
తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర అసలు ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్ ఒకటి చోటుచేసుకుంది. సెప్టెంబర్ 10న థియేటర్లలోకి రాబోతున్న రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారు. కార్తి లాంటి స్టార్ హీరో నటించిన భారీ బడ్జెట్ సీక్వెల్ సినిమా ‘సర్దార్ 2’ని దాటుకుని, సూరి-సుహాస్ నటించిన ‘మండాడి’ సినిమా బుకింగ్స్‌లో దూసుకెళ్తోంది. అసలు తమిళనాడు ఆడియన్స్ మైండ్‌సెట్ ఏంటి? ఈ సీక్వెల్ హడావుడిని తట్టుకుని ఒక కంటెంట్ డ్రివెన్ మూవీ ఎలా ముందంజలో నిలిచింది? అనేది ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా ఒక హిట్ సినిమాకు సీక్వెల్ వస్తోందంటే.. క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో కార్తి, ఎస్.జె. సూర్య కాంబినేషన్‌లో వస్తున్న ‘సర్దార్ 2’పై తమిళనాడుతో పాటు సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. కానీ, ఈ సినిమా ఇనిషియల్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం... తమిళనాడు అడ్వాన్స్ బుకింగ్స్‌లో 'మండాడి' చిత్రం ఏకంగా ₹94.56 లక్షల గ్రాస్ వసూలు చేసి టాప్‌లో నిలిచింది. భారీ సీక్వెల్ అయిన 'సర్దార్ 2' మాత్రం ₹78.89 లక్షలతో సరిపెట్టుకుంది. సీక్వెల్ క్రేజ్ ఉన్నప్పటికీ, హోమ్ గ్రౌండ్ తమిళనాడులో సర్దార్ 2 కంటే మండాడి సినిమానే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ముందంజలో ఉంది.

ఈ ట్రెండ్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ఒకటి మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతోంది. తమిళ ప్రేక్షకులు కేవలం సీక్వెల్ ట్యాగ్‌లు లేదా భారీ బడ్జెట్ హంగులు చూసి టికెట్లు బుక్ చేసుకోవడం లేదు. కథలో దమ్ము, కంటెంట్‌లో నిజాయితీ ఉన్న సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘మండాడి’ ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అందుకే మాస్, క్లాస్ అనే తేడా లేకుండా జనాలు మండాడి టికెట్లు బుక్ చేసుకోవడానికి పోటీ పడుతున్నారు.
ఇనిషియల్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘మండాడి’ హవా చుపిస్తున్నప్పటికీ, సెప్టెంబర్ 10న రాబోతున్న ఈ బాక్సాఫీస్ వార్‌లో తొలి రోజు ఏ సినిమా పైచేయి సాధిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
[Sardar 2 vs Mandaadi, Sardar 2 Movie, Mandaadi Movie, Sardar 2 Bookings, Mandaadi Bookings, Suhas, Karthi, Telugu Film News, Telugu News]






