్తం రూపాన్ని డిఫరెంట్ గా మార్చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. అంతేకాదు.. దుపట్టాను ధరించే విధానాన్ని మార్చడం ద్వారా ఒకే సూట్‌ను చాలా విధాలుగా దరించవచ్చు. దుప్పట్టాను  ఒక భుజంపై ఓపెన్ గా  వేసుకోవచ్చు, ముందు వైపు కుచ్చులతో ధరించవచ్చు, లేదా బెల్ట్‌తో కొత్త టచ్ ఇవ్వవచ్చు.   ఫ్యాషన్ జ్యువెలరీ.. సరైన జ్యువెలరీ  సాధారణ సల్వార్ సూట్‌ను కూడా స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా మార్చగలవు.  సూట్ సింపుల్‌గా ఉంటే, ఆక్సిడైజ్డ్ చెవిపోగులు, చాంద్‌బాలీలు, ఒక స్టేట్‌మెంట్ నెక్లెస్ లేదా రంగురంగుల బ్రాస్‌లెట్‌లు ధరించి  లుక్‌ను మరింత మెరుగుపరుచుకోవచ్చు. అయితే, భారీ వర్క్  ఉన్న సూట్‌తో సింపుల్ ఆభరణాలు మరింత హుందాగా కనిపిస్తాయి. ఆభరణాలను ఎంచుకునేటప్పుడు, బాలెన్స్డ్  లుక్ కోసం సూట్  రంగు , డిజైన్‌ను పరిగణలోకి తీసుకోవాలి. .పాదరక్షలు.. సల్వార్ సూట్‌కు సరైన పాదరక్షలను ఎంచుకోవడం  మొత్తం రూపాన్ని మార్చేస్తుంది. సాంప్రదాయ రూపానికి, ఎత్నిక్ జుట్టీలు, కొల్హాపురి చెప్పులు , శాండల్స్ మంచి ఎంపికలు.  పార్టీకి లేదా ప్రత్యేక సందర్భానికి సూట్ ధరిస్తుంటే, లైట్ హీల్స్ మరింత అందాన్ని ఇస్తాయి.  హెయిర్ స్టైల్, మేకప్.. సరైన హెయిర్‌స్టైల్ , మేకప్ సల్వార్ సూట్‌తో  రూపాన్ని మరింత మెరుగుపరుస్తాయి. సాంప్రదాయ దుస్తులతో, లూజ్ హెయిర్ స్టైల్ కు స్మూత్  కర్ల్స్, లో బన్, గజ్రా స్టైల్ లేదా సైడ్ బ్రెయిడ్ వంటివి బాగుంటాయి. హెవీ మేకప్ లుక్ కంటే లైట్ గా , సహజమైన మేకప్ మరింత హుందాగా కనిపిస్తుంది.  డ్రెస్ రంగుకు అనుగుణంగా   లిప్ కలర్, ఐ మేకప్ , బిందీని సెలెక్ట్ చేసుకోవచ్చు.                                           *రూపశ్రీ.  
అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 20న జరుపుకుంటారు . చెస్ అనేది మెదడును ఎక్కువగా ఉపయోగించే ఆట. అందువల్ల, చెస్ ఆడటం పిల్లల మేధస్సును పదును పెడుతుందని చాలా మంది చెబుతుంటారు. చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆలోచనా, గ్రహణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి పిల్లలతో చెస్ ఆడించాలని అనుకుంటారు. కానీ కేవలం చెస్ ఆడటం మాత్రమే మేధస్సును పదును పెడుతుందా? దీనిపై వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుంటే.. ఆలోచించే అలవాటు.. చదరంగం ఆడేటప్పుడు పిల్లలు ప్రతి ఎత్తును జాగ్రత్తగా పరిశీలించాలి,.  ప్రత్యర్థి ఎలాంటి ఎత్తు వేస్తాడు అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి,  ఇది పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే బదులు ముందుగా ఆలోచించేలా ప్రోత్సహిస్తుంది. క్రమంగా, వారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే అలవాటును పెంపొందించుకోగలుగుతారు. ఏకాగ్రత.. చదరంగం ఆడుతున్నప్పుడు పిల్లల పూర్తి ఏకాగ్రత ఆటపైనే ఉంటుంది. వారి ఏకాగ్రత ఒక్క క్షణం తగ్గినా,  లేదా డిస్టర్బ్ అయినా  వారు ఆటను ఓడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల, ఈ ఆట పిల్లల ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకే చెస్ ఆడేటప్పుడు పిల్లలు ఏకాగ్రతగా ఉండటం వారి చదువులకు, ఇతర ముఖ్యమైన పనులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. జ్ఞాపకశక్తి.. చెస్ ఆడేటప్పుడు పిల్లలు అనేక ఎత్తులు, నియమాలు , చెస్ ఆడే ఇతర  పద్ధతులను గుర్తుంచుకోవలసి ఉంటుంది. దీనివల్ల వారి మెదడు నిరంతరం చురుకుగా ఉంటుంది. వైద్యుల ప్రకారం, ఇది వారి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది , కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తిని కూడా పెంచుతుంది. సహనం.. చెస్ అనేది తొందరపడి ఆడే ఆట కాదు. ప్రతి ఎత్తుగడకు జాగ్రత్తగా ఆలోచన అవసరం. కొన్నిసార్లు, గెలవడానికి చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఇది పిల్లలకు సహనాన్ని నేర్పి, వాస్తవిక దృక్పథంతో నిర్ణయాలు తీసుకునే అలవాటును పెంపొందించడంలో సహాయపడుతుంది. పాఠాలు.. చెస్ అనే కాదు.. ఏ ఆటలో అయినా సరే.. ఎల్లప్పుడూ గెలవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఓడిపోతాం. కానీ ఓటమి పిల్లలు తమ తప్పులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని వైద్యులు చెబుతారు. ఇది తర్వాతిసారి మరింత మెరుగ్గా ఆడేందుకు వారిని ప్రోత్సహిస్తుంది. ఈ అలవాటు వారి చదువులో , ఇతర జీవిత పనులలో కూడా సహాయపడుతుంది. చెస్ మాత్రమే కాదు.. కేవలం చెస్  ఆడటం వల్ల మాత్రమే పిల్లల మెదడు పదునుదేరదని వైద్యులు చెబుతున్నారు. మంచి నిద్ర, సరైన పోషణ, రోజువారీ శారీరాన్ని చురుగ్గా ఉంచే ఇతర ఆటలు, చదువు కూడా చాలా అవసరం. ఇవన్నీ కలిసినప్పుడే పిల్లల మెదడు చక్కగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల, చదరంగంతో పాటు మంచి రోజువారీ అలవాట్లపై దృష్టి పెట్టడం ముఖ్యం.                                     *రూపశ్రీ.  
అంతులేని అలసట వెనుక అసలు కారణం ఏమిటి..డాక్టర్ చెప్పిన నిజాలు.! రోజంతా అలసటగా, నీరసంగా అనిపిస్తుందా? ఎంత విశ్రాంతి తీసుకున్నా శరీరంలో శక్తి లేకపోతే, అది కేవలం సాధారణ అలసట మాత్రమే కాకుండా Chronic Fatigue Syndrome (CFS) అనే ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణులు డా. చిట్టిభొట్ల మధుసూదన శర్మ గారు Chronic Fatigue Syndrome గురించి సులభమైన భాషలో వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: Chronic Fatigue Syndrome అంటే ఏమిటి? సాధారణ అలసటకు, Chronic Fatigue Syndrome కు ఉన్న తేడా ఏమిటి? ఈ సమస్య వచ్చే ప్రధాన కారణాలు ఏమిటి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి? ఈ సమస్యను తగ్గించేందుకు జీవనశైలిలో చేయాల్సిన మార్పులు సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిపుణుల సూచనలు ఎప్పుడూ అలసటగా ఉండటం, ఏ పని చేయాలన్నా శక్తి లేకపోవడం, ఏకాగ్రత తగ్గిపోవడం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. సరైన సమయంలో కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ సమస్యను నియంత్రించుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి. గమనిక: ఈ వీడియోలో అందించిన సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సలహా, నిర్ధారణ లేదా చికిత్స కోసం వైద్య నిపుణులను సంప్రదించండి.  
తిన్న వెంటనే గ్యాస్ వస్తుందా..అయితే మీరు చేస్తున్న తప్పులు ఇవే..! నేటి కాలంలో రోజులో మూడు పూటలా ఆహారం తీసుకోవడం కామన్.  ఉదయం టిఫిన్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తప్పకుండా చేస్తారు. చాలామంది ఉదయం సమయంలో టిఫిన్ స్కిప్ చేస్తే గ్యాస్ సమస్యలు వస్తాయని,  ఆహారం సమయానికి తినకపోతే గ్యాస్ సమస్యలు వస్తాయని చెబుతుంటారు. కానీ కొందరికి ఒక సమస్య ఉంటుంది. అదే ఆహారం తినగానే గ్యాస్ సమస్య రావడం. రోజూ మూడు పూటలా ఆహారం తింటున్నా సరే.. గ్యాస్ సమస్య ఎందుకు వస్తోంది అనేది చాలామందికి అర్థం కాదు.. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. ఇప్పటి కాలంలో చాలామందికి తొందరగా తినడం అలవాటు.  ఆహారాన్ని వేగంగా మింగినప్పుడు దాన్ని సరిగ్గా నమలలేం. ఆహారాన్ని పూర్తిగా నమలడం అనేది జీర్ణక్రియలో మొదటి , అత్యంత ముఖ్యమైన దశ, ఎందుకంటే నోటిలోని లాలాజలం ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. ఆహారం సరిగ్గా నమలకుండా కడుపులోకి ప్రవేశిస్తే, దానిని జీర్ణం చేయడానికి కడుపు మరింత కష్టపడాల్సి వస్తుంది, దీనివల్ల గ్యాస్ , బరువుగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి చాలా మందికి భోజనం చేసేటప్పుడు లేదా తిన్న వెంటనే ఎక్కువగా నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. దీనివల్ల కడుపులోని జీర్ణరసాలు పలుచబడి, సరైన జీర్ణక్రియ జరగదు. ఫలితంగా గ్యాస్, అజీర్ణం కలుగుతాయి. జీర్ణక్రియ సరిగ్గా జరగాలంటే, భోజనానికి సుమారు అరగంట ముందు లేదా భోజనం చేసిన గంట తర్వాత నీళ్లు తాగడం మంచిది. తిన్న వెంటనే మంచం మీద పడుకోవడం లేదా నిద్రపోవడం కూడా గ్యాస్ ఏర్పడటానికి ఒక ప్రధాన కారణం. పడుకోవడం వల్ల కడుపులోని ఆహారం , ఆమ్లం పైకి వచ్చి, కడుపు ఉబ్బరం, గ్యాస్ , గుండెల్లో మంటకు కారణమవుతాయి. తిన్న తర్వాత కనీసం 20 నుండి 30 నిమిషాల పాటు నిటారుగా కూర్చోవడం లేదా తేలికపాటి నడక  జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అతిగా వేయించిన, మసాలా దినుసులు లేదా నూనెతో కూడిన ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది . ఇవి కడుపుపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ ఆహారాలను అధిక పరిమాణంలో తినడం వల్ల గ్యాస్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా, రాజ్మా బీన్స్, శనగలు , క్యాబేజీ వంటి కొన్ని కూరగాయలు , పప్పుధాన్యాలు కూడా సహజంగా గ్యాస్ ను ఉత్పత్తి చేసే  ఆహారాలుగా  పరిగణిస్తారు, కాబట్టి వాటిని సరైన పరిమాణంలో , సరిగ్గా వండిన తర్వాత తినడం ముఖ్యం. ఆహారం తింటూ ఎక్కువగా మాట్లాడటం, వేగంగా శ్వాస తీసుకోవడం, లేదా స్ట్రాతో తాగడం వంటివి కూడా కడుపులోకి గాలి చేరడానికి కారణమవుతాయి. ఈ విధంగా మింగిన గాలి కడుపు ఉబ్బరానికి, గ్యాస్ కు కూడా కారణం కావచ్చు. అందువల్ల, నిశ్శబ్దంగా, సౌకర్యవంతంగా, తక్కువ మాట్లాడుతూ తినడం మంచిది. పైన చెప్పుకున్న ఐదు అలవాట్లు ఎవరిలో అయినా ఉంటే వారు తప్పకుండా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నెమ్మదిగా తినడం, ఆహారాన్ని బాగా నమలడం, భోజనాల మధ్య అధికంగా నీరు త్రాగకుండా ఉండటం, తిన్న వెంటనే పడుకోకుండా ఉండటం, బరువైన , వేయించిన ఆహారాలను తగ్గించడం,  నిశ్శబ్దంగా తినే అలవాటును అలవర్చుకోవడం వంటివి గ్యాస్ సమస్యను తగ్గించుకోవడంలో సహాయపడతాయి.                                  *రూపశ్రీ.  
టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రమాదం.! మధుమేహం అనేది వేగంగా పెరుగుతున్న ఒక  వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ వ్యాధి బారిన 10 కోట్లకు పైగా యువకులు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే.. దాన్ని నయం చేయలేము. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప దాన్ని నియంత్రణలో ఉంచుకోలేం. మధుమేహంలో రెండు రకాలు ఉన్నాయి. టైప్ 1 ,  టైప్ 2 గా మధుమేహాన్ని పరిగణిస్తారు.  అయితే  వీటిలో ఏ రకం ఎక్కువ ప్రమాదకరం.. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్ మధ్య తేడా..   టైప్ 1 డయాబెటిస్.. టైప్ 1 డయాబెటిస్‌లో, క్లోమం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడం పూర్తిగా ఆపేస్తుంది, దీనివల్ల రోగి ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవలసి వస్తుంది. టైప్ 2 డయాబెటిస్.. టైప్ 2 డయాబెటిస్‌లో, శరీరం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది, కానీ ఆ ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగపడదు. ఈ పరిస్థితిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీర్ఘకాలం పాటు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఏది ఎక్కువ ప్రమాదకరమైనది? రక్తంలో చక్కెర స్థాయిలను ఎక్కువ కాలం నియంత్రించకపోతే మధుమేహం ప్రమాదకరంగా మారుతుంది. ఈ నియంత్రణ లేకపోవడం వల్ల కళ్ళు, మూత్రపిండాలు, గుండె, మెదడు , ఇతర అవయవాలకు గణనీయమైన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. టైప్ 1 డయాబెటిస్‌లో, ఇన్సులిన్ తీసుకోకపోవడం వల్ల డయాబెటిక్ కీటోయాసిడోసిస్ అనే తీవ్రమైన పరిస్థితి వచ్చే ప్రమాదం పెరుగుతుంది, ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. టైప్ 2 మధుమేహం సంవత్సరాల తరబడి ఎలాంటి లక్షణాలు లేకుండా ఉండవచ్చు. మూత్రపిండాలు, కళ్ళు, గుండె లేదా నరాలు వంటి ఇతర అవయవాలపై మధుమేహం ప్రభావం చూపినప్పుడు చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ బయటపడుతుంది. టైప్ 2 మధుమేహం నియంత్రణ.. వైద్యుల ప్రకారం, టైప్ 2 మధుమేహాన్ని నియంత్రించడం వల్ల దాని ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి,  బరువును అదుపులో ఉంచుకోవాలి,  సమతుల్య ఆహారం తీసుకోవాలి,   తగినంత నిద్రపోవాలి,  ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. టైప్ 1 డయాబెటిస్‌ను నియంత్రణ.. జీవనశైలి మార్పుల ద్వారా టైప్ 1 మధుమేహాన్ని నియంత్రించలేము. టైప్ 1 మధుమేహానికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు తప్పనిసరిగా తీసుకోవాలి.                                            *రూపశ్రీ.