Home

»

Latest News

తన రొమాంటిక్ డేట్ ఎలా ఉండాలో చెప్పేసిన అనశ్వర రాజన్: ముఖ్యంగా ఆ పూలతో....!

Nov 11, 2026 5:48PM


'గిర గిర గింగిరాగిరే' అంటూ తెలుగు ప్రేక్షకుల హార్ట్స్ లో తిష్ట వేసినా భామ అనస్వర రాజన్. ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి  'కాకా'తో తన జెండా బలంగా పాతాలని చూస్తుంది. అంతకంటే ముందు ఈ నెల 13 న 'ఇట్లు అర్జున' తో పలకరించబోతుంది.

ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన రొమాంటిక్ డేట్ ఎలా ఉండాలో చెప్పి అభిమానులకి పెద్ద పనినినే కల్పించింది. రొమాంటిక్ డేట్ వివరాలు చెప్పే స్టడీ సెంటర్  ఏమైనా ఉందా అని కనుక్కునే పరిస్థితి కూడా.  

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనశ్వర 'మాట్లాడుతు 'సినిమా రంగంలోకి అడుగుపెట్టడం వెనుక పెద్దగా ప్లానింగ్ ఏమీ లేదని, స్కూల్ రోజుల్లో మోనో యాక్టింగ్‌, స్కిట్స్‌లో పాల్గొనేదినని అనశ్వర గుర్తుచేసుకుంది. అయితే, ఒక సినిమా ఆడిషన్స్‌ ప్రకటన చూసి తన కుటుంబ స్నేహితులు ప్రోత్సహించగా వెళ్లగా.. దాదాపు 6 వేల మందిలో తనను ఎంపిక చేయడం మొదట్లో నమ్మలేకపోయానని తెలిపింది.

ఇక అబ్బాయిల విషయంలో తన ఇష్టాయిష్టాల గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అబ్బాయిల్లో బాహ్య రూపం కంటే వారి వ్యక్తిత్వం, మాట్లాడే విధానమే తనకి  ముఖ్యమని, ముఖ్యంగా ఎమోషన్స్‌ పరంగా మెచ్యూరిటీతో ఉండి మృదువుగా మాట్లాడే అబ్బాయిలంటేనే తనకు ఇష్టమని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆల్ఫా రకం అబ్బాయిలు అంటే తనకు అస్సలు నచ్చరని తేల్చిచెప్పింది.

ఇది కూడా చదవండి: ప్యారడైజ్ పై బాబుమోహన్ సంచలన వ్యాఖ్యలు: దరిద్రం వెంటపడితే అంతే! 

తనకు ప్రకృతి అందాలు అంటే ఎంతో ఇష్టమని చెబుతూ, తన కలల రొమాంటిక్‌ డేట్ ఎలా ఉండాలో పూల ద్వారా వర్ణించింది. తనతో డేట్‌కు వచ్చే అబ్బాయి తన కోసం ప్రత్యేకంగా సన్‌ ఫ్లవర్స్‌, వైట్ పియానీస్‌ పూలు తీసుకురావాలని ముద్దుగా కోరుకుంది.

 

ఇద్దరం కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చాలా సేపు మనసు విప్పి మాట్లాడుకోవడం తన డ్రీమ్ అని వివరించింది. మరి ఇంత వివరంగా ఈ కేరళ కుట్టి చెప్పిన తర్వాత అభిమానుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. 

 

మీకు నచ్చవచ్చు :అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మూవీకి క్రేజీ టైటిల్!
మీకు నచ్చవచ్చు: చిరు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

 

[Anaswara Rajan, Itllu Arjuna, Chiranjeevi, kaaka,Telugu Cinema]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com