LATEST NEWS
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..! తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త చర్చనీయాంశంగా మారిన పరిణామంలో, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సంచలన సవాల్ విసిరారు. మాక్ అసెంబ్లీలు పెట్టి బీసీ నేతకు ముఖ్యమంత్రి స్థానం కల్పించడం కేవలం డ్రామాలని, నిజంగా దమ్ముంటే బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.  ఎలాగో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభకు రారూ కదా, మరి బీసీలు  ఎస్సీలపై ఈ కపట ప్రేమ ఎందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్ తన స్థానంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రతిపక్ష నేత బాధ్యతలు అప్పగిస్తే, ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం మాయమాటలు చెబుతూ దళితులు, బీసీలను మోసం చేయడం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు ఏమాత్రం లేదని మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా ఆరోపించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పుగా మలిచారని, మూడెకరాల భూమి పంపిణీ గానీ, ప్రతిష్టాత్మకమైన దళిత బంధు పథకం అమలును గానీ పూర్తిగా విస్మరించారని గుర్తుచేశారు. కేవలం ఎన్నికల సమయంలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం సరికాదని, ఆయన ఆశయాలను, సూచనలను నిజ జీవితంలో పాటించాలని హితవు పలికారు.  నాటి TRS 2003 డాక్యుమెంట్‌ను కూడా సరిగా పట్టించుకోని చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని విమర్శించారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తామనడం సరికాదని, ముందుగా తమ బుర్రలోని పాత, కుహనా ఆలోచనలను శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చురకలంటించారు. కాలం మారిపోయిందని, నేడు దళితులు నగరాలకు వచ్చి ఉన్నత స్థాయికి చేరుకున్నారని, కాలం చెల్లిన దొరలను ప్రజలు ఫామ్ హౌస్‌లకు పరిమితం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి దళితులకు, వెనుకబడిన వర్గాలకు తీవ్రమైన అవమానాలు జరిగినా కేసీఆర్ నుంచి ఎన్నడూ సరైన స్పందన రాలేదని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను చూసి 'అధ్యక్షా' అనాల్సి వస్తుందనే భయంతోనే కేసీఆర్ సభకు రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎలాంటి స్పష్టమైన విజన్ లేకుండా రాష్ట్రాన్ని పాలించి, రాష్ట్రాన్ని తీవ్రమైన అప్పులపాలు చేశారని మండిపడ్డారు.  అయినప్పటికీ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే, మరోవైపు ప్రజా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మిగిలిన రెండున్నరేళ్ల పాలనా కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క ఎన్నికల హామీని కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ పీసీసీ చీఫ్ తన ప్రసంగాన్ని ముగించారు.       [ MLC Mahesh Kumar Goud, Talasani Srinivas Yadav, KCR, PCC Chief, BRS, Congress,  BRS, CM Revanth reddy, KCR, KTR, Telugu One, Telugu News ]
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు. కొండా కుటుంబానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు.“కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు” అని కొండా మురళి స్పష్టం చేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. కొండా సురేఖకు మద్దతుగా వచ్చిన కార్యకర్తలు ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  “కొండాను ఢీకొట్టడం ఈ గొర్రెల వల్ల కాదు” అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని గొర్రెలు, గుంటనక్కలు అన్నీ ఒక్కటై కొండాను ఢీకొట్టాలని చూస్తున్నాయని, అయితే అది సాధ్యం కాదని అన్నారు. ఈ సందర్భంగా కార్యక ర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. “పులి.. పులి.. పులి.. బెబ్బులి.. కొండా మురళి వేట పులి” అంటూ నినాదాలతో హోరెత్తించారు. కొండా కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కార్యకర్తలు తెలిపారు. “మీరు నక్సల్స్‌లోకి వెళ్తే.. మీతోనే నక్సల్స్‌లోకి వస్తాం” అంటూ కొండా మురళికి, కొండా సురేఖకు అభయం ఇచ్చారు. కొండా కుటుంబం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. తాజా పరిణా మాలతో స్థానికంగా కొండా వర్గం రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.       [ Konda Murali, Konda Surekha, Congress party, Warangal, CM Revanth reddy, Konda sushmitha, Telugu One, Telugu News]  
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏర్పడిన భేదాభిప్రాయాల కారణంగా ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్యే కొండా సురేఖను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. మంత్రి పదవిని కోల్పోయిన నాటి నుంచి అసెంబ్లీ జరుగుతున్న ప్రస్తుత వర్షాకాల సమావేశాలకు దూరంగా ఉంటున్న ఆమెతో, తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా ఫోన్లో మాట్లాడారు.  పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాలను పక్కనబెట్టి, వ్యక్తిగత సమస్యలను విడనాడి మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాల్సిన ఆవశ్యకతను ఆమెకు వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ఆమె హాజరుకాకపోవడం కాంగ్రెస్ పార్టీ సర్కిళ్లలో తీవ్ర దుమార రేపింది.  ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను మీనాక్షి నటరాజన్‌కు అప్పగించినట్లు సమాచారం. ఫోన్ సంభాషణ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఢిల్లీ నుంచి నేరుగా రావాల్సిందిగా కొండా సురేఖకు పార్టీ పెద్దల నుంచి పిలుపు అందడం ప్రాధాన్యత సంతరించుకుంది.  మంత్రి పదవిని కోల్పోయి తీవ్ర అసంతృప్తితో రగులుతున్న సురేఖను కూడగట్టే క్రమంలో భాగంగానే హైకమాండ్ ఈ చర్యలు చేపట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఆమెకు త్వరలోనే కేబినెట్ స్థాయి లేదా సముచితమైన మరో ఉన్నత పదవిని అప్పగించే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటం గమనార్హం. గతంలో వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఆమె కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, పరకాల అసెంబ్లీ స్థానంపై చెలరేగిన వివాదం తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి.   తన బిడ్డ చేసిన వ్యాఖ్యలకు తల్లిగా తనను బాధ్యురాల్ని చేసి బలిపశువును చేయడం ఎంతవరకు సమంజసమని సురేఖ గతంలో బహిరంగంగానే ప్రశ్నించిన సంగతి తెలిసిందే. బీసీ వర్గానికి చెందిన తనపైనే కఠిన చర్యలు తీసుకున్నారని, పార్టీలో కొందరికే ఒక రకమైన న్యాయం, తమలాంటి వారికి మరో న్యాయం జరుగుతోందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారకుండా చూసేందుకు హైకమాండ్ వేగంగా పావులు కదుపుతోంది. ఫోన్ కాల్ చర్చల తర్వాత, ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న కొండా సురేఖతో పార్టీ పెద్దలు జరిపే సమావేశం తర్వాత ఈ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందనే అంశంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.         [ Konda Surekha, Congress High Command, Meenakshi Natarajan, Telangana Politics, CM Revanth Reddy, Congress Cabinet, Congress party, Parakala assembly, Konda Sushmita Patel, Telugu One, Telugu News ]
  What Can Today’s Generations Learn From G.D. Naidu? Today, we have almost everything. We have smartphones. We have Google. We have YouTube. We have AI. We have online courses. We have access to knowledge from almost every corner of the world. But with all this access to technology and information… Are we creating enough? Recently, while watching the biopic GDN, I came across the life of G.D. Naidu—an inventor, industrialist and experimenter whose life was far ahead of the technology available during his time. The film itself presents his journey as that of an inventor overcoming enormous challenges during the colonial era. (Netflix) And one question kept coming back to me… How did a man who lived more than 100 years ago, with very limited formal education, develop such extraordinary curiosity about machines, technology and innovation? How did he look at a machine and think, “How does this work?” And then try to understand it? How did he look at a problem and think, “Can I build a better solution?” That was G.D. Naidu. And perhaps the biggest lesson today's generations can learn from his life is not simply how to become an inventor. It is… How to become curious again. Don't Just Use Technology. Understand It. Today, we use technology every minute. We use smartphones, but how many of us understand how they actually work? We use AI, but how many of us are curious about what is happening behind it? We use machines every day, but how many of us stop and ask: “Can this be made better?” G.D. Naidu had a different relationship with technology. He didn't just want to use machines. He wanted to understand them. His curiosity eventually extended into electrical, mechanical and automotive technology, among other areas. He experimented, manufactured and developed practical solutions rather than simply being a passive consumer of technology. Today, technology is everywhere. But perhaps what we need most is not more technology. We need more people who are curious enough to understand it. Your Degree Should Not Be the End of Your Education G.D. Naidu's formal education was limited. But he never allowed that to become the limit of his learning. He learned through observation. Through experimentation. Through machines. Through travel. Through experience. Through mistakes. Through doing. This doesn't mean formal education is unimportant. It means something else: A classroom should be the beginning of learning, not the boundary of learning. Today, a student can learn from the world's best universities without even leaving home. The knowledge is available. The technology is available. The opportunities are available. The question is: Are we using them? Learn by Doing Perhaps one of the most important ideas we can take from G.D. Naidu's approach to education is simple: Learn by doing. Not just reading about something. Not just watching someone else do it. Do it yourself. Build something. Break something. Experiment. Fail. Understand why it failed. Try again. This is where real learning begins. Imagine a child learning electricity only from a textbook. And imagine another child being allowed to build a simple electrical circuit with their own hands. Which child is more likely to remember the lesson? Today, we have simulations, laboratories, robotics kits, 3D printers, coding platforms and AI. We have more tools for hands-on learning than ever before. So the question is not whether resources exist. The question is whether we are using them to create, or simply using technology to consume. Don't Wait for Perfect Resources When we think about innovation today, we often imagine expensive laboratories, advanced equipment and large teams. But G.D. Naidu's journey tells us that innovation can begin much earlier than that. With a machine. With a problem. With a question. And with the determination to find an answer. His early journey itself was remarkable. He became involved in transport and engineering, and the United Motor Service eventually grew into a large bus operation. He also moved beyond transport into manufacturing and technology. That tells us something important. Sometimes we tell ourselves: “I don't have the right equipment.” “I don't have enough money.” “I don't have a laboratory.” “I don't have the right degree.” “I don't have the right opportunity.” But innovation doesn't always begin with resources. Sometimes it begins with a question. “Why?” “How?” “What if?” “Can I make this better?” That is where an inventor begins. Learn From the World. Build for India. G.D. Naidu understood the importance of learning from the world. He travelled abroad, observed technologies and brought back machines and technological knowledge. But the purpose wasn't simply to admire what other countries had built. He used what he learned as inspiration for experimentation, manufacturing and technological development in India. His museum in Coimbatore also became a way of exposing people to technology and the evolution of machines. The G.D. Naidu Industrial Museum today preserves many of these technological exhibits and inventions. (Tamil Nadu Tourism) That is an important lesson for today's generation. We don't have to reject what the world has created. We should learn from it. Understand it. Improve it. And ask: “How can we use this knowledge to solve India's problems?” Today, India has a huge opportunity. AI. Semiconductors. Electric vehicles. Space technology. Biotechnology. Robotics. Clean energy. The next generation shouldn't only ask, “What can I get from the world?” It should also ask, “What can I build for the world?” Innovation Should Solve Real Problems Innovation is not simply about creating something complicated. The real question is: Who does it help? A great invention solves a real problem. It makes something faster. Cheaper. Safer. Simpler. More accessible. More useful. That mindset is especially important for India. We have millions of real-world problems waiting for better solutions. From agriculture to transportation. From water management to waste management. From healthcare to education. From energy to rural technology. From manufacturing to public infrastructure. Imagine if today's young minds started looking at these problems not only as problems… but as opportunities to innovate. That could change India. What Can Millennials Learn? Millennials grew up during one of India's biggest technological transitions. We saw the world move from landlines to smartphones. From letters to instant messaging. From physical maps to Google Maps. From limited information to unlimited information. We have already experienced enormous technological change. But the lesson from G.D. Naidu is: Never let experience become resistance to learning. The technology we mastered yesterday may not be the technology that defines tomorrow. So keep learning. Keep adapting. Keep experimenting. What Can Gen Z Learn? Gen Z has grown up with extraordinary access to information. You can learn almost anything with a smartphone. But information alone doesn't create innovation. There is a difference between: knowing something, understanding something, and building something. The next step is to convert: Information → Knowledge → Skill → Idea → Product → Impact. Don't just become excellent consumers of content. Become creators of solutions. What Can Gen Alpha Learn? Gen Alpha is growing up in a completely different world. AI will be everywhere. Machines will become smarter. Learning will become more personalized. Technology will become increasingly powerful. But that creates an interesting challenge. If machines can answer more questions… will humans continue to ask better questions? That may become one of the most important skills of the future. Don't compete with machines at what machines do best. Use them. Question them. Work with them. And most importantly… imagine things that don't exist yet. And What Would G.D. Naidu Do With Today's Technology? This is the question that fascinates me the most. Imagine taking the young G.D. Naidu from his time… and bringing him into today's world. Give him a smartphone. Give him the internet. Give him AI. Give him a modern laboratory. Give him a 3D printer. Give him access to universities and research from around the world. Give him today's manufacturing technology. What would he build? What problem would he notice first? What machine would he take apart? What technology would he try to improve? What new invention would he imagine? We don't know. But perhaps that is exactly the point. Because the world he lived in had limited technology… but enormous curiosity. We live in a world where technology is abundant. So perhaps our biggest challenge is to make sure… our curiosity doesn't become scarce. The Biggest Lesson From G.D. Naidu When we talk about G.D. Naidu, we often talk about his inventions. But perhaps his greatest contribution was something bigger. He showed that learning doesn't have to stop with a textbook. That curiosity can become knowledge. Knowledge can become skill. Skill can become innovation. And innovation can create opportunities for an entire society. His legacy also reminds us that innovation is not only about inventing things. It is about creating a culture of learning, experimentation and problem-solving. That is why his story is still relevant. Not only for engineers. Not only for inventors. Not only for students. For every generation. Because every generation gets better technology than the previous one. But technology alone doesn't guarantee progress. People do. People who question. People who learn. People who experiment. People who build. People who solve problems. People who look at the world and say: “This can be better.” That is perhaps the real lesson G.D. Naidu leaves for Millennials, Gen Z and Gen Alpha. We don't need everyone to become an inventor. But we need every generation to develop the mindset of an inventor. To observe. To question. To learn. To experiment. To create. And finally… to leave the world a little better than we found it. G.D. Naidu lived in a time when technology was scarce, but curiosity was abundant. We live in a time when technology is abundant. So the real question is… Can we make sure our curiosity remains abundant too? Written by Sreekanth Damacharla Ideas for a Better India
  ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..? తెలంగాణ రాజకీయ రంగంలో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను రేపుతున్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన ఈ కీలక సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరియు ముఖ్య నాయకులు అందరూ పాల్గొని, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. గత మూడు రోజులుగా శాసనసభ ప్రాంగణంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న హైడ్రామా, నాటకీయ పరిణామాలు మరియు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వైఖరిపై ప్రభుత్వం ప్రజల నాడిని పట్టేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫ్లాష్ సర్వే ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నేతల ముందుంచడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే నివేదిక ప్రకారం, రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు, పాలనా విధానాలకు ప్రజల నుంచి పూర్తి స్థాయి సానుకూలత లభిస్తోందని, కాంగ్రెస్ పరిపాలనపై ఎలాంటి ప్రజా వ్యతిరేకత లేదని సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా జరిగిన పరిణామాలు, ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులు, స్పీకర్ పదవిని కించపరిచేలా జరిగిన వ్యాఖ్యలు  ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద చోటుచేసుకున్న శుద్ధీకరణ వివాదాస్పద ఘటనలను ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల, రాజ్యాంగబద్ధ పదవుల పట్ల ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, త్వరలోనే వారికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో, అలాగే ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. ఎర్రవల్లి ఘటనపై మంత్రులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని, చట్టపరమైన చర్యలు కచ్చితంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరియు నియోజకవర్గ ఇంచార్జ్‌లు అందరూ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజలకు వివరించి బలంగా ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియా  డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. ఈ ఫ్లాష్ సర్వే రిపోర్ట్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతుండగా, రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.       [ CM Revanth Reddy, flash survey, BRS party, CLP meeting, Telangana news, Congress government,Telangana goverment, KCR, KTR, BRS Party, Telugu One, Telugu News ]  
ALSO ON TELUGUONE N E W S
Soori’s Mandaadi is turning out to be a strong performer at the box office, with the makers officially declaring that the film grossed Rs.65 crore worldwide. The latest poster gives the film’s theatrical run a clear commercial boost, especially after the movie managed to hold its ground against competing releases. Directed by Mathimaran Pugazhendhi, Mandaadi stars Soori, Suhas, Sathyaraj and Mahima Nambiar in prominent roles. The sports-action drama has been gaining momentum through strong word of mouth, with its raw setting and intense emotional conflict becoming major talking points. The ₹65 crore milestone is particularly notable for Soori, whose transformation into a leading man continues to gather momentum. What started as a film carrying curiosity around its unusual backdrop has now turned into a genuine theatrical success story. It marks to be a successful debut for Suhas in Tamil and a big hit in his career. Produced by Elred Kumar under RS Infotainment, Mandaadi is also backed by Vetrimaaran as creative producer. With the film continuing its successful theatrical run, the focus now shifts to how fast it can hit the coveted Rs.100 crore mark before The Paradise storm at the box office.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
సంతోష్ శోభన్ వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఈ ఏడాది 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన, తాజాగా మరో విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'సత్తిబాబు పరలోకయాత్ర' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయగా, సినీ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు హాలీవుడ్, ఇత‌ర‌ భాషల్లో సైన్స్ ఫిక్షన్ లేదా యాక్షన్ జోనర్‌లో మల్టీవర్స్ కాన్సెప్ట్‌లను చూశాం. అయితే, టాలీవుడ్‌లో తొలిసారిగా మల్టీవర్స్ కామెడీ జోనర్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 'స్వాతిముత్యం' చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మణ్ కె. కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పరలోకం లేదా వేరే లోకాల కాన్సెప్ట్‌ను అత్యంత నవ్వులు పూయించేలా వినోదాత్మకంగా మలచబోతున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తే స్పష్టమవుతోంది. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సంతోష్ శోభన్ నల్ల కళ్లద్దాలు పెట్టుకొని, ఒక కంటితో విచిత్రంగా చూస్తూ చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన ప్రీతి అస్రాని, మానస చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోస్టర్‌లోని బ్యాక్‌గ్రౌండ్, డిజైన్ చూస్తుంటే ఇదొక కంప్లీట్ ఫన్ రైడ్ సినిమా అని అర్థమవుతోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. కేవలం వినోదం మాత్రమే కాకుండా, ఒక కొత్త ప్రయోగంగా తెరకెక్కుతున్న ఈ 'మల్టీవర్స్ కామెడీ' ప్రేక్షకులకు ఏ స్థాయిలో నవ్వులు పంచుతుందో వేచి చూడాలి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.     [Santosh Soban Sattibabu Paraloka Yatra, Telugu First Multiverse Comedy Movie, Santosh Soban New Movie UV Creations, Sattibabu Paraloka Yatra First Look, Lakshman K Krishna Director Movies]
ప్రముఖ డ్యాన్స్ షో 'ఢీ-10' విన్నర్ రాజు ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సినిమా అవకాశాల పేరుతో దగ్గరై, మోసం చేశాడంటూ ఒక యువతి ఫిర్యాదుతో రాజుపై కేసు నమోదైంది. అయితే శిరీష అనే యువతితో రాజు మాట్లాడిన ఆడియో కాల్ లీక్ అయ్యి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "నీ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. ఇక మీదట మనం ఫ్రెండ్స్ లా ఉందాం" అని ఆ ఆడియోలో రాజు చెప్పినట్టుగా ఉంది. అయితే శిరీష మాత్రం.. "రాజు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. కానీ, నువ్వు వేరే అమ్మాయికి దగ్గరవ్వడం నేను తట్టుకోలేకపోతున్నాను." అని ఎంతో ఎమోషనల్ గా చెప్పింది. అంతేకాదు, "నా డబ్బులు నేను తిరిగి తీసుకున్నాక.. నీపై నాకు హక్కు ఉండదు. ఇంత జరిగిన తర్వాత ఫ్రెండ్ లా ఉండలేను. ఒకవేళ నువ్వు తప్పు తెలుసుకొని, మనసు మార్చుకొని వస్తానంటే.. ఆ డబ్బులు రిటర్న్ అడగను. ఇంకా 50 లక్షలు లోన్ తీసుకొని నీ చేతిలో పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను." అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆ ఆడియో క్లిప్ ను బట్టి అర్థమవుతుంది ఏంటంటే.. రాజుని శిరీష మనస్ఫూర్తిగా ప్రేమించింది. అతనికి లక్షల్లో డబ్బులు కూడా ఇచ్చింది. కానీ, రాజు వేరే అమ్మాయితో చనువుగా ఉండటం శిరీషకు నచ్చలేదు. అందుకే డబ్బులు రిటర్న్ అడిగింది. ఒకవైపు డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతూనే.. మరోవైపు రాజు మనసు మార్చుకొని తనతో ఉంటానంటే ఇంకా డబ్బులు ఇస్తానని కూడా చెబుతుంది. మరి ఈ ఆడియోలో నిజానిజాలు ఎంత? ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగి రాజు జైలు పాలయ్యాడు? అనేది తెలియాల్సి ఉంది.       [Dhee Raju Audio Leak, Dhee Raju Case, Raju Sirisha Audio, Dhee Raju Audio, Dhee Raju, Telugu Film News, Telugu Audio, Telugu News]  
తమిళ్ బిగ్ బాస్ సీజన్ 10 హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విజయ్ సేతుపతి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపుతున్నాయి. హౌస్‌లోని ఓ కంటెస్టెంట్‌ను ఉద్దేశించి ఆయన చేసిన 'లీడర్‌షిప్' వ్యాఖ్యలు, దళపతి విజయ్‌పై విసిరిన పరోక్ష సెటైర్లేనంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సరికొత్త ఫార్మాట్‌తో ప్రారంభమైన బిగ్ బాస్ తమిళ 10వ సీజన్ వీకెండ్ ఎపిసోడ్‌లో విజయ్ సేతుపతి, హౌస్ కెప్టెన్‌గా విఫలమైన కంటెస్టెంట్‌ను నిలదీశారు. నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడుతూ.. "ఆలోచించకుండా హామీలు గుప్పించడం, అసలు సమస్యలు, బాధ్యతలు ఎదురైనప్పుడు ఎదుటి జట్టుపై నెట్టేసి పారిపోవడం లీడర్‌షిప్ అనిపించుకోదు. కేవలం ఉపన్యాసాలు దంచడమే నాయకత్వం కాదు, అది ప్రజలను ఏమార్చడమే అవుతుంది" అంటూ గట్టిగానే క్లాస్ పీకారు. విజయ్ సేతుపతి చేసిన ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్ క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన దళపతి విజయ్‌ను ఉద్దేశించే సేతుపతి ఈ వ్యాఖ్యలు చేశారంటూ విజయ్ అభిమానులు, పొలిటికల్ సపోర్టర్లు ఆయనపై మండిపడుతున్నారు. ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ, విజయ్ సేతుపతి కావాలనే పరోక్షంగా పొలిటికల్ టాపిక్ తీసుకొచ్చారంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వాస్తవానికి విజయ్ సేతుపతి, దళపతి విజయ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్టర్' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనూ వేదికలపై విజయ్ సేతుపతి.. విజయ్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో సేతుపతి మద్దతుదారులు స్పందిస్తూ.. ఇది కేవలం బిగ్ బాస్ హౌస్ గేమ్‌కు సంబంధించిన సంభాషణ మాత్రమేనని, దీనికి రాజకీయ రంగు పులమడం సరికాదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు విజయ్ టీవీ యాజమాన్యం కూడా స్పందిస్తూ, బిగ్ బాస్ షోలో జరిగే చర్చలు కేవలం హౌస్ పరిస్థితులకు పరిమితమైనవని, ఏ వ్యక్తిని గానీ, భావజాలాన్ని గానీ ఉద్దేశించినవి కాదని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ సేతుపతి వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.     [Vijay Sethupathi Bigg Boss Tamil 10, Thalapathy Vijay Sethupathi Controversy, Vijay Sethupathi Leadership Speech Bigg Boss, Master Movie Vijay Sethupathi Vijay, Tamil Bigg Boss Season 10 Latest News]
  ఇరుముడి సృష్టించిన ప్రభంజనం తెలిసిందే. మరిన్ని ఫ్యామిలీ డివోషనల్ చిత్రాల రాకకి ఇన్ స్ప్రెషన్ గా నిలిచిందని చెప్పవచ్చు. 250 కోట్ల కలెక్షన్స్ లోకి చేరువలో ఉన్న ఇరుముడి ఈ  సంవత్సరంలో 200 కోట్ల మార్కును దాటిన నాల్గవ చిత్రంగా రికార్డుకెక్కింది ఇప్పుడు ఈ చిత్రం సెప్టెంబర్ 18 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ నెల 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ సర్వర్ క్రాష్ అయ్యే పరిస్థితి. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా ఒకేసారి అందుబాటులోకి రానుండటం విశేషం. దీంతో ఆయా బాషల సినీ ప్రేమికులకి బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. మరి థియేటర్స్ లో ఎన్నో రికార్డులని నమోదు చేసిన ఇరుముడి ఓటిటి హిస్టరీలో కూడా రికార్డులు నమోదు చేయడం పక్కా అని ట్రేడ్ వర్గాల వారు పేర్కొంటున్నారు.  Also Read: కంటెంట్ ఉందా?: గట్టెక్కిస్తారా!       [Irumudi, Ott Release Date, Netflix, Raviteja, Shiva Nirvana, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood'
రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చి యూత్‌ని ఆలోచింపజేసిన ఒక బోల్డ్ అండ్ ఎమోషనల్ మూవీ 'హుషార్ పిట్టలు'. ఏమాత్రం సౌండ్ లేకుండా, ఉన్నట్లుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. అన్షు, వాసవి గణేషన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు బిక్షు ఎంతో రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. రుద్ర క్రాంతి పిక్చర్స్ బ్యానర్‌పై వెంకట్ యాదవ్ నిర్మించిన ఈ సినిమాకి థియేట్రికల్ రన్‌లో మంచి రెస్పాన్సే వచ్చింది. సురేష్‌ ఏషియన్‌ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడంతో అప్పట్లో మంచి టాకే తెచ్చుకుంది.  టీనేజ్‌లో వచ్చే ఆకర్షణ, అవగాహన లేకపోవడం వల్ల జరిగే పొరపాట్లు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? అనే పాయింట్ తో ఈ మూవీ తెరకెక్కింది. ఈ కథలో రవి (అన్ష్) అనే కుర్రాడు చదువులో నంబర్ వన్. టెన్త్ క్లాస్‌లో స్కూల్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన బ్రైట్ స్టూడెంట్. అదే ఊళ్లో ఉండే చిట్టి (వాసవి గణేషన్) అనే అమ్మాయి రవిని ఎంతో ఇష్టపడుతుంది. కానీ, రవికి ప్రేమ, అట్రాక్షన్ లాంటివేమీ తెలీవు. అతని ప్రపంచం అంతా ఒక్క చదువు మాత్రమే. కానీ, అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. రవి చుట్టూ ఉండే బ్యాచ్‌లో బాలన్న అనే ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. బాలన్న మాటలు, అతని ప్రవర్తన రవిని పూర్తిగా ప్రభావితం చేసి తప్పు దారిలోకి తీసుకెళ్తాయి. ఆ ప్రభావాన్ని తట్టుకోలేక, యుక్తవయసులో వచ్చే మార్పుల వల్ల రవి దారి తప్పుతాడు. చివరకు రవి, చిట్టి ఇద్దరూ హద్దులు దాటి ప్రవర్తించే వరకు వెళ్తారు. శారీరికంగా కలుస్తారు. ఆ విషయం ఇరు కుటుంబాలకూ తెలిసిపోతుంది. ప్రశాంతంగా ఉన్న రెండు ఇళ్లు ఒక్కసారిగా నరకంలోకి నెట్టబడతాయి. తెలిసీ తెలియక చేసిన తప్పు వల్ల ఆ రెండు కుటుంబాలు ఎలా విలవిలలాడాయి? సమాజం నుంచి ఎలాంటి నిందలు ఎదుర్కొన్నారు? అసలు రవి, చిట్టిల జీవితాలు ఏ మలుపు తిరిగాయి? అనేది ఎమోషనల్‌గా ఈ సినిమాలో చూపించారు. బోల్డ్ గా ఉంటూనే, ఎమోషనల్ గా ఆలోచింపజేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టీనేజర్స్ ఎలా దారి తప్పుతున్నారు? తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? వంటి విషయాలను ఇందులో చూపించారు. సైలెంట్ గా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ, ఓటీటీలో మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంటోంది.        [Hushar Pittalu Movie, OTT Release, Husharu Pittalu, Telugu Movies 2026, Telugu OTT Movies, Amazon Prime Video, Telugu Film News, Telugu News]  
తెలుగు సినిమా పుట్టిన దగ్గర్నుంచి మేకర్స్ ని ప్రేక్షకులు కోరుకునేది ఒకటే.. మంచి కంటెంట్ ఇచ్చి హిట్ రేంజ్ తో పాటు  కలెక్షన్స్ సంగతి మాకు వదిలేయండి అని. కానీ కొంత మంది ఆ సూత్రాన్ని ఎందుకు పట్టించుకోరో  అర్ధం కాదు. ఈ విషయంలో మొదటి ముద్దాయి నిర్మాణ సంస్థనే. దీంతో  ప్రముఖ భారీ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. వరుసగా బాక్సాఫీస్ వద్ద ఎదురైన చేదు అనుభవాలు, భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్లుగా మిగిలిన చిత్రాలు ఈ నిర్మాణ సంస్థపై పెద్ద ఎత్తున ప్రశ్నార్థకాలను నిలబెట్టాయి జననాయగన్, టాక్సిక్, తో పాటు రీసెంట్ గా మొన్న బాలీవుడ్ లో విడుదలైన 'హివాన్' (Hiwaan) వంటి వరస సినిమాలు భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు ఈ సంస్థ మెగా స్టార్ చిరంజీవితో రూపొందిస్తున్న 'కాకా' పై అభిమానులు, ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాల చూపు పడింది. మూవీ లవర్స్ అయితే ఏకంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'చిరంజీవితో పాటు దర్శకుడు బాబీ హిట్ మోడ్ లో  ఉన్నా  'కాక" లో సరైన కంటెంట్ ఉండాలి? కేవలం ఇమేజ్ ఆధారంగా సీన్స్ ని తెరకెక్కించవద్దు. కథకి సంబంధించిన అన్ని విషయాల్లో పక్కాగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.     Also Read: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పిఏ డెత్ కేసు: మౌనం వీడిన  సూరజ్..నిజంగా హీరోనేనా! ఏది ఏమైనా  మునుపటి పొరపాట్ల నుండి పాఠాలు నేర్చుకుని, బలమైన కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటేనే  KVN  తన ప్రస్థానాన్ని చాటాలగలదు. ప్రేక్షకులు కేవలం స్టార్‌డమ్‌ను మాత్రమే కాకుండా గ్రిప్పింగ్ స్టోరీ లైన్, బలమైన ఎమోషన్స్ కోరుకుంటున్నారు. కాకాతో   KVN  సంస్థ భారీ హిట్ అందుకోవాలని కోరుకుందాం.       [Kaaka, Content, Chiranjeevi, Hiwaan review, KVN Productions, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood]  
'రా కింగ్' మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా "డేవిడ్ రెడ్డి". ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా "డేవిడ్ రెడ్డి" సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.  ఈ రోజు నటి రమ్యకృష్ణ బర్త్ డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు  శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ "డేవిడ్ రెడ్డి" సినిమా నుంచి ఆమె బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ కమల రెడ్డి పాత్రలో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఈ పోస్టర్ లో ఆమె ఖడ్గంతో శత్రువులను తుదముట్టించి తన ఆసనంపై కూర్చుని ఫెరోషియస్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. రమ్యకృష్ణ కెరీర్ లో కమల రెడ్డి పాత్ర ఒక ఐకానిక్ క్యారెక్టర్ గా గుర్తుండిపోనుంది. 'రా కింగ్' మంచు మనోజ్, మరియా ర్యబోషప్క, రమ్యకృష్ణ, ఆర్. పార్తీబన్, కాంచన తదితరులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రవి జక్కుల, కాస్ట్యూమ్స్:  హైందవి సుధ, యాక్షన్: సుప్రీమ్ సుందర్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి, డీవోపీ: ఆచార్య వేణు, మ్యూజిక్: రవి బస్రూర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొట్టు రవికుమార్, ప్రొడ్యూసర్స్: భరత్ మోటుకూరి, నల్లగంగుల వెంకట్ రెడ్డి, స్క్రిప్ట్, డైరెక్టర్: హనుమరెడ్డి యక్కంటి
తన అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి, గాయని భారతరత్న ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించే భారీ ప్రయత్నం ప్రారంభించారు ప్రముఖ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి 110వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ వేదికగా రేపు సాయంత్రం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. తన నట ప్రతిభతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్ రష్మిక మందన్న ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి పాత్రకు ప్రాణం పోసి, ఆ పాత్రలో జీవించబోతున్నారు. ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్ అనౌన్స్ మెంట్ సంగీత ప్రియుల్లో ఆనందాన్ని నింపుతోంది. వరల్డ్ క్లాస్ మేకింగ్, హై టెక్నికల్ వ్యాల్యూస్ తో ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.       [MS Subbulakshmi Biopic, Rashmika Mandanna, Gowtam Tinnanuri, Anirudh Ravichander, Allu Aravind, Rockline Venkatesh, Bunny Vas, Telugu Film News, Telugu News]  
Adivi Sesh’s G2 is reportedly eyeing February 5th for its theatrical release, and the date is already creating some interesting industry chatter. Rather than jumping into the increasingly crowded December-January race, the makers appear to be deliberately waiting for the big-ticket release traffic to clear. The sequel to Goodachari is being mounted on a much larger scale, with foreign locations, heavy action blocks and extensive VFX forming a major part of the film. For a Pan-India spy thriller, getting adequate screens becomes crucial, particularly when several star-driven films are competing for the same real estate during the festive season. That seems to be where February could work in G2’s favour. A comparatively open window would give the film better screen availability and allow the makers to build its theatrical campaign without getting drowned out by bigger releases. In trade circles, the feeling is that this is less about avoiding competition and more about choosing the right battlefield. Directed by Vinay Kumar Sirigineedi and written by Adivi Sesh, G2 features Wamiqa Gabbi, Emraan Hashmi and Prakash Raj in prominent roles. With the team reportedly taking extra time to perfect the action and visuals, the February window could ultimately prove to be a calculated move for one of the year’s closely watched spy thrillers. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  మానవాళి ఆరోగ్యానికి మరియు ఆయుష్షుకు అత్యంత ప్రమాదకరంగా మారిన వ్యాధుల్లో గుండె సంబంధిత జబ్బులు (Cardiovascular Diseases) మరియు క్యాన్సర్ ప్రధానమైనవి. అయితే ఇటీవల ప్రచురితమైన అంతర్జాతీయ వైద్య పరిశోధన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కంటే గుండె జబ్బుల వల్ల జరుగుతున్న మరణాలే అగ్రస్థానంలో ఉన్నాయని వెల్లడించి ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఒకప్పుడు కేవలం వృద్ధులలో లేదా అరవై ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించే గుండె సమస్యలు, ఇప్పుడు చిన్న వయసులోనే ప్రాణాలను తీస్తుండటం అత్యంత ఆందోళనకరమైన విషయంగా మారింది. వైద్య గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 1.8 కోట్ల (180 లక్షల) కంటే ఎక్కువ మంది గుండె సంబంధిత సమస్యల వల్ల తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. ఇది ప్రపంచంలో నమోదవుతున్న మొత్తం మరణాలలో దాదాపు 32 శాతానికి సమానం. దీనికి విరుద్ధంగా క్యాన్సర్ వ్యాధి వల్ల ఏటా సుమారు 1.0 కోటి మరణాలు (మొత్తం మరణాలలో దాదాపు 18 శాతం) సంభవిస్తున్నాయి. అంటే క్యాన్సర్ మహమ్మారి కంటే కూడా గుండె జబ్బులే ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న మొదటి ప్రధాన వ్యాధిగా నిలిచాయి. అందులోనూ ముఖ్యంగా 65 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న యువత మరియు నడివయస్కులలోనే దాదాపు 35 శాతం గుండెపోటు మరణాలు సంభవించడం తీవ్ర హెచ్చరిక సంకేతంగా మారింది. వైద్య నిపుణులు మరియు కార్డియాలజిస్టుల ప్రకారం, ఈ గుండె జబ్బుల విజృంభణకు మన ఆధునిక జీవనశైలే 70 శాతానికి పైగా కారణమవుతోంది. అనియంత్రిత అధిక రక్తపోటు (Hypertension), శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరగడం, మధుమేహం (Diabetes), పొగతాగడం (Smoking) మరియు తీవ్రమైన మానసిక ఒత్తిడి (Stress) గుండె నాళాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. రోజువారీ ఆహారంలో 50 శాతానికి పైగా ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్, అధిక ఉప్పు మరియు ప్రాసెస్డ్ చక్కెర వాడకం రక్తనాళాల్లో కొవ్వు నిల్వలు పేరుకుపోవడానికి దారితీస్తున్నాయి. దీనివల్ల గుండెకు రక్తప్రసరణ ఆగిపోయి క్షణాల్లో హఠాత్తుగా కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ ఎటాక్ సంభవిస్తోంది.   అయితే ఈ ప్రాణాంతక పరిస్థితి నుండి మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమేనని వైద్యరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మనం పాటించే సరైన జీవనశైలి మార్పుల ద్వారా దాదాపు 80 శాతం గుండె జబ్బుల ప్రమాదాన్ని ముందే అరికట్టవచ్చు. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వేగంగా నడవడం లేదా సాధారణ వ్యాయామం చేయడం వల్ల గుండె పనితీరు 40 శాతం మెరుగుపడుతుంది. ప్రతిరోజూ తాజా పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకుంటూ ఉప్పు వాడకాన్ని రోజుకు 5 గ్రాముల కంటే తక్కువగా పరిమితం చేయడం చాలా అవసరం. 30 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి కనీసం ఒకసారి గుండె సంబంధిత రొటీన్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం ద్వారా ముందస్తు ప్రమాదాన్ని గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చు. గుండె ఆరోగ్యం అనేది కేవలం ఒక వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, కుటుంబ శ్రేయస్సుకు మూలస్తంభం. గుండె అందించే సూక్ష్మ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా, క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు, రోజువారీ వ్యాయామం మరియు ఒత్తిడి లేని జీవన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా మాత్రమే గుండె జబ్బుల బారిన పడకుండా దీర్ఘాయుష్షును పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.     [Heart Disease, Cardiovascular Diseases, Cancer, Heart Attack, Cardiac Arrest, Heart Health, High Blood Pressure, Cholesterol, Diabetes, Healthy Lifestyle]  
మహిళల జీవిత ప్రయాణంలో రుతుక్రమం ప్రారంభం కావడం (మెనార్కే) మరియు అది సంపూర్ణంగా నిలిచిపోవడం (మెనోపాజ్) అనేవి రెండు అత్యంత పవిత్రమైన, సహజమైన శారీరక ఘట్టాలు. అయితే, నేటి ఆధునిక కాలంలో చాలామంది మహిళల్లో ఒక ముఖ్యమైన ప్రశ్న తరచుగా ఉత్పన్నమవుతోంది. చిన్నతనంలోనే, అంటే చాలా తక్కువ వయసులోనే మొదటిసారి నెలసరి వస్తే, భవిష్యత్తులో మెనోపాజ్ కూడా త్వరగానే వచ్చేస్తుందా... ఈ రెండింటి మధ్య నిజంగానే ఏదైనా ప్రత్యక్ష సంబంధం ఉందా.. ఈ ప్రశ్నకు ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు (గైనకాలజిస్ట్), బెంగళూరులోని కిమ్స్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ లావణ్య కిరణ్ మరియు అంతర్జాతీయ పరిశోధనలు ఆసక్తికరమైన, శాస్త్రీయమైన సమాధానాలను అందించాయి. సాధారణంగా బాలికలలో 10 నుండి 15 సంవత్సరాల వయసు మధ్యలో మొదటిసారి నెలసరి ప్రారంభమవుతుంది. అలాగే స్త్రీలలో సాధారణ మెనోపాజ్ అనేది 45 నుండి 55 సంవత్సరాల వయసు మధ్య సంభవిస్తుంది. అయితే ఒక మహిళకు మెనోపాజ్ వచ్చే వయసు అనేది జన్యుపరమైన అంశాలు, వారి జీవనశైలి, శారీరక ఆరోగ్యం, ధూమపానం మరియు కొన్ని రకాల వైద్య చికిత్సలపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, 11 సంవత్సరాల కంటే తక్కువ వయసులోనే రుతుక్రమం పొందిన బాలికలలో త్వరగా లేదా ముందస్తుగా మెనోపాజ్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుందని వైద్య అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంశంపై మరింత స్పష్టత కోసం ప్రసిద్ధ  జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటాబోలిజం లో ప్రచురితమైన  నర్సెస్ హెల్త్ స్టడీ 2  పరిశోధన వివరాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ బృహత్తర అధ్యయనంలో 25 నుండి 42 సంవత్సరాల వయసు గల దాదాపు 1,08,000 మందికి పైగా మహిళలను ఏకంగా 20 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పరిశీలించారు. ఈ పరిశోధన కాలంలో సర్జరీ లేదా కేన్సర్ చికిత్సలు వంటి ఎలాంటి వైద్యపరమైన కారణాలు లేకుండగానే సుమారు 2,800 మంది మహిళలు 45 సంవత్సరాల వయసు కంటే ముందే సహజమైన ముందస్తు మెనోపాజ్ (Early Natural Menopause) దశకు చేరుకున్నారు. ఈ పరిశోధన ఫలితాల ప్రకారం, 9 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసులోనే మొదటిసారి నెలసరి వచ్చిన బాలికలలో, 12 సంవత్సరాల వయసులో నెలసరి ప్రారంభమైన మహిళలతో పోలిస్తే 45 ఏళ్ల కంటే ముందే మెనోపాజ్ వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీనితో పాటు, మహిళల రుతుచక్ర వ్యవధి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. 25 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉండే స్వల్ప రుతుచక్రాలు ఉన్న మహిళల్లో అండాలు త్వరగా విడుదల కావడం వల్ల వారిలోని సహజమైన అండాశయ నిల్వలు త్వరగా ఖాళీ అయిపోతాయి. ఫలితంగా వారికి మెనోపాజ్ త్వరగా వస్తుంది. అదే సుదీర్ఘమైన లేదా క్రమం లేని రుతుచక్రాలు ఉన్నవారిలో ఈ ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. 45 ఏళ్ల కంటే ముందే వచ్చే ముందస్తు మెనోపాజ్ వల్ల గుండె జబ్బులు, ఎముకల సాంద్రత తగ్గిపోవడం (ఆస్టియోపోరోసిస్) వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని డాక్టర్ లావణ్య కిరణ్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 40 ఏళ్ల వయసు కంటే ముందే క్రమం లేని నెలసరి, శరీరంలో వేడి ఆవిర్లు (హాట్ ఫ్లాషెస్), రాత్రి వేళల్లో తీవ్రంగా చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్స్, యోని పొడిబారడం, తీవ్రమైన నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. చిన్న వయసులోనే నెలసరి వచ్చినా ఆందోళన చెందకుండా, పోషకాహారం తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, ధూమపానానికి దూరంగా ఉండటం మరియు క్రమం తప్పకుండా గైనకాలజీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రత్యుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగ్గా కాపాడుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. [Menarche, Menopause, Early Menopause, Womens Health, Menstrual Cycle, Reproductive Health, Gynecology, Dr Lavanya Kiran, KIMS Hospitals, Early Menopause Risk]
  ప్రశాంతమైన నిద్ర మానవ ఆరోగ్యానికి అత్యంత ఆవశ్యకమైన నిధి. రాత్రంతా హాయిగా, ఎటువంటి ఆటంకం లేకుండా నిద్రపోతేనే మరుసటి రోజు ఉదయం ఉత్సాహంగా, చురుగ్గా పనులు చేసుకోగలుగుతాం. అయితే చాలామందికి రాత్రివేళల్లో హఠాత్తుగా మెలకువ రావడం, ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోవడం వంటి తీవ్రమైన సమస్య వేధిస్తుంటుంది. రాత్రి సమయం ముఖ్యంగా తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో అకస్మాత్తుగా మెలకువ వచ్చి మళ్లీ గంటల తరబడి నిద్ర కోసం తల్లడిల్లడం మనం చాలామందిలో గమనిస్తుంటాం. దీనిని కేవలం ఒక సాధారణ అలవాటుగానో లేదా ఏదో చిన్న నిద్రలేమి సమస్యగానో భావించి నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు. నిద్ర మధ్యలో పదే పదే మెలకువ రావడానికి మన జీవనశైలితో పాటు శరీరంలో అంతర్గతంగా ఉండే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ప్రధాన కారణాలు కావచ్చు. ఈ సమస్యకు మొదటి మరియు అత్యంత ప్రధానమైన కారణం విపరీతమైన మానసిక ఒత్తిడి (స్ట్రెస్) మరియు ఆందోళన. మనసులో ఏవైనా ఆందోళన కలిగించే ఆలోచనలు ఉన్నప్పుడు, మన శరీరంలో  కోర్టిసాల్  అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు రాత్రి సమయంలో ఒక్కసారిగా పెరుగుతాయి. సాధారణంగా నిద్రపోతున్నప్పుడు తగ్గే ఈ హార్మోన్, మానసిక ఒత్తిడి వల్ల అర్ధరాత్రి వేళ హెచ్చుతగ్గులకు లోనై మెదడును తక్షణమే మేల్కొలిపేస్తుంది. అంతేకాకుండా, రాత్రి పడుకునే ముందు కాఫీ, టీ లేదా ఎనర్జీ డ్రింక్స్ వంటి కెఫిన్ ఉన్న పదార్థాలను తీసుకోవడం కూడా నిద్ర భంగానికి ప్రధాన కారణం. కెఫిన్ ప్రభావం శరీరంలో దాదాపు 6 నుండి 8 గంటల వరకు ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను దెబ్బతీసి, గాఢ నిద్రలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. మరొక ముఖ్యమైన కారణం నిద్రపోయే ముందు భారీగా ఆహారం తీసుకోవడం లేదా జీర్ణక్రియ సంబంధిత సమస్యలు. రాత్రి వేళ ఆలస్యంగా, ముఖ్యంగా కొవ్వులు మరియు కారం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తిని వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ లేదా అసిడిటీ సమస్య తలెత్తుతుంది. కడుపులోని ఆమ్లాలు పైకి రావడం వల్ల గుండెల్లో మంట, అసౌకర్యం కలిగి రాత్రిపూట ఉలిక్కిపడి లేస్తుంటారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు (బ్లడ్ షుగర్ లెవల్స్) హఠాత్తుగా పడిపోవడం వల్ల కూడా నిద్ర మధ్యలో మెలకువ వస్తుంది. రాత్రి సమయంలో రక్తంలో గ్లూకోజ్ తగ్గగానే, దాన్ని సరిచేయడానికి శరీరం అడ్రినలిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది గుండె వేగాన్ని పెంచి మనకు మెలకువ వచ్చేలా చేస్తుంది. రాత్రివేళ పదే పదే మెలకువ రావడానికి  స్లీప్ ఆప్నియా  అనే భయంకరమైన శ్వాసకోశ సమస్య కూడా కారణం కావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో నిద్రపోతున్నప్పుడు గొంతు కండరాలు సడలిపోవడం వల్ల గాలి పీల్చుకోవడం కొన్ని సెకన్ల పాటు నిలిచిపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ స్థాయిలు తగ్గి, ఊపిరి ఆడక మెదడు రక్షణ చర్యగా శరీరాన్ని వెంటనే మేల్కొలుపుతుంది. వీటితో పాటు రాత్రిళ్లు తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం (నాక్టూరియా), పడుకునే గదిలో ఎక్కువ వెలుతురు ఉండటం, తీవ్రమైన ఉష్ణోగ్రత లేదా ధ్వనులు ఉండటం కూడా నిద్రకు విఘాతం కలిగిస్తాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే రాత్రి పూట లలితమైన ఆహారం తీసుకోవడం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం మరియు తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స పొందడం చాలా అవసరం.         [Sleep Problems, Sleep Disorders, Night Waking, Insomnia, Stress and Anxiety, Caffeine, Acid Reflux, Blood Sugar, Sleep Apnea, Healthy Sleep]  
కీళ్ల నొప్పులు, వాపు, ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ (Rheumatoid Arthritis)లో కనిపించవచ్చు. ఇది సాధారణ కీళ్ల నొప్పులతో పోలిస్తే భిన్నమైన ఆటో ఇమ్యూన్ సమస్య. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ఆయుర్వేదం పనిచేస్తుందా? ఇంగ్లీష్ మెడిసిన్ తప్పనిసరా? కొన్ని సందర్భాల్లో సంప్రదాయ వైద్య చికిత్స అవసరం లేదా? ఆటో ఇమ్యూన్ కీళ్ల సమస్యల్లో ఆయుర్వేదాన్ని ఎందుకు కొందరు నిపుణులు సిఫారసు చేయరు? ఫంక్షనల్ మెడిసిన్ విధానం ఎలా భిన్నంగా ఉంటుంది? ఈ వీడియోలో Acupuncture మరియు Functional Medicine నిపుణులు డా. పి.ఎస్. సాగర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు సంబంధించిన వివిధ చికిత్సా విధానాల గురించి వివరిస్తున్నారు. ఆయుర్వేదం, కన్వెన్షనల్ మెడిసిన్, ఫంక్షనల్ మెడిసిన్ మధ్య ఉన్న తేడాలు, వాటి విధానాలు, పరిమితులు మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో చికిత్సను ఎంచుకునేటప్పుడు పరిగణించాల్సిన అంశాల గురించి తెలుసుకోండి. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య పరిస్థితికి సరైన చికిత్సను నిర్ణయించుకునే ముందు అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది భక్తిశ్రద్ధలు, రంగురంగుల మండపాలు, అంతకుమించి స్వామివారికి నివేదించే రకరకాల నైవేద్యాలు. బొజ్జ గణపయ్యకు పెట్టే ప్రసాదాలు కేవలం సంప్రదాయంలో భాగం మాత్రమే కాదు, వాటి వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే ఈ పండుగ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాల వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంటుంది. మన పెద్దలు ఆ కాలానికి తగినట్లుగా, శరీరానికి మేలు చేసే పదార్థాలనే వినాయకుడి ప్రసాదాలుగా మార్చారు. ఆ ప్రసాదాలు ఏమిటి, వాటి వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే.. కుడుములు , ఉండ్రాళ్ళు.. వినాయక చవితి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి కుడుములు, ఉండ్రాళ్ళు. వీటిని నూనె లేకుండా కేవలం ఆవిరి మీద మాత్రమే ఉడికిస్తారు. ఆవిరి మీద ఉడికే ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి చాలా సులభంగా ఉంటాయి. బియ్యపు పిండి, పెసరపప్పు లేదా శనగపప్పు, బెల్లం, కొబ్బరి కలగలిపి వీటిని తయారుచేస్తారు. బియ్యపు పిండి కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఆవిరి వంటకం కావడం వల్ల జీర్ణక్రియకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా పొట్టలో మంట, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఇవి కాపాడతాయి. కొందరు కుడుములను మైదా పిండితో నూనెలో డీప్ ఫ్రై చేసి చేస్తారు. ఇది అంత ఆరోగ్యానికి మంచిది కాదు.   బెల్లం , పప్పుధాన్యాల కాంబినేషన్.. అన్ని రకాల ప్రసాదాలలో బెల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయాన్ని శుభ్రపరచడానికి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది. కుడుముల్లో వాడే శనగపప్పు, పెసరపప్పుల ద్వారా శరీరానికి కావలసిన ప్రోటీన్లు లభిస్తాయి. వర్షాకాలంలో పెరిగే బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి బెల్లం, పప్పుధాన్యాల కాంబినేషన్ శరీరానికి మంచి బలవర్ధకమైన ఆహారంగా పనిచేస్తుంది. జిల్లేడు కాయలు , మోదకాలు.. విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మోదకాలను బియ్యపు పిండిలో బెల్లం, కొబ్బరి పూరకంతో చేస్తారు. కొబ్బరిలో ఉండే మంచి కొవ్వులు చర్మానికి, జుట్టుకు చాలా మంచివి. అంతేకాకుండా కొబ్బరి శరీరానికి అవసరమైన శక్తిని త్వరగా అందిస్తుంది. కొబ్బరి , బెల్లం కలిపి తినడం వల్ల శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు, వాత రోగాల నివారణకు  ఈ కాంబినేషన్ చక్కగా తోడ్పడుతుంది. పాయసం , పరమాన్నం.. పాలు, బియ్యం, బెల్లం లేదా చక్కెరతో తయారుచేసే పాయసం నివేదనలో ముఖ్యమైనది. పాలల్లో లభించే కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది. ఇందులో వేసే యాలకులు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, కడుపులో ఉన్న ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. పాయసంలో వాడే నెయ్యి శరీరానికి కావలసిన విటమిన్లు ఎ, డి లభించేలా చేస్తుంది , కీళ్ళకు అవసరమైన నూనెను అందిస్తుంది. పులిహోర.. ఏ పండుగైనా పులిహోర లేకపోతే నివేదన పూర్తికాదు. వినాయక చవితి నాడు నిమ్మకాయ లేదా చింతపండు పులిహోరను ప్రసాదంగా పెడతారు. చింతపండు, నిమ్మకాయలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో విటమిన్ సి లభించడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పుల వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. పులిహోర తాళింపులో వాడే పసుపు సహజమైన యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. పసుపులోని కుర్కుమిన్ అనే అంశం శరీరంలో మంటను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే ఇందులో వేసే అల్లం, మిరియాలు జీర్ణరసాలను ఉత్పత్తి చేసి ఆకలిని పెంచుతాయి. చలిమిడి , వడపప్పు.. వినాయక చవితి పూజ ముగిసిన తర్వాత ఇచ్చే ముఖ్యమైన ప్రసాదం చలిమిడి ,   పచ్చి పెసరపప్పును నీటిలో నానబెట్టి వడపప్పుగా ఇస్తారు. నానబెట్టిన పెసరపప్పులో పీచు పదార్థం, ప్రోటీన్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. వేడి చేసిన బియ్యపు పిండి, బెల్లం కలిపి చేసే చలిమిడి శరీరానికి తక్షణ బలాన్ని ఇస్తుంది. వర్షాకాలంలో కలిగే అలసటను నివారించడంలో ఈ  కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. పండ్ల నివేదన , పత్రీ ప్రభావం.. స్వామివారికి ప్రసాదాలతో పాటు రకరకాల పండ్లను సమర్పిస్తారు. ముఖ్యంగా వెలగపండు, నేరేడు పళ్ళు, అరటిపళ్ళు నివేదిస్తారు. వెలగపండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, కడుపులోని క్రిములను సంహరిస్తుంది. నేరేడు పళ్ళు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. వీటితో పాటు పూజలో ఉపయోగించే ఏకవింశతి పత్రి కూడా ఒక రకమైన ఔషధ గని. పూజ చేసే సమయంలో ఆ పత్రి తాకిడి, వాటి సువాసనల వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ విధంగా వినాయక చవితి ప్రసాదాలు కేవలం నైవేద్యం మాత్రమే కాకుండా, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధాలుగా పనిచేస్తాయి. మన సంస్కృతిలో భాగమైన ఈ ప్రసాదాలను తిని, పండుగను భక్తితో పాటు ఆరోగ్యకరంగా జరుపుకోవడం ఆ వినాయకుడు ఇచ్చే అదృష్టం.. !                          *రూపశ్రీ.  
ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాలుగా మారింది. బిజీ జీవనశైలి, వేళపాళ లేని తిండి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామంది అనతికాలంలోనే అధిక బరువు బారిన పడుతున్నారు. అయితే, బరువు తగ్గడానికి గంటల తరబడి జిమ్‌లో కష్టపడాల్సిన పనిలేదు లేదా కఠినమైన ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు. మన రోజువారీ ఆహారపు అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా సులభంగా, ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు.  అధిక బరువును తగ్గించుకోవడానికి సహాయపడే కొన్ని సులభమైన ఆహార నియమాలు , చిట్కాల గురించి  వివరంగా తెలుసుకుంటే.. ప్రోటీన్ ఫుడ్.. ప్రోటీన్ లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. రోజూ తీసుకునే ఆహారంలో గుడ్లు, పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలు, పనీర్, లేదా చికెన్ వంటి వాటిని చేర్చుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. దీనివల్ల అనవసరంగా చిరుతిళ్లు తినే అలవాటు తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది శరీరంలో కండరాల నిర్మాణానికి , జీవక్రియ రేటును పెంచడానికి తోడ్పడుతుంది. మంచినీరు మ్యాజిక్.. భోజనం చేసే సమయానికి కనీసం అర్ధగంట ముందు ఒక పెద్ద గ్లాసు మంచి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది , భోజనం చేసేటప్పుడు అతిగా తినకుండా నిరోధించవచ్చు. రోజూ సరిపడా నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి , మెటబాలిజం వేగవంతమవుతుంది. దాహం వేసినప్పుడు శీతల పానీయాలు లేదా ప్యాక్ చేసిన జ్యూస్‌లు తాగడానికి బదులుగా సాధారణ నీరు లేదా నిమ్మరసం, మజ్జిగ తీసుకోవడం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫైబర్.. రోజువారీ ఆహారంలో పీచు పదార్థం లేదా ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, హోల్ గ్రెయిన్స్ , ఓట్స్ వంటి వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను నెమ్మదింపజేసి, రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగకుండా ఫైబర్ నిరోధిస్తుంది. దీనివల్ల త్వరగా ఆకలి వేయదు. కనుక ప్రతిరోజూ  తినే భోజనంలో సగం భాగం కూరగాయలు లేదా సలాడ్లు ఉండేలా చూసుకోవడం మంచిది. తినేటప్పుడు ఈ జాగ్రత్త తప్పనిసరి.. ఆహారం తినేటప్పుడు టీవీ, మొబైల్ ఫోన్లు చూడటం వంటి పనులు మానుకోవాలి. ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమలి తినడం చాలా ముఖ్యం. ఆహారాన్ని బాగా నమిలి తిన్నప్పుడు జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది , కడుపు నిండిందనే సంకేతం మెదడుకు త్వరగా అందుతుంది. తొందరపడి తింటే తెలియకుండానే ఎక్కువ ఆహారాన్ని తినేసే అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్స్.. ప్యాక్ చేసిన ఆహారాలు, బేకరీ తిళ్లు, వేపుళ్లు, , ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వీటిలో కేలరీలు, ఉప్పు , ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి బరువు పెరగడానికి ప్రధాన కారణమవుతాయి. అలాగే పంచదార , తీపి పదార్థాలను పూర్తిగా తగ్గించడం వల్ల శరీరంలో కొవ్వు చేరకుండా చూసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు చక్కెర కలిపిన స్వీట్లకు బదులుగా ఖర్జూరాలు లేదా తాజా పండ్లను ఎంచుకోవచ్చు. వ్యాయామం ముఖ్యమే.. ఆహార నియమాలతో పాటు రోజుకి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే శరీరంలో ఆకలిని పెంచే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. దీనివల్ల అనవసరమైన ఆకలి పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది. మానసిక ఒత్తిడి కూడా బరువు పెరగడానికి ఒక కారణం, కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటివి సాధన చేయాలి. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం.. బరువు తగ్గడం అనేది ఒక రాత్రిలో జరిగే అద్భుతం కాదు. దీనికి సహనం, నిలకడ చాలా అవసరం. కఠినమైన డైటింగ్స్ చేసి అనారోగ్యం పాలవడం కంటే, ఇటువంటి చిన్న చిన్న మార్పులను జీవనశైలిలో భాగం చేసుకుంటే సులభంగా , శాశ్వతంగా బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చు.                        *రూపశ్రీ.