LATEST NEWS
తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరువుల పరిరక్షణ, మూసీ నది పునరుజ్జీవనం, హైదరాబాద్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.కొంతమందికి నష్టం జరిగినా.. భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో తమ్మిడికుంటను అభివృద్ధి చేశామని సీఎం తెలిపారు.  ఒకప్పుడు 14 ఎకరాలకు కుంచించుకుపోయిన చెరువును 30 ఎకరాలకు విస్తరించామన్నారు. ఈ అభివృద్ధి కోసం అక్కినేని నాగార్జున మంచి మనసుతో ముందుకొచ్చి రెండు ఎకరాల భూమిని ప్రభుత్వానికి అందించారని ప్రశంసించారు. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ నాగార్జున హీరోగా నిలిచారని కొనియాడారు. హైదరాబాద్ అంటేనే రాక్స్ అండ్ లేక్స్ సిటీ అని సీఎం గుర్తుచేశారు. ఒకప్పుడు నగరంలో 1,372 చెరువులు ఉండేవని, వివిధ కారణాలతో వాటిలో 50 శాతం మాయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల ఆక్రమణల కారణంగా వర్షాలు పడితే రోడ్లపై నీళ్లు నిలుస్తున్నాయని, కాలనీలు జలమయమవుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో మూసీ వరదల నుంచి హైదరాబాద్‌ను రక్షించేందుకు నిజాం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను నిర్మించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. వికారాబాద్ ప్రాంతంలో ప్రారంభమయ్యే ముచుకుందా నది, మూసా, ఈసా నదులు కలిసే ప్రాంతంలో మూసీగా మారుతుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక నాగరికతలు నదుల ఆధారంగానే అభివృద్ధి చెందాయని, వందేళ్ల క్రితమే నిజాం మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపట్టారని తెలిపారు. అయితే ప్రస్తుతం మూసీ తీవ్ర కాలుష్యానికి గురైందని, దాని ప్రభావంతో నల్లగొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నల్లగొండ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని మార్చేందుకే మూసీ పునరుజ్జీవన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. ప్రకృతిని పరిరక్షించడమే తన లక్ష్యమని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చెప్పారు. అందులో భాగంగానే చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నామని తెలిపారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని, ఈ ప్రక్రియలో ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. ఇది కూడా చదవండి: సోనియా గాంధీతో వైఎస్ షర్మిల భేటీ..ఆసక్తికరంగా మారిన పుస్తకం బహూకరణ.! త్వరలోనే మూసీ పునరుజ్జీవనం తొలి దశ పనులు ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. నగర ప్రజల జీవితాలు మూసీ నదితో ముడిపడి ఉన్నాయని, నదుల పేర్లను ఆడబిడ్డలకు పెట్టుకునే సంస్కృతి మనదని గుర్తుచేశారు. మూసీ సుందరీకరణ మాత్రమే తమ లక్ష్యం కాదని, నదికి పునరుజ్జీవం కల్పించడమే అసలు ఉద్దేశమని స్పష్టం చేశారు. మూసీని ప్రక్షాళన చేయడంతో పాటు చెరువులను ఆక్రమణల చెర నుంచి విడిపించాల్సిందేనని అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, అభివృద్ధి విషయంలో అందరూ కలిసిరావాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నిన్నటి వరకు శిల్పారామం గురించి మాట్లాడుకున్నారని, ఇకపై తమ్మిడికుంట గురించి మాట్లాడుకుంటారని అన్నారు. ఇక నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫ్రమ్ తమ్మిడికుంట అనేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చమత్కరించారు. చెరువు పరిసరాల్లో భద్రత కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. తమ్మిడికుంట పరిసరాల్లో లేక్ ఎకానమీని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. చెరువు ఆవరణలో జమ్మి చెట్టును నాటాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు సూచించారు. అలా చేస్తే దసరా వేడుకలకు చెరువులు వేదికలుగా మారుతాయని, మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు అవి దోహదపడతాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.   మీకు నచ్చవచ్చు: అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్‌మెంట్..కాబోయే భార్య ఎవరో తెలుసా.? [ Thammidikunta Lake, CM Revanth Reddy Musi River Rejuvenation, HYDRA, Akkineni Nagarjuna ]
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంటు సభ్యురాలు సోనియా గాంధీ రాసిన సంచలన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) పుస్తకం ఆధారంగా తెలుగులో అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కిస్తానని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డిలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.  సోనియా గాంధీ జీవిత చరిత్రను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించనున్నట్లు స్పష్టం చేస్తూ, పార్టీ నాయకులు కార్యకర్తలు ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులను సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇందిరా గాంధీ కోడలిగా, రాజీవ్ గాంధీ అర్ధాంగిగా,  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు తల్లిగా ఆమె పడిన కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లు, దేశం కోసం ఆ కుటుంబం అందించిన త్యాగాలను ఈ సినిమా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపిస్తామని జగ్గారెడ్డి తెలిపారు.  ఇది కూడా చదవండి: ఏపీ పెట్టుబడులకు యూఏఈ ఆసక్తి..12 సంస్థలతో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్.! కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ ఎంతటి లోతైనదో వివరిస్తూ, సముద్రం ఎంత లోతుగా ఉంటుందో కాంగ్రెస్ రాజకీయ వ్యవస్థ కూడా అంతటి విశాలమైనదని ఆయన అభివర్ణించారు. సోనియా గాంధీ రాజకీయ జీవితం అత్యంత విజయవంతమైనదని, ఆమెకు ప్రధానమంత్రి పదవిపై ఎలాంటి వ్యామోహం లేదని కొనియాడారు.  భర్త రాజీవ్ గాంధీ అకాల మరణం తర్వాత ప్రధాని అయ్యే అవకాశం పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ, ఆ పదవిని వ్యక్తిగతంగా ఆశించకుండా పి.వి. నరసింహారావును దేశ ప్రధాని పదవికి ఎంపిక చేసిన చారిత్రక రాజనీతిజ్ఞత సోనియా గాంధీ సొంతమని గుర్తుచేశారు. అలాగే, యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ ఆమెనే ప్రధాని కావాలని కోరినప్పటికీ, ఆ పదవిని సునాయాసంగా త్యాగం చేసి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ప్రధానమంత్రిగా కూర్చోబెట్టిన మహోజ్వల ఘట్టం ఓ చరిత్ర అని ఆయన కొనియాడారు.  రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలనేదే సోనియా గాంధీ ప్రధాన కోరిక అని జగ్గారెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక చిత్రానికి సంబంధించి త్వరలోనే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి సినిమా నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.  విశేషం ఏమిటంటే, ఈ సినిమాకి కమర్షియల్ నిర్మాతల ప్రమేయం లేకుండా సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే పూర్తిస్థాయి నిర్మాతలుగా వ్యవహరిస్తారని జగ్గారెడ్డి ప్రకటించారు. దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన సోనియా గాంధీ జీవితంలోని అరుదైన కోణాలను, త్యాగపూరిత ప్రయాణాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ఈ సినిమాపై రాజకీయ వర్గాల్లోనూ, సినీ సర్కిళ్లలోనూ ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. మీకు నచ్చవచ్చు: సోనియా గాంధీతో వైఎస్ షర్మిల భేటీ..ఆసక్తికరంగా మారిన పుస్తకం బహూకరణ.!     [ Sonia Gandhi autobiography, Jagga Reddy film, Sonia Gandhi biopic, Belonging A Journey of Love, Congress party ]  
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో షర్మిల తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కుమార్తె అంజలి వివాహానికి హాజరుకావాలని కోరుతూ సోనియా గాంధీకి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. షర్మిల దంపతులను ఆప్యాయంగా పలకరించిన సోనియా గాంధీ.. ఈ సందర్భంగా తాను ఇటీవల రచించిన 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) పుస్తకాన్ని వారికి బహూకరించారు. అంతేకాదు, పుస్తకంపై స్వయంగా ఆటోగ్రాఫ్ చేసి అందించడం విశేషం. ఇది కూడా చదవండి: విదేశీ మహిళ దేశాధినేత ఎలా అయ్యారు.. సోనియాపై కంగనా సంచలన వ్యాఖ్యలు.! సోనియా గాంధీ జీవిత ప్రయాణం, వ్యక్తిగత అనుభవాలు, కుటుంబ బంధాలు, భారత రాజకీయాల్లో ఆమె ఎదుర్కొన్న సవాళ్లను ఈ పుస్తకం ఆవిష్కరిస్తోంది. ముఖ్యంగా గాంధీ కుటుంబంలోని అనుబంధాలు, విభేదాలకు సంబంధించిన ఆసక్తికర అంశాలు ఇందులో ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా మేనకా గాంధీతో తనకు ఉన్న సంబంధాలు, కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాల గురించి సోనియా వెల్లడించిన విషయాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకంపై ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు, సోనియా గాంధీతో షర్మిల భేటీ రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. కుమార్తె వివాహ ఆహ్వానం కోసం జరిగిన ఈ సమావేశంలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయా? అన్న ఆసక్తి నెలకొంది. అయితే, ఈ భేటీలో రాజకీయ చర్చలు జరిగినట్లు అధికారిక సమాచారం లేదు. మొత్తానికి, ఒకవైపు కుమార్తె వివాహ ఆహ్వానం.. మరోవైపు సోనియా గాంధీ స్వయంగా ఆటోగ్రాఫ్ చేసి అందించిన పుస్తకం.. ఈ భేటీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మీకు నచ్చవచ్చు: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు తీవ్ర అస్వస్థత.. ఎయిమ్స్‌లో అత్యవసర చికిత్స.!     [ Sonia Gandhi, YS Sharmila, Anil Kumar, Anjali Wedding, Belonging A Journey of Love, Maneka Gandhi ]
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం ఎప్పటిలాగే మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఆయన.. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై కుప్పకూలిపోయారు. కొద్దిసేపు స్పృహ కోల్పోయి పడిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ధన్‌ఖడ్‌ను తక్షణమే పోలీసు కంట్రోల్ రూమ్ (PCR) వాహనంలో ఆయన నివాసానికి తరలించారు. సమాచారం అందుకున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ILBS) వైద్య బృందంతో పాటు ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ సందీప్ సేథ్ అక్కడికి చేరుకుని ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 75 ఏళ్ల జగదీప్ ధన్‌ఖడ్‌ను ఎయిమ్స్‌లోని కార్డియో-న్యూరో సెంటర్‌లో చేర్చి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కార్డియాలజీ విభాగానికి చెందిన సీనియర్ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స అందిస్తున్నారు. కాగా, ధన్‌ఖడ్‌కు గతంలోనూ పలు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. 2025 మార్చిలో ఛాతిలో నొప్పి రావడంతో ఎయిమ్స్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో చేరారు. ఆ సమయంలో ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స నిర్వహించారు. అదే ఏడాది జూన్‌లో నైనిటాల్ పర్యటన సందర్భంగా, ఈ ఏడాది జనవరిలో ఇంట్లో ఉన్న సమయంలోనూ ఆయన స్పృహ కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. ఇది కూడా చదవండి: 9వ తరగతిలో మంచి మార్కులు.. కొడుక్కి రూ.2 కోట్ల బీఎండబ్ల్యూ గిఫ్ట్..! 2022 ఆగస్టులో భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన జగదీప్ ధన్‌ఖడ్.. వ్యక్తిగత కారణాలతో 2025 జూలై 21న తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో రాజకీయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు మీకు నచ్చవచ్చు:  ఓ రైడ్‌ కొడదాం గురూ.. నగరాల్లో బైక్ ట్యాక్సీల జోరు.. యువతకు చేతినిండా పని.!      [ Jagdeep Dhankhar, former vice president, AIIMS Delhi, health update, morning walk collapse, cardiology department ]
ప్రస్తుత ఆధునిక కాలంలో ఉపాధి అవకాశాల రూపురేఖలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న యువతకు, చదువుకుంటూనే సంపాదించాలనుకునే విద్యార్థులకు కొత్త దారులు తెరుచుకుంటున్నాయి. ఇందులో బైక్ ట్యాక్సీ సేవలు ఒక ప్రధాన ఉపాధి మార్గంగా ఎదుగుతున్నాయి. నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న రద్దీని అధిగమించడానికి, వేగంగా గమ్యస్థానాలకు చేరడానికి ప్రజలు బైక్ ట్యాక్సీలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఈ డిమాండ్‌కు తగినట్టుగా ఎంతోమంది యువకులు ఈ రంగంలో ఉపాధిని వెతుక్కుంటున్నారు. సొంతంగా ద్విచక్ర వాహనం ఉంటే చాలు, ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేకుండా స్వతంత్రంగా సంపాదించుకునే వెసులుబాటు లభిస్తోంది. మరోవైపు, ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న సిబ్బంది కూడా తమ ఖాళీ సమయాల్లో లేదా ఆఫీసుకు వెళ్లే దారిలో బైక్ ట్యాక్సీ సేవలను అందిస్తూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇది కేవలం పాకెట్ మనీ కోసమే కాకుండా, కుటుంబ ఆర్థిక భద్రతకు కూడా ఎంతో కొంత సహకరిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెద్దగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేకపోవడం, ఎటువంటి సంక్లిష్టమైన ప్రవేశ అర్హతలు అక్కర్లేకపోవడం ఈ రంగం యొక్క ప్రధాన ప్లస్ పాయింట్లు. డిజిటల్ యాప్‌ల ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే ప్రయాణికులతో అనుసంధానం కావడం రైడర్లకు ఎంతో సౌకర్యంగా మారుతోంది. అయితే, ఈ రంగంలో వృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా లేకపోలేదు. పెరుగుతున్న ఇంధన ధరలు, నగరాల్లో ట్రాఫిక్ నిబంధనలు, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలపై రైడర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం మరియు సంబంధిత అగ్రిగేటర్ సంస్థలు సమన్వయంతో పనిచేస్తే, డ్రైవర్ల సంక్షేమానికి మరింత భరోసా దొరుకుతుంది. మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో సాంకేతికతను జోడించి ఉపాధి పొందడంలో ఈ బైక్ ట్యాక్సీ మోడల్ ఒక విజయవంతమైన ఉదాహరణగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో అర్బన్ రవాణా రంగానికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, యువతకు ఇదొక స్థిరమైన ఉపాధి వేదికగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.   ఇది కూడా చదవండి: తెలంగాణ విద్యావిధానంలో సమూల మార్పులు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం.!   [ Bike taxi employment, youth financial security, techies and the unemployed, urban mobility, part-time jobs, Telugu News, Telugu One ]
ALSO ON TELUGUONE N E W S
Popular music composer Anirudh Ravichander and Sunrisers Hyderabad owner Kavya Maran have tied the knot in an intimate destination wedding in Greece. The wedding marks the beginning of a new chapter for the couple, whose relationship has been the subject of considerable speculation for months. Anirudh, known for chartbusters across Tamil and Telugu cinema, and Kavya, daughter of Sun Group chairman Kalanithi Maran, reportedly celebrated their wedding in the presence of close family members and select guests. The first pictures from the ceremony show the couple in coordinated ivory traditional outfits.  Superstar Rajinikanth, Anirudh's parents, Kalanidhi Maran's family, Dayanidhi family, MK Stalin and his family with Udayanidhi Stalin attended this private ceremony. The wedding follows a traditional Tamil engagement ceremony, reportedly held in Greece on November 10. The celebrations have been kept intimate, with the Maran family overseeing the arrangements.  Kavya Maran is widely recognised as the face of Sunrisers Hyderabad during IPL seasons and serves as an executive director at Sun TV Network. Anirudh, meanwhile, has emerged as one of India's busiest composers, delivering hits for major films across multiple industries. Also Read: Did Anirudh walk out of Simbu's Arasan?  Several prominent personalities from cinema and politics have reportedly travelled to Greece for the celebrations. The couple are also hosting a grand wedding reception in Chennai on November 21.  The wedding brings together two prominent names from the worlds of Indian entertainment, business and cricket, making it one of the most talked-about celebrity weddings of the year. Check Out:  Priya Bhavani Shankar marries her beau Rajvel Raj                       Mani Ratnam's Inji Vellam locks January release   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
కోలీవుడ్ స్టార్ సూర్యకు 2026 బాగా కలిసొచ్చినట్టుంది. ఈ ఏడాది వరుసగా మూడు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు. ఇప్పటికే ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలతో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సూర్య.. ఇప్పుడు ‘సీన్’తోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేశారు. దీంతో ఒకే ఏడాదిలో మూడు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన సినిమాలు ఉన్న హీరోగా అరుదైన ఘనత అందుకున్నారు. 200 కోట్ల క్లబ్‌లో సీన్ చేరిన విషయాన్ని తాజాగా సూర్య నిర్మాణ సంస్థ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. జితు మాధవన్ దర్శకత్వంలో సూర్య నటించిన ‘సీన్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.205 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు వెల్లడించింది. దీంతో ఈ ఏడాది సూర్య ఖాతాలో మూడు 200 కోట్ల గ్రాసర్లు చేరాయి. ఇక ఈ ఏడాది సూర్య నటించిన సినిమాల విషయానికి వస్తే.. మే నెలలో వచ్చిన ‘కరుప్పు’ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.   ఆ తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇది కూడా చదవండి: ‘జైలర్ 2’ ఓటీటీ వెర్షన్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.! ఇక తాజాగా దీపావళి కానుకగా విడుదలైన ‘సీన్’ మరోసారి సూర్యకు మంచి విజయాన్ని అందించింది. ‘ఆవేశం’ ఫేమ్ జితు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నజ్రియా నజీమ్, నస్లెన్ కీలక పాత్రల్లో నటించారు. ఇందులో సూర్య డీఎస్పీ ఇన్బరాజ్ పాత్రలో కనిపించారు. భిన్నమైన కథాంశం, సూర్య కొత్త తరహా పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గత కొంతకాలంగా సూర్యకు సరైన కమర్షియల్ హిట్ పడటం లేదనే విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చిన ‘కంగువా’, ఆ తర్వాత ‘రెట్రో’ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆయన బాక్సాఫీస్ స్టామినాపై చర్చ జరిగింది. కానీ 2026లో మాత్రం వరుసగా మూడు విజయాలతో ఆ విమర్శలకు సమాధానం చెప్పినట్టయింది. మీకు నచ్చవచ్చు: ‘గాడ్ ఆఫ్ వార్’కి బ్రేక్.. చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా.! చేతులు మారిన జటాయు ప్రాజెక్ట్.. రోషన్ హీరోగా పాన్ ఇండియా మూవీ లాంచ్.!       [Suriya 200 Crore Movies, Scene Movie, Box Office, Vishwanath And Sons, Karuppu]  
'గిర గిర గింగిరాగిరే' అంటూ తెలుగు ప్రేక్షకుల హార్ట్స్ లో తిష్ట వేసినా భామ అనస్వర రాజన్. ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి  'కాకా'తో తన జెండా బలంగా పాతాలని చూస్తుంది. అంతకంటే ముందు ఈ నెల 13 న 'ఇట్లు అర్జున' తో పలకరించబోతుంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన రొమాంటిక్ డేట్ ఎలా ఉండాలో చెప్పి అభిమానులకి పెద్ద పనినినే కల్పించింది. రొమాంటిక్ డేట్ వివరాలు చెప్పే స్టడీ సెంటర్  ఏమైనా ఉందా అని కనుక్కునే పరిస్థితి కూడా.   రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనశ్వర 'మాట్లాడుతు 'సినిమా రంగంలోకి అడుగుపెట్టడం వెనుక పెద్దగా ప్లానింగ్ ఏమీ లేదని, స్కూల్ రోజుల్లో మోనో యాక్టింగ్‌, స్కిట్స్‌లో పాల్గొనేదినని అనశ్వర గుర్తుచేసుకుంది. అయితే, ఒక సినిమా ఆడిషన్స్‌ ప్రకటన చూసి తన కుటుంబ స్నేహితులు ప్రోత్సహించగా వెళ్లగా.. దాదాపు 6 వేల మందిలో తనను ఎంపిక చేయడం మొదట్లో నమ్మలేకపోయానని తెలిపింది. ఇక అబ్బాయిల విషయంలో తన ఇష్టాయిష్టాల గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అబ్బాయిల్లో బాహ్య రూపం కంటే వారి వ్యక్తిత్వం, మాట్లాడే విధానమే తనకి  ముఖ్యమని, ముఖ్యంగా ఎమోషన్స్‌ పరంగా మెచ్యూరిటీతో ఉండి మృదువుగా మాట్లాడే అబ్బాయిలంటేనే తనకు ఇష్టమని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆల్ఫా రకం అబ్బాయిలు అంటే తనకు అస్సలు నచ్చరని తేల్చిచెప్పింది. ఇది కూడా చదవండి: ప్యారడైజ్ పై బాబుమోహన్ సంచలన వ్యాఖ్యలు: దరిద్రం వెంటపడితే అంతే!  తనకు ప్రకృతి అందాలు అంటే ఎంతో ఇష్టమని చెబుతూ, తన కలల రొమాంటిక్‌ డేట్ ఎలా ఉండాలో పూల ద్వారా వర్ణించింది. తనతో డేట్‌కు వచ్చే అబ్బాయి తన కోసం ప్రత్యేకంగా సన్‌ ఫ్లవర్స్‌, వైట్ పియానీస్‌ పూలు తీసుకురావాలని ముద్దుగా కోరుకుంది.   ఇద్దరం కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చాలా సేపు మనసు విప్పి మాట్లాడుకోవడం తన డ్రీమ్ అని వివరించింది. మరి ఇంత వివరంగా ఈ కేరళ కుట్టి చెప్పిన తర్వాత అభిమానుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.    మీకు నచ్చవచ్చు :అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మూవీకి క్రేజీ టైటిల్! మీకు నచ్చవచ్చు: చిరు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!   [Anaswara Rajan, Itllu Arjuna, Chiranjeevi, kaaka,Telugu Cinema]  
కొన్ని సినిమాలు చూస్తే నవ్వొస్తుంది. మరికొన్ని సినిమాలు చూస్తే ఉత్కంఠ కలుగుతుంది. ఇంకొన్ని మాత్రం మన జీవితంలో మర్చిపోయిన మనుషులను, బంధాలను గుర్తుచేస్తూ మనసును కదిలిస్తాయి. అలాంటి ఓ అరుదైన చిత్రమే ‘పైర్’ (Pyre).  65 ఏళ్లుగా కలిసి జీవిస్తున్న ఓ వృద్ధ దంపతులు.. 28 ఏళ్లుగా తిరిగిరాని కొడుకు.. చుట్టూ మనుషులే లేని ఓ కొండ గ్రామం.. చివరికి తమ మరణం తర్వాత అంత్యక్రియలు చేసేవాళ్లు కూడా ఉండరేమోనన్న భయం. వినడానికి చిన్న కథలా అనిపించినా, ఇందులో దాగున్న భావోద్వేగం మాత్రం గుండెను బరువెక్కిస్తుంది. ఉత్తరాఖండ్‌లోని కుమావోన్ ప్రాంతంలోని ఓ మారుమూల గ్రామం ఈ సినిమా నేపథ్యం. పదం సింగ్, తుల్సీ అనే వృద్ధ దంపతులు అక్కడ నివసిస్తుంటారు. దాదాపు 65 ఏళ్లుగా కలిసి జీవిస్తున్న ఈ జంటకు ఒక కొడుకు. ఉపాధి కోసం ముంబై వెళ్లిన అతడు 28 ఏళ్లుగా తిరిగి రాలేదు. అయినా ఎప్పటికైనా కొడుకు వస్తాడనే ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురుచూస్తూనే ఉంటారు. ఓ రోజు కొడుకు నుంచి ఉత్తరం వస్తుంది. తాను ఊరికి వస్తున్నానని అందులో సమాచారం ఉంటుంది. దీంతో ఆ వృద్ధ దంపతుల ఆనందానికి అవధులుండవు. కానీ మరోవైపు ఆ గ్రామం మాత్రం రోజురోజుకూ ఖాళీ అవుతోంది. ఉపాధి కోసం ఒక్కొక్కరుగా ఊరు విడిచి వెళ్లిపోతున్నారు. ఒకప్పుడు సందడిగా ఉన్న గ్రామం ఇప్పుడు నిశ్శబ్దంగా మారుతోంది. ఇది కూడా చదవండి: ‘మాతృభూమి’ ట్రైలర్.. తెలంగాణ రియల్ హీరో బయోపిక్‌లో సల్మాన్ ఖాన్.! ఈ క్రమంలో ఆ గ్రామం నుంచి వెళ్లిపోతున్న ఓ కుటుంబం ఆ వృద్ధుడితో చెప్పే మాటలు ఎంతో కలచివేస్తాయి. మీరు కూడా త్వరగా ఈ ఊరు విడిచి వెళ్లిపోండి.. లేదంటే మేము వెళ్లిపోయేలోపే చనిపోండి.. మీరు చనిపోతే అంత్యక్రియలు చేయడానికి కూడా ఇక్కడ నలుగురు మనుషులు ఉండరనే అర్థంలో వారు మాట్లాడతారు. ఆ మాటల్లోని కఠినత్వం వెనుక గ్రామాలు ఎదుర్కొంటున్న వలసల సమస్య ఎంత తీవ్రంగా ఉందో చూపించారు దర్శకుడు. ఈ సినిమాలోని అత్యంత భావోద్వేగమైన అంశాల్లో ఒకటి పదం సింగ్ తన ఇంటి బయటే రెండు చితిమంటల కోసం ఏర్పాట్లు చేసుకోవడం. గ్రామంలో సాయం చేసేవాళ్లు ఎవరూ మిగలరని భావించి, ఒకటి తన భార్య కోసం.. మరొకటి తన కోసం సిద్ధం చేసుకుంటాడు. అది చూసిన తుల్సీ ప్రశ్నించగా, తాను ముందుగా చనిపోతే ఆమెను కొండ కిందకు ఎవరు తీసుకెళ్తారని ఆలోచిస్తున్నానని చెబుతాడు. 65 ఏళ్ల దాంపత్యం తర్వాత కూడా తనకంటే భార్య గురించే ఎక్కువగా ఆలోచించే భర్త. ప్రేమ అంటే ఖరీదైన బహుమతులు, విహారయాత్రలు మాత్రమే కాదని.. ఒకరికొకరు తోడుగా ఉండటం, కష్టాల్లో చేయి అందించడం, చివరి క్షణం వరకు ఒకరి గురించి మరొకరు ఆలోచించడమేనని ఈ కథ గుర్తుచేస్తుంది. దర్శకుడు వినోద్ కప్రికి ఈ సినిమా ఆలోచన 2018లో వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని మున్సియారి ప్రాంతంలో ఓ వృద్ధ దంపతుల గురించి తెలుసుకున్న ఆయన, వారి జీవితంలోని ఒంటరితనం, ఒకరిపై మరొకరికి ఉన్న ఆధారాన్ని కథగా మలచాలనుకున్నారు. మొదట నిజ జీవితంలోని ఆ దంపతులతోనే సినిమా చేయాలని భావించినా అది సాధ్యం కాలేదు. చివరికి పదం సింగ్ కప్రి, హీరా దేవిలను ప్రధాన పాత్రల కోసం ఎంపిక చేశారు. వీరిద్దరూ అంతకుముందు కెమెరా ముందు నటించిన అనుభవం లేని సాధారణ గ్రామీణులు. అయినప్పటికీ తెరపై వారి సహజమైన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. పదం సింగ్ కప్రి దర్శకుడు వినోద్ కప్రికి చిన్నాన్న కావడం మరో విశేషం. ‘పైర్’ 2024లో టాలిన్ బ్లాక్ నైట్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్ జరుపుకుంది. అక్కడ బెస్ట్ ఫిల్మ్ ఆడియన్స్ అవార్డును అందుకుంది. ఆ తర్వాత పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. భారతదేశంలో అక్టోబర్ 30, 2026న థియేటర్లలో విడుదలైంది. తక్కువ థియేటర్లలో విడుదలైనప్పటికీ ఈ సినిమా రెండు కోట్లు రాబట్టడం విశేషం.  'రామాయణ' రాకపోయి ఉంటే.. లాంగ్ రన్ లో వండర్స్ క్రియేట్ చేసి ఉండేదేమో. ఇక తాజాగా ఈ సినిమాను 99వ అకాడమీ అవార్డుల కోసం జనరల్ ఎంట్రీ కేటగిరీల్లో సమర్పించేందుకు దర్శకుడు వినోద్ కప్రి నిర్ణయించుకున్నారు. స్వతంత్రంగా రూపొందించిన ఈ చిన్న సినిమా అంతర్జాతీయంగా ఇంతటి గుర్తింపు పొందడం విశేషం. ‘పైర్’ కథ ఉత్తరాఖండ్‌లోని ఓ మారుమూల గ్రామంలో సాగినా, అందులో చూపించిన సమస్య మనకు కూడా కొత్తేమీ కాదు. ఉద్యోగాలు, మెరుగైన జీవితం కోసం పిల్లలు నగరాలకు, విదేశాలకు వెళ్లడం సహజమే. కానీ వారి కోసం ఎదురుచూస్తూ పల్లెల్లో ఒంటరిగా మిగిలిపోయే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? డబ్బులు పంపించవచ్చు, ఫోన్లో మాట్లాడవచ్చు. కానీ అనారోగ్యంగా ఉన్నప్పుడు పక్కన కూర్చునే మనిషిని, నాలుగు మాటలు మాట్లాడే ఆత్మీయతను డబ్బుతో కొనలేం కదా. అందుకే ‘పైర్’ కేవలం ఓ వృద్ధ దంపతుల ప్రేమకథ మాత్రమే కాదు. మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేసే సినిమా కూడా.  మీకు నచ్చవచ్చు: 30 ఏళ్ల ‘భామనే సత్యభామనే’.. కమల్ హాసన్ మేకప్ వెనుక అసలు కథ తెలుసా.? ‘గాడ్ ఆఫ్ వార్’కి బ్రేక్.. చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా.!       [Pyre Movie, Emotional Story, Vinod Kapri, Padam Singh Kapri, Heera Devi]  
Mani Ratnam's much-awaited romantic drama Inji Vellam, starring Vijay Sethupathi and Sai Pallavi, is gearing up for a theatrical release on January 29, 2027. The film has generated considerable curiosity ever since its title and first-look poster were unveiled, featuring the lead pair in a rain-soaked romantic moment. The film marks another collaboration between Mani Ratnam and Vijay Sethupathi after Chekka Chivantha Vaanam. Sai Pallavi joins the filmmaker for the first time, and the pairing has become one of the major attractions. Although the makers have kept the storyline under wraps, the promotional material hints at a romantic drama set against the backdrop of Kolkata.  Inji Vellam is jointly produced by Mani Ratnam and Siva Ananth under Madras Talkies, along with Subaskaran's Lyca Productions. The film also has India Talkies associated with its production.  Also Read: Did Anirudh walk out of Simbu's Arasan?  A.R. Rahman is composing the music, continuing his celebrated association with Mani Ratnam. The technical crew includes cinematographer Avik Mukhopadhyay, editor Sreekar Prasad, production designer Sharmishta Roy, costume designer Eka Lakhani, choreographer Brinda Gopal and action choreographer Dhilip Subbarayan.  With Mani Ratnam, A.R. Rahman, Vijay Sethupathi and Sai Pallavi coming together, Inji Vellam carries considerable expectations. The January 29 release date gives audiences a confirmed target to look forward to, while further details about the film's story and supporting cast are awaited. Check Out:  Naslen wraps his next with Kumbalangi Nights director                      Sukumar launches romantic entertainer with Siddhu  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
బాబుమోహన్.. ఈ పేరుకి ఉన్న చరిష్మా తెలుగు సినిమా ఉన్నంత కాలం వెలుగొందుతూనే ఉంటుంది. బాబు మోహన్ తమ సినిమాలో ఉండేలా చూడు అని ఇష్టదైవాల్ని ప్రార్ధించని హీరో లేడనే టాక్  కూడా తెలుగు ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో తరచూ వినపడుతూ ఉండేది.  అలాంటి బాబు మోహన్  తాజాగా టాలీవుడ్ మోస్ట్ అంటెన్సివ్ చిత్రమైన 'ది ప్యారడైజ్' సినిమా యూనిట్ పై అత్యంత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో తనకు జరిగిన చేదు అనుభవాలను, మేకర్స్ వ్యవహరించిన తీరును బహిరంగంగానే వెల్లడించి సంచలనం సృష్టించారు. ఇటీవలి కాలంలో సినిమాలని బాగా తగ్గించి, అత్యంత సెలెక్టివ్‌గా నటిస్తున్న బాబు మోహన్ 'ది ప్యారడైజ్' చిత్రంలో ఒక కీలకమైన మరియు మంచి క్యారక్టర్ కోసం దర్శకుడు, చిత్ర యూనిట్ తనని  స్వయంగా సంప్రదించారని గుర్తు చేసుకున్నారు. తన వద్దకు వచ్చిన ఆ రోల్ కోసం స్వయంగా లుక్ టెస్ట్ కూడా నిర్వహించారని, గెటప్ చాలా అద్భుతంగా వచ్చిందని ఆ సమయంలో ఎంతో అభినందించారని ఆయన తెలిపారు. షూటింగ్ ప్రారంభం కాగానే వెంటనే పిలుస్తామని, పనులన్నీ పూర్తి కాగానే కబురు పెడతామని చెప్పి యూనిట్ పెద్దలు నమ్మించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.   అయితే, ఆ తర్వాత చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోగా, కనీసం ఫోన్ చేసి చెప్పే మర్యాద కూడా పాటించలేదని బాబు మోహన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిలుపు వస్తుందని, షూటింగ్‌కి రమ్మంటారని ఎంతో ఆశగా ఎదురుచూసిన తనను చివరికి ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా పక్కన పెట్టేశారని ఆయన మండిపడ్డారు. ఇది కూడా చదవండి: టిల్లు మావ కొత్త సినిమా: సబ్జెక్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు! తనలాంటి అనుభవజ్ఞుడైన సీనియర్ నటుడిని ఇలా గెటప్ వేసి, లుక్ టెస్ట్ చేసి అర్ధంతరంగా పక్కన పెట్టడం తీవ్ర అవమానకరమని ఆయన మధనపడ్డారు. నటీనటులకు కనీస గౌరవం ఇవ్వని వారికి దరిద్రం, శని వెంటపడతాయని, అందుకే ఆ సినిమాకి ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదని కొంచం ఘాటుగానే  విమర్శించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.   మీకు నచ్చవచ్చు:రామాయణ సౌత్ కలెక్షన్స్ ఇంతే! మీకు నచ్చవచ్చు: రంగంలోకి చిరంజీవి: ఫ్యాన్స్ లో కోలాహాలం!   [Babu Mohan , Nani, the Paradise, Kayadu Lohar, Mohan Babu]  
‘రంగస్థలం’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ‘RC17’ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ చివరి వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో సుకుమార్ ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌ను సిద్ధం చేస్తున్నారట. ఈ ఏడాది చివర్లోనే కెమెరా ముందుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి పనిచేస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్, హీరోయిన్, సంగీత దర్శకుడు వంటి విషయాలపై కూడా ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. అయితే పూర్తి వివరాలను చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు. ఇది కూడా చదవండి: రామ్ చరణ్ ‘RC17’లో రిషికాంత్?.. పూజకు వెళ్లిన అసలు కారణం చెప్పేశాడు.! అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నెమలి ఈక ఉండటంతో ఇది శ్రీకృష్ణుడి నేపథ్యంలో మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ చివరి వారంలో షూటింగ్ మొదలైతే, కొత్త ఏడాదిలో ఈ సినిమా మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ‘రంగస్థలం’ మ్యాజిక్‌ను సుకుమార్ మరోసారి రిపీట్ చేస్తారా? అనేది చూడాలి. మీకు నచ్చవచ్చు: ‘గాడ్ ఆఫ్ వార్’కి బ్రేక్.. చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా.! చేతులు మారిన జటాయు ప్రాజెక్ట్.. రోషన్ హీరోగా పాన్ ఇండియా మూవీ లాంచ్.!       [RC17 Shooting Update, RC17 Movie, Ram Charan, Sukumar, Mythri Movie Makers]  
డిజె టిల్లు సిద్దు జొన్నలగడ్డ ప్రీవియస్ చిత్రాలని పరిశీలిస్తే వరుస పరాజయాలు. దీంతో అభిమానులు, సినీ ప్రేమికుల్లో ఒకింత బెంగ మొదలైంది. అంతలా డిజె టిల్లు, టిల్లు స్క్వేర్  తో మెస్మరైజ్ చేసాడు. ఈ సారి హిట్ అంటూ కొత్త మూవీ స్టార్ట్ చేసాడు ఆయన కొత్త చిత్రం ‘సిద్ధు 10’ అనే వర్కింగ్ టైటిల్‌తో బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో టైటిల్ పోస్టర్‌ని విడుదల చేశారు. పూజ కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. దర్శకుడు బుచ్చిబాబు, దర్శకురాలు సందిని రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందులో సిద్ధుకు జోడీగా నయన్ సారిక నటించనున్నారు. రొమాంటిక్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రానికి మోహన్ బి దర్శకత్వం వహించనున్నారు. జి వి ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. సుకుమార్ రైటింగ్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఈసారి మరింత డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ తాజా ప్రాజెక్ట్ చాలా యూనిక్ ప్లాట్‌తో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: అల్లు అర్జున్,లోకేష్ కనగరాజ్ మూవీ టైటిల్ ఇదేనా: ఆ స్టార్ అంట!   సినిమా రంగంలో ప్రయోగాత్మక కథలకు ఎప్పుడూ ముందుండే సిద్ధూ జొన్నలగడ్డ, కేవలం ఒకే జానర్‌కు పరిమితం కాకుండా, విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన లైనప్‌లో సోషియో ఫాంటసీ జానర్ మూవీతో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నట్లు ఫిలింనగర్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే బలమైన కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న సిద్ధూ నుంచి వస్తున్న ఈ అప్‌డేట్  అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మీకు నచ్చవచ్చు:సెన్సేషన్ సృష్టిస్తున్న సూర్య !  మీకు నచ్చవచ్చు: శ్రీకాంత్ కొడుకు వచ్చేస్తున్నాడు!   [Siddhu Jonnalagadda, Nayan Saarika, Allu Aravind, Telugu Cinema, TeluguCinema News]  
Anirudh Ravichander is getting married to Kavya Maran and the couple have flown to Greece for their destination wedding. Recently, Superstar Rajinikanth and former CM of Tamil Nadu, MK Stalin with his son Udayanidhi Stalin, have seen flying to the country for the wedding. The couple did not share any photos, yet.  On the other hand, the gossip reports from Tamil Movie circles are stating that Anirudh has walked out of Arasan movie after having differences with Vetrimaaran and Simbu. Mainly, Vetrimaaran, the director of the film loved the promo or title glimpse music but he did not really connect with Anirudh's working hours.  It is reported that Anirudh asks director for their inputs on what they want and then compose in privacy. He had been busy with concerts, other films like Jailer 2, Paradise as well. Vetrimaaran love to interact with his composers and then create a tune but Anirudh did not fit into that space.  So, he always had an issue with how music shapes out while his frequent collaborators like GV Prakash Kumar and Santhosh Narayanan always used to jam with him. But Simbu wanted Anirudh and even producer Kalaipuli S. Thanu preferred the composer for his market status and amount he can bring back in rights.  Also Read: Naslen wraps his next with Kumbalangi Nights director Recently, Simbu did not like the delay in release of glimpse from the film for Diwali and main blame had been shifted to Anirudh who flew before Diwali to Greece. Simbu expected him to complete the composition for the glimpse before taking off bu Vetrimaaran took his time and completed edit in the last minute.  Still, Simbu got upset with Anirudh that he did not wait and Simbu had to lose face in front of his fans. In the last minute, another composer had been appointed for small glimpse and even Vetrimaaran did not give his approval to release but just to please Simbu, Thanu released it.  On the whole, as everything became a huge mess, Simbu also stated that it is better to go with another composer than Anirudh, it seems. Well, post the reception and all the wedding related works are done, the trio will come together and discuss about announcing the obvious. Either he might walk out or they might decide to give the combination another try. For now, Arasan team is disappointed for becoming the centre of all trolls and a big decision is expected, say reports.  Check Out: Priya Bhavani Shankar marries her beau Rajvel Raj                      Salman invites more trolls with Maatrubhumi Trailer   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోకి ఉండే క్రేజ్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. అంచనాలని అందుకోవాలంటే ఏదైనా కొత్త పరికరం కనిపెట్టాల్సిన పరిస్థితి. ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం AA23పై రోజుకో సరికొత్త అప్‌డేట్ సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. తాజా ఫిలింనగర్ సర్కిల్స్ సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి మేకర్స్ ఒక పవర్‌ఫుల్ వర్కింగ్ టైటిల్‌గా 'గ్యాంగ్‌స్టార్' (Gangster) అనే పేరును లాక్ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. లోకేష్ కనగరాజ్ మార్క్ రక్తపాతం, తుపాకీల చప్పుడు, మరియు పూర్తిగా రా అండ్ రస్టిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో ఈ కథ నడవనుందని సినీ వర్గాలు అంటున్నాయి.  ఇప్పటివరకు ఎవరూ ఊహించని సరికొత్త మాస్ షేడ్స్‌లో అల్లు అర్జున్‌ను దర్శకుడు చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు లోకేష్ స్టైలిష్ డార్క్ యాక్షన్ ఎలిమెంట్స్, మరోవైపు బన్నీ స్క్రీన్ ప్రెజెన్స్ తోడవడంతో థియేటర్లలో పూనకాలు ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర గానీ, రొమాంటిక్ ట్రాక్ గానీ ఉండే అవకాశం లేదని, పూర్తిగా ఇంటెన్స్ యాక్షన్ మరియు ఎమోషన్స్‌కే పెద్దపీట వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.   ఇది బన్నీ కెరీర్‌లోనే ఒక సరికొత్త ప్రయోగంగా నిలవనుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా మరియు అత్యంత గోప్యంగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ 'రాకా' చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇది కూడా చదవండి: రాముడికి పట్టాభిషేకం చేసిన సౌత్ ప్రేక్షకులు: కలెక్షన్స్ ఇవే! ఆ షెడ్యూల్స్ ముగిసిన వెంటనే బన్నీ ఈ లోకేష్ ప్రాజెక్ట్‌పై పూర్తి దృష్టి పెట్టనున్నారు. త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి ఈ టైటిల్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదా అదిరిపోయే టీజర్ రానుందని సమాచారం. అటు మాస్ డైరెక్టర్, ఇటు ఐకాన్ స్టార్ కలయికలో రాబోతున్న ఈ 'గ్యాంగ్‌స్టార్' ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి!   బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ , సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మాణ భాగస్వామ్యంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్.    మీకు నచ్చవచ్చు: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! మీకు నచ్చవచ్చు :కమల్ హాసన్ సరికొత్త వివాదం: ఆ కులం వాళ్ళు ఇబ్బందిపడతారేమో!   [Allu Arjun And Lokesh Kanagaraj Movie Title, AA 23 Gangster Title, Allu Arjun, Lokesh Kanagaraj, AA23 movie, Gangster title, Telugucinema news, TeluguCinema, Tollywood, Tollywood News]
శరీరానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మందులతో ఇంకా చికిత్సలతో ఈజీగా తగ్గించుకోవచ్చు. కానీ కొన్ని మొండి వ్యాధులు మాత్రం ఎన్ని మందులు వాడినా అస్సలు తగ్గవు. అటువంటి వాటిలో తామర కూడా ఒకటి. ఇది ఒకసారి శరీరానికి సోకిందంటే అంత తొందరగా వదిలిపెట్టదు. నిర్లక్ష్యం చేస్తే, అది శరీరంలోని అనేక భాగాలకు వ్యాపించడమే కాకుండా, అంటువ్యాధి కాబట్టి ఇతరులకు కూడా సోకే ప్రమాదం ఉంటుంది. ఈ మొండి తామర సమస్యకు రకరకాల మందులు వాడి విసిగిపోయిన వారికి ఒక అద్భుతమైన హోం రెమిడీ అందుబాటులో ఉంది. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేవు, పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా నయం చేసుకోవచ్చు.  తామర అనేది ఒక చర్మ సంబంధిత అంటు వ్యాధి, ఇది వివిధ రూపాల్లో వస్తుంది. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఇది నేరుగా తాకడం వలన ఇంకా వారి వస్తువులు, దుస్తులు వాడటం వలన వేగంగా వ్యాపిస్తుంది. తామర వల్ల చర్మం పొడిబారి, పొలుసులు ఏర్పడి, మచ్చలు పడటం, తీవ్రమైన దురద రావడం వంటి బాధాకరమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు, కానీ చిన్న పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా గజ్జలు, చంకలు వంటి తడిగా ఉండే ప్రదేశాలలో ఇది ఎక్కువగా వస్తుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. తామరలో ప్రధానంగా అటాపిక్ డెర్మటైటిస్ అనేది ఒక రకమైన అలెర్జీ. చిన్న పిల్లలలో, ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు వారికి ఇది ఎక్కువగా వస్తుంది. ఆహార పదార్థాలు, పర్యావరణ మార్పులు, జన్యుపరమైన కారణాల వల్ల ఇది వచ్చే అవకాశం ఉంది. మరొకటి కాంటాక్ట్ డెర్మటైటిస్. తామర ఉన్న వ్యక్తిని తాకినప్పుడు లేదా కొన్ని వాతావరణ మార్పుల వల్ల ఇది రావచ్చు. దీనివల్ల చర్మం ఎర్రగా మారి తీవ్రంగా దురద పెడుతుంది. సాధారణంగా ఇది చేతులు మరియు కాళ్ళపై ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి ప్రకృతి మనకు అద్భుతమైన వస్తువులను ప్రసాదించింది. వేపాకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని శుద్ధి చేస్తాయి, మంటలను తగ్గిస్తాయి. అలాగే, పసుపులోని కర్కుమిన్ శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో వాపు, మంట వంటి సమస్యలను తగ్గించి, చర్మానికి మంచి రక్షణ ఇస్తుంది. మరోవైపు, కొబ్బరి నూనె యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, లినోలిక్ యాసిడ్, విటమిన్ F, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండి, చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది కూడా చదవండి:గుడ్లు పగిలిపోకుండా, పర్ఫెక్ట్ బాయిల్డ్ ఎగ్స్ తయారీకి అద్భుతమైన చిట్కాలు! ఈ అద్భుతమైన ఇంటి నివారణ పద్ధతిని తయారు చేసుకోవడం చాలా సులభం. ముందుగా, వేపాకులను శుభ్రంగా కడిగి, నీడలో, గాలి బాగా తగిలే చోట ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత, 10 నిమిషాల పాటు ఎండలో ఉంచి, ఆపై వాటిని మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ఒక డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు.  ఒక బౌల్ తీసుకుని, మీరు ఎంత వేప పొడి వేసుకుంటారో అంత పసుపు పొడిని కూడా సమానంగా వేయాలి. ఈ రెండింటినీ బాగా కలిపి, కొద్దికొద్దిగా కొబ్బరి నూనె కలుపుతూ, పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమం మరీ చిక్కగా గానీ, పల్చగా గానీ ఉండకుండా చూసుకోవాలి. వీలైతే, ఇందులో రెండు చుక్కలు టీ ట్రీ ఆయిల్ కలుపుకోవచ్చు. ఇది చర్మ అలెర్జీలకు చాలా ప్రభావవంతంగా పనిచేసి మొండి తామరను శాశ్వతంగా తరిమికొడుతుంది. మీకు నచ్చవచ్చు:ప్రెగ్నెన్సీ ఫస్ట్ మంత్స్ డైట్: నిపుణులు చెబుతున్న ముఖ్యమైన సూచనలు                                 శరీరానికి, ఉక్కులాంటి బలాన్నిచ్చే, మేక తలకాయ కూర రహస్యం!     Ringworm Home Remedies, Skin Fungus Treatment, Itching And Rash Relief, Natural Skin Care Tips, Herbal Remedies For Fungus, Doctor Health Advice, Health Tips In Telugu.
ప్రస్తుత రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారం వైపు అడుగులు వేస్తున్నారు. రోజూ తినే సాధారణ వైట్ రైస్ పులావ్‌కు బదులుగా అత్యంత రుచికరమైన మరియు ఆరోగ్య ప్రయోజనాలు నిండిన మిల్లెట్ పులావ్‌ను మీ ఆహారంలో చేర్చుకోవడం ఒక అద్భుతమైన నిర్ణయం. ముఖ్యంగా కొత్తదనాన్ని కోరుకునే వారికి, చిన్నపిల్లల లంచ్ బాక్స్‌ల కోసం ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. కూరగాయలు, పనీర్, మరియు సుగంధ ద్రవ్యాల సమ్మేళనంతో తయారయ్యే ఈ మిల్లెట్ పులావ్ మధ్యాహ్న భోజనానికే కాకుండా రాత్రి భోజనానికి కూడా సరిగ్గా సరిపోతుంది. ఇది కేవలం రుచిని అందించడమే కాకుండా శరీరానికి కావలసిన పోషకాలను సమృద్ధిగా అందిస్తుంది. ఈ అద్భుతమైన రెసిపీ తయారీ కోసం ముందుగా ఒక పెద్ద గిన్నెలో బంగాళదుంపలు, క్యాలీఫ్లవర్, బఠానీలు, బీన్స్ మరియు క్యారెట్లను తీసుకోవాలి. ఈ కూరగాయల మిశ్రమంలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, గరం మసాలా, కారం పొడి మరియు తగినంత ఉప్పు వేయాలి. అన్ని పదార్ధాలను బాగా కలిపి, కూరగాయలను సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు కూరగాయలకు బాగా పట్టి రుచి పెరుగుతుంది. ఆ తర్వాత ఒక పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసి, ఆరు కప్పుల గోరువెచ్చని నీటిని పోసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఇందులో కూరగాయలను వేసి దాదాపు 70 శాతం వరకు ఉడికించి, నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి కడాయిని తీసుకుని అందులో లవంగాలు, దాల్చిన చెక్క వేయాలి. ఈ సుగంధ ద్రవ్యాలు తమ అద్భుతమైన సువాసనను వెదజల్లే వరకు ఒక నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కూరగాయలను ఆ పాన్‌లో వేసి మొత్తం మసాలా దినుసులతో బాగా కలపాలి. కూరగాయలు సుమారు 60 శాతం ఉడికే వరకు ఉడికించి, ఆపై తగినంత నీళ్లు పోసి కలపాలి. ఈ దశలో పనీర్‌ను చిన్న చిన్న ముక్కలుగా కోసి కడాయిలో వేసి మెల్లగా కలపాలి. సగం ఉడికించిన కూరగాయలు మరియు పనీర్ మిశ్రమాన్ని కడాయిలో సమానంగా సర్దుకోవాలి. పులావ్‌కు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని, సువాసనను తీసుకొచ్చేందుకు వేయించిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర మరియు పుదీనా ఆకులను దీనిపై చల్లాలి. మంచి సువాసన మరియు ఆకర్షణీయమైన రంగు కోసం కుంకుమపువ్వు కలిపిన పాలను పైనుంచి పోయాలి. ఆ తర్వాత కడాయికి గట్టిగా మూత పెట్టి, తక్కువ మంట మీద 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి. కూరగాయలు పూర్తిగా ఉడికే వరకు దీనిని కదపకుండా అలాగే ఉంచాలి. ఇది కూడా చదవండి:ఆంధ్ర స్టైల్, శెనగపప్పు మటన్ కర్రీ, తయారీ విధానం వంట పూర్తయిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించి, పులావ్‌ను మరో ఐదు నిమిషాల పాటు మూతపెట్టి అలాగే ఉంచాలి. ఈ సమయంలో గింజలు విరిగిపోకుండా లేదా మెత్తగా అయిపోకుండా ఉండటానికి వెంటనే గరిటె పెట్టి కలపకూడదు. కొద్దిసేపు ఆగిన తర్వాత తినే ముందు ఈ పులావ్‌ను చాలా మెల్లగా కలుపుకోవాలి. ఈ రుచికరమైన మిల్లెట్ పులావ్‌ను వేడి వేడిగా దోసకాయ మరియు పుదీనా రైతాతో కలిపి తింటే దీని రుచి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడంలో, బరువు నియంత్రణలో సహాయపడే ఈ అద్భుతమైన వంటకాన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ కుటుంబ సభ్యులకు వడ్డించండి. మీకు నచ్చవచ్చు:సీడీ ప్లేయర్ల కోసం, విపరీతంగా పెరిగిన సెర్చ్‌లు: అసలు కారణం ఇదే!                                తగినన్ని, నీళ్లు తాగకుండా, మందులు వేసుకుంటే ఏమవుతుంది?       Millet Pulao Recipe, Healthy Lunch Box Ideas, Millets For Weight Loss, Nutritious Rice Alternatives, Easy Cooking Guide, Traditional Food Recipes, Food Articles In Telugu.
ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్య స్పృహతో తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. బరువు తగ్గాలనే లక్ష్యంతో డైట్ చేసేవారు ముందుగా తెల్ల పంచదారకు పూర్తిగా స్వస్తి పలికి, దానికి ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని ఎంచుకుంటున్నారు. పంచదార కంటే బెల్లం ఆరోగ్యకరమైనదని, ఇది సహజమైన పద్ధతిలో తయారవుతుంది కాబట్టి బరువును అకస్మాత్తుగా తగ్గిస్తుందని చాలామంది బలంగా నమ్ముతారు. అయితే, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కేవలం పంచదార స్థానంలో బెల్లాన్ని వాడినంత మాత్రాన బరువు తగ్గుతారనడంలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పైగా బెల్లాన్ని నియంత్రణ లేకుండా అధికంగా తీసుకుంటే, అది బరువు తగ్గించే ప్రయత్నాలకు విరుద్ధంగా మరింత బరువు పెరిగేలా చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చెరకు రసం నుంచే బెల్లం మరియు పంచదార రెండింటినీ తయారు చేసినప్పటికీ, వాటి తయారీ విధానంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. తెల్ల పంచదార తయారీలో అనేక శుద్ధి ప్రక్రియలు జరిగి, సుక్రోజ్ శాతం అత్యధికంగా మారుతుంది. కానీ బెల్లం తక్కువ శుద్ధి ప్రక్రియ ద్వారా తయారవుతుంది కాబట్టి, చెరకులోని కొన్ని సహజ ఖనిజాలు దానిలో అలాగే మిగిలిపోతాయి. ఈ కారణంగా బెల్లంలో శరీరానికి అవసరమైన ఐరన్ లేదా ఇనుము, పొటాషియం, కాల్షియం మరియు మెగ్నీషియం వంటి సూక్ష్మ పోషకాలు కొద్దిపాటి మొత్తంలో లభిస్తాయి. అయితే, ఈ పోషకాలు నామమాత్రంగా మాత్రమే ఉంటాయని, కేవలం వీటికోసమే బెల్లంపై ఆధారపడటం సరైన పద్ధతి కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాగే, క్యాలరీల విషయానికి వస్తే పంచదార మరియు బెల్లం మధ్య పెద్దగా తేడా ఏమీ ఉండదు. వంద గ్రాముల తెల్ల పంచదారలో ఎంతైతే క్యాలరీలు ఉంటాయో, సుమారుగా అంతే మోతాదులో క్యాలరీలు బెల్లంలోనూ నిండి ఉంటాయి. బెల్లం సహజసిద్ధమైనదైనప్పటికీ, దానిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బెల్లం తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ లేదా చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మధుమేహం లేదా షుగర్ వ్యాధి ఉన్నవారు బెల్లం పంచదార కంటే పూర్తిగా సురక్షితమైనదిగా భావించి దానిని స్వేచ్ఛగా తీసుకోవడం సరికాదు. బరువు తగ్గడంలో ప్రధాన సూత్రం రోజువారీగా శరీరానికి అందే మొత్తం క్యాలరీల నియంత్రణపైనే ఆధారపడి ఉంటుంది. బెల్లం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, బరువు తగ్గాలనుకునేవారు రోజుకు కేవలం 1 నుండి 2 చిన్న చెంచాలు లేదా సుమారు 5 నుండి 10 గ్రాములు మాత్రమే పరిమితంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అంతకంటే ఎక్కువ మోతాదులో వాడితే శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగి బరువు తగ్గే ప్రణాళిక దెబ్బతింటుంది. కాబట్టి కేవలం ఒక పదార్థాన్ని మరోదానితో మార్చడం వల్ల ఫలితం ఉండదు. ఇది కూడా చదవండి:Vitamin D, లోపం ఉంటే. వచ్చే ప్రమాదకర లక్షణాలు మరియు నివారణ మార్గాలు! శరీరానికి అవసరమైన ఖనిజాలు మరియు విటమిన్లను పొందడానికి కేవలం బెల్లంపై కాకుండా ఆకుకూరలు, పప్పులు, తాజా పండ్లు మరియు వివిధ రకాల నట్స్ వంటి సమతుల్య పోషకాహారాన్ని తీసుకోవడం ఉత్తమం. దీనితో పాటు రోజువారీ జీవితంలో టీ లేదా కాఫీలలో వేసే తీపి పరిమాణాన్ని క్రమంగా తగ్గించడం, కూల్‌డ్రింక్స్ వంటి ప్యాక్ చేసిన తీపి పానీయాలకు పూర్తిగా దూరంగా ఉండటం చాలా ముఖ్యం. హైడ్రేషన్ కోసం సాధారణ నీటిని ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చివరిగా, బరువు నియంత్రణలో ఉండాలంటే కేవలం ఆహారపు అలవాట్లే కాకుండా శారీరక శ్రమ కూడా అత్యంత కీలకం. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాకింగ్, సైక్లింగ్ లేదా యోగా వంటి వ్యాయామాలు చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. వీటితో పాటు సరైన నిద్ర ఉండేలా చూసుకోవడం ద్వారా ఆకలిని నియంత్రించే హార్మోన్లు సక్రమంగా పనిచేస్తాయి. కాబట్టి బెల్లం సహజమైనదనే భ్రమలో దానిని ఎక్కువగా తినకుండా, అన్ని విషయాలలోనూ తగిన మోతాదును పాటిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని సొంతం చేసుకోవడం మంచిది. మీకు నచ్చవచ్చు:ఖాళీ కడుపుతో, కరివేపాకు తీసుకుంటే బరువు, షుగర్ మాయం!                              డైటీషియన్ చెబుతున్న, ఈ 45 రోజుల. అరటిపండు మ్యాజిక్ సీక్రెట్ తెలుసా?       Jaggery Vs Sugar, Weight Loss Diet Facts, Is Jaggery Good For Weight Loss, Sugar Alternatives Truth, Healthy Eating Habits, Doctor Health Advice, Health Tips In Telugu.
ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే చాలామంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వయసు పెరిగిన తర్వాత మాత్రమే వచ్చే సమస్యగా భావించే ఆర్థరైటిస్ ఇప్పుడు యువతలో కూడా కనిపిస్తోంది. అసలు చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు రావడానికి కారణాలేంటి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అంటే ఏమిటి? ఈ సమస్యకు వ్యాయామానికి ఉన్న సంబంధం ఏమిటి? కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కీళ్లు మన శరీర కదలికలకు ఎంతో కీలకం. నడవడం, మెట్లు ఎక్కడం, కూర్చోవడం, నిలబడటం వంటి రోజువారీ పనులన్నీ కీళ్ల సహకారంతోనే సాధ్యమవుతాయి. అయితే శారీరక శ్రమ తగ్గడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం, సరైన వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు కీళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా మోకాళ్లపై ఒత్తిడి పెరిగినప్పుడు నొప్పి, బిగుతుగా అనిపించడం, కదలికల్లో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి. కీళ్ల నొప్పులు రాకుండా ఉండటానికి, మోకాళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి రోజువారీ వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో Dr. Bhaskarకీళ్ల ఆరోగ్యం, ఆర్థరైటిస్, రుమటాయిడ్  ఆర్థరైటిస్ గురించి ముఖ్యమైన విషయాలను వివరించారు. అలాగే మోకాళ్ల కదలికలు మెరుగుపడటానికి, కండరాలు బలపడటానికి, కీళ్లపై ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగపడే ఐదు వ్యాయామాల గురించి తెలియజేశారు. ఈ ఐదు వ్యాయామాలను ఎలా చేయాలి? వాటిని రోజువారీ జీవితంలో ఎలా భాగం చేసుకోవాలి? కీళ్ల నొప్పులతో బాధపడేవారు వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటికే ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు ఎలాంటి వ్యాయామాలను ఎంచుకోవాలి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఇది కూడా చదవండి    పిండికూరతో కిడ్నీ రాళ్లు కరుగుతాయా.. డాక్టర్ ఏం చెబుతున్నారు కీళ్ల నొప్పులు ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన వ్యాయామాలు సరిపోవు. ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే తమకు తగిన వ్యాయామాలను ఎంచుకోవాలి. నొప్పి పెరిగేలా బలవంతంగా వ్యాయామాలు చేయకూడదు. కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మోకాళ్ల నొప్పుల పట్ల అవగాహన పెంచుకోవడానికి డాక్టర్ భాస్కర్ అందిస్తున్న ఈ విలువైన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోండి. మరిన్ని ఆరోగ్య విషయాలు, నిపుణుల సలహాలు, ఉపయోగకరమైన సమాచార వీడియోల కోసం TeluguOne Healthను ఫాలో అవ్వండి.
మనం రోజూ తినే ఆహారంలో కొన్ని కాంబినేషన్స్ ట్రై చేస్తుంటాం. కానీ ఏ ఆహార పదార్థాన్ని వేటితో కలిపి తింటే మన శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయనే విషయం మీద చాలామందికి స్పష్టత ఉండదు. మనం తినే వాటిలో కొన్ని కాంబినేషన్ లు ఆరోగ్యానికి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. అలాంటి కొన్ని అరుదైన , అత్యంత ప్రయోజనకరమైన ఫుడ్  కాంబినేషన్ లు ఏవో.. వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో  గురించి  వివరంగా తెలుసుకుంటే.. పుచ్చకాయ.. ఉప్పు.. ​మనలో చాలా మందికి పుచ్చకాయ అనగానే గుర్తుకు వచ్చేది కేవలం తియ్యటి రుచి మాత్రమే. అయితే పుచ్చకాయ ముక్కల మీద కొద్దిగా ఉప్పు చల్లుకొని తింటే దాని రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా రెట్టింపు అవుతాయి. పుచ్చకాయలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఉప్పులో సోడియం లభిస్తుంది. ఈ రెండు కలిసి శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉండేలా చూస్తాయి. ముఖ్యంగా ఎండకాలంలో లేదా వర్కవుట్లు చేసిన తర్వాత ఈ కాంబినేషన్ శరీరాన్ని తక్షణ శక్తితో పాటు హైడ్రేట్ గా ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. బాదం..డార్క్ చాక్లెట్.. ​బాదం పప్పులను డార్క్ చాక్లెట్ తో కలిపి తీసుకోవడం మరొక మంచి అలవాటు. బాదం పప్పులో శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు , విటమిన్ ఈ లభిస్తాయి. అలాగే డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఎక్కువగా ఉండే ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఈ రెండింటి కలయిక శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ శక్తిని గణనీయంగా పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది , గుండె సంబంధిత సమస్యలు రాకుండా రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఓట్స్.. పెరుగు.. ​ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తినడం చాలా మందికి అలవాటు. అయితే ఈ ఓట్స్ ను పెరుగుతో కలిపి తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఓట్స్ లో ప్రీబయోటిక్స్ ఉంటాయి. అలాగే పెరుగులో మంచి బ్యాక్టీరియాను అందించే ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఈ రెండు కలిసి కడుపులోని జీర్ణక్రియను మెరుగుపరచడంలో , గట్ హెల్త్ ని ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. పొట్టకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి ఈ ఆహార కాంబినేషన్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది కూడా చదవండి మీకు తెలుసా ..ఈ విటమిన్లు లోపిస్తే లివర్ దెబ్బతింటుంది..! గ్రీన్ టీ.. నిమ్మరసం.. ​బరువు తగ్గాలనుకునేవారు లేదా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టేవారు గ్రీన్ టీ తాగడం సాధారణం. అయితే గ్రీన్ టీ లో కొద్దిగా నిమ్మరసం పిండుకొని తాగితే దాని ప్రయోజనాలు పూర్తిగా శరీరానికి అందుతాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి గ్రీన్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్లను శరీరం వేగంగా గ్రహించేలా సహాయపడుతుంది. సాధారణంగా గ్రీన్ టీ తాగడం వల్ల అందే పోషకాలు నిమ్మకాయ కలవడం వల్ల మరింత మెరుగ్గా పనిచేస్తాయి. పసుపు పాలు.. మిరియాల పొడి.. ​మన ఇంట్లో తరచూ చేసుకునే పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగడం మన సాంప్రదాయం. అయితే ఈ పసుపు పాలలో చిటికెడు మిరియాల పొడి కూడా కలిపితే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. మిరియాలలో పైపరిన్ అనే గుణం ఉంటుంది. ఇది పసుపులోని కర్క్యుమిన్ అనే మూలకాన్ని శరీరం త్వరగా , పూర్తిగా గ్రహించడానికి సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఎముకల నొప్పులు , ఇతర ఆరోగ్య సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ​ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మనం తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఏ ఆహారాన్ని ఏ పదార్థంతో కలిపి తినాలో తెలుసుకొని పాటిస్తే శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈ అద్భుతమైన ఆహార కాంబినేషన్  లను  దైనందిన జీవితంలో భాగం చేసుకొని పూర్తి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.                                                                                                                                                   *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు    ఇలా చేస్తే చాలు... పిల్లలు ఫోన్ పక్కన పెట్టి పుస్తకాలంటే ఇష్టపడతారు..!                                 ​
ప్రతిరోజూ ఉదయం గొంతుకు హాయిగా ఉండేలా వేడి వేడిగా టీ తాగి రోజును ప్రారంభించడం చాలా మందికి అలవాటు. అయితే ఆ రొటీన్ టీకి బదులుగా అప్పుడప్పుడు కొన్ని సుగంధ ద్రవ్యాలు , మూలికలను జోడించి తయారు చేసుకునే పానీయాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని హెర్బల్ టీలు అని అంటారు.   మన వంటింట్లో సులభంగా లభించే మసాలా దినుసులతోనే ఈ టీల  ను తయారు చేసుకుని తాగవచ్చు. అలా వంటిట్లో ఉండే మసాలా దినుసుల్లో అనాస పువ్వు కూడా ఒకటి. ఈ  అనాస పువ్వుతో తయారు చేసే టీ ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ చిన్న పువ్వు కేవలం వంటకాలకు రుచిని ఇవ్వడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకు సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే.. అనాస పువ్వు టీ.. ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వైరల్ ఫీవర్స్ , ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం.  జ్వరం లేదా  ఏదైనా వైరస్  లేదా శ్వాసకోశ సమస్యలు తలెత్తినప్పుడు  ప్రకృతి మనకు ప్రసాదించిన అనాస పువ్వును ఉపయోగించి సులభంగా హెర్బల్ టీ తయారు చేసుకోవచ్చు. అనాస పువ్వును చిన్న ముక్కలుగా చేసి, నీటిలో మరిగించి టీలా తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి మంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయోజనాలు.. వైరల్ ఫీవర్..  శ్వాసకోశ సమస్యలు.. వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, వైరస్ జ్వరాలు సర్వసాధారణం. అనాస పువ్వులో యాంటీ వైరల్ , యాంటీ మైక్రోబయల్  గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించే హానికారక వైరస్‌లతో పోరాడటానికి సహాయపడతాయి. శ్వాసనాళాల్లో చేరిన శ్లేష్మాన్ని కరిగించి, గొంతు నొప్పి , ఊపిరితిత్తుల ఇబ్బంది నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణక్రియ .. తిన్న ఆహారం సరిగా అరగకపోవడం, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ టీ చాలా బాగా పనిచేస్తుంది. అనాస పువ్వులోని పోషకాలు జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచి, జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తాయి. భోజనం తర్వాత లేదా ఉదయం పూట ఈ టీ తాగడం వల్ల పొట్ట తేలికగా ఉంటుంది. ఇది కూడా చదవండి   షుగర్ పేషెంట్లు తప్పక తెలుసుకోవాలి ! ముఖ్యమైన డాక్టర్  సూచనలు రోగనిరోధక శక్తి పెంపు.. శరీరంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే చిన్నచిన్న అనారోగ్యాలు కూడా త్వరగా చుట్టుముడతాయి. అనాస పువ్వు టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. రోజూ దీన్ని తీసుకోవడం వల్ల శరీరం శక్తివంతంగా మారుతుంది , ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షణ లభిస్తుంది. కీళ్ల నొప్పులు,  వాపులు తగ్గించడం.. శరీరంలో ఎక్కడైనా వాపులు లేదా కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు ఈ టీ సహజ నివారణగా పనిచేస్తుంది. దీనిలో ఉండే కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు శరీరంలో మంటను, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. వయసు మళ్లిన వాళ్ళలో లేదా కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారికి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. మానసిక ప్రశాంతత , నిద్రలేమి నివారణ.. రోజంతా పడిన అలసట, ఒత్తిడి కారణంగా రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. అనాస పువ్వు టీలో ఉండే సువాసన , మృదువైన గుణాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. ఇది మనసును రిలాక్స్ చేసి చక్కగా నిద్ర పట్టేలా సహాయపడుతుంది. చర్మ సౌందర్యం.. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల మొటిమలు, చర్మ సమస్యలు వస్తుంటాయి. ఈ హెర్బల్ టీ శరీరాన్ని శుభ్రపరిచి, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారడానికి దోహదపడుతుంది.                                                                                                                                                *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు    థైరాయిడ్ PCOS గట్ హెల్త్.. వీటి మధ్య సంబంధం ఏమిటి.!                                   మహిళలు అస్సలు నిర్లక్ష్యం చేయకూడని అండాశయ క్యాన్సర్ లక్షణాలివే!   What Happens to Your Body When You Drink Star Anise Tea,Amazing Benefits Revealed,Star Anise Tea,Amazing Benefits for Your Body