TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అనాస పువ్వు టీ తాగితే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..!

Published on: Wed Nov 11, 2026 7:34AM

ప్రతిరోజూ ఉదయం గొంతుకు హాయిగా ఉండేలా వేడి వేడిగా టీ తాగి రోజును ప్రారంభించడం చాలా మందికి అలవాటు. అయితే ఆ రొటీన్ టీకి బదులుగా అప్పుడప్పుడు కొన్ని సుగంధ ద్రవ్యాలు , మూలికలను జోడించి తయారు చేసుకునే పానీయాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని హెర్బల్ టీలు అని అంటారు.  
మన వంటింట్లో సులభంగా లభించే మసాలా దినుసులతోనే ఈ టీల  ను తయారు చేసుకుని తాగవచ్చు. అలా వంటిట్లో ఉండే మసాలా దినుసుల్లో అనాస పువ్వు కూడా ఒకటి. ఈ  అనాస పువ్వుతో తయారు చేసే టీ ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ చిన్న పువ్వు కేవలం వంటకాలకు రుచిని ఇవ్వడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకు సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే..

అనాస పువ్వు టీ..

ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వైరల్ ఫీవర్స్ , ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం.  జ్వరం లేదా  ఏదైనా వైరస్  లేదా శ్వాసకోశ సమస్యలు తలెత్తినప్పుడు  ప్రకృతి మనకు ప్రసాదించిన అనాస పువ్వును ఉపయోగించి సులభంగా హెర్బల్ టీ తయారు చేసుకోవచ్చు. అనాస పువ్వును చిన్న ముక్కలుగా చేసి, నీటిలో మరిగించి టీలా తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి మంచి ఉపశమనం లభిస్తుంది.

ప్రయోజనాలు..

వైరల్ ఫీవర్..  శ్వాసకోశ సమస్యలు..

వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, వైరస్ జ్వరాలు సర్వసాధారణం. అనాస పువ్వులో యాంటీ వైరల్ , యాంటీ మైక్రోబయల్  గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించే హానికారక వైరస్‌లతో పోరాడటానికి సహాయపడతాయి. శ్వాసనాళాల్లో చేరిన శ్లేష్మాన్ని కరిగించి, గొంతు నొప్పి , ఊపిరితిత్తుల ఇబ్బంది నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి.

జీర్ణక్రియ ..

తిన్న ఆహారం సరిగా అరగకపోవడం, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ టీ చాలా బాగా పనిచేస్తుంది. అనాస పువ్వులోని పోషకాలు జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచి, జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తాయి. భోజనం తర్వాత లేదా ఉదయం పూట ఈ టీ తాగడం వల్ల పొట్ట తేలికగా ఉంటుంది.

ఇది కూడా చదవండి   షుగర్ పేషెంట్లు తప్పక తెలుసుకోవాలి ! ముఖ్యమైన డాక్టర్  సూచనలు

రోగనిరోధక శక్తి పెంపు..

శరీరంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే చిన్నచిన్న అనారోగ్యాలు కూడా త్వరగా చుట్టుముడతాయి. అనాస పువ్వు టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. రోజూ దీన్ని తీసుకోవడం వల్ల శరీరం శక్తివంతంగా మారుతుంది , ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షణ లభిస్తుంది.

కీళ్ల నొప్పులు,  వాపులు తగ్గించడం..

శరీరంలో ఎక్కడైనా వాపులు లేదా కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు ఈ టీ సహజ నివారణగా పనిచేస్తుంది. దీనిలో ఉండే కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు శరీరంలో మంటను, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. వయసు మళ్లిన వాళ్ళలో లేదా కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారికి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

మానసిక ప్రశాంతత , నిద్రలేమి నివారణ..

రోజంతా పడిన అలసట, ఒత్తిడి కారణంగా రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. అనాస పువ్వు టీలో ఉండే సువాసన , మృదువైన గుణాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. ఇది మనసును రిలాక్స్ చేసి చక్కగా నిద్ర పట్టేలా సహాయపడుతుంది.

చర్మ సౌందర్యం..

శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల మొటిమలు, చర్మ సమస్యలు వస్తుంటాయి. ఈ హెర్బల్ టీ శరీరాన్ని శుభ్రపరిచి, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారడానికి దోహదపడుతుంది.

                                                                                                                                               *రూపశ్రీ.

 

మీకు నచ్చవచ్చు    థైరాయిడ్ PCOS గట్ హెల్త్.. వీటి మధ్య సంబంధం ఏమిటి.!

                                  మహిళలు అస్సలు నిర్లక్ష్యం చేయకూడని అండాశయ క్యాన్సర్ లక్షణాలివే!

 

What Happens to Your Body When You Drink Star Anise Tea,Amazing Benefits Revealed,Star Anise Tea,Amazing Benefits for Your Body