యమదొంగలో ఎన్టీఆర్ నాచోరే నాచోరే అంటూ డాన్స్ చేస్తుంటే నోరెళ్లబెట్టి చూడాల్సిందే...కూర్చి మడతపెట్టి అని.. మహేష్ లుంగీ మడతేడితే థియేటర్ ఉగిపోయంది.. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు.. బాస్ లో ఇంకా తగ్గని గ్రేస్.. యస్ ఈపాటికే మీకు అర్ధమైపోయివుంటుంది... ఈ రోజు డాన్స్ ల్లో మొనగాడు ఎవరు.? తెలుసుకుందాం..! అలానే మీకు ఇష్టమైన డాన్సర్ ఎవరో కామెంట్ చేయండి..
నాకు ఉదయాన్నే లేచి టీవీ ఆన్ చేసే అలవాటుంది.. ఈ రోజు కూడా ఎప్పటిలాగానే టీవీ ఆన్ చేశాను.. ఇంతలోనే ఎన్టీఆర్ యాపిల్ బ్యూటీ సాంగ్ వస్తుంది ఇక నేను ఆగుతానా తెలియకుండానే డాన్స్ మొదలుపెట్టాను.. షడన్ గా నేతమేడమొట్టికాయ కొట్టింది మా అమ్మ ఏంటి ఈ గోల అని.. మా అమ్మ తో చూడు ఎన్టీఆర్ ఎలా చేస్తున్నాడో డాన్స్ అన్నా...
మా అమ్మ చిరంజీవి ఫ్యాన్.. నాకు చిరంజీవి డాన్స్ తర్వాతే ఎవరి డాన్స్ ఐనా అన్నది.. అప్పుడు మొదలయింది.. నాకు టాలీవుడ్ లో ఎవరు గొప్ప డాన్సర్ అనే లోచన.. సో ఇప్పుడు మన టాలీవుడ్ లో డాన్స్ ఎలా రూపాంతరం చెందుతూ ఒచ్చిందో ఓ లుక్ ఎద్దాం.!
"కాలంతో పాటు మనుషులే కాదు... మన తెలుగు సినిమా డ్యాన్స్ కూడా అప్‌డేట్ అవుతూ వచ్చింది! అప్పట్లో భావవ్యక్తీకరణగా మొదలైన ఒక చిన్న అడుగు... ఈరోజు అంతర్జాతీయ వేదికలపై మోత మోగిస్తోంది. అసలు మన టాలీవుడ్ హీరోలు డ్యాన్స్‌ని ఏ రేంజ్‌కి తీసుకెళ్లారో తెలుసా? లెట్స్ డైవ్ ఇన్!"
"1950లు, 60లలో డ్యాన్స్ అంటే నాటకాల ప్రభావమే ఎక్కువ. కూచిపూడి, భరతనాట్యం హావభావాలు, చేతుల ముద్రలు, చిన్న చిన్న అడుగులనే డ్యాన్స్‌గా భావించేవారు. కానీ ఏఎన్నాఆర్, ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ గార్ల రాకతో కథ మారింది!
ముఖ్యంగా డ్యాన్స్‌కి ఒక స్టార్‌డమ్ తెచ్చింది మన ఏఎన్నాఆర్ గారే. మనమంతా డ్యాన్స్‌ని ప్రేమించడం స్టార్ట్ చేసింది ఆయనతోనే! ఇక మన అన్నగారు ఎన్టీఆర్ తక్కువేమీ తినలేదు... తన ఊర మాస్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ప్రతి తెలుగు వాడినీ డ్యాన్సర్‌గా మార్చేశారు. స్క్రీన్ మీద ఆయన కాలు కదిపితే చాలు... థియేటర్లలో కనకవర్షం కురిసేది!"
"అయితే, 70ల చివరలో, 80లలో టాలీవుడ్ డ్యాన్స్ ల్యాండ్‌స్కేప్ పూర్తిగా మారిపోయింది! సౌత్ ఇండియాకే 'బ్రేక్ డ్యాన్స్'ను పరిచయం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి అడుగుపెట్టారు. డ్యాన్స్ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం మొదలైంది! చిరు వేసే స్టెప్స్‌కి ఫ్యాన్స్ థియేటర్లలో పూనకం వచ్చినట్లు ఊగిపోయేవారు. 'డ్యాన్స్ సరిగ్గా లేకపోతే సినిమా బాగోలేనట్లే' అనే స్థాయికి ట్రెండ్ సెట్ చేశారు. ఆయనతో పాటు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌గారలు కూడా తమదైన శైలిలో వైవిధ్యాన్ని తీసుకొచ్చి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు!"
ప్రభుదేవా, లారెన్స్ డ్యాన్స్ క్లిప్స్... ఆ వెంటనే రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ పొతినేనిల హై-స్పీడ్, అక్రోబాటిక్ డ్యాన్స్ మూమెంట్స్. "90ల నాటికి ప్రభుదేవా, లారెన్స్ వంటి యంగ్ కొరియోగ్రాఫర్లు రావడం, అక్రోబాటిక్స్, ఫ్లెక్సిబిలిటీ, హై-ఎనర్జీ మూమెంట్స్ తారస్థాయికి చేరాయి.
ఇక 2000ల తర్వాత పరిస్థితి ఏంటి? జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రామ్ పోతినేని వంటి యంగ్ జనరేషన్ హీరోలు మన టాలీవుడ్ డ్యాన్స్ బెంచ్‌మార్క్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు! క్లాసికల్ బేస్, హిప్ హాప్, పాపింగ్ అండ్ లాకింగ్, మూన్‌వాక్స్‌తో 'స్టైలిష్ డ్యాన్స్'కి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు. స్టిల్... ఈ నిమిషం కూడా ఏదో ఒక కొత్త డ్యాన్స్ మూమెంట్ మనల్ని ఫిదా చేయడానికి రెడీ అవుతూనే ఉంది. మన మాస్టర్లు కూడా తమ ప్రభావాన్ని చాటుతూనే ఉన్నారు. అప్పటి భావవ్యక్తీకరణ నాట్యం నుండి ఇప్పటి అంతర్జాతీయ గ్లోబల్ ట్రెండ్ వరకు... తెలుగు సినిమా డ్యాన్స్ ప్రయాణం ఒక అద్భుతం, మన అభిమానులకి ఒక విజువల్ ఫీస్ట్!
సో... మనతో పాటే అప్‌డేట్ అవుతున్న డ్యాన్స్‌కి గట్టిగా ఒక 'ఓయ్' చెప్పేద్దాం! అంతకంటే ముందు... మీరు చేస్తున్న డ్యాన్స్‌ని ఒక్క నిమిషం హోల్డ్‌లో ఉంచి, మన టాలీవుడ్ హీరోల్లో మీకు ఎవరి డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం? ఏ సిగ్నేచర్ మూమెంట్స్ అంటే ప్రాణం? అనేది కింద కామెంట్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. బికాజ్... డ్యాన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ ఫర్ యు అండ్ మీ! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్‌డేట్స్ కోసం ఛానెల్‌కి సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్!".
[Chiranjeevi, Balakrishna, Nagarjuna, venkatesh, Ntr, Allu arun, Ram Chran,Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]