Home

»

Latest News

200 కోట్ల క్లబ్‌లో సీన్: సూర్య అరుదైన రికార్డ్.!

Nov 11, 2026 6:13PM

కోలీవుడ్ స్టార్ సూర్యకు 2026 బాగా కలిసొచ్చినట్టుంది. ఈ ఏడాది వరుసగా మూడు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు. ఇప్పటికే ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలతో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సూర్య.. ఇప్పుడు ‘సీన్’తోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేశారు. దీంతో ఒకే ఏడాదిలో మూడు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన సినిమాలు ఉన్న హీరోగా అరుదైన ఘనత అందుకున్నారు.

200 కోట్ల క్లబ్‌లో సీన్ చేరిన విషయాన్ని తాజాగా సూర్య నిర్మాణ సంస్థ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. జితు మాధవన్ దర్శకత్వంలో సూర్య నటించిన ‘సీన్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.205 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు వెల్లడించింది. దీంతో ఈ ఏడాది సూర్య ఖాతాలో మూడు 200 కోట్ల గ్రాసర్లు చేరాయి.

ఇక ఈ ఏడాది సూర్య నటించిన సినిమాల విషయానికి వస్తే.. మే నెలలో వచ్చిన ‘కరుప్పు’ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

 

ఆ తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఇది కూడా చదవండి: ‘జైలర్ 2’ ఓటీటీ వెర్షన్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.!

ఇక తాజాగా దీపావళి కానుకగా విడుదలైన ‘సీన్’ మరోసారి సూర్యకు మంచి విజయాన్ని అందించింది. ‘ఆవేశం’ ఫేమ్ జితు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నజ్రియా నజీమ్, నస్లెన్ కీలక పాత్రల్లో నటించారు. ఇందులో సూర్య డీఎస్పీ ఇన్బరాజ్ పాత్రలో కనిపించారు. భిన్నమైన కథాంశం, సూర్య కొత్త తరహా పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

గత కొంతకాలంగా సూర్యకు సరైన కమర్షియల్ హిట్ పడటం లేదనే విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చిన ‘కంగువా’, ఆ తర్వాత ‘రెట్రో’ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆయన బాక్సాఫీస్ స్టామినాపై చర్చ జరిగింది. కానీ 2026లో మాత్రం వరుసగా మూడు విజయాలతో ఆ విమర్శలకు సమాధానం చెప్పినట్టయింది.

మీకు నచ్చవచ్చు:
‘గాడ్ ఆఫ్ వార్’కి బ్రేక్.. చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా.!
చేతులు మారిన జటాయు ప్రాజెక్ట్.. రోషన్ హీరోగా పాన్ ఇండియా మూవీ లాంచ్.!

 

 

 

[Suriya 200 Crore Movies, Scene Movie, Box Office, Vishwanath And Sons, Karuppu]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com