LATEST NEWS
తెలుగుదేశం  అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని గత జగన్ సర్కార్ స్కిల్ కేసు పేరిట అక్రమంగా అరెస్టు చేసి గురువారం (సెప్టెంబర్ 10)కి సరిగ్గా మూడేళ్ల అుతున్న సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా  నిజం గెలిచింది కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్  పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో  జరిగిన  లీడర్‌షిప్ కాంక్లేవ్ సదస్సు వేదికగా ఆయనీ పిలుపు ఇచ్చారు.  సుదీర్ఘ పోరాటాలు, క్లిష్ట పరిస్థితుల్లో శ్రేణులు చేసిన త్యాగాల ఫలితంగానే  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కార్యకర్తల శ్రమను ఎప్పటికీ మరువలేమని లోకేష్ పునరుద్ఘాటించారు.  జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో యాభై మూడు రోజుల పాటు అన్యాయంగా నిర్బంధించిన విషయాన్నిగుర్తు చేసిన లోకేష్.. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే  నాడు ఆ అరెస్ట్ జరిగిందన్నారు.  చివరికి న్యాయస్థానాలు,  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి తప్పు జరగలేదని క్లీన్ చిట్ ఇవ్వడంతో నిజమే గెలిచిందని స్పష్టం చేశారు. ఈ చారిత్రక సత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు. ఈ సదస్సు వేదికగా పార్టీ నాయకులకు లోకేశ్  పార్టీ, పర్సనల్, ప్రభుత్వం  అనే  3-పీ  మార్గదర్శకాలను నిర్దేశించారు. నాయకులు కేవలం పదవులకే పరిమితం కాకుండా వ్యక్తిగతంగా ప్రజలకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను లబ్ధిదారులకు వివరించడంతో పాటు..  పార్టీ సంస్థాగత పటిష్టత కోసం కార్యకర్తలంతా క్రియాశీలకంగా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. ఉన్నత స్థానాలకు ఎదిగే కొద్దీ మరింత వినయంగా ఉంటూ, ప్రతి ఒక్కరితోనూ మానవతా దృక్పథంతో మమేకం కావాలన్నారు.  జగన్ హయాంలో నిరుద్యోగ యువత ఎదుర్కొన్న ఇబ్బందులను ఎత్తి చూపిన లోకేష్. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య   వ్యత్యాసం కూడా తెలియని గత పాలకుల విధానాల వల్ల యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని, రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు.  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక పాలనను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా, క్షేత్రస్థాయిలో   తిప్పికొట్టాలని సూచించారు. పార్టీలో అంతర్గత విభేదాలకు, అహంకారాలకు  ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండకూడదన్న నారా లోకేష్.. ప్రస్తుతం పార్టీని  టీడీపీ 3.0 వెర్షన్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు.  అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపించగలమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకోవడం పార్టీ బాధ్యత అని, కష్టకాలంలో నిలబడిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించారు.  [TDP P3 Vertion, Nara Lokesh, Chandrababu Naidu arrest anniversary, Nijam Gelichindi program, Telugu Desam Party, AP Leadership Conclave, Telugu One]
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం..!  తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్సీలు తాత మధుసూదన్ అలియాస్ తాత మధు, ఎన్. నవీన్ కుమార్ రెడ్డిలకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఒక్కొక్క రికి రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.కేసు తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. అదే రోజు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలు వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.  ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతిని ధులుగా సభా కార్యక్రమా లకు హాజరుకావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల దుస్తులతో నిరసన చేపట్టిన సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ స్పీకర్ ఓఎస్డీ పొల్లేపల్లి వెంకటేశం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 352, 3(5)తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ కోరుతూ పోలీసులు సమర్పించిన నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. అనంతరం ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. తనపై వచ్చిన అనుచిత వ్యాఖ్యల ఆరోపణలను ఎమ్మెల్సీ తాత మధు ఇప్పటికే ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల్లో స్పీకర్‌ను దూషించినట్లు భావిస్తే వాటిని ఉపసంహరిం చుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు. మరోవైపు అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో విధుల్లో ఉన్న పోలీసులతో బీఆర్ఎస్ నేతలు ఘర్షణకు దిగారన్న ఆరోపణలు కూడా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పోలీసులను అడ్డుకోవడం, దాడికి పాల్పడటం వంటి ఆరోపణలపై పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. అయితే పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపైనా వివాదం కొనసాగుతోంది.  ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు స్పందిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవద్దని ఆదేశించింది. అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని స్పష్టం చేసింది. సంబంధిత పోలీసుల వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఇలా స్పీకర్‌పై వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీల అరెస్టు, నాంపల్లి కోర్టు బెయిల్, అసెంబ్లీ వద్ద పోలీసులతో ఘర్షణ, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల వ్యవహారంపై వివాదం వంటి పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.       (BRS MLCs, Tata Madhusudan, N Naveen Kumar Reddy, Telangana Assembly, Telangana Legislative Council, Assembly Speaker, K Chandrasekhar Rao, KCR, Damodar Rajanarsimha, BRS, Telangana Politics, Assembly Resolution, Assembly Privileges, Legislative Council Chairman, Political Controversy)
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు సోషల్ మీడియాను ఎంతవరకు యాక్టివ్‌గా వినియోగిస్తున్నారనే అంశంపై ఆయన ఆరా తీశారు. సోషల్ మీడియాను నేతలు సమర్థంగా వినియోగించాలని లోకేష్ సూచించారు. సోషల్ మీడియానే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని.. దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని చెప్పారు. ఏఎంసీ, కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని.. ప్రభుత్వ పనితీరుపై ఓపెన్‌గా మాట్లాడాలని నేతలకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సెల్ఫీ వీడియోల ద్వారా తన సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని గుర్తుచేశారు. తాను కూడా సుజ్లాన్ విండ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, డీఎస్సీపై జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి సెల్ఫీ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు లోకేష్ తెలిపారు. విషయం చిన్నదైనా, పెద్దదైనా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ప్రతిపక్షాల పని ఎప్పుడూ బురదజల్లడమేనని వ్యాఖ్యానించిన లోకేష్.. వారి దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. పార్టీ ఆదేశాలు, కార్యక్రమాలపై సోషల్ మీడియా టీమ్స్ తక్షణమే స్పందించేలా పనిచేయాలని అన్నారు. జగన్‌కు సంబంధించిన అంశాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు గుడ్డిగా సమర్థిస్తున్నారని లోకేష్ విమర్శించారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని.. ఈ విషయాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.       (Minister  Nara Lokesh, Telugu Desam Party, Amaravati, Leadership Conclave, Political Communication, Public Orientation, Social Media, TDP Leaders, Social Media Strategy, CM Chandrababu, YS Jagan, YSRCP, Telugu One, Telugu News)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఆయనను మరింత ఏకాకిగా మార్చేలా ఉన్నాయి.  సోమవారం (సెప్టెంబర్ 7) ఆయన ఆర్భాటంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కొత్త పార్టీ ప్రకటన చేశారు. అయితే పార్టీ పేరు, జెండా, అజెండాలను రివీల్ చేయలేదు. అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.   విజయకొత్త పార్టీ ప్రకటన చేసి కూడా పార్టీ పేరు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  ఇక ఆయన అనుసరిస్తున్న విధానాలు, పార్టీ లక్ష్యాలపై ఆయనలోనే అయోమయం, గందరగోళం ఉందని ఆయన మీడియా ముఖంగా మాట్లాడిన మాటలను బట్టి అవగతమౌతున్నది. పార్టీ  స్థాపిస్తారట కానీ, తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదంటున్నారు విజయసాయిరెడ్డి.  అసలు రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ, జనసేన వంటి పార్టీలు క్రియాశీలంగా ఉన్న సమయంలో  విజయసాయిరెడ్డి పార్టీ ఏర్పాటు చేసి.. తాను కాదు మరో నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడతాను.. తాను వెనుకుండి సలహాలూ, సూచనలూ ఇస్తాననడం ఆయనలోని గందరగోళానికి  అద్దంపడుతున్నట్లుగా ఉంది. సీఎం అభ్యర్థి స్థాయి నాయకుడు   పార్టీలోకి వచ్చి తన  నాయకత్వంలో పని చేసేంత సీన్ విజయసాయిరెడ్డికి ఉందా అన్న అనుమానాలు రాజకీయపరిశీలకులలో వ్యక్తం అవుతోంది.  రాష్ట్ర రాజకీయాల్లో   బలంగా ఉన్న తెలుగుదేశం, జనసేన, వైసీపీలను కాదని మరీ.. బలమైన నేత ఎవరైనా.. విజయసాయి నాయకత్వంలో పని చేయడానికి ముందుకు వస్తారా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు.  ఆయన మాటలను బట్టి చూస్తే.. ప్రజాదరణ, క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న బలమైన నేతను ముందు పెట్టి తాను వెనకుండి చక్రం తిప్పాలన్నది విజయసాయి ఆలోచనగా కనిపిస్తోంది.   తనను తాను శివసేన వ్యవస్థాపకుడు  బాల్ థాక్రే తో పోల్చుకోవడం కూడా విస్తుగొలుపుతోంది. బాల్ థాకరే మహారాష్ట్రలో హిందుత్వ ఐకాన్, అలాగే.. మరాఠా సెంటిమెంట్ ఆయనకు అప్పట్లో పెద్ద బలంగా నిలిచింది. కానీ ఇక్కడ అంటే ఏపీలో అటువంటి పరిస్థితి లేదు. అన్నిటికీ మించి జగన్ అక్రమాస్తుల కేసు సహా పలు కేసులలోఆయన నిందితుడిగా ఉన్నారు. ఆ కేసులు ముందు ముందు విజయసాయి పొలిటికల్ జర్నీకి అడ్డంకులుగా మారే అవకాశాలనూ కొట్టిపారేయలేము.  ఈ విషయాలన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని ఆలోచిస్తే.. ఇంకా నామకరణం కూడా జరగని విజయసాయి కొత్త పార్టీ ప్రయాణం నల్లేరు మీద బండి నడకగా మారే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదు.   [Vijayasai Reddy Bal Thackeray  Strategy, New Political Party, AP Politics, YCP, Telugudesham, Janasena, Ap Politics, Telugu One]
తెలుగుదేశం, వైసీపీలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. తన కొత్త పార్టీ ప్రకటన కోసం విజయవాడలో సోమవారం (సెప్టెంబర్ 7) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలుగుదేశం, వైసీపీలకు ప్రజాసమస్యల పరిష్కారం పట్ల ఇసుమంతైనా శ్రద్ధ, చిత్తశుద్ధి లేదన్నారు. తాను కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమని ఈ సందర్భంగా విస్పష్టంగా చెప్పిన విజయసాయి.. తన పార్టీ జెండా, అజెండా ప్రకటించడానికి ముందు వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్న ఉద్దేశంతోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, జనసేనలు ఒకే తానులోని గుడ్డలేనన్నారు.  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం వాటికి పట్టవని విమర్శించారు.   ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం తెలుగుదేశం, వైసీపీల చుట్టూనే తిరుగుతోందని విమర్శించిన విజయసాయి, ఆరెండు పార్టీలూ కూడా కుటుంబ, ఫ్యాక్షన్ పార్టీలేననీ,వాటివి స్వార్థపూరిత అజెండాలనీ అన్నారు.  ప్రజాధనాన్ని ఏ స్థాయిలో దోచుకోగలం, ఎలా దోచుకోగలం అన్న విషయంలో  ఈ రెండు పార్టీలూ పోటీపడుతున్నాయన్న విజయసాయి,  రాష్ట్రంలోపోలీసు వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ ఆ పార్టీల ధోరణికి మద్దతు ఇస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు గోరంత, మాకు కొండంత అన్నది ఆ పార్టీల విధానమని విమర్శించారు.  ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు నిజమైన న్యాయం జరగాలంటే, ఈ సంప్రదాయ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మరో ప్రత్యామ్నాయ వేదిక రావలసిన సమయం ఆసన్నమైందని, తన పార్టీ ఆ పాత్ర తీసుకుంటుందని చెప్పారు.   [Vijayasai Reddy Say  YSRCP And YCP Same, TDP YCp faction parties, third alternative, AP politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
జనరల్ గా ఎంత పెద్ద హిట్ సినిమా అయినా రెండో వారం దాటి మూడో వారంలోకి అడుగుపెడితే కలెక్షన్ల వేగం నెమ్మదించడం కామన్.  కానీ 'ఇరుముడి' విషయంలో మాత్రం ఆ బాక్సాఫీస్ సూత్రాలన్నీ బుంగమూతి పెట్టుకోవడం స్టార్ట్ చేసాయి. ఎందుకంటే మూడో ఆదివారం నాడు కూడా  ఏకంగా 2.15 లక్షల టికెట్లు అమ్ముడవడమే.  ముఖ్యంగా నైజాం ఏరియాలో 'ఇరుముడి' సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీ ఒక విధ్వంసమనే చెప్పాలి. ఇప్పటికే నైజాం ప్రాంతంలో  83 .75 కోట్ల గ్రాస్ లోకి చేరింది. అంటే  58 కోట్ల షేర్ రాబట్టి , నాన్, మల్టీస్టారర్ మరియు నాన్-సీక్వెల్ విభాగంలో టాలీవుడ్ టాప్ రికార్డులని  ఒక్కొక్కటిగా అధిగమిస్తోంది. గతంలో 55 కోట్ల షేర్ నమోదు చేసిన 'పెద్ది' మార్కును దాటేసి నైజాంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల టాప్ 5 జాబితాలో సగర్వంగా నిలిచింది. ప్రస్తుతం 'కల్కి' 93 కోట్లు, 'సలార్' .72 కోట్లు, 'దేవర' 63 కోట్లు వంటి భారీ చిత్రాల సరసన నిలిచిన 'ఇరుముడి', అతి త్వరలోనే నైజాంలో ఏకంగా 100 కోట్ల గ్రాస్ మైలురాయిని అందుకోవడానికి అడుగులు వేస్తోంది. రానున్న వినాయక చవితి పండుగ సెలవులు కూడా తోడుకానుండటం అదనపు బలం.       Also Read: ఆ భాషపై శివరాజ్ కుమార్ వ్యాఖ్యలు వైరల్..పెద్దిలో గౌరు నాయుడుగా అలరించాడు కదా! దర్శకుడు శివ నిర్వాణ తండ్రీకూతుళ్ల అనుబంధం, భక్తి, భావోద్వేగాల కలయికతో తీర్చిదిద్దిన ఈ కథ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. పెట్టుబడికి ఇప్పటికే 100 కోట్లకు పైగా నికర లాభాలను అందించి, ఏకంగా 4 నుండి 5 రెట్ల ప్రతిఫలాన్ని నిర్మాతలకు తెచ్చిపెట్టింది. రవితేజ శక్తివంతమైన నటన, ప్రియా భవానీ శంకర్ సహజ అభినయం, చిన్నారి బేబీ నక్షత్ర అమాయకత్వం, దీనికితోడు జీవీ ప్రకాష్ అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. కొత్త చిత్రాలు పోటీగా వస్తున్నప్పటికీ, మూడో వారంలోనూ అదే స్థాయి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండటంతో ఈ చిత్రాన్ని నిర్మాతలు 'జనరేషనల్ బ్లాక్‌బస్టర్'గా కొనియాడుతున్నారు. ఓవర్ ఆల్ గా ఇరుముడి కలెక్షన్స్ చూసుకుంటే ప్రెజెంట్ 250 కోట్ల మార్కుకి చేరువలో ఉంది.     [Irumudi, Nizam Box Office, Peddi, Kalki, salaar, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]    
డిజిటల్ వినోదాన్ని కోరుకునే సినిమా ప్రియులకు ఈ వారం పండగే అని చెప్పాలి. ప్రతి శుక్రవారం లాగే ఈ వారం కూడా వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఆసక్తికరమైన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా తమిళ, మలయాళ చిత్రాలు తెలుగు ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యాయి. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన క్రేజీ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఈ నెల 11 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య సరసన మమితా బైజు కథానాయికగా అలరించింది. పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో ఈ చిత్రం వీక్షకులకు అందుబాటులోకి రానుంది. మరోవైపు యాక్షన్ హీరో విశాల్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మకుటం' కూడా అదే రోజున డిజిటల్ బాట పడుతోంది. ఈ సినిమా ఈ నెల 11వ తేదీ నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. ఇందులో విశాల్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇక ఈ సినిమాల బ్యాక్‌గ్రౌండ్ విషయానికి వస్తే, 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆగస్టులో థియేటర్లలోకి వచ్చి ఏకంగా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డు విజయం సాధించింది. ఇక 'మకుటం' విషయానికొస్తే, విశాల్ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అంజలి, దుషారా విజయన్ కథానాయికలుగా నటించగా జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. కేవలం తమిళ చిత్రాలే కాకుండా మలయాళ పరిశ్రమ నుంచి వచ్చిన సస్పెన్స్ డ్రామా 'వరవు' కూడా ఓటీటీ ప్రియులను పలకరించనుంది. షాజీ కైలాస్ దర్శకత్వంలో జోజు జార్జ్, మురళి గోపి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం 'జీ 5' ప్లాట్‌ఫామ్‌లో సెప్టెంబర్ 11 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాల ఓటీటీ ఎంట్రీపై విపరీతమైన బజ్ నడుస్తోంది. థియేటర్లలో మిస్ అయిన సినిమాలను ఇంటి వద్దే వీక్షించేందుకు అభిమానులు, సినిమా ప్రియులు ముచ్చటపడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫ్రైడే డిజిటల్ స్పేస్‌లో రాబోతున్న ఈ విభిన్నమైన కథాంశాల సినిమాలు ఓటీటీ వీక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.
  సౌత్ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు కరుణాడ చక్రవర్తి  'శివరాజ్‌కుమార్'. ఇటీవల పెద్దిలో గౌరు నాయుడుగా అలరించిన  శివరాజ్‌కుమార్ కి సొంత ఏరియా కర్ణాటకలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పుకుంటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. చూడని హిట్టు లేదు, కొట్టని రికార్డు లేదు. మొదటి మూడు సినిమాలు  వరుసగా 100 రోజులు ఆడి బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి.  శివ రాజ్‌కుమార్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకొని, ఆ తర్వాత అభిమానులకు, కన్నడ ప్రజలకి క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఆయన నటించబోయే కొత్త బహుభాషా చిత్రం ‘ఒరిజినల్ మాన్‌స్టర్’ (Original Monster) టైటిల్ లాంచ్ వేడుకలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఒక విలేకరి  హిందీ డైలాగులు చెప్పడం గురించి ప్రశ్నించగా, శివ రాజ్‌కుమార్ స్పందిస్తూ “హిందీ నాకు రెండో భాష, అది చాలా తేలికైన భాష. పైగా అది మన జాతీయ భాష కూడా. దానిని మనం ఎందుకు నేర్చుకోకూడదు?” అని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ ఒక్క వ్యాఖ్య సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన దుమారాన్ని రేపింది. కన్నడ భాషాభిమానులు, పలువురు నెటిజన్లు శివ రాజ్‌కుమార్ కామెంట్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మన దేశంలో అధికారికంగా ఏ ఒక్క భాషకూ జాతీయ భాష హోదా లేదని, భారత్‌లో అన్ని ప్రాంతీయ భాషలూ సమానమేనని స్పష్టం చేస్తూ  విమర్శలు స్టార్ట్ చేసారు. ఈ వివాదం నెట్టింట వ్యాపించి దాదాపు 100% ప్రతికూల చర్చకు దారితీయడంతో శివ రాజ్‌కుమార్ తక్షణమే స్పందించారు.       Also Read: నందమూరి మోక్షజ్ఞకి జోడీగా ఆ స్టార్ హీరోయిన్: ఈ హీరోయిన్ కూడా లిస్ట్ లో ఉంది తాజాగా ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ నా మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. నేను ఆ సమయంలో హిందీని జాతీయ భాష అని పొరపాటున మాట్లాడాను. భారతదేశంలో ఉన్న అనేక ముఖ్యమైన భాషల్లో హిందీ కూడా ఒక భాష మాత్రమే. భారతీయ భాషల విషయంలో నేను కొంత గందరగోళానికి గురై ఆ పదాన్ని వాడాను. నాకు తెలియక జరిగిన ఈ పొరపాటుకి క్షమాపణలు. ఎవరి భాష వారికి గొప్పది, హిందీ మాట్లాడేవారికి ఆ భాష ఎంత ముఖ్యమో, కన్నడిగులకు కన్నడ భాష అంతకంటే ఎక్కువ ప్రాధాన్యమైనది. మా భాష గౌరవాన్ని మేమెప్పుడూ తగ్గిపోనివ్వం” అనిస్పష్టం చేశారు.         [Shiva Rajkumar, Hindi National Language, Apologises , Kannada remark, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]   
టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేదా థామస్ మళ్లీ మనందరి గుండెల్లో నిలిచిపోయే ఒక అద్భుతమైన ఫ్యామిలీ రోల్‌తో రాబోతున్నారు. '35 చిన్న కథ కాదు' సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపించిన నివేదా, ఇప్పుడు ఓటీటీని షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో రాబోతున్న సరికొత్త ఒరిజినల్ సిరీస్ 'శ్రీమతి'. ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌ను విశ్వక్ ఖండేరావు డైరెక్ట్ చేస్తున్నారు. ప్రతి ఇంట ఉండే చిన్న చిన్న ఆనందాలు, వంటగది సెంటిమెంట్స్, బాధ్యతలు అన్నీ కలగలిపిన "ప్రతి ఇంటి కథ"గా ఈ సిరీస్ రూపుదిద్దుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తేనే మనకు హోమ్‌లీ ఫీలింగ్ కలుగుతుంది. పోస్టర్‌లో నివేదా థామస్ చాలా సంప్రదాయబద్ధంగా, చిరునవ్వుతో కనిపిస్తున్నారు. పోస్టర్ లో చుట్టూ కిచెన్ వాతావరణం, నెమలి డిజైన్లతో చాలా కలర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. నివేదా థామస్ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఎమోషనల్ అండ్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్‌ను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. ఇటీవల వచ్చిన '35 చిన్న కథ కాదు' సినిమాలో మధ్యతరగతి తల్లిగా ఆమె నటనకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఉత్తమ నటిగా తెలంగాణ గద్దర్ అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే తరహా ఎమోషనల్ డెప్త్ ఉన్న 'శ్రీమతి' అనే రిలేటబుల్ రోల్‌లో కనిపిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. కుటుంబ సమేతంగా కూర్చొని చూడదగ్గ ఫ్యూర్ ఎమోషనల్ డ్రామాగా 'శ్రీమతి' అలరించబోతోంది. విశ్వక్ ఖండేరావు మేకింగ్ స్టైల్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ కలిస్తే ZEE5 లో మరొక క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ ఫస్ట్ లుక్ చూసి చాలా పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. https://x.com/i_nivethathomas/status/2097568753462726714     [Srimathi First Look, Nivetha Thomas, Srimathi Web Series, ZEE5 Telugu Original, Vishvak Khanderao, Telugu Web Series, Telugu Film News, Telugu News]  
Ranabaali starring Vijay Deverakonda, Rashmika Mandanna is planned on his career highest budget in the direction of Rahul Sankrityan. The movie explores the story of Singanamala Bobbili Ranabaali who rose against British atrocities forcing villages into femine and severe drought conditions.  The movie teaser states that 8 million Indians have lost their lives during 1876-1878 as British taxes against the grains, and their need to export every piece of produce. Ranabaali, a local cheftain rises against these atrocities and starts killing British officials.  He is known as Savage and the teaser is titled, Savage's Oath, as he decides to not let even one grain of produce be exported from their land. Vijay Deverakonda in this role seems to be trying to hard to fit in as his look and get-up doesn't match him. He tried to be more theatrical and over-the-top which can go off.  The movie seems to not at all try to be understated like Lagaan but more over-the-top and loud. Even antagonist Arnold Vosloo is made to act in the similar way. While the vision of the director and visuals, production values are commendable, this pitch of story-telling could backfire as it seems forced at places. The movie is releasing on 16th October and we have to wait and see, how makers will deliver an output that would negate the tonal disadvantages.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.   
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎపిక్ మూవీ 'రణబాలి'. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా రిలీజ్ అయిన టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.  1876-78 కాలంలో బ్రిటీష్ వాళ్ల దారుణమైన పాలన, మద్రాస్ ప్రెసిడెన్సీలో వచ్చిన ఘోరమైన కరువు, ఆకలి చావులు... ఇవన్నీ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. "ఇది అన్నపూర్ణ దేశం రా... అన్నానికి కరువేంది?" అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే డైలాగ్ ప్రతి ఒక్కరి గుండెల్లో గుచ్చుకుంటుంది. బ్రిటీష్ ఆఫీసర్లు మన ధాన్యాన్ని దోచుకుంటూ, మన ప్రజలను బానిసలుగా మారుస్తుంటే... ఆ కరువు రాక్షసుడి ఆకలి తీర్చడానికి, మన నేల మీద నిలబడటానికి ఒక యోధుడు లేచాడు. ఆ యోధుడే సింగనమల బొబ్బిలి రణబాలి.  రణబాలిగా  విజయ్ లుక్, ఆ బాడీ లాంగ్వేజ్, కళ్లల్లో కనిపిస్తున్న ఆ క్రోధం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తెల్లవాళ్ల తుపాకులకు, ఫిరంగిలకు భయపడకుండా, చేతిలో వేటకత్తి పట్టి ప్రత్యర్థుల తలలు తెగనరికే ఆ సీన్స్ టీజర్‌కే హైలైట్. "ఆ కొండ పైన ఉన్న మా భద్రమల్లాడి మీద ఆన.. ఒక్క మెతుకు కూడా పొలిమేర దాటనివ్వను" అంటూ విజయ్ చెప్పే డైలాగ్స్ అండ్ ఆ వాయిస్ బేస్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. అజయ్-అతుల్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి ఫ్రేమ్‌లో కనిపించే గ్రాండ్ నెస్, ఆ కాలం నాటి సెట్టింగ్స్ ఆకట్టుకున్నాయి, విజయ్ దేవరకొండ మాస్ అవతార్, చారిత్రక కథాంశం, అద్భుతమైన విజువల్స్ చూస్తుంటే ‘రణబాళి’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.       [Ranabaali Teaser, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Mythri Movie Makers, Ranabaali Movie, Telugu Film News, Telugu News]  
    నందమూరి అభిమానులు, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ అభిమానులు కలలు ఫలించి    మోక్షజ్ఞ సెల్యులాయిడ్ పై ల్యాండ్ కావడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మేకర్స్  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కావడం, మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర తెరకెక్కిస్తున్న వశిష్ట దర్శకుడు కావడంతో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు .  ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో డ్యాన్స్, గ్లామర్‌తో కుర్రకారును ఊపేస్తున్న సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి.  శ్రీలీల అనే కాదు కానీ, ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు పలానా హీరోయిన్ ఓకే అంట కదా అని మాట్లాడుకుంటున్నారు. అభిమానులు మాత్రం శ్రీలీల అనే వార్తలపై స్పందిస్తూ శ్రీలీల  'భగవంత్ కేసరి'తో బాలయ్య బిడ్డగా చేసింది కదా అంటున్నారు. ఏది ఏమైనా మోక్షజ్ఞ సరసన కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ కూడా ఈ డెబ్యూ ప్రాజెక్టులో దాదాపు 20 నిమిషాల పాటు సాగే పవర్‌ఫుల్ మాస్ క్యామియో రోల్‌లో కనిపించనున్నారని,  థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని తెలుస్తోంది.     Also Read: రామాయణకి షాక్: ఆ మూవీతో పోటీ తప్పదా.. స్క్రీన్స్ విషయంలో అన్యాయం!   దసరా పండగ సందర్భంగా అధికారికంగా లాంచ్ చేసి, నవంబర్ నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తోంది. ఏది ఏమైనా  "గుహని  వీడిన కూన, వేటకు సిద్ధమైన సింహంలా అడవిలోకి అడుగుపెడుతుండటంతో  పెద్దాయన ఎన్టీఆర్, బాలకృష్ణల నట వారసత్వాన్ని మోక్షజ్ఞ ఏ రీతిలో ముందుకు తీసుకెళ్తాడో చూడటానికి అభిమానులతో పాటు తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.     [Mokshagna, Balakrishna, vasishta, Sreeleela, Mythri Movie Makers, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]  
Jailer 2 starring Superstar Rajinikanth in the direction of Nelson Dilipkumar has huge anticipation to repeat the 2023 HGOTY Jailer magic at the box office. Producer Sun Pictures are believing the movie to create unprecedented records at every market in South India for a Tamil movie.  Shocking the trade in Telugu states, they are quoting an amount of Rs.70 crores it seems. While they are asking for Rs.55 crores, GST and publicity, print costs come up to be valued at Rs.70 crores, it seems. The movie has been collect a gross of Rs.150 crores to 175 crores to even breakeven at such a high rate.  So, even the regular distributors and exhibitors who would give fancy rates for Rajinikanth starrer releasing in Telugu are not showcasing similar interest in this film. They are asking for even lesser price but Sun Pictures have decided to not go for prices less than they have quoted.  They have even quoted Rs.25 crores in Kerala and that is much much higher than Jailer final gross. Looks like Sun Pictures are strongly believing that the movie will not miss out on becoming first Rs.1000 crore grosser for Kollywood. Anirudh Ravichander has returned to score music and teaser, trailer and glimpses will release towards the end of this month. Jailer 2 is releasing on 15th October and there are many cameos from big stars like Hrithik Roshan in the film.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
హీరో నాగశౌర్య వ్యక్తిగత జీవితంపై గత కొన్నిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో రకరకాల రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఆయన తన సతీమణి అనూష శెట్టికి దూరంగా ఉంటున్నారని, ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ కొన్ని వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే, తాజాగా బయటకు వచ్చిన పిక్చర్స్ ఈ రూమర్స్ అన్నింటికీ ఒక్కసారిగా చెక్ పెట్టేశాయి. ఈ యంగ్ కపుల్ ప్రస్తుతం ఫ్రాన్స్ వేదికగా ఎంజాయ్ చేస్తోన్న వెకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూరప్ వీధుల్లో ఇద్దరూ కలిసి ఎంతో ఆనందంగా దిగిన పిక్స్ నెట్టింట ప్రత్యక్షమవ్వడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ జంట ఫొటోలు చూశాక, గతంలో వచ్చిన వార్తలన్నీ ఒట్టి అబద్ధాలేనని తేలిపోయింది. ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అయిన అనూష శెట్టిని నాగశౌర్య 2022లో వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత తమ పర్సనల్ స్పేస్‌కి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ఈ జంట, సోషల్ మీడియాలో తమ ప్రతి చిన్న విషయాన్ని పంచుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అయితే ఈ గ్యాప్‌నే ఆసరాగా చేసుకుని కొందరు వీరి బంధంపై లేనిపోని ఊహాగానాలు సృష్టించారు. సాధారణంగా సెలబ్రిటీలు కొద్దిరోజుల పాటు ఒకే వేదికపై కనిపించకపోయినా లేదా కలసి ఫొటోలు పోస్ట్ చేయకపోయినా ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాల పుకార్లు మొదలవుతుంటాయి. నాగశౌర్య విషయంలోనూ అదే రిపీట్ అయింది. కానీ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు లేదా ప్రెస్ నోట్లు ఇవ్వకుండా, కేవలం తమ ప్రశాంతమైన ప్రయాణంతోనే వీరు విమర్శకులకు సరైన సమాధానం చెప్పారు. ఇక నాగశౌర్య సినిమాల విషయానికి వస్తే, ఆయన చివరిగా 'బ్యాడ్ బాయ్ కార్తీక్' చిత్రంలో పూర్తిస్థాయి మాస్ లుక్‌లో కనిపించి అలరించారు. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించిన ఈ యంగ్ హీరో, త్వరలోనే ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాలీవుడ్ టాక్.       [Naga Shaurya, Anusha Shetty, Naga Shaurya France Vacation, Naga Shaurya Wife, Tollywood News]
  వరల్డ్ వైడ్ గా ఉన్న భారతీయ సినీ ప్రేమికులు, రామభక్తులు నవంబర్ 6 న విడుదల కానున్న 'రామాయణ పార్ట్ 1 ' కోసం రీగర్ గా వెయిట్ చేస్తున్నారు  రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా కనిపించడం రామాయణకి ఉన్న మరో స్పెషాలిటీ.. అయితే జపాన్‌కి  చెందిన ఆస్కార్ విజేత ఫ్రాంచైజీ మూవీ 'గాడ్జిల్లా మైనస్ వన్' సీక్వెల్‌గా వస్తున్న 'గాడ్జిల్లా మైనస్ జీరో'  కూడా నవంబర్ 6,నే గ్లోబల్ వైడ్ గా  థియేటర్లలోకి అడుగుపెడుతుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సాధారణ థియేటర్లలో రెండు సినిమాలకూ తగినన్ని స్క్రీన్లు లభించినప్పటికీ, నార్త్ అమెరికా,ఇతర ఓవర్సీస్ మార్కెట్లలో ఐమాక్స్ (IMAX) స్క్రీన్ల కేటాయింపు ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. ఐమాక్స్ ప్రొడక్షన్‌గా వస్తున్న గాడ్జిల్లాకు ఓవర్సీస్ మార్కెట్లలో ప్రీమియం ఫార్మాట్లలో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉండటంతో రామాయణ మేకర్స్‌కు ఇది ఊహించని షాక్ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.  అయితే భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే అత్యంత భారీ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్‌ను ప్లాన్ చేస్తున్న రామాయణ బృందం మాత్రం ఈ పోటీపై ఎంతో ధీమాగా ఉంది. ఈ చిత్ర అంతర్జాతీయ పంపిణీ హక్కులను గ్లోబల్ జెయింట్ సోనీ పిక్చర్స్ (Sony Pictures) సొంతం చేసుకోవడంతో నార్త్ అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తగినన్ని ప్రీమియం ఐమాక్స్ స్క్రీన్లు దక్కుతాయని ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా  నమ్మకంతో ఉన్నారు.      Also Read: మళ్ళీ మీ ముందుకు పిచ్చెక్కించే బోల్డ్, రొమాంటిక్ పార్ట్ 3 : కోరికలే గుర్రాలైతే! గాడ్జిల్లా మైనస్ జీరో విషయానికి వస్తే   దర్శకుడు తకాషి యమజాకి తెరకెక్కిస్తుండగా  గ్లోబల్ మార్కెట్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని జపాన్ సినిమా చరిత్రలోనే తొలిసారిగా పూర్తి ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేసిన ప్రత్యేక చిత్రంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన గాడ్జిల్లా ట్రైలర్‌లోని విజువల్స్, మైండ్ బ్లోయింగ్ సౌండ్ డిజైన్ అందుకు తగ్గట్టుగా ఉన్నాయి. మరి నవంబర్ 6, న జరగబోయే ఈ రెండు భారీ విజువల్ వండర్స్ మధ్య పోరు అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.      [Ramayana, Godzilla Minus Zero, Imax Clash, Ranbir Kapoor, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]  
గణపతి నవరాత్రులు ఎలా ప్రారంభం అయ్యాయి..వీటి వెనుక ఉన్న భారత చరిత్ర ఏమిటి.! గణపతి నవరాత్రుల మహోత్సవం కేవలం ఒక  పండుగ మాత్రమే కాదు. ఇది భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజా చైతన్యాన్ని, ఐక్యతను పెంపొందించడానికి ఉపయోగపడిన ఒక గొప్ప విప్లవాత్మక సామాజిక ఉద్యమం. ప్రాచీన కాలంలో వినాయక చవితి పూజలు ఇళ్లకే పరిమితమై, ఇళ్లలోనే భక్తి శ్రద్ధలతో జరుగుతుండేవి. శాతవాహనులు, రాష్టకూటులు, విజయనగర రాజుల కాలం నుండి గణేష్ ఉత్సవాల ప్రస్తావన ఉన్నప్పటికీ, అందరూ ఇప్పట్లో వీధుల్లో గణపతిని ప్రతిష్ట చేసి  గణపతి నవరాత్రులు జరుపుకోవడానికి  ప్రధాన కారణం బ్రిటిష్ పాలనా కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు. నేటి వినాయకచవితి నవరాత్రి ఉత్సవాల వెనుక చరిత్రలో జరిగిన కారణాలు ఏమిటో తెలుసుకుంటే.. గణపతి ఉత్సవాల వెనుక చరిత్ర.. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో మరాఠా సామ్రాజ్యంలో సంస్కృతి, జాతీయ భావాన్ని పెంపొందించడానికి వినాయక ఉత్సవాలను ప్రాచుర్యంలోకి తెచ్చారు. పీష్వాల పాలనలో వినాయకుడు వారి కులదైవం కావడంతో పూణేలో ఈ ఉత్సవాలు రాజ్యపండుగలా వైభవంగా సాగేవి. అయితే 1818లో పీష్వాల పాలన అంతరించి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం చేపట్టిన తర్వాత ఈ  ఉత్సవాలు ప్రాభవాన్ని కోల్పోయాయి.  ప్రజలు  ఇళ్లలోనే రహస్యంగా లేదా వ్యక్తిగతంగా పూజలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితిలో 19వ శతాబ్దం చివరలో ఒక పెద్ద మార్పు వచ్చింది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతదేశంలో స్వాతంత్ర్య కాంక్ష తీవ్రమైంది. దీనిని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1892 ప్రాంతంలో తీవ్రమైన ఆంక్షలు విధించింది. భారతీయ ప్రజలు రాజకీయంగా సమావేశం కాకుండా, గుమిగూడకుండా నిషేధాజ్ఞలు విధించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట చేరడం నేరంగా పరిగణించబడేది. ప్రజా సంఘాలు, రాజకీయ సమావేశాలపై కఠినమైన నిఘా ఉండేది. ఈ క్లిష్ట సమయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, లోకమాన్య బిపిన్ చంద్రపాల్, లాలా లజపతిరాయ్ లతో కలిసి పనిచేసిన గొప్ప నాయకుడు లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయ సమావేశాలపై నిషేధం విధించింది కానీ, మతపరమైన ఆచారాలు , ఉత్సవాలపై నేరుగా జోక్యం చేసుకోలేకపోయింది. ఈ అవకాశాన్ని తిలక్ తెలివిగా ఉపయోగించుకున్నారు. 1893లో పూణేలో ఆయన సార్వజనిక గణేశోత్సవ మండలిని ప్రారంభించి, ఇళ్లలోని పూజను వీధులకి, బహిరంగ వేదికలకి తీసుకువచ్చారు. తిలక్ గణపతి ఉత్సవాలను ఒక సామాజిక, రాజకీయ వేదికగా మలిచారు. పందిళ్లు వేసి గణపతి విగ్రహాలను ప్రతిష్టించడం ద్వారా ప్రజలందరూ ఒకచోట చేరే అవకాశం లభించింది. కుల మత భేదాలు లేకుండా ప్రజలందరూ ఒకే వేదికపైకి వచ్చి కలవడానికి ఈ ఉత్సవాలు తోడ్పడ్డాయి. ఉత్సవాల సందర్భంగా సంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, పద్య పఠనాలు నిర్వహించేవారు. వీటితో పాటు దేశభక్తి ఉపన్యాసాలు ఇస్తూ, స్వాతంత్ర్య ఉద్యమ భావాలను, బ్రిటిష్ పాలనలోని అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేవారు. ఈ తొమ్మిది లేదా పది రోజుల ఉత్సవాల కాలంలో విప్లవకారులు, స్వాతంత్ర్య సమరయోధులు రహస్యంగా సమావేశమై ప్రణాళికలు రచించుకోవడానికి వీలు కలిగింది. బ్రిటిష్ గూఢచారులు పందిళ్లలో ఏం జరుగుతుందో కనిపెట్టడం కష్టమయ్యేది. తిలక్ స్థాపించిన కేసరి, మరాఠా వార్తాపత్రికల ద్వారా ఈ గణపతి నవరాత్రుల సందేశం మహారాష్ట్ర అంతటా మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపించింది. ముంబై, పూణే, నాగపూర్ వంటి నగరాల్లో వేలాదిగా సార్వజనిక మండపాలు వెలిశాయి. స్వాతంత్రోద్యమంలో ఈ ఉత్సవాలు అందించిన చైతన్యం వెలకట్టలేనిది. ప్రజలలో జాతీయ సమైక్యతను, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో గణపతి నవరాత్రులు కీలక పాత్ర పోషించాయి. 1947లో దేశానికి స్వాతంత్ర్య లభించినప్పటికీ, తిలక్ ప్రారంభించిన ఈ సాంప్రదాయం భారతదేశ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిపోయింది. కాలక్రమేణా ఈ నవరాత్రుల ఉత్సవాలు మహారాష్ట్ర సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు , ఉత్తర భారత దేశమంతటా విస్తరించాయి. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు, లాల్ బాగ్ చారాజా వంటివి ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఈనాడు గణపతి నవరాత్రులు కేవలం పూజలకే పరిమితం కాకుండా, రకరకాల సామాజిక సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు , పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాలకు వేదికగా మారుతున్నాయి. ఈ విధంగా భక్తి భావనతో మొదలై, స్వాతంత్ర్య ఉద్యమ ఆయుధంగా రూపాంతరం చెంది, నేడు మహోన్నత సామాజిక ఉత్సవంగా విలసిల్లుతున్న గణపతి నవరాత్రుల వెనుక శతాబ్దాల భారతీయ చరిత్ర, సమరయోధుల వ్యూహాత్మక ఆలోచనలు , ప్రజల ఐక్యతా శక్తి దాగి ఉన్నాయి.                     *రూపశ్రీ.  
  వర్షాకాలం రాగానే చల్లటి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పలు రకాల ఆరోగ్య, సౌందర్య సమస్యలు కూడా మొదలవుతాయి. వర్షంలో తడవడం, తేమతో కూడిన వాతావరణం వల్ల కాళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో చాలామందిని వేధించే ప్రధాన సమస్య పగిలిన మడమలు మరియు పొడిబారిన పాదాలు. వర్షపు నీటిలోని బాక్టీరియా, బురద, మరియు వాతావరణంలో పెరిగే తేమ వల్ల పాదాల చర్మం నెర్రలు బారి పగుళ్లు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఈ పగుళ్ల నుంచి తీవ్రమైన నొప్పి, రక్తం కారడం లేదా ఇన్ఫెక్షన్లు రావడం జరుగుతుంది. అందుకే ఈ సీజన్‌లో ముఖ సంరక్షణతో పాటు పాదాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం. వర్షాకాలంలో పగిలిన మడమల సమస్య నుంచి ఉపశమనం పొందడానికి, పాదాలను మెరిసేలా మార్చుకోవడానికి నిపుణులు ఒక అద్భుతమైన చిట్కాను సూచిస్తున్నారు. అదే ఇంట్లోనే చేసుకునే సహజ సిద్ధమైన పెడిక్యూర్! ప్రతిరోజూ పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా, ఇంట్లోనే లభించే వస్తువులతో వారానికి 2 సార్లు ఈ పెడిక్యూర్ చేసుకోవడం వల్ల పగిలిన మడమల సమస్య నుంచి 100 శాతం విముక్తి లభిస్తుంది. ఈ పెడిక్యూర్ ప్రక్రియ పాదాలలోని మృతకణాలను తొలగించి, చర్మానికి అవసరమైన తేమను అందించి పాదాలను ఎంతో మృదువుగామారుస్తుంది. ఈ హోమ్ మేడ్ పెడిక్యూర్ చేయడం అత్యంత సులభం. ముందుగా ఒక వెడల్పాటి బకెట్ లేదా టబ్‌లో పగిలిన పాదాలు మునిగేంత గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. అందులో 1 నుండి 2 చెంచాల ఎప్సమ్ సాల్ట్ లేదా సాధారణ ఉప్పు, కొద్దిగా మైల్డ్ షాంపూ మరియు ఒక నిమ్మకాయ రసం పిండాలి. ఈ నీటిలో మీ పాదాలను దాదాపు 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. గోరువెచ్చని నీటి వల్ల పాదాలపై ఉన్న గట్టి చర్మం మరియు పగుళ్లు మృదువుగా మారుతాయి. నిమ్మకాయలోని యాంటీబాక్టీరియల్ గుణాలు బాక్టీరియాను అంతం చేస్తే, ఉప్పు అలసటను తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. పాదాలు బాగా నానిన తర్వాత ప్యూమిస్ స్టోన్ (Pumice Stone) లేదా ఫుట్ స్క్రబ్బర్ సహాయంతో మడమలను సున్నితంగా రుద్దాలి. దీనివల్ల పాదాలపై ఉన్న మృతకణాలు (Dead Cells) సులభంగా తొలగిపోతాయి. స్క్రబ్బింగ్ పూర్తయిన తర్వాత పాదాలను మంచి నీటితో కడిగి శుభ్రమైన తువ్వాలుతో తుడుచుకోవాలి. అనంతరం పాదాలకు తగినంత తేమను అందించడానికి కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లేదా మంచి మోయిశ్చరైజింగ్ క్రీమ్‌ను రాసి 2 నుండి 3 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. రాత్రి పూట ఈ పెడిక్యూర్ చేసుకుని, ఆ తర్వాత సుతిమెత్తని కాటన్ సాక్స్ (Socks) ధరించి నిద్రపోవడం వల్ల నూనె చర్మంలోకి బాగా ఇంకి పాదాలు పట్టులాగా మారుతాయి. వారానికి కనీసం 2 సార్లు ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే కేవలం 2 వారాల్లోనే పగిలిన మడమలు పూర్తిగా నయమై, పాదాలు అందంగా తయారవుతాయి. దీనితో పాటు వర్షాకాలంలో తడి బూట్లు, తడి సాక్స్ ఎక్కువ సేపు వేసుకోకూడదు. వర్షంలో తడిసిన వెంటనే పాదాలను శుభ్రమైన నీటితో కడుక్కుని పొడిగా ఉంచుకోవాలి. సులభమైన ఈ జాగ్రత్తలు పాటిస్తూ, వారానికి రెండుసార్లు పెడిక్యూర్ చేయడం వల్ల వర్షాకాలంలో కూడా మీ పాదాల అందం, ఆరోగ్యం 100 శాతం పదిలంగా ఉంటాయి.     Pedicure twice a week for soft feet, monsoon foot care tips, and remedies.
  మన భారతీయ వంటకాల్లో పచ్చళ్లకు ఉన్న స్థానమే వేరు. రోజూ తినే ఆహారంలో కాస్త పచ్చడి నంచుకుంటే ఆ రుచే వేరు, మనసుకు కలిగే తృప్తి వేరు. అయితే నేటి ఆధునిక జీవనశైలిలో చాలామంది బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం, గుండె సమస్యలు లేదా ఇతర ఆరోగ్య కారణాల వల్ల నూనె వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని భావిస్తున్నారు. సాధారణంగా తెలుగు ఇళ్లలో పచ్చళ్లు చేయాలంటే నూనెలో ఎండుమిర్చి, ఇతర దినుసులు వేయించడం లేదా పచ్చడికి భారీగా తిరగమాత (తాళింపు) వేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ నూనె ఒక్క చుక్క కూడా వాడకుండా, ఎంతో ఘుమఘుమలాడే సువాసనతో, నోరూరించే రుచితో పాటు 100 శాతం నిండు ఆరోగ్య ప్రయోజనాలను అందించే  ఆయిల్ ఫ్రీ కొత్తిమీర పచ్చడి  (Oil Free Coriander Chutney) ని క్షణాల్లో తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? పోషకాలతో నిండిన కొత్తిమీరతో చేసే ఈ సాంప్రదాయ వంటకం కేవలం నోటికి రుచిని అందించడమే కాకుండా శరీరానికి దివ్యమైన ఆరోగ్య వరప్రదాయినిగా పనిచేస్తుంది. కొత్తిమీరను ప్రతిరోజూ మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు మరియు ఖనిజాలు అందుతాయి. కొత్తిమీరలో విటమిన్ ఎ, విటమిన్  సి, విటమిన్  కె లతో పాటు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మరియు పీచు పదార్థం (ఫైబర్) సమృద్ధిగా ఉంటాయి. నూనె లేకుండా ఈ పచ్చడిని తయారు చేసినప్పుడు అందులోని పోషక విలువలు ఏమాత్రం నశించకుండా 100 శాతం శరీరానికి నేరుగా అందుతాయి. కొత్తిమీరలో ఉండే అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్స్‌ను అంతం చేసి రోగనిరోధక శక్తిని విశేషంగా పెంపొందిస్తాయి. ముఖ్యంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, హై బీపీని అదుపు చేయడంలో మరియు మధుమేహం ఉన్నవారిలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరించడంలో ఈ ఆయిల్ ఫ్రీ పచ్చడి సమర్థవంతంగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థను వేగవంతం చేసి గ్యాస్, అసిడిటీ మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఈ అద్భుతమైన నూనె లేని కొత్తిమీర పచ్చడి తయారు చేసుకోవడానికి మన ఇంట్లో ఎప్పుడూ లభించే దినుసులే సరిపోతాయి. ఈ పచ్చడి తయారీ కోసం 2 కప్పుల తాజా కొత్తిమీర (బాగా కడిగి తరిగినది), మీ కారానికి సరిపడా 4 నుండి 6 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టీస్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ పరిమాణంలో చింతపండు, రుచికి సరిపడా రాతి ఉప్పు మరియు కొద్దిగా రుచిని పెంచడానికి 2 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు లేదా పుట్నాల పప్పును సిద్ధం చేసుకోవాలి. తయారీ విధానం అత్యంత సులభం! మొదటగా చింతపండును కొద్దిగా వేడి నీటిలో నానబెట్టుకోవాలి. అనంతరం ఒక బాణలిలో నూనె వేయకుండా కేవలం పచ్చిమిర్చి, జీలకర్రను డ్రై రోస్ట్ (డ్రైగా వేయించడం) చేసుకోవాలి. పల్లీలను కూడా విడిగా వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లేదా సాంప్రదాయ రోలు తీసుకుని మొదట వేయించిన పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, వేయించిన పల్లీలు, నానబెట్టిన చింతపండు మరియు ఉప్పు వేసి బరకగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత తాజా కొత్తిమీరను అందులో వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే! ఎలాంటి నూనె లేదా తాళింపు అవసరం లేకుండా ఘుమఘుమలాడే హెల్తీ కొత్తిమీర పచ్చడి సిద్ధమవుతుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా కలుపుకుని తిన్నా, ఇడ్లీ, దోస, ఉప్మా, పెసరట్టు, గారెలు లేదా రోటీలలోకి నంచుకుని తిన్నా రుచి అద్భుతంగా ఉంటుంది. జీరో ఆయిల్ కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మరియు డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారికి ఇది 100 శాతం పర్ఫెక్ట్ హెల్త్ డైట్ చట్నీగా నిలుస్తుంది.       Kothimeera pachadi without oil guide, healthy zero oil coriander green chutney.
కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలిసినప్పుడు చాలామందిలో భయం, ఆందోళన మొదలవుతాయి. అయితే ప్రతి కిడ్నీ సమస్య తీవ్రమైనదే అని భావించాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో సమస్యను గుర్తించి, తగిన వైద్య సలహా తీసుకుంటే కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ TeluguOne Health వీడియోలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు, HOD, నెఫ్రాలజీ, NIMS Hospital, Hyderabad, కిడ్నీ సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి? ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? కిడ్నీ వ్యాధి ఉందని తెలిసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీ సమస్యలు ఉన్నవారు భయపడాల్సిన అవసరం ఎందుకు లేదు? వంటి ముఖ్యమైన ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకోవచ్చు. కిడ్నీ ఆరోగ్యంపై సరైన అవగాహన కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆరోగ్యకరమైన జీవనశైలికి అవసరమైన సూచనలను తెలుసుకోండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలకు తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
నేటి ఆధునిక జీవనశైలిలో వెన్నునొప్పి అనేది చాలామందిని వేధించే ప్రధాన సమస్యగా మారింది. గంటల తరబడి డెస్క్ ముందు కూర్చుని పనిచేసే ఐటీ ఉద్యోగులు, ఆఫీస్ సిబ్బంది ఒకవైపు అయితే, ప్రతిరోజూ ట్రాఫిక్‌లో కిలోమీటర్ల కొద్దీ బైక్ ప్రయాణాలు చేసేవారు మరొకవైపు. ఈ రెండు రకాల పనుల వల్ల వెన్నెముకపై చాలా ఒత్తిడి పడి, చిన్న వయస్సులోనే తీవ్రమైన వెన్నునొప్పి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది భవిష్యత్తులో డిస్క్ సమస్యలు, నరాల బలహీనతకు దారితీసే అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. అవేంటో తెలుసుకుంటే.. కూర్చునే పద్ధతిపై దృష్టి పెట్టాలి.. కుర్చీలో కూర్చున్నప్పుడు వీపు కుర్చీకి సరిగ్గా ఆనుకుని ఉండేలా చూసుకోవాలి. నడుము వెనుక భాగంలో ఖాళీ లేకుండా చిన్న కుషన్ లేదా పిల్లో పెట్టుకోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. కంప్యూటర్ లేదా లాప్‌టాప్ స్క్రీన్  కళ్ళ ఎత్తులోనే ఉండాలి. స్క్రీన్ కిందకు ఉన్నప్పుడు మెడ, వెన్ను భాగం ముందుకు వంగి నొప్పికి కారణమవుతాయి.  ప్రతి నలభై ఐదు నిమిషాలకు ఒకసారి సీటు నుంచి లేచి కనీసం రెండు నిమిషాలు అటు ఇటూ నడవడం లేదా శరీరాన్ని స్ట్రెచ్ చేయడం అలవాటు చేసుకోవాలి. బైక్ జర్నీలు చేసేవారికి జాగ్రత్తలు.. రైడింగ్ చేసేటప్పుడు వీపును పక్కకు లేదా ముందుకు ఎక్కువగా వంచకుండా నిటారుగా కూర్చోవాలి. బైక్ షాక్ అబ్జార్బర్లను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం. రోడ్డుపై ఉండే గోతులు, స్పీడ్ బ్రేకర్ల వల్ల వచ్చే షాక్స్ నేరుగా వెన్నెముకపై పడతాయి. అందుకే ప్రయాణంలో హెల్మెట్‌తో పాటు నడుముకు సపోర్ట్ ఇచ్చే లుంబార్ బెల్ట్ వాడటం మంచిది. దూర ప్రాంతాలకు బైక్‌పై వెళ్లేవారు మధ్యమధ్యలో ఆగి కాసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల కండరాల ఒత్తిడి తగ్గుతుంది. వెన్నునొప్పికి ప్రధాన కారణం నడుము , పొత్తికడుపు భాగంలోని కండరాలు బలహీనపడటమే. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కనీసం ఇరవై నిమిషాలు వ్యాయామం చేయడానికి కేటాయించాలి. భుజాలు, నడుము, మెడ భాగాలను సాగదీసే స్ట్రెచింగ్ వ్యాయామాలు, యోగాలోని భుజంగాసనం, మార్జాలాసనం వంటివి వెన్నెముకను బలంగా, దృఢంగా మారుస్తాయి. ఈ వ్యాయామాలు కండరాలకు రక్తప్రసరణను పెంచి నొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. నీరు.. శరీరంలో నీటి శాతం తగ్గితే వెన్నెముక డిస్కులు తమ శోషణ శక్తిని కోల్పోయి త్వరగా అరిగిపోతాయి. అందుకే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి. ఆహారంలో క్యాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి12 ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పాలు, ఆకుకూరలు, గుడ్లు, బాదం , నువ్వులు రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవాలి. శరీర బరువు పెరగకుండా చూసుకోవడం కూడా వెన్నునొప్పి నివారణలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. నిద్ర.. రాత్రి వేళల్లో సరైన నిద్ర లేకపోవడం లేదా సరిగ్గా లేని మెత్తటి పరుపులపై పడుకోవడం వల్ల కూడా వెన్నునొప్పి పెరుగుతుంది. మరీ మెత్తగా ఉన్న పరుపుల కంటే వెన్నెముకకు సరైన ఆధారాన్ని ఇచ్చే ఆర్థోపెడిక్ పరుపులను ఉపయోగించడం మంచిది. చిన్న చిట్కా..  పడుకునేటప్పుడు కాళ్ళ మధ్యలో చిన్న దిండు పెట్టుకోవడం వల్ల నడుముపై పడే భారం తగ్గుతుంది. ఈ చిన్నపాటి మార్పులను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా డెస్క్ జాబ్‌లు, బైక్ ప్రయాణాల వల్ల వచ్చే వెన్నునొప్పికి సులభంగా చెక్ పెట్టవచ్చు. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉండి, కాళ్ళలోకి పాకుతున్నట్లు అనిపిస్తే ఆలస్యం చేయకుండా ఆర్థోపెడిక్ లేదా ఫిజియోథెరపీ వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం.                     *రూపశ్రీ.  
మహిళల శరీరంలో ఏ వయసులో ఎలాంటి మార్పులు వస్తాయో సరిగ్గా గమనిస్తే, ముప్పై ఏళ్లు అనేది ఒక ప్రధానమైన మలుపు అని చెప్పవచ్చు. ఇరవైల వయసులో ఉండే ఎనర్జీ, వేగంగా కోలుకునే తత్వం ముప్పైకి వచ్చేసరికి కాస్త మందగిస్తాయి. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం విషయంలో చాలామందికి తెలియని, తెలిసినా నిర్లక్ష్యం చేసే అనేక విషయాలు ఉంటాయి. చాలామంది ఎముకల బలహీనత లేదా ఆస్టియోపోరోసిస్ అనేది కేవలం అరవై ఏళ్లు దాటిన ముసలివారికి మాత్రమే వచ్చే సమస్య అని భావిస్తారు. కానీ ఎముకలు గుల్లబారే ప్రక్రియ , వాటి నాణ్యత తగ్గడం అనేది నిశ్శబ్దంగా ముప్పై ఏళ్ల వయసు నుంచే ప్రారంభమవుతుంది. ఈ విషయం  అందరూ నమ్మే  అపోహలు, వాటి వెనుక ఉన్న సైన్స్ , ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన  ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే..  ఎముకల మార్పు.. మన శరీరంలోని ఎముకలు ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండే నిర్జీవ నిర్మాణాలు కావు. అవి నిరంతరం మారుతూ ఉండే సజీవ కణజాలాలు. పాత ఎముక కణజాలం తొలగిపోవడం ,  దాని స్థానంలో కొత్త ఎముక కణజాలం ఏర్పడటం అనే ప్రక్రియ జీవితాంతం జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియను బోన్ రీమోడలింగ్ అంటారు. చిన్నతనం నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ల వయసు వరకు శరీరం పాత కణజాలాన్ని తొలగించే వేగం కంటే కొత్త కణజాలాన్ని నిర్మించే వేగమే ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాన్నే పీక్ బోన్ మాస్ అంటారు. అంటే జీవితంలో ఎముకలు చాలా సాంద్రతతో, బలంగా ఉండే స్థితి ఇదే. 30 ఏళ్ల తర్వాత.. ముప్పై ఏళ్లు దాటిన తర్వాత ఎముకల దశ పూర్తిగా మారిపోతుంది. శరీరం కొత్త ఎముకను నిర్మించే వేగం కంటే, పాత ఎముక కణజాలాన్ని కోల్పోయే వేగం పెరగడం మొదలవుతుంది. దీనిని సాధారణ భాషలో బోన్ లాస్ లేదా బోన్ డెన్సిటీ తగ్గడం అంటారు. ఈ మార్పు ముప్పైలలోనే మొదలైనప్పటికీ, ప్రారంభంలో ఎలాంటి నొప్పులు లేదా స్పష్టమైన లక్షణాలు ఉండవు. అందుకే దీనిని సైలెంట్ చేంజ్ అని పిలుస్తారు. ఈ వయసులో శ్రద్ధ తీసుకోకపోతే, నలభై,  యాభై ఏళ్లలో స్వల్పంగా కిందపడినా ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతుంది. కాల్షియం సరిపోతుందా? ఎముకల బలహీనత అనగానే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది కాల్షియం. చాలామంది వెంటనే కాల్షియం మాత్రలు వేసుకోవడం లేదా పాలు తాగడం మొదలుపెడతారు. కానీ నిజానికి కాల్షియం ఒక్కటే ఎముకలను కాపాడలేదు. మీరు ఎంత కాల్షియం తీసుకున్నా, దానిని శరీరం పీల్చుకోవడానికి విటమిన్ డి3 చాలా అవసరం. సూర్యరశ్మి సరిగ్గా తగలకపోవడం వల్ల నేటి కాలంలో ఎంతోమంది మహిళలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. దీనితో పాటు విటమిన్ కె2, మెగ్నీషియం, భాస్వరం వంటి ఇతర మూలకాలు కూడా సరిపడా లేకపోతే, తిన్న ఆహారంలోని కాల్షియం ఎముకలకు చేరకుండా రక్తంలోనే ఉండిపోతుంది లేదా మూత్రపిండాల్లో రాళ్లుగా మారే ప్రమాదం ఉంటుంది. హార్మోన్ల పాత్ర.. 30 ఏళ్ల తర్వాత  వయసులో హార్మోన్ల పాత్ర కూడా చాలా కీలకమైనది. మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ఎముకల సాంద్రతను కాపాడటంలో రక్షణ కవచంలా పనిచేస్తుంది. ముప్పై ఐదు దాటిన తర్వాత లేదా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు, థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు ఈస్ట్రోజెన్ స్థాయిలలో హెచ్చుతగ్గులు వస్తాయి.  ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గిన ప్రతిసారీ ఎముకలు తమ సాంద్రతను వేగంగా కోల్పోతాయి. ముఖ్యంగా గర్భధారణ, పాలిచ్చే సమయాల్లో తల్లి శరీరం నుంచి అధిక మొత్తంలో కాల్షియం బిడ్డకు అందుతుంది. ఆ సమయంలో తగినంత పోషకాహారం తీసుకోకపోతే, ఆ లోపం వయసయ్యే కొద్ది స్పష్టంగా బయటపడుతుంది. వ్యాయామం.. వ్యాయామం విషయంలో కూడా చాలామంది మహిళలు పొరబడుతుంటారు. ప్రతిరోజూ నడవడం లేదా ఇంటి పనులు చేయడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయని అనుకుంటారు. నడక గుండె ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, ఎముకల సాంద్రతను పెంచడానికి లేదా బలంగా ఉంచడానికి వేర్ బేరింగ్ వ్యాయామాలు , రెసిస్టెన్స్ ట్రెయినింగ్ అవసరం. అంటే కాస్త బరువులు ఎత్తడం, పుష్ అప్స్ చేయడం, సొంత శరీర బరువును ఉపయోగించి చేసే వ్యాయామాలు చేయడం వల్ల ఎముకలపై కొంత ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడికి స్పందనగానే శరీరం ఎముకల సాంద్రతను పెంచే కణాలను వేగంగా ఉత్పత్తి చేస్తుంది. ఎముకలకు నష్టం కలిగించే అలవాట్లు.. ఆధునిక జీవనశైలిలోని కొన్ని అలవాట్లు ఎముకలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయి. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ లో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్ , ఉప్పు ఎముకల్లోని కాల్షియంను బయటకు లాగేస్తాయి. కాఫీలు, టీలు ఎక్కువగా తాగడం వల్ల కూడా కాల్షియం శోషణ మందగిస్తుంది. ఇక క్రాష్ డైటింగ్ లు చేస్తూ సడన్ గా బరువు తగ్గడం వల్ల కొవ్వుతో పాటు ఎముకల సాంద్రత కూడా దారుణంగా పడిపోతుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ముప్పై ఏళ్లు దాటిన మహిళలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్ద పెద్ద ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ ఉదయం కాసేపు ఎండలో గడపడం, ఆకుకూరలు, రాగులు, నువ్వులు, విత్తనాలు, పాలు వంటి సమతులాహారాన్ని భాగం చేసుకోవడం, వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయడం , క్రమం తప్పకుండా విటమిన్ డి, కాల్షియం స్థాయిలను చెక్  చేయించుకోవడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చు. నలభై ఏళ్ల తర్వాత ఎముకల సమస్యలతో బాధపడేకంటే, ముప్పైల నుంచే ఎముకల ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం ఎంతో శ్రేయస్కరం.                   *రూపశ్రీ.