LATEST NEWS
వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడేళ్లవుతోంది... సిబిఐ విచారణ ముగిసిందనుకుంటున్న సమయంలో, హఠాత్తుగా ఈడీ ఎందుకు ఎంటర్ అయింది?  అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. దీనిపై సీనియర్ జర్నలిస్టు, ఎనలిస్ట్ వీవీరావు తెలుగువన్ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో,  న్యాయ వర్గాల్లో గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హఠాత్తుగా ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హఠాత్తుగా రంగానికి దిగి తనిఖీలు చేపట్టడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 2019 మార్చి నెలలో జరిగిన వైఎస్ వివేకా  హత్య ఉదంతంలో ఇప్పటివరకు  సిబిఐ విచారణ జరుపుతుండగా, ఉన్నట్టుండి ఈడీ అధికారులు రంగప్రవేశం చేయడం వెనుక ఉన్న కారణాలపై విశ్లేషకులు మరియు సామాన్య ప్రజలు ఆసక్తికరమైన చర్చలకు తెరలేపారు. ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భాగంగా పలు కీలకమైన ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. నిందితులు, సాక్షులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తుల ఇళ్లలో జరిపిన శోధనలలో  24 లక్షల రూపాయల నగదుతో పాటు అనేక కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. అయితే హత్య జరిగిన  ఏడేళ్ల తరువాత నిందితుల ఇళ్లలో కీలక డాక్యుమెంట్లు ఉంటాయా? సంఘటన జరిగిన గంటల వ్యవధిలో సాక్ష్యాలను తారుమారు చేస్తున్న నేటి పరిస్థితుల్లో హత్య జరిగిన ఏడేళ్ల తరువాత కీలక పత్రాల స్వాధీనం అంటూ వస్తున్న వార్తలు నమ్మశక్యంగా లేవని వీవీరావు విశ్లేషించారు.  ఈ తనిఖీల వెనుక కేవలం హత్య కేసు విచారణ మాత్రమే  లేదన్నారు. అయినా ఈడీ వంటి దర్యాప్తు సంస్థల తనిఖీలు రానున్న రోజులలో జరగనున్న రాజకీయ పరిణామాలకు తార్కాణమని గత అనుభవాలను బట్టి  అవగతం చేసుకోవచ్చునన్నారు. ఇప్పుడు ఈడీ దాడుల వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇటీవలే జగన్ హయాంలో ఏపీలో చక్రం తిప్పిన ఐఏఎస్ అధికారి ఒడిషాలో కాంగ్రెస్ గూటికి చేరడం... రానున్న రోజుల్లో జగన్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఎందుకంటే.. ఏడేళ్ల తరువాత ఇప్పుడు ఈడీ ఈ కేసులో అవినాష్ రెడ్డి తదితరుల నివాసాలలో ఆధారాల కోసం తనిఖీలు నిర్వహించడం విచిత్రంగా ఉందన్నారు. రానున్న రోజులలో జరగబోయే పరిణామాలేమిటన్నది వేచి చూడాలన్నారు.   Jagan to join Congress, YS Viveka Case ED Raids, YS Vivekananda Reddy Murder Case, ED Investigation, Avinash Reddy ED Raids, TeluguOne
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ప్రకటించేశారు. శ్రావణ శుక్రవారం రోజే తాను విజయవాడ వేదికగా కొత్తపార్టీ ప్రకటన చేస్తానని వెల్లడించారు.  తాను త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు గతంలోనే వెల్లడించిన విజయసాయి. ఇప్పుడు ఆ పార్టీ ప్రకటన ఎప్పుడు, ఎక్కడ అన్న విషయంలో క్లారిటీ ఇచ్చారు.    శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు  విజయవాడ వేదికగా  పార్టీ పేరు, జెండా, అజెండా, విధివిధానాలను వెల్లడిస్తానని చెప్పారు.  ప్రజాసమస్యలపై నిలదీసేందుకు,  ప్రజల గొంతుకగా మారేందుకు చట్టసభల్లో ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంటూ, పరోక్షంగా వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ బాయ్ కాట్ ను తప్పుపడుతూ విమర్శలు గుప్పించారు.   గత కొంతకాలంగా విజయసాయిరెడ్డి రాజకీయ అడుగులపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నది.  వైసీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయి.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి రాజకీయ సన్యాసం ప్రకటించిన ఇంత కాలానికి సొంత రాజకీయ వేదక ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం విశేషం.    Vijayasai Reddy Political Party Announcement, Vijayawada, Sravana Sukrvaram, Vijayawada,   AP Politics, TeluguOne
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ పర్యటన ఏమైంది? కొన్ని వారాల కిందట జగన్ హస్తిన పర్యటనకు వెడుతున్నారనీ, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారనీ వైసీపీ ఆర్భాటంగా ప్రకటించింది. వైసీపీ సోషల్ మీడియాలో జగన్ పర్యటన గురించిన పోస్టులు పుంఖానుపుంఖాలుగా వెల్లువెత్తాయి. దీంతో జగన్ హస్తిన పర్యటనపై సర్వత్రా ఆసక్తి  వ్యక్తమైంది.   రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలు, ప్రధానంగా అధికార మార్పిడి తర్వాత చోటుచేసుకుంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో ఆయన హస్తిన టూర్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. హస్తిన పర్యటనలో జగన్ మోడీ,  షాలతో చర్చించే అంశాలేంటి?  జగన్, ఆయన పార్టీ నేతలు, సన్నిహిుతలు ఎదుర్కొంటున్న సీబీఐ, ఈడీ విచారణలు వేగవంతమై, దర్యాప్తులు కొలిక్కి వస్తున్న వేళ ఆయన మోడీ, అమిత్ షాలతో భేటీ కానున్నారన్న వార్తలు ఉత్కంఠకు తెరలేపాయి.  జగన్  ఢిల్లీ పర్యటన కేంద్రం పెద్దల ఆశీస్సులతో.. కేసుల నుంచి రక్షణ పొందేందుకేనన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తమైంది. అయితే జగన్ హస్తిన పర్యటన వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చి వారాలు గడిచిపోయినా ఆయన బెంగళూరు, తాడేపల్లి ప్యాలెస్ మధ్య తిరగడం తప్ప హస్తిన  ఫ్లైట్ ఎక్కలేదు. దీంతో  జగన్ పర్యటన సంగతేమైందన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ఆయనకు మోడీ, అమిత్ షాలు అప్పాయింట్ మెంటే ఇవ్వలేదని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో  కేంద్ర ప్రభుత్వంతో  వైసీపీ సఖ్యతగా వ్యవహరించింది. జగన్ ఎప్పుడు కోరితే అప్పుడు మోడీ, షాల అప్పాయింట్ దొరికేసేది. అయితే 2024 ఎన్నికల తరువాత నుంచి  పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు వచ్చింది.   కేంద్రం కోరినా కోరకున్నా...జగన్, వైసీపీ కేంద్ర ప్రభుత్వ విధానాలన్నిటికీ బేషరతు మద్దతు ఇస్తున్నా.. కేంద్రం పెద్దలు ఆయనను పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. ఇక రాష్ట్రంలో  కొలువుదీరిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన అక్రమాలపై వరుస విచారణలు జరుపుతుంటే..  కేంద్ర దర్యాప్తు సంస్థలు జగన్ అక్రమాస్తులు, మద్యం కుంభకోణం కేసుల విచారణల్లో వేగం పెంచుతున్న పరిస్థితిప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. కేంద్రం పెద్దలను కలిసి రక్షణ కోరేందుకు జగన్ మోడీ, షాల అప్పాయింట్ మెంట్ కోరారని రాజకీయవర్గాలలో విస్తృత ప్రచారం జరిగింది. కట్ చేస్తే జగన్ ఇప్పుడు హస్తిన పర్యటన ఊసెత్తడం లేదు. వైసీపీ సోషల్ మీడియాలో  కూడా ఆయన హస్తిన పర్యటనకు సంబంధించిన వివరాలేవీ కనిపించడం లేదు. దీంతో మోడీ, షా జగన్ కు అప్పాయింట్ మెంట్  ఇవ్వలేదని స్పష్టమౌతోందని అంటున్నారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ లో తెలుగుదేశం కీలక భాగస్వామి కావడంతో..  జగన్ కు అప్పాయింట్ మెంట్ ఇవ్వడం  రాజకీయంగా ప్రతికూల సంకేతాలు ఇస్తుందన్న భావనతో మోడీ, షాలు జగన్ కు అప్పాయింట్ మెంట్ నిరాకరించినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి.     రాబోయే రోజుల్లో ఢిల్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఏ దిశగా సాగుతుంది, కేంద్ర ప్రధాన నాయకులతో ఆయన సమావేశం అయ్యే అవకాశం దక్కుతుందా లేదా అనేది ఏపీ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. కేంద్ర దర్యాప్తు సంస్థల కేసుల విచారణ గతిని, రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును ఈ పర్యటన ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వేచి చూడాల్సి ఉంది. What happend to Jagan delhi tour, Modi, Shah, Appointment, Cases, Nda, Telugudesham, Ap, TeluguOne
వైసీపీ  సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అడుగులు ఎటు అన్న విషయంపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చర్చ జోరుగా నడుస్తోంది.  శాసనమండలిలో  వైసీపీ పక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ జనసేన వైపు చూపు సారించారన్న చర్చ జోరందుగుంది.  ఆయన రాజకీయ అడుగులు జనసేన వైపు పడుతున్నాయని వైసీపీలోనే వినిపిస్తున్నది.  ఆయన ఇప్పటికే జనసేన అగ్రనేతతో ఈ విషయంగా చర్చలు జరిపారని గట్టిగా వినిపిస్తోంది.  ఈ విషయంలో  బొత్స సత్యనారాయణ స్వయంగా స్పందిస్తూ ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను పార్టీ మారుతాన్న ప్రచారం పూర్తిగా ఆధారరహితమని స్పష్టం చేశారు. ఇదంతా మైండ్ గేమ్ లో భాగమని కొట్టి పారేశారు.  బొత్స స్వయంగా ఖండిచినా ఆయన జనసేనకు షిఫ్ట్ అవుతారన్న ప్రచారం ఇసుమంతైనా తగ్గలేదు. రాజకీయ పరిశీలకులు సైతం బొత్సలో జనసేన, వైసీపీల మధ్య ఊగిసలాట కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. స్థానిక ఎన్నికలలో పార్టీ పోటీపై వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్న జనసేనాని.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం  చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంగా బొత్స జనసేన వైపు మొగ్గు చూపే అవకాశాలను కొట్టి పారేయలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తాజాగా బొత్స ఇటీవలి మౌనాన్ని వీడి మండలిలోనూ, బయటా కూడా తెలుగుదేశం పై, మంత్రి లోకేష్ పై విమర్శలకు పదును పెట్టడం, అదే సమయంలో జనసేన పట్ల ఒకింత మెతక వైఖరిని అవలంబించడం ఇందుకు తార్కానాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద బొత్స రాజకీయ అడుగుల విషయంలో అటు వైసీపీలోనూ, ఇటు జనసేనలోనూ కూడా ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది.   Botsa Satyanarayana, Janasena Party, YSRCP, AP Politics, Vizianagaram Politics
  టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..! తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ‘అదృశ్య వ్యక్తులు’ ఎవరో నిష్పాక్షికంగా గుర్తించి, వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవిని కోరారు. క్రమశిక్షణా కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ ఇచ్చానని సురేఖ తెలిపారు.  అయినప్పటికీ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఒకే తరహాలో తనపై, తన కుటుంబంపై విమర్శలు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. క్రమశిక్షణా కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై బహిరంగ విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆమె కోరారు.  పార్టీ నాయకత్వం, క్రమశిక్షణా నియమావళిపై తనకు పూర్తి గౌరవం ఉందని పేర్కొన్న సురేఖ.. సీనియర్ బీసీ మహిళా నాయకురాలిగా తనపై సామూహికంగా విమర్శలు వస్తున్నా పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు. పార్టీ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి వున్న పార్టీ అని, ఆ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ కోరారు. Konda Surekha, CM Revanth Reddy, Telangana Congress, Konda Susmitha, TPCC, Congress MLAs Ultimatum, TPCC Disciplinary Committee, MP Mallu Ravi  
ALSO ON TELUGUONE N E W S
  ఇరుముడి.. ఇప్పుడు ఏ ముగ్గురు కలిసినా ఇరుముడి చూసావా లేదా అని డిస్కర్షన్ చేసుకుంటున్నారంటే ఇరుముడి ఆధిపత్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. మాస్ మహారాజా  రవితేజతో పాటు కూతురు మణికంఠ(మణమ్మ) గా చేసిన చిన్నారి నక్షత్ర తన అద్భుతమైన అభినయంతో అందరి దృష్టినీ ఆకరిస్తుంది. మొదటి సినిమాతోనే లీడ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించి, అమాయకత్వంతో కూడిన నటన, ముచ్చటైన సంభాషణలు, తండ్రి-కూతుళ్ల మధ్యన ఉండే అపురూపమైన అనుబంధాన్ని పండించిన తీరు విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకుంది. 'ఒక రకంగా ఇరుముడి కథ నక్షత్ర లక్ష్య సాధన కోసమే పుట్టింది.    క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటన చూసి ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటూ థియేటర్స్ నుంచి వస్తున్నారంటే నక్షత్ర సృష్టించిన 'ఆరా'  ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. అంతటి  గొప్ప పెర్ ఫార్మెన్స్ ని  కనబరిచిన నక్షత్ర రియల్ లైఫ్ బ్యాక్‌గ్రౌండ్  ఇప్పుడు అందరినీ మరింత భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. నిజ జీవితంలో నక్షత్రకు చిన్నతనంలోనే తండ్రి లేరనే చేదు నిజం చాలామందిని కలిచివేస్తోంది. ఆమె చిన్నతనంలోనే తండ్రి దూరమవ్వడంతో, తల్లి అన్ని తానై  ఎంతో క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసింది. సొంత తండ్రి ప్రేమకు దూరమైన నక్షత్ర, తెరపై రవితేజ సరసన కూతురిగా నటిస్తున్నప్పుడు తనలో దాగున్న నిజమైన తండ్రి ప్రేమను, ఆ వెలితిని తీర్చుకుందని నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో దర్శకుడు శివ నిర్వాణ భావోద్వేగంతో వెల్లడి చేసాడు. సినిమా షూటింగ్ సమయంలో 45 రోజుల పాటు సాగిన సుదీర్ఘమైన షెడ్యూల్‌లో నక్షత్ర ప్రదర్శించిన ప్రతిభ, సమయపాలన యూనిట్ సభ్యులందరినీ ఆశ్చర్యపరిచింది. తండ్రి లేని లోటును తన గుండెల్లో దాచుకుని, తెరపై తండ్రి-కూతుళ్ల అనుబంధాన్ని అంత సహజంగా పండించడం సామాన్యమైన విషయం కాదు. నక్షత్ర నేపథ్యం తెలిసిన తర్వాత ప్రేక్షకులు ఆమెపై మరింత ప్రేమాభిమానాలను కురిపిస్తున్నారు. ప్రతిభకు పేదరికం గానీ, జీవితంలో ఎదురయ్యే విషాదాలు గానీ అడ్డంకి కావు అని నక్షత్ర నిరూపించింది.  ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే పై లోకంలో ఉన్న నక్షత్ర తండ్రి తన కూతురు విజయాన్ని చూసి గర్వపడుతూ ఉంటాడు. ఒక వేళ ఆయన మళ్ళీ పుట్టి ఉంటే తల్లి ఒడిలో పసివాడుగా ఇరుముడి థియేటర్ కి వెళ్లి తన కూతురు పెర్ఫార్మ్ చూసి ఉండవచ్చు.  ఇక ఇరుముడి తన ప్రభంజనాన్ని చాలా స్పష్టంగా కొనసాగిస్తు బాక్స్ ఆఫీస్ వద్ద తన అజమాయిషీ చెలాయిస్తూ ఉంది. మూడు రోజులకే 80 కోట్ల క్లబ్ లో చేరడంతో వంద రోజుల పోస్టర్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. హైదరాబాద్ మియాపూర్ లోని మిరాజ్ థియేటర్ లో 'మల్లెపూల పల్లకి' సాంగ్ ని సెకండ్ టైం ప్లే చేయించి భారీ లైటింగ్ మధ్య స్క్రీన్ ముందు ప్రేక్షకులు డాన్స్ లు వెయ్యడం ఇరుముడి ఉదృతి యొక్క స్థాయికి  స్పష్టమైన సంకేతం. నక్షత్ర ది కేరళ లోని కన్నూర్. తన నెలల వయసప్పుడే తండ్రి చనిపోయాడు. ప్రెజెంట్ సెవెంత్ క్లాస్. Irumudi, Nakshathra, Raviteja, Shiva Nirvana
  హీరో.. అభిమానులతో పాటు టోటల్ మానవాళికి లభించిన మిరుమిట్లు గొలిపే అరుదైన గ్రహం. ఎప్పటికప్పుడు నవ శకానికి నాంది పలికే  డైనమేట్ కూడా. హీరో అంటే కేవలం ఫైట్లు, డ్యాన్సులు, బాక్సాఫీస్ రికార్డులే కాదు, సమాజానికి మంచి మార్గం చూపించే బాధ్యత గల శక్తి అని సుదీర్ఘ కాలం నుంచి నిరూపిస్తు వస్తున్నారు.  ఈ క్రమంలోనే మాస్ మహారాజా రవితేజ నుంచి వచ్చిన ‘ఇరుముడి’ సినీ పరిశ్రమలోనే కాకుండా సమాజంలోనూ ఒక గొప్ప చర్చకి  తెరలేపింది. కేవలం ఒక తండ్రిగా తన కూతురిని ప్రేమించడమే కాకుండా, ప్రతి ఆడపిల్లలోను నా కూతుర్ని చూసుకుంటాను. వాళ్ళకి  ఏ కష్టం వచ్చినా తండ్రిగా  అండగా ఉంటాను అని రవితేజ చెప్పే సంభాషణలు ప్రేక్షకుల హృదయాలని కట్టిపడేస్తున్నాయి. అంతే కాకుండా సమాజంలో ఆడపిల్లల భద్రత మరియు గౌరవం పట్ల ఎంతటి బాధ్యత ఉండాలో ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తోంది. రవితేజ అనే కాదు అందరూ హీరోలు తమ సినిమాల్లో సామాజిక బాధ్యతని గుర్తు చేస్తున్నారు. దీని వల్ల సమాజంలో మార్పు రావడమనేది జరుగుతుంది. ముఖ్యంగా డై హార్ట్ ఫ్యాన్స్, ఫ్యాన్స్  తమ హీరో దారిలో పయనించడం తధ్యం. స్టార్ హీరోలు ఇలాంటి సందేశాత్మకమైన కథలతో ముందుకు రావడం వల్ల వారి అభిమానులు కేవలం సినిమాను ఆస్వాదించడమే కాకుండా, నిజ జీవితంలోనూ బాధ్యతాయుత పౌరులుగా మారేందుకు ప్రేరణ పొందుతున్నారు. రవితేజ చెప్పిన ఈ మాటలు, చూపించిన భావోద్వేగాలు నేటి సమాజంలో ఆడపిల్లల పట్ల చూపే కోణాన్ని తప్పకుండా మారుస్తాయని, ఒక మంచి సామాజిక మార్పుకు పునాది వేస్తాయని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.   Also Read: చితి చివరి దాకా ఆయనే  ఇరుముడి సినిమా విషయానికి వస్తే సాధారణ కుటుంబాలలో ఆడపిల్లలు బయటకు వెళ్లి మాట్లాడటానికి భయపడే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, ఈ చిత్రం ఆడపిల్లలకు ధైర్యాన్ని నూరిపోసేలా ఉందనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి 100 మంది తల్లిదండ్రులలో 80 శాతం మంది తమ పిల్లలకు రక్షణ గురించి నేర్పించే విధానంలో ఇరుముడి ఒక కొత్త ఆలోచనని  రేకెత్తిస్తోంది. అందుకే అంటారు సినిమా ఆదిపరాశక్తితో సమానమని . Irumudi, Raviteja, Tollywood    
Ravi Teja is visibly overwhelmed by the response to Irumudi, which has emerged as a record-breaking blockbuster with strong weekday momentum. Speaking at the film’s success meet, the Mass Maharaja said the emotional response from audiences has been unlike anything he has experienced in his career. Ravi Teja revealed that he has been receiving congratulatory messages, audience videos and constantly coming across emotional reactions to the film on social media. He was particularly surprised to see families and aged audiences turning up in theatres. “I have never seen such an emotional response in my life,” he said, crediting the story for connecting deeply with viewers. The actor also spoke about his long-standing desire to explore rooted stories. Having watched films across languages during the pandemic, he wondered whether Telugu audiences would embrace such realistic narratives. Irumudi, according to him, has answered that question emphatically. Director Shiva Nirvana was praised for his conviction and clarity, while Ravi Teja said he gives complete freedom to directors once a script is locked. The actor thanked producers Mythri Naveen and Mythri Ravi and the entire team for making the film possible. With Irumudi continuing its phenomenal weekday run, Ravi Teja promised to keep choosing films that combine entertainment with strong content. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  కామెడీ నటుడుగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి క్యారక్టర్ ఆర్టిస్ట్ గాను పర్ఫెక్ట్ ఫిగర్ అని ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకుంటున్నాడు రాహుల్ రామకృష్ణ.. సోషల్ మీడియా వేదికగా తను చేసే పోస్ట్ లు వైరల్ గా నిలుస్తాయి. తాజాగా ఎక్స్ వేదికగా ‘చితి చివరిదాంక… KCR!’ అనే పోస్ట్ చేసాడు. దీంతో ఆనవాయితీ ప్రకారం సదరు  పోస్ట్ క్షణాల్లో  వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ వెనుక ఉన్న అసలు సందర్భం లేదా ఉద్దేశం ఏంటనేది ఆయన స్పష్టంగా వివరించకపోయినప్పటికీ, నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ అభిమానులు ఆ పోస్టుకి మద్దతుగా కామెంట్లు చేస్తుండగా, మరికొందరు రాహుల్ రామకృష్ణని  లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. Also Read:  కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం Rahul Ramakrishna, kcr  
  సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 1 నేనొక్కడినే మూవీతో జతకట్టి  తెలుగు ప్రేక్షకులని పలకరించిన  కృతిసనన్ ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేంజ్ లో దూసుకెళ్తుంది. రీసెంట్ గా కాక్ టెయిల్ 2 తో అలరించిన కృతి  ఈ నెల 28 న రాబోతున్న రక్షాబంధన్ పండుగని పురస్కరించుకొని చేసిన యాడ్ వివాదంగా మారింది. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ 'గివా' (GIVA) తమ రక్షాబంధన్ మరియు పెట్ కలెక్షన్ ప్రమోషన్ లో భాగంగా ఈ కమర్షియల్ యాడ్‌ను రూపొందించింది. ఈ ప్రకటనలో కృతి  ఆఫ్ వైట్ రంగులో ఉన్న బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, దానిపై ష్రగ్ (కేప్) మరియు డ్రేప్డ్ స్కర్ట్‌తో కూడిన మోడ్రన్ ఇండో-వెస్ట్రన్ లుక్‌లో కనిపించారు. పవిత్రమైన రక్షాబంధన్ పండుగ వేళ, సొంత సోదరుడికి రాఖీ కట్టే సమయంలో ఇలాంటి బోల్డ్ బ్రాలెట్ దుస్తులు ధరించడం సంప్రదాయాలకి విరుద్ధం. రాఖీ కట్టేటప్పుడు కనీసం పూజా పళ్లెం, తిలకం, పసుపు కుంకుమ వంటి ప్రాథమిక సాంప్రదాయ అంశాలు కనిపించకపోవడంపై కూడా నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంప్రదాయ వేడుకల పవిత్రతను ఈ ప్రకటన తగ్గించేలా ఉందంటూ నెటిజన్లలో ఒక వర్గం మండిపడుతోంది.  Also Read: హయ్యస్ట్ టికెట్ రేట్ ఇదే వివాదానికి తోడైన మరో కీలకమైన అంశం ఏమిటంటే.. ఈ యాడ్‌లో కృతి సనన్ తన సోదరుడికి రాఖీ కట్టిన తర్వాత, కుటుంబ సభ్యుడిగా భావిస్తూ తమ పెంపుడు కుక్కకు కూడా రాఖీ కడుతుంది. జ్యువెలరీ బ్రాండ్ తమ పెట్ రాఖీ సేకరణను ప్రమోట్ చేయడానికి ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నప్పటికీ, పెంపుడు జంతువులకు రాఖీ కట్టడాన్ని పండుగ మూల భావనను అపహాస్యం చేయడమేనంటూ ట్రోలర్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.  Kriti Sanon, Raksha Bandhan
The Drishyam franchise is not ending with its third chapter. Producer Antony Perumbavoor has confirmed that another instalment, Drishyam 4, is definitely in the works, giving fans of Mohanlal’s iconic Georgekutty yet another reason to look forward to the franchise. The announcement comes just months after Drishyam 3 continued the story of Georgekutty and his family. The third film itself became a major success, further strengthening the case for another chapter in the popular thriller franchise. Perumbavoor made the confirmation at a recent event, stating that a fourth Drishyam would happen. However, there is an interesting question surrounding the project. While the producer has confirmed Drishyam 4, Mohanlal and director Jeethu Joseph have not separately made an official announcement confirming their involvement in the fourth film. Mohanlal had earlier spoken about the possibility of continuing Georgekutty’s story, while Jeethu has maintained that he would only pursue another sequel if he found a story strong enough to justify it.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  రాకింగ్ స్టార్ యష్ వన్ మాన్ షో 'టాక్సిక్' టెంపరేచర్ అభిమానుల్లోను, ప్రేక్షకుల్లోను రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇందుకు నిదర్శనంగా ముందస్తు బుకింగ్ లో సాధిస్తున్న రికార్డులు చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.ఈ క్రేజ్ ఎంతలా ఉందంటే, ప్రధాన మహానగరాల్లో టికెట్ ధరలు భారీ స్థాయిలో ఉన్నాయి.  ముఖ్యంగా ముంబై బాంద్రాలోని జియో వరల్డ్ డ్రైవ్ వంటి ప్రీమియం థియేటర్లలో ఎంపిక చేసిన ప్రత్యేక షోల కోసం టికెట్ ధర ఏకంగా 2600 వరకు ఉండగా, బెంగళూరులోని ఫోరమ్ రెక్స్ వాక్ వంటి ప్రసిద్ధ ప్రదేశాల్లో 2,181 గా నమోదైంది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే, కన్నడ వెర్షన్ సగటు టికెట్ రేట్ 404 ,హిందీ వెర్షన్ సగటు టికెట్ ధర  364 గా  కొనసాగుతోంది. ఇంత భారీ ధరలు ఉన్నప్పటికీ, బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే థియేటర్లు హౌస్ ఫుల్ అయిపోవడం యశ్ బాక్సాఫీస్ స్టామినాకి  అద్దం పడుతోంది.  అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే  విడుదల రోజుకి సంబంధించి ఇండియాలోనే  నేరుగా 5,55,328 టికెట్లు అమ్ముడై  21.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.  Also Read: నిర్మాతగా మారనున్న నిత్యామీనన్.. హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు దేశవ్యాప్తంగా మొత్తం 13,591 షోలలో ఈ భారీ బుకింగ్స్ నమోదుకాగా, హోల్డ్ చేసిన స్థానాలని  (Block Seats) కూడా పరిగణనలోకి తీసుకుంటే విడుదల మొదటి రోజు ముందస్తు గ్రాస్ కలెక్షన్ ఏకంగా 30.14 కోట్లకు చేరుకోవడం ఒక సంచలనం. ఇందులో యశ్ స్వరాష్ట్రమైన కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. కర్ణాటకలో 8.08 కోట్లకు పైగా గ్రాస్ సాధించగా, అందులో రాజధాని బెంగళూరు ఒక్కటే 648 షోల ద్వారా  6.07 కోట్లను రాబట్టింది.  కేవలం దక్షణాదినే కాకుండా ఉత్తరాది మార్కెట్ లో కూడా యశ్ మానియా కొనసాగుతోంది. హిందీ డబ్బింగ్ వెర్షన్ ముందస్తు బుకింగ్స్ లో 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై రూ. 7.35 కోట్ల వసూళ్లను సాధించింది. విదేశాల్లో కూడా ఈ మూవీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తర అమెరికా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటికే 1,63,150 డాలర్ల పైగా గ్రాస్ నమోదు కాగా, 260 కి పైగా ప్రాంతాల్లో 709 షోలకు గాను 7,545 టికెట్లు అమ్ముడయ్యాయి. ఇందులో విచిత్రంగా కన్నడ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ అడ్వాన్స్ కలెక్షన్స్ లో ముందంజలో ఉండటం గమనార్హం. యుఎస్ లో తెలుగు వెర్షన్ ద్వారా 4,359 టికెట్లతో 94,706 డాలర్లు రాగా, కన్నడ వెర్షన్ 3,173 టికెట్లతో 68,246 డాలర్లు వసూలు చేసింది.   Yash, Toxic, Kaira Adwani, Nayanthara, Geethu Mohandas
న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ది ప్యారడైజ్'. దసరా తర్వాత వీరి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో ప్యారడైజ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఆయా షేర్ సాంగ్, ఇతర కంటెంట్ విశేషంగా ఆకట్టుకొని.. అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లే అప్డేట్ వచ్చేసింది. 'ది ప్యారడైజ్' సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిట్ లాక్ అయిందని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్లంతా షాకింగ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ప్రతీ సీన్ చాలా గ్రిప్పింగ్‌గా వచ్చిందని, ఫస్ట్ హాఫ్ అవుట్‌పుట్ చూసి మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారని టాక్. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో వచ్చిందట. స్క్రీన్ ముందర కూర్చున్న ఆడియన్స్‌కి రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం అంటున్నారు. ఆ ఎపిసోడ్ ను థియేటర్లు షేక్ అయ్యేలా డిజైన్ చేశారట. ప్రస్తుతం మేకర్స్ దృష్టి అంతా సెకండాఫ్ ఎడిటింగ్ మీద ఉంది. త్వరలోనే సెకండ్ హాఫ్ ఎడిట్ కూడా లాక్ చేసి రఫ్ కట్ రెడీ చేయబోతున్నారు.  అంతేకాదు, ఈ వారంలోనే 'ప్యారడైజ్' నుంచి సెకండ్ సింగిల్ బయటకు రాబోతోందట. అది కూడా ఎలాంటి అనిరుధ్ మాస్ టచ్ లో ఉండే ఫోక్ సాంగ్. ఆల్రెడీ ఫస్ట్ సాంగ్‌తో క్రేజ్ పెంచేసిన అనిరుధ్, ఈ సెకండ్ ఫోక్ ట్రాక్‌తో చార్ట్‌బస్టర్స్ రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అయ్యాడు.         The Paradise, Nani, Srikanth Odela, Anirudh  
  పాల కడలిని చిలికినప్పుడు సౌందర్యం అనేది కూడా పుట్టింది, ఆ సౌందర్యం పేరు నిత్యామీనన్ అని అభిమానులు నమ్ముతుంటారు. సెల్యులాయిడ్ పై తన పెర్ఫార్మ్ కూడా అదే విధంగా ఉండటం అభిమానుల నమ్మకానికి ఓటు వేసే పరిస్థితి. గ్లామర్ రోల్స్  కంటే కథకి, ,పెర్ ఫార్మెన్స్ కి ప్రాధాన్యం ఉండే కంటెంట్ బేస్డ్ సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ  ఇప్పుడు తన కెరీర్‌లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతుంది.  ఈసారి నిత్య  ఒక సరికొత్త ఫాంటసీ హారర్ థ్రిల్లర్ కథతో థియేటర్లలో ప్రేక్షకులని  భయపెట్టడమే కాకుండా, థ్రిల్ చేయడానికి వస్తున్నారు. సౌత్ ఇండియా ప్రేక్షకులని  'యామిరుక్కా బయమే', 'కరుంగాప్పియమ్' వంటి హిట్ హారర్ చిత్రాలతో థ్రిల్లింగ్ అనుభూతిని అందించిన దర్శకుడు డీకే (Deekay), తన తదుపరి ప్రాజెక్ట్‌ని  నిత్యా మీనన్‌తో రూపొందించడానికి సిద్ధమయ్యాడు. వినోదం, థ్రిల్ సమపాళ్లలో మిళితం చేసే డీకే శైలికి, నిత్యా మీనన్ నటన తోడవుతుండటంతో ఈ మూవీపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌లో ఒక ఆసక్తికరమైన విశేషం దాగి ఉంది.  నిత్యా మీనన్ కేవలం నటిగానే కాకుండా, నిర్మాతగా కూడా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.దీంతో ఈ న్యూస్  టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.  Also Read: రాకా vs టాక్సిక్ .. ఫ్యాన్స్ అంటుంది ఇదే  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు వేగంగా శరవేగంతో ప్రారంభం కానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది 2027 సమ్మర్ కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. డీకే కథనంలో ఉండే హ్యూమర్, సస్పెన్స్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ మరియు ఫాంటసీ ఎలిమెంట్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇన్నాళ్లూ విభిన్నమైన పాత్రలతో అలరించిన నిత్యా మీనన్, ఫాంటసీ హారర్ జోనర్‌లో భయపెడుతూనే నిర్మాతగా 'డబుల్ ధమాకా' కాంబినేషన్‌తో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.  Nithya Menon, Dk      
  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ, దీపికా పదుకునే ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ 'రాకా' గురించి రోజుకొక క్రేజీ న్యూస్ రాకపోతే సోషల్ మీడియా మారాం చేసే పరిస్థితి. అందుకే అభిమానులు నిత్యం సోషల్ మీడియాని జో కొడుతు  రికార్డు వ్యూస్ ని కట్టబెడుతున్నారు. ఈ కోవలోనే రీసెంట్ గా 'రాకా' గురించి వస్తున్న వైరల్ న్యూస్ సోషల్ మీడియా ఆధిపత్యాన్ని చాటి చెప్తుంది. మృణాల్ ఠాకూర్, రకుల్ ప్రీత్ సింగ్ ,జాన్వీ కపూర్, రష్మిక  వంటి టాప్ హీరోయిన్స్ రాకాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే  వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి  ఐశ్వర్య లక్ష్మి వచ్చి చేరింది. ఫిల్మ్‌వర్గాల్లో ప్రచారం జరుగుతున్న వార్తల ప్రకారం ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాలో సాధారణ రోల్ లో  కాకుండా పవర్‌ఫుల్ లేడీ విలన్ రోల్‌లో కనిపిస్తుందని రూమర్. క్ఒకవేళ ఈ రూమర్ నిజమైతే, ‘రాకా’ చిత్రంలో మొత్తం ఐదుగురు ప్రముఖ నటీమణులు నటిస్తున్నట్లవుతుంది. ఒకే సినిమాలో ఐదుగురు స్టార్ హీరోయిన్లను భాగం చేస్తూ అట్లీ అసలు ఎలాంటి ప్లాన్ చేస్తున్నారనేది ఇప్పుడు సినీ ప్రియుల్లో తీవ్రమైన ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రతీ ఒక్కరి పాత్రకు ప్రాధాన్యత ఉండేలా అట్లీ అత్యంత ఆసక్తికరంగా కథని  డిజైన్ చేశారని తెలుస్తోంది.  ఈ సినిమా కోసం ముంబైతో పాటు వివిధ ప్రదేశాల్లో భారీ ఎత్తున విజువల్ ఎఫెక్ట్స్, భారీ సైంటిఫిక్ సెట్లను నిర్మిస్తున్నారు.  Also Read: NBK 111 టైటిల్ ఒక రేంజ్ లో ఉంది! ఫ్యాన్స్ లో జోష్ ఇటీవల నటి మంచు లక్ష్మి షూటింగ్ సెట్‌ను సందర్శించి అక్కడి వింత జీవులు, అద్భుతమైన నిర్మాణాలు చూసి తాను ఫిదా అయ్యానని, బన్నీని మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో చూస్తారని సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఒక వైపు విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ గ్రాండ్ ప్రాజెక్ట్, మరోవైపు ఐదుగురు లేడీ ఆర్టిస్టుల ప్రాధాన్యతతో కూడిన కథనంతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయబోతోందో వేచి చూడాలి. ఇక ఐశ్వర్య లక్ష్మి ఉందనే వార్తలతో హీరోయిన్స్ విషయంలో  కొంత మంది అభిమానులు, సినీ ప్రియులు  ఈ నెల 26 న విడుదల కాబోతున్న టాక్సిక్ తో రాకాకి పోలిక తెస్తున్నారు. టాక్సిక్ లో ఐదు హీరోయిన్స్ ఉన్న విషయం తెలిసిందే.  Raaka, Toxic, yash, Allu Arjun    
రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు అన్నా చెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల  అనురాగానికి హద్దులు ఉండవు. తన ప్రేమను, రక్షణను కోరుతూ సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టే అక్కచెల్లెళ్లకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలా అని ప్రతి తమ్ముడు, అన్న ఆలోచిస్తుంటారు. బహుమతి ఖరీదైనదే కావాల్సిన అవసరం లేదు, అందులో  ప్రేమాభిమానాలు ఉంటే చాలు. తక్కువ బడ్జెట్‌లో అక్క చెల్లెళ్లను సంతోషపరిచే కొన్ని అద్భుతమైన గిఫ్ట్ ఐడియాలు ఇవే! పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ (Personalized Gifts).. చిన్నప్పటి ఫోటోతో ఉన్న కస్టమైజ్డ్ ఫోటో ఫ్రేమ్, వారి పేరు లేదా బొమ్మతో ఉన్న కాఫీ మగ్, లేదా ఒక కీచైన్ ఇవ్వవచ్చు. ఇవి ఖర్చు తక్కువే అయినా, ఎంతో గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోతాయి. బుక్స్ లేదా డైరీ.. అక్క లేదా చెల్లెలికి పుస్తకాలు చదవడం లేదా అలవాట్లను డైరీలో రాసుకోవడం ఇష్టమైతే, మంచి నవల లేదా ఒక అందమైన పర్సనల్ డైరీ, పెన్ సెట్ బహుమతిగా ఇవ్వవచ్చు. ఇది వారి రోజువారీ జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇయర్ రింగ్స్ మరియు యాక్సెసరీస్.. ప్రస్తుతం ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, ట్రెండీ ఇయర్ రింగ్స్ లేదా హెయిర్ యాక్సెసరీస్ తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. వారికి నచ్చే డిజైన్ ఎంచుకుని ఇస్తే వారు కచ్చితంగా ఆనందిస్తారు. ఇండోర్ ప్లాంట్స్ (Indoor Plants).. మొక్కలను అమితంగా ఇష్టపడే అక్కాచెల్లెళ్ల కోసం చిన్న సైజు మనీ ప్లాంట్, సుక్యులెంట్స్ లేదా జేడ్ ప్లాంట్ వంటి ఇండోర్ ప్లాంట్స్ ఇవ్వడం మంచి ఐడియా. ఇవి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ  ని నింపడమే కాకుండా అనుబంధానికి ప్రతీకగా ఎదుగుతాయి. స్కిన్ కేర్ / సెల్ఫ్ కేర్ కాంబో..  ఇష్టమైన బ్రాండ్ లలో ఫేస్ మాస్క్స్, లిప్ బామ్స్, లేదా ఫ్రాగ్రెన్స్ బాడీ మిస్ట్ వంటి వాటితో చిన్న స్కిన్ కేర్ కిట్  ఇవ్వవచ్చు. ఇవి తక్కువ బడ్జెట్‌లో లభించడమే కాకుండా వారి పట్ల ఉన్న  శ్రద్ధను తెలియజేస్తాయి. హాండ్ మేడ్ గిఫ్ట్స్ & చాక్లెట్స్..  సొంతంగా  చేసిన గ్రీటింగ్ కార్డ్, వారితో ఉన్న అనుబంధాన్ని తెలుపుతూ రాసిన ఒక చిన్న లెటర్ తో పాటు ఒక చాక్లెట్ బాక్స్ ఇస్తే వచ్చే సంతోషం ముందు ఏ ఖరీదైన వస్తువైనా సరిపోదు. ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. నిజమైన ప్రేమ అభిమానం ఉన్నప్పుడు.. వస్తువు ధర కంటే దాన్ని ఇచ్చే విధానంలోనే అసలైన ప్రేమ ఉంటుంది. కాబట్టి ఈ రాఖీకి బడ్జెట్‌కు తగినట్టుగా పై వాటిలో ఒక మంచి గిఫ్ట్ ఎంచుకుని అక్కచెల్లెళ్లకు సర్ ప్రైజ్ ఇచ్చేయండి మరి..                                                                                                                                       *రూపశ్రీ. 
ప్రకృతి మనకు ప్రసాదించిన అత్యంత అమూల్యమైన వరాలలో కొబ్బరి చెట్టు ఒకటి. దీనిని మన పెద్దలు కల్పవృక్షం అని పిలుస్తారు. ఎందుకంటే కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం అనగా లేత కొబ్బరి నీళ్లు, కొబ్బరి గుజ్జు, కొబ్బరి పాలు మరియు స్వచ్ఛమైన కొబ్బరి నూనె మన శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, నిత్య యవ్వనాన్ని అందిస్తాయి. నేటి ఉరుకులు పరుగుల ఆధునిక జీవనశైలిలో సహజసిద్ధమైన పోషకాలను కోల్పోతున్న మన శరీరానికి కొబ్బరి ఒక అద్భుతమైన అమృతంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ మన ఆహారంలో లేదా దినచర్యలో కొబ్బరిని ఏదో ఒక రూపంలో భాగం చేసుకోవడం ద్వారా ఊహించని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆయుర్వేద మరియు పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మొదటగా, కొబ్బరి నీళ్ల గురించి చెప్పుకోవాలంటే ఇవి కేవలం దాహార్తిని తీర్చే సాధారణ పానీయం మాత్రమే కావు. ఒక కప్పు అనగా సుమారు 240 మి.లీ తాజా కొబ్బరి నీళ్లలో దాదాపు 600 మి.గ్రాముల పొటాషియం లభిస్తుంది. ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడటంలో, రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత లేదా శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా శరీరం తక్షణ శక్తిని పుంజుకుంటుంది. అంతేకాకుండా, ఇందులో కెలొరీలు చాలా తక్కువగా అనగా కేవలం 45 నుంచి 60 కెలొరీలు మాత్రమే ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ డ్రింక్. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరంలోని హానికారక వ్యర్థాలను బయటకు పంపడంలో కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఇక కొబ్బరి కాయ లోపల ఉండే తెల్లని గుజ్జులో శరీరానికి అవసరమైన డైటరీ ఫైబర్, కాపర్, ఐరన్ మరియు మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తాజా కొబ్బరిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. మలబద్ధకం సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తూ, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో, చర్మం మరియు జుట్టు కాంతివంతంగా మారడంలో కొబ్బరి గుజ్జు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.       Coconut water and oil nutrition guide, health benefits of coconut from water to oil.
  నేటి ఆధునిక వేగవంతమైన జీవనశైలిలో ఉదయాన్నే ఒక వేడి కప్పు కాఫీ లేదా టీతో రోజును ప్రారంభించడం చాలామందికి ఒక అలవాటుగా మారింది. అలసటను తరిమికొట్టి, శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడానికి కెఫిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, పరిమితికి మించిన కెఫిన్ వినియోగం ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి, వారి హార్మోన్ల సమతుల్యతకు తీవ్రమైన హాని కలిగిస్తుందని వైద్య ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ క్రమం తప్పకుండా 400 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్ మరియు ప్రోజెస్టిరాన్ వంటి అత్యంత కీలకమైన హార్మోన్ల ఉత్పత్తిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది కేవలం తాత్కాలిక అసౌకర్యంతో ఆగకుండా, దీర్ఘకాలికంగా తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మహిళల శరీరంలో కెఫిన్ ప్రవేశించినప్పుడు అది ప్రాథమికంగా స్ట్రెస్ హార్మోన్ అయిన కోర్టిసాల్ స్థాయిలను దాదాపు 30% నుండి 40% వరకు పెంచుతుంది. శరీరంలో కోర్టిసాల్ విపరీతంగా పెరగడం వల్ల మనస్సు నిరంతరం తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకు గురవుతుంది. ఈ అధిక కోర్టిసాల్ ప్రభావం నేరుగా అడ్రినల్ గ్రంధులపై పడి, లైంగిక మరియు సంతానోత్పత్తి హార్మోన్ల ఉత్పత్తిని క్రమంగా క్షీణింపజేస్తుంది. ఫలితంగా, రుతుక్రమ చక్రంలో తీవ్రమైన అసమతుల్యతలు తలెత్తుతాయి. రోజుకు 2 నుండి 3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే మహిళల్లో సుమారు 25% మంది పీరియడ్స్ ఆలస్యం కావడం, అధిక రక్తస్రావం కావడం లేదా తీవ్రమైన పొత్తికడుపు నొప్పితో బాధపడటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, అధిక కెఫిన్ వినియోగం ఈస్ట్రోజెన్ డామినెన్స్‌కు కారణమవుతుంది. శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు అవసరమైన దానికంటే ఎక్కువగా పెరిగినప్పుడు, థైరాయిడ్ గ్రంధి పనితీరు మందగిస్తుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి, జీవక్రియల రేటును గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల చాలామంది మహిళల్లో ఎంత వ్యాయామం చేసినా బరువు తగ్గకపోవడం, నిరంతరం నీరసంగా అనిపించడం, మరియు తీవ్రమైన జుట్టు రాలడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. పిసిఒడి (PCOD), పిసిఒఎస్ (PCOS) మరియు ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలతో బాధపడుతున్న మహిళలు కెఫిన్ వినియోగాన్ని తగ్గించుకోకపోతే, వారి శరీరంలో ఇన్సులిన్ నిరోధకత మరింత పెరిగి వ్యాధి తీవ్రత 50% వరకు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.       How caffeine affects estrogen and pcos,caffeine and period problems in women.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ఒత్తిడి, ఆందోళన, అలసట, ఏకాగ్రత తగ్గడం వంటి ఇబ్బందులు కనిపించవచ్చు. ఇలాంటి సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు యోగా, ప్రాణాయామం కూడా కొంతమందికి ఉపయోగకరంగా ఉండొచ్చు. అలాంటి ప్రాణాయామాల్లో ఉజ్జయి ప్రాణాయామం (Ujjayi Pranayama) ఒకటి. దీనిని చేస్తూ శ్వాస తీసుకునేటప్పుడు గొంతు భాగంలో స్వల్పంగా శబ్దం వస్తుంది. అందుకే దీనిని కొందరు “Ocean Breath” అని కూడా అంటారు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్, ఆయుర్వేద డైటీషియన్ స్రవంతి రఘు ఉజ్జయి ప్రాణాయామాన్ని ఎలా చేయాలి? శ్వాసను ఎలా  నియంత్రించాలి? రోజువారీ జీవితంలో దీనిని ఎలా ప్రాక్టీస్ చేయాలి? వంటి విషయాలను సులభంగా వివరిస్తున్నారు. థైరాయిడ్ సమస్యలతో పాటు ఒత్తిడి, మానసిక ఆందోళన లేదా ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఉన్నవారు ఈ ప్రాణాయామం గురించి తెలుసుకోవచ్చు. అయితే ప్రాణాయామం థైరాయిడ్‌కు వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. థైరాయిడ్‌కు మందులు వాడుతున్నవారు వైద్యుల సూచనలను తప్పకుండా పాటించాలి. గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాత యోగా లేదా ప్రాణాయామాన్ని ప్రారంభించడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
సూపర్‌మార్కెట్‌లో, షాప్స్ లో, చిన్న అంగళ్లలో కొనుగోలు చేసే బిస్కెట్లు, ప్యాకెట్ ఫుడ్స్, పాల ఉత్పత్తులు, జ్యూస్‌లు, సాస్‌లు, రెడీ-టు-ఈట్ ఆహార పదార్థాలపై “Best Before”, “Use By”, “Expiry Date” వంటి పదాలు కనిపిస్తుంటాయి. చాలామందికి వీటి మధ్య తేడా స్పష్టంగా తెలియదు. “తేదీ అయిపోయింది కదా… ఇక ఆహారం మొత్తం పారేయాలా?” అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అంతే కాదు.. తేదీ దాటి ఇంకా ఒక్కరోజే, ఒక్క వారమే.. కాబట్టి ఏమి కాదు అనుకుని  వాడేవాళ్ళు  కూడా ఉంటారు. అయితే Best Before తేదీ , Use By/Expiry తేదీ ఒకే అర్థాన్ని ఇవ్వవు. ఆహారం ఎంతకాలం నాణ్యతగా ఉంటుంది? ఎప్పుడు దాన్ని తినడం సురక్షితం కాదు? అనే విషయాల్లో ఈ తేదీలకు చాలా తేడా ఉంది. దీని గురించి ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. తేదీ ఎందుకు వేస్తారు? ఆహార పదార్థాలను తయారు చేసిన తర్వాత వాటి రుచి, వాసన, రంగు, ఆకృతి, పోషకాల నాణ్యత, భద్రత కాలం గడిచేకొద్దీ మారవచ్చు. అందుకే తయారీదారులు ప్యాకెట్‌పై ఒక నిర్దిష్ట తేదీని సూచిస్తారు. అయితే ఆ తేదీ ప్రతి సందర్భంలో “ఆ రోజు తర్వాత ఆహారం విషంగా మారుతుంది” అని అర్థం కాదు.  ఇక్కడే Best Before, Use By మధ్య తేడా వస్తుంది. “Best Before” అంటే ఏమిటి? Best Before అంటే ఆ ప్యాక్ లో ఉన్న ఆహార పదార్థం  మంచి నాణ్యతను కలిగి ఉండే కాలం. అంటే, ప్యాకెట్‌పై..  ఒక నిర్దిష్ట తేదీ వరకు ఆహారం తన రుచి, వాసన, క్రిస్పీనెస్, రంగు వంటి నాణ్యతలను బాగా కలిగి ఉంటుందనీ అర్ధం. తేదీ దాటిన వెంటనే ఆహారం పాడైపోతుందా? సరిగ్గా నిల్వ చేసిన కొన్ని ఆహార పదార్థాలు Best Before తేదీ దాటిన తర్వాత కూడా కొంతకాలం తినడానికి అనుకూలంగా ఉండవచ్చు. అయితే వాటి నాణ్యత తగ్గి ఉండవచ్చని చెబుతున్నారు. ఉదాహరణకు.. బిస్కెట్లు మెత్తబడవచ్చు, సీరియల్స్ క్రిస్పీనెస్ కోల్పోవచ్చు, కొన్ని ప్యాకెట్ ఫుడ్స్ రుచి తగ్గవచ్చు, టీ, కాఫీ వంటి పదార్థాల సువాసన తగ్గవచ్చు. అందుకే  Best Before అనేది ప్రధానంగా నాణ్యతకు సంబంధించిన అంశం అని చెబుతారు. “Use By” అంటే ఏమిటి? Use By అనేది ఆహారం  భద్రతకు సంబంధించిన గడువు. ఈ తేదీ ముఖ్యంగా త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలకు వర్తిస్తుంది. ఉదాహరణకు: కొన్ని తాజా పాల ఉత్పత్తులు,  తాజా మాంసం, చేపలు, కొన్ని రెడీ-టు-ఈట్ ఆహారాలు, త్వరగా పాడయ్యే ఇతర ఆహారాలు ప్యాకెట్‌పై నిర్ణీత తేదీ ఉంటే.. ఆ తేదీ దాటిన తర్వాత అది బయటికి చూడటానికి లేదా వాసనకు బాగానే ఉన్నప్పటికి తినడం సురక్షితం అని అని అనుకోకూడదు.  అందుకే Use By తేదీ దాటిన ఆహారాన్ని తినకుండా ఉండటం మంచిది. Best Before తేదీ దాటితే ఏం చేయాలి? ఆహారం ఏ రకమైనది, ఎలా నిల్వ చేశారు, ప్యాకెట్ తెరిచారా లేదా అనే విషయాలపై ఇది ఆధారపడి ఉంటుంది. కొన్ని ఆహారాలు ఈ తేదీ దాటిన తర్వాత కూడా తినడానికి అనువుగానే ఉంటాయి. కానీ వాటిలో నాణ్యత మాత్రం తగ్గిపోయి ఉంటుంది. అలాంటి ఆహారం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాసన చూసి ఆహారం సురక్షితమా కాదా తెలుసుకోగలమా? కొన్ని హానికరమైన బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులు ఆహారంలో పెరిగినా, ఆహారంలో  దుర్వాసన, రంగు మార్పు కనిపించకపోవచ్చు కూడా. అందువల్ల ఆహారం వాసన రాలేదనే కారణంతో తినడం సరైనది కాదు. ముఖ్యంగా Use By తేదీ దాటిన ఆహారాన్ని కేవలం వాసన లేదా రుచి చూసి ఏమి కాదని  నిర్ధారించుకోవడం సరైన పద్ధతి కాదు. ప్యాకెట్ తెరిచిన తర్వాత గడువు మారుతుందా? కొన్ని ఆహార పదార్థాలకు ఇది చాలా ముఖ్యమైన విషయం. కొన్ని ఆహారాల మీద best before అని ఉన్నా.. ప్యాకెట్ లు లేదా బాటిల్ మూతలు తెరిచిన తర్వాత వాటిని ఎక్కువ రోజులు వాడటం మంచిది కాదు. వాటిని తొందరగా వాడేయాలి.                                                                                                                                                   *రూపశ్రీ.
ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలి? అనే విషయాలను ఈ వీడియోలో డాక్టర్ ఆర్. బాలాజీ సులభంగా వివరిస్తున్నారు. కాలేయ కణాల్లో అధికంగా కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ (Fatty Liver Disease) అంటారు. చాలా మందిలో దీనివల్ల ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే కొంతమందిలో అలసట, బరువు తగ్గడం లేదా పొత్తికడుపులో అసౌకర్యం వంటి సమస్యలు కనిపించవచ్చు. అధిక బరువు, ఊబకాయం, జీవనశైలి వంటి కారణాలు ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును నియంత్రించుకోవడం ద్వారా ప్రమాద కారకాలను తగ్గించుకోవచ్చు. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. కొంతమందిలో ఈ సమస్య కాలేయంలో తీవ్రమైన మార్పులకు దారితీసే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్‌కు కారణాలు ఏమిటి? దాని లక్షణాలు ఏంటి? ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి పూర్తి వివరాలను డాక్టర్ ఆర్. బాలాజీ ఈ వీడియోలో వివరించారు. వీడియోను పూర్తిగా చూడండి.. ఫ్యాటీ లివర్ గురించి ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా లక్షణాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)