
ఇరుముడి సక్సెస్ రేంజ్ ని మాస్ మహారాజా రవితేజ తో పాటు మేకర్స్ ,అభిమానులు, ప్రేక్షకులు అసలు ఉహించి ఉండరు. తెలుగు సినిమాలో దాగి ఉన్న ఒక ఫార్మేట్ ని బతికించిన సంజీవిని అని కూడా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఒక్కో సినిమాకి 20 కోట్ల నుండి 25 కోట్ల వరకు పారితోషికం తీసుకునే రవితేజ, వరుస ప్లాపుల వల్ల తన మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఇరుముడితో ఒక తెలివైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు .
తన రెగ్యులర్ రెమ్యునరేషన్ వదులుకుని లేదా చాలా తక్కువగా సుమారు 7 నుండి 8 కోట్లకి అందుకొని నైజాం (తెలంగాణ) థియేట్రికల్ రైట్స్ మరియు లాభాల్లో వాటా రూపంలో డీల్ కుదుర్చుకున్నాడు. మరి నన్ను నమ్మి డీల్ కుదుర్చుకున్నావని అయ్యప్ప స్వామి అనుకున్నాడో ఏమో, విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.కేవలం నైజాం ప్రాంతంలోనే ఫస్ట్ వీక్‌లోనే 50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టగా, ఇప్పుడు ఆ కలెక్షన్స్ 81 కోట్ల గ్రాస్ కి చేరాయి. ఇంకా భారీ కలెక్షన్స్ లోనే రన్ అవుతుంది. దీంతో క్లోజింగ్ టైమ్ కి రవితేజ నైజాం రైట్స్ , ప్రాఫిట్ షేరింగ్ తో ఆయన ఖాతాలో ఏకంగా 50 కోట్ల భారీ షేర్ లేదా లాభాల వాటా పడనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read: ఇరుముడిని ఎన్టీఆర్ చేసి ఉంటే: పరిస్థితి ఇదేనా!
వరల్డ్ వైడ్ గా 250 కోట్ల గ్రాస్ మార్కుకి చేరువ అవుతున్న ఇరుముడి దాదాపు అన్నిఖర్చులు పోను 70 కోట్ల దాకా లాభాల్లో ఉంది. దీంతో చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు' తర్వాత ఎక్కువ లాభాలు తీసుకొస్తున్న మూవీగా ఇరుముడి రికార్డులకి ఎక్కింది.
[Irumudi, Raviteja, Priya Bhavani Shankar, Nakshtra, Mass Maharaja Remuneration, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News, Mythri Movie Makers]






