LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత తన పాదయాత్రకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 2029 ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడమనే ఏకైక లక్ష్యంతో ఆయన చేపట్టబోతున్న పాదయాత్ర వచ్చే ఏడాది జులైలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున ప్రారంభించనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ పాదయాత్ర కోసం ఇప్పటి నుంచే గ్రౌడ్ వర్క్ మొదలు పెట్టనున్నారు.  2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు. అయితే 2019 ఎన్నికలలో విజయం తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జనంతో మమేకమై అధికార పగ్గాలు చేపట్టిన జగన్ అధికారం చేజిక్కిన తరువాత జనానికి ముఖం చాటేశారు. రోడ్లకు ఇరు వైపులా పరదాలు కట్టుకుని మరీ పర్యటనలు సాగించారు. అలాగే పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన వాగ్దానాల అమలు అటుంచి, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కూడా పట్టించుకోవడం మానేశారు.   ఈ నేపథ్యంలో  ఈసారి జగన్ పాదాయత్రకు రాజకీయ సమీకరణాలు  భిన్నంగా ఉన్నాయి. గతంలో 2019 ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్ర ద్వారా ప్రజల్లో అపారమైన నమ్మకాన్ని సంపాదించుకున్నప్పటికీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కొన్ని ఆ నమ్మకాన్ని   నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని వైసీపీయులే చెబుతున్నారు. రాజకీయ పరిశీలకులు సైతం.. 2017లో పాదయాత్రకు లభించిన ప్రాజాదరణ ఈ సారి అనుమానమేనని విశ్లేషిస్తున్నారు.   అది పక్కన పెడితే.. సెంటిమెంట్ ప్రకారం వైయస్ఆర్ జయంతి నాడే యాత్రను ప్రారంభించడం ప్రజలకు దగ్గర కావడానికి, వారి విశ్వాసాన్ని తిరిగి పొందడానికి దోహదపడుతుందని జగన్ విశ్వసిన్తున్నారు. వచ్చే ఏడాదిజులై నుంచి జగన్ పాదయాత్రకు సంబంధించిన ప్రకటన ఇంకా అధికారికంగా వెలువడకపోయినా.. పార్టీ వర్గాలు మాత్రం పాదయాత్రకు అదే ముహూర్తం ఖారరైందని గట్టిగా చెబుతున్నాయి.  2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఈ రెండేళ్ల కాలంలో పెద్దగా జనంలోకి వచ్చిన దాఖలాలు లేవు. జగన్ కూడా చుట్టపు చూపుగా రాష్ట్రానికి రావడం వినా.. ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో  పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. ఇక ఒకరిద్దరు వినా పార్టీ నేతలు కూడా పొలిటికల్గా ఇన్ యాక్టివ్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయాలంటే.. పాదయాత్ర వినా మరో మార్గం లేదని జగన్ భావిస్తున్నారు.  ఈ కారణంతోనే ఎన్నికలకు రెండేళ్లు ముందే పాదయాత్ర చేపట్టడం ద్వారా నిరంతరం జనంలో ఉండేలా పాదయాత్రను ఎంచుకున్నారు.    [Jagan Padayatra From July 2027, jagan padayatra 2.0, ys jagan mohan reddy, ap politics, ysr jayanthi,, andhra pradesh News, Telugu One]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత తెలుదేశం పార్టీ తెలంగాణలో ఉనికి మాత్రంగానే మిగిలిందన్నది వాస్తవం. అయితే..  తెలంగాణ రాజకీయాలలో తెలుగుదేశం పాత్ర  ఆ పార్టీపై  ప్రత్యర్థులు   కొనసాగిస్తున్న  విమర్శల దాడి  మాత్రం అలాగే కొనసాగుతున్నాయి.  దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించిన ఒక ప్రధాన రాజకీయ శక్తిగా టీడీపీకి తిరుగులేని  చరిత్ర ఉంది. అయితే రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.  రాష్ట్ర విభజన అనంతర  కాలంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయినప్పటికీ.. ఇప్పటికీ  ప్రత్యర్థి పార్టీల నేతలు తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తుండటం రివాజుగా మారిపోయింది. తెలంగాణ గడ్డపై పార్టీకి ఉన్న బలమైన పునాదులను, చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యర్థులు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు పరిశీలకులు చెబుతుంటారు.   గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే..  టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారాలు చేయడం లేదా ఆ పార్టీ ప్రాభవాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయడం రాజకీయ ప్రత్యర్థులకు మామూలైపోయింది. ఇందుకు కారణం క్షేత్రస్థాయిలో పార్టీకి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న క్యాడర్.  ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలం నాటి పరిస్థితులు,  ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు నేటికీ రాజకీయ చర్చల్లో ప్రస్తావనకు వస్తుండటమే ఇందుకు నిదర్శనం.  అయితే..  తెలుగుదేశంపై విమర్శలను ప్రత్యర్థి పార్టీలు కేవలం   ఎన్నికల సమయాలకే పరిమితం చేయడంలేదు.. తమకు అవసరమైన ప్రతిసంర్భంలోనూ రాజకీయ వేడిని రగల్చడానికి ఒక సాధనంగా మార్చుకుంటున్నారు.  రాష్ట్రంలో అధికార,  ప్రతిపక్ష పార్టీలక మధ్య   మాటల యుద్ధంలో తెలుగుదేశం ప్రస్తావన అన్నది అనివార్యంగా మారిపోయిన పరిస్థితి ఉంది. తెలుగుదేశం ప్రస్తావనే తమ రాజకీయ ఉనికిని బలోపేతం చేస్తుందన్న భావన తెలంగాణ రాజకీయ పార్టీలలో బలంగా పేరుకుపోయిందనడానికి ఇది నిదర్శనమని చెప్పుకోవాల్సి ఉంటుంది.   తాజాగా కొండా సురేఖ ఎపిసోడ్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలకు ఆమె తెలుగుదేశం పార్టీనే ఆశ్రయించారు. రేవంత్ లో ఉన్నది తెలుగుదేశం రక్తం కనుకనే కక్ష పూరితంగా తనపై చర్యలు తీసుకున్నారని విమర్శించారు. ఇలా బీఆర్ఎస్, అలాగే కొత్తగా సొంత కుంపటి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసుకున్న కల్వకుంట్ల కవిత, అధికార కాంగ్రెస్ తెలుగుదేశం జపం లేకుండా రాష్ట్రంలో రాజకీయాలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే తెలంగాణలో తెలుగుదేశం బలానికీ, ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో ఉన్న పట్టుకూ నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  [TDP in Telangana Politics, Telugu Desam Party, Telangana PoliticsNews, TDP Rivals Target, TeluguOne]
  తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖను రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుండి సడన్ గా బర్తరఫ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కలకలమే రేపింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమె పేరు మీద ఒక భారీ ప్రకటన లేదా "బిగ్ అప్‌డేట్" త్వరలోనే రాబోతోందంటూ విపరీతంగా ప్రచారం సాగింది. దీంతో రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ శ్రేణులు మరియు సామాన్య ప్రజలు కొండా సురేఖ తదుపరి అడుగు ఎటువైపోనని ఉత్కంఠగా గమనించారు. అయితే, ఈ వైరల్ ప్రచారాలపై మాజీ మంత్రి కొండా సురేఖ స్వయంగా స్పందిస్తూ ఒక కీలక వివరణ ఇచ్చారు. తన పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవన్నీ తప్పుడు ప్రచారాలని స్పష్టం చేశారు. కేవలం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రజలు, మీడియా నమ్మాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ వివాదానికి ప్రధాన బీజం కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యల నుంచే ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ డిసిప్లినరీ కమిటీ కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. దీనివల్ల దాదాపు 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  కొందరు మంత్రులు సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.  అయితే, తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని సురేఖ పార్టీకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వేరొకరి అభిప్రాయాలకు తండ్రికి లేదా తల్లికి రాజకీయ బాధ్యత అప్పగించడం సరికాదని సమర్థించుకున్నారు. అయినప్పటికీ, పార్టీ క్రమశిక్షణ దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్లు ఏఐసీసీ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం సెప్టెంబర్ 3న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదంతో కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనిపై సురేఖ తీవ్రంగా స్పందిస్తూ, తనకు కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండానే బర్తరఫ్ చేశారని వాపోయారు. ఉరిశిక్ష పడిన ఖైదీకి కూడా చివరి నిమిషంలో మాట్లాడే అవకాశం ఇస్తారని, కానీ తన పట్ల కనీస ప్రజాస్వామ్య సూత్రాలను కూడా పాటించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, మంత్రి పదవి తనకు కేవలం ఒక అలంకారం మాత్రమేనని పేర్కొన్నారు.    తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని తేల్చిచెప్పారు. మరోవైపు, కొండా సురేఖ బర్తరఫ్‌తో పాటు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి జి. చిన్నారెడ్డిని కూడా తప్పించి, ఆ స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించారు. అలాగే తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద, కుడా చైర్‌పర్సన్‌గా సుధారాణిలను నియమిస్తూ ప్రభుత్వం కొన్ని కీలక ప్రక్షాళనలు చేపట్టింది. ప్రస్తుతం కొండా సురేఖ ఇచ్చిన వివరణతో ఆమె పార్టీ మారే ఆలోచనలో లేరని స్పష్టమైనప్పటికీ, తెలంగాణ కాంగ్రెస్‌లో ఉద్రిక్తతలు ఇంకా సమసిపోలేదని స్పష్టమవుతోంది.     (Konda Surekha sacked, Telangana Cabinet churn, CM Revanth Reddy, Konda Surekha, Konda Sushmitha Patel comments, Telangana Congress news, Konda Surekha social media clarification, Telugu One, Telugu news)
రేవంత్ రెడ్డి తన కేబినెట్ నుంచి కొండా సురేఖను  బర్త్ రఫ్ తరువాత ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు అన్న ఉత్కంఠ తెలంగాణ రాజకీయవర్గాలలో నెలకొంది. బీజేపీవైపు ఆమె అడుగులు పడే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషణలకు కూడా చేశారు. అయితే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ వ్యక్తిత్వాన్ని, నాయకత్వ శైలిని ఆమె కొనియాడతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.  గతంలో బీఆర్ఎస్ పార్టీ  కొనసాగిన కాలంలో   కేసీఆర్‌తో  తమ కుటుంబానికి ఉన్న సంబంధాల గురించి తాజాగా వివరించిన  కొండా సురేఖ.. కేసీఆర్ చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. తాను ఆయనతో ఎప్పుడు భేటీ అయినా ఎంతో ఆప్యాయంగా, హుందాగా రిసీవ్ చేసుకునేవారని  గుర్తుచేసుకున్నారు. పార్టీలో సుదీర్ఘకాలం పాటు కలిసి పనిచేసినప్పటికీ, కేసీఆర్ వ్యవహారశైలి తమకు ఎప్పుడూ ఎలాంటి అసంతృప్తి కలిగించలేదన్న కొండా సురేఖ.. బీఆర్ఎస్ అధినాయత్వంతో  తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని చెప్పడమే కాకుండా.. కేసీఆర్ నాయకత్వంలో తనకు ఎటువంటి ఇబ్బందులూ ఎన్నడూ ఎదురు కాలేదన్నారు.  ఈ సందర్భంగా కొండా సురేఖ తన భర్త కొండా మురళికి గతంలో దక్కిన ఎమ్మెల్సీ పదవికి  కేసీఆర్ హయాంలోనే  దక్కిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో కొండా మురళికి శాసనమండలికి వెళ్లే అవకాశం వచ్చినప్పుడు..  పార్టీలోని కొందరు సీనియర్ నేతలు  అడ్డుకునేందుకు  ప్రయత్నించారనీ, ముఖ్యంగా  కడియం శ్రీహరి వంటి సీనియర్ నాయకులు మురళికి ఆ పదవిని దక్కకుండా చేసేందుకు తెరవెనుక పావులు కదిపారని తాజాగా ఆరోపించారు. అయితే  కేసీఆర్ మాత్రం వాటన్నిటినీ తోసి రాజని,  కొండా మురళి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకారం అందించారని కొండా సురేఖ గుర్తు చేసారు.   ప్రస్తుత పరిస్థితుల్లో కొండా సురేఖ కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తడం రాజకీయంగా ఆమె అడుగులు ఎటుపడుతున్నాయన్నదానిపై ఒక స్పష్టత ఇచ్చేయడమేనన్నారు. గతంలో  బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన కొండా సురేఖ.. ఇప్పుడు అదే పార్టీ అధినేతపై ప్రశంసల వర్షం గుప్పించడం వెనుక ఆమె గులాబీ గూటికి చేరే వ్యూహం ఉందని పరిశీలకులు అంటున్నారు.    [Strategy Behind Konda Surekha Praises KCR, Konda, Brs, Konda Murali, MLC, Telangana Politics, Telugu One]
రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న రేవంత్  మంత్రివర్గ ప్రక్షాళన వ్యవహారం.. కేబినెట్ నుంచి కొండా సురేఖ బర్త్ రఫ్ తో కొత్త వివాదానికి తెరలేచింది.  తనకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన పరిణామాలపై కొండా సురేఖ మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.   కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్గతంగా నడుస్తున్న పరిణామాలు, నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు , రాష్ట్ర కాంగ్రెస్ లో పాత, కొత్త విభేదాలను మరోసారి తాజాగా కొండా సురేఖ తన వ్యాఖ్యల ద్వారా తెరపైకి తీసుకువచ్చారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, రేవంత్ రెడ్డి మూలాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయని, ఆయనలొ  ప్రవహిస్తున్నది టీడీపీ రక్తమేనన్న కొండా సురేఖ..  కక్షసాధింపు రాజకీయాలు, వెన్నుపోటు కుట్రలు  తెలుగుదేం రక్తంలోనే ఉన్నాయన్నారు.  తనను టార్గెట్ చేసే క్రమంలో చిన్నారెడ్డిని కూడా రాజకీయంగా బలి చేశారని కొండా సురేఖ ఆరోపంచారు. రక్షా బంధన్ సందర్భంగా తాను స్వయంగా సీఎం నివాసానికి వెళ్లి రాఖీ కట్టానని గుర్తు చేసిన కొండా సురేఖ ఆ సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి   ఈ వివాదం గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదని చెబుతూ సెంటిమెంట్ పండించడానికి ప్రయత్నించారు. తనను కేబినెట్ నుంచి తప్పించే ఆలోచన  కాంగ్రెస్ అధిష్టానానికి లేదనీ, అయితే  కొందరు నేతలు స్వార్థ రాజకీయాల కారణంగానే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు.  కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు అంతర్గతంగా ఏకమై తనపై పెద్ద కుట్ర పన్నారని  ఆరోపించారు. ముఖ్యమంత్రితో వేం నరేందర్ రెడ్డి మైండ్ గేమ్ ఆడిస్తూ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారన్నారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకు గతంలో తాను రాసిన లేఖలను మీడియాకు విడుదల చేశారు.  పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు పంపిన ఆ లేఖల్లో ప్రభుత్వ తీరుపై కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రిగా తనకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని, తన శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలను కూడా తన ప్రమేయం లేకుండానే మంత్రులు, అధికారులు చక్కబెట్టేశారని ఆ లేఖల్లో ఆరోపించారు.    [Konda Surekha Sensational Comments, Revanth Reddy, Congress Government, Telangana Politics, TDP Blood Comments, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్ పాపులర్ యాంకర్ అండ్ వర్సటైల్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ గ్లామరస్ బ్యూటీ పంచుకున్న ఒక ప్రత్యేకమైన డివోషనల్ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తన భావప్రకటనతో వివాదాలకు దూరంగా ఉంటూనే, ఈసారి మరింత ప్రత్యేకమైన భక్తి రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ కృష్ణాష్టమి సందర్బంగా అనసూయ సంప్రదాయబద్ధమైన రాధా దేవి అవతారంలో మెరిసిపోయారు. ఎరుపు రంగు పట్టు చీర ధరించి, డిజైనర్ జ్యువెలరీ మరియు ప్రత్యేకమైన ముస్తాబుతో అలరించారు. కన్నడ భక్తి గీతమైన 'తులసి కోమలవేణి' పాటకు ఆమె చేసిన అభినయం, ఎక్స్‌ప్రెషన్స్ మరియు నృత్య రీతులు అభిమానులను ఎంతగానో కట్టిపడేస్తున్నాయి. అయితే ఈ వీడియో కంటే కూడా ఆమె జోడించిన క్యాప్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. "కృష్ణుడికి అంతా తెలుసు.. నాకు అది చాలు" అంటూ అనసూయ రాసుకొచ్చారు. అంతేకాకుండా శాంతం, నిగ్రహం, పవిత్రత, విశ్వాసం, జ్ఞానం వంటి ఆత్మపరిశీలన పదాలను సైతం ఆమె తన పోస్ట్‌లో ప్రస్తావించారు. గతంలో సనాతన ధర్మం మరియు కొన్ని ఆధ్యాత్మిక అంశాలపై అనసూయ చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద ఎత్తున వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆమె, తాజాగా శ్రీకృష్ణుడి పాటకు రాధగా మారి చేసిన నాట్యం ద్వారా తనపై వచ్చిన విమర్శలన్నింటికీ పరోక్షంగా ఎండ్ కార్డ్ వేసినట్లయిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. టీవీ రంగంలో స్టార్ యాంకర్‌గా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న అనసూయ, 'రంగస్థలం', 'పుష్ప' వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో నటిగా సత్తా చాటారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ఆమె, ఎలాంటి విమర్శలు ఎదురైనా తన వ్యక్తిత్వాన్ని వదులుకోనని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ రాధా-కృష్ణుల కాన్సెప్ట్ వీడియోకు నెటిజన్లు, అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. కృష్ణాష్టమి రోజున ఇంత ఆధ్యాత్మికంగా, అందంగా కనిపించినందుకు నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తుండగా, వివాదాల జోలికి వెళ్లకుండా సైలెంట్‌గా ఇచ్చిన ఈ కౌంటర్ కామెంట్‌పై ఆసక్తికర చర్చ నడుస్తోంది.     [Anasuya Bharadwaj, Anasuya Krishna Dance Video, Janmashtami 2026 Special, Anasuya Instagram Viral Video, Tollywood Celebrities News]
మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ డైరెక్టర్ బాబీ (కె.ఎస్.రవీంద్ర) కలయికలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కాకా' (KAAKA) చిత్రానికి సంబంధించి సాలిడ్ అప్‌డేట్ వెలువడింది. ఇప్పటికే 'వాల్తేరు వీరయ్య'తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ క్రేజీ కాంబోపై సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ అపారమైన అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తదుపరి బిగ్ షెడ్యూల్ సెప్టెంబర్ 7వ తేదీ నుంచి హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను, భారీ యాక్షన్ బ్లాక్‌లను తెరకెక్కించేందుకు దర్శకుడు బాబీ ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి 'సూపర్‌వైజర్ సత్యం'గా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ పాత్రలో అలరించనున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్‌లో చూపించిన మేకింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ అభిమానులకు మైండ్ బ్లాకింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ముగింపులో వచ్చే ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఈ సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవనుందని చిత్రవర్గాల టాక్. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) పతాకంపై వెంకట్ నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటి అనస్వర రాజన్, నివేతా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, కథకు తగ్గట్టుగా అద్భుతమైన నటీనటుల బృందం ఈ ప్రాజెక్ట్‌లో భాగమైంది. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సరికొత్త మాస్ వైబ్‌తో రాబోతున్న ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.     [Chiranjeevi Kaaka Movie, Director Bobby, KVN Productions, Kaaka Hyderabad Schedule, Sankranthi 2027 Release]
  సింగర్ గా, గేయరచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బల్జీత్ సింగ్  తన నివాసంలో శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. పంజాబ్‌లోని లుధియానా జిల్లా పరిధిలో గల సుధార్ పట్టి ధాలివాల్ ఏరియాలో బల్జీత్ సింగ్ నివసిస్తున్నాడు. ఇటీవల ఆయన తల్లిదండ్రులు మరణించడంతో ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. అయితే కొన్ని రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడం, కుటుంబ సభ్యులకు కానీ, స్నేహితులకు కానీ అందుబాటులోకి రాకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. గురువారం ఉదయం ఆయన ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడం గమనించిన స్థానికులు స్థానిక పోలీసులకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీస్ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. ఇంటి తలుపులు తెరిచి చూడగా మంచంపై బల్జీత్ సింగ్ మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. మరణించి దాదాపు 4 నుండి 5 రోజులు అయి ఉండవచ్చని నిరాదరించారు. మృతదేహం పూర్తిగా పాడవడంతో పాటు ఇంటి ప్రాంగణంలో కొన్ని రక్తపు మరకలు  కనిపించడంతో ఈ మృతి వెనుక ఏదైనా కుట్ర లేదా అనుమానాస్పద కోణం ఉందా అనే చర్చ నడిచింది. Also Read: వాళ్ళకోసమే ఓటిటిలు: శివాజీ సంచలన వ్యాఖ్యలు       దీంతో పోలీసులు వెంటనే ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్, సీఐఏ బృందాలను పిలిపించి క్లూస్ సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సివిల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షల నివేదిక ఆధారంగా SHO కుల్విందర్ సింగ్ కీలక విషయాలను వెల్లడించారు. బల్జీత్ సింగ్ గుండెపోటు (హార్ట్ ఎటాక్) కారణంతోనే మరణించినట్లు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. దీంతో  ఆయన మృతిలో ఎలాంటి కుట్ర గానీ, హత్య కోణం గానీ లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బల్జీత్ సింగ్ కి పెళ్లి కాలేదు. వయసు 35 ఏళ్ళు .     [Baljit Singh,  Punjabi singer Baljit Singh, Heart Attack, TeluguCinema, Tollywood, TeluguCinemaNews, Teluguone, TollywoodNews]   
భారతీయ చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు కథనం కంటే కూడా అవి ఎదుర్కొనే వివాదాల వల్లే వార్తల్లో నిలుస్తుంటాయి. కథలో ఉండే బోల్డ్ కంటెంట్ లేదా సమాజంలో చర్చనీయాంశంగా మారే సున్నితమైన అంశాల కారణంగా సెన్సార్ బోర్డ్ ఆంక్షలు ఎదుర్కొన్న చిత్రాలు చాలానే ఉన్నాయి. అటువంటి జాబితాలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది బాలీవుడ్ వివాదాస్పద చిత్రం 'అన్‌ఫ్రీడమ్'. దర్శకుడు రాజ్ అమిత్ కుమార్ తెరకెక్కించిన ఈ డ్రామా మూవీలో స్వలింగ సంపర్కం, ఉగ్రవాదం, మత ఛాందసవాదం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అత్యంత సున్నితమైన విషయాలను సవాలుగా తీసుకుని ఆవిష్కరించారు. 2015లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నించగా, భారతదేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ థియేటర్లలో ప్రదర్శనకు అనుమతి నిరాకరించింది. సినిమాలోని కొన్ని శృంగార సన్నివేశాలు, బోల్డ్ సంభాషణలతో పాటు ఉగ్రవాద నేపథ్యానికి సంబంధించిన ఘట్టాలను తొలగిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డ్ స్పష్టం చేసింది. అయితే సన్నివేశాలను కట్ చేస్తే కథలోని ఆత్మ దెబ్బతింటుందని భావించిన దర్శకనిర్మాతలు, బోర్డ్ సూచించిన మార్పులను చేయడానికి నిరాకరించారు. అప్పీల్ చేసినప్పటికీ థియేట్రికల్ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. థియేటర్లలో విడుదల కాకపోయినప్పటికీ, ఈ చిత్రం అంతర్జాతీయంగా పలు చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భావప్రకటనా స్వేచ్ఛ, సెన్సార్‌షిప్‌పై పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన ఈ మూవీలో విక్టర్ బెనర్జీ, ఆదిల్ హుస్సేన్, ప్రీతి గుప్తా ప్రధాన పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఈ సంచలన చిత్రం ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు డిజిటల్ మాధ్యమంలో ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో, ఓటీటీ వేదికగా 'అన్‌ఫ్రీడమ్' మరోసారి సినీ ప్రియుల్లో హాట్ టాపిక్‌గా మారింది.       [Unfreedom Banned Movie, Unfreedom Netflix OTT, Raj Amit Kumar, Controversial Bollywood Movies, OTT Release Updates]
    శివాజీ సెల్యులాయిడ్ పై పెర్ఫార్మ్  చేస్తుంటే మనకి కూడా అర్జెంటుగా నటుడు కావాలని అనిపిస్తుంది. అంతలా మెస్మరైజ్ చేసే పెర్ఫార్మ్ శివాజీ సొంతం.  సెకండ్ ఇన్నింగ్స్ లో సరికొత్త డైలాగ్ మాడ్యులేషన్ తో దూసుకుపోతున్న శివాజీ ఈ నెల 11 న  ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన 'ఎపిక్' తో మరో సారి సెల్యులాయిడ్ పై సందడి చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో ఓటిటి లపై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.   శివాజీ మాట్లాడుతు  ఓటీటీలు కేవలం సోమరిపోతుల కోసమేనని, అవి థియేటర్లలో లభించే అసలైన సినిమాటిక్ అనుభవాన్ని హరించివేస్తున్నాయి. సినిమా అంటే కేవలం ఒక కథని చూడటం మాత్రమే కాదు. పెద్ద స్క్రీన్, శక్తివంతమైన సౌండ్ సిస్టమ్, పక్కనున్న వందలాది మంది ప్రేక్షకుల రెస్పాన్స్, థియేటర్ వాతావరణం అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన ఎనర్జీని ఇస్తాయి.ఇంట్లో టీవీలు లేదా మొబైల్ ఫోన్లలో పాజ్ చేసుకుంటూ సినిమాలు చూస్తే ఆ అసలైన అనుభూతి దక్కదని చెప్పుకొచ్చాడు. Also read: హఠాత్తుగా విజయ్ లండన్ ప్రయాణం.. ఆమెతో రాజీ కోసమా, లేక!       శివాజీ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం ప్రేక్షకులు శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తూ, బిగ్ స్క్రీన్ అనుభవాన్ని కాపాడుకోవాలనే ఆవేదనతోనే ఆయన అలా మాట్లాడారని అంటుంటే, మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. పెరిగిన టికెట్ ధరలు, పాప్‌కార్న్ రేట్లు మరియు కుటుంబంతో థియేటర్‌కు వెళ్తే అయ్యే ఖర్చుల వల్ల సామాన్యులు ఓటీటీలను ఆశ్రయిస్తున్నారని, అలాంటి వారిని సోమరిపోతులు అనడం సరికాదని నెటిజన్లు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు.       [Sivaji, Epic movie promotions, ott, TeluguCinema, Tollywood, TeluguCinemaNews, Teluguone, TollywoodNews]
జయశ్రీ మీడియా సమర్పణలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కృష్ణంభజే’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కలాల్ శ్రీనివాస్ నిర్మాణంలో నాగరాజ్ కొట్టే ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ న‌టుడు బ్రహ్మాజీ  మార్కండేయ పాత్రను పోషిస్తున్నారు. కృష్ణాష్టమి కానుకగా బ్రహ్మాజీ  'కృష్ణంభ‌జే' ఫస్ట్ లుక్‌ను సోష‌ల్ మీడియాలో లాంచ్ చేశారు. పోస్ట‌ర్‌లో బ్రహ్మాజీ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. బ్రహ్మాజీ మార్కండేయుడి గెటప్‌లో ఆకట్టుకుంటున్నారు. కాషాయ వస్త్రధారణ, రుద్రాక్ష మాలలు, నుదుటిపై విభూతి, చేతిలో యోగ దండంతో ఆయన లుక్‌ ప్రత్యేకంగా నిలుస్తోంది. భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతిబింబంగా కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. పౌరాణిక, భక్తిరస అంశాలను మేళవిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగరాజ్ కొట్టే రచనతో పాటు దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథకు అనుగుణంగా ప్రత్యేకమైన పాత్రలు, ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో మురళీ గౌడ్, రచ్చ రవి, అభయ్ బెతిగంటి, గౌతమ్ రాజు, దయానంద్ రెడ్డి, యాదమ్మ రాజు తదితరులు కీల‌క‌ పాత్రల్లో నటిస్తున్నారు. హీరోగా ప్రదీష్, హీరోయిన్‌గా వంగమయి పటేల్ నటిస్తున్నారు. రచ్చ రవి డైలాగ్స్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ‘కృష్ణంభజే’కు సంబంధించిన మరిన్ని వివరాలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలను త్వరలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.       [Krishnam Bhaje Movie, Actor Brahmaji, Markandeya Look, Krishna Janmashtami, Telugu Film News, Telugu News]  
    సినిమాకి ఉన్న కెపాసిటీ తెలియచేస్తూ ఇళయదళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంలో రాయల్టీగా కూర్చున్న విషయం తెలిసిందే. దీంతో స్వపక్షం, ప్రతిపక్షం వల్ల సోషల్ మీడియాలో నిత్యం విజయ్ కి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజా న్యూస్ విజయ్ ఓల్డ్ న్యూస్ అన్నింటిని పక్కకి నెట్టేసి మై హునా అంటుంది.  Also Read: Rambha Oorvasi Menaka Movie Review: రంభ, ఊర్వశి, మేనక మూవీ రివ్యూ  తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత విజయ్  ఫస్ట్ టైం ఈ నెల 10 న విదేశీ ప్రయాణం చేస్తున్నాడు.  బ్రిటన్ రాజధాని లండన్ నగరంలో ల్యాండ్ అవ్వబోతున్నాడు. పెట్టుబడులు తెచ్చేందుకే మా సార్ వెళ్తున్నారు అంటూ అభిమానులు, పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో మరో వాదన కూడా వినపడుతుంది. విజయ్ వైఫ్ సంగీత మొన్న ఆగస్టులో కోర్టుకెళ్లి సైలెంట్‌గా  విడాకుల పిటిషన్‌ వెనక్కి తీసుకుంది.  ఆ కేసు క్లోజ్ అయి నెల రోజులు కూడా గడవక ముందే  విజయ్  లండన్ వెళ్తున్నాడు. ప్రస్తుతం సంగీత లండన్‌లోనే సెటిల్ అయ్యింది. కాబట్టి ఈ టూర్ వెనుక అసలు స్క్రిప్ట్ ‘పెట్టుబడులు’ కాదని, భార్యామణిని కలవడానికి అనే న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.     [ Vijay, Sangeetha, Tollywood, TeluguCinema, TeluguCinema News, Tollywood News]          
కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సూర్య కెరీర్ ప్రస్తుతం సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆయన తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 50వ చిత్రాన్ని లాక్ చేసినట్లు తెలుస్తోంది. సినీ ప్రేమికులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సన్సేషనల్ కాంబినేషన్‌లో ఈ ల్యాండ్‌మార్క్ మూవీ రూపుదిద్దుకోనుండటంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా బజ్ నెలకొంది. కమల్ హాసన్ బ్లాక్‌బస్టర్ హిట్ 'విక్రమ్' క్లైమాక్స్‌లో కొన్ని నిమిషాల పాటు 'రోలెక్స్'గా కనిపించి సూర్య చేసిన విధ్వంసం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ క్యారెక్టర్ సృష్టించిన ఇంపాక్ట్ ఆధారంగా లోకేష్ కనగరాజ్ ఒక స్టాండ్‌అలోన్ ‘రోలెక్స్’ సినిమా తీయాలని ప్లాన్ చేశారు. సరిగ్గా ఈ వైలెంట్ యాక్షన్ డ్రామానే సూర్య 50వ ప్రాజెక్ట్‌గా పట్టాలెక్కించేందుకు లోకేష్ స్క్రిప్ట్ పనులను ముమ్మరం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సూర్య చేతిలో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లు లైన్‌లో ఉన్నాయి. జితు మాధవన్ కాంబినేషన్‌లో వస్తున్న 'సూర్య 47', అలాగే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'సూర్య 48' పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటి తర్వాత హెచ్. వినోద్‌తో 'సూర్య 49' ప్రకటన రానుంది. వీటిన్నింటినీ పూర్తి చేసిన వెంటనే లోకేష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. లోకేష్ కనగరాజ్ కూడా తన ప్రణాళికలను వేగవంతం చేస్తున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో భాగమైన ఈ 'రోలెక్స్' చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో ఆవిష్కరించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ ల్యాండ్‌మార్క్ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అవ్వడంతో మెగా అభిమానులతో పాటు యాక్షన్ లవర్స్ ఖుషీ అవుతున్నారు. సూర్య-లోకేష్ కాంబోలో రాబోయే ఈ వైలెంట్ అండ్ క్లాసీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.       [Suriya 50, Lokesh Kanagaraj, Rolex Standalone Movie, Suriya Upcoming Movies, LCU Movie Updates]
నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్'. ‘ప్రేమలు’ సినిమాతో మళయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిన డైరెక్టర్ గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇప్పటికే మలయాళంలో విడుదలై రూ. 200 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్.. ఇప్పుడు తెలుగు వెర్షన్ లో థియేటర్లలో విడుదలైంది. మరి ఈ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం. కథ: జస్టిన్ (నివిన్ పౌలీ) ఒక క్యాటరింగ్ సర్వీస్ నడుపుతుంటాడు. గతంలో ఒక విషాదకరమైన ప్రేమకథ తర్వాత 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా, తన తమ్ముడు (సంగీత్ ప్రతాప్), స్నేహితులతో కలిసి సరదాగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. మరోవైపు, తండ్రి తాగుడు అలవాటు వల్ల ఊరు మారి వచ్చిన ఆష్లీ (మమితా బైజు) కుటుంబం జస్టిన్ ఇంటి పక్కనే అద్దెకు దిగుతుంది. వీరిద్దరి మధ్య స్థానిక చర్చికి చెందిన ప్రార్థనా బృందం 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' ద్వారా పరిచయం ఏర్పడుతుంది. కాలేజీ చదువుకునే 20 ఏళ్ల జెన్-జీ అమ్మాయి ఆష్లీ, 90s కిడ్ అయిన జస్టిన్ మధ్య ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అయితే వీరిద్దరికి 13 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంటుంది. కుటుంబం, సమాజం ఏమంటారో అని తమ ప్రేమను దాచడానికి వీరు పడే తాపత్రయం, ఆ తర్వాత పెద్దలకు తెలిసాక జరిగే పరిణామాలు ఏంటి అనేదే ఈ చిత్ర కథాంశం. విశ్లేషణ: ఒక సింపుల్ పాయింట్‌తో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను థియేటర్లలో ఎంటర్టైన్ చేయడం అంత తేలికైన విషయం కాదు. కానీ డైరెక్టర్ గిరీష్ ఏడీ తన మార్క్ మేజిక్‌తో దాన్ని చేసి చూపించారు. ఎక్కడా ఎంబారసింగ్‌గా లేకుండా, న్యాచురల్ కామెడీతో ఫస్ట్ హాఫ్ అంతా పరుగులు పెట్టించారు. ముఖ్యంగా జస్టిన్ ఏజ్ గురించి వచ్చే కౌంటర్లు, జస్టిన్ చెల్లెళ్లతో ఆష్లీ చేసే లేడీస్ డ్రింకింగ్ పార్టీ ఎపిసోడ్, అలాగే తమ్ముడి షార్ట్ ఫిలిం గోల థియేటర్లలో గట్టిగా నవ్వులు పూయిస్తాయి. గిరీష్ ఏ.డి అందించిన వన్-లైనర్స్, సిట్యుయేషనల్ కామెడీ ఈ సినిమాకు మెయిన్ అసెట్. ‘ప్రేమలు’ ఎంత ఫ్రెష్ ఫీల్ ఇచ్చిందో, ఇందులో కూడా ప్రతి ఐదు నిమిషాలకు ఒక సాలిడ్ హ్యూమర్ బ్లాక్ వర్కవుట్ అయింది. సినిమాలోని ప్రతి పాత్ర, ప్రతి డైలాగ్ మనం నిజజీవితంలో కనెక్ట్ చేసుకునేలా ఉంటాయి. అయితే, సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్‌లో స్పీడ్ కాస్త తగ్గుతుంది. మలయాళ సినిమాల్లో సహజంగా ఉండే కొన్ని సబ్‌ప్లాట్స్, అనవసరమైన డ్రాగ్ సీన్స్ వల్ల నిడివి కాస్త ఎక్కువైన భావన కలుగుతుంది. ప్రీ క్లైమాక్స్ కూడా కాస్త సాగదీతగా అనిపించినప్పటికీ, క్లైమాక్స్ మాత్రం మెప్పిస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: నివిన్ పౌలీ జస్టిన్ పాత్రలో చాలా సహజంగా ఒదిగిపోయారు. తనలోని వింటేజ్ కామెడీ టైమింగ్‌ని మళ్లీ గుర్తుచేశారు. ఇక మమితా బైజు అయితే స్క్రీన్ మీద మరోసారి మాయ చేసింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. నివిన్-మమితల మధ్య ఉన్న ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇక 'ప్రేమలు' ఫేమ్ సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్ కనిపించిన ప్రతిసారీ తమ కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. విష్ణు విజయ్ అందించిన సంగీతం కథలోని ఫీల్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. కేరళ అందాలను ప్రశాంతమైన పెయింటింగ్‌లా చూపించిన అజ్మల్ సాబు కెమెరా వర్క్ ఎంతో ప్లెజెంట్‌గా ఉంటుంది. ఆకాష్ జోసెఫ్ ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. తెలుగు డబ్బింగ్ రైటింగ్ బాగుంది. మన నేటివిటీకి తగ్గట్టుగా పంచ్ డైలాగ్స్ కుదిరాయి. ఫైనల్ గా.. కుటుంబం మొత్తం కలిసి హాయిగా నవ్వుకునేలా రూపొందించిన ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ‘ప్రేమలు’ టైప్ ఫ్రెష్ అండ్ క్లీన్ హ్యూమర్‌ని కోరుకునే వారికి ఇది నచ్చుతుంది.   Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.       [Bethlehem Kudumba Unit Review Telugu, BKU Telugu Review, Nivin Pauly, Mamitha Baiju, Girish AD, Premalu Director, Telugu Cinema Review, Telugu Movie Review]  
టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ ప్రస్తుత చిత్ర పరిశ్రమ తీరుపై, అలాగే సెన్సార్ బోర్డు వ్యవహార శైలిపై ఘాటుగా స్పందించారు. ఇటీవల వస్తున్న కొన్ని సినిమాల కంటెంట్, వాటి వల్ల సమాజంపై పడుతున్న ప్రతికూల ప్రభావం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా చిత్రాలను తెరకెక్కిస్తున్న మేకర్స్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. సినిమా అంటే ఒకప్పుడు కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి హాయిగా ఆస్వాదించే వాతావరణం ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సుమన్ ఆవేదన చెందారు. ఇంట్లోని సభ్యులు విడివిడిగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాల్సిన దుస్థితి దాపురించిందని, అలాంటి అసభ్యకర, హింసాత్మక కంటెంట్‌ను థియేటర్లలోకి అనుమతిస్తున్న సెన్సార్ బోర్డు అసలు ఏం చేస్తోందో అర్థం కావడం లేదని నిలదీశారు. ఇప్పటికే చిన్నారులు, యువత చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు చేరి, సోషల్ మీడియా ప్రభావంతో దారి తప్పుతున్నారని సుమన్ గుర్తుచేశారు. ఇలాంటి సున్నితమైన సమయంలో సినిమాల ద్వారా మరింత వికృతమైన ఆలోచనలను ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల పేరుతో కొంతమంది సమాజాన్ని నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. సినిమా అనేది సమాజంలో ఎంతోమందిని ప్రభావితం చేయగల అత్యంత శక్తివంతమైన సాధనమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను మార్చే సామర్థ్యం వెండితెరకు ఉందన్నారు. మంచి వేల్యూస్, సమాజానికి మేలు చేసే సందేశాలు, మానవ అనుబంధాలను పెంపొందించే కథలతో సినిమాలు తీస్తే సమాజంలో ఎంతో మంచి మార్పు తీసుకురావచ్చని తెలిపారు. కేవలం బాక్సాఫీస్ కలెక్షన్లు, వ్యాపార దృక్పథమే ధ్యేయంగా కాకుండా, సామాజిక బాధ్యతతో కథలను ఎంచుకోవాలని దర్శకనిర్మాతలకు సుమన్ విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో అయినా సెన్సార్ బోర్డు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి, మంచి చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలని ఆయన ఆకాంక్షించారు.     [Actor Suman, Censor Board, Current Telugu Movies, Suman Sensational Comments, Tollywood News Updates]
నేటి ఆధునిక డిజిటల్ యుగంలో చిన్న పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఇంట్లో పిల్లలు ఏడుపు ఆపడానికైనా, రచ్చ చేయకుండా సమయానికి అన్నం తినిపించడానికైనా చాలామంది తల్లిదండ్రులు వెంటనే సులువైన మార్గంగా తమ చేతిలోని స్మార్ట్‌ఫోన్ తీసి పిల్లల చేతిలో పెట్టడం లేదా టీవీలో కలర్‌ఫుల్ కార్టూన్లు పెట్టడం సర్వసాధారణమైన అలవాటుగా మారిపోయింది. కానీ, ఈ అలవాటు మీ పిల్లల భవిష్యత్తును తీవ్రమైన ప్రమాదంలోకి నెడుతోందని పిల్లల వైద్య నిపుణులు మరియు తాజా అధ్యయనాలు స్పష్టమైన హెచ్చరికలు చేస్తున్నాయి. ముఖ్యంగా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లల్లో అధికంగా ఉండే ఈ స్క్రీన్ టైమ్ వారి శారీరక, మానసిక వికాసంపై అత్యంత ప్రతికూల ప్రభావం చూపుతోందని నూతన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ అధ్యయనం ప్రకారం చిన్నతనంలో పిల్లలు అధికంగా డిజిటల్ స్క్రీన్లు చూడటం వల్ల కలిగే ప్రధాన నష్టాల్లో మొదటిది మాటలు రావడం తీవ్రంగా ఆలస్యం కావడం. సాధారణంగా 0 నుండి 6 ఏళ్ల వయస్సులో పిల్లలు తమ చుట్టూ ఉన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మాట్లాడే మాటలు, వారి ముఖ కవళికలు మరియు హావభావాలను నిశితంగా గమనిస్తూ సహజంగా భాషను నేర్చుకుంటారు. అయితే నిరంతరం స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్ డిస్‌ప్లే వైపే చూస్తుండటం వల్ల అక్కడ కేవలం ఏకపక్ష సమాచారం మాత్రమే జరుగుతుంది. దీనివల్ల సంభాషణ కొరవడి, పిల్లల్లో సకాలంలో మాటలు రాకపోవడం మరియు భాషా నైపుణ్యాలు పూర్తిగా లోపించడం జరుగుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరొక తీవ్రమైన సమస్య పిల్లల మానసిక వికాసం మందగించడం మరియు శ్రద్ధ లోపించడం. నిరంతరం డిజిటల్ స్క్రీన్ల చిత్ర విచిత్రమైన వెలుగులు చూడటం వల్ల పిల్లల మెదడు అభివృద్ధి వేగం తగ్గుతుంది. వారు ఏ ఒక చిన్న విషయంపైనా ఎక్కువ సేపు దృష్టి కేంద్రీకరించలేరు. అంతేకాకుండా, వారి చేతిలో ఉన్న ఫోన్‌ను అనుకోకుండా లాక్కుంటే విపరీతమైన కోపం ప్రదర్శించడం, చిరాకు పడటం, గట్టిగా ఏడవడం మరియు మొండితనం చూపించడం వంటి మానసిక వైపరీత్యాలకు గురవుతున్నారు. దీంతో పాటు డిజిటల్ சாதனాల నుండి వెలువడే ప్రమాదకర నీలి కాంతి (Blue Light) పిల్లల లేత కంటి చూపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. చాలా చిన్న వయస్సులోనే సైట్ రావడం, కళ్లు పొడిబారడం వంటి తీవ్రమైన శారీరక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నీలి కాంతి మెదడులో నిద్రకు సహకరించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని భారీగా తగ్గిస్తుంది, దీనివల్ల పిల్లలు రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రపోక తీవ్ర నిద్రలేమితో బాధపడుతున్నారు. బయటకు వెళ్లకుండా, ఆటలు ఆడకుండా ఒకే చోట గంటల తరబడి కూర్చుని ఫోన్ చూడటం వల్ల 6 ఏళ్ల లోపు పిల్లల్లో ఊబకాయం మరియు శారీరక బలహీనత వంటి సమస్యలు రాపిడ్‌గా పెరుగుతున్నాయి.       smartphone dangers toddlers study,speech delay kids screen time.
ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న శరీర బరువు, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే మొండి కొవ్వు ప్రతి ఒక్కరినీ తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్య. ఈ జిడ్డు కొవ్వును కరిగించుకోవడానికి, బరువు తగ్గి సన్నబడటానికి చాలామంది ఎన్నో రకాల వ్యాయామాలు, కఠినమైన డైటింగ్ పద్ధతులు అనుసరిస్తుంటారు. అయితే, అతి సులువైన మరియు ప్రాచుర్యం పొందిన గృహ చిట్కాలలో బ్లాక్ కాఫీ తాగడం ఒకటిగా మారింది. పాలు, చక్కెర మరియు ఎటువంటి స్వీట్నర్లు లేకుండా కేవలం వేడి నీటితో మాత్రమే తయారుచేసే ఈ బ్లాక్ కాఫీ నిజంగానే పొట్ట కొవ్వును కరిగించడంలో ఎంతవరకు సహాయపడుతుంది, దీని వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ రహస్యాలు ఏమిటి మరియు ఇది తాగేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన ఆరోగ్య నియమాలు ఏమిటో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. అసలు బ్లాక్ కాఫీ బరువు తగ్గించడంలో ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే అందులోని కేలరీలు మరియు కెఫిన్ పాత్రను తెలుసుకోవాలి. సాధారణ బ్లాక్ కాఫీలో కేలరీలు దాదాపు శూన్యం. మనం తాగే బ్లాక్ కాఫీలోని కెఫిన్ శరీరంలోని మెటబాలిజం రేటును లేదా జీవక్రియ వేగాన్ని గణనీయంగా పెంచుతుంది. మన జీవక్రియ వేగవంతం కావడం వల్ల శరీరం విశ్రాంతిగా ఉన్న సమయంలో లేదా సాధారణ పనులు చేసుకుంటున్నప్పుడు కూడా ఎక్కువ కేలరీలను వేగంగా బర్న్ చేయగలుగుతుంది. ఇది బరువు తగ్గడానికి ప్రాథమిక పునాదిగా పనిచేస్తుంది. దీనికితోడు, బ్లాక్ కాఫీలో 'క్లోరోజెనిక్ ఆసిడ్' అనే అత్యంత శక్తివంతమైన ముఖ్యాంశ కాంపౌండ్ లభిస్తుంది. ఈ క్లోరోజెనిక్ ఆసిడ్ శరీరంలో కొత్తగా గ్లూకోజ్ ఉత్పత్తి కాకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరం కొత్తగా కొవ్వును తయారు చేసుకోకుండా అడ్డుకోవడమే కాకుండా, ఇప్పటికే కణజాలాల్లో పేరుకుపోయిన పాత కొవ్వును వేగంగా కరిగించి శక్తిగా మార్చడంలో ఇది అద్భుతంగా తోడ్పడుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో బ్లాక్ కాఫీ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆకలిని సమర్థవంతంగా నియంత్రించడం. బ్లాక్ కాఫీ తాగిన వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది అకస్మాత్తుగా వచ్చే ఆకలి కోరికలను తగ్గిస్తుంది మరియు సమయానికి మించి ఆహారాన్ని అమితంగా తినకుండా అరికడుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో అన్-హెల్దీ స్నాక్స్ తినే అలవాటు ఉన్నవారు, ఆ సమయంలో ఒక కప్పు బ్లాక్ కాఫీ తీసుకుంటే కేలరీల వినియోగం చాలావరకు తగ్గుతుంది. అంతేకాకుండా, మీరు వ్యాయామం లేదా జిమ్ వర్కౌట్ చేయడానికి సరిగ్గా 30 నిమిషాల ముందు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి మరియు అదనపు స్టామినా లభిస్తాయి. ఇది వ్యాయామం చేసే సమయంలో కండరాల అలసటను తగ్గించి, శరీరం వేగంగా కొవ్వును బర్న్ చేసేలా ప్రోత్సహిస్తుంది.       does black coffee burn belly fat,black coffee health benefits telugu.  
  మనదేశంలో చాలామందికి ఉదయాన్నే లేవగానే వేడివేడిగా ఒక కప్పు టీ పడాల్సిందే. అలసటను పారద్రోలి శరీరానికి, మనస్సుకు తక్షణ ఉత్సాహాన్ని ఇవ్వడంలో టీ కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు ఒకటి రెండు కప్పుల టీ తాగడం సాధారణ అలవాటు అయినప్పటికీ, చాలామంది రోజులో పదే పదే టీ తాగుతుంటారు. అయితే, ఇలా పరిమితికి మించి ఎక్కువ మొత్తంలో టీ తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయని, శరీరంలో కాల్షియం స్థాయిలు గణనీయంగా పడిపోతాయని సోషల్ మీడియాలో నిరంతరం వార్తలు ప్రచారమవుతుంటాయి. ఈ ప్రచారం వినగానే టీ ప్రేమికుల్లో తీవ్ర ఆందోళన మొదలవుతుంది. అసలు టీ తాగడానికి, ఎముకల ఆరోగ్యానికి మధ్య ఉన్న అసలు సంబంధం ఏమిటి? అతిగా టీ తాగడం వల్ల ఎముకల సాంద్రత తగ్గి ఆస్టియోపోరోసిస్ వంటి ప్రమాదకర సమస్యలు వస్తాయా? ఈ విషయాలపై వైద్య నిపుణులు మరియు పరిశోధకులు వెల్లడించిన శాస్త్రీయ నిజాలను వివరంగా తెలుసుకోవడం ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. పరిశోధనల ప్రకారం టీలో  కెఫిన్  అనే సమ్మేళనం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ప్రతి కప్పు టీలో దాదాపు 30 నుండి 50 మిల్లీగ్రాముల వరకు కెఫిన్ ఉంటుంది. మనం అధిక మొత్తంలో కెఫిన్ తీసుకున్నప్పుడు, అది మూత్రపిండాల (కిడ్నీల) ద్వారా శరీరంలోని కాల్షియం మూత్రం రూపంలో బయటకు విసర్జించబడేలా చేస్తుంది. సాధారణంగా మనం ప్రతి 60 మిల్లీగ్రాముల కెఫిన్ తీసుకున్నప్పుడు, శరీరం నుండి సుమారు 1 నుండి 2 మిల్లీగ్రాముల కాల్షియం నష్టపోతామని వైద్య అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే రోజుకు 4 నుండి 5 కప్పుల కంటే ఎక్కువ మోతాదులో టీ తాగే వారిలో కాల్షియం లోపం ఏర్పడే అవకాశాలు స్వల్పంగా పెరుగుతాయి. ముఖ్యంగా, మనం తీసుకునే రోజువారీ ఆహారంలో కాల్షియం శాతం తక్కువగా ఉన్నప్పుడు, ఈ కెఫిన్ ప్రభావం ఎముకల ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంది. ఎముకల నుండి కాల్షియం కరిగిపోవడం వల్ల వయసు పెరిగే కొద్దీ ఎముకలు లొసుగుబారి, త్వరగా విరిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అయితే ఇక్కడే మరొక ఆసక్తికరమైన సైంటిఫిక్ కోణం దాగి ఉంది. టీలో కేవలం కెఫిన్ మాత్రమే కాకుండా  ఫ్లేవనాయిడ్లు  (Flavonoids) మరియు  ఫైటోఈస్ట్రోజెన్లు  అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల క్షీణతను అడ్డుకోవడంలో మరియు ఎముకల సాంద్రతను (Bone Mineral Density) మెరుగుపరచడంలో ఎంతో సాయపడతాయి. ముఖ్యంగా గ్రీన్ టీ మరియు బ్లాక్ టీలలో ఉండే పాలిఫెనాల్స్ అనే కాంపౌండ్లు ఎముకలను పునర్నిర్మించే  ఆస్టియోబ్లాస్ట్  కణాల పనితీరును వేగవంతం చేస్తాయని, అదే సమయంలో ఎముకలను కరిగించే  ఆస్టియోక్లాస్ట్  కణాల చర్యలను అదుపు చేస్తాయని రీసెర్చ్‌లో తేలింది. కాబట్టి మిితంగా అంటే రోజుకు 2 నుండి 3 కప్పుల టీ తాగే వారిలో ఎముకలు బలహీనపడటం అటుంచి, పైగా ఎముకల ఆరోగ్యం మరింత బలపడుతుందని బహుళ అధ్యయనాలు నిరూపించాయి. మరి టీ తాగే అలవాటు ఉన్నవారు ఎముకల బలాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటిది టీ తాగే పరిమాణాన్ని రోజుకు 2 లేదా 3 కప్పులకు పరిమితం చేసుకోవడం చాలా మంచిది. రెండవది, టీ చేసేటప్పుడు అందులో తగినంత పాలు ఉపయోగించడం వల్ల, టీ ద్వారా కోల్పోయే స్వల్ప కాల్షియంను పాలలోని ఉత్కృష్టమైన కాల్షియం భర్తీ చేస్తుంది. భోజనం చేసిన వెంటనే లేదా ఐరన్, కాల్షియం సప్లిమెంట్లు తీసుకునే సమయంలో టీ తాగకపోవడం ఉత్తమం, ఎందుకంటే టీలోని టాన్సిన్లు పోషకాల శోషణను అడ్డుకుంటాయి. మీ రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు, ఆకుకూరలు, రాగులు మరియు విటమిన్ డి లభించే పదార్థాలను సమృద్ధిగా చేర్చుకుంటే టీ వల్ల ఎముకలకు ఎలాంటి నష్టం జరగదు. కాబట్టి టీని పరిమితంగా, సరైన పద్ధతిలో ఆస్వాదిస్తే ఆరోగ్యానికి ఎలాంటి భయం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. How much tea is safe for bones,tea and bone health myths vs reality.
  అల్లం అనేది మన ప్రాచీన వంటకాల్లోనూ, ఆయుర్వేదంలోనూ ఎంతో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్న ఒక సహజమైన ఔషధం. అజీర్ణం గా ఉన్నప్పుడు, వాంతులు అవుతున్నప్పుడు, దగ్గు, జలుబు లాంటి సమస్యలు ఎదురైనప్పుడు అల్లాన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఇక వంటింట్లో కూరల్లోనూ, మసాలా తయారీలోనూ అల్లాన్ని వాడుతుంటారు. ఇలా కాకుండా  ప్రతిరోజూ ఒక చిన్న అల్లం ముక్కను నమిలి మింగడం అలవాటు చేసుకుంటే  ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే విషయంపై ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అవేంటో తెలుసుకుంటే..  అల్లం ప్రభావం..  వరసగా రెండు నెలలు, అంటే అరవై రోజుల పాటు రోజూ క్రమం తప్పకుండా ఒక చిన్న అల్లం ముక్కను నమలడం వల్ల మన శరీరంలో శ్వాసకోశ వ్యవస్థ నుండి జీర్ణవ్యవస్థ వరకు అనేక సానుకూల మార్పులు కనిపిస్తాయి. శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం , ఉపశమనం.. రోజు ఒక చిన్న అల్లం ముక్క నమలడం వల్ల గొంతులో ఏర్పడే అసౌకర్యం, మంట క్రమంగా తగ్గుతాయి. ఊపిరితిత్తులకు వెళ్లే గాలి మార్గాలను ఇది సడలించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. సుమారు ఆరు నుండి ఎనిమిది వారాల పాటు ఈ అలవాటును కొనసాగించడం వల్ల దగ్గు తీవ్రత గణనీయంగా తగ్గుతుంది.  గాలిలో దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల గొంతు , శ్వాసనాళాల్లో కలిగే మంటను అల్లం తగ్గిస్తుంది. అల్లంలోని సహజ సిద్ధమైన వేడి చేసే గుణం ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని లేదా శ్లేష్మాన్ని పలచబడేలా చేస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తుల నుండి కఫం సులువుగా బయటకు వచ్చేస్తుంది. ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, రొంప, , చిన్న శ్వాస సమస్యల నుండి ఇది ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఆస్తమా లేదా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు అల్లాన్ని  కేవలం  ఒక సహాయక పదార్థంగా మాత్రమే ఉపయోగించాలి తప్ప, వైద్యులు సూచించిన మందులకు ప్రత్యామ్నాయంగా తీసుకోకూడదు. జీర్ణవ్యవస్థ మెరుగుదల.. రోజువారీ ఆహారంలో అల్లాన్ని భాగం చేసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఎవరికి మంచిది కాదు?  అల్లం నమలడం చాలా మంచిదే అయినప్పటికీ, కొందరి విషయంలో ఇది ప్రతికూల ప్రభావాలను చూపవచ్చు. అల్లాన్ని పరిమితికి మించి ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే నోటిలో మంట లేదా పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. సున్నితమైన జీర్ణాశయం ఉన్నవారికి లేదా కడుపులో మంట, ఆసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిటిస్ ఉన్నవారికి రోజూ పచ్చి అల్లం నమలడం వల్ల కడుపులో అసౌకర్యం పెరగవచ్చు. రక్త ప్రసరణను పలచబరిచే మందులు  వాడేవారు కూడా అల్లాన్ని అధికంగా తీసుకోకూడదు, ఎందుకంటే అల్లానికి కూడా రక్తాన్ని పలచబరిచే స్వభావం కొంతవరకు ఉంటుంది. తీసుకోవాల్సిన పరిమాణం , జాగ్రత్తలు..  అల్లం ఆరోగ్యానికి మంచిదే అయినా తీసుకోవలసిన పరిమాణం చాలా ముఖ్యం. మన బొటనవేలి పరిమాణంలో ఉన్న ఒక చిన్న అల్లం ముక్క లేదా రెండు చిన్న పలచటి ముక్కలు సరిపోతాయి. ఒకవేళ పచ్చి అల్లం నమలడం వల్ల కడుపులో మంటగా అనిపిస్తే, దానిని నేరుగా నమలకుండా గోరువెచ్చని నీటిలో అల్లం రసం లేదా అల్లం ముక్కలు వేసి మరిగించి ఆ నీటిని తాగడం మంచిది. అల్లం అనేది శారీరక ఆరోగ్యానికి మేలు చేసే   ఒక మంచి ఆహార పదార్థం మాత్రమే గానీ, ఏ రోగానికీ పూర్తి స్థాయి చికిత్స లేదా నివారణ కాదు. తరచూ ఆయాసం రావడం, ఎడతెగని తీవ్రమైన దగ్గు ఉండటం, లేదా గుండెలో  నొప్పి వంటివి  ఉన్నట్లయితే, అల్లంపై మాత్రమే ఆధారపడకుండా వెంటనే  వైద్యులను కలిసి సరైన పరీక్షలు చేయించుకోవాలి.                             *రూపశ్రీ.  
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం. ట్రికట చూర్ణం, ధనియాల పొడి, పసుపు పొడి వంటి మూడు పదార్థాలను సరైన మోతాదులో ఎలా కలపాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? రోజులో ఏ సమయంలో తీసుకుంటే మంచిది? వంటి విషయాలను ఈ వీడియోలో సులభంగా వివరించారు. థైరాయిడ్‌కు సంబంధించిన సమస్యల్లో ఇంటి చిట్కాలను పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. ఇప్పటికే థైరాయిడ్ మందులు వాడుతున్నవారు వైద్యుల సూచన లేకుండా మందులను ఆపకండి లేదా మార్చకండి. థైరాయిడ్ ఆరోగ్యం, ఆయుర్వేద చిట్కాలు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health‌ను ఫాలో అవ్వండి. Disclaimer: ఈ వీడియోలోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు.  
అన్ని జీవరాశులకు ఆహారమే శక్తినవనరు. అయితే మనిషికి మాత్రం ఆహారంలో ఎన్నో ఛాయిస్ లు ఉన్నాయి. కానీ  ఏది పడితే అది, ఎలా పడితే అలా తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. కొందరు అనారోగ్యం చేసినప్పుడు లేదా కొన్ని రకాల ట్రీట్మెంట్ లలో ఉన్నప్పుడు పత్యం చేయమని చెబుతారు.   పత్యం ఆహారంలో ఉన్నప్పుడు వంకాయను తినకూడదని చెబుతూ ఉంటారు.  సాధారణంగా  సాంప్రదాయ ఆయుర్వేదం, నాటు వైద్యంలో కొన్నిరకాల అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి వంకాయ తినకూడదని సిఫారసు చేస్తారు.  సాధారణ రోజుల్లో వంకాయ రుచికరమైన, పోషకాలున్న కూరగాయ అయినప్పటికీ, పత్యం వేళల్లో దీనిని మినహాయించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వంకాయను పత్యం ఉన్నప్పుడు ఎందుకు తీసుకోకూడదో వివరంగా తెలుసుకుంటే.. వంకాయ.. వంకాయను ఆయుర్వేదంలో వాత, పిత్త దోషాలను పెంచే ఆహారంగా పరిగణిస్తారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఉన్నప్పుడు లేదా రోగ నివారణకు పత్యం ఉంటున్నప్పుడు వంకాయ తింటే వాత దోషం పెరిగి నొప్పులు, జాయింట్లలో ఇబ్బందులు వస్తాయి. వంకాయ విత్తనాల్లో , తోలులో కొన్ని రకాల సహజ కాంపౌండ్లు ఉంటాయి. ఇవి సున్నితమైన చర్మం ఉన్నవారిలో, లేదా ఇప్పటికే దద్దుర్లు, దురదలు, అలర్జీలతో బాధపడుతున్న వారిలో సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. ఔషధాల ప్రభావం సరిగ్గా పనిచేయాలన్నా చర్మ సంబంధిత పత్యంలో వంకాయకు దూరంగా ఉండాలి. వంకాయ అరుగుదలకు కాస్త సమయం తీసుకుంటుంది. శరీరంలో అనారోగ్యం ఉన్నప్పుడు జీర్ణక్రియ మందగిస్తుంది. అటువంటి సమయంలో సులభంగా అరగని వంకాయను తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో ఎక్కడైనా గాయాలు, పుండ్లు ఉన్నప్పుడు లేదా శస్త్రచికిత్సలు జరిగినప్పుడు నాటు వైద్యంలో ప్రత్యేక పత్యం సూచిస్తారు. వంకాయ శరీరంలో వేడిని,   దురదను పెంచి పుండ్లు త్వరగా మానకుండా అడ్డుకుంటుందని చెప్తారు. వంకాయ సోలనేసి కుటుంబానికి చెందిన కూరగాయ. ఇందులో సోలనైన్ అనే కాంపౌండ్ ఉంటుంది. సాధారణ ఆరోగ్యంతో ఉన్నవారికి ఇది పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా, పత్యం చేసేవారిలో , మందులు వాడేవారిలో ఇది జీర్ణ వ్యవస్థపై , నాడీ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ కారణాల వల్లనే పత్యం సమయంలో శరీరం త్వరగా కోలుకోవడానికి, ఔషధాలు ఎలాంటి సమస్య లేకుండా పనిచేయడానికి వంకాయకు దూరంగా ఉండాలని పెద్దలు , ఆయుర్వేద వైద్యులు సలహా ఇస్తారు. పత్యం పూర్తయి శరీరం పూర్తి ఆరోగ్యాన్ని పుంజుకున్న తర్వాతే వంకాయను ఆహారంలో తిరిగి చేర్చుకోవడం మంచిది.                          *రూపశ్రీ.